స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

అమ్మాయి పేరిట ఫేక్ అకౌంట్స్. కేటుగాడి వలలో డీసీపీ, సీఐలు, టెకీలుక్రైమ్Swechaa20 Oct 2026, 01:00 PM

అమ్మాయి పేరిట ఫేక్ అకౌంట్స్. కేటుగాడి వలలో డీసీపీ, సీఐలు, టెకీలు

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలానికి చెందిన కె. పవన్ కుమార్ (23)లో హైదరాబాద్‌లో అనేక కంపెనీల్లో ఉద్యోగం చేసి మానేశాడు. ప్రస్తుతం నగరంలోని కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్నాడు. ఈజీ మనీ కోసం అమ్మాయిల పేర్లు, ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో 13, ఫేస్‌బుక్‌లో 14 ఫేక్ అకౌంట్లు సృష్టించి, యువకులు, పురుషులకు తనను తాను అమ్మాయిగా పరిచయం చేసుకునేవాడు.వారి వ్యక్తిగత వివరాలు, న్యూడ్ ఫొటోలను సేకరించాక స్వరం మార్చేవాడు. అమ్మాయి అన్నను అని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేయడం, మరికొందరి దగ్గర పెట్టుబడుల పేరిట వసూళ్లు చేసినట్టు తెలిసింది.పవన్ బాధితుల్లో సీఐలు, అదనపు డీసీపీలతో సహా 14 మంది పోలీసులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, గిగ్ వర్కర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. నాలుగేళ్లలో దాదాపు రూ.26.16 లక్షలు సంపాదించినట్టు పోలీసులు గుర్తించారు.

Nivetha Pethuraj: ఈసారి గురూజీ కాస్త సెకండ్ లీడ్‌ను వాడాడుగా!సినిమాSwechaa20 Oct 2026, 12:49 PM

Nivetha Pethuraj: ఈసారి గురూజీ కాస్త సెకండ్ లీడ్‌ను వాడాడుగా!

Nivetha Pethuraj: విక్టరీ వెంకటేష్, కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి జంటగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47’. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆదర్శ కుటుంబం నుంచి ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’ వచ్చి ఆకట్టుకుంది. ఈ క్రమంలో, తాజాగా ఈ సినిమా నుంచి రెండవ పాట ‘మాలా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

రావణుడు కాదు..‘బొద్దింక’ దహనమే ఈసారి స్పెషల్!NationalSwechaa20 Oct 2026, 12:37 PM

రావణుడు కాదు..‘బొద్దింక’ దహనమే ఈసారి స్పెషల్!

దసరా అనగానే అందరికీ రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం గుర్తుకువస్తుంది. దేశరాజధాని ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఈ ఆనవాయితీని పాటిస్తారు.ఈసారి కూడా రావణాసురుడి బొమ్మను దహనం చేసేందుకు ఢిల్లీలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ,ఈసారి ఢిల్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా వరుసగా నిరసనలు చేపడుతున్న కాక్రోజ్ జనతా పార్టీ (సీజేపీ) సింబల్ అయిన బొద్దింకను కూడా దహనం చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. శ్రీ కేశవ్ రామలీలా కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ మైదానంలో ఏకంగా 30 అడుగుల భారీ బొద్దింక (కాక్రోచ్) దిష్టిబొమ్మను ఏర్పాటు చేశారు.రావణాసురుడి బొమ్మతో పాటే బొద్దింక బొమ్మను కూడా ఇవాళ సాయంత్రం దహనం చేయనున్నారు.వాటితో పాటే కుంభకర్ణుడు, మేఘనాథుడి దిష్టిబొమ్మలను కూడా దహనం చేయనున్నట్టు శ్రీ కేశవ్ రామలీలా కమిటీ ప్రకటించింది.

స్వర్ణం  సాధించిన తెలంగాణ స్టార్ అథ్లెట్..క్రీడలుSwechaa20 Oct 2026, 12:04 PM

స్వర్ణం సాధించిన తెలంగాణ స్టార్ అథ్లెట్..

పారా ఏషియన్ క్రీడల్లో తెలంగాణ క్రీడాకారిణి మరోసారి సత్తా చాటారు. భారత జాతీయ పతాకాన్ని విదేశీ గడ్డపై సగర్వంగా ఎగరేశారు. పారా ఏషియన్ గేమ్స్-2026లో రాష్ట్రానికి చెందిన అథ్లెట్ దీప్తి జివాంజీ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారు. మహిళల 400 మీటర్ల రన్నింగ్ విభాగం ఫైనల్లో అద్భుతమైన వేగంతో దూసుకెళ్లారు. కేవలం 56.36 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకుని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. పరుగు ప్రారంభం నుంచే పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. పారా ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు ఇది 5వ స్వర్ణ పతకం కావడం విశేషం. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి అంతర్జాతీయ ట్రాక్‌లపై నిలకడగా రాణిస్తున్న దీప్తి.. 2024 పారిస్ పారాలింపిక్స్‌లోనూ కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు.తాజాగా పసిడి పతకం సాధించడంతో ఆమె విజయాన్ని అందరూ కీర్తిస్తున్నారు.

SS Rajamouli: ఆరేడు సినిమాలు కలిపితే వారణాసి..సినిమాSwechaa20 Oct 2026, 11:43 AM

SS Rajamouli: ఆరేడు సినిమాలు కలిపితే వారణాసి..

SS Rajamouli: గతకొంతకాలంగా సీక్వెల్స్ మీద మన మేకర్స్ దృష్టి పెడుతున్నారు. కథను లార్జర్ దాన్ లైఫ్ అన్న రీతిలో తయారు చేసి రెండు లేదా మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. వీటికి, సీక్వెల్స్, ఫ్రాంఛైజీస్, ఛాప్టర్స్ అంటూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా వారణాసి సినిమా గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇచ్చిన స్టేట్‌మెంట్ చూస్తే కొన్ని సినిమాలను కలిపితే ఒక్క వారణాసి అవుతుందనిపిస్తోంది.

వరంగల్ ప్రజలకు షాక్.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం వాయిదా!తెలంగాణSwechaa20 Oct 2026, 11:20 AM

వరంగల్ ప్రజలకు షాక్.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం వాయిదా!

వరంగల్ ప్రజలకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇవాళ ప్రారంభం కావాల్సిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. దసరా కానుకగా ఆస్పత్రిని 'సాఫ్ట్ లాంచ్' చేసి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలను ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని అనివార్య కారణాలతో హాస్పిటల్ ప్రారంభం వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.ఈ విషయం తెలియడంతో ఉమ్మడి వరంగల్ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.ఆసుపత్రి భవన నిర్మాణం, మౌలిక వసతులు, వైద్య పరికరాలు సమకూర్చడంలో ఆలస్యం కావడంతో ప్రారంభాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.అయితే, సరైన సన్నద్ధత లేకుండా కేవలం ప్రచారం కోసమే మంత్రులు గడువులు ప్రకటిస్తున్నారని, ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్థానిక ప్రజాసంఘాలు మండి పడుతున్నాయి.

Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్.. విమర్శలకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రణాళికలు సిద్దం చేసిన రేవంత్ సర్కార్!!..తెలంగాణSwechaa20 Oct 2026, 10:18 AM

Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్.. విమర్శలకు ఛాన్స్ ఇవ్వకుండా ప్రణాళికలు సిద్దం చేసిన రేవంత్ సర్కార్!!..

ఎప్పుడు జీవకళతో కళకళలాడే తుంగభద్ర నది, ఈసారి ఎల్ నినో ప్రభావం తో వరుణుడి కరుణ లేక బోసిపోయి కన్నీరు పెట్టిస్తుంది. ఎగువన కర్ణాటకలోనూ వర్షాభావం తీవ్రమవ్వడంతో సుంకేసుల బ్యారేజీ వద్ద కనుచూపు మేరలో నీటి జాడ కూడా కనిపించడం లేదు. పారే నది కాస్తా ఎడారిలా మారిపోవడంతో, దిగువ ప్రాంతాలకు చుక్క నీరు కూడా వారని దయనీయ పరిస్థితి ఏర్పడింది.

దసరా ఎఫెక్ట్.. నాన్‌‌వెజ్ ప్రియులకు షాక్తెలంగాణSwechaa20 Oct 2026, 10:02 AM

దసరా ఎఫెక్ట్.. నాన్‌‌వెజ్ ప్రియులకు షాక్

దసరా పండుగ సందర్బంగా నాన్ వెజ్ ప్రియులకు షాక్ తగిలింది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో మాంసం ధరలు కొండెక్కినట్టు తెలుస్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో కిలో స్కిన్‌ లెస్ చికెన్ ధర రూ.300 నుంచి రూ. 320 వరకు పలుకుతున్నట్టు తెలిసింది. వరంగల్, కామారెడ్డి వంటి జిల్లాల్లో రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సహా ప్రధాన నగరాల్లోనూ కిలో చికెన్ ధర దాదాపు రూ.280 నుంచి రూ.300 మధ్యలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు మటన్ ధరలు కూడా స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. మేక, పొట్టేలును బట్టి కిలోకు రూ. 700 నుంచి రూ. 1,100 వరకు విక్రయిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా డిమాండ్ అధికంగా ఉన్నట్టు విక్రయదారులు చెబుతున్నారు.

Payal Rajput: పాయల్ ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్..ఏమవుతుందో పాపం!సినిమాSwechaa20 Oct 2026, 09:42 AM

Payal Rajput: పాయల్ ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్..ఏమవుతుందో పాపం!

Payal Rajput: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో డెబ్యూ మూవీతో సాలీడ్ హిట్ అందుకొని క్రేజీ హీరోయిన్‌గా పాపులర్ కాలేకపోయిన వాళ్ళలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయమైన పాయల్..బోల్డ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న పాయల్ కెరీర్.. ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో సాగలేదు. మళ్ళీ, అజయ్ భూపతి దర్శకత్వంలోనే 'మంగళవారం' అనే థ్రిల్లర్ మూవీతో హిట్ అందుకుంది.

Tollywood: తడబడుతున్న కొత్త దర్శకులు?సినిమాSwechaa20 Oct 2026, 09:01 AM

Tollywood: తడబడుతున్న కొత్త దర్శకులు?

Tollywood: ఒక్క సినిమాతో హిట్ కొట్టిన దర్శకులు రెండవ సినిమాకి మాత్రం తడబడి ఫ్లాప్ చూస్తున్నారు. దీని, వల్ల మొదటి సినిమా ఇచ్చిన సక్సెస్..మర్చిపోయి..అవకాశాలిచ్చే హీరోలు, నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు. ఈ మధ్య కాలంలో డెబ్యూ సినిమాతో సూపర్ హిట్ కొట్టి వరుసగా రెండు మూడు ఆఫర్స్ అందుకున్న దర్శకులు, రెండవ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ కావడంతో చేతికి వచ్చిన అవకాశాలు జారిపోతున్నాయి. అలా, 'ది ప్యారడైజ్' దర్శకుడి క్రేజ్ ప్రాజెక్ట్ ఇప్పుడు డైలమాలో పడిందట.

Balakrishna: స్క్రీన్ స్పేస్ తగ్గిందనే ఒప్పుకోని బాలయ్య!సినిమాSwechaa20 Oct 2026, 08:29 AM

Balakrishna: స్క్రీన్ స్పేస్ తగ్గిందనే ఒప్పుకోని బాలయ్య!

Balakrishna: దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న జైలర్ ఫ్రాంఛైజీస్ నుంచి తాజాగా ఓ వార్త బయటకి వచ్చి అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చగా సాగుతోంది. జైలర్, జైలర్ 2 చిత్రాలు భారీ కమర్షియల్ విజయాలను అందుకున్నాయి. తాజాగా వచ్చిన జైలర్ 2 బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. అయితే, ఈ సినిమాలో బాలకృష్ణ ఓ కామియో రోల్ చేయాల్సి ఉండగా, ఆ పాత్రకి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువగా ఉందని బాలయ్య సున్నితంగా తిరస్కరించారట.

జగన్ ఢిల్లీ లెక్కలు మారుస్తున్నారా? ఇండియా కూటమి వైపు అడుగులు ఖాయమా..?ఏపీSwechaa20 Oct 2026, 12:25 AM

జగన్ ఢిల్లీ లెక్కలు మారుస్తున్నారా? ఇండియా కూటమి వైపు అడుగులు ఖాయమా..?

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటున్నారా? కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కీలక సందర్భాల్లో మద్దతు ఇచ్చిన జగన్.. ఇప్పుడు అదే ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయన ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా? జాతీయ రాజకీయాల్లో కొత్త దారిని వెతుకుతున్నారా?

Karthik Subbaraj: బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది..కార్తీక్ సుబ్బరాజ్!సినిమాSwechaa19 Oct 2026, 10:57 PM

Karthik Subbaraj: బాల్ మెగాస్టార్ కోర్టులో ఉంది..కార్తీక్ సుబ్బరాజ్!

Karthik Subbaraj: మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పానని..అయితే బాల్ ఆయన కోర్టులోనే ఉందని తాజాగా తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్లారిటీ ఇచ్చాడు. తెలుగు సినీ పరిశ్రమలో టాలెంటెడ్ డైరెక్టర్స్‌ను ఎంకరేజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. కొత్త తరహా కథలు, సినిమాల గురించి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే, ఆయన తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చెప్పిన కథ విన్నారు. కానీ, ఇంకా ఆయన డెసిషన్ ఏంటనేది రివీల్ చేయలేదు.

కొత్త బోర్లకు నో పర్మిషన్.. ఏసీ వాడకంపై ఆంక్షలు- ప్రభుత్వం కీలక నిర్ణయంతెలంగాణSwechaa19 Oct 2026, 10:41 PM

కొత్త బోర్లకు నో పర్మిషన్.. ఏసీ వాడకంపై ఆంక్షలు- ప్రభుత్వం కీలక నిర్ణయం

Elnino: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీరు, విద్యుత్ పొదుపు దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లో నిర్మాణాల కోసం కొత్త బోర్లకు అనుమతులు ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ప్రభుత్వ ఆఫీసుల్లో విద్యుత్ వాడకాన్ని తగ్గించాలంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఉన్నతాధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

కొత్త బోర్ల తవ్వకానికి నో పర్మిషన్

హైదరాబాద్‌లో తాగునీటి అవసరాలకు తప్ప నిర్మాణాలకు, ఇతర పనులకు కొత్త బోర్ల తవ్వకానికి అనుమతులు మంజూరు చేయవద్దని తేల్చి చెప్పారు. నగరంలో మున్సిపల్ నల్లా కనెక్షన్లకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని తోడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారిని గుర్తించేందుకు హైడ్రా సహకారంతో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఇక నవంబర్ 1 నుంచి నిర్మాణాలకు గ్రీన్ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన నీటిని సప్లయ్ చేయనున్నట్లు ప్రకటించారు.

Neha Bhora: ఢిల్లీ పోలీసుల నోటీసుపై హైకోర్టుకు నేహా బోరా!NationalSwechaa19 Oct 2026, 09:53 PM

Neha Bhora: ఢిల్లీ పోలీసుల నోటీసుపై హైకోర్టుకు నేహా బోరా!

Neha Bhora: శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ఢిల్లీ పోలీసులు జారీ చేసిన ముందస్తు నోటీసును సవాల్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. విచారణ కాలంలో ఎక్కడా గొడవలు జరగకుండా చూసేందుకు రూ.10,000 వ్యక్తిగత బాండ్‌తో పాటు ఒక పూచీదారుడిని సమర్పించాలంటూ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదాలో పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటీసు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనంటూ ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Mahabubabad: దారి తప్పిన బతుకమ్మ నిధులు.. అధికారుల తీరుతో డ్యామేజ్ అవుతున్న రేవంత్ సర్కార్!!..తెలంగాణSwechaa19 Oct 2026, 09:34 PM

Mahabubabad: దారి తప్పిన బతుకమ్మ నిధులు.. అధికారుల తీరుతో డ్యామేజ్ అవుతున్న రేవంత్ సర్కార్!!..

బతుకమ్మ వేడుకల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే... క్షేత్రస్థాయిలో అధికారులు కత్తెర్లు వేస్తున్నారు! మహబూబాబాద్ మున్సిపాలిటీ విలీన గ్రామాల్లో ఒక్కో బతుకమ్మకు రూ. 50 వేలు మంజూరైతే, జీఎస్టీ పేరుతో ఏకంగా రూ. 11,000 కట్ చేసి అధికారుల హస్తలాఘవం చూపించారు. పూలకు జీఎస్టీ లేకపోయినా ఈ కోతలేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిధులు పక్కదారి పడుతుంటే, అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి తీరని పొలిటికల్ డ్యామేజ్ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

Bathukamma Celebrations: టెక్సాస్‌లో 15 వేల మందితో బతుకమ్మ సంబరాలు!తెలంగాణSwechaa19 Oct 2026, 09:32 PM

Bathukamma Celebrations: టెక్సాస్‌లో 15 వేల మందితో బతుకమ్మ సంబరాలు!

Bathukamma Celebrations: అమెరికా గడ్డపై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడింది. టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలోని ప్రతిష్టాత్మక 'కొమెరికా సెంటర్' వేదికగా 'టి-ప్యాడ్' (TPAD) ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు సరికొత్త రికార్డు సృష్టించాయి. ఏకంగా 15 వేల మందికి పైగా ప్రవాస తెలుగు ప్రజలు తరలిరావడంతో ప్రాంగణమంతా పండుగ శోభతో వెలిగిపోయింది. పొద్దున మొదలైన ఆటపాటలు రాత్రి దాకా నాన్‌స్టాప్‌గా సాగి ప్రతి ఒక్కరినీ అలరించాయి.ఈ వేడుకల్లో మెయిన్ హైలైట్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి సందడే. అమెరికాలో ఇంత భారీ ఎత్తున బతుకమ్మ చేయడం చూసి ముగ్ధుడైన ఆయన, వేదికపైకి వచ్చి గంటపాటు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. తన మార్క్ కామెడీ పంచ్‌లతో నవ్విస్తూనే, అక్కడున్న యూత్‌తో పాటు పిల్లలను కూడా స్టేజ్ మీదికి పిలిచి వారితో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. నవీన్ ఎనర్జీకి ఆడిటోరియం మొత్తం కేరింతలతో హోరెత్తిపోయింది.

Elon Musk: అమెరికన్ పిల్లలందరికీ స్పేస్‌ఎక్స్ ఫ్రీ షేర్లు!InternationalSwechaa19 Oct 2026, 09:27 PM

Elon Musk: అమెరికన్ పిల్లలందరికీ స్పేస్‌ఎక్స్ ఫ్రీ షేర్లు!

Elon Musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తనదైన శైలిలో సంచలన ప్రకటన చేసి అందరి బుర్రలను పాడుచేశారు. కార్పొరేట్ కంపెనీలు సమాజ సేవ పేరుతో నిధులను ఏవో ఫండ్స్‌కు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా, నేరుగా సామాన్యులకే వాటాలు ఇచ్చేస్తే బాగుంటుందంటూ సరికొత్త ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. వచ్చే ఏడాది నుంచి అమెరికాలోని ప్రతి పిల్లాడికీ తన రాకెట్ కంపెనీ 'స్పేస్‌ఎక్స్' లో ఒక్కో షేరును పూర్తిగా ఉచితంగా ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థ 'ఆంథ్రోపిక్' ఇటీవల సమాజ హితం కోసం కంపెనీలో 5 శాతం వాటాలను ఒక ప్రత్యేక ఫండ్‌కు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయంపై స్పందించిన మస్క్.. "వాటాలను ఏదో నిధికి చేర్చే బదులు, నేరుగా ప్రజలకే ఇచ్చేస్తే సరిపోతుంది కదా! భవిష్యత్తులో నేను కూడా ఇదే చేయబోతున్నా" అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా కౌంటర్ ఇచ్చారు.

గోదావరి నీటి నిల్వకు ప్రభుత్వం కసరత్తు.. దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలుతెలంగాణSwechaa19 Oct 2026, 08:41 PM

గోదావరి నీటి నిల్వకు ప్రభుత్వం కసరత్తు.. దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలు

Godavari: గోదావరి నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇందులో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే వేసవిలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి నీటిని నిల్వ చేసే ప్రయత్నాల్లో భాగంగా దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలు ఏర్పాటు చేసే పనులకు ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అమ్మగారిపల్లి వద్ద గోదావరి ఆనకట్టను మంత్రి తమ్మల పరిశీలించారు.

TG: సింగరేణి అధికారులకు పండుగ బొనాంజా!తెలంగాణSwechaa19 Oct 2026, 08:32 PM

TG: సింగరేణి అధికారులకు పండుగ బొనాంజా!

TG: పండుగ వేళ సింగరేణి ఉద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే తీపి కబురు చెప్పింది. చాలా రోజులుగా వాళ్లు అడుగుతున్న మెయిన్ డిమాండ్‌ను పరిష్కరిస్తూ వేతనాల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. కోల్ ఇండియాలో ఆఫీసర్లకు ఏ విధంగా అయితే శాలరీలు ఇస్తున్నారో.. సరిగ్గా అదే తరహాలో మన సింగరేణి అధికారులకు కూడా జీతాలు పెంచుతూ అధికారికంగా ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో సింగరేణి ప్రాంతంలో పండుగ జోష్ మరింత పెరిగింది.

TG: రేషన్ బియ్యంతో పాటు పప్పు, నూనె.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!తెలంగాణSwechaa19 Oct 2026, 08:17 PM

TG: రేషన్ బియ్యంతో పాటు పప్పు, నూనె.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన!

TG: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు చెప్పేందుకు రెడీ అవుతోంది. ఇకపై రేషన్ దుకాణాల్లో కేవలం బియ్యం మాత్రమే కాకుండా, సామాన్యుల వంటింట్లో రోజూ వాడే నిత్యావసర సరుకులన్నింటినీ అందించే ఆలోచనలో సర్కార్ ఉంది. మార్కెట్లో సరుకుల రేట్లు మండిపోతుండటంతో పేద కుటుంబాలకు కాస్త ఊరటనిచ్చేందుకు బియ్యంతో పాటు కందిపప్పు, వంటనూనె, గోధుమపిండి లాంటి సరుకులను రేషన్ ద్వారా పంచే విషయంపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది.సచివాలయంలో పౌరసరఫరాల శాఖ ఆఫీసర్లతో జరిపిన కీలక భేటీలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రేషన్ లబ్ధిదారులకు బియ్యంతో పాటు గోధుమపిండి, కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారంపొడి వంటి సరుకులు ఇస్తే బాగుంటుందనే ప్రతిపాదనపై అధికారులతో ఆయన చర్చించారు.

Aadarsha Kutumbam: థమన్‌ని మళ్ళీ ట్రోల్ చేస్తారు..నో డౌట్!సినిమాSwechaa19 Oct 2026, 08:14 PM

Aadarsha Kutumbam: థమన్‌ని మళ్ళీ ట్రోల్ చేస్తారు..నో డౌట్!

Aadarsha Kutumbam: ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్‌లో ఎక్కువగా ట్రోల్ అయింది సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ మాత్రమే. కావాలని చేస్తాడా..అలా, కలిసొస్తుందా తెలియదు గానీ, థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలలో ఒక్క పాటైనా కాపీ ట్యూన్ అని థమన్‌ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తున్నారు. ఇప్పటికే, చాలాసార్లు ఇలా నెగిటివీని నెత్తిన మోశాడు. ఇప్పుడు, ఆదర్శ కుటుంబం విషయంలో మళ్ళీ అదే జరిగేలా ఉంది.

Telangana: కేసీఆర్ మార్క్ రాజకీయాన్ని దాటేసిన హరీష్ రావు.. ఇంకా ఎంత కాలం ఈ చిల్లర రాజకీయాలు!!..అభిప్రాయంSwechaa19 Oct 2026, 07:50 PM

Telangana: కేసీఆర్ మార్క్ రాజకీయాన్ని దాటేసిన హరీష్ రావు.. ఇంకా ఎంత కాలం ఈ చిల్లర రాజకీయాలు!!..

కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న హరీశ్ రావు.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలపై కూడా సమాధానం చెప్పాలి కదా! ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌ను నిలదీస్తున్న నేతలు, గత హామీల అమలుపైనా లెక్కలు చెప్పాలి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రజలకు ఒరిగేదేమిటి? తెలంగాణ ప్రజలకు కావాల్సింది రాజకీయ కట్టుకథలు కాదు.. ఆధారాలతో కూడిన నిజాలు, హామీల అమలు, కళ్లముందు కనిపించే పాలన! ఇది మీ పాలనలో జరిగిందా?.. ముందు మీ అవినీతిని కడుక్కుని బరిలోకి దిగితే మంచిదని జనం అభిప్రాయపడుతున్నారు..

Flydubai: విమానాన్ని నడిపిన ప్లంబర్.. పైలట్ స్మిత్ ఏమన్నారంటే?NationalSwechaa19 Oct 2026, 07:27 PM

Flydubai: విమానాన్ని నడిపిన ప్లంబర్.. పైలట్ స్మిత్ ఏమన్నారంటే?

Flydubai: ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయానక ఘటన తర్వాత ఒక వార్త ప్రపంచవ్యాప్తంగా తెగ చక్కర్లు కొట్టింది. విమానం గాల్లో ఉండగానే పైలట్ల మధ్య దాడి జరిగి అదుపుతప్పితే, ఓ ప్యాసింజర్ అయిన ప్లంబర్ కాక్‌పిట్‌లోకి దూరి టీవీ షో గుర్తొచ్చి విమానాన్ని కంట్రోల్ చేశాడని, అలా అందరి ప్రాణాలు కాపాడాడంటూ ఒక కథ విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. తాజాగా ఈ ప్రచారంపై నాడు కాక్‌పిట్‌లో ప్రాణాలతో పోరాడిన ఇండియన్ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్పందించారు. యూఏఈలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న స్మిత్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ అసలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు. "నిజం చెప్పాలంటే ఆ ప్లంబర్ కథేంటో నాకైతే అస్సలు తెలియదు. నాపై ఒక్కసారిగా దాడి జరిగినప్పుడు విమానం కిందపడిపోకుండా ఆపడం, నన్ను నేను కాపాడుకోవడం మీదే నా శక్తినంతా పెట్టాను. ఒక ప్లంబర్ నిజంగానే విమానాన్ని ల్యాండ్ చేయగలడా లేదా అనే ఊహాగానాల జోలికి నేను వెళ్లదల్చుకోలేదు" అని స్పష్టం చేశారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒక సీనియర్ అధికారి 'విమానం కెప్టెన్ కంట్రోల్‌లోనే ఉంది' అని చెప్పడం మాత్రమే తనకు గుర్తుందన్నారు.

Middle East: సౌదీ రక్షణకు ఈజిప్ట్ సైనిక కవచం.. చీలిపోతున్న అరబ్ ప్రపంచం?InternationalSwechaa19 Oct 2026, 07:18 PM

Middle East: సౌదీ రక్షణకు ఈజిప్ట్ సైనిక కవచం.. చీలిపోతున్న అరబ్ ప్రపంచం?

Middle East: మధ్యప్రాచ్యంలో దశాబ్దాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రాంతీయ ఆధిపత్య పోరు ఇప్పుడు ముస్లిం ప్రపంచాన్ని రెండు బలమైన శిబిరాలుగా చీల్చే ప్రమాదకర అంచుకు చేరింది. యెమెన్‌‌లోని హౌతీ తిరుగుబాటుదారులు సరిహద్దులు దాటి సౌదీ అరేబియా గుండెకాయపై బాంబులు కురిపిస్తుంటే, ఇస్లామిక్ ప్రపంచంలోనే అత్యంత బలమైన సైనిక శక్తిగా పేరున్న ఈజిప్ట్ రంగంలోకి దిగేందుకు సై అంటోంది. "సౌదీకి ఏ ఆపద వచ్చినా మా సైన్యాన్ని పంపిస్తాం" అని ఈజిప్ట్ అధ్యక్షుడు చేసిన ప్రకటన అరబ్ గడ్డపై సరికొత్త సైనిక సమీకరణాలకు తెరలేపింది. ఇది కేవలం సౌదీ భద్రతకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు, అరబ్ ప్రపంచపు పట్టు కోసం సాగుతున్న అంతర్గత యుద్ధపు తీవ్రతకు నిదర్శనం.రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన ఆకస్మిక డ్రోన్ దాడి 13 మందిని బలిగొనడం, ఆ వెనుకే ప్రపంచ ఇంధన దిగ్గజం 'అరాంకో' ప్రధాన కార్యాలయంపై బాంబుల వర్షం కురవడం యావత్ గల్ఫ్ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

Meenakshi Chaudhary: "నా జీవితం నా ఇష్టం"..మీనాక్షి బోల్డ్ స్టేట్‌మెంట్!సినిమాSwechaa19 Oct 2026, 07:10 PM

Meenakshi Chaudhary: "నా జీవితం నా ఇష్టం"..మీనాక్షి బోల్డ్ స్టేట్‌మెంట్!

Meenakshi Chaudhary: హీరోయిన్ అవ్వాలంటే ఒక అమ్మాయి ఎన్ని కష్టాలను అనుభవించాలో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో చూపించారు. ఇది వందకి వంద శాతం నిజమని ఆ తర్వాత చాలామంది సినీ తారలు ఒప్పుకున్నారు. ఇక్కడ, హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ దక్కాలంటే కాంప్రమైజ్ కాక తప్పదని అంటుంటారు. తాజాగా, హాట్ బ్యూటీ మీనాక్షి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు, ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికరమైన చర్చగా మారింది.

ఎల్‌నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ.. సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ బహిరంగ లేఖతెలంగాణSwechaa19 Oct 2026, 07:08 PM

ఎల్‌నినోపై క్యాబినెట్ సబ్ కమిటీ.. సీఎం రేవంత్‌కు బీఆర్ఎస్ బహిరంగ లేఖ

Elnino: ఎల్ నినోపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పందించారు. సీఎం రేవంత్, మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యులకు 23 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖ సంధించారు. సంక్షోభం వచ్చి ఆరు నెలలయ్యాక ‘ఉపసంఘం’ డ్రామానా? అని లేఖలో మండిపడ్డారు. ఎల్ నినో విపత్తు ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యమే అని ధ్వజమెత్తారు. పంటలు ఎండిపోయాక, వర్షాకాలం ముగిశాక కమిటీ వేయడం ప్రజా వంచన కాదా? అని నిలదీశారు.

ఎల్ నినోపై ప్రభుత్వం కీలక నిర్ణయం..తెలంగాణSwechaa19 Oct 2026, 06:47 PM

ఎల్ నినోపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

Elnino: ఎల్ నినో పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులను సమీక్షించి, వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఈ కమిటీకి చైర్మన్ గా నియమించారు. మంత్రులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, వాకిటి శ్రీహరి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు

రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి, సంబంధిత శాఖలకు అవసరమైన ఆదేశాలు, సూచనలు జారీ చేయడంతో పాటు తదుపరి చర్యలపై ప్రభుత్వానికి సిఫారసు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై సబ్ కమిటీ ఫోకస్ చేస్తుంది. తాగునీటి సమస్యలు తలెత్తకుండా సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోనుంది.

Rapo 23-Rithesh: జెనీలియా స్కెచ్ అదిరింది!సినిమాSwechaa19 Oct 2026, 06:40 PM

Rapo 23-Rithesh: జెనీలియా స్కెచ్ అదిరింది!

Rapo 23-Rithesh: హ.హ.హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను బొమ్మరిల్లు సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న జెనీలియా దేశ్‌ముఖ్..ఆ తర్వాత తెలుగులో రెడీ, ఆరెంజ్, ఢీ, శశిరేఖా పరిణయం, నా ఇష్టం లాంటి సినిమాలు చేసింది. వాస్తవానికి, బొమ్మరిల్లు మూవీ కంటే ముందే సత్యం, నా అల్లుడు, సై, సాంబ, సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాలు చేసింది.

Tollywood: దిల్ రాజు ని కాపాడేది రామాయణ?సినిమాSwechaa19 Oct 2026, 06:11 PM

Tollywood: దిల్ రాజు ని కాపాడేది రామాయణ?

Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాతగా వెలుగుతున్న దిల్ రాజు..అంతకముందు డిస్ట్రిబ్యూటర్ అనే విషయం తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్ అయిన దిల్ రాజు, నిర్మాతగా మారి పలు విజయవంతమైన సినిమాలను నిర్మిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నిర్మాతగా భారీ నష్టాలను చూశాడు. పంపిణీ చేసిన సినిమాలు అంతగా కలిసి రాలేదు. ఇప్పుడు, రామాయణ సినిమాను మన రెండు తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు దిల్ రాజు.