స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Delimitation: ముచ్చటగా మూడోసారి.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కుతుందా?NationalSwechaa19 Oct 2026, 06:01 PM

Delimitation: ముచ్చటగా మూడోసారి.. డీలిమిటేషన్ బిల్లు గట్టెక్కుతుందా?

Delimitation: గతంలో రెండుసార్లు చేజారిన రాజ్యాంగ సవరణ బిల్లును ఈసారి ఎలాగైనా పార్లమెంట్ గడప దాటించాలన్న పట్టుదలతో ఢిల్లీ పీఠం పావులు కదుపుతోంది. నియోజకవర్గాల పునర్విభజన చట్టం ద్వారా దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. వర్షాకాల సమావేశాలు ముగిసి రెండు నెలలు గడుస్తున్నా సభలను ఇంకా ప్రోరోగ్ చేయకుండా పెండింగ్‌లో పెట్టడం, బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం ముగిసిన వెంటనే ప్రత్యేక సమావేశాల నిర్వహణకు తెరవెనుక ఏర్పాట్లు సాగుతుండటం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే రెండుసార్లు చతికిలపడ్డ ఈ ప్రతిష్టాత్మక బిల్లును ముచ్చటగా మూడోసారి అధికార ఎన్డీయే కూటమి ఎలా నెగ్గించుకుంటుందన్నదే ఇప్పుడు అతిపెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న.

భూ వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంరాజకీయాలుSwechaa19 Oct 2026, 05:47 PM

భూ వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యం

Bhu Bharati: దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ వ్యవస్థ పునర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సోమవారం అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్ష నిర్వహించారు.

మరింత పారదర్శకంగా, వేగంగా రెవెన్యూ సేవలు

భూభారతి చట్టం అమలు, రైతులకు పట్టాదారు పాస్‌బుక్కుల పంపిణీ, రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన భూముల రీ-సర్వే, భూ సమస్యల పరిష్కారం, ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయాల అమలు తీరుపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రజలకు రెవెన్యూ సేవలు మరింత పారదర్శకంగా, వేగంగా అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో మ‌రింత ప‌కడ్బందీగా పనిచేయాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు.

వీడు మామూలోడు కాదు.. మహిళ పేరుతో పోలీస్ అధికారికే హనీ ట్రాప్క్రైమ్Swechaa19 Oct 2026, 05:11 PM

వీడు మామూలోడు కాదు.. మహిళ పేరుతో పోలీస్ అధికారికే హనీ ట్రాప్

Honey Trap: హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసును పోలీసులు ఛేదించారు. మహిళ పేరుతో పోలీస్ అధికారినే హనీ ట్రాప్ చేసిన కేటుగాడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు పవన్‌ను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను చార్మినార్‌ డీసీపీ కిరణ్‌ వెల్లడించారు. నిందితుడు పవన్ మహిళగా పోలీస్ అధికారితో పరిచయం చేసుకున్నాడని.. చాటింగ్‌ ద్వారా మరింత దగ్గరయ్యాడని.. ఆ తర్వాత డబ్బులు డిమాండ్‌ చేశాడని తెలిపారు.

వందల మంది బాధితులు

దీని గురించి తమకు సమాచారం అందిన వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితుడిని పట్టుకున్నామని డీసీపీ చెప్పారు. విచారణలో షాకింగ్ విషయాలు కనుగొన్నామన్నారు. నిందితుడి జాబితాలో వందల మంది బాధితులు ఉన్నారని, వేలాది వాట్సప్‌ చాటింగ్‌లు వెలుగులోకి వచ్చాయన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ హనీట్రాప్‌ బాధితులు ఉన్నారని గుర్తించామన్నారు. దుబాయ్‌ వంటి విదేశాల్లో ఉన్నవారు సైతం పవన్‌ చేతిలో మోసపోయినట్లు డీసీపీ కిరణ్ పేర్కొన్నారు.

Dandiya: దసరా నవరాత్రుల్లో దాండియా ఎందుకు ఆడతారో తెలుసా?తెలంగాణSwechaa19 Oct 2026, 04:52 PM

Dandiya: దసరా నవరాత్రుల్లో దాండియా ఎందుకు ఆడతారో తెలుసా?

Dandiya: దసరా శరన్నవరాత్రులు మొదలయ్యాయంటే చాలు.. ఊరూవాడా అంతా ఒకటే సందడి. రంగురంగుల దుస్తులు ధరించి, చేతుల్లో అందమైన కర్రలు పట్టుకుని, డోలు దరువులకు అనుగుణంగా అడుగులు వేస్తూ దాండియా ఆడుతుంటారు. ఒకప్పుడు కేవలం గుజరాత్, రాజస్థాన్‌లకే పరిమితమైన ఈ దాండియా సంస్కృతి, ఇప్పుడు తెలుగు నేలతో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా మార్మోగిప

పాతబస్తీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టంతెలంగాణSwechaa19 Oct 2026, 03:53 PM

పాతబస్తీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Old City Fire: హైదరాబాద్ పాతబస్తీలో అగ్నిప్రమాదం జరిగింది. చార్మినార్ పరిధి మదీనా క్రాస్ రోడ్డులోని బాంబే హోసరీ వస్త్ర దుకాణం, గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం వస్త్ర దుకాణంలో మంటలు అంటుకున్నాయి. మంటలు చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

సొమ్ము సింగరేణిది.. సోకు సర్కారుది?టాప్ న్యూస్Swechaa19 Oct 2026, 03:36 PM

సొమ్ము సింగరేణిది.. సోకు సర్కారుది?

సింగరేణి సొమ్మును రేవంత్ సర్కార్ పబ్లిసిటీకి వినియోగిస్తున్నదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో వృథా ఖర్చులపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దసరా శుభాకాంక్షల పేరిట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోతో సింగరేణి సంస్థ కరపత్రాలు ప్రింట్ చేయించినట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ మూడు రంగుల బార్డర్‌తో నాలుగు పేజీల కరపత్రాలను ముద్రించినట్టు తెలిసింది. ఇందుకు రూ.లక్షలు వెచ్చించినట్టు తెలుస్తోంది. కార్మికుల సంక్షేమంపై కోతలు పెడుతున్న సర్కార్.. ప్రచారానికి మాత్రం భారీగా ఖర్చు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండుగ సందర్భంగా కార్మికులకు కనీసం స్వీట్లు ఇవ్వని పంచని యాజమాన్యం.. కరపత్రాలకు మాత్రం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

పొంగులేటి, పీసీసీ చీఫ్, పెద్దపల్లి ఎంపీకి బీఆర్ఎస్ నోటీసులుతెలంగాణSwechaa19 Oct 2026, 03:01 PM

పొంగులేటి, పీసీసీ చీఫ్, పెద్దపల్లి ఎంపీకి బీఆర్ఎస్ నోటీసులు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేసిన వారిపై బీఆర్ఎస్ లీగల్ టీం ఘాటుగా రియాక్ట్ అయ్యింది. కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ తన ఫాంహౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నోటీసులు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రెటరీ, లీగల్‌ సెల్‌ ఇన్‌‌చార్జి సోమ భరత్‌ కుమార్‌ నోటీసులు జారీ చేశారు.ఇదే విషయంలో ‘వెలుగు’ దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.ఎందుకంటే సదరు దినపత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆరోపించింది.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు నోటీసులు పంపించారు.

Telangana Politics: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. రాష్ట్రంలో ఢిల్లీ దళాల మోహరింపు..!తెలంగాణSwechaa19 Oct 2026, 02:52 PM

Telangana Politics: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫుల్ ఫోకస్.. రాష్ట్రంలో ఢిల్లీ దళాల మోహరింపు..!

Telangana Politics: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత కాషాయ జెండాను రెపరెపలాడించేందుకు తెలంగాణే సరైన వేదిక అని బీజేపీ అధిష్ఠానం గట్టిగా నిర్ణయించుకుంది. ఇన్నాళ్లూ కేవలం రాష్ట్ర స్థాయి నేతల ప్రకటనలు, నిరసనలతో సరిపెట్టిన బీజేపీ హైకమాండ్.. ఇప్పుడు గేరు మార్చి నేరుగా ఢిల్లీ సైన్యాన్ని తెలంగాణ గడ్డపై మోహరిస్తోంది. జాతీయ ఎన్నికల వ్యూహకర్తలు, సంఘటనా నిపుణులు స్వయంగా రంగంలోకి దిగి రాష్ట్రంలోనే తిష్టవేసేలా పక్కా రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించిన "ఇంకా మా ఆట మొదలే కాలేదు" అన్న మాటల వెనుక ఉన్న అసలు ఆయుధం.. ఢిల్లీ పెద్దలు పంపబోతున్న ఈ ప్రత్యేక దళాలేనని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌నే ప్రధాన కార్యాలయంగా చేసుకుని వ్యూహాలు రచిస్తుంది. కానీ, బీజేపీ ఈసారి రూటు మార్చింది. తెలంగాణ రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉత్తర తెలంగాణ నడిబొడ్డు ‘వరంగల్’ను తన ప్రధాన కార్యస్థానంగా ఎంపిక చేసుకుంది. బీజేపీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి దశరథ్ పండుగ ముగియగానే నేరుగా వరంగల్‌లోనే మకాం వేయనున్నారు.

సీఎం రేవంత్ మరో సోదరుడి భూ కుంభకోణం.. చిట్టా విప్పిన మన్నె క్రిశాంక్!తెలంగాణSwechaa19 Oct 2026, 01:58 PM

సీఎం రేవంత్ మరో సోదరుడి భూ కుంభకోణం.. చిట్టా విప్పిన మన్నె క్రిశాంక్!

రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భారీగా అవినీతికి పాల్పడుతోందని, రూ.వేల కోట్ల ఆస్తులు అక్రమంగా కాజేసి వారి, వారి బినామీల పేర్ల మీద పొగేశారని బీఆర్ఎస్ కీలక నేత మన్నె క్రిశాంక్ గత కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ కుటుంబం, అతని సోదరులు పాల్పడిన అవినీతికి సంబంధించిన లెక్కలు తన వద్ద ఉన్నాయని ఆరోపించారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ రెడ్డి మరో తమ్ముడు అనుముల కృష్ణారెడ్డి చేస్తున్న సెటిల్మెంట్స్ దందాను పూర్తి ఆధారాలతో మన్నె క్రిశాంక్ బయటపెట్టారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మన్నెక్రిశాంక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేకు ఫండ్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలని అనుముల కృష్ణారెడ్డి బెదిరించినట్టు మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చందన్‌వల్లి గ్రామంలోని 363 సర్వే నంబర్‌లో ఉన్న నిషేధిత భూమిలో 363/3 భూమిని ఇటీవలే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని ఆరోపించారు.

TG : కాళేశ్వరంలో జలకళ.. రాష్ట్రంలో కరువు నేల!తెలంగాణSwechaa19 Oct 2026, 01:30 PM

TG : కాళేశ్వరంలో జలకళ.. రాష్ట్రంలో కరువు నేల!

కాళేశ్వరం కన్నెపల్లి వద్ద గోదావరి జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. 22 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్టు తెలిసింది. అక్కడ రోజుకు దాదాపు 1.9 టీఎంసీల నీరు ప్రవాహిస్తుండగా.. రేవంత్ సర్కార్ మాత్రం సాగుకు నీళ్లు లేవంటూ చెబుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుబాటులో ఉన్న జలాలను సాగు కోసం ఎందుకు వినియోగించడం లేదని రైతులు, ప్రతిపక్ష నేతలు నిలస్తున్నారు. రేవంత్ సర్కారుకు అన్నదాతల మీద అంత ప్రేమ ఉంటే.. అధికారంలోకి వచ్చి మూడేండ్లు అయినా ఎందుకు మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయలేదని.. విచారణల పేరుతో కాలయాపన చేసి తీరా కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో రిపేర్లు చేయిస్తామని హడావుడి చేస్తే దిగువకు వెళ్లిపోయిన నీటిని ఎలా తెస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇ ళేశ్వరంలోని కన్నెపల్లి వద్ద ఇప్పుడు కూడా నీరు వృథాగా పోతుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.రేవంత్ సర్కార్‌కు నీటిని ఎత్తిపోయడం చేతగాకపోతే తమకు అప్పగిస్తే నీళ్ళు ఎత్తిపోసి చూపిస్తామని మరోసారి ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.

Bloody Romeo: నానికి కావాల్సింది ఇప్పుడు ఇలాంటి సినిమానేనా!సినిమాSwechaa19 Oct 2026, 01:11 PM

Bloody Romeo: నానికి కావాల్సింది ఇప్పుడు ఇలాంటి సినిమానేనా!

Bloody Romeo: నేచురల్ స్టార్ నాని కి గత కొంతకాలంగా హిట్స్ దక్కడం లేదు. పాన్ ఇండియా క్రేజ్ తో మాస్ అండ్ యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. సినిమా రిలీజ్‌కి ముందు ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కానీ, ఆ హైప్‌కి తగ్గట్టుగా సినిమా ఉండటం లేదు. అంతకముందు హిట్ 3..ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమాలు నానికి షాకిచ్చాయి. దీంతో, వెంటనే బ్లడీ రోమియో సినిమాను పట్టాలెక్కించాడు.

జనరల్ బోగీలకు కోత.. ఏసీ కోచ్‌ల మోత.. రైళ్లలో సామాన్యుడికి చోటేది?తెలంగాణSwechaa19 Oct 2026, 01:03 PM

జనరల్ బోగీలకు కోత.. ఏసీ కోచ్‌ల మోత.. రైళ్లలో సామాన్యుడికి చోటేది?

 పండుగ పూట స్వగ్రామాలకు వెళ్లే పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు రైల్వే శాఖ నుంచి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, కేవలం ధనికులకే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన రైలు ప్రయాణాన్ని సంపన్నులకే పరిమితం చేసేలా ప్రభుత్వ విధానాలు మారుతున్నాయనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ బోగీల సంఖ్యను విపరీతంగా పెంచేస్తున్నారు. ఆదాయమే ధ్యేయంగా సాగుతున్న ఈ తీరు వల్ల సాధారణ ప్రయాణికులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

తెలంగాణలో మరో స్కామ్? నీళ్లే లేని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ!తెలంగాణSwechaa19 Oct 2026, 12:58 PM

తెలంగాణలో మరో స్కామ్? నీళ్లే లేని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ!

రాష్ట్రంలో నీళ్లు లేక చెరువులు ఎండిపోతుంటే అందులో చేప పిల్లలు వదిలేందుకు సర్కార్ సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ కసరత్తు ప్రారంభించినట్టు సమాచారం. ఎండిన చెరువుల్లో చేప పిల్లల పంపిణీ కోసం రూ.133 కోట్ల ప్రజాధనం వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా నిబంధనల ప్రకారం నీటి నిల్వలు 50 శాతం ఉండి, 6 నెలల పాటు నీటి నిల్వ ఉంటేనే చేప పిల్లలు విడుదల చేయాలని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసారి 17,677 చెరువుల్లో దాదాపు 13 వేల చెరువులు ఎండిపోయినా చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ సిద్ధం అవుతుండటంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేప పిల్లల పంపిణీ పేరిట మరో కుంభకోణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ప్రచారం జరుగుతోంది.

వెండి బతుకమ్మ వివాదంపై నోరు విప్పిన పీవీ సింధు.. ట్రోలర్లకు కౌంటర్!తెలంగాణSwechaa19 Oct 2026, 12:34 PM

వెండి బతుకమ్మ వివాదంపై నోరు విప్పిన పీవీ సింధు.. ట్రోలర్లకు కౌంటర్!

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగెటివ్ ట్రోలింగ్‌పై భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు (PV Sindhu) తీవ్రంగా స్పందించారు. వేడుకల్లో భాగంగా వెండి బతుకమ్మను ప్రదర్శించడంపై కొందరు నెటిజన్లు అనవసర విమర్శలు గుప్పించగా, వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సంప్రదాయం వెనుక ఉన్న అసలైన అర్థాన్ని, భావోద్వేగాలను తెలుసుకోకుండా నిందించడం సరికాదని హితవు పలికింది.

బాలీవుడ్‌పై అండర్‌వరల్డ్‌ పంజా.. 90ల నాటి భయం తిరిగొస్తోందా?NationalSwechaa19 Oct 2026, 12:33 PM

బాలీవుడ్‌పై అండర్‌వరల్డ్‌ పంజా.. 90ల నాటి భయం తిరిగొస్తోందా?

బాలీవుడ్‌లో 90లలో పరిస్థితి వేరు. సినిమా తీస్తున్న నిర్మాతకు ఒక భయం ఉండేది. ఫోన్‌ ఎప్పుడు మోగుతుంది? అవతలి వైపు నుంచి ఎవరు బెదిరిస్తారు? చెప్పినట్లు వినకపోతే ఏం జరుగుతుంది? అనే టెన్షన్ ఉండేది. తాజాగా నటుడు టైగర్‌ ష్రాఫ్‌ కారుపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో మరోసారి బాలీవుడ్‌ భద్రతపై ఆందోళన మొదలైంది.

Tollywood: అక్కినేని హీరోలు మరీ స్లో అయ్యారు!సినిమాSwechaa19 Oct 2026, 12:11 PM

Tollywood: అక్కినేని హీరోలు మరీ స్లో అయ్యారు!

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా స్లో అయిన హీరోలు అక్కినేని వారు. నాగార్జున మాత్రమే కాదు, నాగ చైతన్య, అఖిల్ కూడా ఈ మధ్య బాగా స్లో అయ్యారు. సినిమాల ఎంపిక మీద చాలా నెమ్మదయ్యారు. ప్రస్తుతం, మన సౌత్‌లో పాన్ ఇండియా సినిమాల హడావుడి ఎక్కువగా ఉంది. కానీ, అక్కినేని హీరోలలో మాత్రం క్రేజ్ ఉన్నా కూడా వరుస ప్రాజెక్ట్స్ చేయడానికి ఆలోచిస్తున్నారు.

కోనేరులో మునిగిన ఇన్నోవా క్రిస్టా.. వీడియో వైరల్వైరల్ న్యూస్Swechaa19 Oct 2026, 12:01 PM

కోనేరులో మునిగిన ఇన్నోవా క్రిస్టా.. వీడియో వైరల్

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహేశ్వరంలో ఘోర ప్రమాదం సంభవించింది. కారు అదుపుతప్పి ఆలయ కోనేరులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారు డోర్ తీసుకుని నీటిలోకి దూకి తన ప్రాణాలను రక్షించుకున్నాడు.ఈ ఘటన నిన్న చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. కారు కోనేరులో పూర్తిగా మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియో విజువల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Hyderabad: మల్లారెడ్డి అంటే భయమా? అల్లు అర్జున్ అంటే ద్వేషమా? బయటపడని సీఎం??అభిప్రాయంSwechaa19 Oct 2026, 11:38 AM

Hyderabad: మల్లారెడ్డి అంటే భయమా? అల్లు అర్జున్ అంటే ద్వేషమా? బయటపడని సీఎం??

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మకమైన వ్యక్తిగా రాష్ట్ర యువత అభిమానించడం తెలిసిందే.. ఎందుకంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూనే.. దొరల గడీల పాలనను బద్ధలు కొడుతానని బహిరంగంగా సవాలు చేయడం.. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.. ఇది ఆయనలో ఉన్న పట్టుదలకు నిదర్శనంగా నిలిచిందనే ప్రశంసలు అందుకుంది.

టెకీలను భయపెడతున్న ‘కరెంట్’.. సర్కారుపై అసహనం!తెలంగాణSwechaa19 Oct 2026, 11:32 AM

టెకీలను భయపెడతున్న ‘కరెంట్’.. సర్కారుపై అసహనం!

రాష్ట్రంలో వేసవి రాకముందే కరెంట్ కోతలు ప్రారంభం అయ్యాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పవర్ తీసేస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు.కరెంట్ కోతల కారణంగా ముఖ్యంగా వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సమాచారం. ఇయర్ ఎండ్ కావడంతో పెండింగ్ ప్రాజెక్టులు క్లియర్ చేసేందుకు టార్గెట్లు ఇస్తున్నారని, వాటిని పూర్తి చేద్దామంటే ఇష్టానుసారంగా కరెంట్ కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాల సీజన్ పూర్తిగా ముగియక ముందే ఇలా అప్రకటితంగా కోతలు పెడితే సమ్మర్‌లో ఎలా ఉంటుందో అని ఇప్పటినుంచే టెకీలు ఆందోళన చెందుతున్నారు. అసలే ఐటీ సెక్టార్‌లో పరిస్థితులు బాలేవని, చిన్న చిన్న కారణాలు, కాస్ట్ కటింగ్, ఏఐ అప్‌గ్రేడ్, స్కిల్ అప్టేట్ చేసుకోలేదని ఉద్యోగాలు తీసేస్తున్న సమయంలో ఇలా కరెంట్ కోతలు పెడితే టార్గెట్ రీచ్ కాలేదని, ఇన్ టైంలో పెండింగ్ వర్క్స్ క్లియర్ చేయలేదని తమ ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం ఉందని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఆవేదన చెందుతున్నారు.

గర్భా వేడుకల్లో బాలికతో అసభ్యప్రవర్తన..బీజేపీ నేతపై పోక్సో కేసుNationalSwechaa19 Oct 2026, 10:53 AM

గర్భా వేడుకల్లో బాలికతో అసభ్యప్రవర్తన..బీజేపీ నేతపై పోక్సో కేసు

ఇండోర్‌ - హీరానగర్ ప్రాంతంలో ఉన్న కంకేశ్వరి గర్బా ఉత్సవ్‌ వద్ద 15 ఏళ్ల బాలికతో అసభ్యంగా ప్రవర్తించి, ఆమెను బీజేపీ మండల అధ్యక్షుడు కమల్ చౌహాన్ బయటకు నెట్టివేశాడు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి అతన్ను అడ్డుకునేందుకు యత్నించగా బూతులు తిడుతూ దాడికి యత్నించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. గర్భా వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన బాలిక ప్రవేశం విషయంలో వివాదం తలెత్తడంతో కమల్ చౌహాన్ తనతో అసభ్యంగా ప్రవర్తించి, బయటకు నెట్టివేశాడని సదరు బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.దీంతో సదరు బీజేపీ నాయకుడిపై పోక్సో చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్) సెక్షన్ 74 కింద కేసు ఫైల్ చేసినట్టు తెలిసింది. బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అక్కడే ఉన్న పలువురిని భయభ్రాంతులకు గురిచేసినట్టు కూడా తెలుస్తోంది.

గాంధీ, నెహ్రూ, యాదవ్ నాయకత్వం మాకు అవసరం లేదు :  అసదుద్దీన్ ఒవైసీతెలంగాణSwechaa19 Oct 2026, 10:34 AM

గాంధీ, నెహ్రూ, యాదవ్ నాయకత్వం మాకు అవసరం లేదు : అసదుద్దీన్ ఒవైసీ

దేశ రాజకీయాల్లో ముస్లిం ప్రాధాన్యంపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన రెండు నెలల ముందుగానే అక్కడ ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ముస్లింలు ఎవరికీ బానిసలు కాదని, సంప్రదాయ పార్టీల వెనుక నడవాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. యూపీలోని రాంపూర్‌‌లో ఆయన మాట్లాడుతూ.. తమకు నెహ్రూ, గాంధీ , యాదవ్ కుటుంబాల నాయకత్వం ఇకపై అవసరం లేదన్నారు. ముస్లిం సమాజం నుంచి స్వయంగా నాయకులు ఎదుగుతారని పేర్కొన్నారు. ఇంకెన్నాళ్లు ఇతర పార్టీల నాయకుల వెనుక తిరుగుతారని ప్రశ్నించారు. సంప్రదాయ లీడర్లను నెహ్రూ, గాంధీలుగా భావించి మద్దతు ఇవ్వాలని కొందరు మనవారే చెబుతున్నారని, ‘అలాంటి వారికి, ఒవైసీకి ఉన్న తేడా ఇదే. వాళ్లు ఇతరులను సమర్థించమంటారు. కానీ నేను మాత్రం మీరే నాయకులు కండి అంటాను’ అని అసదుద్దీన్ ఒవైసీ తేల్చిచెప్పారు.

ఢిల్లీలో కొత్త పొలిటికల్ వార్: 'సీజేపీ'కి పోటీగా 'లాల్ హిట్‌ జనతా పార్టీ' ఆవిర్భావం!రాజకీయాలుSwechaa19 Oct 2026, 10:25 AM

ఢిల్లీలో కొత్త పొలిటికల్ వార్: 'సీజేపీ'కి పోటీగా 'లాల్ హిట్‌ జనతా పార్టీ' ఆవిర్భావం!

 దేశ రాజధాని ఢిల్లీలో సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా డిమాండ్‌తో నిరసనలు చేపడుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరో సరికొత్త గ్రూప్ రంగంలోకి దిగింది. ‘లాల్ హిట్‌ జనతా పార్టీ’ (Lal Hit Janata Party) పేరుతో ఆవిర్భవించిన ఈ నూతన వేదిక.. దేశ రాజ్యాంగ సంస్థలకు మద్దతుగా నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని ప్రకటించింది. ఢిల్లీలోని మాలవియా స్మృతి భవన్‌లో ‘లాల్ హిట్‌ జనతా పార్టీ’ చీఫ్ అయాన్ భట్నాగర్ ఆధ్వర్యంలో తొలి సభ్యత్వ సమావేశం ఘనంగా నిర్వహించారు.

Cinema: గెస్ట్ అపీరియన్స్, ఐటం సాంగ్స్ కి కోట్లు గుమ్మరిస్తే ఎలా?సినిమాSwechaa19 Oct 2026, 10:14 AM

Cinema: గెస్ట్ అపీరియన్స్, ఐటం సాంగ్స్ కి కోట్లు గుమ్మరిస్తే ఎలా?

Cinema: బాలీవుడ్ లో ఒకప్పుడు భారీ మల్టీస్టారర్ చిత్రాలొచ్చి బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో వసూళ్లను రాబట్టాయి. స్టార్ హీరోలను, హీరోయిన్లను హిందీ దర్శకులు ఒకే సినిమాలో ఒకే ఫ్రేమ్ లో చూపిస్తే ప్రపంచవ్యాప్తంగా సినీ లవర్స్‌కి కన్నులపండుగగా అనిపించింది. ఒక్క వాల్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచి..బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్ఠించింది. ఆ ట్రెండ్ అండ్ కల్చర్ మన సౌత్‌లో మొదలై కొనసాగుతోంది. కానీ, చిన్న గెస్ట్ అపీరియన్స్‌కి కోట్లు గుమ్మరిస్తున్నారు.

హీరో టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్  సంచలనంసినిమాSwechaa19 Oct 2026, 09:27 AM

హీరో టైగర్ ష్రాఫ్‌ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ సంచలనం

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరోసారి కాల్పుల మోత కలకలం రేపింది. ప్రముఖ బాలీవుడ్ యాక్షన్ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో టైగర్ ష్రాఫ్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఎట్టకేలకు సురక్షితంగా బయటపడగా.. ఆయన కారు డ్రైవర్‌తో పాటు మరో స్థానిక పౌరుడికి గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. టైగర్ ష్రాఫ్ తన కారులో ప్రయాణిస్తుండగా, ఒక ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు అగంతకులు వారిని వెంబడించారు. అదును చూసి నటుడితో పాటు ఆయన డ్రైవర్‌పైకి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో డ్రైవర్‌కు, అటుగా వెళ్తున్న మరో సామాన్య పౌరుడికి గాయాలు కావడంతో స్థానికులు వారిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టైగర్ ష్రాఫ్ ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా ఉన్నట్లు తెలిసింది.

jagityala: బతుకమ్మ సంబరాల్లో కల్లోలం.. ఇంటర్ విద్యార్థి దారుణ హత్య!..క్రైమ్Swechaa19 Oct 2026, 09:24 AM

jagityala: బతుకమ్మ సంబరాల్లో కల్లోలం.. ఇంటర్ విద్యార్థి దారుణ హత్య!..

సద్దుల బతుకమ్మ పండుగ పూట జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వలస వచ్చిన ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవలో ఇంటర్ విద్యార్థి సంతోష్‌ను అనిల్ కత్తితో దారుణంగా హతమార్చాడు. కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా సంతోష్ మార్గమధ్యంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పండగ పూట జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది.

చెన్నైకి రెడ్ అలర్ట్.. తమిళనాడును ముంచెత్తుతున్న కుండపోత వర్షాలు!NationalSwechaa19 Oct 2026, 09:05 AM

చెన్నైకి రెడ్ అలర్ట్.. తమిళనాడును ముంచెత్తుతున్న కుండపోత వర్షాలు!

 తమిళనాడు రాజధాని చెన్నైతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈశాన్య రుతుపవనాల (Northeast Monsoon) ప్రభావంతో తమిళనాడులో కుండపోత వానలు కురుస్తున్నాయి. ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ శాఖ చెన్నై నగరానికి 'రెడ్ అలర్ట్' (Red Alert) జారీ చేసింది. అదేవిధంగా చెంగల్పట్టు, తిరువళ్లూరు, నీలగిరి, కోయంబత్తూరు, తేని జిల్లాలతో పాటు మరో 26 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ 'ఆరెంజ్ అలర్ట్' ప్రకటించారు.

Nayanthara: మూడవసారి రజినీతో జోడీ?సినిమాSwechaa19 Oct 2026, 08:55 AM

Nayanthara: మూడవసారి రజినీతో జోడీ?

Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్‌తో చాలా బిజీగా ఉన్నారు. ఇటు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీలో నయన్ క్రేజ్ ప్రస్తుతం భారీ స్థాయిలో ఉంది. ఇప్పుడున్న స్టార్ హీరోయిన్స్‌లో నయన్ హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. చేతిలో పలు భారీ చిత్రాలుండగా..ఇప్పుడు మరో క్రేజీ మూవీలో ఛాన్స్ అందుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ధర్మన్. త్వరలో, అఫీషియల్‌గా ప్రకటన రానుందట.

Ajith-Hombale: హోంబలే నుంచి మరో భారీ ప్రాజెక్ట్?సినిమాSwechaa19 Oct 2026, 08:22 AM

Ajith-Hombale: హోంబలే నుంచి మరో భారీ ప్రాజెక్ట్?

Ajith-Hombale: రాకింగ్ స్టార్ యష్ హీరోగా వచ్చిన భారీ పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ ఛాప్టర్ 1. ఈ సినిమాతో నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ అంతటా బాగా పాపులర్ అయింది. ఈ సంస్థను 2012లో బెంగళూరులో విజయ్ కిరగందూర్, చలువె గౌడ ప్రారంభించారు. కాంతార కూడా ఇదే నిర్మాణ సంస్థలో వచ్చింది. అలాగే, పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా సలార్ వచ్చి వసూళ్ల సునామీని సృష్ఠించింది. ఇప్పుడు తమిళ సీనియర్ హీరో అజిత్ కుమార్‌తో హోంబలే ఓ భారీ చిత్రానికి సన్నాహాలు చేస్తోంది.

King 100: నాగ్ స్టోరీ సెలక్షన్స్ మారిందా!సినిమాSwechaa18 Oct 2026, 10:52 PM

King 100: నాగ్ స్టోరీ సెలక్షన్స్ మారిందా!

King 100: టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున చేస్తున్న ప్రయోగాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎప్పుడూ తన అన్నపూర్ణ సంస్థ నుంచి కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తుంటాడు ఈ మన్మధుడు. కొత్త దర్శకుడంటే మొదటి సినిమాకి ప్రాణం పెట్టి పనిచేస్తాడు. హిట్ కొట్టాలనే కసి ఉంటుంది. అందుకే, డెబ్యూ డైరెక్టర్ అంటే నాగ్‌కి ఆసక్తి ఎక్కువ. అలాగే, ఇప్పుడు రా.కార్తీక్ ని మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.

హీరోయిన్స్‌కి మెగాస్టార్, సూపర్ స్టార్ అంటే ఎంత క్రేజో!సినిమాSwechaa18 Oct 2026, 10:36 PM

హీరోయిన్స్‌కి మెగాస్టార్, సూపర్ స్టార్ అంటే ఎంత క్రేజో!

నేటితరం హీరోయిన్స్‌కి సీనియర్ హీరోలతో నటించే అవకాశం దక్కితే ఏదో అవార్డ్ వరించినట్టుగా పొంగిపోతుంటారు. ముఖ్యంగా, మన టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి, తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలలో ఛాన్స్ వస్తే జీవితంలో ఏదో సాధించినట్టే అని ఫీలవుతుంటారు. 70 ఏళ్ళు దాటిన ఈ హీరోల పక్కన హీరోయిన్ ఛాన్స్ అంటే కొంతదికి అసలు రాదు. కాబట్టి, స్పెషల్ సాంగ్ ఛాన్స్ వస్తే మత్రం అదే ఓ అవార్డ్. పూర్ణ ఇప్పుడు అదే ఆనందంలో ఉంది.