స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

చందనవల్లిలో సీఎం రేవంత్ సోదరుడి భూ దందా..!టాప్ న్యూస్Swechaa21 Oct 2026, 12:29 PM

చందనవల్లిలో సీఎం రేవంత్ సోదరుడి భూ దందా..!

రాష్ట్రంలో 22 ఏ నిషేధిత జాబితా భూముల పంచాయితీ ఇంకా కొలిక్కి రాకముందే తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడి భూ దందాపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికీ సీఎం కుటుంబ సభ్యుల మీద భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేత మన్నెక్రిశాంక్ ముఖ్యమంత్రి కుటుంబ ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు బయటపెడుతున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే రైతులు, సామాన్యుల భూములను నిషేధిత జాబితాలో చేర్చిందని, కమీషన్లు ఇచ్చిన వారి భూములను 22 ఏ నుంచి తీసేస్తున్నారని.. లేదంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీపావళి వరకు నిరసనలు ఆపేద్దాం: అభిజీత్ దీప్కే కీలక ప్రకటన!InternationalSwechaa21 Oct 2026, 11:49 AM

దీపావళి వరకు నిరసనలు ఆపేద్దాం: అభిజీత్ దీప్కే కీలక ప్రకటన!

 కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీనామా చేయాలనే డిమాండ్‌తో దేశ రాజధానిలో తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నిరసనకు బ్రేక్ పడింది. ఈ నిరసనలను దీపావళి పండుగ ముగిసే వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పండుగ వాతావరణంలో కార్యకర్తలందరూ తమ నిరసనలను పక్కనబెట్టి, కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడపాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Senior Heroes: సీనియర్ హీరోలు అస్సలు తగ్గట్లేదుగా..వీళ్లకి పాన్ ఇండియా క్రేజ్ అవసరం లేదుసినిమాSwechaa21 Oct 2026, 11:34 AM

Senior Heroes: సీనియర్ హీరోలు అస్సలు తగ్గట్లేదుగా..వీళ్లకి పాన్ ఇండియా క్రేజ్ అవసరం లేదు

Senior Heroes: సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున..ఇప్పుడు బాక్సాఫీస్ సందడంతా ఈ సీనియర్ హీరోలదే కనిపిస్తోంది. వరుసబెట్టి ఒక్కో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు..బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతున్నారు. వీరితో పోల్చుకుంటే నెక్స్ట్ జనరేషన్ హీరోలు చాలా వెనకబడి ఉన్నారు. కారణం, వాళ్ళు పాన్ ఇండియా సినిమా వెనకాల పరిగెత్తడమే.

India-US: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. రూబియో సంచలన ప్రకటన!InternationalSwechaa21 Oct 2026, 11:30 AM

India-US: భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. రూబియో సంచలన ప్రకటన!

 భారత్, యునైటెడ్ స్టేట్స్ (USA) మధ్య ఎంతోకాలంగా నిరీక్షిస్తున్న ప్రతిష్టాత్మక ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trade Deal) ఖరారుకు అతిసమీపంలో ఉన్నట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు. రెండు దేశాల మధ్య కొన్ని చిన్నచిన్న సాంకేతిక అంశాలు మాత్రమే పరిష్కరించాల్సి ఉందని, మరో కొద్ది వారాల్లోనే ఈ చారిత్రాత్మక ఒప్పందం అధికారికంగా ఖరారయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అధికారిక పర్యటనలో భాగంగా ముంబై చేరుకున్న మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో (S. Jaishankar) తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.

2027లోపు పోలీసు శాఖలోని అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa21 Oct 2026, 11:17 AM

2027లోపు పోలీసు శాఖలోని అన్ని ఖాళీలు భర్తీ చేస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి మరో శుభవార్త చెప్పారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘ఈ రోజు మనందరికీ ఎంతో భావోద్వేగమైన రోజు.. పోలీస్ అమరులను స్మరించుకునే రోజు. సమాజం కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరులకు నివాళులు’ అని పేర్కొన్నారు. 2027 లోగా పోలీస్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 డీఎస్పీలను నియమించామన్నారు.ట్రాన్స్ జెండర్స్‌ను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించి వారి ఆత్మగౌరవాన్ని పెంచామని, గతంలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన కానిస్టేబుళ్ల కు రూ.40 లక్షలు ఎక్స్గ్రేషియా ఉంటే దానిని ఏకంగా రూ. కోటికి పెంచామని తెలిపారు.

RC 17: దసరాకి సుకుమార్-చరణ్ సినిమా ఎందుకు మొదలవలేదు!సినిమాSwechaa21 Oct 2026, 10:57 AM

RC 17: దసరాకి సుకుమార్-చరణ్ సినిమా ఎందుకు మొదలవలేదు!

RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ ప్రాజెక్ట్‌ను దసరా పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రకటిస్తారని అంతటా ప్రచారం జరిగింది. కానీ, అసలు విజయదశమి రోజున ఈ ప్రాజెక్ట్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. దీంతో, సోషల్ మీడియాలో రక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి.

ప్రతి శ్వాస దేశం కోసమే.. పోలీసు అమరవీరులకు జోహార్లు!NationalSwechaa21 Oct 2026, 10:55 AM

ప్రతి శ్వాస దేశం కోసమే.. పోలీసు అమరవీరులకు జోహార్లు!

మనకు ఏదైనా ప్రమాదం ఎదురైతే మొదట గుర్తొచ్చే పేరు పోలీసు. ప్రకృతి విపత్తు విరుచుకుపడినా.. ప్రజల రక్షణ కోసం ముందుగా రంగంలోకి దిగేది పోలీసు వ్యవస్థే. వారి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ.. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన ప్రతి పోలీసు అమరవీరుడికి నివాళులర్పించే రోజే అక్టోబర్ 21.. పోలీసు అమరవీరుల దినోత్సవం.

AP: ఎంపీటీసీ, జడ్పీటీసీ సమరానికి సై.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ!ఏపీSwechaa21 Oct 2026, 10:31 AM

AP: ఎంపీటీసీ, జడ్పీటీసీ సమరానికి సై.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ షురూ!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సమరానికి తెరలేచింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న, గడువు ముగిసిన మండల పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గం (MPTC), జిల్లా పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గం (ZPTC) స్థానాలకు ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ప్రకటించింది. నిబంధనల ప్రకారం ప్రతిరోజు ఉదయం 11:00 గంటల నుంచి సంబంధిత మండల ప్రజా పరిషత్ (MPP), జిల్లా పరిషత్ (ZP) కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులు ఈ దరఖాస్తులను స్వీకరిస్తారు.

దొరికినంత దోచుడే.. మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్లు..!తెలంగాణSwechaa21 Oct 2026, 10:28 AM

దొరికినంత దోచుడే.. మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్లు..!

కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటివరకు మంత్రులు, ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు రాగా తాజాగా వారి పీఏ(పర్సనల్ అసిస్టెంట్స్) మీద కూడా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏ ఏకంగా రూ.కోట్ల స్కాం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు దొరికిన కాడికి దోచుడే అనే కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఎవరికైనా మంత్రి, ఎమ్మెల్యేలతో పని ఉంటే అపాయింట్ మెంట్ ఇప్పించడం దగ్గరి నుంచి వారి పని పూర్తి చేసిపెట్టడానికి ఓ రేటు ఫిక్స్ చేసినట్టు సమాచారం.

మరోసారి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశంతెలంగాణSwechaa21 Oct 2026, 09:54 AM

మరోసారి కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల సమావేశం

తెలుగు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారానికి మరోసారి కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు సమావేశం కానున్నాయి.కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాల వాటాకు సంబంధించి ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించిన పరస్పర ఫిర్యాదులు, పోలవరం, టెలీమెట్రీ పరికరాల ఏర్పాటు సహా ఇతర అంశాలు బోర్డు సమావేశాల్లో ప్రస్తావనకు రానున్నాయి. 26న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, 30న గోదావరి నదీ యాజమాన్య బోర్డుల సమావేశం జరగనుంది. ఈ సమావేశాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన అధికారులు, ఇంజినీర్లు పాల్గొననున్నారు.

Viral: స్వలింగ సంపర్క జంట.. సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కానున్న ప్రధాని దంపతులు!InternationalSwechaa21 Oct 2026, 09:26 AM

Viral: స్వలింగ సంపర్క జంట.. సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కానున్న ప్రధాని దంపతులు!

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి రాబ్ జెట్టెన్, ఆయన భాగస్వామి నికోలస్ కీనన్ సరోగసీ ద్వారా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించారు. తమ జీవితంలోకి రాబోయే తొలి సంతానం కోసం తాము ఎంతగానో ఎదురుచూస్తున్నామని, 2027లో చిన్నారిని ఆహ్వానించనున్నట్లు ఈ స్వలింగ సంపర్క జంట సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ ప్రక్రియ పూర్తిగా వాణిజ్యపరమైన ప్రయోజనాలు లేకుండా, స్నేహితుల సహకారంతోనే జరిగిందని జెట్టెన్ ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రాట్స్ 66 (D66) పార్టీ స్పష్టం చేసింది. నెదర్లాండ్స్ చట్టాలకు లోబడి ఐవీఎఫ్ పద్ధతిలో ఈ గర్భధారణ జరిగిందని, ఎగ్ డోనర్‌గా, సరోగేట్ తల్లుగా వ్యవహరించిన తమ స్నేహితురాలికి జంట కృతజ్ఞతలు తెలిపింది.

Jailer 2: రజినీ మేనియా..ప్రతీరోజూ 100కోట్ల గ్రాస్!సినిమాSwechaa21 Oct 2026, 09:04 AM

Jailer 2: రజినీ మేనియా..ప్రతీరోజూ 100కోట్ల గ్రాస్!

Jailer 2: సౌత్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ 2 మూవీతో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద భారీ కమర్షియల్ సక్సెస్‌ను సాధించింది. మనకి అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో గానీ పార్ట్ 2 సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ. అందుకే, జైలర్ లాంటి మంచి కమర్షియల్ హిట్ తర్వాత ఇదే సినిమాకి సీక్వెల్ అంటే కాస్త సందేహాలు కలిగాయి.

Rakul Preet Singh: నెగిటివ్ రోల్స్‌కి పర్‌ఫెక్ట్ ఛాయిస్ దొరికిందా!సినిమాSwechaa21 Oct 2026, 08:32 AM

Rakul Preet Singh: నెగిటివ్ రోల్స్‌కి పర్‌ఫెక్ట్ ఛాయిస్ దొరికిందా!

Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్..చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కనిపించింది. అది కూడా 4000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ మూవీ రామాయణతో. ఇందులో, రకుల్ నెగిటివ్ రోల్ చేసింది. మైథలాజికల్ సినిమాలో నటించడం రకుల్‌కి ఇదే మొదటి సారి. ఈ సినిమాలో శూర్పణఖ పాత్రలో అలరించడానికి సిద్ధమవుతోంది. ఇటీవల, ఈ సినిమా ట్రైలర్ చూస్తే, రకుల్ శూర్పణఖ పాత్రలో అద్భుతంగా నటించినట్టు అనిపించింది.

డాలర్‌పై రూపాయి వార్.. ఆర్బీఐ మాస్టర్ ప్లాన్!వ్యాపారంSwechaa20 Oct 2026, 11:40 PM

డాలర్‌పై రూపాయి వార్.. ఆర్బీఐ మాస్టర్ ప్లాన్!

డాలర్ తో పోటీ పడలేక రూపాయి రోజు రోజుకూ ఇబ్బంది పడుతూనే ఉంది. లైఫ్ టైమ్ కనిష్టానికి చేరుకుంటూ.. చుక్కలు చూపెడుతోంది. చమురు కంపెనీలకు ప్రత్యేక డాలర్ విండో.. ఫారెక్స్ ట్రేడింగ్‌పై కఠిన ఆంక్షలు.. ఊహాజనిత లావాదేవీలకు చెక్.. లాంటి అంశాలను RBI తెరపైకి తెస్తోంది. మరి ఈ వ్యూహం పనిచేస్తుందా?

Sai Pallavi: జీవితంలో ఇలాంటి రోల్ చేయడం అందరివల్లా కాదు!సినిమాSwechaa20 Oct 2026, 10:57 PM

Sai Pallavi: జీవితంలో ఇలాంటి రోల్ చేయడం అందరివల్లా కాదు!

Sai Pallavi: హీరోయిన్స్‌కి ఛాలెంజింగ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. కానీ, అందరూ అలాంటి రోల్స్ చేయడానికి ధైర్యం చేయరు. ఎక్కువమంది ఫక్తు కమర్షియల్ సినిమాలను చేయడానికి, గ్లామర్ హీరోయిన్ అనిపించుకోవడానికే ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే, మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రయోగాలు చేసే హీరోయిన్స్ చాలా తక్కువ. పైగా, అందరికీ ఇలాంటి పాత్రలు చేసే అవకాశం దక్కదు. రామాయణ సినిమాలో మాత్రం సాయి పల్లవి గొప్ప పాత్రను చేసే అవకాశం దక్కించుకుంది.

కాల్పులతో క్రేజ్‌.. భయంతో బ్రాండింగ్‌! అండర్ వరల్డ్ కొత్త గేమ్NationalSwechaa20 Oct 2026, 10:50 PM

కాల్పులతో క్రేజ్‌.. భయంతో బ్రాండింగ్‌! అండర్ వరల్డ్ కొత్త గేమ్

ఒకే ఒక్క కాల్పుల ఘటన.. దేశవ్యాప్తంగా చర్చ. ఒక గ్యాంగ్‌ పేరు.. సోషల్‌ మీడియాలో హడావుడి. ఆ తర్వాత బెదిరింపులు, ప్రకటనలు, వైరల్‌ పోస్టులు! ఒకప్పుడు అండర్‌వరల్డ్‌ అంటే డబ్బు, వ్యాపారాలపై పట్టు. ఇప్పుడు కొన్ని గ్యాంగ్‌ల చుట్టూ కనిపిస్తున్న పబ్లిసిటీ స్టంట్ మరో కోణాన్ని చూపిస్తోంది.

Tollywood: యంగ్ హీరోలు ఆది సాయి కుమార్‌లా మారాల్సిందే..సినిమాSwechaa20 Oct 2026, 09:46 PM

Tollywood: యంగ్ హీరోలు ఆది సాయి కుమార్‌లా మారాల్సిందే..

Tollywood: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ప్రతీ 10 ఏళ్ళకి జానర్ మారుతుంటుంది. ఒకదశలో కేవలం ప్రేమకథా చిత్రాలే ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కువగా యంగ్ హీరోలు చేసిన ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము దులుపుతాయి. బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్‌తో తొడకొట్టాడు. ఆ విధంగా ఇప్పుడు మిస్టిక్ థ్రిల్లర్స్, మైథలాజికల్, సస్పెన్స్ థ్రిల్లర్స్ భారీ సక్సెస్ సాధిస్తున్నాయి. ఆ పల్స్ పట్టుకున్నాడు ఆది సాయి కుమార్..హిట్ కొడుతున్నాడు.

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం..తెలంగాణSwechaa20 Oct 2026, 09:37 PM

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం..

Yadadri: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ ప్రాజెక్ట్‌లో మరో కీలక ఘట్టం నమోదైంది. 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. ట్రయల్ రన్ ప్రక్రియలో భాగంగా ఈ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని విజయవంతంగా ప్రారంభించి గ్రిడ్‌కు అనుసంధానించే దిశగా కీలక పురోగతి సాధించారు. 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ప్లాంట్ పూర్తిస్థాయి లక్ష్యం 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి మార్గం సుగమమైంది. మొత్తం 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్లాంట్‌లో ఇప్పటికే నాలుగు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా 5వ యూనిట్ ట్రయల్ రన్‌ను జెన్‌కో అధికారులు పూర్తి చేశారు. వచ్చే నెల నాటికి 5 యూనిట్లలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తికి అధికారులు చర్యలు చేపట్టారు.

Sharwanand: ఆ గంగ కాస్తా పెనుగంగగా మారితే "భోగి"సినిమాSwechaa20 Oct 2026, 09:30 PM

Sharwanand: ఆ గంగ కాస్తా పెనుగంగగా మారితే "భోగి"

Sharwanand: కొన్ని సినిమాలు కథా బలం మీద ఆడుతుంటాయి..బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ నమోదు చేస్తుంటాయి. అలాంటి, సినిమాల లిస్ట్‌లోకి చేరేలా ఉంది శర్వానంద్ నటిస్తున్న భోగి సినిమా. తాజాగా, ఈ సినిమా నుంచి సాంగ్ రిలీజైంది. విజయవాడలో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ సినిమా గురించి చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Devisriprasad: విజయదశమి రోజున "ఎల్లమ్మ" అప్‌డేట్..సినిమాSwechaa20 Oct 2026, 08:54 PM

Devisriprasad: విజయదశమి రోజున "ఎల్లమ్మ" అప్‌డేట్..

Devisriprasad: విజయదశమి పండుగ పర్వదినాన ఎల్లమ్మ సినిమా నుంచి ఊహించని అప్‌డేట్ రావడం ప్రేక్షకుల్లో ఆనందాన్ని కలిగించింది. అసలు, ఈ సినిమా గురించి గతకొన్ని రోజుల నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. వాటికి మేకర్స్ చెక్ పెడుతూ దసరా పండుగ రోజు ఎల్లమ్మ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ పోస్టర్ వదిలారు. 2027, మార్చి 5న ఎల్లమ్మ జాతర మొదలు కాబోతోంది.

Telangana: కాంగ్రెస్ చరిత్రలో మైలు రాయి 2023-2024.. రేవంతుడు హన్మంతుడే!!..తెలంగాణSwechaa20 Oct 2026, 06:57 PM

Telangana: కాంగ్రెస్ చరిత్రలో మైలు రాయి 2023-2024.. రేవంతుడు హన్మంతుడే!!..

ఒకప్పుడు తెలంగాణలో కాంగ్రెస్‌ అంటే అంతర్గత కుమ్ములాటలు.. నాయకుల మధ్య ఆధిపత్య పోరు! పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. రాముడి కార్యసాధనలో హనుమంతుడు కీలకమైనట్టే.. రాజకీయంగా దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్‌కు రేవంత్‌ కొత్త ఊపిరి అందించారు.

ఎన్నికల బరిలోకి టీఆర్ఎస్.. అభ్యర్థిని ప్రకటించిన కవితతెలంగాణSwechaa20 Oct 2026, 05:38 PM

ఎన్నికల బరిలోకి టీఆర్ఎస్.. అభ్యర్థిని ప్రకటించిన కవిత

Kavitha: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తమ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్‌ పేరుని ప్రకటించారు కవిత. పట్టభద్రులు తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బహుజనుల కోసం పోరాటం చేస్తానని ప్రకటించిన కవిత.. తన పార్టీ నుంచి తొలి అభ్యర్థిగా బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపిక చేశారు.

Vishwambhara: మెగాస్టార్ విశ్వంభర చిత్రాన్ని మర్చిపోండిక!సినిమాSwechaa20 Oct 2026, 04:27 PM

Vishwambhara: మెగాస్టార్ విశ్వంభర చిత్రాన్ని మర్చిపోండిక!

Vishwambhara: టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్‌లో ఇప్పటికే, ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మాస్ ఆడియన్స్‌లో చిరు క్రేజ్ నెక్స్ట్ లెవల్. అయితే, ఇప్పుడు సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’

సీజేపీ నేతలకు షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడగింపుNationalSwechaa20 Oct 2026, 02:53 PM

సీజేపీ నేతలకు షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు

కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు బిగ్ షాక్ తగిలింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అనుమతి లేకుండా నిరసనలు చేపట్టిన కేసులో సీజేపీ కీలక అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు న్యాయస్థానం మరోసారి షాక్ ఇచ్చింది.వీరి జ్యుడీషియల్ కస్టడీని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కోర్టు మరో రెండు రోజుల పాటు పొడిగించింది. అయితే, తీర్పు చెప్పే క్రమంలో న్యాయస్థానం సీజేపీ నేతల ప్రవర్తనపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. నిందితులకు చట్టమంటే ఏమాత్రం గౌరవం లేదని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనలు చేపట్టే ప్రాంతాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను డీ నోటిఫై చేసి సున్నితమైన ప్రదేశాల్లో జాబితాలో చేర్చినా అక్కడ పదేపదే నిరసనలకు పిలుపునివ్వడం సీజేపీ నేతలకు అలవాటుగా మారిందని మెజిస్ట్రేట్ అసహనం వెల్లిబుచ్చారు.

ముస్లిం సిటీగా మారనున్న ‘పారిస్’.. ట్రంప్ సంచలన కామెంట్స్InternationalSwechaa20 Oct 2026, 02:23 PM

ముస్లిం సిటీగా మారనున్న ‘పారిస్’.. ట్రంప్ సంచలన కామెంట్స్

ఫ్రాన్స్‌లో చెలరేగిన అల్లర్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలకు పాఠశాలల సమస్యలు, లేదా ఇతర కారణాలు కాదని, కేవలం వలసలే ప్రధాన కారణమని స్పష్టంచేశారు. తాను పలుమార్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మాట్లాడానని చెప్పారు. వలసవాదులను విపరీతంగా ప్రోత్సహిస్తూ ఫ్రాన్స్ తప్పు చేస్తోందని ఇప్పటికే చెప్పానని గుర్తుచేశారు. ప్రపంచం మొత్తం ఫ్రాన్స్‌కే వస్తోందని, అలా చేయడం సరికాదని హెచ్చరించినట్టు గుర్తుచేశారు.యూరప్, ఫ్రాన్స్ దేశాల అధ్యక్షులు వెంటనే తమ దేశాల సరిహద్దులను మూసివేయాలని సూచించారు. మితిమీరిన వలసదారుల వల్లే అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయని ట్రంప్ ఆరోపించారు. ఐరోపా ఇప్పటికైనా సరిహద్దులను మూసివేసి నిరసనలు చేస్తున్న వారిలో నేరస్థులను గుర్తించకపోతే యూరప్ మొత్తం నాశనమైపోతుందని పునరుద్ఘాటించారు.

AP: పవన్ కళ్యాణ్ కు సవాల్ గా చంద్రబాబు రాజకీయం!!.. జగన్ కు లాభమా!!..ఏపీSwechaa20 Oct 2026, 02:09 PM

AP: పవన్ కళ్యాణ్ కు సవాల్ గా చంద్రబాబు రాజకీయం!!.. జగన్ కు లాభమా!!..

ఒకప్పుడు చంద్రబాబు రాజకీయాలు విశ్లేషకులకు సైతం అంతుచిక్కకుండా సాగాయని చెబుతారు. అందులో ముఖ్యంగా మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడనే ఆరోపణలున్నాయి.. తర్వాత జగన్ హాయమంలో కష్టాల్లో ఉన్నప్పుడు పవన్ అండగా నిలబడటం రాజకీయంగా పుంజుకోవడం.. ఇప్పుడు కూటమిగా ఏపీలో అధికారంలోకి రావడం తెలిసిందే.. అయితే రాజకీయ వ్యూహాలలో ఆరితేరిన చంద్ర బాబు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో ఇబ్బందులు ఎదురైతే అంత సులువుగా ఏపీ రాజకీయాలు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేసి.. పవన్ వైపు మొగ్గు చూపే అవకాశమే ఉండదనే టాక్ ఉంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి లాగిన ఆశ్చర్య పోవలసిన అవసరం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు..

రీల్స్ పిచ్చి.. చిన్నారని సముద్రపు అలల్లో వదిలేసి వెర్రివేషాలు!వైరల్ న్యూస్Swechaa20 Oct 2026, 02:06 PM

రీల్స్ పిచ్చి.. చిన్నారని సముద్రపు అలల్లో వదిలేసి వెర్రివేషాలు!

ఓ జంట సెల్ఫీ, రీల్స్ పిచ్చిలో పడి కన్నకూతురిని సముద్రపు అలలకు వదిలేశారు. బీచ్ వద్ద చిన్నారి ఆడుకుంటూ ఉండగా.. ఆమె తండ్రి సెల్పీ స్టిక్ చేతబట్టుకుని వీడియో తీయడం ప్రారంభించాడు.దీంతో అప్పటివరకు చిన్నారిని పట్టుకున్న తల్లి..కూతురిని వదిలేసి భర్తతో కలిసి సెల్ఫీలు దిగడం మొదలెట్టింది.ఆ సమయంలో అలల ధాటికి చిన్నారి కొట్టుకుపోయినా ఏమీ పట్టనట్టు వీడియో తీసుకోవడంలో బిజీగా ఉండిపోయారు. ఇంతలో ఓ అబ్బాయి వచ్చి ఆ పాపను పట్టుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రీల్స్ పిచ్చిలో చిన్నారి ప్రాణాలనే పణంగా పెడతారా? అంటూ ఆ జంటపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విరుచుకపడుతున్నారు. మీ పైత్యానికి చిన్నారని బలి చేసే బదులు మీరే సముద్రంలోకి వెళ్లొచ్చు కదా? అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

రేపు పబ్లిక్ ఇష్యూకు ‘జియో’.. రూ.2.5 లక్షల కోట్ల బిడ్స్ దాఖలు!NationalSwechaa20 Oct 2026, 01:44 PM

రేపు పబ్లిక్ ఇష్యూకు ‘జియో’.. రూ.2.5 లక్షల కోట్ల బిడ్స్ దాఖలు!

స్టాక్ మార్కెట్ చరిత్రలో సరికొత్త చరిత్ర లిఖించేందుకు రిలయ్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రిస్‌ సిద్ధమైంది. రేపు జియో తొలిసారి పబ్లిక్ ఇష్యూ (IPO)కు రానుంది. దేశీయ టెలికాం, డిజిటల్ రంగాల్లో కీలకంగా మారిన జియో ఐపీవో అక్టోబర్ 21న ప్రారంభంకానుంది. కంపెనీ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ అక్టోబర్ 21న ప్రారంభమై అక్టోబర్ 23న ముగుస్తుంది. రెండ్రోజుల పాటు పబ్లిక్ ఇష్యూ కొనసాగనుంది. దీనికి ఇప్పటికే అపూర్వ స్పందన వచ్చినట్టు తెలుస్తోంది. రూ.8,110 కోట్ల యాంకర్ బుక్‌కు ఏకంగా 30 రెట్లకు పైగా (రూ.2.5 లక్షల కోట్లకు పైగా) బిడ్లు దాఖలైనట్టు సమాచారం. దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద పబ్లిక్ ఇష్యూగా నిలవనుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.ఐపీవో ద్వారా సుమారు రూ.30 వేల కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. షేర్ల ధరల శ్రేణిని రూ.1,065 - 1,119గా నిర్ణయించింది. ధరల శ్రేణిలో గరిష్ట స్థాయి ప్రకారం కంపెనీ రూ.30,213 కోట్లు సమీకరించే అవకాశం ఉంది.

మనుషులా? ఉన్మాదులా? భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్!.. ఆపై!క్రైమ్Swechaa20 Oct 2026, 01:30 PM

మనుషులా? ఉన్మాదులా? భర్త కళ్లెదుటే భార్యపై గ్యాంగ్ రేప్!.. ఆపై!

బిహార్ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భర్త ముందే వివాహితపై 8 మంది దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బిహార్‌ రాష్ట్రంలోని ఈస్ట్ చంపారన్ జిల్లా మధుబన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారియా సరేహ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. కొత్తగా పెళ్లైన ఓ జంట దుర్గా పూజ కోసం జాతరకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యారు. ఆ సమయంలో వారిని 8 మంది దుండగులు అడ్డుకున్నారు. భర్తను ఘోరంగా కొట్టి వారి వద్ద ఉన్న నగదు సహా నగలు లాక్కున్నారు. అనంతరం మహిళను మామిడి తోటలోకి లాక్కెళ్లి గ్యాంగ్‌ రేప్ చేశారు.భర్త అకౌంట్‌లో ఉన్న రూ.3 వేలు ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకుని అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

అమ్మాయి పేరిట ఫేక్ అకౌంట్స్. కేటుగాడి వలలో డీసీపీ, సీఐలు, టెకీలుక్రైమ్Swechaa20 Oct 2026, 01:00 PM

అమ్మాయి పేరిట ఫేక్ అకౌంట్స్. కేటుగాడి వలలో డీసీపీ, సీఐలు, టెకీలు

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన కె. పవన్ కుమార్ (23)లో హైదరాబాద్‌లో అనేక కంపెనీల్లో ఉద్యోగం చేసి మానేశాడు. ప్రస్తుతం నగరంలోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈజీ మనీ కోసం అమ్మాయిల పేర్లు, ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో 13, ఫేస్‌బుక్‌లో 14 ఫేక్ అకౌంట్లు సృష్టించి, యువకులు, పురుషులకు తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకునేవాడు.వారి వ్యక్తిగత వివరాలు, న్యూడ్ ఫొటోలను సేకరించాక స్వరం మార్చేవాడు. అమ్మాయి అన్నను అని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేయడం, మరికొందరి దగ్గర పెట్టుబడుల పేరిట వసూళ్లు చేసినట్టు తెలిసింది.పవన్ బాధితుల్లో సీఐలు, అదనపు డీసీపీలతో సహా 14 మంది పోలీసులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, గిగ్ వర్కర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. నాలుగేళ్లలో దాదాపు రూ.26.16 లక్షలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు.