స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Music Directors: మ్యూజిక్ డైరెక్టర్స్‌కి లైఫ్ లేదా?సినిమాSwechaa30 Oct 2026, 03:24 PM

Music Directors: మ్యూజిక్ డైరెక్టర్స్‌కి లైఫ్ లేదా?

Music Directors: ఒకప్పటితో పోల్చుకుంటే గత పదేళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో సంగీత దర్శకులెక్కువైపోయారు. వారిలో వేళ్ళపైన లెక్కపెట్టేవాళ్ళే కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నారు తప్ప..కొందరైతే రెండు మూడేళ్ళకి మించి కొనసాగలేకపోతున్నారు. దీనికి, పలు రకాల కారణాలున్నాయి. ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఏ.ఆర్.రెహమాన్ కూడా గతకొంతకాలంగా తమిళంలో చాలా స్లో అయ్యాడు. తెలుగులో మెలోడి బ్రహ్మగా పేరొందిన మణిశర్మ కూడా అంతే.

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణంలో పురోగతి.. మంత్రి కీలక ఆదేశాలు!తెలంగాణSwechaa30 Oct 2026, 03:06 PM

నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రుల నిర్మాణంలో పురోగతి.. మంత్రి కీలక ఆదేశాలు!

 తెలంగాణలో ప్రభుత్వ వైద్య రంగాన్ని మరింత పటిష్టం చేసి, సామాన్య ప్రజలకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ చికిత్సలను ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్ విస్తరణ పనులతో పాటు గోషామహల్‌లో నిర్మిస్తున్న నూతన ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవన నిర్మాణ పురోగతిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.  డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంక అల, టీజీఎమ్‌ఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ వాణి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ పార్టీలు తెలంగాణను ముంచుతున్నాయి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ధ్వజం!తెలంగాణSwechaa30 Oct 2026, 02:54 PM

జాతీయ పార్టీలు తెలంగాణను ముంచుతున్నాయి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ధ్వజం!

 ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాశనం చేస్తున్నాయని కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలోని పెద్దన్న, ఇక్కడ రాష్ట్రంలోని చిన్నన్న ఇద్దరూ చేతులు కలిపి తెలంగాణ ప్రయోజనాలను పూర్తిగా ముంచుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని పాలించడంలో, ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు.  రైతాంగ సమస్యలు, దెబ్బతిన్న పంటల గురించి పార్లమెంట్‌లో మాట్లాడాలని డిమాండ్ చేస్తే, బీజేపీ ఎంపీలు భిక్షాటన లంకెతో పొలిటికల్ డ్రామాలు ఆడుతున్నారని కల్వకుంట్ల సంజయ్ ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ మియాపూర్ భూములు కొట్టేయాలని చూశాడు : రేవంత్‌ రెడ్డితెలంగాణSwechaa30 Oct 2026, 02:47 PM

కేసీఆర్‌ మియాపూర్ భూములు కొట్టేయాలని చూశాడు : రేవంత్‌ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్‌ మియాపూర్ భూములు కొట్టేయాలని చూశాడంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మియపూర్‌లోని రూ.50 వేల కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికే చెందుతాయని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు ఇందుకు గాను సుప్రీంకోర్టుకు రేవంత్ ధన్యవాదాలు తెలియజేశారు. 'కేసీఆర్‌ తన బంధువు దామోదర్ రావు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ రావు ద్వారా కబ్జాకు యత్నించారు. తెలంగాణలోని భూములను కబ్జా చేయాలని చూశారు. అప్పట్లో నేను టీపీసీసీ చీఫ్‌గా పోరాడితే నన్ను జైలుకు పంపించారు. ఆ భూముల విషయంలో దామోదర్ రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లు లంచంగా ఇచ్చారు.

AI Technology: ప్రశ్నార్థకంగా మారుతున్న మానవాళి మనుగడ.. 10 ఏళ్లలో ఏఐతో అంతం ఖాయమా?InternationalSwechaa30 Oct 2026, 02:34 PM

AI Technology: ప్రశ్నార్థకంగా మారుతున్న మానవాళి మనుగడ.. 10 ఏళ్లలో ఏఐతో అంతం ఖాయమా?

మనిషి తన మేధస్సుతో సృష్టించిన కృత్రిమ మేధ ఇప్పుడు అదే మనిషికి పెను ముప్పుగా మారుతోంది! రాబోయే 10 ఏళ్లలో ఏఐ కారణంగా మానవాళి అంతరించిపోయే ప్రమాదం 50 శాతానికి పైగా ఉందంటూ శాస్త్రవేత్తలు సంచలన హెచ్చరికలు చేస్తున్నారు. మనుషుల నియంత్రణ దాటి, సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఏఐ చేరుకుంటే... భూమిపై మానవ మనుగడ ప్రశ్నార్థకం కావడం ఖాయం. భవిష్యత్తే లేనప్పుడు రిటైర్మెంట్ ఎందుకు అంటూ నిపుణులే ఆందోళన చెందుతున్న ఈ తరుణంలో... టెక్నాలజీ వైపు మనం వేస్తున్న అడుగులు పురోగతా? లేక ప్రళయమా? అనేది ఆలోచించుకునే అవసరం ఉందని అంటున్నారు..

హిమాలయాల్లో హైడ్రోజన్ బాంబుల్లా హిమ సరస్సులు.. భూటాన్‌లో 17 సరస్సులతో భారీ ముప్పు!NationalSwechaa30 Oct 2026, 12:51 PM

హిమాలయాల్లో హైడ్రోజన్ బాంబుల్లా హిమ సరస్సులు.. భూటాన్‌లో 17 సరస్సులతో భారీ ముప్పు!

ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటున్న హిమనదాలు.. నిమిషాల్లోనే నదుల ఉగ్రరూపం. భూటాన్‌లో తాజాగా సంభవించిన హిమ సరస్సు ఉప్పొంగిన ఘటన మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అసోం, పశ్చిమ బెంగాల్‌కు వరద హెచ్చరికలు జారీ కావడంతో హిమాలయాల దిగువ ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.

ఉత్తరాంధ్రను కుదిపేస్తున్న 'ఆర్నబ్' తుపాను: పొంగిపొర్లుతున్న బాహుదా, వంశధార నదులు!NationalSwechaa30 Oct 2026, 12:45 PM

ఉత్తరాంధ్రను కుదిపేస్తున్న 'ఆర్నబ్' తుపాను: పొంగిపొర్లుతున్న బాహుదా, వంశధార నదులు!

భారతదేశ తూర్పు తీరాన్ని వణికించిన 'ఆర్నబ్' తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర ప్రాంతం తీవ్రంగా అతలాకుతలమవుతోంది. పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని దాటి ఉగ్రరూపంతో ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో ఉన్న బాహుదా నది పొంగి పొర్లుతుండటంతో ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. వీటికి తోడు వంశధార, నాగావళి, మహేంద్రతనయ, సువర్ణముఖి, వేగావతి నదులు తీవ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్నాయి.

GPSAP-2026: దేశంలోనే తొలిసారి.. తెలంగాణ సర్కార్ వినూత్న ప్రయోగం!తెలంగాణSwechaa30 Oct 2026, 12:03 PM

GPSAP-2026: దేశంలోనే తొలిసారి.. తెలంగాణ సర్కార్ వినూత్న ప్రయోగం!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి పల్లెను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి 'గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక' (GPSAP-2026) రూపకల్పనకు శ్రీకారం చుట్టింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆలోచనలు, ఆదేశాల మేరకు రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక విధానానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాబోయే ఐదేళ్ల కాలంలో గ్రామాల్లో చేపట్టాల్సిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులకు ఈ ప్రణాళిక ఒక స్పష్టమైన దిక్సూచిలా పనిచేయనుంది.

HYD: నగరంలో తాగునీటి తిప్పలు.. ప్రత్యామ్నాయాలపై జలమండలి కసరత్తు!తెలంగాణSwechaa30 Oct 2026, 11:13 AM

HYD: నగరంలో తాగునీటి తిప్పలు.. ప్రత్యామ్నాయాలపై జలమండలి కసరత్తు!

హైదరాబాద్ మహా నగరంలో భానుడి ప్రతాపానికి తోడు భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో రానున్న రోజుల్లో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జలమండలి (HMWS&SB) మేనేజింగ్ డైరెక్టర్ (MD) అశోక్ రెడ్డి బాంబు పేల్చారు. రాబోయే 8 నెలల సుదీర్ఘ కాలం పాటు మంజీరా, సింగూరు ప్రాజెక్టుల నుంచి నీటి లభ్యత లేనందున, ఆ ప్రాజెక్టుల నీటి సాయం లేకుండానే మహానగర ప్రజల నీటి అవసరాలను తీర్చాల్సి వస్తుందని వెల్లడించారు. అయితే నీటి వనరులు క్రమంగా క్షీణిస్తుండటంతో జలమండలి అధికారులు ముందస్తు చర్యలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

ఎన్వీఎస్-03 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం: నావిక్ వ్యవస్థ బలోపేతానికి ఇస్రో మరో కీలక అడుగు!NationalSwechaa30 Oct 2026, 10:53 AM

ఎన్వీఎస్-03 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం: నావిక్ వ్యవస్థ బలోపేతానికి ఇస్రో మరో కీలక అడుగు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశీయ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' (NavIC) సేవలను మరింత బలోపేతం చేసేందుకు మరొక ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 (GSLV-F18) రాకెట్ ద్వారా 'ఎన్వీఎస్-03' (NVS-03) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం రాత్రి 11:51 గంటలకు జరగనున్న ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం రాత్రే అధికారిక కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

'రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను': పాదయాత్రలో  ఈటల సంచలన వ్యాఖ్యలు!తెలంగాణSwechaa30 Oct 2026, 10:29 AM

'రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను': పాదయాత్రలో ఈటల సంచలన వ్యాఖ్యలు!

జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యల పరిష్కారం కోరుతూ మల్కాజిగిరి బీజేపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర తీవ్ర రాజకీయ వేడిని రాజేసింది. పాదయాత్ర సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డంప్ యార్డు తొలగింపు కోసం తాను పాదయాత్ర చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు 'ఈటలకు పనిలేక తిరుగుతున్నాడంటూ' బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం ఈ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించడమే కాకుండా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తాను వీధుల్లోనే తిరుగుతూ పోరాటం చేస్తానని బహిరంగంగా సవాల్ విసిరారు.

రూ.47 లక్షల కోట్లు ఆవిరి! గూగుల్ సామ్రాజ్యానికి ఏఐ సెగ.. సెర్చ్ ఇంజిన్ కథ ముగిసినట్టేనా?వ్యాపారంSwechaa30 Oct 2026, 10:11 AM

రూ.47 లక్షల కోట్లు ఆవిరి! గూగుల్ సామ్రాజ్యానికి ఏఐ సెగ.. సెర్చ్ ఇంజిన్ కథ ముగిసినట్టేనా?

ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే గూగుల్. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతకాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. గూగుల్‌కు పోటీగా ఏఐ టూల్స్ దూసుకొస్తున్నాయి. ప్రశ్న అడిగితే నేరుగా సమాధానాలే ఇచ్చే టెక్నాలజీ వచ్చేసింది. ఈ మార్పు ఇప్పుడు గూగుల్ పునాదులనే కదిలిస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

Today in History October 30: చరిత్రలో ఈ రోజు (30 అక్టోబర్)InternationalSwechaa30 Oct 2026, 09:35 AM

Today in History October 30: చరిత్రలో ఈ రోజు (30 అక్టోబర్)

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 1928: లాహోర్‌లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో లాలా లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు.

  • 1961: సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 'త్సార్ బొంబా' (Tsar Bomba) హైడ్రోజన్ బాంబును పరీక్షించింది.

  • 1909: ప్రముఖ అణు శాస్త్రవేత్త, భారత అణు విజ్ఞాన పితామహుడు హోమీ జహంగీర్ భాభా జననం.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1938: ఆర్సన్ వెల్లెస్ రేడియో నాటకం 'ది వార్ ఆఫ్ ది వరల్డ్స్' (The War of the Worlds) ప్రసారమైంది — అంగారక గ్రహవాసులు భూమిపై దాడి చేశారనే నాటకీయ కథనంతో అమెరికాలో తీవ్ర కలకలం రేగింది.

  • 1961: ఆర్కిటిక్ మహాసముద్రంలో సోవియట్ యూనియన్ 50 మెగాటన్నుల సామర్థ్యం గల 'త్సార్ బొంబా'ను విజయవంతంగా పరీక్షించింది.

🚀 సైన్స్ & అడ్వెంచర్

  • 1909: భారత అణుశక్తి రంగానికి పునాది వేసిన హోమీ జహంగీర్ భాభా బొంబాయిలో జన్మించారు.

👤 ప్రముఖుల జననాలు

  • 1909: హోమీ జహంగీర్ భాభా — ప్రముఖ భారతీయ అణు భౌతిక శాస్త్రవేత్త, Bhabha Atomic Research Centre (BARC) వ్యవస్థాపకుడు.

  • 1960: డియెగో మారడోనా (Diego Maradona) — ప్రపంచ ప్రసిద్ధ అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం జననం.

  • 1932: బరాక్‌పూర్ సంజీవరావు లేదా ఇతర ప్రముఖ భారతీయ సామాజిక వేత్తలు.

నేటి పంచాంగం - 30 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ పంచమిSpiritualitySwechaa30 Oct 2026, 09:13 AM

నేటి పంచాంగం - 30 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ పంచమి

వివరాలు:

  • తేదీ: 30 అక్టోబరు 2026, శుక్రవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: పంచమి (రాత్రి 08:35 వరకు, తదుపరి షష్ఠి)

  • వారం: శుక్రవారం (భార్గవవాసరే)

  • నక్షత్రం: ఆర్ద్ర (మధ్యాహ్నం 11:48 వరకు, తదుపరి పునర్వసు)

  • యోగం: శివ (సాయంత్రం 05:12 వరకు, తదుపరి సిద్ధ)

  • కరణం: తైతుల (ఉదయం 09:32 వరకు), తదుపరి గరజ (రాత్రి 08:35 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 10:30 - 12:00 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 03:00 - 04:30 వరకు

  • అమృతకాలం: రాత్రి 02:15 - 03:52 వరకు (అనగా అక్టోబర్ 31 తెల్లవారుజామున)

  • దుర్ముహూర్తము: ఉదయం 08:32 - 09:18 వరకు మరియు మధ్యాహ్నం 12:22 - 01:08 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 03:40 - 05:22 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మిథునం

  • సూర్యోదయం: ఉదయం 06:18

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:41

స్వేచ్ఛ న్యూస్  ఎఫెక్ట్.. తాండూర్ ఎమ్మెల్యే కుటుంబంపై విజిలెన్స్ గురిస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa30 Oct 2026, 08:50 AM

స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. తాండూర్ ఎమ్మెల్యే కుటుంబంపై విజిలెన్స్ గురి

సత్యాలే వార్తలుగా స్వేచ్ఛ న్యూస్ పరిశోధనాత్మక కథనాలను ప్రచురిస్తోంది. అందరి కంటే ముందే నిజాలను పసిగట్టి ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. అధికార అహంకారంతో పాటు, కండ బలం, ధన బలంతో ఏమైనా చేయొచ్చు అనుకునే వారి వ్యవహారం బట్టలు ఊడదీసే విధంగా ఫాలో అప్ స్టోరీలు ఇస్తోంది. అదేవిధంగా తాండూర్ ఎమ్మెల్యే బీ మనోహార్ రెడ్డి కుటుంబం భూ కబ్జాపై మొదటి నుంచి స్వేచ్ఛ న్యూస్ ప్రజల ముందు ఉంచింది. దీంతో అధికారులు అప్రమత్తం అవ్వడమే కాకుండా విజిలెన్స్ నివేదకకు రెవెన్యూ అధికారులను విచారించారు. పీటీ యాక్ట్ ఫవర్ ఫుల్ కావడంతో ఎమ్మెల్యే అధికార బలంతో అమ్మకం జరిపితే కొనుగోలు చేసిన ప్లాట్ ఓనర్స్ ఎలా మోసపోతారనేది కూడా కీలక విషయం కానుంది.

ఓట్‌ బచావో వర్సెస్‌ బిజినెస్‌ బచావో! రాహుల్‌ ర్యాలీతో ఢిల్లీలో రచ్చ!NationalSwechaa30 Oct 2026, 12:28 AM

ఓట్‌ బచావో వర్సెస్‌ బిజినెస్‌ బచావో! రాహుల్‌ ర్యాలీతో ఢిల్లీలో రచ్చ!

ఎన్నికల వ్యవస్థపై సందేహాలుంటే సమాధానం అడగాలి. అందుకోసం వీధుల్లోకి రావాల్సి వచ్చినా వెనకడుగు వేయకూడదన్నది కాంగ్రెస్‌ వాదన. అయితే పండుగ వేళ తమ వ్యాపారాలు దెబ్బతింటే ఎలా? రోజువారీ ఆదాయంపైనే ఆధారపడే వేలాది మంది పరిస్థితి ఏంటన్నది ఢిల్లీ వ్యాపారుల ప్రశ్న.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలకు షాక్..! తెలంగాణలో కాంగ్రెస్‌కు సవాల్ తప్పదా..?తెలంగాణSwechaa29 Oct 2026, 11:26 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలకు షాక్..! తెలంగాణలో కాంగ్రెస్‌కు సవాల్ తప్పదా..?

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారంలో ఉన్న పార్టీలు అన్ని చోట్లా ఇబ్బంది పడ్డాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితేంటి..?

Heros: లుక్ టెస్ట్..మేకోవర్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న మేకర్స్..సినిమాSwechaa29 Oct 2026, 10:52 PM

Heros: లుక్ టెస్ట్..మేకోవర్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న మేకర్స్..

Heros: ప్రతీ సినిమాకి హీరోల మేకోవర్ అనేది తప్పనిసరిగా మారింది. ఇది, ఇప్పుడు కాదు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. కథ, అందులో హీరో పాత్రకి తగ్గట్టుగా వేశాధారణ ఉండాలనేదే ముఖ్యం. అందుకే, ప్రతీ సినిమా కథ విన్న తర్వాత హీరోలు..ఇతర పాత్రల్లో నటించే కీలక నటులకి లుక్ టెస్ట్ అనేది తప్పనిసరి. ముఖ్యంగా, హీరోలను సినిమా సినిమాకి ఎంతో ప్రత్యేకంగా చూపిస్తున్నారు.

Heroines: పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్‌గానే!సినిమాSwechaa29 Oct 2026, 10:23 PM

Heroines: పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్‌గానే!

Heroines: మన స్టార్ హీరోయిన్స్ చాలామంది పెళ్ళికి ముందే సినిమాలను చేస్తూ వస్తున్నారు తప్ప పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకి దూరమైన వాళ్ళే ఉన్నారు. రోజా, మీనా, రంభ లాంటి వాళ్ళు మళ్ళీ సినిమాల వైపు రాలేదు. అంతకముందున్న వాళ్ళలో కూడా చాలామంది పెళ్లి తర్వాత పూర్తిగానే సినిమాలను వదిలేశారు. కానీ, జనరేషన్ మారింది. ఇప్పటితరం వాళ్ళు మాత్రం పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తూ ఉన్నారు.

UP: తవ్వేకొద్దీ బయటపడ్డ నోట్ల కట్టలు.. 3 బ్లూ డ్రమ్ముల్లో కోట్ల డబ్బువైరల్ న్యూస్Swechaa29 Oct 2026, 10:14 PM

UP: తవ్వేకొద్దీ బయటపడ్డ నోట్ల కట్టలు.. 3 బ్లూ డ్రమ్ముల్లో కోట్ల డబ్బు

UP: సినిమాల్లో గుప్తనిధుల కోసం నేల తవ్వితే బంగారు నాణేలు బయటపడటం చూసుంటాం. కానీ ఇక్కడ తవ్వుతున్న కొద్దీ కట్టల కొద్దీ ఐదొందల నోట్లు బయటపడ్డాయి. అది కూడా ఎక్కడో అడవుల్లో కాదు.. ఓ పల్లెటూరి పెంకుటింట్లో. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీపంలో వెలుగుచూసిన ఈ ‘3 బ్లూ డ్రమ్ముల’ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. భూమిలో దాదాపు 15 అడుగుల లోతున గొయ్యి తీసి.. మూడు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోట్ల రూపాయల క్యాష్ దాచిపెట్టిన తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు.ప్రయాగ్‌రాజ్ గంగానగర్ జోన్ పరిధిలోని రామ్‌నగర్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. ఊళ్లో వాళ్లతో చిన్న గొడవ జరగడంతో, ఈ సోదరుల ఇంట్లో ఏదో పెద్ద తతంగమే నడుస్తోందని పోలీసులకు ఉప్పందింది.

మీ పెట్టుబడులను డబుల్ చేసే బాధ్యత నాది- సీఎం రేవంత్తెలంగాణSwechaa29 Oct 2026, 09:55 PM

మీ పెట్టుబడులను డబుల్ చేసే బాధ్యత నాది- సీఎం రేవంత్

Cm Revanth: హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీ అని, పెట్టుబడులకు సరైన నగరం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. మీకు కావాల్సిన సదుపాయాలు, మౌలిక వసతులు మేము కల్పిస్తామన్నారు. మీ పెట్టుబడులను డబుల్ చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

TG: ఆ పని చేయకపోతే పాలిటిక్స్ వదిలేస్తా.. సీఎంకు ఈటల రాజేందర్ ఓపెన్ ఛాలెంజ్!తెలంగాణSwechaa29 Oct 2026, 09:51 PM

TG: ఆ పని చేయకపోతే పాలిటిక్స్ వదిలేస్తా.. సీఎంకు ఈటల రాజేందర్ ఓపెన్ ఛాలెంజ్!

TG: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విసిరిన సవాల్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. హైదరాబాద్ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు, తాను చెప్పినట్లు చేయకపోతే ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ ఈటల చేసిన శపథం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.హైదరాబాద్ శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని, దీనిని శాశ్వతంగా అక్కడి నుంచి తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈటల అన్నారు.

అభిమానం పేరుతో టార్చర్.. ఫ్లైట్ లో కీర్తి సురేష్ కు చేదు అనుభవం....సినిమాSwechaa29 Oct 2026, 09:33 PM

అభిమానం పేరుతో టార్చర్.. ఫ్లైట్ లో కీర్తి సురేష్ కు చేదు అనుభవం....

Keerthy Suresh: హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ వెంటపడటం మామూలే. కానీ కొందరు మాత్రం అభిమానం పేరుతో శృతిమించి ప్రవర్తిస్తూ నరకం చూపిస్తుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు విమానంలో సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కావాలంటూ ఆమెను విపరీతంగా వేధించాడు. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి బయటపెట్టడంతో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.కీర్తి సురేశ్ తన భర్త ఆంటోనితో కలిసి మిలాన్ నుంచి ఇండియాకు ఫ్లైట్‌లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాగా తాగి తూలుతున్న ఓ ప్రయాణికుడు కీర్తి కూర్చున్న సీటు దగ్గరకు వచ్చాడు. కాళ్లపై నిలబడే సత్తువ కూడా లేకపోయినా.. కీర్తితో ఇప్పుడే సెల్ఫీ దిగాలంటూ మొండిపట్టు పట్టాడు. పరిస్థితి అర్థం చేసుకున్న కీర్తి.. కాసేపు ఆగి తర్వాత తీసుకుందామని చాలా కూల్‌గా చెప్పినా అతగాడు వినిపించుకోలేదు.

AP Farmers: ఏపీపై విరుచుకుపడ్డ 'అర్నబ్'.. రైతన్నకు మరింత కష్టకాలంఏపీSwechaa29 Oct 2026, 08:38 PM

AP Farmers: ఏపీపై విరుచుకుపడ్డ 'అర్నబ్'.. రైతన్నకు మరింత కష్టకాలం

AP Farmers: ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. సరిగ్గా చేతికొచ్చే టైంకి తీరని విషాదాన్ని మిగిల్చింది. బంగాళాఖాతంలో పుట్టిన తీవ్ర తుఫాను 'అర్నబ్' ఏపీ కోస్తా జిల్లాలపై విలయతాండవం చేసింది. గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల భీకర వేగంతో యానం–అమలాపురం మధ్య తీరం దాటిన ఈ పెను తుఫాను ధాటికి అన్నదాతల బతుకులు అల్లకల్లోలమయ్యాయి. కుండపోత వర్షాలు, ఈదురుగాలుల బీభత్సానికి ఏడు జిల్లాలు అతలాకుతలమవగా, రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణనష్టంతో పాటు ఊహించని స్థాయిలో జరిగిన ఆస్తి, పంట నష్టం రైతాంగాన్ని కోలుకోలేని స్థితిలోకి నెట్టేసింది.'అర్నబ్' తుఫాను మిగిల్చిన అత్యంత తీవ్రమైన దెబ్బ వ్యవసాయ రంగానికే తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, మరో 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

చిత్రం లేదు
తెలంగాణSwechaa29 Oct 2026, 08:34 PM

TG: ఎవ్వరినీ వదిలిపెట్టను.. వాళ్లంతా నాకు క్షమాపణ చెప్పాల్సిందే: కేటీఆర్

TG: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత ఆరోపణల వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ కోర్టు మెట్లు దిగి క్షమాపణలు చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని, లేదంటే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు."మొన్న ప్రముఖ పత్రిక ఈనాడు బేషరతుగా క్షమాపణ చెప్పింది.. ఈరోజు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. రేపు నాపై బురదజల్లిన ఇంకొందరు కూడా క్యూ కట్టి సారీ చెప్పక తప్పదు" అంటూ కేటీఆర్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమో లేదా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనో అసత్యాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే- సుప్రీంకోర్టుతెలంగాణSwechaa29 Oct 2026, 08:30 PM

మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే- సుప్రీంకోర్టు

Miyapur Lands: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 100, 101 లకు చెందిన భూవివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ రెండు సర్వే నెంబర్లలోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాగా, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమి తమదేనంటూ గతంలో ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని 2003లో తీర్పు ఇచ్చింది.

Karnataka Congress: డీకేకు ఆదిలోనే ఘోర ఓటమి.. కష్టకాలం మొదలయిందా?NationalSwechaa29 Oct 2026, 07:51 PM

Karnataka Congress: డీకేకు ఆదిలోనే ఘోర ఓటమి.. కష్టకాలం మొదలయిందా?

Karnataka Congress: మొన్నటివరకు "జ్ఞానేష్.. ఇట్స్ డన్ బ్రో" అంటూ బీజేపీపై విపక్షాలు సెటైర్లు వేస్తే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బీజేపీ-జేడీఎస్ కూటమి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శాసన మండలిలో ఖాళీ అయిన నాలుగు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. నాలుగుకి నాలుగు సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుని 4-0తో క్లీన్ స్వీప్ చేసింది. రిజల్ట్స్ రాగానే బీజేపీ నేతలు సీఎం డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ.. "డీకే.. మీ పని అయిపోయింది బ్రో" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు.గతంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతూ డీకే శివకుమార్ చెవిలో బంతిపూలు పెట్టుకున్న పాత ఫొటోను బీజేపీ బయటకు తీసింది. మండలి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నేతల చెవుల్లోనే పూలు పెట్టారంటూ ఎక్స్‌లో దారుణంగా ట్రోల్ చేసింది. ఈ నాలుగు స్థానాల్లో.. గతంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సిట్టింగ్ సీటును ఈసారి జేడీఎస్ ఎగరేసుకుపోయింది. ఇక మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ తమ సిట్టింగ్ సీట్లను సులభంగా కాపాడుకుని సత్తా చాటింది.

Telangana: కొండా సురేఖ క్షమాపణ వెనుక రాజకీయ వ్యూహం ఉందా? కేటీఆర్ క్షమించినట్లేనా?..రాజకీయాలుSwechaa29 Oct 2026, 07:17 PM

Telangana: కొండా సురేఖ క్షమాపణ వెనుక రాజకీయ వ్యూహం ఉందా? కేటీఆర్ క్షమించినట్లేనా?..

తెలంగాణ రాజకీయంలో గత కొంతకాలంగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత విమర్శల వ్యవహారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

KTR: ఏపీలో కరువు లేదు.. తెలంగాణలో కరువుకి రేవంత్ రెడ్డే కారణంతెలంగాణSwechaa29 Oct 2026, 07:00 PM

KTR: ఏపీలో కరువు లేదు.. తెలంగాణలో కరువుకి రేవంత్ రెడ్డే కారణం

KTR: తెలంగాణలో కరువు పరిస్థితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నట్లుగా రేవంత్ తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు. మేము ఎంత చెప్పినా వినకుండా వెయ్యి టీఎంసీల నీళ్లు దిగువకు వదిలారని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి నాలుగు నెలల కిందట మొత్తం బీఆర్ఎస్ నాయకులం కన్నెపల్లికి పోయామని కేటీఆర్ గుర్తు చేశారు.

Super ElNino: ఎల్‌నినో ఊచకోత.. భారత్‌లో సమ్మర్‌ వరకు 55వేల మరణాలు?NationalSwechaa29 Oct 2026, 06:52 PM

Super ElNino: ఎల్‌నినో ఊచకోత.. భారత్‌లో సమ్మర్‌ వరకు 55వేల మరణాలు?

Super ElNino: వాతావరణం మారిపోతుండటం ఇప్పుడు జనాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలే ఎండకాలం వస్తే ఆ వేడిని తట్టుకోవడం కష్టమైపోతుంది. అలాంటిది ఈసారి రాబోతున్న ‘సూపర్ ఎల్‌నినో’తో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్న వార్త జనాల్లో భయాన్ని రేపుతోంది. ముఖ్యంగా మన దేశంలో అక్టోబర్ నుంచి వచ్చే మార్చి లోపే ఎండల దెబ్బకు, వడగాలులకు ఏకంగా 55 వేల మంది చనిపోయే ఛాన్స్ ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా చనిపోయే వాళ్ల కంటే అదనంగా దాదాపు 3.73 లక్షల మంది కేవలం ఈ ఎల్‌నినో ఎండల వల్లే చనిపోవచ్చని నిపుణులు లెక్కగట్టారు.