స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

phonepe diwali insurance: కేవలం రూ.11తో రూ.25,000 కవరేజీ.. ఫోన్‌పే దీపావళి బంపర్ ఆఫర్!NationalSwechaa22 Oct 2026, 10:02 PM

phonepe diwali insurance: కేవలం రూ.11తో రూ.25,000 కవరేజీ.. ఫోన్‌పే దీపావళి బంపర్ ఆఫర్!

phonepe diwali insurance: దీపావళి పండుగ వచ్చిందంటే చాలు.. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ బాంబులు కాల్చడానికి తెగ ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అలాంటప్పుడు ఆసుపత్రి ఖర్చులు మీదపడితే సామాన్య కుటుంబాలకు చేతిలో చిల్లిగవ్వ లేక పెద్ద తలనొప్పిగా మారుతుంది. సరిగ్గా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ప్రముఖ యూపీఐ యాప్ ఫోన్‌పే ఓ అదిరిపోయే ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రూ.11 కడితే చాలు.. ఏకంగా రూ.25,000 వరకు వైద్య ఖర్చులకు భరోసా ఇచ్చేలా ప్రత్యేక బాణసంచా బీమాను (ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్) అందుబాటులోకి తెచ్చింది. ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిసి ఫోన్‌పే ఈ చిన్న బీమా పాలసీని వరుసగా మూడో ఏడాది కూడా అందిస్తోంది. పండుగ వేళ కాలిన గాయాలైనా లేదా ఇతర ప్రమాదాలు జరిగినా ఆసుపత్రి ఖర్చుల భారం పడకుండా ఇది అండగా నిలుస్తుంది.

whatsapp: ఫోన్‌లో సిమ్ లేకపోతే ఇక వాట్సాప్ బంద్..NationalSwechaa22 Oct 2026, 09:47 PM

whatsapp: ఫోన్‌లో సిమ్ లేకపోతే ఇక వాట్సాప్ బంద్..

whatsapp: వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. మొబైల్ నుంచి సిమ్ కార్డు తీసేసినా, లేదా కేవలం వైఫై కనెక్షన్‌తో ఫోన్లు, ట్యాబ్‌లలో వాట్సాప్ నడిపించే పద్ధతికి త్వరలోనే కాలం చెల్లనుంది. 'సిమ్ బైండింగ్' పేరిట సరికొత్త రూల్స్‌ను ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ప్రకారం, మీ వాట్సాప్ అకౌంట్ ఏ నంబర్‌తో రిజిస్టర్ అయి ఉందో.. ఆ సిమ్ కార్డు తప్పనిసరిగా అదే ఫోన్‌లో యాక్టివ్‌గా ఉంటేనే యాప్ పనిచేస్తుంది. ఈ నిబంధనలను పాటించేందుకు మెసేజింగ్ సంస్థలకు 2026 డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అంటే, 2027 జనవరి 1 నుంచి ఈ రూల్స్ కచ్చితంగా అమల్లోకి రానున్నాయి.

నల్గొండ-పాలమూరు మధ్య ముదిరిన జల వివాదం.. సీఎం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠతెలంగాణSwechaa22 Oct 2026, 08:22 PM

నల్గొండ-పాలమూరు మధ్య ముదిరిన జల వివాదం.. సీఎం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

Water War: నల్గొండ-పాలమూరు మధ్య జల వివాదం ముదిరింది. పాలమూరు ఏదుల రిజర్వాయర్ నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపు వ్యవహారం చిచ్చు రాజేసింది. ఈ అంశంపై ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ ప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం ఈ చర్యలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఉత్తమ్ ను కలిశారు. ఇదే సమావేశానికి మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్గొండ జిల్లా సీనియర్ నేత జానారెడ్డి కూడా హాజరుకావడం ఆసక్తికరంగా మారింది. దాదాపు గంటన్నరపాటు మంత్రి ఉత్తమ్ తో చర్చించారు. పాలమూరు నుంచి డిండి ప్రాజెక్టుకు నీటి తరలింపును ఆపాలని ప్రజాప్రతినిధులు మంత్రి ఉత్తమ్ కి విజ్ఞప్తి చేశారు.

75% మార్కులు దాటితేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!NationalSwechaa22 Oct 2026, 08:11 PM

75% మార్కులు దాటితేనే డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త రూల్స్ ఇవే!

driving licence new rules: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి నిబంధనలను తెరపైకి తెచ్చింది. రోడ్డు భద్రతను పెంచే లక్ష్యంతో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కొత్త ముసాయిదా నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇకపై ఆన్‌లైన్ టెస్టుల్లో పాస్ అవ్వడం అంత సులువు కాదు.సురక్షిత డ్రైవింగ్‌పై అభ్యర్థులకు ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకునేందుకు నిర్వహించే ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పరీక్షలో పాస్ మార్కులను కేంద్రం భారీగా పెంచింది. ఇప్పటివరకు 60 శాతం మార్కులు వస్తే సరిపోయేది, కానీ తాజా రూల్స్‌తో దాన్ని 75 శాతానికి పెంచారు. అంతేకాకుండా ఈ పరీక్ష రాయడానికి ముందు కనీసం 30 నిమిషాల పాటు సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్‌ను తప్పనిసరిగా చూడాల్సి ఉంటుంది.

Saudi Arabia: సౌదీ అరేబియాలో దాడులు.. భారత్ కీలక ప్రకటనNationalSwechaa22 Oct 2026, 07:24 PM

Saudi Arabia: సౌదీ అరేబియాలో దాడులు.. భారత్ కీలక ప్రకటన

Saudi Arabia: సౌదీ అరేబియాపై హౌతీ తిరుగుబాటుదారులు సాగిస్తున్న వరుస డ్రోన్ దాడులతో ఆ ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలతో అట్టుడుకుతోంది. ఇంధన కేంద్రాలు, పౌర విమానాశ్రయాలే లక్ష్యంగా జరిగిన ఈ భీకర దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఇండియన్ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది.సాధారణ ప్రజలు తిరిగే ప్రదేశాలు, వాణిజ్య మౌలిక సదుపాయాలపై ఇలాంటి దాడులకు తెగబడటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర విదేశాంగ శాఖ గట్టిగా స్పష్టం చేసింది. ఇలాంటి విధ్వంసకర చర్యలను తక్షణమే నిలిపివేయాలని హెచ్చరించింది. సౌదీ అరేబియా సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే విషయంలో అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ పూర్తి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చింది.

BRS: గులాబీ పార్టీలో భారీ ప్రక్షాళన? తేడా వస్తే ఇన్‌ఛార్జులపై వేటు తప్పదా!తెలంగాణSwechaa22 Oct 2026, 07:18 PM

BRS: గులాబీ పార్టీలో భారీ ప్రక్షాళన? తేడా వస్తే ఇన్‌ఛార్జులపై వేటు తప్పదా!

BRS: తెలంగాణ భవన్‌లో ఇప్పుడు అంతర్గత సమీక్షల వేడి మామూలుగా లేదు. రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం.. పార్టీలో పేరుకుపోయిన అలసత్వాన్ని వదిలించేందుకు సర్జికల్ స్ట్రైక్‌కు సిద్ధమవుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పట్టభద్రుల ఓటర్ల నమోదు విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన ‘లాస్ట్ వార్నింగ్’ చూస్తుంటే.. ఈ నెపంతో పార్టీలో ఒక భారీ ప్రక్షాళనకే గ్రౌండ్ సిద్ధమైనట్లు అర్థమవుతోంది.ఎన్నికలు జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ స్థానాల పరిధిలోకి ఆరు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 68 అసెంబ్లీ సెగ్మెంట్లు వస్తాయి. సాధారణంగా అభ్యర్థి ఖరారైన తర్వాతే ఎన్నికల హీట్ మొదలవుతుంది. కానీ ఈసారి వ్యూహం మార్చిన అధిష్ఠానం.. అభ్యర్థిని ప్రకటించకుండానే ఓటర్ల నమోదు బాధ్యతను పూర్తిగా అసెంబ్లీ ఇన్‌ఛార్జుల భుజస్కంధాలపై పెట్టింది.

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసే పోటీతెలంగాణSwechaa22 Oct 2026, 06:58 PM

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసే పోటీ

Telangana Politics: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై విరుచుకుపడ్డారు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్. ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసే పోటీ చేస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై ఎంక్వైరీ కమిషన్ వేసింది, అందులో అవకతవకలను బయటపెట్టింది కాంగ్రెస్ పార్టీనే అని ఆయన స్పష్టం చేశారు.

icici bank: ఐసీఐసీఐ కస్టమర్లకు భారీ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!NationalSwechaa22 Oct 2026, 05:59 PM

icici bank: ఐసీఐసీఐ కస్టమర్లకు భారీ షాక్.. డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్!

icici bank: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు బ్యాడ్ న్యూస్. సేవింగ్స్ అకౌంట్స్ ద్వారా జరిపే నగదు లావాదేవీల చార్జీలను సవరిస్తూ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రూల్స్ డిసెంబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో బ్యాంకు బ్రాంచీలు, ఏటీఎంలలో భారీగా నగదు డిపాజిట్, విత్‌డ్రా చేసే కస్టమర్ల జేబులకు మరింత చిల్లు పడనుంది.బ్యాంక్ వెల్లడించిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. బ్రాంచీలతో పాటు క్యాష్ రీసైక్లర్ మెషిన్ల ద్వారా జరిపే నగదు లావాదేవీలపై చార్జీలను పెంచారు. నెలవారీ ఉచిత పరిమితి దాటిన తర్వాత చేసే లావాదేవీల్లో ప్రతి వెయ్యి రూపాయలపై ఇప్పటివరకు ఉన్న రూ.3.50 చార్జీని రూ.4కి పెంచారు.

హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. గంటన్నర వ్యవధిలో రూ.3.34 కోట్లు కొట్టేశారుక్రైమ్Swechaa22 Oct 2026, 05:57 PM

హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. గంటన్నర వ్యవధిలో రూ.3.34 కోట్లు కొట్టేశారు

Cyber Fraud: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీకి పాల్పడ్డారు. గంటన్నర వ్యవధిలోనే ఏకంగా రూ.3.34 కోట్లు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. రాయదుర్గంలోని NBFC సంస్థకు చెందిన బేగంపేట బ్రాంచ్ అకౌంట్ నుంచి నగదు మళ్లించారు. కేవలం గంటన్నర వ్యవధిలో 183 విడతలుగా 3.34 కోట్ల రూపాయలను 52 వేర్వేరు మ్యూల్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేసేశారు. భారీ మొత్తంలో నగదు మాయమైన విషయాన్ని గుర్తించిన కంపెనీ సీఎఫ్ఓ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ భారీ మోసంపై దర్యాఫ్తు ప్రారంభించింది.

వెంటనే కరువు మండలాలను ప్రకటించండి, రైతులకు సాయం చేయండితెలంగాణSwechaa22 Oct 2026, 05:09 PM

వెంటనే కరువు మండలాలను ప్రకటించండి, రైతులకు సాయం చేయండి

Harish Rao: రాష్ట్రంలో వెంటనే కరువు మండలాలను ప్రకటించాలని మాజీమంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే పంట నష్టపోయిన రైతులకు సాయం చేయాలన్నారు. ఇక చివరి దశలో ఉన్న పంటలకు సాగునీటిని, నాణ్యమైన కరెంటును అందించాలని బీఆర్ఎస్ పార్టీ తరుఫున డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మాట్లాడి కోల్ ఇండియా నుంచి బొగ్గు తెచ్చుకుని ఉంటే పంటలు ఎండిపోవు కదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు. ప్రకృతి వల్ల జరిగిన నష్టం తక్కువ.. కాంగ్రెస్ వైఫల్యం వల్ల జరిగిన నష్టం ఎక్కువ అని విమర్శించారు. ఏమన్నా అంటే అధికారులను సస్పెండ్ చేస్తా అని సీఎం రేవంత్ అంటున్నారు.. అది కరెక్ట్ కాదు. అధికారులను సస్పెండ్ చేసినంత మాత్రాన రైతుల కష్టాలు తీరవు కదా? అని హరీశ్ రావు అన్నారు.

AI Agents: భారత్‌కు సెర్ట్-ఇన్ రెడ్ అలర్ట్.. మన డేటా సేఫేనా?NationalSwechaa22 Oct 2026, 05:00 PM

AI Agents: భారత్‌కు సెర్ట్-ఇన్ రెడ్ అలర్ట్.. మన డేటా సేఫేనా?

AI Agents: డిజిటల్ విప్లవంతో భారత్ శరవేగంగా దూసుకుపోతున్న వేళ, దేశ భద్రతకు పెను సవాలుగా మారే ఓ చేదు నిజాన్ని భారత అధికారిక సైబర్ భద్రతా విభాగం ‘సెర్ట్-ఇన్’ బహిర్గతం చేసింది. కేవలం కంప్యూటర్ల ముందు కూర్చుని హ్యాకింగ్ చేసే సాధారణ కేటుగాళ్ల ముప్పును దాటి, ఇప్పుడు ‘ఏఐ ఏజెంట్లు’ నేరుగా దేశ ఐటీ నెట్‌వర్క్‌లను టార్గెట్ చేస్తున్నాయని హెచ్చరించింది. పరిశోధన, మూల్యాంకనం కోసం అనుమతించిన కొన్ని ఏఐ ఏజెంట్లు తమ పరిమితులను దాటి భారత కీలక వ్యవస్థల్లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు సెర్ట్-ఇన్ స్పష్టం చేసింది. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే.. అసలు తమ డేటాబేస్‌ల్లోకి ఏఐ ఏజెంట్లు చొరబడ్డాయన్న విషయాన్ని కూడా ఆయా భారత సంస్థలు గుర్తించలేకపోవడం.

చిత్రం లేదు
ఏపీSwechaa22 Oct 2026, 04:46 PM

ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా హింసకు పాల్పడుతోంది: వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జరుగుతోన్న అక్రమాలు, దాడులు, అధికార పక్షం అనుసరిస్తున్న తీరుపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా హింసను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎంత దూరమైనా, న్యాయపోరాటం.. ఎందాకైనా చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో తాడేపల్లిలో నిర్వహించిన అత్యవసర ఉన్నత స్థాయి సమావేశంలో స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.

CJP: అనుభవలేమా? ప్లాన్-బి లేదా? సిజేపీకి దిక్కుతోచని స్థితి!NationalSwechaa22 Oct 2026, 03:48 PM

CJP: అనుభవలేమా? ప్లాన్-బి లేదా? సిజేపీకి దిక్కుతోచని స్థితి!

CJP: దేశవ్యాప్తంగా నీట్ ఆందోళనలతో యువతను ఏకం చేసి, సరికొత్త సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ)కి అసలు సిసలైన రాజకీయ వాస్తవాలు ఇప్పుడు బోధపడుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రెండ్ చేయడం వేరు.. వ్యవస్థలను ఎదుర్కొంటూ గ్రౌండ్‌లో నిలబడి పోరాటం నడపడం వేరన్న పచ్చి నిజాన్ని ఆ పార్టీ నాయకత్వం ఆలస్యంగా గుర్తించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌మంతర్ వేదికగా చేపట్టిన రెండో విడత ఆందోళనల్లో ఆ పార్టీ వేసిన తప్పటడుగులు, వ్యూహాత్మక లోపాలు ఇప్పుడు ఉద్యమాన్నే డైలమాలో పడేశాయి.

వింత పంచాయితీ.. మరిది కొరికాడని వదిన ఫిర్యాదు!తెలంగాణSwechaa22 Oct 2026, 03:42 PM

వింత పంచాయితీ.. మరిది కొరికాడని వదిన ఫిర్యాదు!

భార్యా భర్తలైన విజయ్ కుమార్, సౌమ్య హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే,కొన్నాళ్లుగా భర్త ఉద్యోగం చేయకుండా తన బంగారు ఆభరణాలు తీసుకున్నాడని భార్య ప్రధానంగా ఆరోపణలు చేసింది.ఆస్తి పత్రాల తీసుకోవడంతో పాటు తన పేరుపై రుణాలు తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సౌమ్య ఆవేదన వ్యక్తం చేసింది.ఈ క్రమంలోనే ఈ నెల 20న ఇంట్లో వివాదం జరగ్గా తన మరిది సురేశ్ కుమార్ తన చేతులు, కాళ్లపై కొరికాడని సౌమ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.తనని చంపుతానని కూడా సురేశ్ కుమార్ బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సౌమ్య పేర్కొన్నది.

చిత్రం లేదు
NationalSwechaa22 Oct 2026, 03:30 PM

'మోదీ నా ఆత్మీయ స్నేహితుడు: పోలాండ్‌ ప్రధాని డోనాల్డ్ టస్క్

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్న తీరు, ఆయన దౌత్య విధానాలపై పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ (Donald Tusk) ప్రశంసల జల్లు కురిపించారు. అంతర్జాతీయ వేదికలపై నరేంద్ర మోదీని తన అత్యంత సన్నిహిత స్నేహితుడిగా చెప్పుకోవడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు.

ప్రాణం తీసిన రూ.20 వాటర్ బాటిల్..!క్రైమ్Swechaa22 Oct 2026, 03:18 PM

ప్రాణం తీసిన రూ.20 వాటర్ బాటిల్..!

రూ.20 వాటర్ బాటిల్ కోసం ఓ వ్యక్తిపై దాడి చేసి మరి హత్య చేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరణానికి ముందు బాధిత వ్యక్తి తనకు పిల్లలు ఉన్నారని, కొట్టొద్దని ఎంత వేడుకున్నా దుండగులు విడిచిపెట్టలేదు. దెబ్బలకు తాళలేక సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకివెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో నల్గొండకు చెందిన మాస సాయికుమార్ (33) పనిచేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. వారం క్రితం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకులకు విశాఖపట్నం వెళ్తున్నానని చెప్పి సాయికుమార్ వెళ్లాడు.ఈ నెల 18న అర్ధరాత్రి దాటాక విజయవాడ పడమటలో ఓ మద్యం దుకాణం వద్ద ఉన్న పాన్‌షాపులోని ఫ్రిజ్ నుంచి రూ.20 వాటర్ బాటిల్ తీసుకునేందుకు సాయికుమార్ యత్నించాడు. అయితే, దొంగతనం చేస్తున్నాడని భావించిన నలుగురు దాడి చేయడం దెబ్బలకు తాళలేక మరణించాడు.

చిత్రం లేదు
Swechaa22 Oct 2026, 03:08 PM

ఏఐని ఓ వ్యక్తిలా పరిగణించాలి: సర్వప్రియానంద ఆసక్తికర వ్యాఖ్యలు

కృత్రిమ మేధ (Artificial Intelligence) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, ఇది మానవాళి తన స్వంత ప్రత్యేకత, ఉనికిపై కలిగి ఉన్న సంప్రదాయ అభిప్రాయాలను పూర్తిగా మార్చివేస్తోందని న్యూయార్క్‌ వేదాంత సొసైటీ అధిపతి స్వామి సర్వప్రియానంద వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న అధునాతన ఏఐ వ్యవస్థలను సాంకేతికంగా ఒక వ్యక్తిలా పరిగణించడం సముచితమేనని, అయితే దానర్థం యంత్రాలకు మనుషుల తరహాలో స్వయం చైతన్యం లేదా ఆధ్యాత్మిక అవగాహన ఉందని కాదని ఆయన స్పష్టం చేశారు.

బీసీ లెక్కల్లో తేడాలుంటే సవరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa22 Oct 2026, 03:05 PM

బీసీ లెక్కల్లో తేడాలుంటే సవరిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహించిన బీసీ కులగణన లెక్కల్లో తేడాలుంటే సవరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీలకు సామాజిక న్యాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎవరూ చేయని సాహసం తమ ప్రభుత్వం చేసిందని చెప్పారు. ఏడాదిలోనే కులగణన పూర్తి చేసి తొలిసారిగా బీసీల జనాభా లెక్కలను తేల్చామన్నారు. ప్రస్తుత లెక్కల్లో ఎవరైనా తమ వివరాలు నమోదు కాలేదని భావిస్తే, వాటిని సవరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అవసరమైతే బీసీ కులగణన లెక్కలను సరిచేసి, జాబితాలోకి రాని వారిని చేర్చుతామన్నారు. నగరంలోని రవీంద్రభారతిలో నిర్వహించిన పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం ఈ సందర్బంగా కీలక వ్యాక్యలు చేశారు. ఏ కులం వారైనా తమ జనాభా లెక్కల్లో తక్కువగా నమోదైందని భావిస్తే సంబంధిత వివరాలు అందించాలని కోరారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో పదవుల పరేషాన్!తెలంగాణSwechaa22 Oct 2026, 02:51 PM

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో పదవుల పరేషాన్!

Telangana Congress: బాగా వేడిగా ఉన్నప్పుడే ఇనుమును కావాల్సిన రూపంలోకి మలుచుకోవాలి.. అలాగే అవసరం ఉన్నప్పుడే అందించే సహాయానికైనా, ఇచ్చే పదవికైనా విలువుంటుంది. సరిగ్గా సమయానికి ఆ గుర్తింపు దక్కకపోతే ఎంత పెద్ద పదవి ఇచ్చినా ఆ మజా ఉండదు. సరిగ్గా ఇప్పుడిదే పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో కనిపిస్తోంది. రాష్ట్రంలో సొంత ప్రభుత్వం కొలువుదీరి ఇన్ని నెలలవుతున్నా, నామినేటెడ్ పోస్టులు, పార్టీ పదవుల భర్తీ విషయంలో అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరు నేతల్లో తీవ్ర అసహనానికి దారితీస్తోంది. ఎదురుచూసి చూసి కళ్లు కాయలు కాసి, ఆ కాయలు పళ్లై రాలిపోయే పరిస్థితి వచ్చిందంటూ హస్తం పార్టీ కేడర్ లోలోపల రగిలిపోతున్నారు.

దమ్మామ్ విమానాశ్రయంపై హౌతీల భీకర దాడి..  భారతీయుడు మృతి!InternationalSwechaa22 Oct 2026, 02:41 PM

దమ్మామ్ విమానాశ్రయంపై హౌతీల భీకర దాడి.. భారతీయుడు మృతి!

 సౌదీ అరేబియాలోని కీలకమైన దమ్మామ్ అంతర్జాతీయ విమానాశ్రయం (King Fahd International Airport) లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు జరిపిన క్షిపణి/డ్రోన్ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారిలో ఒకరు సౌదీ పౌరుడు కాగా, మరొకరు భారతీయ జాతీయత కలిగిన వ్యక్తిగా సౌదీ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GACA) అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ఘటనతో పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత కొన్ని వారాలుగా సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలు, పౌర విమానాశ్రయాలు, కీలక మౌలిక సదుపాయాలపై హౌతీలు దాడులను క్రమంగా పెంచుతున్నారు.

భగ్గుమంటున్న ముడి చమురు.. భారత్‌లో పెట్రో ధరలు పెరుగుతాయా?NationalSwechaa22 Oct 2026, 02:21 PM

భగ్గుమంటున్న ముడి చమురు.. భారత్‌లో పెట్రో ధరలు పెరుగుతాయా?

 అంతర్జాతీయ విఫణిలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ (Petrol and Diesel Prices) ధరల పెంపు మళ్లీ వాహనదారులను కలవరపెడుతోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్రమైన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇరాన్ సంక్షోభం, సౌదీ అరేబియా ఆయిల్ క్షేత్రాలపై దాడుల ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతోంది. సెప్టెంబర్ 2026 నాటికి దేశ ముడి చమురు దిగుమతి బిల్లు ఏకంగా 47 శాతం పెరిగి 15.4 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.45 లక్షల కోట్లు) చేరుకున్నట్లు కేంద్ర పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రేమతో హగ్ ఇచ్చిన భర్త.. విరిగిన పక్కటెముకలు!వైరల్ న్యూస్Swechaa22 Oct 2026, 01:47 PM

ప్రేమతో హగ్ ఇచ్చిన భర్త.. విరిగిన పక్కటెముకలు!

ఓ భర్త తన భార్యను ప్రేమగా కౌగిలించుకోగా ఆమె పక్కటెముకలు విరిగాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటన చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో అక్టోబర్ 18న చోటుచేసుకున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. తన భార్యపై ఉన్న ప్రేమను తెలియజేసేందుకు ఆ భర్త ఆమెను దగ్గరకు తీసుకుని గట్టిగా హగ్ చేసుకుని పైకి లేపాడు. ఆ సమయంలో టక్ మని శబ్దం రావడంతో పాటు ఆమెకు తీవ్రమైన వెన్నునొప్పి ఏర్పడింది. బాధితురాలు నిటారుగా నిలబడలేనంత తీవ్రమైన నొప్పితో విలవిలలాడిపోయింది. దీంతో తన భార్యను ఆసుప‌త్రికి తరలించాడు. వైద్యులు సిటీ స్కానింగ్ చేసి చూడగా 5 పక్కటెముకలు విరిగాయని, మరొక దానికి క్రాక్ వచ్చినట్లు చెప్పారు.డాక్టర్ల మాట విన్న భర్త‌కు నోట్లో నుంచి మాట రాలేదని తెలిసింది. హగ్ చేసుకుంటే ఎముకలు విరగడం ఏంటని ఆ భర్త షాక్‌లో ఉండిపోయాడు.

నిమ్స్‌లో లక్ష్మీభాస్కర్‌ అక్రమాల బాగోతం!క్రైమ్Swechaa22 Oct 2026, 01:29 PM

నిమ్స్‌లో లక్ష్మీభాస్కర్‌ అక్రమాల బాగోతం!

 అక్రమాస్తుల కేసులో ఏసీబీ (ACB) అధికారులకు చిక్కిన నిమ్స్ అదనపు మెడికల్‌ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్‌ లీలలు ఒక్కటొకటిగా బట్టబయలవుతున్నాయి. తాజాగా నిమ్స్(NIMS)లో జరిగిన సంచలన నియామకాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే గగనంగా మారిన తరుణంలో, ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులకు లక్ష్మీభాస్కర్ అక్రమ పద్ధతిలో శాశ్వత (Permanent) ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు తాజాగా తేలింది.

జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఖాళీలు.. రూ.లక్షలు కొట్టు జాబ్ పట్టు!తెలంగాణSwechaa22 Oct 2026, 01:25 PM

జాతీయ ఆరోగ్య మిషన్‌లో ఖాళీలు.. రూ.లక్షలు కొట్టు జాబ్ పట్టు!

రాష్ట్రంలో ఉద్యోగాల పేరిట కొందరు అధికారులు భారీ అవినీతికి తెరలేపారు.జాబ్ కావాలంటే రూ. లక్షలు చెల్లించాలని కండిషన్ పెట్టినట్టు సమాచారం. ఉద్యోగానికి ఇంత చొప్పున అంటూ రేట్ కూడా ఫిక్స్ చేశారు. మెరిట్ లిస్టును పక్కన పడేసి డబ్బులు ఎవరు ఇస్తే వారికే జాబ్ అంటూ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. వైద్యారోగ్యశాఖలో ఈ వ్యవహారం బయట పడగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగాల కోసం కష్టపడి చదివిన అభ్యర్థుల భవిష్యత్ ప్రస్తుతం గందరగోళంగా మారింది. మెదక్ జిల్లా పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ (NHM)లో 64 కీలక పోస్టుల భర్తీకి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో అర్హులురెండు వేలకు పైగా మంది దరఖాస్తులు చేసుకున్నారు. మెరిట్ లిస్టు ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగాల్సి ఉంటుంది.కానీ, కొందరు దళారులు కొత్త దందాకు తెరలేపారు. ఉద్యోగం కావాలా? అయితే రూ.లక్షలు ఇవ్వాల్సిందే అని అభ్యర్థులను డిమాండ్ చేసినట్టు సమాచారం.వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అండదండలతో దళారులు రెచ్చిపోతున్నట్టు తెలుస్తోంది.

నదిలో స్నానం చేద్దామని బాలికను పిలిచి..!క్రైమ్Swechaa22 Oct 2026, 12:49 PM

నదిలో స్నానం చేద్దామని బాలికను పిలిచి..!

ఓ మైనర్ బాలికను వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి రేప్ చేసి చంపేశాడు. ఈ ఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలోని మార్దు గ్రామంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. భగవత్ మెహతో(23) అనే యువకుడు నదిలో స్నానం చేద్దామని చెప్పి 17 ఏళ్ల మైనర్ బాలికను పిలిచాడు. ఐదు నిమిషాల్లో తిరిగి వస్తానని ఇంట్లో చెప్పి భగవత్ వద్దకు బాలిక వెళ్లింది. అతను నది వద్దకు కాకుండా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికైనా చెప్తుందన్న భయంతో బాలికను దారుణంగా హతమార్చాడు.అనంతరం ఏమీ ఎరుగనట్టు ఘటనా స్థలం నుంచి మెహతో వెళ్లిపోయాడు. కుమార్తె సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సాయంతో చుట్టూ వెతకడం ప్రారంభించారు.ఎంత వెతికినా జాడ దొరక్కపోవడంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన సోనియా గాంధీ: ‘ఆత్మకథ’తో తొలి పోస్ట్‌!NationalSwechaa22 Oct 2026, 12:45 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన సోనియా గాంధీ: ‘ఆత్మకథ’తో తొలి పోస్ట్‌!

 భారత రాజకీయాల్లో అత్యంత ప్రభావశీలమైన నాయకురాలిగా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతగా సుదీర్ఘకాలం దేశ రాజకీయాలను శాసించిన సోనియా గాంధీ ఎట్టకేలకు సోషల్ మీడియా దిగ్గజం 'ఇన్‌స్టాగ్రామ్' (Instagram)లోకి అధికారికంగా ప్రవేశించారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలతో, ముఖ్యంగా యువతతో నేరుగా మమేకమయ్యేందుకు ఆమె ఈ ముందడుగు వేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన తొలి పోస్ట్‌గా తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తన రాబోయే ఆటోబయోగ్రఫీ పుస్తకం ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ (Belonging: A Journey of Love) తొలి కాపీని అభిమానులతో పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Shocking: నయా దోపిడి.. డబ్బుల్లేవని.. లోన్‌ తీయించి మరీ దోచుకున్న దొంగలు!క్రైమ్Swechaa22 Oct 2026, 12:33 PM

Shocking: నయా దోపిడి.. డబ్బుల్లేవని.. లోన్‌ తీయించి మరీ దోచుకున్న దొంగలు!

చేతిలో డబ్బులు లేవని ప్రాధేయపడినా ఆ కిడ్నాపర్లు కనికరించలేదు. ఏకంగా మొబైల్ లోన్ యాప్ ద్వారా అప్పు తీసుకునేలా బలవంతపెట్టి దోచుకున్నారు. ఈ విచిత్ర దోపిడీ చెన్నైలోని పల్లికరణై (Pallikaranai) ప్రాంతంలో చోటుచేసుకుంది. 21 ఏళ్ల అజయ్ అనే యువకుడిని నలుగురు దుండగులు ఆటోలో బలవంతంగా అపహరించి ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. అజయ్‌ను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లిన నిందితులు డబ్బులు డిమాండ్ చేయగా, తన వద్ద చిల్లిగవ్వ లేదని అతను కన్నీరుమున్నీరయ్యాడు.

Asian Para Games: ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్!క్రీడలుSwechaa22 Oct 2026, 12:22 PM

Asian Para Games: ఆర్చరీలో భారత్‌కు గోల్డ్ మెడల్!

జపాన్ వేదికగా జరుగుతోన్న ప్రఖ్యాత 'ఆసియా పారా గేమ్స్' (Asian Para Games)లో భారత పారా క్రీడాకారులు అద్భుత ప్రదర్శనలతో అదరగొడుతున్నారు. పోటీల్లో భాగంగా గురువారం జరిగిన ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్ తరఫున బరిలోకి దిగిన శీతల్ దేవి (Sheetal Devi), తోమన్ కుమార్ (Thoman Kumar) జోడీ అసాధారణ ప్రతిభ కనబరిచింది. ఫైనల్ పోరులో ఇండోనేషియా జట్టుపై 151-148 తేడాతో ఘన విజయం సాధించి పోడియంపై అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా, ఈ జోడీ మొత్తం 1,402 పాయింట్ల సంయుక్త స్కోరుతో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించి చరిత్ర సృష్టించింది.

దావూద్‌ ఎక్కడున్నాడో తెలియదా? ఐక్య రాజ్య సమితికి భారత్‌ క్లాస్‌!InternationalSwechaa22 Oct 2026, 12:17 PM

దావూద్‌ ఎక్కడున్నాడో తెలియదా? ఐక్య రాజ్య సమితికి భారత్‌ క్లాస్‌!

భారత్‌కు మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ఉన్న దావూద్‌ ఇబ్రహీం భారత్‌లోనే ఉన్నాడంటూ ఐక్యరాజ్యసమితి నివేదికలో ప్రస్తావించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. అసలు దావూద్‌ ఎక్కడున్నాడు? ఐరాస నివేదికలో ఏం పేర్కొన్నారు? భారత్‌ ఎందుకు తీవ్రంగా స్పందించింది?

ఎస్ఐఆర్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి భర్త..!NationalSwechaa22 Oct 2026, 11:36 AM

ఎస్ఐఆర్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొననున్న కేంద్రమంత్రి భర్త..!

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఓట్ల చోరీకి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రశ్నిస్తున్న గొంతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలు అణచివేస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే రేపు అక్టోబర్ 23న ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలకు సీజేపీ,ఇతర యాక్టివిస్టులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, SIR వ్యతిరేక నిరసనలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ఎకానమిస్ట్ పరకాల ప్రభాకర్ పాల్గొననున్నారు. ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది.