స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

అన్నదాతపై దాడి.. గజ్వేల్ ఎస్ఐ‌ మల్లారెడ్డిపై వేటుతెలంగాణSwechaa24 Oct 2026, 01:22 PM

అన్నదాతపై దాడి.. గజ్వేల్ ఎస్ఐ‌ మల్లారెడ్డిపై వేటు

యువరైతు భీమరి రవి మీద దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న గజ్వేల్‌ టౌన్‌ పోలీస్‌‌స్టేషన్‌ ఎస్ఐ మల్లారెడ్డిపై వేటు పడింది.తీవ్ర రక్తస్రావంతో గజ్వేల్ పీఎస్‌లో ఉండి యువరైతు మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించారు.ఆయనను సీఏఆర్‌ (CAR) హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సమస్య పరిష్కరించాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన రైతు మీద దాడి చేస్తారా? అంటూ ప్రతిపక్షాలు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రైతులపై దాడులు.. కాంగ్రెస్ పాలనలో అన్నదాత బతుకే ప్రశ్నార్థకం :  హరీశ్ రావుతెలంగాణSwechaa24 Oct 2026, 01:02 PM

రైతులపై దాడులు.. కాంగ్రెస్ పాలనలో అన్నదాత బతుకే ప్రశ్నార్థకం : హరీశ్ రావు

రాష్ట్రంలో అన్నదాతల మీద పోలీసుల దాడులు పెరుగుతున్నాయి. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఓ రైతు పట్ల ఎస్ఐ కర్కశంగా వ్యవహరించారు. తప్పు ఎవరిదో ఆరా తీయకుండా విచక్షణా రహితంగా దాడికి పాల్పడటంతో పాటు దుర్బాషలాడినట్టు కూడా తెలుస్తోంది.ఎస్ఐ దాడిలో సదరు రైతు తలకు తీవ్ర రక్తస్రావం జరిగింది. గజ్వేల్‌కు చెందిన భీమరి రవి అనే యువరైతు తన సమస్య చెప్పుకునేందుకు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. తన వ్యవసాయ పొలంలో పంట సాగు విషయంలో పొరుగువారితో వివాదం తలెత్తిన నేపథ్యంలో సమస్యను పరిష్కరించుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే కరెంటు ఎప్పుడు వస్తుందని ఎస్ఐ అడుగగా తనకు తెలియదని సమాధానం ఇచ్చానని బాధితుడు రవి పేర్కొన్నాడు. దీంతో పీకడానికి వ్యవసాయం చేస్తున్నావా? అంటూ ఎస్ఐ తనను కొట్టాడని, రక్తం కారుతున్నా కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లకుండా స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.

భర్త మిస్సింగ్ కేసులో ట్విస్ట్..ఇంట్లో దొంగ నోట్ల ప్రింటింగ్!NationalSwechaa24 Oct 2026, 12:35 PM

భర్త మిస్సింగ్ కేసులో ట్విస్ట్..ఇంట్లో దొంగ నోట్ల ప్రింటింగ్!

కనిపించకుండా పోయిన వ్యక్తి ఇంట్లో భారీ ఎత్తున దొంగ నోట్లను ముద్రించే సెటప్‌ను పోలీసులు కనిపెట్టారు. ఈ ఘటన కేరళంలో చోటుచేసుకుంది.కొల్లాం సిటీ పరిధిలోని వాడి, కల్లెలివయల్‌కు చెందిన సిబియాన్ అనే వ్యక్తి ఈనెల 16న అదృశ్యమయ్యాడు. దీంతో అతని భార్య టిన్సీ పల్లితోట్టం పీఎ‌స్‌లో మిస్సింగ్ కేసు ఫైల్ చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, కొల్లాం సిటీ యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ బృందం శనివారం సిబియాన్ ఇంట్లో ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో సుమారు రూ. 2.5 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని ముద్రించేందుకు ఉపయోగించిన అత్యాధునిక ప్రింటింగ్ యంత్రాలు, ప్రత్యేక కాగితాలు, రసాయనాలు, సంబంధిత సామగ్రిని చూసి పోలీసులు, నార్కోటిక్ బృందాలు కంగు తిన్నాయి. దీంతో విచారణ స్పీడప్ చేసిన పోలీసులు వెంటనే సిబియాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

మహబూబ్‌నగర్‌లో అమానుషం..రైతు చొక్కా పట్టుకుని లాక్కెళ్లి ఎస్ఐ దాడితెలంగాణSwechaa24 Oct 2026, 12:16 PM

మహబూబ్‌నగర్‌లో అమానుషం..రైతు చొక్కా పట్టుకుని లాక్కెళ్లి ఎస్ఐ దాడి

మహబూబ్ నగర్ జిల్లాలో ఓ రైతు తనకు న్యాయంగా రావాల్సిన పరిహారం కోసం ప్రభుత్వానికి ఎదురుతిరిగాడు. జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ గ్రామంలో రిజర్వాయర్ కోసం నర్సింహులు అనే రైతు 1.28 ఎకరాల భూమిని ఇచ్చాడు. అందులో 20 గుంటలకు ఇంతవరకు పరిహారం రాలేదని ఆందోళన చెందాడు. అధికారులను ప్రశ్నించగా వారి నుంచి సమాధానం కరువైంది.దీంతో ఏం చేయాలో తెలియక తనకు పరిహారం వచ్చేంత వరకు ఆ 20 గుంటల భూమిలో సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం తనకు పరిహారం అందని 20 గుంటల్లో సాగు చేసేందుకు వెళ్లగా ప్రాజెక్టు కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించినట్టు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మల్లేశ్.. రైతు నర్సింహులుపై చేయి చేసుకుని, చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించాడు.ఈ క్రమంలోనే సదరు రైతు కాంట్రాక్టర్, పోలీసుల కాళ్లు మొక్కినట్టు తెలుస్తోంది.

మనదేం అమెరికా కాదు.. ఏసీ బస్టాండ్లు కట్టలేం: మంత్రి పొన్నం ప్రభాకర్తెలంగాణSwechaa24 Oct 2026, 12:15 PM

మనదేం అమెరికా కాదు.. ఏసీ బస్టాండ్లు కట్టలేం: మంత్రి పొన్నం ప్రభాకర్

 తెలంగాణలో ఆర్టీసి బస్టాండ్లు, రవాణా మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికారిక అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో శనివారం ఆయన మాట్లాడారు.  ప్రజా రవాణా వ్యవస్థ, ప్రయాణికుల వసతులపై మాట్లాడుతూ.. మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అమెరికా లాంటి అగ్రరాజ్యంలా ఉండదని, ప్రయాణికులందరికీ ఏసీ బస్టాండ్లు నిర్మించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

సంక్రాంతి తర్వాత 4నెలలు ప్రత్యేక ఉపాధి పథకం: సీఎం రేవంత్తెలంగాణSwechaa24 Oct 2026, 11:42 AM

సంక్రాంతి తర్వాత 4నెలలు ప్రత్యేక ఉపాధి పథకం: సీఎం రేవంత్

ఎల్‌నినో ప్రతికూల పరిణామాల వల్ల తెలంగాణ వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు అడుగంటి తీవ్ర నీటి కొరత తలెత్తే అవకాశమున్న నేపథ్యంలో ప్రభుత్వం పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత నుంచి మే నెల చివరి వరకు (నాలుగు నెలల పాటు) రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఒక 'ప్రత్యేక ఉపాధి పథకాన్ని' (Special Employment Scheme) అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రతినిధులు, అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేశారు.

అంతర్జాతీయ చెస్‌లో అద్భుతం.. చరిత్ర సృష్టించిన 11ఏళ్ల భారత సంతతి బాలిక!InternationalSwechaa24 Oct 2026, 11:21 AM

అంతర్జాతీయ చెస్‌లో అద్భుతం.. చరిత్ర సృష్టించిన 11ఏళ్ల భారత సంతతి బాలిక!

 విశ్వ చెస్ వేదికపై భారత సంతతికి చెందిన బ్రిటన్ చిచ్చరపిడుగు బోధన శివానందన్(11) సరికొత్త చరిత్ర లిఖించింది. చెస్ క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇంటర్నేషనల్ మాస్టర్’ (IM) హోదాను దక్కించుకున్న అతిపిన్న వయస్కురాలైన అమ్మాయిగా బోధన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కేవలం 11 ఏళ్ల 7 నెలల 16 రోజుల వయసులోనే ఆమె ఈ అరుదైన ఘనతను సాధించి అంతర్జాతీయ క్రీడా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది.  దశాబ్దాల క్రితం చెస్ దిగ్గజం జుడిత్ పోల్గర్ నెలకొల్పిన చారిత్రక రికార్డును దాటి బోధన కొత్త చరిత్ర సృష్టించింది.

హైదరాబాద్‌లో దారుణం.. శునకంపై  లైంగికదాడి!క్రైమ్Swechaa24 Oct 2026, 11:18 AM

హైదరాబాద్‌లో దారుణం.. శునకంపై లైంగికదాడి!

నేటి సమాజంలో మనుషులకే కాదు వీధి కుక్కులకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. మహిళలు, మైనర్లపై లైంగికదాడుల ఘటనలు పెరిగిపోతూనే ఉన్న క్రమంలో తాజాగా జంతువులపై కొందరు కామాంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తమ లైంగికవాంఛను తీర్చుకోవడానికి సమాజం అసహ్యించుకునే పనులకు పూనుకుంటున్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కొంపల్లిలోని సాయినగర్‌లోని మెఫెయిర్ లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న సంజయ్ తివారీ (50) అనే వ్యక్తి వీధి శునకంపై లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం .ఈ నెల 8వ తేదీన అపార్ట్‌మెంట్ ఆవరణలో తిరిగే ఒక ఆడ కుక్కను శాలువలో బంధించి తన సెక్యూరిటీ క్యాబిన్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది.సీసీ ఫుటేజీలో ఆ దృశ్యాలు రికార్డు అయినట్టు తెలుస్తోంది.

సముద్రంలో ఇంటర్నెట్ కేబుళ్లు కట్ చేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!InternationalSwechaa24 Oct 2026, 11:02 AM

సముద్రంలో ఇంటర్నెట్ కేబుళ్లు కట్ చేస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్!

 అమెరికా, ఇరాన్ మధ్య దశాబ్దాల శత్రుత్వం మళ్లీ క్లైమాక్స్‌కు చేరుకుని, మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధ మేఘాలు అలముకుంటున్నాయి. ఇరాన్‌పై మరోసారి బలమైన సైనిక దాడి చేపట్టేందుకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే గనుక జరిగితే గల్ఫ్ ప్రాంతంలో సముద్ర గర్భంలో ఉన్న సమాచార ఇంటర్నెట్ కేబుళ్లను (Subsea Internet Cables) పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇరాన్ తీవ్రస్థాయిలో ప్రతిహెచ్చరికలు జారీ చేసింది. ఈ అనూహ్య పరిణామాలతో పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేనంత తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

సింఘమ్ నెట్‌వర్క్.. భారత్‌లో ఏం జరుగుతోంది? ఎవరీ నెవిల్ రాయ్?NationalSwechaa24 Oct 2026, 10:56 AM

సింఘమ్ నెట్‌వర్క్.. భారత్‌లో ఏం జరుగుతోంది? ఎవరీ నెవిల్ రాయ్?

వందల మిలియన్ డాలర్ల వ్యాపారం. ప్రపంచవ్యాప్తంగా సంస్థలతో సంబంధాలు. చైనా కేంద్రంగా సాగుతున్న కార్యకలాపాలపై ఆరోపణలు. భారత్‌లో ఒక డిజిటల్ న్యూస్ సంస్థ చుట్టూ చెలరేగిన వివాదం. ఈ పరిణామాలన్నింటి మధ్య మరోసారి వినిపిస్తున్న పేరు నెవిల్ రాయ్ సింఘమ్. ఎవరీ వ్యక్తి..?

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేతక్రైమ్Swechaa24 Oct 2026, 10:50 AM

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎలాంటి అనుమతులు, సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. వివరాల్లోకివెళితే..రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న విదేశీ కరెన్సీ ముఠా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎయిర్ పోర్టులోని డిపాచర్ సెక్షన్‌లో నిఘా పెట్టిన డీఆర్‌ఐ అధికారులు.. మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లేందుకు సిద్ధమైన ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుంది.అనుమానంతో వారి బ్యాగులను స్కానింగ్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేయగా, అందులో రహస్య గదుల వలే ర్యాక్స్ ఏర్పాటు చేసి దాచిన విదేశీ కరెన్సీ నోట్ల కట్టలు వెలుగుచూశాయి.

ఒకటో తేదీన జీతాలు..  ప్రచారానికే పరిమితమా?తెలంగాణSwechaa24 Oct 2026, 10:27 AM

ఒకటో తేదీన జీతాలు.. ప్రచారానికే పరిమితమా?

రాష్ట్రంలోని మత్స్యశాఖలో పనిచేస్తున్న కిందిస్థాయి ఉద్యోగులకు వేతనాలు రావడం లేదని తెలుస్తోంది. మూడు నెలలుగా జీతాలు లేక మత్స్యశాఖ ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అటెండర్లతో పాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాలేదని సమాచారం. ఒకటో తారీఖున వేతనాలు ఇవ్వాలని జీవో జారీ చేసినట్టు ఉన్నతాధికారులు చెబుతున్నా.. తమకు మాత్రం ఇంతవరకు జీతాలు రాలేదని ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అలవెన్సులు రాక క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్లు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది.

విషాదం.. కోతుల గుంపు వెంబడించడంతో 12ఏళ్ల బాలుడి మృతి!క్రైమ్Swechaa24 Oct 2026, 10:16 AM

విషాదం.. కోతుల గుంపు వెంబడించడంతో 12ఏళ్ల బాలుడి మృతి!

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊహించని రీతిలో కోతుల గుంపు ఒక్కసారిగా వెంబడించడంతో తీవ్రమైన భయాందోళనకు గురై, గుండె ఆగి ఓ 12 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు, పోలీసుల సమాచారం ప్రకారం.. వల్లాపురం గ్రామానికి చెందిన మొక్క వీరబాబు దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. వీరి కుమారుడు మొక్క నిశాంత్ గౌడ్ (12) దసరా సెలవులను ఆనందంగా గడిపేందుకు అమ్మమ్మ ఇంటికి వచ్చాడు.

ఎన్ని లక్షల కోట్లు అయితే సరిపోతాయి సర్?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa24 Oct 2026, 09:36 AM

ఎన్ని లక్షల కోట్లు అయితే సరిపోతాయి సర్?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన మూడేళ్లు ముగియకముందే అవినీతిపై ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి. ఏ శాఖలో చూసినా డబ్బులు తప్ప, మన డ్యూటీ మనం చేశామా అనే ఆలోచన ఏ ఒక్క ఉద్యోగికి లేదు. అందులో సీఎం నిర్వహించే శాఖలో కొట్టొచ్చినట్లు అనేకం కనిపిస్తున్నాయి. హెల్ప్ చేసిన వాళ్లకు దోచిపెడుతున్న సంఘటనలు చూస్తే ఇదేం పాలన, ఈ కాంగ్రెస్ ఉంటే ఎంత, ఊడితే ఎంత అన్నట్లుగా ప్రజాస్వామ్య వాదులకు అనిపిస్తోంది.

మెడికోవర్ మీది కాదా?

కేసీఆర్ ప్రారంభించారు. కిషన్ రెడ్డి ఓపెనింగ్ చేశారు. నేను ప్రారంభిస్తే నాది అవుతుందా అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కానీ, అందులో డైరెక్టర్స్ మెడికల్ మాఫియాకు నిదర్శనం. ఆనాడు కేసీఆర్ సొంత కులానికి దోచిపెట్టేలా ఒక్క యశోదనే బతికేలా చేసి 300 శాతం లాభాలకు తీసుకొచ్చారు. దాన్ని ఫారెన్ కంపెనీలకు అమ్ముకుని వైట్ చేసుకున్నారు.

📜 చరిత్రలో ఈరోజు – అక్టోబర్ 24: నేటి ప్రాధాన్యతలివే!InternationalSwechaa24 Oct 2026, 09:01 AM

📜 చరిత్రలో ఈరోజు – అక్టోబర్ 24: నేటి ప్రాధాన్యతలివే!

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

1945: ఐక్యరాజ్యసమితి (UN) అధికారిక ఆవిర్భావం.

1901: నయాగరా జలపాతాన్ని బారెల్‌లో విజయవంతంగా దాటిన తొలి మహిళ.

1964: బ్రిటన్ పాలన నుండి జాంబియా దేశానికి స్వాతంత్ర్యం.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

1945: ఐక్యరాజ్యసమితి (UN) అధికారికంగా అస్తిత్వంలోకి వచ్చింది.

1919: న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీ పతనంతో ప్రపంచవ్యాప్తంగా మహా ఆర్థిక మాంద్యం ప్రారంభమైంది.

1964: జాంబియా దేశం బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందింది.

🚀 సైన్స్ & అడ్వెంచర్

1861: మొదటి ఖండాంతర టెలిగ్రాఫ్ వ్యవస్థను వెస్ట్రన్ యూనియన్ పూర్తి చేసింది.

1901: అన్నీ ఎడ్సన్ టేలర్ అనే మహిళ మొదటిసారిగా బారెల్‌లో కూర్చుని నయాగరా జలపాతాన్ని విజయవంతంగా దాటింది.

1931: న్యూయార్క్‌లో ప్రసిద్ధ జార్జ్ వాషింగ్టన్ బ్రిడ్జ్ ప్రారంభించబడింది.

2007: చైనా తన మొట్టమొదటి చంద్రయాన నౌక చాంగ్ అండ్-1 (Chang'e 1) ను ప్రయోగించింది.

👤 ప్రముఖుల జననాలు

1881: ప్రసిద్ధ స్పానిష్ చిత్రకారుడు పాబ్లో పికాసో జననం.

1914: ప్రముఖ సంఘసేవకురాలు, రాజ్యసభ సభ్యురాలు లక్ష్మీ సెహగల్ జననం.

🎗️ జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

🇺🇳 ఐక్యరాజ్యసమితి దినోత్సవం (United Nations Day)

📢 ప్రపంచ అభివృద్ధి సమాచార దినోత్సవం (World Development Information Day)

💉 ప్రపంచ పోలియో దినోత్సవం (World Polio Day)

🛡️ ఇండో-టిబెటియన్ సరిహద్దు దళాల (ITBP) అవతరణ దినోత్సవం

నేటి పంచాంగం - 24 అక్టోబర్ 2026 | స్వాతికార్తి, శనిత్రయోదశి ప్రత్యేకతలుSpiritualitySwechaa24 Oct 2026, 08:45 AM

నేటి పంచాంగం - 24 అక్టోబర్ 2026 | స్వాతికార్తి, శనిత్రయోదశి ప్రత్యేకతలు

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఆశ్వయుజ శుక్లపక్ష త్రయోదశి (24 అక్టోబర్ 2026) శనివారం నేటి పంచాంగ వివరాలు. ఈ రోజు స్వాతికార్తి, శనిత్రయోదశి పర్వదినం సందర్భంగా తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రం, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాలు, రాహుకాలం, వర్జ్యం, అమృతకాలం వివరాలు మీకోసం.

వివరాలు:

  • తేదీ: 24 అక్టోబరు 2026, శనివారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం

  • తిథి: త్రయోదశి (ఉదయం 11:19 వరకు, తదుపరి చతుర్దశి)

  • నక్షత్రం: ఉత్తరాభాద్ర (రాత్రి 07:44 వరకు)

  • యోగం: వ్యాఘాతం (రాత్రి 08:18 వరకు)

  • కరణం: తైతుల (ఉ.11:32 వరకు), తదుపరి గరజి (రా.11:13 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 09:00 - 10:30 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 01:30 - 03:00 వరకు

  • అమృతకాలం: మధ్యాహ్నం 02:59 - 04:36 వరకు

  • దుర్ముహూర్తము: ఉదయం 06:48 - 07:36 వరకు

  • వర్జ్యం: ఉదయం 06:45 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మీనం

  • సూర్యోదయం: ఉదయం 06:10

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:53

కర్ణాటకలో స్టింగ్‌ ఆపరేషన్ కలకలం.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?NationalSwechaa23 Oct 2026, 11:48 PM

కర్ణాటకలో స్టింగ్‌ ఆపరేషన్ కలకలం.. కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది?

కర్ణాటక రాజకీయాల్లో ఇప్పుడు అధికారం కంటే ఎక్కువగా స్టింగ్‌ ఆపరేషన్ల గురించే చర్చ జరుగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించినట్లు చెబుతున్న ఓ వీడియో వివాదం మొదలై.. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు, పోలీసుల దర్యాప్తు, నేతల మధ్య వరుస సమావేశాల వరకు వ్యవహారం వెళ్లింది.

TG: పక్క రాష్ట్రాల్లో లేని కరువు.. తెలంగాణకే ఎందుకొచ్చింది?తెలంగాణSwechaa23 Oct 2026, 10:13 PM

TG: పక్క రాష్ట్రాల్లో లేని కరువు.. తెలంగాణకే ఎందుకొచ్చింది?

TG: పక్కనున్న కర్ణాటకలో చూస్తే వానలు 30 నుంచి 35 శాతం తక్కువగా పడ్డాయి. ఆంధ్రాలో కూడా 25 నుంచి 33 శాతం లోటు వర్షపాతమే నమోదైంది. కానీ మన తెలంగాణ పరిస్థితి చూస్తే.. ఆ రెండు రాష్ట్రాల కంటే చాలా మెరుగ్గా వానలు కురిశాయి. ఇక్కడ లోటు కేవలం 17 నుంచి 24 శాతమే. అంటే లెక్క ప్రకారం చూసుకున్నా పక్క రాష్ట్రాల్లోనే కరువు విలయతాండవం చేయాలి, అక్కడే రైతులు గగ్గోలు పెట్టాలి. కానీ అక్కడేమో రిజర్వాయర్లు కళకళలాడుతూ జల పండుగలు చేసుకుంటుంటే.. మన దగ్గరేమో నెర్రెలు బారిన భూములు, ఎండిపోయిన పంటలు కనిపిస్తున్నాయి. అసలు పక్క రాష్ట్రాలకు రాని కరువు.. తెలంగాణ నెత్తినే ఎందుకు పడింది.

TG: కాలువ జాగాలకే ఎసరు.. తహసీల్దార్ సహా ముగ్గురు అధికారులు సస్పెండ్!తెలంగాణSwechaa23 Oct 2026, 09:58 PM

TG: కాలువ జాగాలకే ఎసరు.. తహసీల్దార్ సహా ముగ్గురు అధికారులు సస్పెండ్!

TG: సర్కారు జాగాలను కాపాడాల్సినోళ్లే కబ్జాదారులతో చేతులు కలిపితే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చేశారు సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్. సాక్షాత్తూ నాగార్జునసాగర్ కాలువ భూములు, సీలింగ్ భూములను కాజేసేందుకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై వేటు వేశారు. హుజూర్‌నగర్ తహసీల్దార్ కవితతో పాటు ఆర్ఐ కాశీం షరీఫ్, జీపీవో జానీ పాషాలను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.హుజూర్‌నగర్‌లోని 458, 281 సర్వే నంబర్ల పరిధిలో పెద్ద ఎత్తున భూ దందా జరిగినట్లు ఆర్డీవో విచారణలో తేలింది. సాగునీటి కాలువలకు చెందిన భూములను అసలు రికార్డులు చూడకుండా, కోర్టు ఆర్డర్లను సైతం లెక్కచేయకుండా తప్పుడు రిపోర్టులు ఇచ్చి మరీ రిజిస్ట్రేషన్లకు వీళ్లు సహకరించారని బయటపడింది.

TG: ఎల్‌నినో ఎఫెక్ట్.. గిరిజనులకు 125 రోజుల పని!తెలంగాణSwechaa23 Oct 2026, 09:50 PM

TG: ఎల్‌నినో ఎఫెక్ట్.. గిరిజనులకు 125 రోజుల పని!

TG: ఎల్‌నినో దెబ్బకు కరువు ముంచుకొస్తున్న వేళ.. అడవి బిడ్డలు పనుల్లేక పస్తులుండే పరిస్థితి రాకూడదని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి కోసం గిరిజనులు ఊళ్లు విడిచి వలసలు పోకుండా ఉండేలా పక్కా ప్లాన్ రెడీ చేసింది. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద పనుల దినాలను ఏకంగా 125 రోజులకు పెంచుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

TG: ఇంటి వద్దకే మీసేవ..  అదిరిన రెస్పాన్స్తెలంగాణSwechaa23 Oct 2026, 09:48 PM

TG: ఇంటి వద్దకే మీసేవ.. అదిరిన రెస్పాన్స్

TG: కుల, ఆదాయ సర్టిఫికెట్లు కావాలన్నా.. ఆధార్ కార్డులో తప్పులు సరిచేయించుకోవాలన్నా ఇకపై మీసేవ సెంటర్లకు పరిగెత్తాల్సిన పనే లేదు. గంటల తరబడి ఎండలో క్యూలలో నిలబడే తిప్పలు తప్పిస్తూ సర్కార్ అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. జస్ట్ ఒక్క ఫోన్ కొడితే చాలు.. మీసేవ వాళ్లే స్వయంగా మన ఇంటి తలుపు తట్టి మరీ పని చేసి పెడతారు.ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆలోచనతో వచ్చిన ఈ ‘మీసేవ డోర్‌స్టెప్’ సేవలకు జనాల నుంచి మామూలు రెస్పాన్స్ రావడం లేదు. మొదలైన నెల రోజుల్లోనే దాదాపు 3,885 మంది ఫోన్లు చేసి ఈ సదుపాయాన్ని వాడేసుకున్నారు. కులం, ఆదాయం, నివాస సర్టిఫికెట్ల దగ్గర్నుంచి.. చాలామందికి పెద్ద తలనొప్పిగా మారిన ఆధార్ కొత్త నమోదు, అడ్రస్ లేదా ఫోన్ నంబర్ మార్పు లాంటి పనులన్నీ ఇప్పుడు ఇంట్లో హ్యాపీగా కూర్చునే అయిపోతున్నాయి.

TG: హైకోర్టు చెప్పినా రైతు బీమా ఇవ్వరా?తెలంగాణSwechaa23 Oct 2026, 08:31 PM

TG: హైకోర్టు చెప్పినా రైతు బీమా ఇవ్వరా?

TG: హైకోర్టు స్వయంగా ఆర్డర్ ఇచ్చినా రైతు బీమా డబ్బులు ఇవ్వకుండా అధికారులు లేట్ చేస్తుండటంతో ఓ బాధిత మహిళ నేరుగా రంగంలోకి దిగింది. తనకు న్యాయంగా రావాల్సిన రైతు బీమాను వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ ప్రధాన కార్యాలయానికి చేరుకుంది.సంస్థాన్ నారాయణపురం మండలం గోగులోనిభావికి చెందిన కళ్లెం మంజుల అనే మహిళ.. తన లాయర్ గుమ్మి రాజ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత మన్నె నర్సింహారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు జనార్దన్ రెడ్డి, జాన్ రెడ్డిలను వెంటబెట్టుకుని బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపీ ఐఏఎస్‌ను కలిశారు.

తాగేందుకు చుక్క నీరు కూడా దొరకదు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలుతెలంగాణSwechaa23 Oct 2026, 08:29 PM

తాగేందుకు చుక్క నీరు కూడా దొరకదు- సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Elnino: ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్ నినో కారణంగా చాలా దారుణమైన పరిస్థితులు చూడబోతున్నామన్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ కరువు మనల్ని కబలిస్తోందన్నారు. కరువుపై 6 నెలలుగా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. తెలంగాణలోనే కాదు మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడులోనూ కరువు ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాల్లో కరువు పరిస్థితి ఉందన్నారు.

తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి రాబోతోందని హెచ్చరించిన సీఎం రేవంత్.. అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అసవరం ఉందని స్పష్టం చేశారు. సాగునీరు సంగతి దేవుడెరుగు.. తాగునీరే దొరకని పరిస్థితి వస్తుందన్నారు. ప్రజలను భాగస్వామ్యం చేయకుంటే ఈ కరువును ఎదుర్కోలేమన్నారు. కరోనా ఎంతటి విపత్తో.. ఇప్పుడు ఎల్ నినో కూడా అంతే విపత్తు అని హెచ్చరించారు.

6 నెలల్లోనే రేవంత్ రెడ్డి మార్క్ ఆర్థిక వినాశనం- దాసోజు శ్రవణ్ సంచలనంతెలంగాణSwechaa23 Oct 2026, 08:15 PM

6 నెలల్లోనే రేవంత్ రెడ్డి మార్క్ ఆర్థిక వినాశనం- దాసోజు శ్రవణ్ సంచలనం

Brs: కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల వ్యవధిలోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా చేసిన అంకెల గారడీ మొత్తం కాగ్ (కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తాజా అర్ధవార్షిక నివేదికతో బట్టబయలైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ తన అసమర్థ పాలనతో, అడ్డగోలు అప్పులతో ఖజానాను ఖాళీ చేసి, రాజ్యాంగబద్ధ ఆడిట్ సంస్థలకే తప్పుడు లెక్కలు చెబుతూ రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టారని శ్రవణ్ మండిపడ్డారు.

మావోయిస్టుల మరణాలకు గుర్తింపు ఎక్కడ.. సంస్మరణ దినోత్సవాలు ఇంకెప్పుడు?తెలంగాణSwechaa23 Oct 2026, 07:22 PM

మావోయిస్టుల మరణాలకు గుర్తింపు ఎక్కడ.. సంస్మరణ దినోత్సవాలు ఇంకెప్పుడు?

సమాజ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకుంటూ ఏటా సంస్మరణ వేడుకలు నిర్వహించడం చూస్తూనే ఉన్నాం. అక్టోబర్ 21న మొదలైన ఈ కార్యక్రమాలు అక్టోబర్ 31 జాతీయ ఐక్యతా దినోత్సవం వరకు పది రోజుల పాటు కొనసాగుతాయి. విధి నిర్వహణలో చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం, ఉద్యోగాలు, అవార్డులు ఇచ్చి అండగా నిలుస్తోంది. అయితే సరిగ్గా ఇక్కడే సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది.పోలీసుల త్యాగాలను ఎవరూ కాదనడం లేదు. కానీ అదే సమయంలో పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం అడవి బాట పట్టి ప్రాణాలు వదిలిన మావోయిస్టుల సంగతేంటి? అనే గొంతులు నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రజల రక్షణ కోసం పోలీసులు ప్రాణాలిస్తే, అణగారిన ప్రజల హక్కుల కోసం మావోలు బలైపోయారని కొందరు వాదిస్తున్నారు.

వివాదంలో శంకర్‌పల్లి సీఐ, ఎస్ఐ.. యువతి సంచలన ఆరోపణలుక్రైమ్Swechaa23 Oct 2026, 06:57 PM

వివాదంలో శంకర్‌పల్లి సీఐ, ఎస్ఐ.. యువతి సంచలన ఆరోపణలు

Shankarpally Police: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి సీఐ, ఎస్ఐలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ యువతి వారిపై సంచలన ఆరోపణలు చేసింది. మేజర్ అయిన తనను మైనర్ గా చూపి అక్రమ కేసు పెట్టారని యువతి ఆరోపించింది. తన భర్తను తప్పుడు కేసులో అరెస్ట్ చేయడం కోసం పోలీసులు ఇలా చేశారని వాపోయింది. తాను మేజర్ అయినప్పటికీ రికార్డుల్లో మైనర్‌గా చూపి తన భర్తను అక్రమంగా రిమాండ్‌కు తరలించారని ఆమె కన్నీటిపర్యంతమైంది. శంకర్‌పల్లి సీఐ, ఎస్ఐలు వేధిస్తున్నారంటూ శివానీ అనే యువతి విడుదల చేసిన సెల్ఫీ వీడియో కలకలం రేపుతోంది.

పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం కరీంనగర్ సీపీ ప్రత్యేక ప్రార్థనలుతెలంగాణSwechaa23 Oct 2026, 06:16 PM

పోలీస్ అమరవీరుల కుటుంబాల సంక్షేమం కోసం కరీంనగర్ సీపీ ప్రత్యేక ప్రార్థనలు

Karimnagar CP: సమాజ శాంతి కోసం అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, వారి కుటుంబాలకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అండగా నిలుస్తుందని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక సవరన్ మసీదులో సీపీ గౌస్ ఆలం శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

సమాజ రక్షణ కోసం, శాంతిభద్రతల పరిరక్షణలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించారు. అలాగే పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది క్షేమం, ప్రజా సంక్షేమం కోరుతూ ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీతో పాటు ఏసీపీలు యాదగిరిస్వామి, వెంకటస్వామి, విజయకుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

TG: తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌కు బీసీఐ షాక్.. ఏకపక్ష నిర్ణయాలపై స్టే!తెలంగాణSwechaa23 Oct 2026, 05:53 PM

TG: తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌కు బీసీఐ షాక్.. ఏకపక్ష నిర్ణయాలపై స్టే!

TG: తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్‌ రామ్‌రెడ్డి సాములు ఏకపక్ష నిర్ణయాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) గట్టి ఝలక్ ఇచ్చింది. రూల్స్ పక్కనపెట్టి కమిటీల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై బీసీఐ మధ్యంతర స్టే విధించింది. ఈ మేరకు తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్ రామ్‌రెడ్డి, సెక్రటరీలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.అక్టోబర్ 11న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో సభ్యులు వ్యక్తం చేసిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా, మినిట్స్‌లో నమోదు చేయకుండా రామ్‌రెడ్డి ఒంటెద్దు పోకడలకు వెళ్లారని బీసీఐకి ఫిర్యాదులు అందాయి.

Elnino: ‎ఎల్‌నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశంతెలంగాణSwechaa23 Oct 2026, 04:49 PM

Elnino: ‎ఎల్‌నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం

Elnino: సచివాలయంలో తెలంగాణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం, సబ్-కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది. ‎రాష్ట్రంలో నెలకొన్న కరువు, ఎల్ నినో పరిస్థితులను అధిగమించేందుకు, తగిన చర్యలను సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ‎​రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కరువు ప్రభావం, నీటి లభ్యత, రైతులకు అందించాల్సిన ఉపశమనం, భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. ‎​ఈ సమావేశానికి సబ్-కమిటీ సభ్యులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, సీఎస్ సంజయ్ జాజుతో పాటు సంబంధిత శాఖల అధికారులు హాజరయ్యారు.

TG: ‘రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది’.. : కేటీఆర్తెలంగాణSwechaa23 Oct 2026, 04:23 PM

TG: ‘రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది’.. : కేటీఆర్

TG: తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ, ఆయన నడుపుతున్న పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయాలపై సంచలన విషయాలు మాట్లాడారు.రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి కేవలం కొద్దిరోజులు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరెంట్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని నిపుణులు ముందే చెప్పినా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు.