స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Telangana: కీలక శాఖలపై రేవంత్ సర్కార్ ఫోకస్-12 మంది ఐఏఎస్‌ అధికారులకు కొత్త బాధ్యతలు!తెలంగాణSwechaa28 Oct 2026, 12:59 PM

Telangana: కీలక శాఖలపై రేవంత్ సర్కార్ ఫోకస్-12 మంది ఐఏఎస్‌ అధికారులకు కొత్త బాధ్యతలు!

తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. మొత్తం 12 మంది సీనియర్ అధికారులకు బదిలీలు, అదనపు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. పర్యావరణం, ఇంధనం, పంచాయతీరాజ్, క్రీడలు, దేవాదాయ, వైద్యారోగ్య శాఖల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్ నెలల్లోనూ అధికారుల బదిలీలు జరిగాయి. వరుస మార్పులతో ప్రభుత్వ పరిపాలనలో ఎలాంటి ఫలితాలు వస్తాయి? ప్రజలకు సేవలు మరింత వేగంగా అందుతాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Land Act: భూములు కొనేవాళ్ళు ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టమే!..Legal MattersSwechaa28 Oct 2026, 12:10 PM

Land Act: భూములు కొనేవాళ్ళు ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టమే!..

కష్టపడి పైసా పైసా కూడబెట్టి ఎంతో కొంత భూమి కొనుక్కుంటే.. ఆ భూమి మనది అవుతుందన్న నమ్మకం లేదు. భూమి అమ్మిన వాళ్ళు మోసం చేశారో లేదో తెలియక తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నేడు ఉన్నాయి.. అందుకే అసలు భూములు ఎన్ని రకాలు.. వాటి పేర్లు ఏమిటి.. వాటిని ఎలా గుర్తించాలి అన్న విషయాలపై క్లారిటీ ఉంటే.. ఈ ఆందోళనే అక్కర్లేదని న్యాయవాదులు తెలియచేస్తున్నారు..

తెలంగాణలో 365  కరువు మండలాలు.. సర్కార్ కీలక నిర్ణయం!తెలంగాణSwechaa28 Oct 2026, 10:59 AM

తెలంగాణలో 365 కరువు మండలాలు.. సర్కార్ కీలక నిర్ణయం!

ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో సాగు, తాగు నీటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సాగు, తాగు నీటి ఇబ్బందులు ఏర్పడిన చోట కరువును డిక్లేర్ చేసింది. దీంతో కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరి కరువు ప్రాంతాల్లో అన్నదాతలకు ఆర్థిక సాయం ప్రకటించేందుకు సిద్ధమైంది.ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు త్వరగా తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలో ప్రతిఏటా కురవాల్సిన వర్షపాతం కంటే 17 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో నీటి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది.

TG : అవినీతి ఖాకీలు!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa28 Oct 2026, 10:23 AM

TG : అవినీతి ఖాకీలు!

పోలీసుల అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్న ఘటనలు చూస్తే ఎవరైనా ఈ మాట అనకుండా ఉండరు.విధుల్లో నిజాయితీగా పని చేస్తానని ప్రమాణం చేసి ఖాకీ డ్రెస్ వేసుకునే పోలీసులు ఆ శాఖకే మాయని మచ్చ తెస్తున్నారు. విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. కొందరు చేస్తున్న ఈ తప్పు వల్ల డిపార్ట్‌మెంట్ మొత్తానికి చెడ్డపేరు వస్తోంది.మంగళవారం హైదరాబాద్‌లోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో రూ.3 లక్షల లంచం తీసుకుంటూ సీఐ కొండల్ రావు ఏసీబీకి పట్టుబడ్డాడు.ఆయనతో పాటు ఓ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ప్రేమ.. జ్ఞాపకాలు.. కన్నీళ్లు! ఇన్నాళ్లకు మనసు విప్పిన సోనియా గాంధీNationalSwechaa28 Oct 2026, 12:10 AM

ప్రేమ.. జ్ఞాపకాలు.. కన్నీళ్లు! ఇన్నాళ్లకు మనసు విప్పిన సోనియా గాంధీ

ఇన్నేళ్లూ ఇతరులు చెప్పిందే నా కథ.. ఇప్పుడు నా వంతు అంటున్నారు సోనియా గాంధీ. రాజీవ్‌తో తొలి పరిచయం నుంచి ఆయన ప్రధాని కావడాన్ని వ్యతిరేకించే వరకు.. బయట ప్రపంచానికి తెలియని భావోద్వేగాలను పంచుకుంటున్నారు. నవంబర్ 10న విడుదల కానున్న ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంతో తన జీవితంలోని జ్ఞాపకాలను పాఠకుల ముందుకు తీసుకురానున్నారు.

హైదరాబాద్‌లో వాటర్ ఎమర్జెన్సీ.. బోర్లు ఎండితే అంతే సంగతి!తెలంగాణSwechaa27 Oct 2026, 11:19 PM

హైదరాబాద్‌లో వాటర్ ఎమర్జెన్సీ.. బోర్లు ఎండితే అంతే సంగతి!

నీటి కోసం ట్యాంకర్ల చుట్టూ తిరగాల్సి వస్తే? రోజువారీ అవసరాలకు కూడా నీటిని కొనుక్కోవాల్సి వస్తే? పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. హైదరాబాద్‌లో భూగర్భ జలాల పరిస్థితిపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక మ్యాప్ ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.

పెండింగ్ బిల్లులు చెల్లించండి- ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ట్రెసా అభ్యర్థనతెలంగాణSwechaa27 Oct 2026, 09:00 PM

పెండింగ్ బిల్లులు చెల్లించండి- ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ట్రెసా అభ్యర్థన

TRESA: తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (TRESA-ట్రెసా) రాష్ట్ర ప్రతినిధి బృందం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాని కలిసింది. రెవెన్యూ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని కోరింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 కాలానికి వాహన అద్దె చార్జీలు చెల్లించకపోవడం వల్ల తహసీల్దార్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రెసా ప్రతినిధులు వాపోయారు. పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్ల వాహన అద్దె చార్జీలను వెంటనే విడుదల చేయాలన్నారు. భవిష్యత్తులో ప్రతి నెల వాహన అద్దె బిల్లులు పెండింగ్‌లో ఉండకుండా సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కు విజ్ఞప్తి చేశారు.

ప‌నితీరులో మార్పు రాక‌పోతే క‌ఠిన‌ చ‌ర్య‌లు- రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి వార్నింగ్తెలంగాణSwechaa27 Oct 2026, 08:41 PM

ప‌నితీరులో మార్పు రాక‌పోతే క‌ఠిన‌ చ‌ర్య‌లు- రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి వార్నింగ్

Land Survey: రెవెన్యూ ఉద్యోగులు స‌క్ర‌మంగా, బాధ్య‌తాయుతంగా ప‌ని చేసిన‌ప్పుడే ప్ర‌జ‌లు ముఖ్యంగా రైతుల స‌మ‌స్య‌లు తీరుతాయ‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ప‌లుమార్లు రెవెన్యూ ఉద్యోగుల‌ను ఆదేశించిన‌ప్ప‌టికీ పూర్తి స్థాయి ఫ‌లితాలు క‌నిపించ‌లేద‌న్నారు. భ‌విష్య‌త్తులో మార్పు రాక‌పోతే అధికారులు, ఉద్యోగుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు.

ఎల్‌నినో, కరువు పరిస్థితులపై అఖిలపక్ష భేటీతెలంగాణSwechaa27 Oct 2026, 08:25 PM

ఎల్‌నినో, కరువు పరిస్థితులపై అఖిలపక్ష భేటీ

‎Elnino: రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, కరువు పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది.

‎

NBK 112: అందుకే థమన్, అనిరుధ్‌లను పక్కన పెట్టిన కొరటాల!సినిమాSwechaa27 Oct 2026, 07:22 PM

NBK 112: అందుకే థమన్, అనిరుధ్‌లను పక్కన పెట్టిన కొరటాల!

NBK 112: మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు రచయిత కొరటల శివ. మొదటి సినిమాను ఏకంగా ప్రభాస్‌తో చేసి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో, ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్‌టిర్, మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌లను డైరెక్ట్ చేసే ఛాన్స్ అందుకున్నాడు. అయితే, వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్స్ అందుకున్న కొరటాల ఆచార్య విషయంలో మాత్రం తడబడ్డాడు. దీని, తర్వాత చేసిన దేవర సినిమా కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు.

అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన సమస్యలపై మాట్లాడొద్దా?తెలంగాణSwechaa27 Oct 2026, 06:46 PM

అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన సమస్యలపై మాట్లాడొద్దా?

Anirudh Reddy: కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. సొంత పార్టీ ప్రభుత్వంపైనే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. నేను చస్తేనే నా నియోజకవర్గానికి నిధులు ఇస్తామంటే.. ప్రాణత్యాగానికైనా సిద్ధమే అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. అధికార పార్టీలో అలజడి సృష్టించాయి.

మూడోసారి తిరగబడతా..

తాజాగా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ లో రేషన్ డీలర్ల సమావేశంలో మరోసారి హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. నేను ఒక్కసారి అడుగుతా, రెండోసారి బతిమాలుతా, మూడోసారి తిరగబడతా.. అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన సమస్యలపై మాట్లాడొద్దా? అని ప్రశ్నించారు. తప్పుని తప్పు అని చెప్పొద్దా? అని నిలదీశారు.

Shruti Haasan: కమల్ కూతురుకి కథలు నచ్చడం లేదా?సినిమాSwechaa27 Oct 2026, 06:22 PM

Shruti Haasan: కమల్ కూతురుకి కథలు నచ్చడం లేదా?

Shruti Haasan: విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురు సౌత్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌కి ఈ మధ్య ఆకట్టుకునే కథలు చెప్పే వాళ్ళు లేరని తెలుస్తోంది. అందుకే, కొత్త ప్రాజెక్ట్స్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. గత చిత్రం రజినీకాంత్ నటించిన కూలీ. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇప్పుడు, పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న "ఆకాశంలో ఒక తార" అనే సినిమా రూపొందుతుండగా, ఇందులో కీలక పాత్రను పోషించింది.

శబరిమల యాత్ర.. అయ్యప్ప భక్తులకు కీలక సూచనలుతెలంగాణSwechaa27 Oct 2026, 05:48 PM

శబరిమల యాత్ర.. అయ్యప్ప భక్తులకు కీలక సూచనలు

Sabarimala Yatra: 2026-27 శబరిమల మండల-మకరవిళక్కు యాత్రా కాలానికి సంబంధించిన వర్చువల్ క్యూ బుకింగ్ అక్టోబర్ 29 గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. సోమవారం జరిగిన ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు (TDB) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్స్ కలిపి రోజుకు గరిష్టంగా 80వేల మంది యాత్రికులను మాత్రమే అనుమతిస్తారు. యాత్రికుల అధికారిక వెబ్ సైట్ sabarimalaonline.org ద్వారా తమ దర్శన స్లాట్లను బుక్ చేసుకోవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ పూర్తిగా ఉచితం.

కాంగ్రెస్ పాలనలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? పనులు అవుతాయా?తెలంగాణSwechaa27 Oct 2026, 04:42 PM

కాంగ్రెస్ పాలనలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? పనులు అవుతాయా?

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. కాంగ్రెస్ పాలనలో చచ్చిపోతేనే పనులు అవుతాయా? అంటూ ధ్వజమెత్తారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్‌ను లక్ష కోట్ల అప్పుల్లో ముంచారని, 600 కోట్ల రూపాయల బియ్యాన్ని పందికొక్కుల పాలు చేశారని ఆరోపించారు. పెండింగ్ బిల్లుల కోసం తాను చనిపోవడానికీ సిద్ధమని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అంటుంటే.. సమస్యల పరిష్కారం కోసం ప్రాణత్యాగానికి సిద్ధమని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు రాజు అంటున్నారు. కాంగ్రెస్ రాజ్యంలో చచ్చిపోతేనే బిల్లులు వస్తాయా? అంటూ విరుచుకుపడ్డారు హరీశ్ రావు.

Nidhhi Agerwal: సైలెంట్‌గా కానిచ్చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ!సినిమాSwechaa27 Oct 2026, 04:02 PM

Nidhhi Agerwal: సైలెంట్‌గా కానిచ్చేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ!

Nidhhi Agerwal: యాక్టింగ్ రాదు, ఎక్స్‌ప్రెషన్స్ లేవు అన్న మాట నిధి అగర్వాల్ విషయంలో వినిపించింది. పక్కా హైదరాబాదీ అయిన నిధి..ముందు బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ బ్యూటీ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ అంటే ఒక్క ఇస్మార్ట్ శంకర్ సినిమా మాత్రమే. దాదాపు, అందరు ఈమెను ఫ్లాప్ హీరోయిన్ అనే కామెంట్స్ చేశారు. కానీ, ఈ ఫ్లాప్ హీరోయిన్ చేతిలో ఏకంగా అరడజను సినిమాలుండటం షాకింగ్ విషయం.

Varanasi: ఇంకా పూర్తి చేయాల్సింది మిగిలే ఉంది!సినిమాSwechaa27 Oct 2026, 03:18 PM

Varanasi: ఇంకా పూర్తి చేయాల్సింది మిగిలే ఉంది!

Varanasi: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ సినిమాకి సంబందించి దర్శకుడు రాజమౌళి విదేశాలలో పలు పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ముందు అక్కడ ఆడియన్స్‌ను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకూ, వ్యాపారపరంగా వారణాసి నుంచి ఏ డీల్ కూడా క్లోజ్ కాలేదు. అయితే, తాజా సమాచారం మేరకు ఇంకో 10 రోజుల పాటు షూట్ బ్యాలెన్స్ ఉంది.

175 ఎకరాల భూవివాదం.. ఎంపీ రఘునందన్ రావు కుటుంబంపై సంచలన ఆరోపణలు!తెలంగాణSwechaa27 Oct 2026, 03:18 PM

175 ఎకరాల భూవివాదం.. ఎంపీ రఘునందన్ రావు కుటుంబంపై సంచలన ఆరోపణలు!

 రాష్ట్రంలో మరోసారి భూ అన్యాక్రాంతం, ప్రభుత్వ భూముల ప్రైవేట్ పట్టాల మార్పిడి వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సిద్దిపేట జిల్లా చౌడర్‌పల్లి గ్రామం సర్వే నంబర్ 294 పరిధిలోని సుమారు 175 ఎకరాల భూమికి సంబంధించిన చారిత్రక రికార్డులు, తదనంతరం జరిగిన భూ బదలాయింపులపై స్వతంత్ర దర్యాప్తు జరగాలంటూ తీవ్రస్థాయిలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ వివాదంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు (MP) మాధవనేని రఘునందన్ రావు కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

‘జగన్ 2.0 చూపిస్తే.. మేం 10X చూపిస్తాం..’ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్!ఏపీSwechaa27 Oct 2026, 02:51 PM

‘జగన్ 2.0 చూపిస్తే.. మేం 10X చూపిస్తాం..’ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్!

 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి, విపక్ష వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘మీరు 2.0 చూపిస్తామని బెదిరిస్తే.. మేం 10X (పదిరెట్లు) చూపిస్తాం’ అంటూ జగన్‌కు పవన్ కల్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలో మంగళవారం ఏర్పాటు చేసిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సంయుక్త మీడియా సమావేశంలో పవన్ మాట్లాడారు.

Keerthy Suresh: హిందీ సినిమా ఫ్లాప్..కీర్తి లాజిక్ కరెక్టే కదా!సినిమాSwechaa27 Oct 2026, 02:45 PM

Keerthy Suresh: హిందీ సినిమా ఫ్లాప్..కీర్తి లాజిక్ కరెక్టే కదా!

Keerthy Suresh: స్టార్స్ నటించిన ప్రతీ సినిమా హిట్టావ్వాలని లేదు. బ్లాక్ బస్టర్ కొట్టాలని టార్గెట్ ఏమీ ఉండదు. సినిమా చేయడం వరకే మేకర్స్ పని. అలాగే, హీరోహీరోయిన్ విషయంలోనూ. ఒక సినిమా ఫలితాన్ని చాలా విషయాలు ప్రభావితం చేస్తాయి. పోటీగా మరో సినిమా..లేదా దర్శకుడు తీర్చిదిద్దిన తీరు..సీజన్..ఇలా ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Ramayana: మొన్న సాయి పల్లవి, ఇప్పుడు రెహమాన్..ట్రోలర్స్ తప్పేనా!సినిమాSwechaa27 Oct 2026, 02:16 PM

Ramayana: మొన్న సాయి పల్లవి, ఇప్పుడు రెహమాన్..ట్రోలర్స్ తప్పేనా!

Ramayana: సోషల్ మీడియా ప్రభావం ప్రతీ విషయం మీద ఉంటోంది. దీపావళి పండుగ సందర్భంగా ఈ నవంబర్ 5న మైథలాజికల్ మూవీ రామాయణ పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా, రామాయణ నుంచి 'మంగళ రంగ్‌' అంటూ సాగే పాటను విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాట ట్యూన్ విషయంలో టోలర్స్ గట్టిగా ఆస్కార్ విన్నర్‌ను కామెంట్స్ చేస్తున్నారు. దీనికి, ఆయన ఇచ్చిన కౌంటర్ బుల్లెట్‌లా తగిలింది.

సౌదీ భారీ స్కెచ్: రూ.9,500 కోట్ల ఆఫర్!InternationalSwechaa27 Oct 2026, 02:13 PM

సౌదీ భారీ స్కెచ్: రూ.9,500 కోట్ల ఆఫర్!

 పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్) ప్రాంతంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అత్యంత కీలకమైన రాజకీయ, దౌత్య పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. యెమెన్‌లోని హౌతీ (Houthi) తిరుగుబాటుదారులతో శాశ్వత కాల్పుల విరమణ (Ceasefire) ఒప్పందం కుదుర్చుకోవడం కోసం సౌదీ అరేబియా భారీ ప్రతిపాదన తెచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. తమ దేశ భూభాగంపై దాడులను తక్షణమే నిలిపివేస్తే, హౌతీలకు ఏకంగా 1 బిలియన్ అమెరికన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.9,507 కోట్లు) ఆర్థిక సాయంగా అందించేందుకు సౌదీ ఆఫర్ చేసినట్లు గల్ఫ్ దౌత్య వర్గాలను ఉటంకిస్తూ కథనాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌లో 4.3కిలోమీటర్ల పొడవుతో అతిపెద్ద ఫ్లైఓవర్.. పనులు షురూ!తెలంగాణSwechaa27 Oct 2026, 02:06 PM

హైదరాబాద్‌లో 4.3కిలోమీటర్ల పొడవుతో అతిపెద్ద ఫ్లైఓవర్.. పనులు షురూ!

 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే కీలక మార్గంలో ప్రయాణించే వాహనదారులకు జీహెచ్‌ఎంసీ (GHMC) తీపి కబురు అందించింది. భాగ్యనగరంలో నిత్యం నెలకొనే తీవ్ర ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పంజాగుట్ట-జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. నగరంలోనే అత్యంత పొడవైనదిగా నిలవనున్న ఈ భారీ ఫ్లైఓవర్ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులు వేగవంతం చేశారు.

విశాఖను ఘోరంగా వణికిస్తున్న అర్నబ్ తుపాను..ఏపీSwechaa27 Oct 2026, 01:59 PM

విశాఖను ఘోరంగా వణికిస్తున్న అర్నబ్ తుపాను..

ఏపీని అర్నబ్ తుపాను గజగజ వణకిస్తోంది. తీరంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలలు సైతం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి జోరుగా వర్షం కురవడంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.ఈదురు గాలులు బలంగా వీస్తుండటంతో వాతావరణం గందరగోళంగా మారింది. ఈదురుగాలుల ధాటికి ఎక్కడికక్కడ చెట్లు కూలుతున్నాయి. విశాఖపట్నంలోని అంగడి దిబ్బలో ఓ ఇంటిపై వృక్షాలు కూలాయి. దీనికి తోడు ఆంధ్రా యూనివర్సిటీలో రోడ్డుకు అడ్డంగా చెట్టు పడినట్టు తెలిసింది.తుపాను నేపథ్యంలో విశాఖలోని పర్యాటక ప్రాంతాలన్నింటనీ ముందుగానే అధికారులు మూసివేశారు. అదే విధంగా ఆంధ్రా యూనివర్సిటీకి 10 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. విద్యాసంస్థలకు కూడా రెండు రోజులు సెలవు ఇచ్చారు.

టోల్‌చార్జీలు తగ్గింపు.. కండిషన్స్ అప్లయ్!NationalSwechaa27 Oct 2026, 01:26 PM

టోల్‌చార్జీలు తగ్గింపు.. కండిషన్స్ అప్లయ్!

జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్‌ ఏడాది పాస్ విధానంలో ప్రస్తుతం అమలవుతున్న వాటిలో కీలక మార్పులు చేస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానికులకు తక్కువ ధరకే సంవత్సర పాస్ అందించేలా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. జాతీయ రహదారి ఫీజు నిర్ధారణ, సేకరణ నిబంధనలకు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తాజా నిబంధనలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. కమర్షియల్ వాహనదారుల ప్రయోజనాల కోసం రిజిస్టర్ అయి, ఫాస్టాగ్‌ కలిగి ఉన్న ఓనర్స్ తమ స్థానిక ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల వద్ద రాయితీ పాస్‌లను పొందేందుకు అర్హులు అవుతారు.

చైన్ స్నాచర్ల బీభత్సం..మహిళలను బైక్‌తో ఢీకొట్టి, కట్టర్‌తో కట్ చేసి!క్రైమ్Swechaa27 Oct 2026, 12:52 PM

చైన్ స్నాచర్ల బీభత్సం..మహిళలను బైక్‌తో ఢీకొట్టి, కట్టర్‌తో కట్ చేసి!

హైదరాబాద్ మహానగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రోడ్డు మీద ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తున్న ఈ దుండగులు.. ఈసారి మరింత బరితెగించారు. పట్టపగలే ఓ మహిళను వెంబడించి మరీ యాక్సిడెంట్ చేసి ఆమె మెడలోని చైన్‌ను కట్టర్ సాయంతో కట్ చేసి దొంగిలించుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం స్టేజి వద్ద చోటుచేసుకోగా మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నల్గొండ జాతీయ రహదారిపై హిమబిందు అనే మహిళ ద్విచక్ర వాహనంపై తన కొడుకుతో కలిసి వెళ్తోంది. నకిరేకల్‌ నుంచి ఆటిపాముల వైపు వెళ్తుండగా ఎదురుగా బైక్ మీద హెల్మెట్లు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు.. బాధితురాలి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో తల్లీకొడుకులను రోడ్డుపై కిందపడిపోగా ఆమెను బెదిరించారు. చంపేస్తామని బెదిరింపులకు గురిచేసి కట్టర్‌తో దాడి చేసి ఆమె 3 తులాల పుస్తెలతాడును దుండగులు ఎత్తుకెళ్లారు.

కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచే చెక్.. బీజేపీ బిగ్ స్కెచ్!తెలంగాణSwechaa27 Oct 2026, 12:41 PM

కాంగ్రెస్‌కు తెలంగాణ నుంచే చెక్.. బీజేపీ బిగ్ స్కెచ్!

కాంగ్రెస్‌ ఢిల్లీలో భారీ ర్యాలీకి సిద్ధమవుతుంటే.. బీజేపీ మాత్రం తెలంగాణ నుంచి తన రాజకీయ కార్యాచరణను మరింత వేగవంతం చేస్తోంది. నవంబర్‌లో అమిత్ షా.. డిసెంబర్‌లో ప్రధాని మోదీ పర్యటనలు.. అసలు తెలంగాణలో బీజేపీ ఏం చేయబోతోంది? కాంగ్రెస్‌కు ఇక్కడి నుంచే రాజకీయంగా చెక్ పెట్టాలనుకుంటోందా?

Telangana: గాడితప్పిన హామీలు.. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఎటువైపు?..తెలంగాణSwechaa27 Oct 2026, 12:31 PM

Telangana: గాడితప్పిన హామీలు.. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఎటువైపు?..

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను గత ప్రభుత్వం అప్పుల పాలు చేసిందన్న విమర్శలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అదే ఆర్థిక సంక్షోభాన్ని కొనసాగిస్తోందనే ఆరోపణలున్నాయి.. ఆరు గ్యారెంటీలు, ఉచిత పథకాల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలు ఆచరణలో విఫలమవుతున్నాయి. విద్య, వైద్యం వంటి ప్రాథమిక రంగాలను పక్కనబెట్టి, సరైన ఆదాయ వనరుల సృష్టి లేకుండా అమలు చేస్తున్న ఈ పథకాల భారం చివరికి సామాన్య ప్రజలపైనే పడుతోందని అంటున్నారు. పారదర్శక పాలన అందిస్తామన్న మాటలు నీటిమూటలవుతుండటంతో, రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని అంటున్నారు..

వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు..  జయేశ్  రంజన్ సంచలన నిర్ణయంతెలంగాణSwechaa27 Oct 2026, 12:22 PM

వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు.. జయేశ్ రంజన్ సంచలన నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వంలో కీలక హోదాలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తదుపరి సీఎస్‌ బాధ్యతలు చేపట్టేందుకు అర్హుడిగా లైన్‌లో ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కాగా, ఆయన వీఆర్ఎస్ అప్లికేషన్‌పై కేంద్ర సిబ్బంది శిక్షణా వ్యవహారాల శాఖ(డీవోపీటీ), తెలంగాణ ప్రభుత్వం నిబంధనలను అనుసరించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న జయేశ్ రంజన్.. సర్వీస్ కాలం ముగియడానికి ముందే వీఆర్ఎస్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం బ్యూరోక్రసీ వర్గాల్లో హాట్ టాపిక్‌ అయ్యింది. ఇదిలాఉండగా, పాలనాపరమైన నిర్ణయాలు, ప్రాధాన్యత విషయంలో తన సీనియార్టీకి తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదని ఆయన అసహనంతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

‘పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు అయింది’ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!తెలంగాణSwechaa27 Oct 2026, 12:17 PM

‘పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు అయింది’ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

 తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మారిందని, ఏ ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పాలనలో న్యాయం జరగడం లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే పంపుహౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం రాష్ట్రంలో 'కృత్రిమ కరవు'ను సృష్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి విధానాలను తప్పుబడుతూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్నూలులో 600 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ ప్రారంభం!ఏపీSwechaa27 Oct 2026, 12:06 PM

కర్నూలులో 600 మెగావాట్ల భారీ సోలార్ ప్లాంట్ ప్రారంభం!

 పునరుత్పాదక ఇంధన (Renewable Energy) రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరొక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. కర్నూలు జిల్లాలో ఏకంగా 600 మెగావాట్ల (MW) విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో నిర్మించిన భారీ సోలార్ ప్లాంట్ విజయవంతంగా అందుబాటులోకి వచ్చి తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు విజయవంతంగా ప్రారంభం కావడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తీవ్ర హర్షం వ్యక్తం చేశారు.