స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Telangana culture: తెలంగాణ కల్చర్ అంటే అందుకే ఇష్టం!తెలంగాణSwechaa22 Oct 2026, 11:04 AM

Telangana culture: తెలంగాణ కల్చర్ అంటే అందుకే ఇష్టం!

గతేడాది కంటే తెలంగాణలో సుమారు రూ.555 కోట్ల విలువైన మద్యం వినియోగం పెరిగిపోయిందని దసరా పండుగ వేళ టీవీ ఛానళ్లు, వివిధ పత్రికల్లో ప్రచారాలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రా మీడియా ఈ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు పెద్ద తాగుబోతులుగా చూపిస్తూ ఈ ప్రచారానికి మరింత ఊతం పోస్తోంది. ఇక్కడ ఆంధ్రా మీడియా ఒకే కోణంలో ప్రచారం చేయడం సరికాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ సంప్రదాయాలు, సంస్కృతిని తెలుసుకోవాలి.

దసరా సెలవులు ఓవర్.. పల్లెలు విడిచి పట్టణాలకు ప్రజలు!తెలంగాణSwechaa22 Oct 2026, 10:54 AM

దసరా సెలవులు ఓవర్.. పల్లెలు విడిచి పట్టణాలకు ప్రజలు!

రాష్ట్రంలో దసరా సెలవులు ముగిశాయి. నిన్నటివరకు కుటుంబంతో సరదాగా గడిపిన వారంతా నేడు పట్టణాలకు తిరుగుప్రయాణం అవుతున్నారు. బతుకుదెరుకు కోసం నగరాలకు వలస వెళ్లి పండక్కి సొంతూర్లకు వెళ్లినవారంతా తిరుగుప్రయాణం అవుతున్నారు.దీంతో పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పండుగ సమయంలో భార్యబిడ్డలతో సొంతూర్లకు రావడంతో కళకళలాడిన గ్రామాలు.. మళ్లి బోసిపోనున్నాయి. సెలవులు ముగియడంతో జనాలు తిరిగి హైదరాబాద్ బాట పట్టారు. ఇప్పటికే చాలా మంది నగరానికి వచ్చారు. నేటితో సెలవులు ముగుస్తుండటంతో పిల్లలతో కలిసి పేరెంట్స్ తిరుగు ప్రయాణం కావడంతో నగరానికి ట్రాఫిక్ పెరిగింది. దీంతో హైదరాబాద్‌‌కు వచ్చే ప్రధాన రాహదారులపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. మరోవైపు ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. దీంతో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కూటమికి లాసేనా?ఏపీSwechaa22 Oct 2026, 10:27 AM

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్.. కూటమికి లాసేనా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అనిల్‌చంద్ర పునేఠా ప్రకటించారు.రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్టు ఎస్‌ఈసీ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పునేఠా ప్రకటించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి నివేదికలు వచ్చాక ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు నిన్న మీడియాకు వివరాలు వెల్లడించారు. దీంతో తదుపరి ఎన్నికల ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు అనిల్ చంద్ర స్పష్టంచేశారు.

'ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'ను ఆవిష్కరిస్తాం: ఇరాన్ సంచలన ప్రకటన!Accusations Without Official ConfirmationSwechaa22 Oct 2026, 09:35 AM

'ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్'ను ఆవిష్కరిస్తాం: ఇరాన్ సంచలన ప్రకటన!

 అమెరికా, ఇజ్రాయెల్‌ల నుంచి వరుసగా బెదిరింపులు ఎదురవుతున్న తరుణంలో, వారికి దీటుగా సమాధానమిచ్చేందుకు 'ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' (బాంబులకే తండ్రి వంటిది) అనే సరికొత్త అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రతినిధి హోసేన్ మొహెబ్బీ టెహ్రాన్‌లో ఈ ప్రకటన చేయడంతో పశ్చిమాసియాలో (Middle East) మిలిటరీ ఉద్రిక్తతలు, ఆయుధ పోటీ సరికొత్త స్థాయికి చేరుకున్నాయి.

KhammamCommandControlScam:టెండర్ ఏదైనా వాటాల లొల్లి?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa22 Oct 2026, 08:51 AM

KhammamCommandControlScam:టెండర్ ఏదైనా వాటాల లొల్లి?

కేంద్రం నుంచి గ్రాంట్ రూపంలో రాష్ట్రానికి 25 శాతం, లోన్స్ రూపంలో 50 శాతం సమకూర్చుకునే నిధుల టెండర్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం పర్సంటేజీలతో పరేషాన్ చేస్తోంది. అర్హత పేరుతో 1 లేదా 2 కంపెనీలకే అవకాశం ఉండేలా చూస్తోంది. 20 శాతం నుంచి 30 శాతం కమీషన్ ఇస్తేనే మీకు టెండర్ వస్తుందని ముందే తెగేసి చెప్పేస్తున్నారు. అది భరించే సంస్థలకే ఇస్తామని చెప్పడంతో అర్హత ఉన్నా చాలామంది కాంట్రాక్టర్స్ వెనకడుగు వేస్తున్నారు. ప్రధాని ఏక్తామాల్ నిర్మాణంలో రూ.100 కోట్లు ఇప్పటికే ఎస్కలేషన్ పేరుతో లేపేశారు.

SBI కస్టమర్లకు అలర్ట్‌.. డార్క్‌ వెబ్‌లో వ్యక్తిగత వివరాలు!వ్యాపారంSwechaa21 Oct 2026, 11:53 PM

SBI కస్టమర్లకు అలర్ట్‌.. డార్క్‌ వెబ్‌లో వ్యక్తిగత వివరాలు!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కస్టమర్ల వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన డేటా లీక్‌ వ్యవహారం కలకలం రేపుతోంది. డార్క్‌ వెబ్‌లో లభించిన సుమారు 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా, వాటిలో 3,897 రికార్డుల్లో వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం ఉన్నట్లు బ్యాంకు గుర్తించింది.

TG: దసరా దావత్‌లో మందుబాబుల రికార్డు.. రూ.2,054 కోట్ల అమ్మకాలు!తెలంగాణSwechaa21 Oct 2026, 09:40 PM

TG: దసరా దావత్‌లో మందుబాబుల రికార్డు.. రూ.2,054 కోట్ల అమ్మకాలు!

TG: తెలంగాణలో పండుగ వచ్చిందంటే చాలు.. ఊరూవాడా దావత్‌ల రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దసరా వేడుకలకు తోడు వరుస సెలవులు రావడంతో ఈసారి రాష్ట్రవ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. వైన్ షాపుల ముందు మందుబాబులు క్యూలు కట్టి పోటీపడి కొనడంతో లిక్కర్ అమ్మకాలు సరికొత్త రికార్డులను తిరగరాశాయి. కేవలం 19 రోజుల వ్యవధిలోనే ఏకంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడై ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. గత ఏడాది దసరా సీజన్‌తో పోలిస్తే అమ్మకాల విలువ ఏకంగా 37.02 శాతం పెరగడం విశేషం.

మా ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఒప్పుకుంటా- మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలుతెలంగాణSwechaa21 Oct 2026, 09:07 PM

మా ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని ఒప్పుకుంటా- మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Congress: కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. కాంగ్రెస్ నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో తెలుపుతూ బీఆర్ఎస్ నాయకులు పలు ఆధారాలు కూడా బయటపెట్టారు. యధేచ్చగా అవినీతికి పాల్పడుతున్న వ్యక్తుల పేర్లను కూడా వారు బహిర్గతం చేశారు. ఏ విధంగా, ఏ రేంజ్ లో కరప్షన్ జరుగుతుందో ఎవిడెన్స్ తో సహా వివరిస్తున్నారు.

TG: ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ క్లీన్ స్వీప్!తెలంగాణSwechaa21 Oct 2026, 08:43 PM

TG: ఆర్టీసీ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ క్లీన్ స్వీప్!

TG: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ ఘన విజయం సాధించింది. ప్రభుత్వం అండదండలు ఉన్న కాంగ్రెస్ అనుబంధ సంఘం టీడబ్ల్యూయూ ఎన్ని ఎత్తులు వేసినా, కార్మికులు మాత్రం వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తమకు నచ్చిన ఎంప్లాయీస్ యూనియన్‌కే జై కొట్టారని చెబుతున్నారు.

రైతులకు బిగ్ రిలీఫ్.. ల క్ష ఎకరాలకు సాగునీరుతెలంగాణSwechaa21 Oct 2026, 07:30 PM

రైతులకు బిగ్ రిలీఫ్.. ల క్ష ఎకరాలకు సాగునీరు

Jupally: ఎల్ నినోతో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడిన వేళ ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు ఉపశమనం దక్కింది. నార్లాపూర్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్ లోకి మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిని విడుదల చేయడంతో అదనంగా లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై నిర్లక్ష్యం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా వదిలేసిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు నీటిని విడుదల చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

Bangladesh PM: దుర్గామాత గుడిలో బంగ్లా ప్రధాని పూజలు!InternationalSwechaa21 Oct 2026, 07:23 PM

Bangladesh PM: దుర్గామాత గుడిలో బంగ్లా ప్రధాని పూజలు!

Bangladesh PM: బంగ్లాదేశ్‌లో గత కొంతకాలంగా మైనారిటీలైన హిందువులపై వరుస దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం, ఆలయాల విధ్వంసం వంటి ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఆ దేశ ప్రధాని తారిక్ రహ్మాన్ స్వయంగా దుర్గామాత ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం రంగ్‌పూర్‌లోని ప్రసిద్ధ రాధా గోవింద్ ధర్మ సభ ఆలయాన్ని సందర్శించిన ఆయన, అక్కడ కొలువుదీరిన దుర్గామాత పూజా కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ప్రధానికి ఆలయ పెద్దలు భవతోష్ సర్కార్, ఖోకోన్ సర్కార్ దగ్గరుండి స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయంలో హాస్టల్ నిర్మాణ పనుల కోసం రూ. 10 లక్షల బంగ్లా టాకాలను తారిక్ రహ్మాన్ విరాళంగా అందజేశారు.

ఎంపీ ఈటల రాజేందర్ కీలక నిర్ణయం.. 27 నుంచి పాదయాత్రతెలంగాణSwechaa21 Oct 2026, 06:43 PM

ఎంపీ ఈటల రాజేందర్ కీలక నిర్ణయం.. 27 నుంచి పాదయాత్ర

Eatala Rajender: జవహర్ నగర్ డంప్ యార్డ్ విషయంలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డంప్ యార్డ్ తరలించాలనే డిమాండ్ తో ఆయన పాదయాత్ర చేయనున్నారు. డంప్ యార్డ్ వల్ల చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటోందన్న ఈటల.. ప్రభుత్వం వెంటనే స్పందించి డంప్ యార్డును అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా.. జవహర్ నగర్ బాధితులు, పర్యావరణ పరిరక్షణ కోసం భారీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 23న జవహర్ నగర్ బాధితులతో స్థానికంగా సమావేశం కానున్నారు. 25న మేధావులు, పర్యావరణవేత్తలతో డంప్ యార్డు ఏరియాలోనే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక డంప్ యార్డుని తరలించాలనే డిమాండ్ తో 27 నుంచి పాదయాత్ర చేయనున్నారు.

Telangana: రేవంత్ రెడ్డిని సీఎం చేసిన కేసీఆర్.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు!!..రాజకీయాలుSwechaa21 Oct 2026, 06:31 PM

Telangana: రేవంత్ రెడ్డిని సీఎం చేసిన కేసీఆర్.. ఇలా జరుగుతుందని ఊహించి ఉండడు!!..

ఒకప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఢీకొంటూ అరెస్టులు, జైలు జీవితాన్ని ఎదుర్కొన్న రేవంత్‌.. వెనక్కి తగ్గకుండా రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. కాంగ్రెస్‌ లో పీసీసీ అధ్యక్షుడిగా ఎదిగి, 2023లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు తెరదించారు. ఈ క్రమంలో కేసీఆర్.. ఇలా జరుగుతుందని అసలు ఊహించి ఉండడు!!.. రేవంతు ను గెలికి ఇబ్బందులు పెట్టి మరి సిఎం కావాలనే పట్టుదల పెరగడానికి కారణం అయ్యాడనే టాక్ ఉంది.

TG: లంచగొండులకు సచివాలయం అండ... 22 కేసులు క్లోజ్?తెలంగాణSwechaa21 Oct 2026, 05:52 PM

TG: లంచగొండులకు సచివాలయం అండ... 22 కేసులు క్లోజ్?

తెలంగాణలో ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అవినీతి అధికారులను సచివాలయం వెనకేసుకొస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లలో ఏసీబీ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరిన 22 కేసుల్లో ప్రభుత్వం అనుమతి నిరాకరించడమే కాకుండా, ఆ కేసులను ఉపసంహరించుకోవాలని దర్యాప్తు సంస్థను ఆదేశించినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం. పద్మనాభరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి (సీఎస్) లేఖ రాశారు.

Double Salary Scam: తెలంగాణలో దొంగ జీతాల బాగోతం.. ఇంత కాలం ఏం చేశారు?తెలంగాణSwechaa21 Oct 2026, 05:49 PM

Double Salary Scam: తెలంగాణలో దొంగ జీతాల బాగోతం.. ఇంత కాలం ఏం చేశారు?

నెల తిరిగేసరికి ఒక్క కొలువు చేసి సంపాదించుకున్న జీతం అందుకోవడానికే సగటు ఉద్యోగి ట్రెజరీ వైపు ఆశగా ఎదురుచూసే రోజులివి. అలాంటిది ఎలాంటి జంకూ గొంకూ లేకుండా, సర్కారు ఖజానానే గుల్ల చేస్తూ ఏకంగా రెండేసి జీతాలు లాగేస్తున్న దొంగ ఉద్యోగుల ముఠా గుట్టు తెలంగాణలో రట్టయింది. ఒకే ఆధార్ కార్డును రెండు వేర్వేరు శాఖల్లో జతచేసి, ఏళ్ల తరబడి రెండు చేతులా ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న వైనం సెక్రటేరియట్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఉద్యోగుల డేటాను పక్కాగా ఆన్‌లైన్ చేసి ఆధార్‌తో లింక్ చేసే క్రమంలో ప్రభుత్వం నియమించిన అహ్మద్ నదీం కమిటీ పరిశీలనలో ఏకంగా 3,900 మంది ఉద్యోగులు ఈ రకంగా డబుల్ శాలరీలు గుంజుతున్నట్లు తేలడంతో అధికారులు నివ్వెరపోయారు.

FSSAI Raid: కరకరలాడే స్నాక్స్ కావు... కల్తీ విషం!తెలంగాణSwechaa21 Oct 2026, 05:41 PM

FSSAI Raid: కరకరలాడే స్నాక్స్ కావు... కల్తీ విషం!

రంగురంగుల ప్యాకెట్లలో మెరుస్తూ, కొరకగానే కరకరలాడే చప్పుడుతో పిల్లల నాలుకను ఊరించే ఆ చిరుతిళ్లు అమృతం కావు... నిలువెల్లా విషం అని అంటున్నారు అధికారులు. రూపాయి, రెండు రూపాయలకే ప్యాకెట్ నిండా దొరుకుతున్నాయి కదా అని పిల్లల చేతుల్లో పెడుతున్న ఆ స్నాక్స్, వాళ్ల పసి ప్రేవులను నిశ్శబ్దంగా కుళ్లబెడుతున్నాయని తెలిస్తే ఏ తల్లిదండ్రుల గుండెలైనా బద్దలవ్వాల్సిందే. కాసుల కోసం కళ్లుమూసుకున్న కల్తీ ముఠాలు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతూ సాగిస్తున్న విష దందా హైదరాబాద్ వేదికగా రట్టయింది. కాటేదాన్ సమీపంలోని ప్రేమావతిపేటలో రూల్స్‌ని తుంగలో తొక్కి సాగుతున్న సాహిల్ ఫుడ్స్‌కు చెందిన నాలుగు తయారీ కేంద్రాలపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేయడంతో ఈ వికృత రూపం బయటపడింది.

మంచిర్యాలలో హైటెన్షన్.. కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరుతెలంగాణSwechaa21 Oct 2026, 05:13 PM

మంచిర్యాలలో హైటెన్షన్.. కాంగ్రెస్‌లో భగ్గుమన్న వర్గపోరు

Congress: మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి భగ్గుమంది. కాంగ్రెస్ నేతల మధ్య గ్రూప్ వార్ తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మరో నేత జగన్ మోహన్ రావు వర్గీయుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన పలువురికి గాయాలయ్యాయి. ఈ క్రమంలో జగన్ మోహన్ రావు ఇంటిపై ఎమ్మెల్యే వర్గీయులు దాడి చేస్తారన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జగన్ మోహన్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

రౌడీయిజం, అరాచకాలపై ఉక్కుపాదం మోపాలి: సీఎం చంద్రబాబుఏపీSwechaa21 Oct 2026, 04:11 PM

రౌడీయిజం, అరాచకాలపై ఉక్కుపాదం మోపాలి: సీఎం చంద్రబాబు

 ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, పోలీసులు రౌడీయిజం, అరాచకాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.  మంగళగిరిలోని 6వ ఏపీఎస్పీ (APSP) బెటాలియన్‌లో నిర్వహించిన 'పోలీసు అమరవీరుల సంస్మరణ దినం' కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నేరస్థులకు పోలీసు యూనిఫాం చూస్తే ఒణుకు పుట్టాలని, అదే సమయంలో బాధితులకు పూర్తి భరోసా కల్పించేలా ప్రవర్తించాలని హితవు పలికారు.

TG: తెలంగాణలో అన్నం తినే పరిస్థితి లేదా? కిలో రూ.90కి చేరిన సన్న బియ్యం!తెలంగాణSwechaa21 Oct 2026, 03:53 PM

TG: తెలంగాణలో అన్నం తినే పరిస్థితి లేదా? కిలో రూ.90కి చేరిన సన్న బియ్యం!

కూరగాయలు, నూనెల రేట్లు పెరిగితేనే సర్దుకుపోయే సామాన్యుడికి, ఇప్పుడు రోజూ తినే నాలుగు మెతుకులు కూడా గొంతులో పచ్చివెలక్కాయలా మారుతున్నాయి. తెలంగాణలో సన్న బియ్యం ధరలు గతంలో ఎన్నడూ లేని రీతిలో భగ్గుమంటూ పేద, మధ్యతరగతి వర్గాల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. కేవలం కొద్ది నెలల క్రితం వరకు రూ. 50 నుంచి రూ. 55 మధ్య లభించిన సన్నాలు, ఇప్పుడు అమాంతం పెరిగి ప్రాంతాన్ని బట్టి కిలో ఏకంగా రూ. 65 నుంచి రూ. 90 దాకా పలుకుతున్నాయి. పండుగల సీజన్ ముంగిట ప్రధాన ఆహారమైన బియ్యం రేట్లు ఇలా ఆకాశాన్నంటుతుండటం గృహిణుల నెలవారీ బడ్జెట్‌ను పూర్తిగా తలకిందులు చేస్తోంది.

ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు వద్దు: మంత్రి సీతక్కతెలంగాణSwechaa21 Oct 2026, 03:47 PM

ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు వద్దు: మంత్రి సీతక్క

 ప్రకృతి వైపరీత్యాలపై రాజకీయాలు చేయొద్దని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రతిపక్షాలకు హితవు పలికారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో (El Nino) ప్రభావంతో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగి వర్షపాతం తగ్గే ముప్పు ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు భవిష్యత్తులో ప్రజలకు ఎలాంటి నీటి ఎద్దడి, తాగునీటి కొరత తలెత్తకుండా సమర్థవంతమైన ప్రణాళికలు అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క  స్పష్టం చేశారు.

కాంగ్రెస్ - సీపీఐ దోస్తీకి ఎమ్మెల్సీ చిచ్చు!తెలంగాణSwechaa21 Oct 2026, 03:22 PM

కాంగ్రెస్ - సీపీఐ దోస్తీకి ఎమ్మెల్సీ చిచ్చు!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే పాత నానుడి తెలంగాణ రాజకీయ వేదికపై మరోసారి ప్రత్యక్షమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేతికి చేయి కలిపి, కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన అసలైన మిత్రపక్షం సీపీఐని పక్కనబెట్టి.. ఎన్నికల్లో తమతో కత్తులు దూసిన ప్రత్యర్థుల గడపను అధికార పార్టీ తొక్కడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా జెండా పాతాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతో వ్యూహాలు రచిస్తుండగా, క్షేత్రస్థాయిలో వామపక్షాల మద్దతు కూడగట్టే క్రమంలో గాంధీభవన్ వేస్తున్న అడుగులు విమర్శలకు తావిస్తున్నాయి.

జియో  ఐపీవోకు భారీ స్పందన.. 3.68 రెట్లు సబ్‌స్క్రైబ్NationalSwechaa21 Oct 2026, 03:15 PM

జియో ఐపీవోకు భారీ స్పందన.. 3.68 రెట్లు సబ్‌స్క్రైబ్

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫామ్స్ ఇవాళ పబ్లిక్ ఇష్యూకు రాగా, మార్కెట్లో అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. రూ. 30,213 కోట్ల విలువైన ఈ భారీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయి సరికొత్త రికార్డును సృష్టించింది.క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (QIB) విభాగంలో ఇన్వెస్టర్లు విపరీతమైన ఆసక్తి చూపించారు. ఐపీఓ ప్రారంభమైన ఉదయం 10 గంటల సమయానికే QIB కోటా 2.86 రెట్లు సబ్‌స్క్రైబ్ కాగా, ఆ తర్వాత అది 3.68 రెట్లకు పైగా దూసుకెళ్లింది. సాధారణ రిటైల్ మదుపరుల నుంచి మొదటి రోజు ఉదయం స్పందన కాస్త నెమ్మదిగా ఉన్నట్టు తెలిసింది. పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందే (అక్టోబర్ 19న) యాంకర్ ఇన్వెస్టర్ల బుక్ కోసం ఏకంగా రూ. 2.5 లక్షల విలువైన బిడ్స్ దాఖలయ్యాయి. ఆఫర్ చేసిన దానికంటే దాని విలువ 30 రెట్లు ఎక్కువ.

డ్రైవర్లు రాలేదని కండక్టర్లకు వేధింపులు.. ఇంటికి వెళ్లిపోవాలని!తెలంగాణSwechaa21 Oct 2026, 02:51 PM

డ్రైవర్లు రాలేదని కండక్టర్లకు వేధింపులు.. ఇంటికి వెళ్లిపోవాలని!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుషాయిగూడ ఆర్టీసీ డిపో వద్ద ఇవాళ ఉదయం స్వల్ప వివాదం నెలకొంది. విధులకు హాజరయ్యేందుకు డిపో వద్దకు వచ్చిన మహిళా కండక్టర్లను అధికారులు అడ్డుకున్నారు. విధుల్లోకి రావాల్సిన అవసరం లేదని అనుమతించలేదు. ‘బస్ డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి’ అంటూ వారిని అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకుండా అడ్డుకున్నట్టు సమాచారం. దీంతో మహిళా కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులకు కేటాయించిన డ్రైవర్లు విధులకు రాకపోతే మమ్మల్ని సెలవు పెట్టి వెళ్లాలని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు.విధుల్లోకి అనుమతించాలని డిపో ఎదుటే ఆందోళనకు దిగారు. ఉదయమే డిపోకు చేరుకున్నా అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకాలు చేయనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని మహిళా కండక్టర్లు వాపోయారు. డ్రైవర్లు విధులకు హాజరు కాని సందర్భాల్లో తమను సెలవు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మహిళా కండక్టర్లు తీవ్ర ఆరోపణలు చేశారు.

Tollywood: వీళ్ళు రిటైర్‌మెంట్ తీసుకున్నట్టేనా?సినిమాSwechaa21 Oct 2026, 02:42 PM

Tollywood: వీళ్ళు రిటైర్‌మెంట్ తీసుకున్నట్టేనా?

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో 15 ఏళ్ళకి పైగా కొనసాగుతున్న సీనియర్ హీరోయిన్స్ కొందరు గత కొంతకాలంగా సినిమాలు లేక, రాక రిలాక్స్ అవుతున్నారు. ఒకదశలో హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న వీరికి, ఇప్పుడు అవకాశాలు కరువయ్యాయి. చెప్పాలంటే, మన సీనియర్ స్టార్ హీరోలకి మంచి జోడీ. కానీ, ప్రేక్షకులే వారిపై ఆసక్తి చూపడం లేదు. ఆ హీరోయిన్స్‌లో ముఖ్యంగా అనుష్క శెట్టి, మిల్కీ బ్యూటీ తమన్నా, కాజల్ అగర్వాల్, ప్రియమణి, త్రిష లాంటి వారున్నారు.

బీసీ సీఎంపై మాట మార్చిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్తెలంగాణSwechaa21 Oct 2026, 02:32 PM

బీసీ సీఎంపై మాట మార్చిన పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తరపున బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారని గత కొంతకాలంగా చెబుతూ వచ్చిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఒక్కసారిగా మాట మార్చారు. ఇప్పుడు బీసీ లీడర్ ముఖ్యమంత్రి కావడానికి తొందర ఏమీ లేదన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. పీసీసీ చీఫ్ ఇలా రెండు రెండు మాటలు మాట్లాడితే కాంగ్రెస్, ఆ పార్టీ నేతలను ఎలా నమ్మాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్‍కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సీఎం రేవంత్ పరిపాలన చూస్తుంటే 2034 వరకే కాదు, 2039 వరకు కూడా తామే అధికారంలో ఉంటామని జోస్యం చెప్పారు. భవిష్యత్‍లో ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా బీసీ నేత సీఎం అవుతారని, ఇది కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్నారు. కానీ, భవిష్యత్‍లో మాత్రం బీసీ వ్యక్తి తప్పకుండా సీఎం అవుతారని పేర్కొన్నారు.

Bhagwant Mann: సీఎంకు ఎయిర్‌పోర్ట్‌లో ఫైన్.. ఆమ్‌ఆద్మీ పార్టీలో తీవ్ర కలకలం!NationalSwechaa21 Oct 2026, 02:13 PM

Bhagwant Mann: సీఎంకు ఎయిర్‌పోర్ట్‌లో ఫైన్.. ఆమ్‌ఆద్మీ పార్టీలో తీవ్ర కలకలం!

 ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు (Bhagwant Mann) ఢిల్లీ విమానాశ్రయంలో తీవ్ర అవమానం జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సంచలన ఆరోపణలు చేసింది. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు సీఎం మాన్‌ను సుమారు మూడు గంటల పాటు ఉద్దేశపూర్వకంగా నిర్బంధించి, ఆపై రూ.50వేల జరిమానా విధించారని ఆప్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది.

ఏపీ సర్కారుకు ‘సుప్రీం’ షాక్.. నామినేషన్ల గడువు పెంపు!ఏపీSwechaa21 Oct 2026, 01:56 PM

ఏపీ సర్కారుకు ‘సుప్రీం’ షాక్.. నామినేషన్ల గడువు పెంపు!

ఏపీ లోకల్ బాడీ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. నామినేషన్ ప్రక్రియ సమయంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ నేతల మధ్య వివాదం రాజుకుంది.ఈ క్రమంలోనే పలు మున్సిపాలిటీల పరిధిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. మున్సిపాలిటీలకు నామినేషన్ల గడువు ఇప్పటికే ముగియగా.. తాజాగా సుప్రీంకోర్టు ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న మొత్తం 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువు పెంచాలని ఆదేశించింది. దీనికి తోడు వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్ల గడువుపై ఇవాళే నిర్ణయం తీసుకోవాలన్న న్యాయస్థానం.. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించవద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది.

సైబర్ అటాక్..డార్క్‌వెబ్‌లో ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా లీక్!NationalSwechaa21 Oct 2026, 01:36 PM

సైబర్ అటాక్..డార్క్‌వెబ్‌లో ఎస్‌బీఐ ఖాతాదారుల డేటా లీక్!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు బిగ్ షాక్ తగిలింది. బ్యాంకు ఖాతాదారుల వివరాలకు సంబంధించిన పోర్టల్‌పై సైబర్ అటాక్ జరిగినట్టు తెలిసింది.ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం ధృవీకరించింది. ఎస్బీఐ ఖాతాదారుల వివరాలు డార్క్ వెబ్‌లో దర్శనం ఇచ్చినట్టు సమాచారం. ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 3,897 ఎస్బీఐ ఖాతాదారుల వివరాలు ప్రస్తుతం డార్క్ వెబ్‌లో అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. 3,897 కస్టమర్ల పేర్లు, సెల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈ-మెయిల్, ఇంటి చిరునామాలు, బ్రాంచ్ వివరాలు, CIF ఐడీలు, లోన్ రికార్డులు డార్క్‌వెబ్‌లో బహిర్గతం అయినట్టు ఎస్బీఐ బ్యాంకు ఓ అధికారిక నోట్ విడుదల చేసింది. అయితే, బ్యాంక్ ప్రధాన కార్యకలాపాలకు లేదా లావాదేవీలకు ఎలాంటి అంతరాయం కలగలేదని, పూర్తి దర్యాప్తు కోసం ఒక స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీని నియమించినట్టు ఎస్బీఐ ప్రకటించింది.

చిత్రం లేదు
క్రీడలుSwechaa21 Oct 2026, 01:30 PM

VIRAL VIDEO: మైదానంలోనే కంటతడి పెట్టుకున్న హర్మన్‌ప్రీత్!

భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) ఎట్టకేలకు తన సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ అద్భుతమైన ఫామ్‌లోకి వచ్చింది. గత కొంతకాలంగా వరుస వైఫల్యాలతో పరుగుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడిన ఆమె.. తాజాగా జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అజేయ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయింది. కేవలం 41 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో విధ్వంసకరంగా ఆడి ఏకంగా 91 పరుగులు సాధించింది.

Karthi: కార్తీ టార్గెట్ కూడా టాలీవుడ్!సినిమాSwechaa21 Oct 2026, 12:41 PM

Karthi: కార్తీ టార్గెట్ కూడా టాలీవుడ్!

Karthi: తమిళ, మలయాళ హీరోలు ఈ మధ్య మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంటున్నారు. మన తెలుగు హీరోలు ఇతర భాషలలో స్ట్రైట్ సినిమాలు చేయడానికి అవకాశాలు దక్కడం లేదు. కానీ, మన ఫిల్మ్ మేకర్స్ మాత్రం కోలీవుడ్, శాండిల్‌వుడ్ హీరోలను టాలీవుడ్‌కి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే, తమిళ స్టార్ హీరో కార్తి కూడా నేరుగా తెలుగు సినిమాలను చేస్తూ వస్తున్నాడు.