స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Venu Sriram: 'వకీల్ సాబ్' దర్శకుడెక్కడ?సినిమాSwechaa25 Oct 2026, 06:25 PM

Venu Sriram: 'వకీల్ సాబ్' దర్శకుడెక్కడ?

Venu Sriram: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక దర్శకుడు ఎప్పుడు ఫేడవుట్ అవుతున్నాడో చెప్పలేకపోతున్నాము. ఒక సినిమా హిట్ అయితే హీరోలు కథ చెప్పమంటారు. నిర్మాతలు అడ్వాన్స్ ఇస్తారు. అదే, నిర్మాత.. అదే దర్శకుడికి ఒక ఫ్లాప్ వస్తే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసేసుకుంటాడు. హీరోలు కూడా కనీసం కథ వినే టైమ్ ఇవ్వకుండా ఎస్కేప్ అవుతుంటారు. అలాంటి, దర్శకుల్లో వేణు శ్రీరామ్ కూడా ఉన్నారు. వకీల్ సాబ్ లాంటి భారీ హిట్ తర్వాత తమ్ముడు ఫ్లాప్‌తో మళ్ళీ ఏంచేస్తున్నాడో తెలియలేదు.

Revanth Reddy: ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. తుమ్మిడిహట్టి చిక్కుముడులు వీడేనా?తెలంగాణSwechaa25 Oct 2026, 06:13 PM

Revanth Reddy: ముంబైకి సీఎం రేవంత్ రెడ్డి.. తుమ్మిడిహట్టి చిక్కుముడులు వీడేనా?

Revanth Reddy: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల్లో అత్యంత కీలకమైన తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చిక్కుముడులను విప్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ముంబై బయలుదేరనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్న సీఎం, సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వంతో అత్యంత కీలకమైన చర్చలు జరపనున్నారు.సోమవారం ఉదయం 11 గంటలకు ముంబైలోని సహ్యాద్రి స్టేట్ గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం సమావేశం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆ శాఖకు చెందిన కీలక ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. సరిహద్దు ప్రాజెక్టుల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుంది.

Suriya: సక్సెస్ ట్రాక్ ఎక్కిన సూర్య..క్రెడిట్ మాత్రం మన తెలుగు వాళ్ళకే!సినిమాSwechaa25 Oct 2026, 05:42 PM

Suriya: సక్సెస్ ట్రాక్ ఎక్కిన సూర్య..క్రెడిట్ మాత్రం మన తెలుగు వాళ్ళకే!

Suriya: విభిన్నమైన నటనతో కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన సూర్య..హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నాడు. పాత్ర కోసం ఎలాంటి మేకోవర్ అయినా సిద్ధంగా ఉండే సూర్య..గజినీ, 24 లాంటి సినిమాలతో మంచి ప్రయోగాలు చేశాడు. సెవెంత్ సెన్స్, సింగం సిరీస్, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలు ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్స్. అయితే, మధ్యలో కొన్ని ఫ్లాప్స్ వచ్చి ఇబ్బండి పడ్డాడు.

Mythri Ravi: నిర్మాత చెప్పినట్టు విజయ్ ఖాతాలో విజయం చేరిందా?సినిమాSwechaa25 Oct 2026, 05:15 PM

Mythri Ravi: నిర్మాత చెప్పినట్టు విజయ్ ఖాతాలో విజయం చేరిందా?

Mythri Ravi: మన టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం అన్నీ రకాల జానర్..అన్నీ రకాల బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ విజయ పంథాలో కొనసాగుతున్నారు. ఇరుముడి సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్న ఈ సంస్థ, తాజాగా రణబాలి మూవీతోను మరో హిట్ అందుకున్నట్టుగా నిర్మాత వెల్లడించాడు. దీన్నిబట్టి, హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో విజయం చేరినట్టే.

Sweets: హైదరాబాద్ స్వీట్ షాపుల్లో వాంతులయ్యే నిజాలు!తెలంగాణSwechaa25 Oct 2026, 05:04 PM

Sweets: హైదరాబాద్ స్వీట్ షాపుల్లో వాంతులయ్యే నిజాలు!

Sweets: పండుగల సీజన్ వచ్చిందంటే చాలు.. నెయ్యి సువాసనలు వెదజల్లే రంగురంగుల మిఠాయిలను లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటాం. బ్రాండెడ్ షాపు కదా, వేల రూపాయలు పెట్టి కొంటున్నాం కదా అని గుడ్డిగా నమ్ముతుంటాం. కానీ ఆ మెరిసే ప్యాకింగ్‌ల వెనుక, ఆ ఘుమఘుమలాడే నెయ్యి వాసనల వెనుక ఎంతటి కాలకూట విషం దాగుందో తెలిస్తే కడుపులో తిప్పడం ఖాయం. పండుగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు హైదరాబాద్ నగరంలోని పేరుమోసిన స్వీట్ దుకాణాలు, తయారీ కేంద్రాలు ప్రజారోగ్యంతో ఎంతలా చెలగాటమాడుతున్నాయో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో బట్టబయలైంది.ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు జీడిమెట్ల, కూకట్‌పల్లి, మాసబ్‌ట్యాంక్, చందానగర్, బేగంబజార్ వంటి పలు ప్రాంతాల్లోని స్వీట్ తయారీ కేంద్రాల్లో సోదాలు నిర్వహించాయి. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి అధికారులే విస్తుపోయారు.

పీడీఎస్ రైస్ పక్కదారి.. ఒకేసారి 150 మంది రైస్ మిల్లర్ల అరెస్టు!తెలంగాణSwechaa25 Oct 2026, 04:18 PM

పీడీఎస్ రైస్ పక్కదారి.. ఒకేసారి 150 మంది రైస్ మిల్లర్ల అరెస్టు!

రాష్ట్రంలో పీడీఎస్ రైస్ పక్కదారి పట్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్లపై తెలంగాణ ప్రభుత్వం కొరఢా ఝలిపించింది.కస్టమ్ మిల్లింగ్ రైస్ సరఫరాలో భారీ అక్రమాలు జరిగాయని అధికారులు విచారణలో తేల్చడడంతో రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) అధికారులు ఇవాళ తెల్లవారుజాము నుంచే రంగంలోకి దిగారు. ఇప్పటివరకు దాదాపు 150 మందికిపైగా రైస్ మిల్లర్లను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.ఆదివారం ఉదయం 5 గంటల నుంచే సీఐడీ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. ములుగు జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అలాగే, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో నలుగురు రైస్ మిల్లు యజమానులను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టినట్టు సమాచారం.

Telangana Congress: రేవంత్ రెడ్డికి దక్కని సపోర్ట్.. పార్టీ నేతలపై గుస్సాతెలంగాణSwechaa25 Oct 2026, 03:51 PM

Telangana Congress: రేవంత్ రెడ్డికి దక్కని సపోర్ట్.. పార్టీ నేతలపై గుస్సా

Telangana Congress: తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇప్పుడు అధికార వర్గాల్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఉమ్మడిగా, విడివిడిగా సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, నిర్ణయాలను టార్గెట్ చేస్తూ ప్రతిరోజూ దాడి పెంచుతున్నాయి. అయితే, విపక్షాలు ఇంత తీవ్రంగా విరుచుకుపడుతున్నా.. అధికార పక్షం నుంచి అదే స్థాయిలో ధీటైన సమాధానం రాకపోవడం, తనపై మాత్రమే భారం పడుతుండటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Telangana BJP: తెలంగాణ నేతలపై అధిష్టానం ఆగ్రహం.. పనితీరు మార్చుకుంటారా?తెలంగాణSwechaa25 Oct 2026, 03:06 PM

Telangana BJP: తెలంగాణ నేతలపై అధిష్టానం ఆగ్రహం.. పనితీరు మార్చుకుంటారా?

Telangana BJP: తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వానికి రాష్ట్ర నేతల వ్యవహారశైలి తీవ్ర అసహనాన్ని తెప్పిస్తోంది. హైదరాబాద్ నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన వరుస కీలక భేటీల్లో అధిష్టానం దూత సునీల్ బన్సల్ స్వరం తీవ్రంగా మారింది. పార్టీ పదవులను అలంకారప్రాయంగా వాడుకుంటూ, కేవలం ఏసీ గదులకే పరిమితమైన నేతల వైఖరిపై ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న సంకేతాలు ఈ సమావేశంతో స్పష్టమయ్యాయి. పార్టీని ముందుకు నడిపించే సత్తా లేని వారికి కీలక బాధ్యతల్లో కొనసాగే అర్హత లేదని బన్సల్ ముఖం మీదే స్పష్టం చేయడం రాష్ట్ర నాయకత్వాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాల్సిన సమయంలో, నాయకులు అంతర్గత రాజకీయాలకే ప్రాధాన్యమిస్తుండటంపై కేంద్రం అసంతృప్తితో ఉంది. కేవలం పదవులను అనుభవించడం తప్ప, పార్టీ ఇచ్చిన బాధ్యతలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్న వారి జాబితా అధిష్టానం వద్ద ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

రాయచూర్‌లో దారుణం.. సిగరెట్ ఇవ్వలేదని వ్యాపారి హత్య!క్రైమ్Swechaa25 Oct 2026, 02:18 PM

రాయచూర్‌లో దారుణం.. సిగరెట్ ఇవ్వలేదని వ్యాపారి హత్య!

 కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన రాయచూర్‌లో దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. అప్పుగా సిగరెట్ ఇవ్వడానికి నిరాకరించాడనే చిన్న కారణంతో, గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటుపడిన ఒక యువకుడు కిరాణా వ్యాపారిని కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. రాయచూర్ పట్టణ పరిధిలోని ఎల్‌బీఎస్ నగర్, క్రౌన్ బేకరీ సమీపంలో శనివారం జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.  మత్తులో విచక్షణ కోల్పోయిన నిందితుడు.. నర్సింహులుపై కొడవలితో దాదాపు ఎనిమిది సార్లు దారుణంగా వేటు వేశాడు. ఈ తీవ్రమైన దాడిలో తీవ్ర గాయాలపాలైన నర్సింహులు రక్తపుమడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘోర హత్యకు సంబంధించిన భయానక దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ (CCTV) కెమెరాలో రికార్డయ్యాయి.

మేడిగడ్డ టూర్ ఒక జాలీట్రిప్.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలుతెలంగాణSwechaa25 Oct 2026, 02:16 PM

మేడిగడ్డ టూర్ ఒక జాలీట్రిప్.. దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి బీఆర్ఎస్ నేతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విపత్కకర పరిస్థితులను అడ్వాంటెజ్‌గా తీసుకుని, ప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందడానికే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తున్నదని దానం నాగేందర్ మండిపడ్డారు.ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త డ్రామాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ మీద బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల వెనుక కేవలం రాజకీయ స్వార్థం తప్పా ఏమీ లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల చేపట్టిన కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ పర్యటన కేవలం ఒక ‘జాలీ ట్రిప్’ మాత్రమేనని దానం నాగేందర్ అభివర్ణించారు.రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వలన వర్షాభావ పరిస్థితులు నెలకొన్న విషయం బీఆర్ఎస్ నేతలకు తెలీదా? అని ప్రశ్నించారు.

రూ.600లకే బస్ పాస్.. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయంతెలంగాణSwechaa25 Oct 2026, 01:56 PM

రూ.600లకే బస్ పాస్.. టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం

టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలోని ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేకంగా తక్కువ ధరకే అన్ లిమిటెడ్ బస్ పాస్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ ఫ్రెండ్లీ కోసం సరికొత్త ఆఫర్‌కు శ్రీకారం చుట్టింది. రూ.600లకే అన్‌లిమిటెడ్ ‘వీక్లీ బస్ పాస్’ స్కీంను అందుబాటులోకి తెచ్చింది. ఈ పాస్ తీసుకుని నగరంలో ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. కొనుగోలు చేసిన రోజు నుంచి వరుసగా 7 రోజుల పాటు ఈ పాస్ చెల్లుబాటు కానుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏసీ బస్సులతో సహా అన్ని రకాల సిటీ బస్సుల్లోనూ ప్రయాణికులు అపరిమితంగా ట్రావెల్ చేయొచ్చు. కేవలం పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు మాత్రం ఈ పాస్ వర్తించదని టీజీఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ప్రస్తుతమున్న రోజువారీ, నెలవారీ పాసులకు అదనంగా ప్రయాణికులకు మెరుగైన, అనుకూలమైన ప్రయాణ ఎంపికను అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Tollywood: ఈ సర్దుబాట్లు మంచిదే..లేదంటే మొత్తం మునుగుతారు!సినిమాSwechaa25 Oct 2026, 01:53 PM

Tollywood: ఈ సర్దుబాట్లు మంచిదే..లేదంటే మొత్తం మునుగుతారు!

Tollywood: చిన్న సినిమా, పెద్ద సినిమా..హీరో ఎవరైనా కంటెంట్ బలంగా ఉంటే ఆ సినిమానే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. మనది ఫ్యాన్ బేస్డ్ ఇండస్ట్రీ. ఒకప్పుడు హీరోల మధ్య పోటీ ఉండేది. హీరోను బట్టే సినిమా బిజినెస్ అయ్యేది. నిర్మాతకి లాభాలు వచ్చేవి. కానీ, రాజమౌళి దాన్ని మార్చేసి..దర్శకుడు పేరునే ముందు పరిగణలోకి తీసుకొనేలా కొత్త ట్రెండ్ సృష్ఠించాడు. ఈ మధ్యకాలంలో దర్శకుడెవరు అన్న దానిపైనే సినిమా బిజినెస్ జరుగుతోంది.

సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. విమాన సర్వీసులు తాత్కాలిక రద్దు!InternationalSwechaa25 Oct 2026, 01:52 PM

సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. విమాన సర్వీసులు తాత్కాలిక రద్దు!

 సౌదీ అరేబియాలో అకస్మాత్తుగా తలెత్తిన భద్రతాపరమైన ఉద్రిక్త పరిస్థితుల (Security Situation) నేపథ్యంలో ప్రముఖ భారతీయ విమానయాన సంస్థలు అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగో, ఆకాశ ఎయిర్ సంస్థలు సౌదీ అరేబియాలోని వివిధ ప్రధాన నగరాలకు నడిపే తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో ఉమ్రా (Umrah) యాత్రికులు, సాధారణ ప్రయాణికులు, వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతుండగా, ప్రయాణ ప్రణాళికలను మరోసారి సమీక్షించుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.

వ్యాపారుల దందా.. ప్రైవేటు గోదాముల్లో బియ్యం అక్రమ నిల్వలు!టాప్ న్యూస్Swechaa25 Oct 2026, 01:41 PM

వ్యాపారుల దందా.. ప్రైవేటు గోదాముల్లో బియ్యం అక్రమ నిల్వలు!

రాష్ట్రంలో సన్నబియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. బియ్యం ధరలు ఇంతలా ఎందుకు పెరిగాయని అడిగితే సరఫరా లేదని, ఎల్ నినో ప్రభావం అని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం బియ్యం ధరల పెరుగుదల మీద ఏ మాత్రం స్పందించడం లేదు. సామాన్యుడి వంటిల్లు తగలబడిపోతున్నా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సర్కారు చేతగానితనాన్ని సూచిస్తోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు పీడీఎస్ రైస్ టన్నుల కొద్దీ పక్కదారి పడుతున్నా అడ్డుకోలేని సర్కార్ బియ్యం రేట్లు పెరగడానికి ఎల్ నినో కారణమని చెబుతోంది.

సంచలన నివేదిక.. మహిళలపై నేరాల కేసుల్లో బీజేపీ నేతలే టాప్!NationalSwechaa25 Oct 2026, 01:27 PM

సంచలన నివేదిక.. మహిళలపై నేరాల కేసుల్లో బీజేపీ నేతలే టాప్!

మహిళలపై వేధింపులు, లైంగిక దాడులు, నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల్లో అధికార బీజేపీ (BJP)కి చెందిన వారే మొదటి స్థానంలో ఉన్నారని 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR), 'నేషనల్ ఎలక్షన్ వాచ్' తమ తాజా అధ్యయనంలో సంచలన విషయాలను వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పదవుల్లో ఉన్న 772 మంది ఎంపీలు, 4,109 మంది ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించగా, మొత్తం 168 మంది ఎమ్మెల్యేలు, 19 మంది ఎంపీలు మహిళలపై నేరాలకు సంబంధించిన పెండింగ్ కేసులను ఎదుర్కొంటున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది.

Srinu Vaitla: సంక్రాంతి బరిలో జార్జి క్రిష్ తట్టుకోగలడా? ఇంత రిస్క్ అవసరమా?సినిమాSwechaa25 Oct 2026, 01:07 PM

Srinu Vaitla: సంక్రాంతి బరిలో జార్జి క్రిష్ తట్టుకోగలడా? ఇంత రిస్క్ అవసరమా?

Srinu Vaitla: 2027, సంక్రాంతికి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. వాటిలో, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా, సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్, ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి మహాకాళి, అనిల్ రావిపూడి రూపొందిస్తున్న మల్టీస్టారర్ సహా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ బెర్త్ కన్‌ఫర్మ్ చేసుకున్నాయి. ఇంత ఠఫ్ కాంపిటీషన్‌లో గత కొన్నేళ్ళ నుంచి ఇండస్ట్రీలో లేని శ్రీను వైట్ల..శర్వాతో చేస్తోన్న జార్జి క్రిష్ సినిమాతో బరిలోకి దిగుతున్నాడు. ఇది రిస్క్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఫ్లెక్సీల చించివేత.. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఫీవర్!తెలంగాణSwechaa25 Oct 2026, 01:06 PM

ఫ్లెక్సీల చించివేత.. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఫీవర్!

నగరంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ నేతలు, జీహెచ్ఎంసీ తొలగించడంపైనా బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బీఆర్‌ఎస్ అంటే ఎందుకంత భయం రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నిస్తున్నారు. ​ఖైరతాబాద్‌లో గులాబీ జెండా రెపరెపలు చూసి కాంగ్రెస్ సర్కార్‌కు వణుకు పుడుతోందని, ​ఖైరతాబాద్ సీనియర్ నేత జిబ్రాన్ బీఆర్‌ఎస్‌లో చేరికను చూసి అధికార పార్టీ ఓర్వడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ​జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, బంజారాహిల్స్, విరించి హాస్పిటల్, పంజాగుట్ట, సోమాజిగూడ పరిసరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయడంపై గులాబీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ​అర్ధరాత్రి వేళ జీహెచ్‌ఎంసీ అధికారులను అడ్డం పెట్టుకుని ఫ్లెక్సీలు తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. ​ఫ్లెక్సీలు తొలగింపుపై ప్రశ్నిస్తే జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమాధానం దాటవేస్తున్నారని, ​పై అధికారుల ఆదేశాలంటూ చెబుతున్నారని వెల్లడించారు.

కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. కారెక్కిన  NSUI మాజీ రాష్ట్ర అధ్యక్షుడుతెలంగాణSwechaa25 Oct 2026, 12:38 PM

కాంగ్రెస్‌కు బిగ్‌షాక్.. కారెక్కిన NSUI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు

అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది.అసలు సిసలైన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగుతోందని పేర్కొంటూ NSUI మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆదిలాబాద్ జిల్లా యువ నాయకుడు భార్గవ్ దేశ్ పాండే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అంతకుముందు రోజు ఆయన సొమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్ పాలనలో యువకులకు, నిజమైన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాయి నాయకుల పెత్తనం పెరిగిందని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం జెండాలు మోశామని, కానీ గత మూడేండ్లుగా తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని అన్నారు.

Dil Raju: దిల్ రాజు గేమ్ స్టార్ట్?సినిమాSwechaa25 Oct 2026, 12:29 PM

Dil Raju: దిల్ రాజు గేమ్ స్టార్ట్?

Dil Raju: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్స్‌గా ఓ వెలుగు వెలిగాడు దిల్ రాజు. అయితే, వరుస ఫ్లాపుల వల్ల నిర్మాణంలో, డిస్ట్రిబ్యూషన్‌లో ఆ మధ్య కాస్త స్లో అయ్యాడు. ఈ గ్యాప్‌లో మైత్రీ వారు, సితార, ఏషియన్ వాళ్ళు బాగా పుంజుకున్నారు. ఎక్కువగా వరుస హిట్స్ కొడుతుంది అంటే మైత్రీ వారే. డిస్ట్రిబ్యూషన్ పరంగా కూడా మైత్రీ దూసుకుపోతోంది. దీంతో, పరిస్థితులను బాగా అర్థం చేసుకున్న దిల్ రాజు స్ట్రాటజీ ప్లాన్ చేశాడు.

'మన్ కీ బాత్'కు 12ఏళ్లు.. 139వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!NationalSwechaa25 Oct 2026, 12:19 PM

'మన్ కీ బాత్'కు 12ఏళ్లు.. 139వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ భావోద్వేగ ప్రసంగం!

 ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' (Mann Ki Baat) విజయవంతంగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆదివారం ప్రసారమైన 139వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ భావోద్వేగంతో ప్రసంగించారు. గత పన్నెండు సంవత్సరాల ప్రయాణం తనకెంతో మధురమైన అనుభూతిని మిగిల్చిందని, ఇది సాధారణ ప్రయాణం కాదని, దేశ ప్రజలను దగ్గరగా అర్థం చేసుకునే ఒక 'పవిత్ర తీర్థయాత్ర'తో సమానమని భావోద్వేగంతో వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అసాధారణ కృషితో సమాజానికి సేవ చేస్తున్న సామాన్యుల స్ఫూర్తిదాయక గాథలను ఈ వేదిక ద్వారా దేశం ముందుంచినట్లు తెలిపారు.

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. స్తంభించిన పారిశ్రామిక అనుమతుల సేవలు!తెలంగాణSwechaa25 Oct 2026, 12:08 PM

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. స్తంభించిన పారిశ్రామిక అనుమతుల సేవలు!

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలకమైన పారిశ్రామిక సింగిల్ విండో అనుమతుల పోర్టల్ 'టీజీ-ఐపాస్' (TG-iPASS) సైబర్ దాడికి గురైంది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సులభతరంగా అందించే ఈ 'గవర్న్‌మెంట్ టు బిజినెస్' (G2B) ప్లాట్‌ఫారమ్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డేటాబేస్‌ను పూర్తిగా ఎన్‌క్రిప్ట్ (Encrypt) చేయడంతో పోర్టల్ సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ఘటనపై 'తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో' (TGCSB) సుమోటోగా కేసు నమోదు చేసి విస్తృత దర్యాప్తు ప్రారంభించింది.

Cyclone Arnab: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. అక్టోబర్ 28 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!తెలంగాణSwechaa25 Oct 2026, 11:38 AM

Cyclone Arnab: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. అక్టోబర్ 28 నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న రోజుల్లో బలపడి భీకర తుపానుగా మారనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ముప్పునకు 'అర్నాబ్' (Cyclone Arnab) నామకరణం చేయగా, ఇది మరింత తీవ్రమై ఈ నెల 28న తీరం దాటే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతోంది.

Prabhas-Fauzi: ఇలా పోల్చుకోవడం సినిమాను చంపినట్టేగా!సినిమాSwechaa25 Oct 2026, 11:37 AM

Prabhas-Fauzi: ఇలా పోల్చుకోవడం సినిమాను చంపినట్టేగా!

Prabhas-Fauzi: హను రాఘవపూడి అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది ఆయన తీసిన 'అందాల రాక్షసి', 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ', 'పడి పడి లేచె మనసు' 'సీతారామం' చిత్రాలే. మొదటి సినిమా కథ నచ్చి స్వయంగా రాజమౌళీనే 'అందాల రాక్షసి' సినిమాను ప్రమోట్ చేశాడు. 'అందాల రాక్షసి' నుంచి 'పడి పడి లేచె మనసు' సినిమాల వరకూ ఒకెత్తైతే, ఆ తర్వాత దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లతో చేసిన సీతారామం ఒక్కటీ ఒకెత్తు.

జేఈఈ మెయిన్ 2027 పరీక్షా తేదీల షెడ్యూల్ విడుదలటాప్ న్యూస్Swechaa25 Oct 2026, 11:28 AM

జేఈఈ మెయిన్ 2027 పరీక్షా తేదీల షెడ్యూల్ విడుదల

దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్ -2027 అధికారిక షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా ప్రకటించింది. 2027 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి సెషన్-1, సెషన్-2 పరీక్షా తేదీల పూర్తి వివరాలు, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన తేదీలు, వివరాలను అధికారులు వెల్లడించారు. దేశంలోని ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక సంస్థల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తొలి విడత దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 24న ప్రారంభమైంది. నవంబర్ 22న రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల పరీక్షా కేంద్రాల సమాచారాన్ని తెలిపే ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్’ను డిసెంబర్ 30వ తేదీన విడుదల చేయనున్నారు.

ఇది చేతిరాతా? డిజిటల్ ప్రింటా?: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న నేపాల్ అమ్మాయి!InternationalSwechaa25 Oct 2026, 11:17 AM

ఇది చేతిరాతా? డిజిటల్ ప్రింటా?: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న నేపాల్ అమ్మాయి!

మానవ మేధస్సు, క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన ఏ స్థాయిలో అద్భుతాలను సృష్టించగలదో నిరూపిస్తోంది నేపాల్‌కు చెందిన ఓ సాధారణ విద్యార్థిని. ఆమె పేరు ప్రకృతి మల్లా (Prakriti Malla). ఆమె చేతిరాతతో రాసిన అక్షరాలను చూస్తే ఎవరైనా సరే.. అది నిజంగా చేతితో రాసిందా లేక కంప్యూటర్ ఫాంట్ సహాయంతో ప్రింట్ తీశారా అని ఆశ్చర్యపోవాల్సిందే. అచ్చం డిజిటల్ ప్రింట్‌ను తలపించేలా, ఏమాత్రం సైజు తేడా లేకుండా ఉన్న ఆమె అక్షరాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి విపరీతమైన ప్రశంసలు అందుకుంటున్నాయి.

ఆర్టీసీ భూములపై రేవంత్ సర్కార్ కన్ను.. సీక్రెట్ జీవో జారీ!తెలంగాణSwechaa25 Oct 2026, 10:42 AM

ఆర్టీసీ భూములపై రేవంత్ సర్కార్ కన్ను.. సీక్రెట్ జీవో జారీ!

తెలంగాణ ప్రభుత్వం మీద మరోసారి సంచలన ఆరోపణలు వినిపిస్తున్నాయి.మొన్నటివరకు పాలిటెక్నిక్ భూముల మీద కన్నేసిన సీఎం రేవంత్ రెడ్డి.. తాజాగా ఆర్టీసీ భూములను లాక్కునేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రాష్ట్రంలో ఆర్టీసీకి పెద్దఎత్తున భూములు ఉన్నాయి. డిపోలు,వర్క్ షాప్స్ పేరిట నడుస్తున్నాయి. ఆ స్థలాలపైనా కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడిందని, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు ఈ స్థలాలను వాడుకోవాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌–ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న 6 ఎకరాల 15 గుంటల ఆర్టీసీ భూమిని లాక్కునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సదరు భూమిలో పేదలకు ఇళ్లు కట్టించాలనే పేరిట తెలంగాణ హౌసింగ్ బోర్డుకు కట్టబెడుతూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కనీసం ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోకుండా, అక్టోబర్ 22న గుట్టుచప్పుడు కాకుండా రెవెన్యూ శాఖ ద్వారా జీవో నంబర్ 206ను ప్రభుత్వం జారీ చేసినట్టు తెలుస్తోంది.

క్రీడల్లో పెరిగిన రాజకీయ జోక్యం.. ముంబై లిట్‌ఫెస్ట్‌లో శశి థరూర్ ఘాటు వ్యాఖ్యలు!NationalSwechaa25 Oct 2026, 10:28 AM

క్రీడల్లో పెరిగిన రాజకీయ జోక్యం.. ముంబై లిట్‌ఫెస్ట్‌లో శశి థరూర్ ఘాటు వ్యాఖ్యలు!

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య జరిగే క్రికెట్ పోటీలు ప్రస్తుతం మైదానంలో ఆడే సాధారణ క్రీడగా కాకుండా పూర్తిస్థాయి రాజకీయ వ్యవహారంగా మారిపోయాయని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ, ప్రముఖ రచయిత శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లో ‘గన్’ కలకలం.. పారిపోయిన బార్ కస్టమర్లుక్రైమ్Swechaa25 Oct 2026, 10:08 AM

హైదరాబాద్‌లో ‘గన్’ కలకలం.. పారిపోయిన బార్ కస్టమర్లు

హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి మరోసారి గన్ కలకలం సృష్టించింది. ఓ వ్యక్తి బార్ అండ్ రెస్టారెంట్‌లో ఫుల్లుగా తాగేసి బిల్లు చెల్లించే విషయంలో తోటి మిత్రులతో గొడవకు దిగినట్టు సమాచారం. తాను బిల్లు కట్టనని, మీరే కట్టాలని గొడవకు దిగడంతో బౌన్సర్లు వచ్చి వారిని కిందకు పంపించివేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన కారులోని గన్ తీసుకొని వచ్చి కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేదంటే కాల్చేస్తానని ఫ్రెండ్స్, బౌన్సర్లను బెదిరించినట్టు సమాచారం. సోమాజిగూడ హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. బౌన్సర్లు ఎంట్రీ ఇచ్చి వారిని కిందకు పంపడంతో తన కారులోని గన్ తీసుకొచ్చి బెదిరించగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు వెంటనే అక్కడకు వచ్చి గన్ చూపించిన వ్యక్తిని అరెస్టు చేశారు.

Ram Charan: ఆ రెండు రామ్ చరణ్ డ్రీమ్ రోల్స్?సినిమాSwechaa25 Oct 2026, 09:06 AM

Ram Charan: ఆ రెండు రామ్ చరణ్ డ్రీమ్ రోల్స్?

Ram Charan: రామ్ చరణ్..మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి చిరుతలా ఎంట్రీ ఇచ్చి..మొదటి సినిమాతో అటు డాన్స్ పరంగా ఇటు యాక్టింగ్ పరంగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు. వారసుడి ఎంట్రీ అనేది మొదటి సినిమా వరకే తప్ప, ఆ తర్వాత ఏ నటుడైనా తన సొంత టాలెంట్‌తో నిరూపించుకొని నిలబడాల్సిందే. చరణ్ ఈ విషయంలో ప్రతీ సినిమాను తన మొదటి సినిమాగా చేస్తున్నాడు.

నేటి పంచాంగం - 25 అక్టోబర్ 2026 | శరద్ పౌర్ణమి ప్రత్యేకతలుSpiritualitySwechaa25 Oct 2026, 08:47 AM

నేటి పంచాంగం - 25 అక్టోబర్ 2026 | శరద్ పౌర్ణమి ప్రత్యేకతలు

వివరాలు:

  • తేదీ: 25 అక్టోబరు 2026, ఆదివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం

  • తిథి: చతుర్దశి ఉదయం 11:55 వరకు, తదుపరి పూర్ణిమ

  • నక్షత్రం: రేవతి రాత్రి 07:22 వరకు, తదుపరి అశ్విని

  • యోగం: హర్షణ సాయంత్రం 05:21 వరకు, తదుపరి వజ్ర

  • కరణం: వాణిజ ఉదయం 11:55 వరకు, తదుపరి విష్టి రాత్రి 10:52 వరకు

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: సాయంత్రం 04:18 - 05:44 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 12:00 - 01:26 వరకు

  • అమృతకాలం: సాయంత్రం 05:03 - 06:34 వరకు

  • దుర్ముహూర్తము: సాయంత్రం 04:12 - 04:58 వరకు

  • వర్జ్యం: ఉదయం 07:57 - 09:28 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మీనం (రాత్రి 07:22 వరకు, తదుపరి మేషం)

  • సూర్యోదయం: ఉదయం 06:15 | సూర్యాస్తమయం: సాయంత్రం 05:44