స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలుతెలంగాణSwechaa26 Oct 2026, 03:45 PM

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో కుండపోత వానలు

Rains: ఓవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు భయపెడుతున్న నీటి కొరత.. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబర్ 28న తూర్పు తెలంగాణలోని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. అదే రోజున వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

నీటి ట్యాంకులు, జనరేటర్లు.. ప్రభుత్వ హాస్పిటల్స్‌పై సర్కార్ అప్రమత్తంతెలంగాణSwechaa26 Oct 2026, 03:30 PM

నీటి ట్యాంకులు, జనరేటర్లు.. ప్రభుత్వ హాస్పిటల్స్‌పై సర్కార్ అప్రమత్తం

తెలంగాణలో విద్యుత్, నీటి సమస్యలు మున్ముందు తీవ్రతరం కానున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది.ఆసుపత్రుల్లో విద్యుత్ సరఫరా అంతరాయాలు, నీటి కొరత కారణంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే 2025 జూలై 3న జనరేటర్ల కొనుగోలుకు రూ.21.96 కోట్ల నిధులు కేటాయించగా.. తాజాగా వాటిని విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 107 ఆసుపత్రుల్లో విద్యుత్ బ్యాకప్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని కూడా ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Power Crisis: ఖాళీ బిల్డింగుల షో.. హైదరాబాద్‌లో కరెంట్ కష్టాలు తప్పవా?తెలంగాణSwechaa26 Oct 2026, 02:51 PM

Power Crisis: ఖాళీ బిల్డింగుల షో.. హైదరాబాద్‌లో కరెంట్ కష్టాలు తప్పవా?

హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ జోరు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గచ్చిబౌలి, మాదాపూర్, తెల్లాపూర్, కోకాపేట నుంచి మొదలుకొని నగర శివార్ల దాకా ఎటు చూసినా ఆకాశాన్ని తాకే భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. అయితే, ఈ నిర్మాణాల వెనుక జరుగుతున్న షో చూస్తుంటే.. భవిష్యత్తులో నగర ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పవా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా ఎవరూ చేరని ఖాళీ బిల్డింగుల కోసం రాత్రంతా విచ్చలవిడిగా వందల యూనిట్ల విద్యుత్‌ను తగలబెడుతున్నారు.

టీజీపీఎస్సీ, ఆర్‌అండ్‌బీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయండి : హరీశ్ రావుతెలంగాణSwechaa26 Oct 2026, 02:27 PM

టీజీపీఎస్సీ, ఆర్‌అండ్‌బీ ఏఈఈ పరీక్షను వాయిదా వేయండి : హరీశ్ రావు

రాష్ట్రంలో జరగాల్సిన ప్రభుత్వ పోటీ పరీక్షలను వాయిదా వేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.వాయిదా వేయకపోతే విద్యార్థులకు జరిగే నష్టాన్ని ఈ సందర్భంగా వివరించారు. ఈ మేరకు సోమవారం ప్రెస్‌నోట్ విడుదల చేశారు. విద్యార్థులు, ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. రాష్ట్రంలో ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో అభ్యర్థులు ఏ పరీక్ష రాయాలా? అని ఒత్తిడికి గురవుతున్నట్టు సమాచారం. ఈ విషయం మాజీ మంత్రి హరీశ్ రావు వద్దకు చేరగా, విద్యార్థుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఆయన సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేశారు. వచ్చే నెల 6న జరగాల్సిన TGPSC ఆర్ అండ్‌ బీ AEE పరీక్ష,కేంద్ర ప్రభుత్వం నిర్వహించే SSC JE పరీక్ష ఒకేరోజు రావడంతో 50 వేల మందికి పైగా సివిల్ ఇంజినీరింగ్ అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.

రాహల్ గాంధీ కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం.. యూపీ పోలీస్ కీలక నిర్ణయంNationalSwechaa26 Oct 2026, 02:03 PM

రాహల్ గాంధీ కాన్వాయ్‌కు ఘోర ప్రమాదం.. యూపీ పోలీస్ కీలక నిర్ణయం

వియత్నాం పర్యటన ముగించుకుని వచ్చిన లోక్‌‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం యూపీలో పర్యటిస్తున్నారు. అయితే,రాహుల్ పర్యటనలో భాగంగా ఘోర ప్రమాదం సంభవించింది. ఆయన కాన్వాయ్‌లోని పలు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి.కాన్వాయ్‌లోని 5 కార్లు, అంబులెన్స్ ఒకదానివెనుక మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడినట్టు సమాచారం. కొందరు పోలీసులకు కూడా గాయాలు అయినట్టు సమాచారం. కాగా, కాన్వాయ్ ప్రమాదంలో రాహుల్ గాంధీ తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం. యూపీలోని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌ వేపై ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి వాహనాల్లోని పోలీసులు, సిబ్బందిని బయటకు తీశారు.

ఫండ్స్ గోవిందా?  తెలంగాణ లోకల్ ఎలక్షన్స్ ఇంకెప్పుడో?టాప్ న్యూస్Swechaa26 Oct 2026, 01:27 PM

ఫండ్స్ గోవిందా? తెలంగాణ లోకల్ ఎలక్షన్స్ ఇంకెప్పుడో?

తెలంగాణలో ఎంపీటీపీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు కూడా పెండింగులోనే ఉన్నాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా? అని అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జీహెచ్ఎంసీ పాలన గడువు ఈ ఏడాది ప్రారంభంలో ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లు పాలన కొనసాగిస్తున్నారు.చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న MPTC, ZPTC స్థానాలతో పాటు GHMC, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.డిసెంబర్ చివర్లో లేదా 2027 జనవరి తొలి వారంలోగా ఎన్నికలు పూర్తి చేయాలని నిర్ణయించినట్టు టాక్ వినిపిస్తోంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది.

Kangana Ranaut: కంగనాకి తెలుగు సినిమా సూటవదు..మళ్ళీ ఎలా ట్రై చేస్తున్నారు స్వామీ?సినిమాSwechaa26 Oct 2026, 01:01 PM

Kangana Ranaut: కంగనాకి తెలుగు సినిమా సూటవదు..మళ్ళీ ఎలా ట్రై చేస్తున్నారు స్వామీ?

Kangana Ranaut: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్స్‌గా వెలుగుతున్న చాలామంది మన టాలీవుడ్‌లో ఖంగుతిన్నవాళ్ళే. ఇక్కడ, భాష తెలియక స్క్రీన్ మీద ఎలాంటి హావాభావలను చూపించాలో అర్థంకాక పాత్ర గాలో తేలిపోయింది. అలాంటి, నటులు ఒకటి రెండు సినిమాలతోనే సర్దేసుకున్నారు. అలాంటి, వారిలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఒకరు.

Aadarsha Kutumbam: కొలతలు, లెక్కల ప్రకారమే తీశారా?సినిమాSwechaa26 Oct 2026, 12:43 PM

Aadarsha Kutumbam: కొలతలు, లెక్కల ప్రకారమే తీశారా?

Aadarsha Kutumbam: కథ-కథనం బలంగా ఉన్న సినిమాలే ఇప్పుడు ప్రేక్షకాధరణ పొందుతున్నాయి. అంతేతప్ప కొలతల ప్రకారం, లెక్కల ప్రకారం తీస్తున్న ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటడం లేదు. కథ బావుంటే పాటలు, కామెడీ లేకపోయినా ఎమోషన్స్ మీద ఆడేస్తుంది. లేదా, మాస్ హీరోల కోసం కాకుండా చిన్న నటీనటులతోనైనా క్యూట్ లవ్ స్టోరీని తీసినా ఆడుతుంది. అవే, నిర్మాతలను లాభాల్లోకి తెస్తున్నాయి. కానీ, త్వరలో రాబోతున్న ఆదర్శకుటుంబం ఫార్ములా ప్రకారమే రూపొందించారట.

బ్రెజిల్ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ.. నాలుగోసారి అధ్యక్షుడిగా లూలా..!InternationalSwechaa26 Oct 2026, 12:37 PM

బ్రెజిల్ ఎన్నికల్లో థ్రిల్లింగ్ విక్టరీ.. నాలుగోసారి అధ్యక్షుడిగా లూలా..!

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా మరోసారి ఘన విజయం సాధించారు. ఉత్కంఠ భరితంగా సాగిన రన్ ‌ఆఫ్ ఫైట్‌లో రైట్‌వింగ్ ప్రత్యర్థి ఫ్లావియో బోల్సనారో‌ను ఓడించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. ఎన్నికల్లో భాగంగా మొదటి విడతలో వెనుకబడిన లూలా డి సిల్వా.. ఎన్నికల ప్రచారంలో కార్మిక వర్గం, జీవన వ్యయం, ప్రజారోగ్య, ఆర్థిక సమస్యలపై దృష్టి సారించారు. దాంతో ప్రజలు మరోసారి లూలాకు పట్టం కట్టారు. బ్రెజిల్ దేశ అధ్యక్ష ఎన్నికల సమయంలో పలు ప్రాంతాల్లో ప్రజారవాణా నిలిచిపోవడం, భారీ వర్షాల కారణంగా ఆ దేశ సుప్రీంకోర్టు ఆదేశాలతో పోలింగ్ సమయాన్ని మరో 2 గంటలు పొడిగించాల్సి వచ్చింది. ఉత్కంఠ భరింత సాగిన ఈ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో లూలా 51.79 శాతం ఓట్లు సాధించగా, ఫ్లావియో బోల్సనారో 48.21 శాతం ఓట్లు పొందారు. 88 ఏళ్ల వయసులో లూలా నాలుగోసారి బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

అతి తీవ్ర తుపానుగా అర్నబ్.. అసలు తుపాను ఎలా పుడుతుంది? దేనితో ఎక్కువ ప్రమాదం?NationalSwechaa26 Oct 2026, 12:36 PM

అతి తీవ్ర తుపానుగా అర్నబ్.. అసలు తుపాను ఎలా పుడుతుంది? దేనితో ఎక్కువ ప్రమాదం?

సముద్రం మీద చిన్నగా మొదలయ్యే అల్పపీడనం కొన్ని రోజులకే విధ్వంసం సృష్టించగల తుపానుగా ఎలా మారుతుంది? తుపాను, తీవ్ర తుపాను, అతి తీవ్ర తుపాను మధ్య తేడా ఏమిటి? తుపాను సమయంలో ప్రాణాలకు, ఆస్తులకు ఎక్కువ ప్రమాదం దేని వల్ల ఉంటుంది?

ఉద్యోగాల కల్పన పేరిట డీడీయూజీకేవై నిధుల్లో భారీ కుంభకోణం?టాప్ న్యూస్Swechaa26 Oct 2026, 12:31 PM

ఉద్యోగాల కల్పన పేరిట డీడీయూజీకేవై నిధుల్లో భారీ కుంభకోణం?

గ్రామీణ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ‘దీన దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన’ (DDUGKY) పథకం నిధులు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. యువతకు ఉద్యోగానికి పనికొచ్చే ఎలాంటి స్కిల్ ట్రైనింగ్ ఇవ్వకుండానే ప్రభుత్వం నుంచి నిధులు డ్రా చేసినట్టు సమాచారం. ‘సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్’ కేంద్రంగానే కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు హైకోర్టు లేదా అత్యున్నత స్థాయి విజిలెన్స్ విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిరుద్యోగ యువతకు స్కిల్ ట్రైనింగ్, ఉపాధి కల్పన కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నాయి.అయితే, సాహితి సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వంతో ఈ మేరకు అగ్రిమెంట్ చేసుకుని ఉపాధి శిక్షణ ఇస్తున్నది. అయితే,ఇటీవల కాలంలో ప్రాజెక్టుల పేరిట సదరు కంపెనీకి నిధులు భారీగానే అందాయి. కానీ, శిక్షణ ఎంతమందికి అందించారనే దానిపై లెక్కల్లో తేడాలు వచ్చాయి .

Samyuktha: ఈసారైనా బలమైన పాత్ర దక్కుతుందా?సినిమాSwechaa26 Oct 2026, 11:45 AM

Samyuktha: ఈసారైనా బలమైన పాత్ర దక్కుతుందా?

Samyuktha: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్‌బికే112 త్వరలో సెట్స్‌పైకి రాబోతోంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం, బాలయ్య 'దాదా' సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న భారీ స్థాయిలో విడుదలకి సిద్ధమవుతోంది. ఈ సినిమా పూర్తి చేస్తూనే కొరటాల సినిమాకి షిఫ్ట్ కానున్నాడు.

బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. ఆన్‌లైన్‌లో క్లాసులుతెలంగాణSwechaa26 Oct 2026, 10:59 AM

బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు.. ఆన్‌లైన్‌లో క్లాసులు

వేల సంఖ్యలో విద్యార్థులు చదువుకునే బాసర ట్రిపుల్ ఐటీలో నీటి కష్టాలు మొదలయ్యాయి. కనీస తాగునీటి సౌకర్యం కూడా కరువైనట్టు సమాచారం. క్యాంపస్‌లో నీళ్లు లేని దుస్థితిలో విద్యార్థులకు నవంబర్ 17 వరకు ఆన్‌లైన్ క్లాసులు ప్రకటించినట్టు తెలిసింది.దీంతో అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాన్ని విద్యార్థులు వేలెత్తి చూపిస్తున్నారు. నిర్వాహకులు మాత్రం తమకు ఏమి సంబంధం లేదని, ప్రభుత్వం నుంచి సహకారం లేదని చేతులు దులుపుకుంటున్నట్టు తెలుస్తోంది. అంత పెద్ద విద్యాసంస్థలో కనీసం తాగు నీటి సౌకర్యం కల్పించకపోవడం పాలకుల పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Kothagudem: కదులుతున్న బస్సులోంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ ప్రయాణికురాలు.. చివరికి..క్రైమ్Swechaa26 Oct 2026, 10:16 AM

Kothagudem: కదులుతున్న బస్సులోంచి కండక్టర్‌ను తోసేసిన మహిళ ప్రయాణికురాలు.. చివరికి..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చిల్లర వివాదం తీవ్ర విషాదానికి దారితీసింది. మిట్టగూడెం వద్ద మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో బాలుడి టికెట్ విషయంలో ప్రయాణికురాలికి, మహిళా కండక్టర్ ప్రవల్లికకు వాగ్వాదం జరిగింది. చిల్లర విషయంలోనూ గొడవ కొనసాగడంతో ప్రయాణికురాలిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేందుకు కండక్టర్ ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్రయాణికురాలు ప్రవల్లికను నెట్టివేయడంతో, ఆమె కదులుతున్న బస్సు వెనుక చక్రాల కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆమెను 108 వాహనంలో భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆర్టీసీ వర్గాల్లో కలకలం రేపింది.

తమిళనాడులో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్NationalSwechaa26 Oct 2026, 10:03 AM

తమిళనాడులో కుండపోత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

తమిళనాడులో ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గతవారం రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ (IMD) హెచ్చరికల ప్రకారం.. రాష్ట్రంలోని 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరో 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మరికొన్నింటికి రెడ్ అలర్ట్ ప్రకటించారు.పుదుక్కోట్టై, శివగంగై, రామనాథపురం, నాగపట్నం జిల్లాలో కుండపోత వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాగపట్నం తీర ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. తమిళనాడులోని పశ్చిమ,దక్షిణ జిల్లాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉండటంతో ముందస్తు భద్రత కోసం కోయంబత్తూరు, దిండుక్కల్, రామనాథపురం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు జిల్లా కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. మరోవైపు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైకల్ ప్రాంతంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

సర్కారుపై పోరుబాట.. రేపటి నుంచే ‘ఈటల’ పాదయాత్ర!తెలంగాణSwechaa26 Oct 2026, 09:45 AM

సర్కారుపై పోరుబాట.. రేపటి నుంచే ‘ఈటల’ పాదయాత్ర!

జవహర్ నగర్ డంపింగ్ యార్డును మరొక చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రేపటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు. సర్కారుకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా మొద్ద నిద్ర వీడటం లేదని, అందుకే పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. ఈ పాదయాత్రకు సంబంధించి టైమింగ్ షెడ్యూల్ విడుదల అయ్యింది. మంగళవారం ఉదయం 9 గంటలకు ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువు వద్ద పాదయాత్ర ప్రారంభం కానుంది.ముందుగా లక్ష్మీనారాయణ చెరువు సందర్శన, ఆ తర్వాత ⁠బాధితులతో సమావేశం నిర్వహించనున్నారు.అనంతరం 5 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టనున్నారు. ఆ తర్వాత మర్రిపల్లిగూడెం గ్రామంలో ఎంపీ ఈటల బృందం పర్యటన కొనసాగనుంది. అక్కడ కూడా బాధితులతో సమావేశం కానున్నారు.

మూడో పెళ్లితోనే అమీర్ ఖాన్ టార్గెట్! అసలు బిష్ణోయ్ గ్యాంగ్ స్కెచ్ ఏంటి?క్రైమ్Swechaa26 Oct 2026, 09:35 AM

మూడో పెళ్లితోనే అమీర్ ఖాన్ టార్గెట్! అసలు బిష్ణోయ్ గ్యాంగ్ స్కెచ్ ఏంటి?

టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటనలో నిందితులు మొదట అమీర్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారనే వార్తలు సంచలనంగా మారాయి. ఆయనను చేరుకోవడం కష్టమని భావించి, మరో హీరోపై దాడికి ప్లాన్ మార్చారన్నది పోలీసులు చెబుతున్న మాట. మరి ఈ వ్యవహారం వెనుక అసలు కథేంటి? అమీర్ ఖాన్ మూడో పెళ్లి దీనికి కారణమా?

హైదరాబాద్‌లో సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం..క్రైమ్Swechaa26 Oct 2026, 09:29 AM

హైదరాబాద్‌లో సాఫ్ట్‌‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం..

హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కత్తులతో బెదిరించి గుర్తు తెలియని దుండగులు కారులో ఎక్కించుకుని వెళ్లినట్టు సమాచారం. అనంతరం నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించకున్నట్టు తెలిసింది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సాఫ్ట్‌వేర్ శ్యామ్ నాగ్ శనివారం రాత్రి తన ఫ్రెండ్ భార్గవ్‌రాజ్‌తో కలిసి గోపన్‌పల్లిలో మద్యం తాగారు.భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లగా కారులో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు శ్యామ్‌ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్ నగర్‌లో చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న బాధితుడి ఫ్రెండ్ భార్గవ్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.వెంటనే డయల్ 112కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి శ్యామ్ నాగ్‌ను గుర్తించారు.

Sai Pallavi: ఒక్క పాటతో పల్లవిపై విమర్శలన్నీ మాఫ్!సినిమాSwechaa26 Oct 2026, 08:59 AM

Sai Pallavi: ఒక్క పాటతో పల్లవిపై విమర్శలన్నీ మాఫ్!

Sai Pallavi: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్న హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి. తెలుగులో నటించిన ఫిదా ఆమెకి స్టార్ స్టేటస్ తీసుకువచ్చింది. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల రాసుకున్న పాత్రకు 100 శాతం న్యాయం చేసింది. ఇంత నేచురల్ పర్ఫార్మెన్స్ ఇంకో హీరోయిన్ చేయలేదనే ప్రశంసలు అందుకుంది.

Today in History October 26: చరిత్రలో ఈరోజుInternationalSwechaa26 Oct 2026, 08:36 AM

Today in History October 26: చరిత్రలో ఈరోజు

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

1950: మదర్ థెరీసా కలకత్తాలో 'మిషనరీస్ ఆఫ్ చారిటీ' సేవా సంస్థను స్థాపించారు.

1962: భారత్-చైనా యుద్ధం నేపథ్యంలో భారతదేశంలో తొలిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితి (National Emergency) విధింపు

1947: జమ్మూ కాశ్మీర్ రాజా హరిసింగ్ భారతదేశంలో కాశ్మీర్ విలీన పత్రం (Instrument of Accession) పై సంతకం చేశారు.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

1825: అమెరికాలో గ్రేట్ లేక్స్ మరియు అట్లాంటిక్ మహాసముద్రాన్ని అనుసంధానించే ప్రసిద్ధ 'ఈరీ కెనాల్' (Erie Canal) ప్రారంభమైంది.

1950: మదర్ థెరీసా కోల్‌కతాలో మిషనరీస్ ఆఫ్ చారిటీ సేవా సంస్థను అధికారికంగా స్థాపించారు.

1979: దక్షిణ కొరియా అధ్యక్షుడు పార్క్ చుంగ్-హీ కేసీఐఏ (KCIA) అధిపతి చేతిలో హత్యకు గురయ్యారు.

🚀 సైన్స్

1984: వైద్య చరిత్రలో మైలురాయి — 'బేబీ ఫే' అనే 14 రోజుల చిన్నారికి మొట్టమొదటిసారిగా బబూన్ (కోతి) గుండెను విజయవంతంగా అమర్చారు.

👤 ప్రముఖుల జననాలు

1947: అమెరికా మాజీ ప్రథమ మహిళ, 67వ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ జననం.

1965: ప్రముఖ దక్షిణ భారత రంగుల ప్రపంచ నేపథ్య గాయకుడు నాగూర్ బాబు (మనో) జననం.

1985: ప్రముఖ భారతీయ సినీ నటి ఆసిన్ జననం.

నేటి పంచాంగం - 26 అక్టోబర్ 2026 | ఆశ్వయుజ పౌర్ణమి & కార్తిక స్నానాల ప్రారంభంSpiritualitySwechaa26 Oct 2026, 08:03 AM

నేటి పంచాంగం - 26 అక్టోబర్ 2026 | ఆశ్వయుజ పౌర్ణమి & కార్తిక స్నానాల ప్రారంభం

వివరాలు:

  • తేదీ: 26 అక్టోబరు 2026, సోమవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం / కృష్ణ పక్షం

  • తిథి: పౌర్ణమి (ఉదయం 09:41 వరకు, తదుపరి కృష్ణ పాడ్యమి)

  • వారం: సోమవారం (ఇందువాసరే)

  • నక్షత్రం: అశ్విని (సాయంత్రం 05:41 వరకు, తదుపరి భరణి)

  • యోగం: వజ్ర (మధ్యాహ్నం 02:16 వరకు, తదుపరి సిద్ధి)

  • కరణం: బవ (ఉదయం 09:41 వరకు), తదుపరి బాలవ (రా. 08:24 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 07:42 - 09:08 వరకు

  • యమగండం: ఉదయం 10:34 - మధ్యాహ్నం 12:00 వరకు

  • అమృతకాలం: ఉదయం 10:59 - మధ్యాహ్నం 12:28 వరకు

  • దుర్ముహూర్తము: మధ్యాహ్నం 12:23 - 01:08 వరకు మరియు మధ్యాహ్నం 02:40 - 03:26 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 01:58 - 03:27 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మేషం

  • సూర్యోదయం: ఉదయం 06:16

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:44

Ramayana: 4000 కోట్ల సినిమాకి "NO" టికెట్ హైక్స్..దిల్ రాజు గ్రేట్!సినిమాSwechaa26 Oct 2026, 07:59 AM

Ramayana: 4000 కోట్ల సినిమాకి "NO" టికెట్ హైక్స్..దిల్ రాజు గ్రేట్!

Ramayana: సినిమా సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉంటే ఎంత భారీ విజయం అందుకుంటుందో ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమా నిరూపించింది. రవితేజ-శివ నిర్వాణ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయితే, రవితేజకి వరుస ఫ్లాప్స్ వస్తున్న నేపథ్యంలో అటు ఏపీ ఇటు తెలంగాణలలో ఎలాంటి టికెట్ పెంపు లేకుండా విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు, రామాయణ సినిమాకి అలాగే ప్లాన్ చేశారు దిల్ రాజు.

PM Modi: సైబర్‌ ఉగ్రవాదులతో జాగ్రత్తగా ఉండాలి.. ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరిక!NationalSwechaa25 Oct 2026, 09:57 PM

PM Modi: సైబర్‌ ఉగ్రవాదులతో జాగ్రత్తగా ఉండాలి.. ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరిక!

PM Modi: యుద్ధాలు అంటే బోర్డర్ల దగ్గర తుపాకులు పట్టుకుని పోరాడటమే కాదని, సైబర్ ఉగ్రవాదులు మన ఆర్థిక వ్యవస్థ మీదే కన్నేశారని ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్ దొంగలు, సైబర్ ముఠాల నుంచి మన బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. ఒడిశాలో రూ.169 కోట్లతో ఏర్పాటు చేసిన ఆర్బీఐ డేటా సెంటర్, సైబర్ సెక్యూరిటీ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత అక్కడ మాట్లాడిన ప్రధాని, సరికొత్త తరహా యుద్ధాల గురించి సంచలన విషయాలు చెప్పారు."ఈ రోజుల్లో యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే జరగడం లేదన్నది అందరికీ తెలుసు. ఒక దేశాన్ని దెబ్బకొట్టాలంటే ఆ దేశ డబ్బు చలామణిని, బ్యాంకింగ్ వ్యవస్థను టార్గెట్ చేస్తే చాలు. భారత్ వేగంగా ఎదుగుతున్న ఈ టైమ్‌లో మన బ్యాంకుల మీద సైబర్ ఉగ్రవాదులు గురిపెట్టే ప్రమాదం ఉంది.

Vakiti Srihari: మొక్కుబడి మీటింగ్‌లకు చెక్.. మంత్రి శ్రీహరి కొత్త స్కెచ్!తెలంగాణSwechaa25 Oct 2026, 09:28 PM

Vakiti Srihari: మొక్కుబడి మీటింగ్‌లకు చెక్.. మంత్రి శ్రీహరి కొత్త స్కెచ్!

Vakiti Srihari: సాధారణంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించారంటే.. మండల కేంద్రంలోనో లేదా కలెక్టరేట్‌లోనే ఓ నాలుగు గంటలు కూర్చొని, ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోతుంటారు. కానీ మక్తల్ నియోజకవర్గంలో మాత్రం మంత్రి వాకిటి శ్రీహరి ఈ మొక్కుబడి తంతుకు పూర్తిగా చెక్ పెట్టేశారు. పల్లె సీమల్లో పేరుకుపోయిన అసలైన సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు సరికొత్త కార్యాచరణతో రంగంలోకి దిగారు. అమరచింత మండలంలోని 14 గ్రామాల అభివృద్ధిపై ఆయన చేపట్టిన ప్రత్యేక సమీక్ష ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.

DK Aruna: రేవంత్ ఓటు చోరీ చేసి గెలిచాడా?.. డీకే అరుణ ఫైర్తెలంగాణSwechaa25 Oct 2026, 09:12 PM

DK Aruna: రేవంత్ ఓటు చోరీ చేసి గెలిచాడా?.. డీకే అరుణ ఫైర్

DK Aruna: "తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు దొంగిలించి గెలిచిందా? రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేసే సీఎం అయ్యారా?" అంటూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని దౌల్తాబాద్ మండలం గోకఫసాల్ వాడ గ్రామంలో నిర్వహించిన ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్రంపై కాంగ్రెస్ నేతలు పనిగట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. "ఎస్‌ఐఆర్ ప్రక్రియ దేశంలో గతంలోనే ఎనిమిది సార్లు జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏదో జరిగిపోతున్నట్లు రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారు. విదేశీ వేదికలెక్కి దేశ పరువు తీసేలా మాట్లాడుతున్నారు.

Anant Ambani: సైకిల్ తొక్కుతూ ఇంటింటికీ డెలివరీ ఇస్తున్న వ్యక్తి.. అనంత్‌ అంబానీ ఏం చేశాడంటే?NationalSwechaa25 Oct 2026, 07:50 PM

Anant Ambani: సైకిల్ తొక్కుతూ ఇంటింటికీ డెలివరీ ఇస్తున్న వ్యక్తి.. అనంత్‌ అంబానీ ఏం చేశాడంటే?

Anant Ambani: రోజంతా సైకిల్ తొక్కుతూ ఆర్డర్లు డెలివరీ చేసే ఒక సామాన్యుడి జీవితంలో అస్సలు ఊహించని సంఘటన జరిగింది. వచ్చే అరకొర సంపాదనతో బైక్ కొనడం అసాధ్యం అనుకున్న వేళ.. అంబానీ ఇంటి నుంచి వచ్చిన ఒక సర్‌ప్రైజ్ అతడి కళ్లలో నీళ్లు తెప్పించింది. ఎండనక, వాననక సైకిల్‌పైనే కిలోమీటర్ల కొద్దీ తిరుగుతున్న ఆ డెలివరీ బాయ్‌ పరిస్థితి చూసి చలించిపోయిన అనంత్ అంబానీ, అతడికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నారు.ముంబైకి చెందిన సుజీత్ అనే యువకుడు డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడికి కనీసం ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనే స్థోమత కూడా లేదు. దాంతో ప్రతిరోజూ సైకిల్‌ మీదే తిరుగుతూ ఆర్డర్లు డెలివరీ చేస్తుంటాడు. ఒకరోజు రోడ్డుపై అతడు సైకిల్ తొక్కుతూ వెళ్తుండగా హుస్సేన్ మన్సూరి అనే లోకల్ ఇన్‌ఫ్లుయెన్సర్ పలకరించాడు.

Pavan Sadineni: క్రేజీ కాస్టింగ్‌తో "ఆకాశంలో ఒక తార"..సినిమాSwechaa25 Oct 2026, 07:30 PM

Pavan Sadineni: క్రేజీ కాస్టింగ్‌తో "ఆకాశంలో ఒక తార"..

Pavan Sadineni: తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ ఉన్న అతికొద్దిమంది దర్శకుల్లో పవన్ సాదినేని ఒకరు. ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం "ఆకాశంలో ఒక తార". అద్భుతమైన టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌తో పాటు డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటోంది. సినిమాకి సంబందించిన ప్రతీ విషయాన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు పవన్ సాదినేని. ఈ సినిమా నవంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.

Virosh Divorce Rumors: విజయ్-రష్మికనూ వదలని దుర్మార్గులు.. ఇంకా ఎంతమందిని టార్గెట్ చేస్తార్రా?సినిమాSwechaa25 Oct 2026, 07:07 PM

Virosh Divorce Rumors: విజయ్-రష్మికనూ వదలని దుర్మార్గులు.. ఇంకా ఎంతమందిని టార్గెట్ చేస్తార్రా?

Virosh Divorce Rumors: సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలంటే కొందరికి కేవలం ఒక ఆట వస్తువులా మారిపోయింది. వాళ్లు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు అనే ఆసక్తి వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత వాళ్ల కాపురాలపై విషం కక్కే స్థాయికి దిగజారడం ఇటీవల సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది. తాజాగా టాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నాలను టార్గెట్ చేస్తూ సాగుతున్న నీచ ప్రచారం చూస్తే.. అసలు ఈ వికృత చేష్టలు ఎక్కడిదాకా వెళ్తాయి? ఇంకెంత మంది సెలబ్రిటీల జీవితాలతో ఇలా ఆడుకుంటారు? అనే ఆగ్రహం సర్వత్రా వ్యక్తమవుతోంది.ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ ఏడాదే ఉదయ్‌పూర్‌లో అత్యంత ఘనంగా మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు విజయ్, రష్మిక. పెళ్లి తర్వాత వీళ్లిద్దరూ కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా కూడా థియేటర్లలోకి వచ్చి సందడి చేసింది. తమ వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా మొదలుపెట్టిన ఈ కొత్త జంటపై కొందరు అప్పుడే పడి ఏడవడం మొదలుపెట్టారు

Tummidihatti Barrage: మేడిగడ్డ గండం దాటి.. తుమ్మిడిహెట్టి వైపు రేవంత్ జల వ్యూహం!తెలంగాణSwechaa25 Oct 2026, 07:03 PM

Tummidihatti Barrage: మేడిగడ్డ గండం దాటి.. తుమ్మిడిహెట్టి వైపు రేవంత్ జల వ్యూహం!

Tummidihatti Barrage: తెలంగాణను ఏళ్ల తరబడి వేధించిన కాళేశ్వరం వివాదం, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు తెచ్చిన రాజకీయ సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రేవంత్ రెడ్డి సరికొత్త జల రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. మేడిగడ్డ వైఫల్యాలను కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం చేయకుండా, దానికి తిరుగులేని శాశ్వత సాంకేతిక సమాధానం చూపించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ప్రభుత్వం పాత మూలాల వైపు అడుగులు వేస్తోంది. దివంగత వైఎస్సార్ హయాంలో రూపుదిద్దుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అసలు గుండెకాయ అయిన ‘తుమ్మిడిహెట్టి’ని మళ్లీ వెలుగులోకి తెచ్చి, ఉత్తర తెలంగాణకు జీవనాడిగా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగానే ముంబై వేదికగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో అత్యంత కీలక భేటీకి సిద్ధమయ్యారు.

Venu Sriram: 'వకీల్ సాబ్' దర్శకుడెక్కడ?సినిమాSwechaa25 Oct 2026, 06:25 PM

Venu Sriram: 'వకీల్ సాబ్' దర్శకుడెక్కడ?

Venu Sriram: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు ఎప్పుడు ఫేడవుట్ అవుతున్నాడో చెప్పలేకపోతున్నాము. ఒక సినిమా హిట్ అయితే హీరోలు కథ చెప్పమంటారు. నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తారు. అదే, నిర్మాత.. అదే దర్శకుడికి ఒక ఫ్లాప్ వస్తే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాడు. హీరోలు కూడా కనీసం కథ వినే టైమ్ ఇవ్వకుండా ఎస్కేప్ అవుతుంటారు. అలాంటి, దర్శకుల్లో వేణు శ్రీరామ్ కూడా ఉన్నారు. వకీల్ సాబ్ లాంటి భారీ హిట్ తర్వాత తమ్ముడు ఫ్లాప్‌తో మళ్ళీ ఏంచేస్తున్నాడో తెలియలేదు.