స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఏసీబీ వలలో అసిస్టెంట్ ఇంజినీర్.. రూ.1,20వేల లంచం డిమాండ్తెలంగాణSwechaa15 Oct 2026, 02:29 PM

ఏసీబీ వలలో అసిస్టెంట్ ఇంజినీర్.. రూ.1,20వేల లంచం డిమాండ్

హైదరాబాద్‌లో కరెంట్ మీటర్ల మంజూరు కోసం రూ. 1,20,000 లంచం తీసుకుంటూ టీజీఎస్‌పీడీసీఎల్ (TGSPDCL) అసిస్టెంట్ ఇంజనీర్ పీఎస్ రాకేష్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆయన మదన్నపేట సెక్షన్ సంతోష్ నగర్ సబ్‌స్టేషన్ పరిధిలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఫిర్యాదు దారుడి భవనానికి కొత్తగా 6 విద్యుత్ మీటర్లను మంజూరు చేయడానికి భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్లాన్ ప్రకారం బాధిత వ్యక్తి అసిస్టెంట్ ఇంజినీర్ రాకేశ్‌కు రూ. రూ.1,20,000 లంచం రూపేణా అందజేస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రసాయన పరీక్షలు నిర్వహించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, ఏఈ రాకేష్‌పై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టుకు తరలించారు.

రేవంత్‌రెడ్డి కమీషన్ల దందా? టెండర్లలో భారీ అక్రమాలపై సంచలన లేఖ!!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa15 Oct 2026, 02:12 PM

రేవంత్‌రెడ్డి కమీషన్ల దందా? టెండర్లలో భారీ అక్రమాలపై సంచలన లేఖ!!

 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కాంట్రాక్టర్ల పట్ల అనుసరిస్తున్న వైఖరి, టెండర్ల కేటాయింపుల్లో అక్రమాలపై నిర్మాణ రంగంలో తీవ్ర కలకలం రేగుతోంది. ఇటీవల రేడియల్ రోడ్ల (HGCL) టెండర్ల అవినీతిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఆరోపణల వివాదం ముగియకముందే, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్వీఎం కన్స్ట్రక్షన్స్ (RVM Constructions) మేనేజింగ్ డైరెక్టర్ నామా రమేశ్ "బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా" (BAI) అధ్యక్షుడికి రాసిన సంచలన లేఖ బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది.

ప్రియుడి బెయిల్ కోసం ప్రియురాలి సాహసం..క్రైమ్Swechaa15 Oct 2026, 02:03 PM

ప్రియుడి బెయిల్ కోసం ప్రియురాలి సాహసం..

మత్తుకు బానిసైన ఓ యువతి చేసిన సాహసం ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు డ్రగ్స్ సరఫరా దందా చేస్తూ ప్రియురాలు పోలీసులకు చిక్కింది. విజయవాడ - పటమటకు చెందిన నాగసౌమ్య, ఆమె ప్రియుడు కాశీవర్ధన్ ఇద్దరూ డ్రగ్స్‌కు బానిసలు అయ్యారు. మూడు నెలల క్రితం చిత్తూరులో డ్రగ్స్ సరఫరా చేస్తూ కాశీవర్ధన్ పోలీసులకు చిక్కాడు. అతన్ని విడిపించేందుకు డబ్బులు లేక, కొందరితో కలిసి డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆ కమీషన్ డబ్బులను నాగసౌమ్య కూడబెడుతోంది.ఈ క్రమంలో కృష్ణలంకకు చెందిన బషీర్ రూ.50 వేలు కమీషన్ ఇస్తానని అనడంతో బెంగళూరుకు వెళ్లి 110 గ్రాముల ఎండీఎంఏ తీసుకుంది. బెంగళూరు - హౌరా ఎక్స్‌ప్రెస్‌లో నాగసౌమ్య తిరిగి విజయవాడ రాగా ముందస్తు సమాచారంతో పోలీసులు ఆమెను పట్టుకున్నారు.

Jailer 2 Review: తప్పు చేస్తే కొడుకును కూడా వదలని ముత్తువేల్ పాండ్యన్సినిమాSwechaa15 Oct 2026, 02:02 PM

Jailer 2 Review: తప్పు చేస్తే కొడుకును కూడా వదలని ముత్తువేల్ పాండ్యన్

Jailer 2 Review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ 2. గతంలో వచ్చిన జైలర్ సినిమాకి సీక్వెల్ కావడంతో సహజంగానే సీక్వెల్ మూవీపై అంచనాలు రెట్టింపు స్థాయిలో పెరగడం సహజం. అందుకు తగ్గట్టుగానే దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ జైలర్ 2 చిత్రాన్ని రూపొందించాడు. అక్టోబర్ 15న రిలీజైన ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది.

సీఎం హెచ్చరికతో కదలిక.. యాదాద్రి ప్లాంట్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు!తెలంగాణSwechaa15 Oct 2026, 01:32 PM

సీఎం హెచ్చరికతో కదలిక.. యాదాద్రి ప్లాంట్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీలు!

 రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న అప్రకటిత విద్యుత్ కోతలు, సరఫరా సమస్యలపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో విద్యుత్ శాఖ అధికారుల తీరును తీవ్రంగా తప్పుపట్టిన ఆయన, పరిస్థితిలో తక్షణ మార్పు రాకపోతే ఉన్నతాధికారులను సైతం సస్పెండ్ చేయడానికి వెనుకాడబోమని గట్టి హెచ్చరిక జారీ చేశారు. నైనీ, మహానది నుంచి బొగ్గు సరఫరాకు అవసరమైన లింకేజీలు ఉన్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తిలో మందగమనం ఎందుకు ఉందో నిలదీస్తూ తక్షణ నివేదిక కోరారు.

ఆంధ్రా అధికారులకు అందలం..తెలంగాణ వాళ్లు బలి!టాప్ న్యూస్Swechaa15 Oct 2026, 01:16 PM

ఆంధ్రా అధికారులకు అందలం..తెలంగాణ వాళ్లు బలి!

రాష్ట్రంలో మరోసారి తెలంగాణ ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది. మనకు న్యాయపరంగా దక్కాల్సిన నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఎన్నో బలిదానాలకు ఓర్చి సాధించిన స్వరాష్ట్రంలోనూ స్థానిక ఉద్యోగులు వివక్షను ఎదుర్కొంటున్నట్టు ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఎలాగైతే ఉద్యోగాలు, ప్రమోషన్ల విషయంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతోందని చెబుతున్నారు. పలు ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో పైస్థాయిలో ఇప్పటికీ ఆంధ్రా అధికారులే పెత్తనం చెలాయిస్తున్నట్టు తెలిసింది. తాజాగా నిన్న జరిగిన ఓ పరిణామం తెలంగాణ ఉద్యోగులు, ఉన్నతాధికారులకు ఎంతటి తీరని అన్యాయం జరుగుతుందో, సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.రాష్ట్రంలో కరెంటు కోతలు, విద్యుత్ సంస్థల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడం, కరెంటు కోతలపై సీఎం అధికారుల మీద సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యం వహిస్తే సస్పెండ్ చేస్తానని అధికారులను హెచ్చరించారు. అయితే, సీఎం రేవంత్ వ్యాఖ్యలతో విద్యుత్ సంస్థలలో పనిచేసే ఇంజినీర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

Tollywood: మైథలాజికల్ సినిమాలకి అదే మైనస్..ఆ కోట్లన్నీ ఏమవుతున్నాయ్?సినిమాSwechaa15 Oct 2026, 01:10 PM

Tollywood: మైథలాజికల్ సినిమాలకి అదే మైనస్..ఆ కోట్లన్నీ ఏమవుతున్నాయ్?

Tollywood: ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమా అనేది మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేస్తుంది ఎవరి కోసం..ఎందుకోసం. 5 కోట్ల లోపు సినిమాలు కూడా అవాక్కయ్యే వసూళ్ళను రాబడుతున్నాయి. కానీ, పాన్ ఇండియా సినిమా అందులోనూ మైథలాజికల్ సినిమాలకి మాత్రం కనీసం థియేటర్స్ రెంట్ కూడా రావడం లేదు. దీనికి, కారణం అతుకుల బొంతలా ఉంటోన్న వీఎఫ్ఎక్స్.

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఉదంతంపై ఏపీ హైకోర్టు సీరియస్: డీజీపీకి కీలక ఆదేశాలు!క్రైమ్Swechaa15 Oct 2026, 12:51 PM

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్య ఉదంతంపై ఏపీ హైకోర్టు సీరియస్: డీజీపీకి కీలక ఆదేశాలు!

 కాకినాడ జిల్లా తునిలో సంచలనం సృష్టించిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ఘటనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. చిన్నారి ఆచూకీని వీలైనంత త్వరగా కనిపెట్టేందుకు రాష్ట్ర పోలీసు శాఖ మరింత చురుగ్గా, పకడ్బందీగా గాలింపు చర్యలు చేపట్టాలని డీజీపీ హరీశ్ కుమార్‌ను స్పష్టంగా ఆదేశించింది.  సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తప్పిపోయిన పిల్లల కేసుల్లో పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.

1000 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్.. 23 వేల మార్కు సమీపంలో నిఫ్టీ!వ్యాపారంSwechaa15 Oct 2026, 12:34 PM

1000 పాయింట్లకు పైగా ఎగబాకిన సెన్సెక్స్.. 23 వేల మార్కు సమీపంలో నిఫ్టీ!

 భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం అదరగొట్టే లాభాలతో దూసుకెళ్తున్నాయి. గత సెషన్‌లో నమోదైన నష్టాల నుంచి పూర్తిగా తేరుకున్న సూచీలు, కొనుగోళ్ల మద్దతుతో భారీ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో వెల్లువెత్తిన కొనుగోళ్ల జోరు, అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Crude Oil) ధరలు తగ్గడం, రూపాయి మారకం విలువ బలపడటం వంటి సానుకూల పరిణామాలు మార్కెట్ ర్యాలీకి ఊతమిచ్చాయి.

Nalgonda: మున్సిపల్ కార్పొరేషన్‌ లో బోగస్ ఉద్యోగుల దందా.. బినామీల పేరిట జీతాలు డ్రా!!..తెలంగాణSwechaa15 Oct 2026, 12:09 PM

Nalgonda: మున్సిపల్ కార్పొరేషన్‌ లో బోగస్ ఉద్యోగుల దందా.. బినామీల పేరిట జీతాలు డ్రా!!..

రాష్ట్రంలో ప్రభుత్వం ఏదైనా అవినీతికి మాత్రం అంతం ఉండటం లేదు. ఒకవైపు లంచాల భూతం పట్టిపీడిస్తుండగా.. మరోవైపు ప్రతి శాఖలో రోజుకో కొత్త కుంభకోణం భయటపడటం చర్చంశనీయంగా మారుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కుంభకోణాలకు నిలయం అనే ఆరోపణలున్నాయి. కానీ బీఆర్ఎస్ అవినీతిపై రేవంత్ రెడ్డి చేసిన పోరాటంతో ప్రజల్లో నెలకొన్న ఆశ.. మళ్ళీ కాంగ్రెస్ కు పునరుజ్జీవం ఇచ్చింది..

అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక రాష్ట్రంలో ప్రతి శాఖలో తవ్వుతున్న కొద్ది అవినీతి లుకలుకలు బయటపడటం.. మళ్ళీ కాంగ్రెస్ పాలనపై గతం తాలూకు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కరెంట్ కోతలు.. తప్పు మీరే చేసి అధికారులను బద్నాం చేస్తారా?:  హరీశ్ రావుతెలంగాణSwechaa15 Oct 2026, 12:00 PM

కరెంట్ కోతలు.. తప్పు మీరే చేసి అధికారులను బద్నాం చేస్తారా?: హరీశ్ రావు

రాష్ట్రంలో నెలకొన్న కరెంటు కష్టాలు, తాజా పరిస్థితులపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు.గురువారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు.రాష్ట్రంలో కరెంట్ సంక్షోభం తలెత్తడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని అన్నారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు పునరావృతం అవుతున్నాయని పేర్కొన్నారు.వేసవి రాకముందే రాష్ట్రంలో కోతలు మొదలు అయ్యాయని, ఈ సంక్షోభానికి ముమ్మాటికీ రేవంత్ ప్రభుత్వమే కారణమని స్పష్టంచేశారు. తప్పులు మీరు చేసి అధికారులపై నెపం నెట్టడం సీఎం, మంత్రులకు పరిపాటిగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో బొగ్గు నిల్వలు ముందస్తుగా ఏర్పాటు చేయకపోవడంతో విద్యుత్ సంక్షోభం తలెత్తిందని, అందుకు ప్రభుత్వమే కారణమని వెల్లడించారు. విద్యుత్ రంగంపై సమీక్షలు లేకపోవడంతో కరెంట్ కోతలు వస్తున్నాయని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు హెచ్చరికలు వచ్చినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు.

‘సింగరేణి పోతే ఆ మాత్రం ఉండాలి’.. కొత్త లుక్‌పై కేటీఆర్ చమత్కారం!వైరల్ న్యూస్Swechaa15 Oct 2026, 11:55 AM

‘సింగరేణి పోతే ఆ మాత్రం ఉండాలి’.. కొత్త లుక్‌పై కేటీఆర్ చమత్కారం!

 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) తన సరికొత్త లుక్‌తో రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తించారు. సాధారణంగా క్లీన్ షేవ్, ప్రొఫెషనల్ ఫార్మల్ ఆహార్యంలో కనిపించే ఆయన.. ఈసారి గడ్డం పెంచి సరికొత్త 'మాస్ లుక్'లో దర్శనమివ్వడం బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.  రామగుండంలో నిర్వహించనున్న 'సింగరేణి కార్మిక గర్జన' సభకు బయల్దేరిన సమయంలో ఆయన ఈ కొత్త అవతారంలో కనిపించడంతో ఫొటోలు, వీడియోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి.

రోబోటిక్ టెక్నాలజీతో అద్భుతం.. 12ఏళ్ల తర్వాత నడిచిన యువతి!వైరల్ న్యూస్Swechaa15 Oct 2026, 11:18 AM

రోబోటిక్ టెక్నాలజీతో అద్భుతం.. 12ఏళ్ల తర్వాత నడిచిన యువతి!

 సాంకేతికత మనిషి సౌకర్యాలకే పరిమితం కాకుండా, ఎంతోమంది నిరాశలో కూరుకుపోయిన జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. దీనికి లెబనాన్‌కు చెందిన జెస్సికా టవిల్ (Jessica Tawil) ఉదంతం చక్కటి ఉదాహరణగా నిలిచింది. 2014లో సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జెస్సికా వెన్నుపూస దెబ్బతినడంతో పారాప్లీజియా (Paraplegia) బారిన పడ్డారు. అప్పటి నుంచి శరీర కింది భాగం పనిచేయక పూర్తిగా వీల్‌చైర్‌కే పరిమితమైన ఆమె జీవితంలో, అత్యాధునిక టెక్నాలజీ తాజాగా అద్భుతమైన మార్పును తెచ్చింది.

రూ. లక్షల్లో జీతం..వేధింపులకు యువ టెకీ బలిక్రైమ్Swechaa15 Oct 2026, 10:57 AM

రూ. లక్షల్లో జీతం..వేధింపులకు యువ టెకీ బలి

సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న ఓ యువ టెకీ జీవితం పెళ్లయ్యాక ఛిద్రం అయిపోయింది. తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకున్న ఆ యువతి.. వివాహం అనంతరం ఆమె జీవితం నరకప్రాయంగా మారింది. అత్తింటి వారి నుంచి ఒత్తిడి, వేధింపులు ఎక్కువ అయిపోయాయి.ఓవైపు ఉద్యోగంలో వర్క్ ప్రెజర్.. మరోవైపు అత్తింటి వేధింపులు పెరగడంతో జీవితం మీద విరక్తి కలిగింది. తన బాధను తల్లిదండ్రులకు చెప్పినా వారు ఏమి చేయలేకపోయారు. దీంతో తనువు చాలించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మహారాష్ట్ర పూణెలోని కేశవ్‌నగర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. 2018లో రాహుల్ అనే వ్యక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని త్రిష్ణకు వివాహం జరిగింది.

నేడు మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశంతెలంగాణSwechaa15 Oct 2026, 10:23 AM

నేడు మంత్రులతో ముఖ్యమంత్రి సమావేశం

ఎట్టకేలకు రేవంత్ సర్కార్ మేల్కొంది. రైతులకు విద్యుత్ సరఫరా విషయంలో అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోకుండా రేయింబవళ్లు విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. పంటలు చేతికొచ్చే వరకు విద్యుత్ కోతలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే 20 రోజులు పంటలకు అత్యంత కీలకమని, ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ కొరత కారణంగా రైతులు పంట నష్టపోకూడదని హెచ్చరించారు. వ్యవసాయానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అందుకు అనుగుణంగా సరఫరా పెంచాలని సూచించారు. ఎల్ నినో పరిస్థితులపై చర్చించేందుకు నేడు మంత్రులతోనూ సమావేశం అవుతున్నారు.

నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలుతెలంగాణSwechaa15 Oct 2026, 10:20 AM

నేటి నుంచి రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని తెలుస్తోంది.రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య రుతుపవనాలు దక్షిణ భారతంలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని, దీంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వర్షాలు కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వాతావరణంలో చోటుచేసుకున్న ఈ మార్పుల దృష్ట్యా ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఫ్లైదుబాయ్ విమాన దాడి ఘటనలో మరో ట్విస్ట్.. ఇద్దరు పైలట్లు అరెస్ట్!InternationalSwechaa15 Oct 2026, 10:16 AM

ఫ్లైదుబాయ్ విమాన దాడి ఘటనలో మరో ట్విస్ట్.. ఇద్దరు పైలట్లు అరెస్ట్!

 దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానం (FZ1073) కాక్‌పిట్‌లో గత నెలలో జరిగిన సంచలన దాడి కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. విమానాన్ని కూల్చివేసేందుకు పెద్దఎత్తున కుట్ర జరిగిందనే అనుమానాలు బలపడుతున్న తరుణంలో, దుబాయ్ పోలీసులు తాజాగా మరో ఇద్దరు మాల్దీవుల పైలట్లను అరెస్ట్ చేశారు. మాల్దీవుల వార్తా సంస్థ 'అధాదు' వెల్లడించిన వివరాల ప్రకారం.. గత శనివారమే ఈ అరెస్టులు జరగగా, యూఏఈలోని మాల్దీవుల రాయబార కార్యాలయం వారి కుటుంబ సభ్యులకు ఈ సమాచారాన్ని చేరవేసింది.

స్వేచ్ఛ న్యూస్ వార్తలతో  సర్కార్ అప్రమత్తం!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa15 Oct 2026, 09:59 AM

స్వేచ్ఛ న్యూస్ వార్తలతో సర్కార్ అప్రమత్తం!

ప్రజల మేలు కోరే నాయకుడే ముఖ్యమంత్రి కావాలని వందల మంది నాయకులున్నా ఏరికోరి ఒక్కరినే సీఎం కావాలని కోరుకుంటారు. వాళ్ల కోసం వందల మంది క్లోజ్‌గా పని చేస్తారు. వేల మంది మేలు కోరుతారు. లక్షల మంది ఆయన కోసం ఓట్లు వేస్తారు. మిగతా కోట్ల మంది వివిధ న్యాయకత్వంతో ఓట్లు వేసి పాలించే అదృష్టం కల్పిస్తారు. ఇలాంటి గొప్ప ప్రజాస్వామ్యంలో రేవంత్ రెడ్డికి 40 శాతం మార్కులు కూడా లేకుండానే 75 శాతంతో డిస్టెన్స్‌లో పాస్ చేశారు తెలంగాణ ప్రజలు.

రోగులకు  నిమ్స్ శుభవార్త.. ఓపీ సేవల సమయం పెంపుతెలంగాణSwechaa15 Oct 2026, 09:34 AM

రోగులకు నిమ్స్ శుభవార్త.. ఓపీ సేవల సమయం పెంపు

రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే రోగులకు ‘నిమ్స్’ హాస్పిటల్ శుభవార్త చెప్పింది. ఓపీ(ఔట్ పేషెంట్) సేవల సమయం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. నిమ్స్‌లో అత్యవసర చికిత్సలకు మినహాయించి సాధారణ హెల్త్ చెకప్, అనారోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ కోసం వెళ్లే రోగులు తప్పకుండా ఓపీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఉదయం 8 గంటల నుంచి కేవలం 11 గంటల వరకే ఓపీ సేవలు మొన్నటివరకు కొనసాగాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చేది. తమ బంధువులు, కుటుంబాల కోసం రాత్రిళ్లు వచ్చి ఆస్పత్రి లేదా హోటల్స్‌లో బస చేసి ఉదయాన్నే ఓపీ తీసుకుని హెల్త్ చెకప్, ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లేవారు. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని రోగులు, వారి తరపు బంధువులు ఆవేదన వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి.

ఐపీఎల్‌లో తొలి టైటిల్ లక్ష్యంగా.. యువరాజ్‌ సింగ్ నూతన పగ్గాలు!క్రీడలుSwechaa15 Oct 2026, 08:59 AM

ఐపీఎల్‌లో తొలి టైటిల్ లక్ష్యంగా.. యువరాజ్‌ సింగ్ నూతన పగ్గాలు!

 భారత క్రికెట్ దిగ్గజ ఆల్ రౌండర్, ప్రపంచకప్ విజేత యువరాజ్ సింగ్ ఐపీఎల్‌లో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్టు అసిస్టెంట్, బ్యాటింగ్ కోచ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. కోచ్‌గా తన మొదటి అధికారిక ఐపీఎల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్న యువీ, జట్టులో గెలుపు సంస్కృతిని, గట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపి ఢిల్లీ ఫ్రాంచైజీకి తొలిసారి ఐపీఎల్ ట్రోఫీ అందించడమే తన ప్రధాన ధ్యేయమని ధీమా వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యారు.

కొల్లాపూర్‌లో వాటర్ వార్.. కాలువ నీటి పంపిణీపై రైతుల ఘర్షణ!తెలంగాణSwechaa15 Oct 2026, 08:43 AM

కొల్లాపూర్‌లో వాటర్ వార్.. కాలువ నీటి పంపిణీపై రైతుల ఘర్షణ!

 ఎల్‌నినో ప్రభావంతో సాగు, తాగునీటికి కష్టాలు అధికమవుతున్నాయి. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనేపథ్యంలో సాగునీటి పంపిణీకి సంబంధించి రెండు గ్రామాల రైతుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల పరిధిలో ప్రవహిస్తున్న భీమా కాలువ ద్వారా జూరాల ప్రాజెక్టు నీటిని మళ్లించే వ్యవహారంలో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

చలికాలంలోనూ సెగలు.. 2027 వేసవి భగ్గుమంటుందా? భారత్‌కు సూపర్‌ ఎల్‌నినో ముప్పు!NationalSwechaa15 Oct 2026, 12:37 AM

చలికాలంలోనూ సెగలు.. 2027 వేసవి భగ్గుమంటుందా? భారత్‌కు సూపర్‌ ఎల్‌నినో ముప్పు!

చలికాలంలోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదై, వచ్చే ఏడాది వేసవిలో భరించలేని వేడి ఎదురుకాబోతోందా? పసిఫిక్‌ సముద్రంలో వేగంగా బలపడుతున్న ఎల్‌నినో పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. భారత్‌లో ఇప్పటికే ముగిసిన నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని మిగిల్చాయి.

హుతీల హైటెక్ దాడులు.. సౌదీకి సవాల్! 27 లక్షల మంది భారతీయుల భద్రతపై ఆందోళనInternationalSwechaa14 Oct 2026, 11:50 PM

హుతీల హైటెక్ దాడులు.. సౌదీకి సవాల్! 27 లక్షల మంది భారతీయుల భద్రతపై ఆందోళన

అసలు హుతీలు ఎవరు? సౌదీ అరేబియాతో వీరికి శత్రుత్వం ఎందుకు? అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తున్న వీరిని అడ్డుకోవడం సాధ్యమేనా? ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు పరిష్కార మార్గాలేంటి?

రైతులకు ఇచ్చింది 8గంటల కరెంటే.. ఇదిగో సాక్ష్యంతెలంగాణSwechaa14 Oct 2026, 11:50 PM

రైతులకు ఇచ్చింది 8గంటల కరెంటే.. ఇదిగో సాక్ష్యం

Harish Rao: రేవంత్ సర్కార్ పాలనలో రైతులకు 8 గంటల కరెంట్ కూడా దక్కడం లేదన్నారు మాజీమంత్రి హరీశ్ రావు. ఇచ్చిన 7 గంటల 50 నిమిషాల కరెంటులోనూ మూడుసార్లు కోతలే విధించారన్నారు. మాటల్లో 24 గంటల ఉచిత విద్యుత్.. చేతల్లో మాత్రం నిలువునా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ట్రిప్పింగ్‌లతో పారిన మడే పారుతూ, వెనక మళ్లకు నీరందక పంటలన్నీ ఎండిపోతున్నాయని వాపోయారు.

ఐటీ కంపెనీలకు, బడా పరిశ్రమలకు కడుపునిండా కరెంట్

ఐటీ కంపెనీలకు, బడా పరిశ్రమలకు కడుపునిండా కరెంట్ ఇచ్చి.. అంతా వాడగా మిగిలిన అడుగుబొడుగు లో వోల్టేజ్ కరెంటును రైతుల ముఖాన కొడుతున్నారని ఆరోపించారు. నాడు కేసీఆర్ రైతుకు మొదటి ప్రాధాన్యతనిచ్చి 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంట్ ఇస్తే.. నేడు రేవంత్ రెడ్డి పరిశ్రమల కోసం రైతుల పొట్టకొడుతూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టారని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ వలసలు మొదలయ్యాయితెలంగాణSwechaa14 Oct 2026, 11:23 PM

రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ వలసలు మొదలయ్యాయి

Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు. పాలమూరు ఎత్తిపోతలను పండబెట్టావు, నీళ్లు ఇవ్వలేదు అంటూ సీఎం రేవంత్ పై మండిపడ్డారు. మళ్లీ పాలమూరు జిల్లాలో వలసలు మొదలయ్యాయని వాపోయారు. గట్టు మండలం రాయపురం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలను నిరంజన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి హరీశ్ రావు పరిశీలించారు.

UAE Lottery: నిజమైన లక్కీభాస్కర్‌.. రూ.13 కోట్ల లాటరీ గెలిచిన భారతీయుడు..NationalSwechaa14 Oct 2026, 10:18 PM

UAE Lottery: నిజమైన లక్కీభాస్కర్‌.. రూ.13 కోట్ల లాటరీ గెలిచిన భారతీయుడు..

UAE Lottery: సినిమాల్లో లక్కీభాస్కర్ కథలు వినడానికే ఆసక్తిగా ఉంటాయి.. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఓ భారతీయుడి విషయంలో అది అక్షరాలా నిజమైంది. చిన్నపాటి ఆశతో కేవలం 50 దిర్హామ్‌లు (సుమారు రూ.1,100) పెట్టి కొన్న ఒక్క లాటరీ టికెట్ ఆయన తలరాతను పూర్తిగా మార్చేసింది. ఏకంగా 5 మిలియన్ దిర్హామ్‌లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13 కోట్ల జాక్‌పాట్ కొట్టేసి రాత్రికి రాత్రే నిజమైన 'లక్కీభాస్కర్'గా మారారు.షార్జా నగరంలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన కిశోర్, ఇటీవల ‘యూఏఈ లాటరీ’ అధికారిక వెబ్‌సైట్ నుంచి 50 దిర్హామ్‌లు వెచ్చించి ఒక టికెట్ కొనుగోలు చేశారు

TG: "వాటాలు కుదరకే నైనీ టెండర్ రద్దు..".. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్తెలంగాణSwechaa14 Oct 2026, 09:43 PM

TG: "వాటాలు కుదరకే నైనీ టెండర్ రద్దు..".. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

TG: సింగరేణి సంస్థను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని, కమిషన్ల పంపకాల్లో తేడాలు రావడం వల్లే సొంత మంత్రులే కుంభకోణాలను బయటపెట్టుకుంటున్నారని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వేదికగా నిర్వహించిన 'సింగరేణి కార్మిక గర్జన' సభలో ఆయన పాల్గొని, సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహార శైలిపై ఫైర్ అయ్యారు.నైనీ బొగ్గు బ్లాక్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. "తామే నైనీ కుంభకోణాన్ని అడ్డుకున్నామని, దానివల్ల ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయని మంత్రి గొప్పలు చెబుతున్నారు. అసలు నిజం అది కాదు.. లోపల వాటాల పంపకాలు కుదరకే ఈ టెండర్లను రద్దు చేసుకుని, ఒకరి గుట్టును మరొకరు రచ్చకెక్కించుకుంటున్నారు" అని ఎద్దేవా చేశారు.

Karnataka politics: కన్నడ నాట కుర్చీలాట.. డీకే శివకుమార్ ఓపెన్ ఛాలెంజ్!NationalSwechaa14 Oct 2026, 09:21 PM

Karnataka politics: కన్నడ నాట కుర్చీలాట.. డీకే శివకుమార్ ఓపెన్ ఛాలెంజ్!

Karnataka politics: కర్ణాటక రాజకీయ యవనికపై అధికారం కోసం సాగుతున్న కుర్చీలాట ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చాలన్న పట్టుదలతో విపక్షాలు పావులు కదుపుతున్నాయన్న ప్రచారానికి ఆజ్యం పోస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర పేల్చిన ఒక పొలిటికల్ బాంబ్ కన్నడ నాట తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా తమకు అనుకూలంగా మారిందని, ఎన్నికలు వస్తే కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులతో సహా ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరడం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపాయి. తమకు ఎవరినీ బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన అసంతృప్త నేతలే స్వయంగా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విజయేంద్ర తేల్చిచెప్పారు.

ఒక్కొక్కరికి రూ.10లక్షలు ఇవ్వాలి- హరీశ్ రావు డిమాండ్తెలంగాణSwechaa14 Oct 2026, 09:21 PM

ఒక్కొక్కరికి రూ.10లక్షలు ఇవ్వాలి- హరీశ్ రావు డిమాండ్

Harish Rao: కర్ణాటక రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వలస కూలీల కుటుంబాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు పరామర్శించారు. కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం ఇందువాసి గ్రామానికి చెందిన దళిత వలస కూలీల కుటుంబాలతో ఆయన మాట్లాడారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి యోగ క్షేమాలు అడుగుతున్న క్రమంలో కేసీఆర్ సార్ బాగున్నారా సార్ అని బాధితులు హరీష్ రావును అడిగారు.

Vangaveeti Radha: జనసేన గూటికి వంగవీటి వారసుడు..ఏపీSwechaa14 Oct 2026, 08:55 PM

Vangaveeti Radha: జనసేన గూటికి వంగవీటి వారసుడు..

Vangaveeti Radha: బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ బుధవారం సాయంత్రం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా రాధాకృష్ణకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కార్యాలయానికి చేరుకున్న వంగవీటి రాధాను పవన్ కల్యాణ్ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు.