స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మూసీ పేరుతో మెగా లూటీ.. 30శాతం కమీషన్ కోసమే రేవంత్ ఆరాటంతెలంగాణSwechaa28 Oct 2026, 11:09 PM

మూసీ పేరుతో మెగా లూటీ.. 30శాతం కమీషన్ కోసమే రేవంత్ ఆరాటం

Musi: రాష్ట్రంలో తీవ్ర కరువు కాటకాలు విలయతాండవం చేస్తుంటే.. ప్రజలు తాగునీరు, సాగునీరు లేక అల్లాడిపోతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం వేల కోట్ల రూపాయలతో 'మూసీ సుందరీకరణ' పేరుతో మరో మెగా దోపిడీకి తెరలేపిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. కనీసం డీపీఆర్ లేకుండా, ఎలాంటి పారదర్శకత లేకుండా, నిబంధనలను గాలికొదిలేసి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ద్వారా రూ. 7,345 కోట్ల అప్పు తెచ్చి గ్లోబల్ టెండర్లు పిలవడం పాలకుల దివాలాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. మూసీ రివైవ్‌మెంట్‌పై రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసపూరిత వైఖరి, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు దాసోజు శ్రవణ్. మూసీ టెండర్ల ముసుగులో.. రూ.7,300 కోట్ల పనుల్లో.. 30 శాతం కమీషన్ కోసమే రేవంత్ రెడ్డి ఆరాటం అని ధ్వజమెత్తారు.

కరువును ఎదుర్కొనేందుకు అఖిలపక్షం సూచనల మేరకు చర్యలు- మంత్రి ఉత్తమ్తెలంగాణSwechaa28 Oct 2026, 10:55 PM

కరువును ఎదుర్కొనేందుకు అఖిలపక్షం సూచనల మేరకు చర్యలు- మంత్రి ఉత్తమ్

Elnino: కరువు పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం సానుకూల, నిర్మాణాత్మక దృక్పథంతో ముందుకు సాగుతుందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భరోసా ఇచ్చారు. అంతర్రాష్ట్ర నదీ జలాల అంశాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను, రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో అఖిలపక్ష సమావేశంలో నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ జాజు, ఎల్‌నినో నోడల్‌ అధికారి రామకృష్ణారావు హాజరయ్యారు.

TG: ఖమ్మం, భద్రాద్రికి అర్నబ్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి మంత్రి పొంగులేటి!తెలంగాణSwechaa28 Oct 2026, 10:04 PM

TG: ఖమ్మం, భద్రాద్రికి అర్నబ్ తుఫాన్ ముప్పు.. రంగంలోకి మంత్రి పొంగులేటి!

TG: బంగాళాఖాతంలో కల్లోలం రేపుతున్న ‘అర్నబ్’ తుపాను ప్రభావం ఇప్పుడు తెలంగాణ వైపు మళ్లుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని సరిహద్దు ప్రాంతాలకు పెను ముప్పు పొంచి ఉందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ తుఫాను ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కుండపోత వర్షాలతో పాటు భీకరమైన ఈదురుగాలులు విరుచుకుపడే ప్రమాదం ఉండటంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రమాద తీవ్రతను ముందుగానే పసిగట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయి అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్‌లతో మంత్రి పొంగులేటి నేరుగా ఫోన్‌లో మాట్లాడి గ్రౌండ్ లెవల్ పరిస్థితులపై సమీక్షించారు.

AP: తీరం వైపు 'అర్నబ్'.. ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు!ఏపీSwechaa28 Oct 2026, 09:52 PM

AP: తీరం వైపు 'అర్నబ్'.. ఉత్తరాంధ్రకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు!

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను తీరం వైపు శరవేగంగా దూసుకొస్తోంది. ప్రస్తుతానికి ఈ తీవ్ర తుపాను కాస్త బలహీనపడి సాధారణ తుపానుగా మారినప్పటికీ, ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రం పెను ముప్పు పొంచే ఉంది. ఈ రోజు రాత్రికి ఇది మరింతగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతున్నా.. దీని ప్రభావంతో ఒక్కసారిగా విరుచుకుపడే ఆకస్మిక వరదలు (ఫ్లాష్ ఫ్లడ్స్) స్థానికంగా తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.‘అర్నబ్’ ప్రభావంతో గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోనుంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వానలు పడనుండగా.. ఒకటి రెండు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

Tollywood: రన్‌టైమ్ సినిమాకి రిస్క్ అవుతుందా?సినిమాSwechaa28 Oct 2026, 09:51 PM

Tollywood: రన్‌టైమ్ సినిమాకి రిస్క్ అవుతుందా?

విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ సినిమా ఆదర్శకుటుంబం తాజాగా, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పర్‌ఫెక్ట్ రన్‌టైమ్ తో ప్రేక్షకుల ముందుకు అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మొదటిసారి వెంకీ హీరోగా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సామాన్యుడు తెగిస్తే ఏకే 47 అవుతాడనే పాయింట్‌తో తెరకెక్కిన సినిమాను కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. 2 గంటల 29 నిముషాల నిడివితోనే మన ముందుకు వస్తోంది.

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది- భట్టి విక్రమార్కతెలంగాణSwechaa28 Oct 2026, 09:39 PM

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది- భట్టి విక్రమార్క

Elnino: ‎ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఏర్పడిన వర్షాభావ, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజా ప్రభుత్వం అన్ని ముందస్తు జాగ్రత్తలు, చర్యలను తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపించామని, అవసరమైన సమయంలో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన సహాయంపై విజ్ఞప్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీల సూచనలను పరిగణనలోకి తీసుకొని సమష్టి కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు.‎

చిత్రం లేదు
NationalSwechaa28 Oct 2026, 09:34 PM

PNB Scam: పీఎన్‌బీలో రూ.35 కోట్ల స్కామ్.. మేనేజర్‌తో సహా ఐదుగురు ఉద్యోగులు సస్పెండ్!

PNB Scam: ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో వెలుగు చూసిన రూ.35 కోట్ల స్కామ్ తీవ్ర దుమారం రేపింది. ఖాతాదారుల పర్మిషన్ లేకుండానే కోట్ల రూపాయల డిపాజిట్లు పక్కదారి పట్టినట్లు తేలడంతో బ్యాంకు యాజమాన్యం తక్షణ చర్యలకు ఆదేశించింది. ప్రాథమిక విచారణ అనంతరం బాధ్యులుగా తేలిన బ్రాంచ్ మేనేజర్‌తో సహా మొత్తం ఐదుగురు ఉద్యోగులను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఖాతాదారుల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ అకౌంట్ల నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే రూ.35 కోట్లు మాయమైన వ్యవహారం బయటకు రాగానే పీఎన్‌బీ ఉన్నతాధికారులు, విజిలెన్స్ బృందాలు సదరు బ్రాంచ్‌పై దృష్టి సారించాయి. అంతర్గత తనిఖీల్లో బ్యాంకు ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. మేనేజర్‌తో పాటు మరో నలుగురు సిబ్బందిపై వేటు వేశారు.

ఢిల్లీకి సీఎం రేవంత్.. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరుతెలంగాణSwechaa28 Oct 2026, 08:58 PM

ఢిల్లీకి సీఎం రేవంత్.. ఇన్వెస్ట్ తెలంగాణ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరు

Cm Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఢిల్లీలో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. సీఎం రేవంత్‌, పలు దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు, గ్లోబల్‌ కంపెనీల సీఈవోలు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు, అంతర్జాతీయ ప్రోత్సాహక ఏజెన్సీల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Jailer-2: నాగవంశీకి ఏమీ మిగల్లేదా..?సినిమాSwechaa28 Oct 2026, 08:50 PM

Jailer-2: నాగవంశీకి ఏమీ మిగల్లేదా..?

Jailer-2: సినిమా చేసేది హీరో, తీసేది దర్శకుడు, ఖర్చు పెట్టేది నిర్మాత. కొనేది పంపిణీ దారుడు..ఇలా ఒక సినిమా మార్కెట్‌లోకి రావడానికి మూలాలు. అయితే, నిర్మాత దగ్గర కొన్న తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి వచ్చే లాభ నష్టాలతో ఆ నిర్మాతకి పనిలేదు. లాభం వచ్చినప్పుడు పంచుకోడు..నష్టం వచ్చినప్పుడు ఆదుకోడు. ఇలాంటి వ్యవహారల మధ్య సినిమా వ్యాపారం జరుగుతుంది. అయితే, ఇటీవల వచ్చిన జైలర్ 2 సినిమాను తెలుగులో విడుదల చేసిన నాగవంశీకి మాత్రం ఏమీ మిగల్లేదట.

TG: నేనే కాబోయే సీఎం.. కాదు నేనే.. అప్పుడే కాంగ్రెస్‌‌లో లొల్లి!తెలంగాణSwechaa28 Oct 2026, 08:43 PM

TG: నేనే కాబోయే సీఎం.. కాదు నేనే.. అప్పుడే కాంగ్రెస్‌‌లో లొల్లి!

TG: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పూర్తి కాలం కూడా గడవకముందే, గాంధీ భవన్‌లో సీఎం కుర్చీ చుట్టూ అంతర్గత లొల్లి తారాస్థాయికి చేరింది. పాలనను పరుగులు పెట్టించాల్సిన కీలక సమయంలో, ప్రజా సమస్యల పరిష్కారం కంటే వచ్చే 2029 ఎన్నికల్లో సీఎం ఎవరు అవుతారనే చర్చే కాంగ్రెస్ ముఖ్య నేతల మధ్య జోరుగా నడుస్తుండటం రాజకీయ వర్గాల్లో విస్మయం కలిగిస్తోంది. రేవంత్ రెడ్డే సీఎం పీఠం ఎక్కగాలేనిది, పార్టీని ఎన్నో ఏళ్లుగా మోస్తున్న మేమెందుకు కాకూడదన్న అంతర్గత ఈగో ఇప్పుడు బహిరంగ ప్రకటనల రూపంలో బయటపడుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇటీవల కాలంలో ఒకరి తర్వాత ఒకరుగా కాంగ్రెస్ కీలక నేతలంతా తామే కాబోయే సీఎంలమంటూ ఓపెన్‌గా క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఇప్పటికే తమ మనసులోని కోరికను బయటపెట్టగా, ఎమ్మెల్సీ జగ్గారెడ్డి, యువ నేత బల్మూరి వెంకట్‌, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి సైతం సీఎం రేసులో తామూ ఉన్నామంటూ ఎవరికి వారు కర్చీఫ్‌లు వేసుకుంటున్నారు.

TG: కేటీఆర్‌ నన్ను వేధిస్తున్నాడు.. బల్మూరి ఇందూజ సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa28 Oct 2026, 08:13 PM

TG: కేటీఆర్‌ నన్ను వేధిస్తున్నాడు.. బల్మూరి ఇందూజ సంచలన ఆరోపణలు

TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) చిక్కుల్లో పడ్డారు. తనపై సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేయిస్తూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారంటూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బల్మూర్ ఇందుజా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌ను ఆశ్రయించారు. కేటీఆర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా బీఆర్‌ఎస్ శ్రేణులు, కేటీఆర్ అనుచరులు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతూ నిరంతరం మానసిక వేదనకు గురిచేస్తున్నారని ఇందుజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ ఆదేశాలు, సపోర్ట్‌తోనే నెట్టింట తనపై ఈ స్థాయి దాడి జరుగుతోందని ఆమె ఆరోపించారు.

ఇందిరమ్మ పాలన అంటే.. ఆనాటి ఎమర్జెన్సీ రోజులేతెలంగాణSwechaa28 Oct 2026, 07:34 PM

ఇందిరమ్మ పాలన అంటే.. ఆనాటి ఎమర్జెన్సీ రోజులే

Brs: రేవంత్ సర్కార్ పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు. మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్, హరీశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి హౌస్ అరెస్ట్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తో పాటు కార్తీక్ రెడ్డిని అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు.

రేవంత్ కి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు

ఇందిరమ్మ పాలన అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులే అని మరోసారి గుర్తు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ కి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ గొంతు నొక్కే ఇలాంటి కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తి లేదన్నారు. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయతాండవం చేస్తుంటే లక్షన్నర కోట్ల రూపాయల లూటిఫికేషన్ కు సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేయడం సిగ్గు చేటన్నారు.

Telangana: కాంగ్రెస్ సర్కార్‌కు కరువు గండం.. పతనం ఖాయమా?..తెలంగాణSwechaa28 Oct 2026, 07:20 PM

Telangana: కాంగ్రెస్ సర్కార్‌కు కరువు గండం.. పతనం ఖాయమా?..

తెలంగాణలో సాగునీటి కొరత, విద్యుత్ సమస్యలు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్‌గా మారాయి. పలు జిల్లాల్లో పంట పొలాలు ఎండిపోతుండటంతో రైతాంగంలో అసంతృప్తి క్రమంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజల నుంచి నేరుగా ప్రశ్నలు ఎదుర్కోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Vishwak Sen: ‘అర్ణబ్’ తుఫాన్ బాధితుల కోసం విశ్వక్ సంచలన నిర్ణయం!సినిమాSwechaa28 Oct 2026, 07:10 PM

Vishwak Sen: ‘అర్ణబ్’ తుఫాన్ బాధితుల కోసం విశ్వక్ సంచలన నిర్ణయం!

Vishwak Sen: ఏపీలో ‘అర్ణబ్’ తుఫాన్ విళయతాండవం ఆడుతున్న వేళ ఎన్నో కుటుంబాలకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇస్తూ..వారికి అవసరమైన సదుపాయాలను కల్పించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో చిత్రపరిశ్రమ నుంచి కూడా పలువురు సంఘీభావం తెలుపుతూ అండగా ఉంటామని హామీ ఇస్తున్నారు.

AP: అర్నబ్ తుఫాన్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం చంద్రబాబుఏపీSwechaa28 Oct 2026, 06:52 PM

AP: అర్నబ్ తుఫాన్ బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

AP: అర్నబ్ తుఫాన్ వల్ల నష్టపోయిన వాళ్లెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని, బాధితులందరినీ అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి పరిస్థితులను సమీక్షించిన సీఎం, అనంతరం మీడియాతో మాట్లాడారు. పంటలు, ఆస్తులు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా నిలబడుతుందని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.తుఫాన్ దెబ్బకు ఐదుగురు చనిపోవడంపై సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందజేస్తామని చెప్పారు. ఇళ్లు పాడైపోయిన వాళ్లకు తక్షణ ఖర్చుల కోసం రూ.10 వేలు, పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వాళ్లకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున గరిష్టంగా రూ.3 వేల వరకు సాయం అందించి ఆదుకుంటామని తెలిపారు.

Tollywood: మెగావర్స్‌కి హోస్ట్‌గా మెగాస్టార్..గెస్టులుగా సౌత్ స్టార్స్!సినిమాSwechaa28 Oct 2026, 06:36 PM

Tollywood: మెగావర్స్‌కి హోస్ట్‌గా మెగాస్టార్..గెస్టులుగా సౌత్ స్టార్స్!

Tollywood: మెగాస్టార్ చిరంజీవి మరోసారి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ కార్యక్రమం స్ట్రీమింగ్ కోసం రెడీ అవుతోంది. చాలాఏళ్ళ తర్వాత మళ్ళీ చిరు హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుండటంతో ఇటు మెగా అభిమానుల్లో అటు సినీ వర్గాలలో రెట్టింపు ఉత్సాహం, ఆసక్తి నెలకొంది. తాజా, సమాచారం మేరకు చిరు ఈ ఎంటర్‌టైన్ ప్రోగ్రామ్ షూట్‌లో పాల్గొంటున్నారు.

హైదరాబాద్‌లో తాగునీటి స‌మ‌స్య రాకూడ‌దు- సీఎం రేవంత్ కీలక ఆదేశాలుతెలంగాణSwechaa28 Oct 2026, 06:27 PM

హైదరాబాద్‌లో తాగునీటి స‌మ‌స్య రాకూడ‌దు- సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Cm Revanth: రాజ‌ధాని న‌గ‌రం హైద‌రాబాద్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తాగు నీటి స‌ర‌ఫ‌రా విష‌యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. రిజ‌ర్వాయ‌ర్లలో నీటి నిల్వ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తూ ఉండాల‌న్నారు. క్యూర్ ఏరియాలో మంచి నీటి స‌ర‌ఫ‌రా, ఎస్టీపీల నిర్మాణం, ట్రీటెడ్ వాట‌ర్ వినియోగంపై ఎంసీఆర్ హెచ్ ఆర్డీ బోధి పెవిలియ‌న్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు.

Serbia: యూరప్‌లో 14 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికిన విద్యార్థి లోకం..InternationalSwechaa28 Oct 2026, 06:17 PM

Serbia: యూరప్‌లో 14 ఏళ్ల ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికిన విద్యార్థి లోకం..

ప్రజాస్వామ్యంలో పాలకుల కంటే ప్రజలే బలవంతులని, ముఖ్యంగా విద్యార్థి లోకం తిరగబడితే ఎంతటి బలమైన నియంతలైనా తలవంచక తప్పదని సెర్బియా ఎన్నికల ఫలితాలు మరోసారి చాటిచెప్పాయి. గత 14 ఏళ్లుగా దేశాన్ని తన కనుసన్నల్లో శాసిస్తూ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండదండలతో తిరుగులేని నేతగా వెలుగొందిన అలెగ్జాండర్ ఉసిక్‌ను ఆ దేశ యువత మట్టికరిపించింది. రెండేళ్ల పాటు ఏమాత్రం వెరవకుండా విద్యార్థులు నడిపిన ప్రజా ఉద్యమం ముందు అధికార పక్షం చివరకు చేతులెత్తేసింది. ఫలితాలు వెలువడగానే ఓటమిని అంగీకరించిన ఉసిక్, గద్దె దిగక తప్పలేదు. ఈ సంచలన విజయంతో రాజధాని బెల్‌గ్రేడ్‌తో పాటు ప్రధాన నగరాలన్నీ యువత సంబరాలతో హోరెత్తిపోతున్నాయి. స్వాతంత్ర్యం, స్వేచ్ఛను పునరుద్ధరించుకున్నామంటూ ప్రజలు వేలాదిగా వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు.

తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలితెలంగాణSwechaa28 Oct 2026, 06:17 PM

తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలి

Elnino: ఎల్ నినో పరిస్థితుల కారణంగా తెలంగాణ మొత్తాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. కరువును కొన్ని మండలాలకే పరిమితం చేయడం కరెక్ట్ కాదన్నారు. క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితిని పరిశీలించేందుకు నవంబర్ 3,4 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తామన్నారు. అదే సమయంలో రాజకీయ పార్టీలకు హితబోధ చేశారు కూనంనేని సాంబశివరావు. ఎల్ నినో పరిస్థితులతో కరువు విలయ తాండవం చేస్తోందన్నారు. కరువు అనేది ప్రపంచవ్యాప్తంగా సంభవించిందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంపై రాజకీయంగా ఒకరిపై మరొకరు బురద చల్లుకోవడం మాని.. ఈ సంక్షోభం నుంచి ఎలా బయటపడాలో ఆలోచన చేయాలని రాజకీయ పార్టీలకు సూచించారు.

ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పోలింగ్ ఎప్పుడంటేఏపీSwechaa28 Oct 2026, 05:26 PM

ఏపీలో MPTC, ZPTC ఎన్నికల రీషెడ్యూల్.. పోలింగ్ ఎప్పుడంటే

Elections: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్ అయ్యాయి. ఈ మేరకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 5న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. 7న ఫలితాలు వెల్లడిస్తారు. అవసరమైన చోట నవంబర్ 6న రీపోలింగ్ కు అవకాశం కల్పిస్తారు. నవంబర్ 3న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ కారణంగా నవంబర్ 3న జరగాల్సిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు. నవంబర్ 5న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.

DPDP Act: పత్రికా స్వేచ్ఛకు ఉరితాడులా డిజిటల్ చట్టం?NationalSwechaa28 Oct 2026, 05:15 PM

DPDP Act: పత్రికా స్వేచ్ఛకు ఉరితాడులా డిజిటల్ చట్టం?

DPDP Act: డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) యాక్ట్-2023 నిబంధనలు స్వతంత్ర జర్నలిజం ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయనే ఆందోళన దేశ సర్వోన్నత న్యాయస్థానం మెట్లెక్కింది. వార్త రాయాలన్నా, పరిశోధనాత్మక కథనాలు ప్రచురించాలన్నా సదరు వ్యక్తుల ముందస్తు అనుమతి (కన్సెంట్) తప్పనిసరి అయితే దేశంలో పత్రికా రంగమే నిర్వీర్యమవుతుందని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన త్రిసభ్య ధర్మాసనం, దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వానికి అధికారిక నోటీసులు జారీ చేసింది.ఈ చట్టంలోని కొన్ని రూల్స్ వాస్తవ విలేకరితనానికి సంకెళ్లు వేసేలా ఉన్నాయని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ ధర్మాసనం ఎదుట బలంగా వాదించారు. ప్రతి వార్త వెనుక సమాచారం ప్రచురించేందుకు వ్యక్తుల ముందస్తు అనుమతి తీసుకోవాల్సి రావడం పరోక్షంగా "ముందస్తు సెన్సార్‌షిప్" కిందకే వస్తుందని పేర్కొన్నారు.

ప్రజాభవన్ ఎదుట మోకాళ్లపై కూర్చుని మాజీ సర్పంచుల నిరసనతెలంగాణSwechaa28 Oct 2026, 04:42 PM

ప్రజాభవన్ ఎదుట మోకాళ్లపై కూర్చుని మాజీ సర్పంచుల నిరసన

Protest: తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆందోళన బాటపట్టింది. మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచులు నిరసనకు దిగారు. మోకాళ్ళపై కూర్చుని నిరసన తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

మూడేళ్లుగా బిల్లులు పెండింగ్

గ్రామాల అభివృద్ధి కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేసిన మాజీ సర్పంచులకు ఇప్పటికీ బిల్లులు అందలేదని, దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఇప్పటివరకు ప్రజాభవన్ లో 13 సార్లు వినతి పత్రాలు అందజేశామన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో పెట్టారని ప్రభుత్వంపై మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనైనా ప్రభుత్వం స్పందించాలని, బిల్లులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేయవద్దంటూ పట్టభద్రులను కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని హెచ్చరించారు.

Tech Layoffs: సైలెంట్ కిల్లర్‌గా ఏఐ.. ఐటీ కొలువులపై వేలాడుతున్న కత్తి!NationalSwechaa28 Oct 2026, 04:07 PM

Tech Layoffs: సైలెంట్ కిల్లర్‌గా ఏఐ.. ఐటీ కొలువులపై వేలాడుతున్న కత్తి!

Tech Layoffs: ఒకప్పుడు లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవితం, చేతినిండా ప్రాజెక్టులతో కళకళలాడిన ఐటీ పరిశ్రమలో ఇప్పుడు గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. పదేళ్ల క్రితం ‘సాఫ్ట్‌వేర్ ఇంజినీర్’ అంటే అదొక తిరుగులేని భరోసా. కానీ, నేడు ఆ భరోసాను ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ తీవ్రంగా ప్రశ్నిస్తోంది. అంతర్జాతీయంగా మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, డెల్ వంటి దిగ్గజ కంపెనీల నుంచి మొదలుకొని దేశీయ ఐటీ టాప్ కంపెనీలు టీసీఎస్, టెక్ మహీంద్రా వరకు దాదాపు అన్ని సంస్థల్లో తెరవెనుక ఒకటే చర్చ నడుస్తోంది.. అదే ‘కాస్ట్ కటింగ్’, వర్క్‌ఫోర్స్ రీ-స్ట్రక్చరింగ్. సాధారణంగా జరిగే లేఆఫ్‌ల లాగా కాకుండా, అత్యంత వ్యూహాత్మకంగా సాగుతున్న ఈ అంతర్గత ప్రక్షాళన వెనుక అసలేం జరుగుతోందో తెలుసుకుందాం.

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ కథ మార్చారు కాబట్టే డిజాస్టర్!సినిమాSwechaa28 Oct 2026, 04:02 PM

Karthik Subbaraj: ‘గేమ్ ఛేంజర్’ కథ మార్చారు కాబట్టే డిజాస్టర్!

Karthik Subbaraj: కొన్ని సినిమాలు రిలీజ్ సమయంలో కాకుండా, ఆ తర్వాత ఎప్పటికో గానీ, అసలు బాక్సాఫీస్ లెక్కలు..ఫ్లాప్ కి కారణాలు..కారణమైన వ్యక్తులు బయటకు వస్తారు. తాజాగా, తమిళ దర్శకరచయిత కార్తీక్ సుబ్బరాజ్ వెల్లడించిన ఓ ఆసక్తికరమైన విషయం మెగా అభిమానులను షాక్‌కి గురి చేస్తోంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమాకి సంబందించి కార్తీక్ ఇచ్చిన కథను దర్శకుడు శంకర్ మార్చడం వల్లే డిజాస్టర్ అయిందని అసలు విషయాన్ని బయటపెట్టాడు.

రూ.10 లక్షలు లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐ అరెస్ట్క్రైమ్Swechaa28 Oct 2026, 03:20 PM

రూ.10 లక్షలు లంచం డిమాండ్.. బంజారాహిల్స్ ఎస్ఐ అరెస్ట్

ACB: హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ)ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసులో అరెస్ట్ చేయకుండా రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశారు ఎస్ఐ విజయ్. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ఎస్ఐపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్లాట్ల విక్రయం పేరుతో మోసాలకు పాల్పడ్డ ఫార్చ్యూన్ హోమ్స్ అధినేత రోసిరెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఎస్ఐని అరెస్ట్ చేశారు.

Tollywood: ఒకేసారి బాలయ్య, నాగార్జున, షారుఖ్!సినిమాSwechaa28 Oct 2026, 03:17 PM

Tollywood: ఒకేసారి బాలయ్య, నాగార్జున, షారుఖ్!

Tollywood: ముగ్గురు బిగ్ స్టార్ కలిసి ఒకేసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్రకి సిద్ధమవుతున్నారు. ఇది, ఒకరకంగా ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగించేదే అయినా, ఆ సినిమాలలో ఏ ఒక్కటైనా ఫలితం తేడా కొడితే..నిర్మాత మాత్రం తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. చిన్న సినిమా అయినా బిగ్ స్టార్ సినిమా అయినా..ఒక్కో వారం ఒక్కో సినిమా రిలీజైతేనే అందరికీ లాభం.

Keerthy Suresh: హీరోయిన్లది గ్యారెంటీ లేని జీవితం!సినిమాSwechaa28 Oct 2026, 02:42 PM

Keerthy Suresh: హీరోయిన్లది గ్యారెంటీ లేని జీవితం!

Keerthy Suresh: "హీరోయిన్లది గ్యారెంటీ లేని జీవితం" అంటోంది మహానటి..కీర్తి సురేష్. వరుసగా సౌత్‌లోని అన్నీ భాషల్లో సినిమాలు చేస్తూ..ఈ మధ్య బాలీవుడ్ నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న కీర్తి, ఉన్నపలంగా ఇలా ఎందుకు అన్నది..అనే ఆశ్చర్యం అందరిలోనూ కలుగుతోంది. కీర్తి సురేష్ ఇలా అనడానికి ముఖ్య కారణం కూడా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆమె నటించిన మహానటి సినిమా.

లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బంజారాహిల్స్ ఎస్సైతెలంగాణSwechaa28 Oct 2026, 02:24 PM

లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బంజారాహిల్స్ ఎస్సై

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్సై విజయ్‌ లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాట్ల అమ్మకాల పేరుతో మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫార్చ్యూన్ 99 హోమ్స్ అధినేత రోసిరెడ్డిని.. ఎస్ఐ విజయ్ రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. అరెస్ట్ చేయకుండా ఉండాలంటే లంచం ఇవ్వాల్సిందేనని బ్లాక్ మెయిల్ చేశాడు.

అయితే, తాను రూ.10వేల కంటే ఎక్కువ ఇవ్వలేనని రోసిరెడ్డి చెప్పాడు. దీంతో పాత కేసుల్లో నోటీసు పేరుతో పిలిపించి లక్ష ఇవ్వాలంటూ విజయ్ డిమాండ్‌ చేశాడు. ఎస్ఐ వేధింపులు భరించలేకపోయిన రోసిరెడ్డి.. ఏసీబీని ఆశ్రయించాడు. ఎస్ఐ విజయ్ కి రోసిరెడ్డి లక్ష రూపాయలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. విజయ్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Srinidhi Shetty: కేజీఎఫ్ కి పూర్తి భిన్నమైన పాత్రలో శ్రీనిధి!సినిమాSwechaa28 Oct 2026, 02:17 PM

Srinidhi Shetty: కేజీఎఫ్ కి పూర్తి భిన్నమైన పాత్రలో శ్రీనిధి!

Srinidhi Shetty:కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించిన లేటెస్ట్ సినిమా ఆదర్శకుటుంబం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు. అయితే, సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరిగానే వెంకీ-శ్రీనిధిల మధ్య చాలా ఏజ్ గ్యాప్ ఉంది. వాస్తవానికి, శ్రీనిధి యూత్ హీరోలతో సినిమాలు చేయాల్సింది. కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన కథ నచ్చి వెంకటేష్ హీరో అనగానే ఒప్పుకుంది.

Telangana: కీలక శాఖలపై రేవంత్ సర్కార్ ఫోకస్-12 మంది ఐఏఎస్‌ అధికారులకు కొత్త బాధ్యతలు!తెలంగాణSwechaa28 Oct 2026, 12:59 PM

Telangana: కీలక శాఖలపై రేవంత్ సర్కార్ ఫోకస్-12 మంది ఐఏఎస్‌ అధికారులకు కొత్త బాధ్యతలు!

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 12 మంది సీనియర్ అధికారులకు బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పర్యావరణం, ఇంధనం, పంచాయతీరాజ్, క్రీడలు, దేవాదాయ, వైద్యారోగ్య శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లోనూ అధికారుల బదిలీలు జరిగాయి. వరుస మార్పులతో ప్రభుత్వ పరిపాలనలో ఎలాంటి ఫలితాలు వస్తాయి? ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.