స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఏటా రూ.50లక్షలు లంచం..! నిమ్స్‌లో మరోసారి ఏసీబీ తనిఖీల కలకలంతెలంగాణSwechaa29 Oct 2026, 06:41 PM

ఏటా రూ.50లక్షలు లంచం..! నిమ్స్‌లో మరోసారి ఏసీబీ తనిఖీల కలకలం

ACB Raids: హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో మరోసారి తనిఖీల కలకలం రేగింది. ఏసీబీ అధికారులు సహా డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మూడు శాఖలకు సంబంధించిన అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. క్యాంటీన్ తో పాటు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏటా రూ.50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్తున్నట్లు కనుగొన్నారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ కేసులో దొరికిన లింకుల ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నారు.

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్‌.. రూ.300 కోట్ల భూముల్లో ఎమ్మెల్యే  దందాపై విజిలెన్స్  ఎంక్వైరీ..!తెలంగాణSwechaa29 Oct 2026, 06:24 PM

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్‌.. రూ.300 కోట్ల భూముల్లో ఎమ్మెల్యే దందాపై విజిలెన్స్ ఎంక్వైరీ..!

TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఏకంగా రూ.300 కోట్ల విలువైన ప్రొటెక్టెడ్ టెనెన్సీ (పీటీ) భూముల వ్యవహారంపై స్వేచ్ఛ వరుస కథనాలు రాసింది. ఈ భూముల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని.. వాటిని కొనొద్దని అప్రమత్తం చేసింది. స్వేచ్ఛ కథనాలతో విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా రికార్డుల్లో ఉన్న తమ భూములను కొట్టేసేందుకు కొందరు అధికారులు, రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర విజిలెన్స్ బృందం మహేశ్వరం తహసీల్దార్ ఆఫీస్‌లో విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టడంతో వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది.

Kodangal: దారుణ పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం.. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రైతుల దుస్థితే నిదర్శనం!..తెలంగాణSwechaa29 Oct 2026, 05:42 PM

Kodangal: దారుణ పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం.. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రైతుల దుస్థితే నిదర్శనం!..

రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉంది. నీళ్లులేక, క‌రెంట్ రాక అప్పులు చేసి పంట‌లు పండిస్తే తీరా అమ్ముకునే స‌మయానికి గిట్టిబాటు ధ‌ర‌లు లేక‌పోవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పత్తికి గిట్టుబాటు ధర కల్పించాల‌ని వికారాబాద్ జిల్లా కొడంగల్‌ మండలం నీటూర్‌ గేటు సమీపంలోని విజయ్‌ ఇండస్ట్రీస్‌ కాటన్ మిల్లు వద్ద రైతుల నిరసన చేప‌ట్టారు. నీళ్లు లేక దిగుబడి తగ్గితే, ఉన్న పత్తికి కూడా సరైన ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.

Tollywood: బ్యానర్‌కి ఒక దర్శకుడు..ఇదే సేఫ్ గేమ్!సినిమాSwechaa29 Oct 2026, 05:31 PM

Tollywood: బ్యానర్‌కి ఒక దర్శకుడు..ఇదే సేఫ్ గేమ్!

Tollywood: బ్యానర్‌కి ఒక దర్శకుడు..ఇదే సేఫ్ గేమ్! అవును..కొంతమంది స్టార్ డైరెక్టర్స్..తమ స్నేహితులను నిర్మాణ రంగంలోకి తీసుకువచ్చి కొత్త బ్యానర్‌ను స్థాపించి వాళ్ళకే సినిమాలను చేస్తున్నారు. ప్రభాస్ తన స్నేహితుల కోసం యూవీ క్రియేషన్స్ ప్రారంభించాడు. ఇందులో, ప్రభాస్ మాత్రమే కాదు, మిగతా దర్శకులతోనూ, హీరోలతోనూ సినిమాలను చేస్తున్నారు.

Tollywood: కాంబినేషన్ కాదు కథ, హిట్ టాక్ మాత్రమే ముఖ్యం!సినిమాSwechaa29 Oct 2026, 05:15 PM

Tollywood: కాంబినేషన్ కాదు కథ, హిట్ టాక్ మాత్రమే ముఖ్యం!

వెంకటేష్ నటించిన రెండు బ్లాక్ బస్టర్స్ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలకి కథ-మాటలందించాడు త్రివిక్రమ్. ఇన్నేళ్ళకి వీళ్ల కాంబినేషన్‌లో ఆదర్శకుటుంబం సినిమా వస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఎప్పుడూ..ఏదో ఒక పాపులర్ నవల ఆధారంగానో..పాత సినిమాల కథను తిప్పి, ఇప్పటి జనరేషన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సినిమాలు తీసి మెప్పిస్తున్నాడు. త్రివిక్రమ్ అక్కడా ఇక్కడా కథలు కాపీ కొడతాడనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు, వస్తోన్న ఆదర్శకుటుంబం సినిమాకి అంతే.

Hyderabad: హైదరాబాద్‍లో బ్రాండెడ్ బియ్యం కొంటున్నారా?.. అయితే మీరు మోసపోయినట్టే!..తెలంగాణSwechaa29 Oct 2026, 04:42 PM

Hyderabad: హైదరాబాద్‍లో బ్రాండెడ్ బియ్యం కొంటున్నారా?.. అయితే మీరు మోసపోయినట్టే!..

ఎల్ నినో ఎఫెక్ట్ పేరుతో ఇప్పటికే భియ్యం ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ సమయంలో కొంత మంది వ్యాపారులు భారీగా అక్రమాలకు తెరలేపుతున్నారు. తాజాగా హైదరాబాద్‍లో భారీ రేషన్ బియ్యం స్కామ్ వెలుగు చూసింది. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి బయట మార్కెట్లో అమ్మేస్తున్న మాఫియాగుట్టు రట్టైంది. నగరంలోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కర్మన్‌ఘాట్‌లోని పలు రైస్ డిపోల్లో బియ్యం సంచులపై ముద్రించిన తూకానికి, వాస్తవంగా ఉన్న బియ్యం పరిమాణానికి తేడా ఉంటోందనే ఫిర్యాదులతో రంగంలోకి దిగగా ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

మూసీ ప్రక్షాళన ముసుగులో లూటీకి తెరలేపారు- కేటీఆర్తెలంగాణSwechaa29 Oct 2026, 04:42 PM

మూసీ ప్రక్షాళన ముసుగులో లూటీకి తెరలేపారు- కేటీఆర్

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రం కరువులో ఉంటే మూసీ సుందీకరణ ఎవరు అడిగారు అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మూసీ ప్రాజెక్ట్ ముసుగులో వేలాది ఎకరాల లూటీకి సీఎం రేవంత్ తెరలేపారని ఆరోపించారు. అందుకే పబ్లిక్ హియరింగ్ అంటే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు అని చెప్పారు.

పబ్లిక్ రాకుండా తూతూ మంత్రంగా ఏదో చేశామంటే చేశాం అనిపించుకోవడానికి ఒక ప్రొసీజరల్ ఇష్యూ లాగా చాపకింద తోసేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ డీపీఆర్ ఇవాళ్టి వరకు లేదన్నారు. ఒకవేళ ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. సుందరీకరణ పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు.

Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ.. దలాల్ స్ట్రీట్‌లో జియో రచ్చ!NationalSwechaa29 Oct 2026, 04:36 PM

Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ.. దలాల్ స్ట్రీట్‌లో జియో రచ్చ!

Jio IPO: దలాల్ స్ట్రీట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్' స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతూనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఏకంగా రూ.30,213 కోట్ల భారీ సైజుతో దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా మార్కెట్లోకి వచ్చిన జియో.. ఇన్వెస్టర్లకు ఊహకందని లాభాల పంట పండించింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో జియో షేర్లు అదరగొట్టే రేంజ్‌లో లిస్ట్ కావడంతో ఇన్వెస్టర్ల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ ఐపీఓకు వచ్చిన డిమాండ్ చూసి మార్కెట్ పండితులే విస్తుపోయారు. ఏకంగా రూ.7.33 లక్షల కోట్ల విలువైన బిడ్లు వెల్లువెత్తడంతో ఈ పబ్లిక్ ఇష్యూ 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా, బిడ్డింగ్ మొదలైన కేవలం 95 నిమిషాల్లోనే 100 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. దాదాపు 1.3 కోట్ల మందికి పైగా సాధారణ ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని నమ్మి జియో చేతుల్లో పెట్టడం భారత కార్పొరేట్ రంగంలోనే ఒక అద్భుతంగా నిలిచింది.

Bhogi: శర్వానంద్‌కి సోలో డేట్ దొరకలేదు పాపం!సినిమాSwechaa29 Oct 2026, 03:44 PM

Bhogi: శర్వానంద్‌కి సోలో డేట్ దొరకలేదు పాపం!

Bhogi: చిన్న సినిమా సక్సెస్ కూడా పెద్ద సినిమా మీద కొన్నిసార్లు గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. అందుకే, మన సీనియర్ నిర్మాతలైన సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున కనీసం సినిమా సినిమాకి మధ్య రెండు వారాలైనా గ్యాప్ ఉండాలని చెప్తుంటారు. దానివల్ల, థియేటర్స్ పుష్కలంగా దొరుకుతాయి. సినిమా బావుంటే మంచి కలెక్షన్స్ వచ్చి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారు.

Shocking: చాట్‌జీపీటీ యువ ఇంజనీర్ ప్రాణం తీసిందా?: ఓపెన్‌ఏఐపై తల్లిదండ్రుల సంచలన దావా!వైరల్ న్యూస్Swechaa29 Oct 2026, 03:24 PM

Shocking: చాట్‌జీపీటీ యువ ఇంజనీర్ ప్రాణం తీసిందా?: ఓపెన్‌ఏఐపై తల్లిదండ్రుల సంచలన దావా!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోన్న తరుణంలో, దాని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు తెరలేపిన ఒక విషాదకర ఘటన అమెరికాలోని సియాటెల్‌లో వెలుగుచూసింది. చాట్‌జీపీటీ (ChatGPT) ఇచ్చిన వైద్యపరమైన సలహాను గుడ్డిగా పాటించడం వల్లే తమ ముద్దుల కుమార్తె మరణించిందని ఆరోపిస్తూ ఓ బాధితురాలి తల్లిదండ్రులు ప్రముఖ టెక్ దిగ్గజం 'ఓపెన్‌ఏఐ' (OpenAI) సంస్థపై కోర్టులో దావా వేశారు. వైద్యం, ఆరోగ్యం వంటి అత్యంత కీలకమైన అంశాలలో ఏఐ చాట్‌బాట్లపై ఆధారపడటం ఎంత ప్రాణాంతకమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

Congress: ప్రియాంక గాంధీ ఎంట్రీ.. రాహుల్ గాంధీ రాజకీయానికి చెక్ పడనుందా?..రాజకీయాలుSwechaa29 Oct 2026, 03:15 PM

Congress: ప్రియాంక గాంధీ ఎంట్రీ.. రాహుల్ గాంధీ రాజకీయానికి చెక్ పడనుందా?..

ఇందిరా గాంధీ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక ప్రభంజనం అయితే.. సోనియా గాంధీ ఒక పునరుజ్జీవనం అని అంటారు.. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ కూడా రానున్న కాలంలో ఒక కొత్త రాజకీయ అధ్యాయంగా నిలుస్తారా.. కాంగ్రెస్ భవిష్యత్తును నిర్ణయించే నాయకురాలిగా ఎదుగుతారా.. అనే ఆసక్తి ఇప్పటికే పార్టీ వర్గాలలో నెలకొంది.. గతంలో పార్టీ తరపున నిర్వహించే పలు సభల్లో మెరిసిన ప్రియాంక.. తమ పార్టీలో కీలకంగా మారనుందనే సంకేతాలు వెలువడుతున్నాయి..

Sunil Bansal : తెలంగాణ బీజేపీని ‘ఇజ్జత్ కా సవాల్’గా తీసుకున్న సునీల్ బన్సల్!తెలంగాణSwechaa29 Oct 2026, 03:10 PM

Sunil Bansal : తెలంగాణ బీజేపీని ‘ఇజ్జత్ కా సవాల్’గా తీసుకున్న సునీల్ బన్సల్!

తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్ఠానం అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ‘ఎలక్షన్ మాస్టర్ మైండ్’ సునీల్ బన్సల్.. తెలంగాణపై కన్నేశారు. బెంగాల్, ఒడిశా వంటి గడ్డు కోటలను సైతం బీజేపీ ఖాతాలో వేయడంలో కీలక పాత్ర పోషించిన బన్సల్, ఇప్పుడు తెలంగాణను తన వ్యక్తిగత ‘ఇజ్జత్ కా సవాల్’గా మార్చుకున్నారు. అక్కడ సక్సెస్ కొట్టి ఇక్కడ విఫలమైతే తన ట్రాక్ రికార్డుకు మచ్చ పడుతుందన్న భావనతో, తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాల్సిందేనని అత్యంత పట్టుదలతో పావులు కదుపుతున్నారు.

Viral: "వేడినీళ్లు తాగు బాబూ.. చల్లటి నీళ్లు వద్దు": వైభవ్ సూర్యవంశీపై అభిమాని మాతృవాత్సల్యం!క్రీడలుSwechaa29 Oct 2026, 02:57 PM

Viral: "వేడినీళ్లు తాగు బాబూ.. చల్లటి నీళ్లు వద్దు": వైభవ్ సూర్యవంశీపై అభిమాని మాతృవాత్సల్యం!

భారత యువ క్రికెట్ సంచలనం, కేవలం 15 ఏళ్ల వయసులోనే అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి సంబంధించిన ఓ అరుదైన, హృద్యమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో చోటుచేసుకున్న ఈ ఘటన చూసేవారి మనసులను హత్తుకుంటోంది. మైదానంలో పరుగుల వర్షం కురిపించే ఈ చిన్నారి క్రికెటర్‌పై ఓ మహిళా అభిమాని చూపిన మాతృసమానమైన ఆప్యాయత అందరినీ ఆకట్టుకుంటోంది.

ఎప్‌స్టీన్ ఒక పిచ్చివాడు.. 20 ఏళ్ల క్రితమే క్లబ్ నుంచి గెంటేశా: ట్రంప్InternationalSwechaa29 Oct 2026, 02:31 PM

ఎప్‌స్టీన్ ఒక పిచ్చివాడు.. 20 ఏళ్ల క్రితమే క్లబ్ నుంచి గెంటేశా: ట్రంప్

అమెరికాలో అత్యంత వివాదాస్పదంగా మారిన కుబేరుడు, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎట్టకేలకు బహిరంగంగా స్పందించారు. నవంబర్ 3న జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల (US Midterm Elections) ప్రచారంలో భాగంగా ఒహియో రాష్ట్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ట్రంప్‌కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. సభ జరుగుతుండగా ఒక నిరసనకారుడు ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న పాత సంబంధాల గురించి బిగ్గరగా నినాదాలు చేస్తూ ప్రశ్నించడంతో ట్రంప్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

అర్నబ్ తుపాన్ బాధితులకు అమిత్ షా అభయం.. 4 రాష్ట్రాల సీఎంలతో సమీక్ష!ఏపీSwechaa29 Oct 2026, 01:52 PM

అర్నబ్ తుపాన్ బాధితులకు అమిత్ షా అభయం.. 4 రాష్ట్రాల సీఎంలతో సమీక్ష!

 తుపాన్ ధాటికి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయ పునరావాస కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఆర్నబ్ తుఫాన్ వల్ల సంభవించిన పంట, ఆస్తి, మౌలిక సదుపాయాల నష్ట తీవ్రతను ప్రత్యక్షంగా విశ్లేషించడానికి త్వరలోనే ఇంటర్-మినిస్టీరియల్ కేంద్ర బృందాలు (IMCTs) ప్రభావిత రాష్ట్రాల్లో పర్యటిస్తాయని వెల్లడించారు. ప్రకృత్తి విపత్తు సంభవించిన ఈ కష్టసమయంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన కట్టుబాటుతో బాధితులకు అండగా నిలుస్తుందని ఆయన పునరుద్ఘాటించారు.

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత నిధులపై కీలక అప్‌డేట్ ఇచ్చిన కేంద్రం!..NationalSwechaa29 Oct 2026, 01:22 PM

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత నిధులపై కీలక అప్‌డేట్ ఇచ్చిన కేంద్రం!..

రైతులకు గుడ్ న్యూస్! పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 24వ విడతపై కీలక అప్‌డేట్ వెలువడింది. అక్టోబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ విడతలో అర్హులైన రైతుల ఖాతాల్లోకి 2 వేల రూపాయల చొప్పున జమ కానున్నాయి. అయితే, మీకు డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవాలంటే అధికారిక వెబ్‌సైట్‌లో స్టేటస్ చెక్ చేసుకోండి. ఈ-కేవైసీ, భూమి రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. అధికారిక ప్రకటనతో నిధుల విడుదల వివరాలను ధ్రువీకరించుకోవడం మర్చిపోవద్దు!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: 'అర్నబ్' దెబ్బ నుంచి కోలుకోకముందే మరో తుపాను ముప్పు!ఏపీSwechaa29 Oct 2026, 01:17 PM

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం: 'అర్నబ్' దెబ్బ నుంచి కోలుకోకముందే మరో తుపాను ముప్పు!

ఇటీవల సంభవించిన 'అర్నబ్' తుపాను సృష్టించిన తీవ్ర బీభత్సం, విపరీతమైన పంట, ఆస్తి నష్టం నుంచి ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంత ప్రజలు ఇంకా కోలుకోకముందే రాష్ట్రానికి మరొక కొత్త విపత్తు ముప్పు పొంచి ఉందనే వార్త తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో నూతనంగా ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ వేగంగా వాయుగుండంగా బలపడి రాష్ట్రం వైపునకు ప్రయాణించే అవకాశాలు ఉండటంతో తీర ప్రాంత ప్రజలతో పాటు రైతాంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

దీపావళి సీజన్..అన్నీ డబ్బింగ్ చిత్రాలే!సినిమాSwechaa29 Oct 2026, 12:58 PM

దీపావళి సీజన్..అన్నీ డబ్బింగ్ చిత్రాలే!

2027 దీపావళి పండుగకి టాలీవుడ్ అంత కలర్‌ఫుల్‌గా కనిపించదా..అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే, ఈ దీపావళికి ఒక్కటి కూడా స్ట్రైట్ సినిమా రావడం లేదు. మన స్టార్ హీరోల సినిమాలు కనీసం రెండు రిలీజైనా కూడా, ఆ సౌండ్ ఇంకోలా ఉంటుంది. కానీ, ఈ దీపావళి కాంతులంతా కోలీవుడ్ సినిమాలదే అనిపిస్తోంది. అలాగే, బాలీవుడ్‌లో రూపొందిన రామాయణ చిత్రానిది. పరభాషా చిత్రాల మధ్యే గట్టి పోటీ నెలకొంది.

Tollywood: తండేల్ సక్సెస్ ఇంకా వృష కర్మపై ఉందా..ఏ రకంగా?సినిమాSwechaa29 Oct 2026, 12:39 PM

Tollywood: తండేల్ సక్సెస్ ఇంకా వృష కర్మపై ఉందా..ఏ రకంగా?

Tollywood: మన టాలీవుడ్ హీరోలలో అక్కినేని వారే బాగా స్లోగా సినిమాలను చేస్తూ వస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య మరీ సెలెక్టెడ్‌గా ఉన్నాడు. తండేల్ లాంటి 100 కోట్ల సినిమా తర్వాత వరుసగా నాలుగైదు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టకుండా..ఒకే ఒక్క సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమానే వృష కర్మ. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ పెద్దగా అప్‌డేట్స్ కూడా ఇవ్వలేదు. దీంతో, తండేల్ సక్సెస్ బజ్ ఇంకా కంటిన్యూ ఎలా అవుతుంది..వృష కర్మకి ప్రమోషన్స్ కావాలి కదా..అంటూ మాట్లాడుకుంటున్నారు.

స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. పుల్లారెడ్డి స్వీట్ షాప్‌తో పలు షాపుల లైసెన్స్ రద్దు!తెలంగాణSwechaa29 Oct 2026, 12:37 PM

స్వీట్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. పుల్లారెడ్డి స్వీట్ షాప్‌తో పలు షాపుల లైసెన్స్ రద్దు!

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ హైదరాబాద్‌లో పలు ప్రముఖ స్వీట్ షాపులు, ఆహార తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. అత్యంత ఆదరణ పొందిన 'పుల్లారెడ్డి స్వీట్స్' (G. Pulla Reddy Sweets) సహా పలు షాపుల్లో తనిఖీలు చేసి అపరిశుభ్రత, నిబంధనల ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. అత్యంత ప్రమాదకరమైన వాతావరణంలో స్వీట్లు తయారు చేస్తున్నట్లు ఆధారాలతో సహా నిరూపితం కావడంతో పుల్లారెడ్డి స్వీట్స్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) లైసెన్స్‌ను అధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు.

Srikanth Odela: యూటర్న్ తీసుకున్న ఓదెల..ఈసారి చిన్న ప్రేమ కథతో!సినిమాSwechaa29 Oct 2026, 12:11 PM

Srikanth Odela: యూటర్న్ తీసుకున్న ఓదెల..ఈసారి చిన్న ప్రేమ కథతో!

శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ఓ పీరియాడిక్ లవ్ స్టోరీని తయారు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో..చిన్న ప్రేమకథను తీసి మళ్ళీ ఇటు ప్రేక్షకులతోనూ అటు ఇండస్ట్రీ వర్గాలతోనూ ప్రశంసలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడట. కథ నచ్చితే ఈ సినిమాను నాని నిర్మించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ది ప్యారడైజ్ ఈవెంట్‌లో.. "నాని అన్న నన్ను భరించాల్సిందే" అంటూ తనమీదే బాధ్యత పెట్టాడు కాబట్టి.

కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. వివాదాస్పద వ్యాఖ్యలకు చెక్!తెలంగాణSwechaa29 Oct 2026, 12:01 PM

కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణలు.. వివాదాస్పద వ్యాఖ్యలకు చెక్!

 తెలంగాణ రాజకీయంలో గత కొంతకాలంగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత విమర్శల వ్యవహారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఢిల్లీ ర్యాలీపై కాంగ్రెస్‌ ఫుల్‌ ఫోకస్‌.. నవంబర్ 1న ఏం జరగనుంది?NationalSwechaa29 Oct 2026, 11:51 AM

ఢిల్లీ ర్యాలీపై కాంగ్రెస్‌ ఫుల్‌ ఫోకస్‌.. నవంబర్ 1న ఏం జరగనుంది?

ఢిల్లీలో నవంబర్‌ 1న జరగనున్న భారీ ర్యాలీని కాంగ్రెస్‌ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఓట్ చోరీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న విపక్ష కూటమి.. ఈ ఉద్యమం ఎక్కడా బలహీనపడకుండా వ్యూహాలు రచిస్తోంది.

Today in History: చరిత్రలో ఈ రోజు (29 అక్టోబర్)InternationalSwechaa29 Oct 2026, 11:34 AM

Today in History: చరిత్రలో ఈ రోజు (29 అక్టోబర్)

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 1923: ముస్తఫా కెమాల్ అటాతుర్క్ నాయకత్వంలో రిపబ్లిక్ ఆఫ్ టర్కీ (Turkey Republic) అధికారికంగా అవతరించింది.

  • 1929: 'బ్లాక్ టుడే' (Black Tuesday) — న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తీవ్రంగా కుప్పకూలి ప్రపంచంలోనే అత్యంత దారుణమైన ఆర్థిక మాంద్యానికి (Great Depression) దారితీసింది.

  • 1969: ఇంటర్నెట్ ఆవిర్భావానికి పునాది అయిన 'అర్పానెట్' (ARPANET) ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆన్‌లైన్ సందేశం పంపబడింది.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1923: ఒట్టోమన్ సామ్రాజ్యం అంతమై టర్కీ స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రకటించబడింది.

  • 1929: వాల్ స్ట్రీట్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వడంతో వందలాది కంపెనీలు దివాలా తీశాయి.

  • 1956: సుయెజ్ సంక్షోభం (Suez Crisis) ప్రారంభమైంది — ఇజ్రాయెల్ సైన్యం ఈజిప్ట్‌పై దాడి చేసింది.

🚀 సైన్స్ & అడ్వెంచర్

  • 1969: UCLA కంప్యూటర్ నుండి స్టాన్‌ఫోర్డ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కి అర్పానెట్ (ARPANET) ద్వారా తొలిసారిగా "LOG" అనే మెసేజ్ పంపబడింది. ఇది ఇంటర్నెట్ చరిత్రలో మైలురాయి.

  • 1998: 77 సంవత్సరాల వయస్సులో జాన్ గ్లెన్ (John Glenn) డిస్కవరీ స్పేస్ షటిల్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి, అంతరిక్షంలో ప్రయాణించిన అత్యంత వయోధికుడిగా రికార్డు సృష్టించారు.

👤 ప్రముఖుల జననాలు

  • 1985: హీరోయిన్ కాజల్ అగర్వాల్ బర్త్ డే

  • 1971: ప్రముఖ ఇంగ్లాండ్ క్రికెటర్ మైఖేల్ వాన్ (Michael Vaughan) జననం.

పోలీసు సేవల్లో సాంకేతిక విప్లవంస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa29 Oct 2026, 11:19 AM

పోలీసు సేవల్లో సాంకేతిక విప్లవం

 పోలీసు సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థంగా అందించేందుకు తెలంగాణ పోలీసు శాఖ సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఇందులో భాగంగా నేర పరిశోధన విభాగం (సీఐడీ) రూపొందించిన ఏడు డిజిటల్‌ సేవలను డీజీపీ సీ.వీ.ఆనంద్ డీజీపీ కార్యాలయంలో ప్రారంభించారు. పోలీసు సేవలను ఇటీవల వినియోగించుకున్న ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు తెలుసుకునేందుకు సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ సెంటర్‌ (సీఎఫ్‌సీ)ను ఏర్పాటు చేశారు. పిటిషన్లు, ఎఫ్‌ఐఆర్‌ల నమోదు, ఈ-చలాన్లు, పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ సేవలపై ప్రజల స్పందనను ఈ కేంద్రం సేకరిస్తుంది.

చూసి నేర్చుకో రేవంత్..   లేదంటే చెత్త సీఎం  అవుతావు!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa29 Oct 2026, 10:07 AM

చూసి నేర్చుకో రేవంత్.. లేదంటే చెత్త సీఎం అవుతావు!

ఆంధ్రాలో తుఫాన్ భీభత్సం సృష్టించింది. చెరువులు, వాగులు జలకళసంతరించుకున్నాయి. కానీ, తెలంగాణలో జనం నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. కరువు అనేది దశాబ్దాల నుంచి ముందే హెచ్చరించేది. పెను తుఫాన్‌లు వారం ముందే తెలుస్తాయి. ప్రభుత్వాలు పసి గట్టి అలర్ట్ అవ్వాలి. కానీ, మీ నిద్రమత్తు కమీషన్స్ పాలనలో కరువుకు కారణం ఆనాటి పాలన అంటూ వదిలించుకోవాలనుకుంటున్నారు. మీ వద్ద 130 మంది ఐఏఎస్‌లు, 120 మంది ఐపీఎస్‌లు వాళ్ల కింద లక్షల మంది ఉద్యోగులు ఉన్నా మీరు కరువుపై ఏనాడూ ఆదేశించలేదు. మీ పైరవీకారుల గురించే చెప్పారు. అందుకే ఈనాడు ఇంతగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది.

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 68 మంది దుర్మరణం!InternationalSwechaa29 Oct 2026, 09:25 AM

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 68 మంది దుర్మరణం!

యూరప్ దేశమైన స్పెయిన్‌లో అత్యంత ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రెండు హైస్పీడ్ రైళ్లు ఒకదానికొకటి దారుణంగా ఢీకొన్న దుర్ఘటనలో మృతుల సంఖ్య ఏకంగా 68కి చేరింది. స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌కు దక్షిణంగా దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న టోలెడో ప్రావిన్స్‌లోని ఉర్దా రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ విపత్తు తీవ్రతకు పలు బోగీలు పట్టాలు తప్పి, సమీపంలోని లోయలో పడిపోవడంతో ప్రాణనష్టం భారీగా నమోదైంది.

todays-panchangam-29-october: నేటి పంచాంగం - 29 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ చవితిSpiritualitySwechaa29 Oct 2026, 08:57 AM

todays-panchangam-29-october: నేటి పంచాంగం - 29 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ చవితి

వివరాలు:

  • తేదీ: 29 అక్టోబరు 2026, గురువారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: చవితి (రాత్రి 10:41 వరకు, తదుపరి పంచమి)

  • వారం: గురువారం (బృహస్పతివాసరే)

  • నక్షత్రం: మృగశిర (మధ్యాహ్నం 01:21 వరకు, తదుపరి ఆర్ద్ర)

  • యోగం: పరిఘ (రాత్రి 08:04 వరకు, తదుపరి శివ)

  • కరణం: భద్ర/విష్టి (ఉదయం 10:12 వరకు), తదుపరి బవ (రాత్రి 10:41 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: మధ్యాహ్నం 01:30 - 03:00 వరకు

  • యమగండం: ఉదయం 06:00 - 07:30 వరకు

  • అమృతకాలం: ఉదయం 06:38 - 08:21 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 10:02 - 10:48 వరకు మరియు మధ్యాహ్నం 02:40 - 03:26 వరకు

  • వర్జ్యం: రాత్రి 09:18 - 11:01 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మిథునం

  • సూర్యోదయం: ఉదయం 06:17

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:42

బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. కాంగ్రెస్‌పై మోదీ కౌంటర్! తిప్పికొట్టిన హస్తం పార్టీNationalSwechaa29 Oct 2026, 12:40 AM

బ్యాలెట్ పేపర్‌తోనూ ఓటమే.. కాంగ్రెస్‌పై మోదీ కౌంటర్! తిప్పికొట్టిన హస్తం పార్టీ

ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతో నిర్వహిస్తే తమకు అనుకూలంగా ఉంటుందన్న కాంగ్రెస్ వాదనపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్‌గా భవిష్యత్తు ఎన్నికలన్నీ బ్యాలెట్ పేపర్లతో నిర్వహించే ధైర్యం ఉందా అంటూ హస్త

ఏపీలో వరదలు.. తెలంగాణలో కరువు సెగలు! ఒకే రోజు రెండు రాజధానుల్లో భిన్నమైన సమీక్షలుతెలంగాణSwechaa28 Oct 2026, 11:58 PM

ఏపీలో వరదలు.. తెలంగాణలో కరువు సెగలు! ఒకే రోజు రెండు రాజధానుల్లో భిన్నమైన సమీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు.. వరదలపై ముఖ్యమంత్రి వరుస సమీక్షలు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులపై ఆందోళన.. ఎల్‌నినో ప్రభావంపై అఖిలపక్ష చర్చలు. రెండు తెలుగు రాష్ట్రాలు.. మధ్య దూరం 300 కిలోమీటర్ల లోపే. కానీ ప్రకృతి చూపిస్తున్న ప్రభావం మాత్రం పూర్తి భిన్నం.