స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

TG: ‘రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది’.. : కేటీఆర్తెలంగాణSwechaa23 Oct 2026, 04:23 PM

TG: ‘రేవంత్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది’.. : కేటీఆర్

TG: తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగడుతూ, ఆయన నడుపుతున్న పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో జరిగిన అంబర్‌పేట నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, ప్రస్తుత రాజకీయాలపై సంచలన విషయాలు మాట్లాడారు.రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి కేవలం కొద్దిరోజులు మాత్రమేనని, ఆ తర్వాత మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడతారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుకాక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా కరెంట్ కోతలతో రైతులు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని నిపుణులు ముందే చెప్పినా ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు.

ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీళ్లు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయంతెలంగాణSwechaa23 Oct 2026, 04:12 PM

ఏదుల రిజర్వాయర్ నుంచే డిండికి నీళ్లు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

Cm Revanth: ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ బోధి పెవిలియన్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తుమ్మిడిహెట్టిపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు

ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ, డిండి, అచ్చంపేట ప్రాజెక్టులపై కీలకంగా చర్చించారు. తుమ్మిడిహెట్టిపై త్వరలోనే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ నెల 23 తర్వాత చర్చలకు పిలుస్తానని ఇటీవలే మహారాష్ట్ర సీఎం సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. 152 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఎంత నీటిని తీసుకునే వీలుంది, మహారాష్ట్ర పరిధిలో ఎంతమేరకు ముంపునకు గురవుతుందో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లంచావతారులు.. ఏసీబీకి ఇలా ఫిర్యాదు చేయండి :  నారగోని ప్రవీణ్తెలంగాణSwechaa23 Oct 2026, 03:41 PM

సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో లంచావతారులు.. ఏసీబీకి ఇలా ఫిర్యాదు చేయండి : నారగోని ప్రవీణ్

తెలంగాణలోని చాలా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో విపరీతమైన లంచాలు నడుస్తున్నాయని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. డాక్యుమెంట్ రైటర్ల ద్వారా డబ్బులు వసూలు చేయడం, సాయంత్రం లెక్క చూడటం అధికారులకు పరిపాటిగా మారిందని అన్నారు. ఈ విషయం ఏసీబీకి దృష్టికి కూడా వచ్చిందని, అందుకే గత ఒకటి,రెండేళ్లుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని గుర్తుచేశారు.అవినీతినిరోధక శాఖ (ACB) ప్రతిశాఖ వారీగా లెక్క విడిగా ప్రకటించదన్నారు. కానీ 2025 వార్షిక నివేదిక ప్రకారం మొత్తంగా 199 కేసులు నమోదు అయ్యాయని, 273 మంది అవినీతి అధికారులు అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు.అందులో 157 ట్రాప్ కేసులు ఉన్నాయని చెప్పారు.

యువశక్తితోనే వికసిత భారత్ సాధ్యం: ప్రధాని నరేంద్ర మోదీNationalSwechaa23 Oct 2026, 03:35 PM

యువశక్తితోనే వికసిత భారత్ సాధ్యం: ప్రధాని నరేంద్ర మోదీ

దేశంలోని అపారమైన యువశక్తిని సరైన దిశలో సద్వినియోగం చేసుకోవడం ద్వారానే బలమైన, అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడం సాధ్యమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపంలో శుక్రవారం అత్యంత వైభవంగా ప్రారంభమైన 'చిన్మయ అమృత మహోత్సవ గ్లోబల్ సమ్మేళన్'కు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పవిత్ర చిన్మయ మిషన్ స్థాపించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ప్లాటినం జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమాలు అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 25 వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి.

రైస్ మిల్లర్లపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ నిఘా.. వెలుగులోకి భారీ కుంభకోణం!తెలంగాణSwechaa23 Oct 2026, 03:08 PM

రైస్ మిల్లర్లపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ నిఘా.. వెలుగులోకి భారీ కుంభకోణం!

 తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అక్రమ రేషన్ దందా, ధాన్యం రీ-సైక్లింగ్ మిల్లింగ్ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ధాన్యం నిల్వలు, మిక్సింగ్ ప్రక్రియలపై రాష్ట్ర సరిహద్దులతో పాటు వివిథ జిల్లాల్లోని రైస్ మిల్లులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ రైస్ మిల్లుపై అధికారులు దాడులు చేయగా, అక్కడ దొరికిన ఆధారాలతో సిద్ధిపేట జిల్లాలో నడుస్తున్న అక్రమ రేషన్ దందా బట్టబయలైంది. 

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడుల కలకలం..తెలంగాణSwechaa23 Oct 2026, 03:07 PM

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ దాడుల కలకలం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ(ED) దాడులు కలకలం రేపాయి. శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత పెట్టుబడుల యాప్స్ ద్వారా సామాన్యులను బురిడీ కొట్టిస్తూ రూ.వందల కోట్లు కొల్లగొడుతున్న అంతర్రాష్ట్ర ముఠాలపై ఈడీ దాడులు చేసింది. నిందితులపై మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి సోదాలు జరుపుతున్నారు.స్పాట్‌లో దొరికిన విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అనగా మొత్తం 15 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రలోని పూణె సైబర్ క్రైమ్ పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా అక్రమ నెట్‌వర్క్‌ మూలాలను సేకరించే పనిలో ఈడీ అధికారులు నిమగ్నమయ్యారు. కీలక నిందితుల నివాసాలు, వారి కార్యాలయాల్లో ఈడీ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. అక్కడ లభ్యమైన రికార్డులు, ఆర్థిక లావాదేవీల పత్రాలు, డిజిటల్ పరికరాలను లోతుగా పరిశీలిస్తున్నారు.

Andhra Pradesh: వికటించిన జగన్ వ్యూహం.. అలా చేయకపోతే వైసీపీకి విజయం దక్కేదా?..ఏపీSwechaa23 Oct 2026, 03:05 PM

Andhra Pradesh: వికటించిన జగన్ వ్యూహం.. అలా చేయకపోతే వైసీపీకి విజయం దక్కేదా?..

జగన్ స్వయంకృతాపరాధమే వైసీపీకి శాపంగా మారుతోందా? స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలన్న పిలుపుతో పాటు టికెట్లపై హెచ్చరికలు పార్టీకి వ్యూహాత్మకంగా ఇబ్బందులు తెచ్చాయనే చర్చ జరుగుతోంది. మరోవైపు చెల్లెలు షర్మిలతో విభేదాలు, తల్లి విజయమ్మ వైఖరి కుటుంబ రాజకీయాలను రచ్చకెక్కించాయి. బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా జగన్‌పై రాజకీయ విమర్శలకు అస్త్రంగా మారింది.

congress: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ‘హస్తం’ గూటిలో గుబులు!తెలంగాణSwechaa23 Oct 2026, 02:57 PM

congress: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ‘హస్తం’ గూటిలో గుబులు!

congress: సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ అంటే దూకుడు మామూలుగా ఉండదు. సర్కార్ చేసే చిన్న అభివృద్ధి పనైనా మైకులూది ఊరూవాడా ప్రచారం చేసుకోవాలి. బలం తక్కువగా ఉన్న ప్రాంతాలను వెతికి పట్టుకుని మరీ జెండా పాతాలి. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రానికే గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరంలో మాత్రం చేతులెత్తేసినట్లే కనిపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వం ప్రణాళికలతో ముందుకెళ్తుంటే, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు మాత్రం నత్తనడకన సాగుతూ ఉనికిని కాపాడుకోలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పరిపాలనా వికేంద్రీకరణ, వేగవంతమైన అభివృద్ధి పేరుతో జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం, త్వరలోనే వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

శకునిగా చంద్రబాబు.. బిహార్‌ను మించిన ‘జంగిల్ రాజ్’ : వైఎస్ జగన్ఏపీSwechaa23 Oct 2026, 02:45 PM

శకునిగా చంద్రబాబు.. బిహార్‌ను మించిన ‘జంగిల్ రాజ్’ : వైఎస్ జగన్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రస్తుతం నెలకొన్నరాజకీయ పరిస్థితులపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. నామినేషన్ల టైంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై జగన్ మీడియాతో మాట్లాడారు. నామినేషన్ పత్రాలను చించేయడం,కేంద్రాల వద్ద వైసీపీ అభ్యర్థులపై దాడులను తీవ్రంగా ఖండించారు. నామినేషన్ల వేయకుండా వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేయడంతో పాటు పోలీస్ స్టేషన్లకు పిలిపించి మరీ ముందస్తు అరెస్టులు చేశారన్నారు.

క్యాంపస్‌లో తీవ్ర నీటి ఎద్దడి.. బాసర ట్రిపుల్ ఐటీకి అనూహ్యంగా సెలవులు పొడిగింపు!తెలంగాణSwechaa23 Oct 2026, 02:35 PM

క్యాంపస్‌లో తీవ్ర నీటి ఎద్దడి.. బాసర ట్రిపుల్ ఐటీకి అనూహ్యంగా సెలవులు పొడిగింపు!

 నిర్మల్ జిల్లాలోని ప్రసిద్ధ బాసర ట్రిపుల్ ఐటీ (RGUKT Basara) విద్యార్థులకు రాజీవ్‌గాంధీ జ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయ అధికారులు అనూహ్యంగా సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దసరా సెలవుల అనంతరం విద్యార్థులు క్యాంపస్‌కు తిరిగి రావలసి ఉండగా, ఆవరణలో ఊహించని రీతిలో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తడంతో ఈ అత్యవసర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎల్ నినో తీవ్ర ప్రభావం వల్ల ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం, చుట్టుపక్కల ఉన్న చెరువులు, వాగులు ఎండిపోయి భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా అధికారులు తెలిపారు.

గుంతల వలయం.. ప్రమాదాలకు కేరాఫ్ బడంగ్‌పేట రహదారి!తెలంగాణSwechaa23 Oct 2026, 02:23 PM

గుంతల వలయం.. ప్రమాదాలకు కేరాఫ్ బడంగ్‌పేట రహదారి!

హైదరాబాద్‌లోని బడంగ్‌పేట్ మున్సిపాలిటీలో ప్రధాన రోడ్డు అధ్వాన్నంగా మారింది. మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో బీరప్ప కాలనీవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.రోజుకు రెండు, మూడు ప్రమాదాలు జరుగుతున్నాయని, జీహెచ్ఎంసీకి విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే లేడని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే రోడ్లు వేస్తామని చెప్పడం తప్పా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికుల మండిపడుతున్నారు. రెండు నెలల క్రితం మట్టిని తవ్వించి వారం రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటిదాకా పనులు ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ కోసం కొత్త ఇన్‌చార్జీలు.. కేటీఆర్ టార్గెట్ రీచ్ అవుతారా?తెలంగాణSwechaa23 Oct 2026, 01:58 PM

‘గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ’ కోసం కొత్త ఇన్‌చార్జీలు.. కేటీఆర్ టార్గెట్ రీచ్ అవుతారా?

వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయపతాకం ఏగరేసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది.గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీ తరఫున బిగ్ షాక్ తగిలింది.ఈసారి అలా కాకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ‘ఖమ్మం–వరంగల్–నల్గొండ’, ‘మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్’ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కొత్త ఇన్‌చార్జిలను నియమించారు.

చిత్రం లేదు
తెలంగాణSwechaa23 Oct 2026, 01:48 PM

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణే నంబర్ వన్: సీఎం రేవంత్ రెడ్డి

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని ఐసీసీసీ భవనంలో శుక్రవారం నిర్వహించిన ‘దక్షిణ ప్రాంతీయ పోలీసు సమన్వయ కమిటీ’ (SRPCC) ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసు బలగాల మధ్య పరస్పర సమన్వయాన్ని, సహకారాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

పెళ్లయిన 6 నెలలకే భార్య స్కెచ్.. ఆపై అదృశ్యం!క్రైమ్Swechaa23 Oct 2026, 01:06 PM

పెళ్లయిన 6 నెలలకే భార్య స్కెచ్.. ఆపై అదృశ్యం!

పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళ తన భర్తను కడతేర్చింది.ప్రియుడి కోసం ఈ పని చేయడంతో పాటు మర్డర్ అనంతరం అక్కడి నుంచి జంప్ అయ్యింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపురా జిల్లా ముద్దెబిహాళ్ తాలూకా రుదాగి గ్రామంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గణేశ్ బసప్ప(27)కు ఆరు నెలల క్రితం అక్షత అనే యువతితో వివాహం జరిగింది. అక్టోబర్ 21 తెల్లవారుజామున గణేశ్ బసప్ప తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. గణేశ్ నిద్రలో ఉన్నప్పుడు అతన్ని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. ప్రియుడితో వెళ్లిపోయేందుకే కట్టుకున్న భార్య అక్షత..భర్తను గొంతు కోసి హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఎందుకంటే హత్య అనంతరం అమె కనిపించకుండా పోయింది. ఆక్షత ప్రియుడు కూడా కనిపించడం లేదని సమాచారం.

రాత్రికి రాత్రే వరించిన అదృష్టం.. రూ.7లక్కీ టికెట్‌తో కోటీశ్వరురాలైన కూలీ భార్య!వైరల్ న్యూస్Swechaa23 Oct 2026, 01:01 PM

రాత్రికి రాత్రే వరించిన అదృష్టం.. రూ.7లక్కీ టికెట్‌తో కోటీశ్వరురాలైన కూలీ భార్య!

 అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవరూ ఊహించలేరు. పంజాబ్‌కు చెందిన ఓ నిరుపేద దినసరి కూలీ భార్య జీవితాన్ని కేవలం రూ.7లక్కీ డిప్ టికెట్ పూర్తిగా మార్చివేసింది. పిల్లల కోసం దుస్తులు కొనేందుకు బజారుకు వెళ్లిన ఆమె, మార్గమధ్యంలో సరదాగా కొన్న లాటరీ టికెట్‌తో ఏకంగా రూ.కోటి జాక్‌పాట్ గెలుచుకున్నారు. పంజాబ్‌లోని కోట్‌కపురా (Kotkapura) ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. కోట్‌కపురా ప్రాంతానికి చెందిన బిమ్లా దేవి భర్త రోజువారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

‘షమొండా’ కలకలం.. పశువుల నుంచి మనుషులకు సోకిన వైరస్!InternationalSwechaa23 Oct 2026, 12:52 PM

‘షమొండా’ కలకలం.. పశువుల నుంచి మనుషులకు సోకిన వైరస్!

పశువులకు మాత్రమే సోకుతుందని భావించిన ప్రమాదకరమైన 'షమొండా వైరస్‌' (Shamonda Virus) ఇప్పుడు మానవులకు కూడా సోకగలదని తేలడం అంతర్జాతీయ వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈగల ద్వారా కేవలం జంతువులలో మాత్రమే వ్యాపించే ఈ వైరస్‌ బారినపడి ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటిసారి అని వైద్య అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు. తూర్పు ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలో పశువులలో ఈ వైరస్‌ జాడ వెలుగుచూడగా, తాజాగా మనుషుల్లోనూ దీని ప్రాణాంతక ప్రభావం బయటపడింది.

ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత!సినిమాSwechaa23 Oct 2026, 12:26 PM

ప్రముఖ గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి కన్నుమూత!

 తమిళ సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ప్రముఖ సీనియర్ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ రామస్వామి (75) క్యాన్సర్, వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తన సుదీర్ఘమైన స్వర్ణోత్సవ సంగీత ప్రయాణంలో కృష్ణరాజ్ దాదాపు 3వేలకు పైగా భక్తి, ప్రైవేటు పాటలు ఆలపించగా, అందులో 300కు పైగా సూపర్ హిట్ సినీ గీతాలు ఉన్నాయి. తన ప్రత్యేకమైన కంఠస్వరంతో, ముఖ్యంగా ఫోక్ (జానపద), మాస్ ఉత్సాహభరితమైన పాటలతో కొన్ని దశాబ్దాల పాటు కోట్లాది మంది సంగీత అభిమానులను ఆయన విశేషంగా అలరించారు

ట్యాంకర్ నీళ్లే దిక్కు.. సాగునీటి ఎద్దడితో అన్నదాత కుదేలు!తెలంగాణSwechaa23 Oct 2026, 11:18 AM

ట్యాంకర్ నీళ్లే దిక్కు.. సాగునీటి ఎద్దడితో అన్నదాత కుదేలు!

తెలంగాణ వ్యాప్తంగా సాగునీటి ఎద్దడి, భూగర్భ జలాలు ఇంకిపోవడం, విద్యుత్ సరఫరాలో తలెత్తుతున్న అంతరాయాల కారణంగా వరి పంటలు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే మాడిపోతుంటే తట్టుకోలేక హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన ఓ రైతు అసాధారణ రీతిలో పోరాడుతున్నాడు. తన ఎనిమిది ఎకరాల వరి పంటను దక్కించుకునేందుకు నీటి ట్యాంకర్ల ద్వారా పొలానికి నీరు అందిస్తూ పంటను తడిపే ప్రయత్నం చేస్తున్నారు.

సిద్దిపేటలో దసరా నాడు దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్!క్రైమ్Swechaa23 Oct 2026, 11:11 AM

సిద్దిపేటలో దసరా నాడు దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్!

సిద్దిపేట జిల్లాలో బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం ప్రస్తుతం సంచనంగా మారింది. వివరాల్లోకివెళితే.. సిద్ధిపేట జిల్లా ధూల్మిట్ట మండలంలో బాధిత బాలిక తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటోంది. ఆమె పేరెంట్స్ పొలం పనులకు వెళ్లిన సమయంలో స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు.. బాలిక ఆడుకుంటుండగా ఆమెకు మాయమాటలు చెప్పినట్టు తీసుకెళ్లినట్టు సమాచారం. సమీపంలోని మరో గ్రామానికి తీసుకెళ్లి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు తెలిసింది. మరుసటి రోజు ఉదయం బాలికను సొంత గ్రామానికి తీసుకొచ్చి వదిలేసి నిందితులు అక్కడి నుంచి పరార్ అయ్యారు. అయితే, రాత్రంతా ఎక్కడుందని తల్లిదండ్రులు ఆరా తీయగా తనపై చేర్యాల పట్టణం, ధూల్మిట్ట గ్రామానికి చెందిన ఏడుగురు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక వెల్లడించింది.

డెమోక్రాట్లు గెలిస్తే జైలుకు వెళ్తావు: జర్నలిస్ట్‌కు మస్క్ కౌంటర్!InternationalSwechaa23 Oct 2026, 11:09 AM

డెమోక్రాట్లు గెలిస్తే జైలుకు వెళ్తావు: జర్నలిస్ట్‌కు మస్క్ కౌంటర్!

టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్(X) అధినేత ఎలాన్ మస్క్(Elon Musk) సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ, టెక్ వర్గాల్లో సంచలనం రేపుతున్నాయి. రాబోయే 2026 అమెరికా మధ్యంతర ఎన్నికల్లో(US Midterms 2026) డెమోక్రాట్లు విజయం సాధించి కాంగ్రెస్‌ని చేజిక్కించుకుంటే మస్క్ జైలుకు వెళ్లాల్సి రావచ్చు అంటూ ప్రముఖ టెక్ జర్నలిస్ట్ కారా స్విషర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఆయన విరుచుకుపడ్డారు. కేవలం రెండే రెండు పదాల్లో ‘మెసేజ్ అందింది’ (Message received) అంటూ మొదట స్పందించిన మస్క్, ఆ తర్వాత మరింత ఘాటైన పోస్ట్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.

బోరు బంద్‌ అయితే.. బిల్డర్‌ బిజినెస్‌ బందేనా? హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు వాటర్‌ టెన్షన్‌!తెలంగాణSwechaa23 Oct 2026, 11:02 AM

బోరు బంద్‌ అయితే.. బిల్డర్‌ బిజినెస్‌ బందేనా? హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌కు వాటర్‌ టెన్షన్‌!

హైదరాబాద్‌లో భూగర్భ జలాలపై పెరుగుతున్న ఒత్తిడి.. కొత్త బోర్ల తవ్వకాలపై ఆంక్షలు.. నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగంపై దృష్టి.. ఈ పరిణామాలు ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రంగానికి కొత్త సవాళ్లను ముందుకు తెస్తున్నాయి.

కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలుతెలంగాణSwechaa23 Oct 2026, 10:41 AM

కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎగసిపడుతున్న అగ్నికీలలు

హైదరాబాద్ మహానగరంలోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా గల హరిజన సేవా సంఘం కాలనీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ నివాసం ఉంటున్న వారి పూరి గుడిసెలకు నిప్పు అంటుకోవడంతో మంటలు భారీగా వ్యాపించాయి. ఇండ్లు మొత్తం అగ్నికి ఆహుతవుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. హరిజన సేవా సంఘం కాలనీలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దోమల నివారణ కోసం పెట్టిన పొగ వలన మంటలు చెలరేగి పక్కనే ఉన్న గుడిసెలకు వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయాయి.అంతటితో ఆగకుండా మంటలు పక్కనే ఉన్న కట్టెల షాపునకు వ్యాపించాయి. దీంతో కట్టెల షాపు కూడా పూర్తిగా దగ్ధమైనట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు అవ్వగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతిInternationalSwechaa23 Oct 2026, 10:16 AM

టిబెట్‌లో భారీ భూకంపం.. 16 మంది మృతి

హిమాలయాలను ఆనుకుని ఉన్న టిబెట్‌లో భారీ భూకంపం సంభవించింది. నిన్న సాయంకాలం వేళ 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 16 మంది మరణించారు. 54 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. భూమి లోపల 10 కిమీటర్ల దూరంలో కౌంటీకి 70 కి.మీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. టిబెట్‌లో ఒక్కసారిగా భారీ కదలికలతో భూమి కంపించగా విద్యుత్, టెలికమ్యూనికేషన్, రోడ్ వ్యవస్థ కూడా భారీగా దెబ్బతిన్నట్టు సమాచారం.క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.మరోవైపు టిబెట్ దేశంలో భారీ భవనాలు సైతం నేలమట్టం అయినట్టు సమాచారం.

బిల్లులపై 25 శాతం కమీషన్‌.. ఏసీబీకి చిక్కిన అధికారులుతెలంగాణSwechaa23 Oct 2026, 09:56 AM

బిల్లులపై 25 శాతం కమీషన్‌.. ఏసీబీకి చిక్కిన అధికారులు

భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు పీఎంకేఎస్‌వై అధికారులు సతీశ్ రెడ్డి, రాజు ఏసీబీకి చిక్కారు. వారు కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసేందుకు 25 శాతం కమీషన్‌ డిమాండ్‌ చేసినట్టు తెలిసింది. మొత్తంగా రూ.1.62 కోట్ల పనుల బిల్లుల వ్యవహారంలో లంచం డిమాండ్‌ చేయగా.. కాంట్రాక్టర్ నుంచి రూ.39 లక్షలు అడిగారు. అయితే, బాధిత కాంట్రాక్టర్ ఇప్పటికే పలుమార్లు ఆన్‌లైన్‌లో నిందితుల ఖాతాలకు నగదు బదిలీ చేశాడు. తాజాగా మరో రూ.1.34 లక్షల బిల్లులోనూ అవినీతి అధికారులు కమీషన్‌ డిమాండ్‌ చేశారు. వారి తీరుతో విసిగిపోయిన కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. పీఎంకేఎస్‌వై కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

భారత్‌ను లక్ష్యంగా చేసుకోలేదు.. హెచ్-1బీ ఆంక్షలపై అమెరికా స్పష్టత!InternationalSwechaa23 Oct 2026, 09:23 AM

భారత్‌ను లక్ష్యంగా చేసుకోలేదు.. హెచ్-1బీ ఆంక్షలపై అమెరికా స్పష్టత!

 అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హెచ్-1బీ (H-1B) వీసాలు, వలసల విధానాలపై ట్రంప్ పరిపాలనా యంత్రాంగం అమలు చేస్తున్న కఠినతర నిబంధనలు, ఆంక్షలు ఏ ఒక్క దేశాన్ని లేదా భారత్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని తెచ్చినవి కావు అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. శతాబ్దాలుగా తమ దేశంలో లోపభూయిష్టంగా మారిన వలసల వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా సరిదిద్దేందుకే ఈ సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. స్వదేశీ అమెరికన్ ఉద్యోగుల ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వడమే 'అమెరికా ఫస్ట్' సిద్ధాంతం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.

TGGENCOAshScam: మంత్రి కనుసన్నల్లో బూడిద దందా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa23 Oct 2026, 08:56 AM

TGGENCOAshScam: మంత్రి కనుసన్నల్లో బూడిద దందా?

హైదరాబాద్‌లో హోర్డింగ్స్‌పై 200 కుటుంబాలు రోడ్డుపాలు అవుతున్నాయని ఏటా రూ.300 కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టే మాఫియా చేసిన ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం, నాయకుల విచ్చలవిడితనంతో ఏటా వెయ్యి కోట్లు సంపాదిస్తోంది. టీజీ జెన్ కో బొగ్గు కోసం కాకుండా బూడిద కమీషన్స్ కోసం చేస్తున్న దందాతో 2 వేల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. నాలుగు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్‌కి ఒకే టెండర్ ఏటా రూ.93 కోట్లతో బుడిద అమ్ముకునేందుకు చేసిన వ్యాపారం విలువ, లొసుగులు, ఆ తర్వాత పర్యావరణ విధ్వంసం ఏంటో చూస్తే దీన్ని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వదలడం లేదని అనిపిస్తుంది.

క్షిపణి మనదే.. ప్రపంచ మార్కెట్‌ మనదే.. భారత్‌ కొత్త వ్యూహం!NationalSwechaa23 Oct 2026, 12:19 AM

క్షిపణి మనదే.. ప్రపంచ మార్కెట్‌ మనదే.. భారత్‌ కొత్త వ్యూహం!

ఒకప్పుడు యుద్ధ విమానం కావాలన్నా.. క్షిపణి కావాలన్నా.. ఆధునిక రక్షణ పరికరం కావాలన్నా భారత్‌ విదేశాల వైపు చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సీన్‌ మారుతోంది. భారత్‌ తయారు చేసిన ఆయుధాలే ఇతర దేశాల రక్షణ వ్యవస్థల్లోకి అడుగుపెడుతున్నాయి.

రాహుల్ గాంధీ ఓ.. ఫెయిల్డ్ ప్రొడక్ట్! కాంగ్రెస్‌పై మోదీ విమర్శల వర్షంNationalSwechaa22 Oct 2026, 11:48 PM

రాహుల్ గాంధీ ఓ.. ఫెయిల్డ్ ప్రొడక్ట్! కాంగ్రెస్‌పై మోదీ విమర్శల వర్షం

ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ తన నాయకుడిని రాజకీయంగా నిలబెట్టేందుకు పదేపదే ప్రయత్నిస్తోందని, అయినా ఫలితం ఉండటం లేదని విమర్శించారు.

ap local body elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రీషెడ్యూల్.. కొత్త పోలింగ్ తేదీ ఇదే!ఏపీSwechaa22 Oct 2026, 10:09 PM

ap local body elections : ఏపీలో మున్సిపల్ ఎన్నికలు రీషెడ్యూల్.. కొత్త పోలింగ్ తేదీ ఇదే!

p local body elections : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌లో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక మార్పులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జరగాల్సిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తేదీని రీషెడ్యూల్ చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. పాత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న జరగాల్సిన మున్సిపల్ పోలింగ్‌ను నవంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఇక ఈ ఎన్నికల ఫలితాలను నవంబర్ 3న వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఈ నెల 25న విడుదల కానుంది.రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలన్నింటికీ నవంబర్ 1న పోలింగ్ ఖరారైనప్పటికీ, వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరుపై మాత్రం ఈసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

phonepe diwali insurance: కేవలం రూ.11తో రూ.25,000 కవరేజీ.. ఫోన్‌పే దీపావళి బంపర్ ఆఫర్!NationalSwechaa22 Oct 2026, 10:02 PM

phonepe diwali insurance: కేవలం రూ.11తో రూ.25,000 కవరేజీ.. ఫోన్‌పే దీపావళి బంపర్ ఆఫర్!

phonepe diwali insurance: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ బాంబులు కాల్చడానికి తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అలాంటప్పుడు ఆసుపత్రి ఖర్చులు మీదపడితే సామాన్య కుటుంబాలకు చేతిలో చిల్లిగవ్వ లేక పెద్ద తలనొప్పిగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రముఖ యూపీఐ యాప్ ఫోన్‌పే ఓ అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.11 కడితే చాలు.. ఏకంగా రూ.25,000 వరకు వైద్య ఖర్చులకు భరోసా ఇచ్చేలా ప్రత్యేక బాణసంచా బీమాను (ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్) అందుబాటులోకి తెచ్చింది. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఫోన్‌పే ఈ చిన్న బీమా పాలసీని వరుసగా మూడో ఏడాది కూడా అందిస్తోంది. పండుగ వేళ కాలిన గాయాలైనా లేదా ఇతర ప్రమాదాలు జరిగినా ఆసుపత్రి ఖర్చుల భారం పడకుండా ఇది అండగా నిలుస్తుంది.