స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

దీపావళి వరకు ఆగండి.. రాహుల్ గాంధీకి మరోసారి ఢిల్లీ వ్యాపారుల రిక్వెస్ట్..!NationalSwechaa27 Oct 2026, 11:55 AM

దీపావళి వరకు ఆగండి.. రాహుల్ గాంధీకి మరోసారి ఢిల్లీ వ్యాపారుల రిక్వెస్ట్..!

కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు డిమాండ్, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నేషనల్ కాంగ్రెస్ పార్టీ దేశరాజధాని ఢిల్లీలో నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపుమేరకు నవంబర్ 1 సుమారు 10వేల మందితో నిరసన ప్రదర్శన నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కేంద్రంలోని మోడీ సర్కార్.. సీఈసీని అడ్డం పెట్టుకుని ఓట్ చోరీకి పాల్పడుతోందని, అందుకే జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనలకు రాహుల్ పిలుపునిచ్చారు.దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి తరలివెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో న్యూ ఢిల్లీలో కేంద్రం పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేస్తున్నారు.ఇదిలాఉండగా, నవంబర్ 1న రాంలీలా మైదానంలో నిర్వహించ తలపెట్టిన నిరసన ర్యాలీని దీపావళి పండుగ ముగిసే వరకు వాయిదా వేయాలని ఢిల్లీ వ్యాపార సంఘాలు మరోసారి రాహుల్ గాంధీని కోరాయి.

ఆఫర్ వద్దంటే ఉద్యోగం పోతుందా?  మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఆందోళన!వ్యాపారంSwechaa27 Oct 2026, 11:24 AM

ఆఫర్ వద్దంటే ఉద్యోగం పోతుందా?  మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల్లో ఆందోళన!

ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) తన ఉద్యోగులకు భారీ స్వచ్ఛంద నిష్క్రమణ (Voluntary Separation) ఆఫర్‌ను ప్రకటించి టెక్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. సంస్థలో పనిచేస్తున్న సుమారు 60,000 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీని వీడేందుకు (వీఆర్‌ఎస్ తరహాలో) ఈ వెసులుబాటు కల్పించింది. అమెరికా, భారత్, బ్రిటన్, కెనడా వంటి నాలుగు ప్రధాన దేశాల్లోని ఎంపిక చేసిన విభాగాల ఉద్యోగులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఉద్యోగి హోదా, సీనియారిటీ స్థాయి (ల్యాడర్ లేయర్ 70 వరకు), పనిచేసిన కాలాన్ని బట్టి ఆకర్షణీయమైన పరిహారం, ఆరోగ్య బీమా, షేర్ల ప్రయోజనాలు చెల్లించనున్నట్లు ప్రకటించడంతో ఐటీ వర్గాల్లో దీనిపై తీవ్ర చర్చ సాగుతోంది.

Dil Raju: ఈ బడా నిర్మాత టార్గెట్ వాళ్ళేనా?సినిమాSwechaa27 Oct 2026, 11:12 AM

Dil Raju: ఈ బడా నిర్మాత టార్గెట్ వాళ్ళేనా?

Dil Raju: తెలుగులో దాదాపు 10 ఏళ్ళపాటు దిల్ రాజు అటు నిర్మాతగా ఇటు డిస్ట్రిబ్యూటర్‌గా చక్రం తిప్పాడు. సురేష్ బాబు, నాగార్జున, అల్లు అరవింద్ లాంటి వారున్నా కూడా రాజు గారు..దూసుకెళ్ళారు. దాదాపు స్టార్ హీరోలందరితోను సినిమాలు ప్లాన్ చేశాడు. వాటిలో కొన్ని మాత్రమే వర్కౌట్ అయ్యాయి. సీనియర్ హీరోలతో ఇంకా సెట్ కాని ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి.

మెటా సరికొత్త ప్లాన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్ తరహా లాంగ్ వీడియోలు!వ్యాపారంSwechaa27 Oct 2026, 11:11 AM

మెటా సరికొత్త ప్లాన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో యూట్యూబ్ తరహా లాంగ్ వీడియోలు!

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం కొన్ని సెకన్లు లేదా నిమిషాల వరకే పరిమితమైన రీల్స్‌ ఇకపై ఏకంగా 90నిమిషాల (గంటన్నర) నిడివి ఉన్న సుదీర్ఘ వీడియోలను పోస్ట్ చేసేలా కొత్త ఫీచర్‌పై ప్రయోగాలు చేస్తోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్‌కు (YouTube) గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతోనే మెటా ఈ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్‌లో నాలుగు చోట్ల భారీ పేలుళ్లు!క్రైమ్Swechaa27 Oct 2026, 10:42 AM

హైదరాబాద్‌లో నాలుగు చోట్ల భారీ పేలుళ్లు!

హైదరాబాద్ మహానగరంలో ఇవాళ ఉదయం భారీ పేలుళ్లు సంభవించాయి. ఉన్నట్టుండి భారీ శబ్దాలు రావడంతో భయంతో జనాలు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులు, మరణాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. బాంబులు పేలాయా? ఏదైనా కెమికల్ బాక్సులు పేలాయా? అనేది తెలియ రాలేదు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి, అత్తాపూర్, లంగర్‌హౌస్ ప్రాంతాల్లో పెద్ద పెద్ద శబ్దాలతో పేలుళ్లు సంభవించినట్టు సమాచారం. ఒక్కసారిగా భారీ శబ్దాలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉప్పరపల్లి, లంగర్‌హౌస్, అత్తాపూర్, రాజేంద్రనగర్, ఎర్రబోడ, కేశవస్వామి నగర్ పరిసర ప్రాంతాల్లో వరుసగా ఒకదాని తర్వాత మరొకటి పేలుడు శబ్దాలు వినిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో తీవ్ర గందగోళ వాతావరణం నెలకొంది.

ఫిట్స్ నాటకం..  సబ్‌జైలు నుంచి 17మంది ఖైదీలు పరారీ!క్రైమ్Swechaa27 Oct 2026, 10:35 AM

ఫిట్స్ నాటకం.. సబ్‌జైలు నుంచి 17మంది ఖైదీలు పరారీ!

ఫిట్స్ నాటకం ఆడి జైలు నుంచి 17మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలోని తేక్కంపట్టి సబ్ జైలులో చోటుచేసుకుంది. సోమవారం రాత్రి వేళ జైలు సిబ్బందిని నమ్మించి, వారిపై విచక్షణారహితంగా దాడి చేసి ఖైదీలు పరారైనట్లు జైలు అధికారులు వెల్లడించారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనతో అప్రమత్తమైన తమిళనాడు పోలీస్ యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, సరిహద్దుల్లో తనిఖీలను తీవ్రతరం చేసింది.

ఎంపీ ఈటలకు షాకిచ్చిన పోలీసులు..తెలంగాణSwechaa27 Oct 2026, 10:23 AM

ఎంపీ ఈటలకు షాకిచ్చిన పోలీసులు..

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు బిగ్ షాక్ తగిలింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు కోసం ఆయన ఇవాళ చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. నాలుగు రోజుల మహా పాదయాత్రకు అనుమతిని నిరాకరించారు. మంగళవారం ఘట్‌కేసర్ మండలం ఎదులాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేయగా.. సుమారు 5 వేల మంది పార్టీ నాయకులు, కార్యకర్తలతో యాత్రను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి పాదయాత్రకు అనుమతి లేదని పేర్కొంటూ నాయకులను అడ్డుకున్నారు.

రేపు తీరం దాటనున్న ‘అర్నాబ్’..  తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలుతెలంగాణSwechaa27 Oct 2026, 09:38 AM

రేపు తీరం దాటనున్న ‘అర్నాబ్’.. తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు

అర్నాబ్ తుపాన్ కారణంగా రేపు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రమాదకరమైన 'అర్నాబ్' తుపాను అక్టోబర్ 28 ఉదయానికి ఏపీలో తీరం దాటే అవకాశం ఉన్నది. అయితే, తీరం దాటే సమయంలో తూర్పు తెలంగాణలో (ఎరుపు రంగులో గుర్తించిన ప్రాంతాలు) భారీ నుండి అతి భారీ వర్షాలు (100-120 మి.మీ వరకు) కురిసే అవకాశం ఉంది. అలాగే, గంటకు 50-60 కి.మీ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.ఇక నీలం రంగులో గుర్తించిన జిల్లాల్లో అక్టోబర్ 27 రాత్రి, అక్టోబర్ 28న తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో అక్టోబర్ 28న మోస్తరు వర్షాలు (30 మి.మీ వరకు) కురిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.

TG : కాంగ్రెస్ ఖతం?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa27 Oct 2026, 09:15 AM

TG : కాంగ్రెస్ ఖతం?

రేవంత్ రెడ్డి సర్కార్ రెండు నెలల క్రితం వరకు ఏది చేస్తున్నా ఎంతో కొంత ప్రజలకు మేలు జరుగుతుందనే ఎక్కడో ఒక్క వద్ద అందరి మదిలో మెదిలేది. కానీ, రానురాను ప్రభుత్వంలో పెరిగిపోతున్న అనధికార వ్యవస్థ, ఉద్యోగుల బరితెగింపుతో రేవంత్ ఏం చేయలేకపోతున్నారు. మాటలు వేరు. చేతలు వేరు. మళ్లీ ప్రభుత్వం రాదు. దోచుకునేవారికి దోచుకునేంతగా చేసి పెడుతున్నారు. ఏ పోలీస్ సిస్టమ్ పనిచేయడం లేదు. నిఘా వ్యవస్థ నిద్ర మత్తులో ఉంది. విజిలెన్స్ అధికారులు ఏం ఇస్తారు అన్నట్లుగా ఉన్నారు. ప్రభుత్వం తరుపు న్యాయవాదులు అంతకు మించిగా తప్పుడు పత్రాలు ఇస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆధారాలు ఉన్నాయి. మంత్రుల చిట్టా ఉంది. మీ అనుచరుల ఆగడాలు ఉన్నాయి. ర్యాపిడో రైడ్‌తో మరింతగా మీరేంటో బోధపడింది.

Naga Chaithanya: డిసెంబర్ 4న వృష కర్మ రిలీజ్..సేఫ్ గేమ్ కాదేమో!సినిమాSwechaa27 Oct 2026, 09:12 AM

Naga Chaithanya: డిసెంబర్ 4న వృష కర్మ రిలీజ్..సేఫ్ గేమ్ కాదేమో!

Naga Chaithanya: అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ సినిమా వృష కర్మ. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా చడీ చప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి పెద్దగా అప్‌డేట్స్ కూడా ఏవీ రాలేదు. తెలిసిందల్లా ఇందులో హీరోయిన్ మీనాక్షీ చౌదరీ..మిస్టిక్ థ్రిల్లర్ కథ అన్నది మాత్రమే. ఇక, ఈ సినిమాను డిసెంబర్ 4న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. కానీ, ఇక్కడే పెద్ద సమస్య వచ్చింది.

చరిత్రలో ఈ రోజు (27 అక్టోబర్)InternationalSwechaa27 Oct 2026, 09:08 AM

చరిత్రలో ఈ రోజు (27 అక్టోబర్)

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 1947: జమ్మూ కాశ్మీర్ రక్షణార్థం భారత సైన్యం (Indian Army) శ్రీనగర్‌లో అడుగుపెట్టింది (ఇన్ఫాంట్రీ డే / Infantry Day).

  • 1920: లీగ్ ఆఫ్ నేషన్స్ (League of Nations) తన ప్రధాన కార్యాలయాన్ని స్విట్జర్లాండ్‌లోని జెనీవాకు మార్చింది.

  • 1858: అమెరికా మాజీ అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ జననం.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1971: డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తన పేరును అధికారికంగా 'జైర్' (Zaire) గా మార్చుకుంది.

  • 1998: గెహ్రాడ్ ష్రోడర్ జర్మనీ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టారు.

  • 2017: స్పానిష్ పార్లమెంట్ నుండి ఏకపక్షంగా స్వాతంత్ర్యం ప్రకటించుకున్న తర్వాత స్పెయిన్ ప్రభుత్వం కేటలోనియా స్వయంప్రతిపత్తిని రద్దు చేసింది.

🚀 సైన్స్

  • 1995: రష్యా తన మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహం 'ఎక్స్‌ప్రెస్-1' (Express-1)ను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించింది.

👤 ప్రముఖుల జననాలు

  • 1858: 26వ అమెరికా అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత థియోడర్ రూజ్‌వెల్ట్ జననం.

  • 1904: ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు, పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ మరణం (అక్టోబర్ 17 లేదా 27 న అనేక ప్రాంతాల్లో వర్ధంతి జరుపుకుంటారు - ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు).

  • 1955: ప్రముఖ భారతీయ నటుడు, దర్శకుడు ఇర్ఫాన్ ఖాన్ జననం.

అసురన్ వచ్చేస్తున్నారు..! తమిళనాట ధనుష్ సరికొత్త రాజకీయం..NationalSwechaa27 Oct 2026, 09:00 AM

అసురన్ వచ్చేస్తున్నారు..! తమిళనాట ధనుష్ సరికొత్త రాజకీయం..

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క. ఇన్నాళ్లూ వెండితెరపై తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ధనుష్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారా? ఇప్పటికే తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న విజయ్‌కు పోటీగా మరో స్టార్ హీరో రంగంలోకి దిగబోతున్నారా?

నేటి పంచాంగం - 27 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ పాడ్యమి/విదియ, ప్రత్యేక విశేషాలుSpiritualitySwechaa27 Oct 2026, 08:51 AM

నేటి పంచాంగం - 27 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ పాడ్యమి/విదియ, ప్రత్యేక విశేషాలు

వివరాలు:

  • తేదీ: 27 అక్టోబరు 2026, మంగళవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: పాడ్యమి (ఉదయం 07:29 వరకు, తదుపరి విదియ)

  • వారం: మంగళవారం (భౌమవాసరే)

  • నక్షత్రం: భరణి (సాయంత్రం 04:31 వరకు, తదుపరి కృత్తిక)

  • యోగం: సిద్ధి (ఉదయం 11:29 వరకు, తదుపరి వ్యతీపాత)

  • కరణం: బాలవ (ఉదయం 07:29 వరకు), తదుపరి కౌలవ (రాత్రి 06:21 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: మధ్యాహ్నం 03:00 - 04:30 వరకు

  • యమగండం: ఉదయం 09:00 - 10:30 వరకు

  • అమృతకాలం: రాత్రి 08:14 - 09:51 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 08:31 - 09:17 వరకు మరియు రాత్రి 10:43 - 11:33 వరకు

  • వర్జ్యం: ఉదయం 06:14 - 07:51 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మేషం

  • సూర్యోదయం: ఉదయం 06:16

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:43

60 వేల మందికి ఎగ్జిట్ గేట్.. ఏఐకి రెడ్ కార్పెట్! మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయంవ్యాపారంSwechaa26 Oct 2026, 11:41 PM

60 వేల మందికి ఎగ్జిట్ గేట్.. ఏఐకి రెడ్ కార్పెట్! మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం

మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 వేల మంది ఉద్యోగులకు స్వచ్ఛందంగా ఉద్యోగం వీడే అవకాశం కల్పించే ప్యాకేజీని ప్రకటించింది. అమెరికా, కెనడా, భారత్, బ్రిటన్‌లలోని ఎంపిక చేసిన ఉద్యోగులకు ఈ ఆఫర్ వర్తించనుంది. వైస్ ప్రెసిడెంట్ స్థాయి, అంతకంటే దిగువ హోదాల్లో ఉన్న అర్హులైన ఉద్యోగులు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు.

Tummidihatti: రేవంత్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర సీఎం.. ప్లాన్ రివర్స్ అయిందే!తెలంగాణSwechaa26 Oct 2026, 10:00 PM

Tummidihatti: రేవంత్‌కు షాకిచ్చిన మహారాష్ట్ర సీఎం.. ప్లాన్ రివర్స్ అయిందే!

Tummidihatti: తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంచి తెలంగాణకు పుష్కలంగా నీళ్లు తేవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహానికి ముంబై గడ్డపై ఊహించని బ్రేక్ పడింది. ఎంతో నమ్మకంతో మహారాష్ట్రకు వెళ్లిన రేవంత్ బృందానికి ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన షాక్‌తో ప్లాన్ మొత్తం తలకిందులైంది. అనుమతులు సాధించి విజయవంతంగా తిరిగొద్దామనుకున్న రేవంత్ సర్కార్‌కు ఉత్త కమిటీ ప్రతిపాదన మాత్రమే మిగిలింది.2016లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మహారాష్ట్రతో కుదిరిన ఒప్పందం ప్రకారం తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు 148 మీటర్లుగా నిర్ణయించారు. అయితే ఈ ఎత్తుతో తెలంగాణకు సరిపడా నీరు అందదని భావించిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్, బ్యారేజీ ఎత్తును కనీసం 150 లేదా 152 మీటర్ల వరకు పెంచాలని పట్టుబట్టింది. ఇదే అజెండాతో సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ముంబై వెళ్లి ఫడ్నవీస్‌తో కీలక మంతనాలు జరిపారు. ఎలాగైనా ఒప్పించి ప్రాజెక్టును పరుగులు పెట్టించాలన్నది వారి వ్యూహం.

ఫామ్‌హౌస్‌లో అసలేం జరిగింది? రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతిక్రైమ్Swechaa26 Oct 2026, 09:53 PM

ఫామ్‌హౌస్‌లో అసలేం జరిగింది? రిటైర్డ్ ఎస్ఐ కుమారుడు అనుమానాస్పద మృతి

Farmhouse: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి ఘటన కలకలం రేపుతోంది. బీటెక్ చదువుతున్న కృష్ణ కౌండిన్య (21) స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి విగతజీవిగా మారాడు. ఉప్పల్ బగాయత్ కు చెందిన రిటైర్డ్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కుమారుడు కౌండిన్య తన ఫ్రెండ్ రిషబ్ తో కలిసి పుట్టిన రోజు వేడుకల కోసం ఏదులాబాద్ లోని ఒక ఫామ్‌హౌస్‌కి వెళ్లాడు. కాగా, అక్కడ అపస్మారక స్థితిలో పడిపోయాడు అంటూ అతడి తండ్రికి ఫోన్ చేసి చెప్పారు. కౌండిన్యను స్నేహితులు ఘట్ కేసర్ ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Tollywood: ప్రభాస్-త్రివిక్రమ్ ల సినిమా గురించి ఇప్పట్లో మాట్లాడకపోవడం మంచిదా?సినిమాSwechaa26 Oct 2026, 09:27 PM

Tollywood: ప్రభాస్-త్రివిక్రమ్ ల సినిమా గురించి ఇప్పట్లో మాట్లాడకపోవడం మంచిదా?

Tollywood: కొన్ని కాంబినేషన్ కుదరాలని అభిమానులే కాదు..ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా కోరుకుంటారు. అంతేకాదు, కొందరు హీరోలతో సినిమా చెయ్యాలనే తాపత్రయం, ఆరాటం కొందరు దర్శకులకీ ఉంటుంది. కానీ, అంత సులభంగా ఈ కాంబినేషన్స్ కుదరవు. ఇప్పుడు, ఇండస్ట్రీలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది ప్రభాస్-త్రివిక్రమ్ ల సినిమా గురించే. దీనికి కారణం స్వయంగా గురూజీ ఈ టాపిక్ తీసుకురావడమే.

చిత్రం లేదు
NationalSwechaa26 Oct 2026, 09:23 PM

Kolkata: కోల్‌కతాలో దారుణం.. ప్రేమ వ్యవహారంలో తండ్రీకొడుకులను నగ్నంగా ఊరేగించారు!

Kolkata: ప్రియురాలిని ముద్దుపెట్టుకున్నాడన్న కారణంతో ఓ యువకుడితో పాటు అతడి తండ్రి, స్నేహితుడి బట్టలు విప్పించి, తుపాకీతో బెదిరిస్తూ వీధుల్లో నగ్నంగా ఊరేగించిన అత్యంత అమానుష ఘటన కోల్‌కతాలో తీవ్ర కలకలం రేపింది. నాగరిక సమాజం తలదించుకునేలా సాగిన ఈ దాష్టీకం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందంటే.. కోల్‌కతాలోని బెహాలా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు తన స్నేహితుడితో కలిసి ప్రియురాలైన మైనర్ బాలికను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఆ యువకుడు ఆమెకు ముద్దు పెట్టాడు. అయితే, దీన్ని బాలిక బంధువుల్లో ఒకరు దూరం నుంచి చూసి వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.

Railway Jobs: డిగ్రీ ఉంటే చాలు.. రైల్వేలో 1,250 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు!NationalSwechaa26 Oct 2026, 09:13 PM

Railway Jobs: డిగ్రీ ఉంటే చాలు.. రైల్వేలో 1,250 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు!

Railway Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు తీపి కబురు చెప్పింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన యువత కోసం దేశవ్యాప్తంగా ఏకంగా 1,250 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైల్వే చరిత్రలోనే మొదటిసారిగా ఈ పోస్టులను సాధారణ NTPC నుంచి వేరుచేసి, ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండటం విశేషం.ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2027 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైతే నెలకు పే లెవల్-6 కింద బేసిక్ పే రూ.35,400తో పాటు ఇతర రైల్వే అలవెన్సులు అందుతాయి.

TG: 8 లక్షల మంది పోడు రైతులకు పట్టాలివ్వాల్సిందే.. : గోడం గణేష్తెలంగాణSwechaa26 Oct 2026, 08:05 PM

TG: 8 లక్షల మంది పోడు రైతులకు పట్టాలివ్వాల్సిందే.. : గోడం గణేష్

TG: నీరు, అడవి, నేల కోసం నిజాం సర్కార్‌పై పోరాడి ప్రాణాలర్పించిన ఆదివాసీల దేవుడు కొమురం భీమ్ 86వ వర్ధంతి సభ జోడేఘాట్‌లో జరిగింది. తుడుం దెబ్బ నాయకులతో పాటు పలువురు ప్రజాసంఘాల నేతలు అక్కడ భీమ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఉన్న 8 లక్షల మంది అర్హులైన పోడు రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. "ఒకపక్క ఆదివాసీల ఆత్మగౌరవం అంటూ గొప్పలు చెబుతూనే.. మరోపక్క అడవుల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులను ఫారెస్ట్ ఆఫీసర్లు వేధిస్తున్నారు.

South Cinema: కాప్ స్టోరీస్‌కి మంచి క్రేజ్ అండ్ డిమాండ్సినిమాSwechaa26 Oct 2026, 07:44 PM

South Cinema: కాప్ స్టోరీస్‌కి మంచి క్రేజ్ అండ్ డిమాండ్

South Cinema: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో కాప్ స్టోరీస్‌కి ఎప్పుడూ మంచి డిమాండ్ అండ్ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంటుంది. హీరోలను పోలీస్ పాత్రలో చూడటం అభిమానులకు ఎంత ఆసక్తో..దర్శకులు అంతకన్నా రెట్టింపు ఆసక్తి చూపిస్తున్నారు. తమిళంలో సూర్య సింగం సిరీస్‌తో వరుసగా హిట్స్ అందుకున్నాడు. తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ విక్రమార్కుడు, క్రాక్ సినిమాలతో సాలీడ్ హిట్స్ అందుకున్నాడు. బాలయ్యకి ఈ జానర్ సినిమాలు వర్కౌట్ అయ్యాయి. హీరోలే కాదు, హీరోయిన్స్ కూడా హిట్ కొట్టినవాళ్ళే.

తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపు.. కీలక ముందడుగుతెలంగాణSwechaa26 Oct 2026, 07:43 PM

తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపు.. కీలక ముందడుగు

Tummidihatti Barrage: తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం అంశంలో ముందడుగు పడింది. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ నిర్వహించిన సమావేశం సానుకూలంగా సాగింది. బ్యారేజీ ఎత్తును 148 మీటర్ల నుంచి 152 మీటర్లకు పెంచాలన్న తెలంగాణ విజ్ఞప్తిని పున:పరిశీలించేందుకు సిద్ధమని మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తెలిపారు. అయితే మహారాష్ట్రకు, తమ ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని స్పష్టం చేశారు.

Vijay - Rashmika: తప్పుడు పోస్టులతో ఫేక్‌ ప్రచారాలు.. పోలీసులకు విజయ్‌ టీం ఫిర్యాదుసినిమాSwechaa26 Oct 2026, 07:31 PM

Vijay - Rashmika: తప్పుడు పోస్టులతో ఫేక్‌ ప్రచారాలు.. పోలీసులకు విజయ్‌ టీం ఫిర్యాదు

Vijay - Rashmika: సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలపై కొందరు పనిగట్టుకుని చేస్తున్న తప్పుడు ప్రచారాలపై విజయ్ టీమ్ సీరియస్ అయింది. లేనిపోని కట్టుకథలు అల్లుతూ ఆన్‌లైన్‌లో అసత్యాలు వ్యాప్తి చేస్తున్న వారి ఆగడాలకు చెక్ పెట్టేందుకు నేరుగా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ డీసీపీని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసింది.గతంలో వచ్చిన ‘కాఫీ విత్ కరణ్’ షోలో విజయ్, రష్మిక మాట్లాడిన మాటలను కొందరు కావాలనే కట్ చేసి, వక్రీకరిస్తూ నెట్టింట ఫేక్ ప్రచారం మొదలుపెట్టారని టీమ్ తమ ఫిర్యాదులో పేర్కొంది.

AP: ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా ‘అర్నబ్’.. ఏపీకి హైఅలర్ట్!ఏపీSwechaa26 Oct 2026, 06:40 PM

AP: ఇవాళ అర్ధరాత్రికి తీవ్ర తుపానుగా ‘అర్నబ్’.. ఏపీకి హైఅలర్ట్!

AP: బంగాళాఖాతంలో కదులుతున్న ‘అర్నబ్’ తుపాను గంటగంటకూ మరింత బలాన్ని పెంచుకుంటూ తీరం వైపు వేగంగా దూసుకొస్తోంది. ఇవాళ అర్ధరాత్రి కల్లా ఇది ‘తీవ్ర తుపాను’గా మారనుందని వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. అక్కడితో ఆగకుండా, మంగళవారం నాటికి ఏకంగా ‘అతి తీవ్ర తుపాను’గా రూపాంతరం చెంది తీరంపై విరుచుకుపడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు స్పష్టం చేశారు. బుధవారం ఉదయానికల్లా బాపట్ల - విశాఖపట్నం మధ్య, ముఖ్యంగా యానాం సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది.

కొత్త ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందితెలంగాణSwechaa26 Oct 2026, 06:33 PM

కొత్త ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది

Harish Rao: రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీమంత్రి హరీశ్ రావు. కొత్త ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్లు ఎత్తిపోయడం చేతకాదని విమర్శించారు. కానీ, ఎల్ నినో పేరు చెప్పి ప్రజలను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లున్నా ఎత్తిపోసే తెలివి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. దేవాదుల నుంచి నీళ్లు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించిన హరీశ్ రావు.. ప్రాజెక్టులకు నీటి విడుదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. హైదరాబాద్ బీఆర్ఎస్ భవన్ లో మాజీమంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

Heroines: సొంత గొంతే ఇష్టం..సినిమాSwechaa26 Oct 2026, 06:28 PM

Heroines: సొంత గొంతే ఇష్టం..

Heroines: సినిమాలో హీరో పాత్రలకి దాదాపు తమ సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. కానీ, హీరోయిన్స్..ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం భాష సమస్య వల్ల ఇతర డబ్బింగ్ ఆర్టిస్టుల మీద ఆధారపడుతున్నారు. అయితే, గత కొంతకాలంగా మన హీరోయిన్స్ మాత్రం వేరే వాళ్ల గొంతు మీద ఆధారపడటం లేదు. భాష రాకపోయినా కూడా పట్టుదలతో నేర్చుకొని తమ పాత్రలకి తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. వారిలో, సాయి పల్లవి..అనుపమ పరమేశ్వరన్..కీర్తి సురేష్ ఉండటం విశేషం.

Dhanush: రాజకీయాల్లోకి ధనుష్‌ అడుగులు.. విజయ్‌ను చూసి తొందరపడుతున్నాడా?NationalSwechaa26 Oct 2026, 04:57 PM

Dhanush: రాజకీయాల్లోకి ధనుష్‌ అడుగులు.. విజయ్‌ను చూసి తొందరపడుతున్నాడా?

Dhanush: తమిళనాడు రాజకీయాల్లో సినిమా హీరోల ఎంట్రీ అనేది కొత్తేమీ కాదు కానీ.. ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనం కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. దళపతి విజయ్ తన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో రచ్చ లేపుతూ క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్తుంటే.. ఇప్పుడు ఆయన బాటలోనే మరో స్టార్ హీరో ధనుష్ కూడా పొలిటికల్ ఎంట్రీకి చకచకా పావులు కదుపుతున్నారు. అయితే, విజయ్ వేస్తున్న అడుగులను చూసి ధనుష్ కూడా అనవసరంగా తొందరపడుతున్నాడా? కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే రాజకీయాల్లోకి దూకడం కరెక్టేనా? అనే సరికొత్త చర్చ ఇప్పుడు చెన్నై వీధుల్లో హాట్ టాపిక్‌గా మారింది.

నేను చచ్చిపోతేనే నిధులు ఇస్తారా? ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుతెలంగాణSwechaa26 Oct 2026, 04:42 PM

నేను చచ్చిపోతేనే నిధులు ఇస్తారా? ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

నేను చచ్చిపోతేనే జడ్చర్లకు నిధులు ఇస్తారంటే చావడానికైనా సిద్ధమే అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. రూ.40 కోట్లు విలువనా? లేదా నా ప్రాణం విలువనా? అనేది ప్రభుత్వమే నిర్ణయించాలన్నారు. తన నియోజకవర్గంలో రోడ్లు పూర్తి చేయకుంటే 30వేల మందితో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతా అని రేవంత్ సర్కార్ ను ఆయన హెచ్చరించారు. జడ్చర్ల నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి బిల్లులు మంజూరు చేస్తామని మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. నా చావుతోనే స్పందిస్తారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిధులు, పెండింగ్ బిల్లుల కోసం కొట్లాడేందుకు సిద్ధమన్నారు.

Tollywood: పెద్ద హీరోలతో సినిమా..ఫ్లాపైతే దర్శకుడికి చుక్కలేగా!సినిమాSwechaa26 Oct 2026, 04:07 PM

Tollywood: పెద్ద హీరోలతో సినిమా..ఫ్లాపైతే దర్శకుడికి చుక్కలేగా!

Tollywood: స్టార్ హీరోలతో సినిమా చేయడం అంటే దర్శకులకి పెద్ద సవాలే. వర్కౌట్ అయితే దర్శకుడి రేంజ్ కూడా ఎక్కడికో వెళుతుంది. మన రాజమౌళి, అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా. తేడా కొట్టి గనక సినిమా ఫ్లాపైతే అదే దర్శకుడి కెరీర్ తలకిందులవుతుంది. మన మారుతి, క్రిష్ లాంటి దర్శకుల మాదిరిగా. కానీ, ఇక్కడ ఎవరూ ఫ్లాప్ కావాలని కోరుకోరు. ప్రేక్షకులను మెప్పించలేకపోవడం వల్లే జీవితాలు తారుమారవుతాయి. అదే, జరిగితే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సిందే.

AmitShah: నవంబర్ 1న విపక్షాల ర్యాలీపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా!NationalSwechaa26 Oct 2026, 03:49 PM

AmitShah: నవంబర్ 1న విపక్షాల ర్యాలీపై బీజేపీ గురి.. రంగంలోకి అమిత్ షా!

AmitShah: నవంబర్ 1న ఢిల్లీ రోడ్లపై ప్రతిపక్ష ఇండియా కూటమి తలపెట్టిన ‘ఓట్ బచావో - దేశ్ బచావో’ ర్యాలీపై బీజేపీ ప్రత్యేకంగా గురిపెట్టింది. దేశ రాజధాని వేదికగా విపక్షాలు భారీ ఎత్తున జనసమీకరణ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తుంటే.. ఆ ప్లాన్‌ను ఆదిలోనే తుంచేయడానికి ఆ పార్టీ అపర చాణక్యుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. విపక్షాల వ్యూహాలకు గండికొట్టి, వారి నిరసనల వేడిని జాతీయ స్థాయిలో తగ్గించడమే లక్ష్యంగా కమలదళం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.ఈ క్రమంలోనే ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా సమక్షంలో హై-లెవల్ మీటింగ్ జరిగింది. పార్టీ నేషనల్ అధికార ప్రతినిధులు, మీడియా కోఆర్డినేటర్లు, ఐటీ సెల్, సోషల్ మీడియా ముఖ్య నేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి అంశాన్ని సునిశితంగా పరిశీలించి, వాటి వెనుక ఉన్న డొల్లతనాన్ని ఎండగట్టాలని అమిత్ షా తన టీమ్‌కు పక్కా రోడ్‌మ్యాప్ ఇచ్చారని చెబుతున్నారు.