స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

నేటి పంచాంగం - 25 అక్టోబర్ 2026 | శరద్ పౌర్ణమి ప్రత్యేకతలుSpiritualitySwechaa25 Oct 2026, 08:47 AM

నేటి పంచాంగం - 25 అక్టోబర్ 2026 | శరద్ పౌర్ణమి ప్రత్యేకతలు

వివరాలు:

  • తేదీ: 25 అక్టోబరు 2026, ఆదివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం

  • తిథి: చతుర్దశి ఉదయం 11:55 వరకు, తదుపరి పూర్ణిమ

  • నక్షత్రం: రేవతి రాత్రి 07:22 వరకు, తదుపరి అశ్విని

  • యోగం: హర్షణ సాయంత్రం 05:21 వరకు, తదుపరి వజ్ర

  • కరణం: వాణిజ ఉదయం 11:55 వరకు, తదుపరి విష్టి రాత్రి 10:52 వరకు

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: సాయంత్రం 04:18 - 05:44 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 12:00 - 01:26 వరకు

  • అమృతకాలం: సాయంత్రం 05:03 - 06:34 వరకు

  • దుర్ముహూర్తము: సాయంత్రం 04:12 - 04:58 వరకు

  • వర్జ్యం: ఉదయం 07:57 - 09:28 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మీనం (రాత్రి 07:22 వరకు, తదుపరి మేషం)

  • సూర్యోదయం: ఉదయం 06:15 | సూర్యాస్తమయం: సాయంత్రం 05:44

January-12 Vidudhala: అనిల్ రావిపూడి మార్క్ క్లైమాక్స్..ఈసారి వర్కౌట్ అవుతుందా?సినిమాSwechaa25 Oct 2026, 08:36 AM

January-12 Vidudhala: అనిల్ రావిపూడి మార్క్ క్లైమాక్స్..ఈసారి వర్కౌట్ అవుతుందా?

January-12 Vidudhala: విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ ల క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘జనవరి 12 విడుదల’. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తెరక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. అనిల్ మార్క్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ కి చేరుకుంది. కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలైందా? బన్సల్ ఎంట్రీతో పొలిటికల్ హీట్!తెలంగాణSwechaa25 Oct 2026, 12:53 AM

తెలంగాణలో బీజేపీ గేమ్ మొదలైందా? బన్సల్ ఎంట్రీతో పొలిటికల్ హీట్!

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కొత్త దిశలోకి వెళ్తోందా? ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క అన్నట్టుగా కమలం పార్టీ అడుగులు పడుతున్నాయా..? ఎన్నికల సమయంలో హడావుడి చేసే రాజకీయాల నుంచి.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండే స్థాయికి పార్టీని తీసుకెళ్లాలనే లక్ష్యంతో జాతీయ నాయకత్వం రంగంలోకి దిగిందా?

బెంగళూరు ప్యాలెస్‌ చిచ్చు.. అన్నాచెల్లెళ్ల మధ్య అసలు గొడవేంటి?ఏపీSwechaa25 Oct 2026, 12:12 AM

బెంగళూరు ప్యాలెస్‌ చిచ్చు.. అన్నాచెల్లెళ్ల మధ్య అసలు గొడవేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు అన్నకు అండగా నిలిచిన చెల్లెలు.. ఇప్పుడు అదే అన్నతో ఆస్తుల విషయంలో న్యాయపోరాటం చేస్తున్నారు. రాజకీయంగా దూరమైన ఇద్దరి మధ్య ఇప్పుడు మరో వివాదం రాజుకుంది. ఈసారి అంశం అధికారం కాదు.. ఎన్నికలు కాదు.. షర్మిల కుమార్తె పెళ్లి వేదిక!

Telugu Cinema: బ్యాక్ గ్రౌండ్ లేని నటులపై విషపు జర్నలిజం..సినిమాSwechaa24 Oct 2026, 10:28 PM

Telugu Cinema: బ్యాక్ గ్రౌండ్ లేని నటులపై విషపు జర్నలిజం..

elugu Cinema: తెలుగు సినీ పరిశ్రమలో గాడ్‌ఫాదర్లు లేకుండా, కేవలం ప్రతిభనే నమ్ముకుని వచ్చే నటీనటులపై కొందరు యూట్యూబ్ నిర్వాహకులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత హేయంగా మారింది. వెనుక పెద్ద ఫ్యామిలీల సపోర్ట్ ఉన్న హీరోల ముందు చేతులు కట్టుకుని వినయంగా నిలబడే కొందరు సోకాల్డ్ జర్నలిస్టులు.. ఎలాంటి సినీ నేపథ్యం లేని యువ నటులు కనిపి

Bank Loan Tips: బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే రోడ్డున పడటం ఖాయం!NationalSwechaa24 Oct 2026, 09:48 PM

Bank Loan Tips: బ్యాంక్ లోన్ తీసుకుంటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే రోడ్డున పడటం ఖాయం!

Bank Loan Tips: సొంతిల్లు కట్టుకోవాలన్నా, పిల్లల చదువులు, పెళ్లిళ్లు, లేదా కొత్త బిజినెస్ మొదలుపెట్టాలన్నా చేతిలో ఒకేసారి లక్షల రూపాయలు ఉండటం అందరికీ సాధ్యం కాదు. ఇలాంటి టైమ్‌లో బ్యాంకులు ఇచ్చే లోన్లే పెద్ద ఆసరాగా నిలుస్తాయి.

ఇరిగేషన్ శాఖలో కలకలం.. జూరాల ప్రాజెక్ట్ ఎస్ఈ కార్యాలయంలో రికార్డుల దగ్ధంతెలంగాణSwechaa24 Oct 2026, 09:28 PM

ఇరిగేషన్ శాఖలో కలకలం.. జూరాల ప్రాజెక్ట్ ఎస్ఈ కార్యాలయంలో రికార్డుల దగ్ధం

Jurala: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జూరాల ప్రాజెక్ట్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE) కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన ఘటన కలకలం రేపుతోంది. కార్యాలయంలో భద్రపరిచిన పాత రికార్డులను ఒక ఉద్యోగి కార్యాలయం బయట కాల్చివేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఈ‌ కార్యాలయం రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య డివిజన్ -1 బదిలీపై వెళ్లారు. అతడి స్థానంలో వచ్చిన దినేష్ అనే ఉద్యోగికి రికార్డులు అప్పజెప్పాల్సి ఉంది. అయితే జూరాల ప్రాజెక్టు నిర్మాణం నాటి నుంచి ఇప్పటివరకు సంబంధించిన అనేక ముఖ్యమైన పత్రాలను బదిలీపై వెళ్లిన ఉద్యోగి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా తగలబెట్టినట్లు సమాచారం.

TG: ఇళ్లలో అక్రమ బోర్లు.. సున్నం చెరువులో హైడ్రా స్టింగ్ ఆపరేషన్!తెలంగాణSwechaa24 Oct 2026, 08:52 PM

TG: ఇళ్లలో అక్రమ బోర్లు.. సున్నం చెరువులో హైడ్రా స్టింగ్ ఆపరేషన్!

TG: హైదరాబాద్ నగరంలో దశాబ్దాలుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ నీటి దందాపై హైడ్రా పక్కా ప్లాన్‌తో దాడి చేసింది. సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లోని ఇళ్లనే అడ్డాగా చేసుకుని అక్రమంగా నీటిని తోడేస్తున్నారన్న సమాచారంతో అధికారులు చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ ఇప్పుడు నగరవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఎవరూ కనిపెట్టకుండా ఉండేందుకు ఏకంగా పడుకునే బెడ్‌రూమ్‌లు, వంటగదులు, నీళ్ల సంపుల్లోనే భారీ బోర్లు వేసి కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్న కేటుగాళ్ల గుట్టును అధికారులు మీడియా సమక్షంలోనే రట్టు చేశారు.జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, జలమండలి సిబ్బందిని కలుపుకుని హైడ్రా టీమ్ శనివారం తెల్లవారుజామున 6:30 గంటలకే సున్నం చెరువు చెంత రంగంలోకి దిగింది. ఇళ్ల లోపల భారీ మోటార్లతో బోర్లు వేసి, అక్కడి నుంచి వందల మీటర్ల మేర భూమి అడుగున పైపులు పరిచి నీటిని మరో ప్రాంతానికి గుంజేస్తున్నారు.

కరెంటు విషయంలో పచ్చి అబద్ధాలు - సీఎం రేవంత్ పై నిప్పులుతెలంగాణSwechaa24 Oct 2026, 08:23 PM

కరెంటు విషయంలో పచ్చి అబద్ధాలు - సీఎం రేవంత్ పై నిప్పులు

Jagadish Reddy: కొందామన్నా కూడా మార్కెట్ లో కరెంటు దొరకడం లేదు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కరెంటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారు అంటూ నిప్పులు చెరిగారు. బయట మార్కెట్ లో కరెంట్ యూనిట్ ధర రూ.2 నుండి రూ.7 లోపే దొరుకుతుంటే రూ.15 రూపాయలు పెట్టినా దొరకట్లేదని అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు.

కరెంట్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోందా?

ఇండియన్ ఎనర్జీ ఎక్స్‌ఛేంజ్ ప్రకారం యూనిట్ ధర రూ.3.97 నుండి రూ.6.74 మధ్య కరెంట్ అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. రాత్రి పూట రూ. 1.90 కూడా యూనిట్ కరెంటు దొరుకుతుందని వెల్లడించారు. అయితే యూనిట్ కు 15 రూపాయలు చెల్లించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా మార్కెట్ లో విద్యుత్ దొరకడం లేదు అంటూ సీఎం రేవంత్ అబద్ధాలు ఆడుతున్నారని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కరెంట్ అంటే ఏంటో.. కరెంట్ ఇవ్వడం ఎంత కష్టమో ఇప్పుడు అర్థమవుతోందా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారాయన. ఒకానొక కాలంలో గుజరాత్‌తో సహా దేశం మొత్తం కరెంట్ సంక్షోభం ఉన్నా.. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కేసీఆర్ కరెంట్ పోనియ్యలేదని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

TG: సోమాజిగూడ బార్‌లో గన్ కలకలం.. కాల్చేస్తా అంటూ బెదిరింపులుతెలంగాణSwechaa24 Oct 2026, 08:12 PM

TG: సోమాజిగూడ బార్‌లో గన్ కలకలం.. కాల్చేస్తా అంటూ బెదిరింపులు

TG: హైదరాబాద్ నడిబొడ్డున అర్ధరాత్రి పూట తుపాకీతో ఒక యువకుడు చేసిన రచ్చ తీవ్ర కలకలం రేపింది. సోమాజిగూడలోని ఫేమస్ ‘హెడ్ క్వార్టర్స్ బార్ అండ్ రెస్టారెంట్’లో ఈ సీన్ వెలుగు చూసింది. బార్‌లో తిని తాగిన తర్వాత బిల్లు కట్టడమే కాకుండా.. మళ్లీ లోపలికి వచ్చి ఆ కట్టిన బిల్లు డబ్బులను వెంటనే వెనక్కి ఇచ్చేయాలంటూ గన్ తీసి బెదిరించడం అందరినీ షాక్‌కు గురిచేసింది.అసలేం జరిగిందంటే.. బార్‌లో బిల్లు కట్టే విషయంలో సిబ్బందితో మహమ్మద్ షానవాజ్ (24) అనే యువకుడు అర్ధరాత్రి వేళ గొడవకు దిగాడు. మాటా మాటా పెరగడంతో కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు.. బయట పార్క్ చేసి ఉన్న తన థార్ కారు దగ్గరికి వెళ్లి అందులోంచి రివాల్వర్ బయటకు తీశాడు.

Mahesh Babu: బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేస్తున్న సూపర్ స్టార్!సినిమాSwechaa24 Oct 2026, 07:41 PM

Mahesh Babu: బాలీవుడ్ సినిమాలను రిజెక్ట్ చేస్తున్న సూపర్ స్టార్!

Mahesh Babu: మన టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంతో క్రేజ్. ఎలాగైనా అక్కడ స్ట్రైట్ సినిమాలను చేయాలని చాలా ప్రయత్నిస్తుంటారు. నేరుగా అడగలేక అక్కడ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ద్వారా రాయబారం పంపి హిందీ ఆఫర్స్ గురించి ఆరా తీస్తుంటారు. కానీ, మన టాలీవుడ్‌లో ఒకే ఒక్క స్టార్ హీరో మాత్రం అసలు హిందీ సినిమా అంటే ఆమడ దూరం ఉంటాడు. ఆయనే సూపర్ స్టార్ మహేష్ బాబు.

TG: హైదరాబాద్‌లో నీటి వృథాపై కఠిన ఆంక్షలు.. రూల్స్ దాటితే రూ.5 వేలు ఫైన్!తెలంగాణSwechaa24 Oct 2026, 07:37 PM

TG: హైదరాబాద్‌లో నీటి వృథాపై కఠిన ఆంక్షలు.. రూల్స్ దాటితే రూ.5 వేలు ఫైన్!

TG: హైదరాబాద్ నగరంలో తాగునీరు వృథా కాకుండా చూసేందుకు జలమండలి అధికారులు కఠిన ఆంక్షలు పెట్టారు. ముఖ్యంగా నగరంలో తిరిగే వాటర్ ట్యాంకర్ల నుంచి రోడ్ల మీద నీళ్లు కారిపోవడంపై జలమండలి ఎండీ అశోక్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ట్యాంకర్ల నుంచి ఒక్క చుక్క నీరు కూడా వృథా కావడానికి వీల్లేదని, రూల్స్ గాలికొదిలేస్తే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు.ట్యాంకర్ల ద్వారా నీటిని వృథా చేస్తే నవంబర్ 1 నుంచి ఏకంగా రూ.5 వేల జరిమానా ఫైన్ వేయబోతున్నట్లు తెలిపారు. ఒకవేళ మొదటిసారి ఫైన్ పడ్డా కూడా తీరు మార్చుకోకుండా అదే ట్యాంకర్ మళ్లీ పట్టుబడితే.. ఏకంగా ఆ ట్యాంకర్ రిజిస్ట్రేషన్‌నే రద్దు చేస్తామని ఎండీ స్పష్టం చేశారు. తాగునీటి విలువ తెలియకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని అధికారులు తేల్చేశారు.

సీఎం రేవంత్.. నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దుతెలంగాణSwechaa24 Oct 2026, 07:15 PM

సీఎం రేవంత్.. నిరుద్యోగ యువత భవిష్యత్తును బలి చేయొద్దు

TGPSC AEE Exam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీమంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఇంజినీరింగ్ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీయొద్దని హరీశ్ రావు కోరారు. నవంబర్ 6న జరగనున్న TGPSC AEE (సివిల్) పరీక్షను వెంటనే వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. SSC JE, TGPSC AEE పరీక్షలు ఒకే తేదీలో ఉండటంతో వేలాది మంది తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారని హరీశ్ రావు వాపోయారు.

సొంత జిల్లా రైతాంగానికే ద్రోహం- సీఎం రేవంత్‌పై డీకే అరుణ నిప్పులుతెలంగాణSwechaa24 Oct 2026, 07:14 PM

సొంత జిల్లా రైతాంగానికే ద్రోహం- సీఎం రేవంత్‌పై డీకే అరుణ నిప్పులు

Dindi: సీఎం రేవంత్ రెడ్డిపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రజల ఆశీర్వాదంతో సీఎం కుర్చీ దక్కించుకున్న రేవంత్ రెడ్డి.. నాడు కేసీఆర్ పాలమూరు మెడకు వేసిన ‘డిండి ఉరితాడు’ను ఇప్పుడు బిగించే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరిట పాలమూరు జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ తో కలిసి నిర్వహించిన నీటిపారుదల సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు చూస్తుంటే ముఖ్యమంత్రికి ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఏమాత్రం ప్రేమ లేదని స్పష్టమవుతోందని ఫైరయ్యారు.

brs: కారులో గ్రూపు రాజకీయాలు.. కేటీఆర్ క్లాసులు పనిచేస్తాయా?తెలంగాణSwechaa24 Oct 2026, 06:13 PM

brs: కారులో గ్రూపు రాజకీయాలు.. కేటీఆర్ క్లాసులు పనిచేస్తాయా?

brs: గులాబీ గూటిలో ఎప్పటినుంచో సాగుతున్న వర్గపోరు, అంతర్గత కుమ్ములాటలకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గట్టిగానే నడుం బిగించారు. ఒకే పార్టీలో ఉంటూ పక్క నియోజకవర్గంలో సొంత పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు తెరవెనుక గోతులు తవ్వే పద్ధతికి ఇక కాలం చెల్లిందని నేతలకు తేల్చి చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు పెట్టిన క్లాస్ పార్టీ శ్రేణుల్లో కాస్త చలనం తీసుకురావడంతో, అదే ఫార్ములాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన గ్రూపు తగాదాలను కేటీఆర్ ఇచ్చే వార్నింగ్‌లు ఎంతవరకు కట్టడి చేస్తాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.

bjp : ఓసీ, బీసీ లెక్కలతో సరికొత్త ఎత్తుగడ.. బీజేపీ గెలుపు గుర్రాలు వీరేనా?తెలంగాణSwechaa24 Oct 2026, 06:10 PM

bjp : ఓసీ, బీసీ లెక్కలతో సరికొత్త ఎత్తుగడ.. బీజేపీ గెలుపు గుర్రాలు వీరేనా?

bjp : తెలంగాణలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పక్కా ప్లాన్‌తో బీజేపీ పావులు కదుపుతోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి కేడర్‌లో పూర్తిస్థాయిలో జోష్ నింపేందుకు ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా పరిగణిస్తూ అధిష్టానం గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టింది. ఒకవైపు ఓటర్ల నమోదు ప్రక్రియను పరుగులు పెట్టిస్తూనే, మరోవైపు సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించింది. రెండు స్థానాల్లో ఒకచోట ఓసీ, మరోచోట బీసీ అభ్యర్థిని బరిలోకి దించి విజయం సాధించాలనే వ్యూహంతో కమలనాథులు ముందుకెళ్తున్నారు.పార్టీ అంతర్గత సమాచారం ప్రకారం.. సామాజిక సమీకరణాల లెక్కలతో ఇద్దరు కీలక నేతల పేర్లను బీజేపీ పెద్దలు పరిశీలిస్తున్నారట. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి ఓసీ కోటాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది.

Tollywood: అందుకే కన్నడ హీరోయిన్స్ అంటే మనవాళ్లు ఎంకరేజ్ చేసేది!సినిమాSwechaa24 Oct 2026, 06:10 PM

Tollywood: అందుకే కన్నడ హీరోయిన్స్ అంటే మనవాళ్లు ఎంకరేజ్ చేసేది!

Tollywood: సౌత్ సినిమా ఇండస్ట్రీలలో మన టాలీవుడ్, కోలీవుడ్ కంటే కూడా సినిమాల మేకింగ్ పరంగా..నటీనటుల రెమ్యూనరేషన్స్ పరంగా శాండిల్‌వుడ్ లో చాలా తక్కువ. కేజీఎఫ్ సిరీస్ రాకముందు అక్కడ భారీ బడ్జెట్ సినిమా అంటే 10 కోట్ల లోపే ఉండేది. కానీ, ఇప్పుడు వాళ్ళు కూడా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ ప్రపంచవ్యాప్తంగా కన్నడ సినిమాకి అసాధారణ పాపులారిటీ వచ్చింది.

Venkatesh: 100 కోట్లకి తగ్గని సీనియర్ హీరో!సినిమాSwechaa24 Oct 2026, 05:27 PM

Venkatesh: 100 కోట్లకి తగ్గని సీనియర్ హీరో!

Venkatesh: మన సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ సినిమాల పరంగా చాలా దూకుడుగా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో వెంకీ చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దీంతో, సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున లలో చూసుకుంటే ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న హీరో వెంకీమామనే. అంతేకాదు, అసలు గ్యాప్ లేకుండా సినిమాలను లైనప్ చేస్తున్నాడు.

rice price hike: తెలంగాణలో ‘ఎల్‌నినో’ పేరుతో వ్యాపారుల దోపిడీ.. పట్టించుకోని ప్రభుత్వం..!NationalSwechaa24 Oct 2026, 05:12 PM

rice price hike: తెలంగాణలో ‘ఎల్‌నినో’ పేరుతో వ్యాపారుల దోపిడీ.. పట్టించుకోని ప్రభుత్వం..!

rice price hike: నిత్యావసర సరుకుల ధరలతో ఇప్పటికే విలవిల్లాడుతున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలకు బియ్యం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వంటింట్లో అన్నం ముద్ద దిగకుండా సన్న బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మార్కెట్లో సూపర్ ఫైన్ రకం సన్న బియ్యం కిలో ధర ఏకంగా రూ.90 నుంచి రూ.95కు చేరుకుంది. ధరల పెరుగుదల చూస్తుంటే త్వరలోనే కిలో వంద రూపాయల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. కేవలం ఒక్క వారంలోనే 25 కిలోల బస్తాపై రూ.450 వరకు పెంచేయడం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.జూలై నుంచి క్రమంగా పెరుగుతున్న ధరలు అక్టోబర్ నాటికి ఊహించని స్థాయికి చేరాయి. ప్రీమియం రకంగా పేరున్న 'జై శ్రీరామ్' రకం బియ్యం జూన్‌లో క్వింటాల్ ధర రూ.5,600 నుంచి రూ.6,300 మధ్య ఉండగా, ప్రస్తుతం క్వాలిటీని బట్టి ఏకంగా రూ.8,400 నుంచి రూ.9,200 వరకు పలుకుతోంది.

జీవితంలో చదువుతో పాటు ‘క్యారెక్టర్’ ముఖ్యం: వెంకీ మామ కామెంట్స్ వైరల్!వైరల్ న్యూస్Swechaa24 Oct 2026, 05:11 PM

జీవితంలో చదువుతో పాటు ‘క్యారెక్టర్’ ముఖ్యం: వెంకీ మామ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేశ్ విద్యార్థులకు, యువతకు సంబంధించిన పలు ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ వేడుకకు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన చేసిన సరదా కామెంట్స్, సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కాలేజీ రోజులు ప్రతీ ఒక్కరి జీవితంలోనూ అత్యంత మధురమైనవని, ఆ 3-4 ఏళ్ల ప్రయాణాన్ని విద్యార్థులు పూర్తిస్థాయిలో ఆస్వాదించాలని వెంకటేశ్ సూచించారు.

డిసెంబర్ 15నుండి నీటి కష్టాలు..! కాలనీలు, బస్తీలలో మొబైల్ మైక్‌ల ద్వారా ప్రచారంతెలంగాణSwechaa24 Oct 2026, 04:23 PM

డిసెంబర్ 15నుండి నీటి కష్టాలు..! కాలనీలు, బస్తీలలో మొబైల్ మైక్‌ల ద్వారా ప్రచారం

Save Water: ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎల్ నినో కరోనా లాంటి విపత్తు అని.. ముందు ముందు రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయని హెచ్చరించారు ముఖ్యమంత్రి రేవంత్. సాగునీటి సంగతి దేవుడెరుగు.. తాగేందుకు కూడా చుక్క నీరు దొరకని పరిస్థితి రాబోతోందన్నారు. ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ క్రమంలో నీటిని, విద్యుత్ ను అత్యంత పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

TG: లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్.. హైదరాబాద్ పవర్ గ్రిడ్ ఆఫీస్‌లో కలకలం!తెలంగాణSwechaa24 Oct 2026, 04:21 PM

TG: లేడీస్ వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్.. హైదరాబాద్ పవర్ గ్రిడ్ ఆఫీస్‌లో కలకలం!

TG: హైదరాబాద్ కవాడిగూడలోని పవర్ గ్రిడ్ ఆఫీస్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆడవాళ్ల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్ పెట్టి వీడియోలు తీస్తున్న ఓ అటెండెంట్ బాగోతం తాజాగా బయటపడింది. వాష్‌బేసిన్ కింద పక్కాగా ఫోన్ దాచిపెట్టి దొరికిపోవడంతో ఆఫీస్‌లో పెద్ద రచ్చే జరిగింది.అక్టోబర్ 13న ఓ మహిళా ఉద్యోగిని వాష్‌రూమ్‌లోకి వెళ్లి చూడగా.. వాష్‌బేసిన్ కింద ఏదో ఉన్నట్లు అనుమానం వచ్చింది. దగ్గరికెళ్లి చూస్తే డబుల్ సైడెడ్ టేప్‌తో అతికించి ఉన్న ఒక మొబైల్ ఫోన్ కనిపించింది. వెంటనే ఆమె ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని బయటకు వచ్చి, అక్కడే ఉన్న ఫ్లోర్ అటెండెంట్ భరత్‌ను "ఈ ఫోన్ ఎవరిది?" అని నిలదీసింది. తన నిర్వాకం బయటపడిందని తెలియగానే భరత్ ఆమె చేతిలోని ఫోన్‌ను లాక్కుని ఒక్కసారిగా పరుగెత్తాడు. మిగతా ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి ఆయనను పట్టుకున్నారు.

టార్గెట్ తుమ్మిడిహెట్టి.. సీఎం రేవంత్ ముంబై పర్యటన ఫిక్స్తెలంగాణSwechaa24 Oct 2026, 03:09 PM

టార్గెట్ తుమ్మిడిహెట్టి.. సీఎం రేవంత్ ముంబై పర్యటన ఫిక్స్

తెలంగాణలోని సాగు,తాగు నీటి రంగానికి ప్రాణం పోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఎప్పటినుంచే ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఎలాంటి ఎత్తిపోతలు లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపి అక్కడి నుంచి హైదరాబాద్‌కు నీటిని సరఫరా చేయాలని చూస్తోంది.ఈ క్రమంలోనే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తులో నిర్మించాలని చూస్తోంది. అందుకు మహారాష్ట్ర సర్కార్ అభ్యంతరం చెబుతోంది. ముంపు ప్రభావం తమకు ఎక్కువగా ఉంటుందని,అందుకు సమ్మతించబోమని గతంలో పేర్కొంది.ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల బృందం వచ్చే సోమవారం ముంబైలో పర్యటించనుంది.

రేవంత్ సర్కారుకు జల గండం..!  కన్నెపల్లికి బీఆర్ఎస్ బృందం!టాప్ న్యూస్Swechaa24 Oct 2026, 02:43 PM

రేవంత్ సర్కారుకు జల గండం..! కన్నెపల్లికి బీఆర్ఎస్ బృందం!

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో తీవ్ర కరువు రాబోతుందని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం అందుకు సంసిద్ధంగా ఉండాలని సంకేతాలు ఇస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, నీరు, విద్యుత్ వృథా చేయకూడదని చెబుతోంది. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిక కురవకపోవడంతో జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోతున్నాయి. మరోవైపు జల విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిచిపోయింది. దీంతో కేవలం థర్మల్ విద్యుత్ పైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. వేసవి రాకముందే ఎండలు తీవ్రతరం కావడంతో విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది. దీంతో కరెంట్ కోతలు మొదలయ్యాయి. ఓవైపు సాగు నీరు లేక, మరోవైపు కరెంట్ కోతల కారణంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

reliance jio: ఉచిత డేటాతో మొదలై.. దేశంలోనే అతిపెద్ద ఐపీవో వైపు రిలయన్స్ జియో ప్రస్థానం!NationalSwechaa24 Oct 2026, 02:39 PM

reliance jio: ఉచిత డేటాతో మొదలై.. దేశంలోనే అతిపెద్ద ఐపీవో వైపు రిలయన్స్ జియో ప్రస్థానం!

reliance jio: ఒకప్పుడు భారత్‌లో మొబైల్ ఇంటర్నెట్ వాడకం అంటే ఒక విలాసవంతమైన అంశం. నెలకు ఒక జీబీ డేటా కోసం రూ.250 నుంచి రూ.300 వరకు ఖర్చు పెడుతూ, ఇంటర్నెట్ ఆన్ చేయడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచించే రోజులు అవి. సరిగ్గా పదేళ్ల క్రితం.. 2016 సెప్టెంబరులో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో భారత టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది. అప్పటివరకు స్థిరపడిన పాత రూల్స్‌ను, టెలికాం గుత్తాధిపత్యాన్ని ఒక్క దెబ్బతో తుడిచిపెట్టేసింది. ఫ్రీ కాలింగ్, అపరిమిత హై-స్పీడ్ డేటా అంటూ మొదలైన జియో ప్రయాణం.. నేడు దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారి, భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ఐపీవో దిశగా అడుగులు వేస్తోంది.

రాజీవ్ గాంధీతో అమర ప్రేమకథ.. జ్ఞాపకాలను పంచుకున్న సోనియా!NationalSwechaa24 Oct 2026, 02:26 PM

రాజీవ్ గాంధీతో అమర ప్రేమకథ.. జ్ఞాపకాలను పంచుకున్న సోనియా!

మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీతో తనకున్న అరుదైన, సుదీర్ఘమైన అనుబంధం, అనురాగాన్ని గుర్తుచేసుకుంటూ కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ అత్యంత భావోద్వేగపూర్వక పోస్ట్‌ను షేర్ చేశారు. సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' (X) లో అడుగుపెట్టిన సందర్భంగా ఆమె తన తొలి సందేశంగా ఈ జ్ఞాపకాలను పంచుకున్నారు. నవంబర్ 10న విడుదల కాబోతున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకానికి సంబంధించి ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేస్తూ, రాజీవ్ గాంధీతో తన 'ప్రేమ ప్రయాణం' ఎలా ప్రారంభమైందో వివరించారు.

యూరప్‌లో ఎండల బీభత్సం: రికార్డు ఉష్ణోగ్రతలకు 50 వేల మంది బలిInternationalSwechaa24 Oct 2026, 02:05 PM

యూరప్‌లో ఎండల బీభత్సం: రికార్డు ఉష్ణోగ్రతలకు 50 వేల మంది బలి

యూరప్ ఖండంలో ఈ ఏడాది వేసవి కాలం అత్యంత వినాశకరమైన రీతిలో తీవ్ర ప్రాణనష్టంతో ముగిసింది. ఎండల తీవ్రత సాధారణ స్థాయిలను మించిపోవడంతో పలు దేశాల్లోని పట్టణ ప్రాంతాలు విపరీతమైన ఉక్కబోత, వడగాల్పులతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల ధాటికి ప్రజల సాధారణ జీవనం పూర్తిగా అస్తవ్యస్తం కావడమే కాక, భారీ సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. తీవ్రమైన వేడిని తట్టుకోలేక వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ వేత్తలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా విధ్వంసకర బ్యాటర్క్రీడలుSwechaa24 Oct 2026, 01:57 PM

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా విధ్వంసకర బ్యాటర్

ఐపీఎల్-2027 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. జట్టు ప్రధాన హెడ్ కోచ్‌గా వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ కీరన్ పొలార్డ్‌ను నియమిస్తూ శనివారం అధికారిక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుంది. అయితే, ఐదునెలల ముందునే ముంబై జట్టులో కీలక మార్పులకు యాజమాన్యం శ్రీకారం చుట్టింది.ఎందుకంటే గత ఐదు సీజన్లలో ముంబై ఇంతవరకు టైటిల్ గెలవలేకపోయింది. ఇప్పటి నుంచి మార్పులు చేస్తేనే టోర్నీ ప్రారంభమయ్యాక జట్టు మంచి ప్రతిభను కనబరుస్తుందని ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

వనాటు దీవుల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!InternationalSwechaa24 Oct 2026, 01:38 PM

వనాటు దీవుల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ!

దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప దేశమైన 'వనాటు' (Vanuatu) తీర ప్రాంతంలో శనివారం ఉదయం అత్యంత భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైనట్లు అమెరికా భూగర్భ పరిశోధన సంస్థ (USGS), పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించాయి. భూకంప కేంద్రం సముద్ర గర్భంలో కేవలం 10 కిలోమీటర్ల తక్కువ లోతులో కేంద్రీకృతమై ఉండటంతో సమీప తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచివుందంటూ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ తొలుత హెచ్చరికలు జారీ చేసింది.

సముద్ర తీరంలో 16 అడుగుల భారీ చేప.. మరో ప్రళయం రాబోతోందా?!InternationalSwechaa24 Oct 2026, 01:30 PM

సముద్ర తీరంలో 16 అడుగుల భారీ చేప.. మరో ప్రళయం రాబోతోందా?!

 సముద్రపు అగాధాల నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఓ అరుదైన భారీ జీవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు కారణమవుతోంది. దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశానికి చెందిన 'అరికా' (Arica) బీచ్ తీరంలో సుమారు 16 అడుగుల భారీ పొడవున్న అరుదైన 'ఓర్‌ఫిష్' (Oarfish) ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దీంతో స్థానికులు, పర్యాటకులు తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు. సాధారణంగా ఈ చేపను ‘డూమ్స్‌డే ఫిష్’ (Doomsday Fish) లేదా ‘ప్రళయ చేప’ అని పిలుస్తుంటారు. సముద్ర గర్భంలో నివసించే ఈ చేప తీరానికి వస్తే త్వరలోనే భారీ భూకంపాలు, తీవ్ర సునామీలు విరుచుకుపడతాయనే నమ్మకం కొన్ని దేశాల్లో పూర్వీకుల నుంచి గట్టిగా నమ్ముతున్నారు.