స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

రైతు మెడకు ఉరి.. జీవో నెంబర్ 17- హరీశ్ రావు సంచలనంతెలంగాణSwechaa14 Oct 2026, 08:20 PM

రైతు మెడకు ఉరి.. జీవో నెంబర్ 17- హరీశ్ రావు సంచలనం

GO 17: కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విరుచుకుపడ్డారు. పాత రోజులు తెస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తన మాట నిలబెట్టుకున్నారని విమర్శించారు. ఏపీలో కృష్ణా నీళ్లు పుష్కలంగా పారుతున్నాయన్న హరీశ్ రావు.. రేవంత్ వదిలిన నీటిని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒడిసి పెట్టారని చెప్పారు.

ప్రభుత్వం చేతకానితనం వల్ల, కరెంటు ఇవ్వకపోవడం వల్ల, కృష్ణా నదిలో నీళ్లు ఎత్తకపోవడం వల్ల ఇవాళ పాలమూరుకు రేవంత్ రెడ్డి పేరిట గ్రహణం పట్టిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చింది, కరెంటు బాధలు తెచ్చింది అంటూ నిప్పులు చెరిగారు. ఇక రేవంత్ సర్కార్ తెచ్చిన జీవో నెంబర్ 17పై తీవ్రంగా స్పందించారు హరీశ్ రావు. జీవో నెంబర్ 17తో రైతులకు ఇచ్చే 24 గంటల ఉచిత కరెంటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉరి వేసిందని ధ్వజమెత్తారు.

Bathukamma Sarees: దసరా పండుగకు బతుకమ్మ చీరల్లేవ్.. ఈసారి అందరికీ అందడం అనుమానమేనా?తెలంగాణSwechaa14 Oct 2026, 08:12 PM

Bathukamma Sarees: దసరా పండుగకు బతుకమ్మ చీరల్లేవ్.. ఈసారి అందరికీ అందడం అనుమానమేనా?

Bathukamma Sarees: తెలంగాణ ఆడపడుచులకు దసరా, బతుకమ్మ పండుగల వేళ అందాల్సిన ఉచిత చీరల పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఏటా పండుగకు ముందే పల్లెపల్లెనా సందడి చేస్తూ చేతికందే బతుకమ్మ చీరల పంపిణీ ఈసారి లేట్ కావడంతో అసలు ఇస్తారా లేదా అనే అనుమానాలను ఆడపడుచులు వ్యక్తం చేస్తున్నారు. పండుగ రోజులు సమీపిస్తున్నా క్షేత్రస్థాయిలో చీరల పంపిణీ ప్రారంభం కాకపోవడం, మరోవైపు ఉత్పత్తి లక్ష్యానికి చాలా దూరంలో ఉండటంతో మహిళల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన మహిళలు, యువతుల సంఖ్య సుమారు 1.68 కోట్లుగా ఉంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం 1.05 కోట్ల చీరల తయారీకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చింది.

Bittu Tabahi: బిట్టూ తబాహి.. నీ కష్టానికి ఇక్కడ విలువ లేదు.. ఈ జనాలు మారరు!NationalSwechaa14 Oct 2026, 07:21 PM

Bittu Tabahi: బిట్టూ తబాహి.. నీ కష్టానికి ఇక్కడ విలువ లేదు.. ఈ జనాలు మారరు!

Bittu Tabahi: ఓ పక్క స్వచ్ఛ భారత్ అంటూ టీవీల్లో, ఫ్లెక్సీల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ప్రచారాలు చేసుకుంటున్నాం.. పర్యావరణాన్ని కాపాడాలంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు దంచుతున్నాం. కానీ గ్రౌండ్ లెవల్‌లో మన బుద్ధి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ ఘటనే పక్కా ఉదాహరణ. 20 ఏళ్ల ఓ కాలేజ్ కుర్రాడు.. తనకు ఈత రాకపోయినా, చేతులకు కనీసం గ్లౌజులు కూడా లేకపోయినా, ప్రాణాలనే ఫణంగా పెట్టి 8 నెలల పాటు రోజూ నదిలో దిగి టన్నుల కొద్దీ చెత్తను బయటకు తీశాడు. కానీ చుట్టుపక్కల జనాలు ఏం చేశారు? వారం తిరక్కుండానే మళ్లీ పాత రోజుల్లాగే ప్లాస్టిక్ కవర్లు, వ్యర్థాలు విసిరేసి నదిని మురికిగుంటలా మార్చేశారు. ఇది చూశాక ఎవరికైనా వచ్చే మాటేమిటంటే.. "బిట్టూ తబాహి.. నీ కష్టానికి ఇక్కడ విలువే లేదు.. ఈ జనాలు అస్సలు మారరు!".మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా బియోరా పట్టణానికి చెందిన సురేంద్ర సింగ్ చౌధరీ.. సోషల్ మీడియాలో 'బిట్టూ తబాహి'గా అందరికీ తెలుసు. తను సాధారణంగా డిగ్రీ చదువుకుంటున్న కుర్రాడు. రోజూ చూసే అజ్నార్ నది ప్లాస్టిక్ చెత్తతో డంపింగ్ యార్డులా మారి కుళ్లిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు. ప్రభుత్వాలు పట్టించుకోవని తెలిసింది, అధికారుల వైపు చూస్తే పనవ్వదని అర్థమైంది.

Karimnagar: కరీంనగర్ నామినేటెడ్ MLC లో ఆదిపత్యం ఎవరిదో?తెలంగాణSwechaa14 Oct 2026, 07:03 PM

Karimnagar: కరీంనగర్ నామినేటెడ్ MLC లో ఆదిపత్యం ఎవరిదో?

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గవర్నర్ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలకు నవంబరు రెండో వారంలో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆ పదవులను చేజిక్కించుకునేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు పావులు కడుపుతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అంశాన్ని ప్రస్తావిస్తూ బీసీలకు సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ప్రధాన ఆశావహులు తెరపైకి వచ్చారు.

రైతుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే- ఎమ్మెల్యే గంగుల కమలాకర్తెలంగాణSwechaa14 Oct 2026, 06:26 PM

రైతుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమే- ఎమ్మెల్యే గంగుల కమలాకర్

SRSP: సాగునీటి కోసం తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. వెంటనే సాగునీటిని విడుదల చేసి తమ పంటలను కాపాడాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాల రైతులదీ ఇదే పరిస్థితి. సాగునీటి కోసం ఆయా ప్రాంతాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికి మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మద్దతుగా నిలిచారు.

కరీంనగర్‌, చొప్పదండి నియోజకవర్గాల రైతుల సాగునీటి హక్కుల కోసం ఆయన గళమెత్తారు. పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడినా సాగునీరు అందకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ పరిధిలోని ఎస్సారెస్పీ డీ-86 కెనాల్‌ దగ్గర రైతులతో కలిసి ఆందోళనకు దిగారు గంగుల కమలాకర్.

1986 నుంచి 2026 వరకు.. మారిపోయిన మనిషి, మాయమైన మానవత్వం!అభిప్రాయంSwechaa14 Oct 2026, 06:08 PM

1986 నుంచి 2026 వరకు.. మారిపోయిన మనిషి, మాయమైన మానవత్వం!

జీవితం ఒక నిత్య ప్రవాహం.. కాలంతో పాటు ఎన్నో మార్పులను మోసుకుంటూ ముందుకు సాగుతున్న ప్రయాణం.. నిన్నటి జ్ఞాపకాలు మనసులో మిగిలిపోతాయి.. నేటి అనుభవాలు మనుషుల్ని మార్చేస్తాయి.. రేపటి ఆశలు జీవితాన్ని నడిపిస్తాయి. కానీ ఈ ప్రయాణంలో మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు మాత్రం మాయం అవకూడదు. ఎందుకంటే కాలం మారుతుంది.. పరిస్థితులు మారతాయి.. తరాలు మారతాయి.. కానీ మనసుకు హత్తుకునే జ్ఞాపకాలు, కష్టాల్లో తోడుగా నిలిచే బంధాలు ఎప్పటికీ వెలకట్టలేనివే. ఇవన్నీ దాటి ఒక సారి జీవిత ప్రయాణాన్ని పరిశీలించుకుంటే.. చివరికి మిగిలేది సంపాదించిన ఆస్తులు కాదు.. మనం పంచిన ప్రేమ, నిలబెట్టుకున్న బంధాలు మాత్రమే.

Puri-Srinu Vaitla: ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్స్ కలిశారు..హిట్ గ్యారెంటీనా!సినిమాSwechaa14 Oct 2026, 06:04 PM

Puri-Srinu Vaitla: ఇద్దరు ఫ్లాప్ డైరెక్టర్స్ కలిశారు..హిట్ గ్యారెంటీనా!

Puri-Srinu Vaitla: పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల..ఇప్పుడు వీరిద్దరికీ బ్లాక్ బస్టర్ గ్యారెంటీగా అవసరం. పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్ళీ హిట్ కొట్టలేదు. ఆ హిట్ కోసం ఎంతో తాపత్రయపడుతున్నాడు. అలాగే, ఆగడు సినిమా డిజాస్టర్ తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకి శ్రీను వైట్ల జార్జి క్రిష్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజాగా, ఈ ఫ్లాప్ డైరెక్టర్స్ ఇద్దరూ ఒకే సెట్‌లో కలిశారు. ఇది, హిట్ కి సంకేతంగా కనిపిస్తోంది.

Blue Drum case: 'బ్లూ డ్రమ్' మర్డర్ కేసులో మీరట్ కోర్టు సంచలన తీర్పు!NationalSwechaa14 Oct 2026, 05:59 PM

Blue Drum case: 'బ్లూ డ్రమ్' మర్డర్ కేసులో మీరట్ కోర్టు సంచలన తీర్పు!

Blue Drum case: అక్రమ సంబంధం కోసం కట్టుకున్న భర్తను అత్యంత పాశవికంగా హతమార్చి, శవాన్ని ముక్కలు చేసి బ్లూ డ్రమ్ములో పెట్టి సిమెంట్‌తో పూడ్చేసిన భయానక ఘటనలో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ 'బ్లూ డ్రమ్' హత్య కేసులో నిందితురాలైన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పును ఇచ్చింది. ఇలాంటి అమానవీయ నేరాలు సమాజంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తిస్తాయని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ మిశ్రా ఈ కఠిన తీర్పును ప్రకటించారు.గతేడాది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో వెలుగుచూసిన ఈ ఘోరం ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించింది. మర్చంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్‌ను ఆయన భార్య ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అతి కిరాతకంగా అంతమొందించింది. అంతటితో ఆగకుండా, నేరం బయటపడకుండా ఉండేందుకు సౌరభ్ మృతదేహాన్ని ఏకంగా 15 ముక్కలుగా నరికివేసింది.

UPI: పండుగల వేళ ‘యూపీఐ’ ట్విస్ట్.. తెరవెనుక ఏం జరిగింది?NationalSwechaa14 Oct 2026, 05:44 PM

UPI: పండుగల వేళ ‘యూపీఐ’ ట్విస్ట్.. తెరవెనుక ఏం జరిగింది?

UPI: పండుగల సీజన్ మొదలైంది అంటే చాలు.. మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతాయి. పల్లెటూరి కిరాణా కొట్టు నుంచి నగరాల్లోని భారీ షాపింగ్ మాల్స్ దాకా కరెన్సీ నోట్ల సవ్వడి కంటే ‘క్యూఆర్ కోడ్’ స్కానింగ్‌ల చప్పుడే ఎక్కువగా వినిపిస్తుంది. దేశంలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా మారిన యూపీఐ నెట్‌వర్క్‌పై సరిగ్గా ఇలాంటి పండుగ వేళ ఒక భారీ పిడుగు పడబోయింది. రూ.2,000 దాటిన లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) పేరుతో కొత్త ఛార్జీల బాదుడు మొదలుకావాల్సింది. కానీ చివరి నిమిషంలో సీన్ మారింది. వ్యాపార వర్గాల ఆందోళనలతో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టింది.దేశవ్యాప్తంగా సాగే డిజిటల్ చెల్లింపుల వ్యవహారాలను ఎన్‌పీసీఐ పర్యవేక్షిస్తుంది. ఈ క్రమంలోనే ఎంపిక చేసిన కస్టమర్-టు-మర్చంట్ (P2M) యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ రుసుము వసూలు చేయాలని నిర్ణయించారు. దీనిని అక్టోబర్ 15 నుంచే పక్కాగా అమల్లోకి తేవాలని భావించారు.

Vijay-Rashmika: సినీ తారలే కాదు ఆదర్శ దంపతులు కూడా..సినిమాSwechaa14 Oct 2026, 05:22 PM

Vijay-Rashmika: సినీ తారలే కాదు ఆదర్శ దంపతులు కూడా..

Vijay-Rashmika: మన తెలుగు సినిమా పరిశ్రమలో సెలబ్రిటీలు అభిమానుల కోసం చేయూతను అందిస్తున్న విషయం తెలిసిందే. తమని ప్రాణంగా అభిమానించే వాళ్ళకి అండగా ఉండటం అనేది దాదాపు అందరూ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఎన్నో ఏళ్ళ నుంచి రక్తదానం, నేత్రదానం చేస్తూ వస్తున్నారు. అలాగే, ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తున్నారు. మెగా ఎంకరేజ్‌మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా సమయంలో ఆయన చేసిన సేవ గురించి అందరూ మాట్లాడుకున్నారు.

తెలంగాణలో వాటర్ వార్స్ షురూ.. సాగునీటి కోసం రెండు గ్రామాల రైతుల మధ్య ఘర్షణతెలంగాణSwechaa14 Oct 2026, 04:48 PM

తెలంగాణలో వాటర్ వార్స్ షురూ.. సాగునీటి కోసం రెండు గ్రామాల రైతుల మధ్య ఘర్షణ

Water Fight: వనపర్తి జిల్లాలో సాగునీటి కోసం రెండు గ్రామాల రైతుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. మాట మాట పెరిగి కొట్టుకునే వరకు వెళ్లింది. పానగల్ మండలంలో మహమ్మదాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతులు బీమా కాలువ నీటి పంపిణీ విషయంలో గొడవపడ్డారు.

పానగల్ మండలం మహమ్మదాపూర్ లో బీమా కాలువ కెనాల్ షట్టర్ మూసివేత వివాదానికి దారితీసింది. దీంతో 5 గ్రామాల పొలాలకు సాగునీరు నిలిచిపోయింది. ఆయా గ్రామాల రైతులు కెనాల్ షట్టర్ తెరవడంతో ఇరువర్గాల రైతుల మధ్య వివాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు రాళ్లతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. దీంతో మహమ్మదాపూర్ లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Mohammed bin Salman: సౌదీకి క్షిపణి గండం.. కనిపించని మహమ్మద్ బిన్ సల్మాన్!InternationalSwechaa14 Oct 2026, 04:21 PM

Mohammed bin Salman: సౌదీకి క్షిపణి గండం.. కనిపించని మహమ్మద్ బిన్ సల్మాన్!

Mohammed bin Salman: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు రోజురోజుకూ మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, శక్తిమంతమైన రాజ్యాల్లో ఒకటైన సౌదీ అరేబియా రాజభవనాల్లో ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తత, అభద్రత నెలకొంది. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు సౌదీ భూభాగంపై క్షిపణి దాడులను ముమ్మరం చేయడంతో సౌదీ యువరాజు, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్ భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఏ క్షణంలో ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో తెలియని పరిస్థితుల నడుమ ఆయన రహస్య బంకర్లలో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న వార్తలు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి.గత వారం రోజులుగా మహమ్మద్ బిన్ సల్మాన్ బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. శత్రువుల నిఘా కన్ను పడకుండా ఉండేందుకు ఆయన కదలికలను భద్రతా విభాగం అత్యంత గోప్యంగా ఉంచుతోంది. అత్యున్నత శిక్షణ పొందిన ఎలైట్ కమాండోల భారీ భద్రతా వలయం నడుమ.. ఒక రహస్య బంకర్ నుంచి మరో సురక్షితమైన రాజభవనానికి ఆయనను నిరంతరం మారుస్తున్నారు.

మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్.. సీబీఐ కోర్టు సంచలన నిర్ణయంఏపీSwechaa14 Oct 2026, 04:18 PM

మాజీ సీఎం జగన్‌కు బిగ్‌షాక్.. సీబీఐ కోర్టు సంచలన నిర్ణయం

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయన మీద గతంలో నమోదైన సీబీఐ, ఈడీ కేసులను ఇకమీదట రోజువారీగా విచారించాలని హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు నిర్ణయించింది. వైఎస్ జగన్‌తో పాటు నిందితులందరినీ వ్యక్తిగతంగా విచారించాలని ఈ సందర్బంగా న్యాయస్థానం ఆదేశించింది.కాగా, దశాబ్దకాలంగా ఈ కేసులు డిశ్చార్జి పిటిషన్ల దశలోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ క్రమంలోనే విచారణను వేగవంతం చేయాలని కోరుతూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇటీవల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన సత్వర విచారణ హక్కు ప్రకారం, ఈ కేసులను రోజువారీ ప్రాతిపదికన విచారించాలని ఈడీ తన పిటిషన్‌లో పేర్కొంది.ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టులో బలంగా వాదించారు.

International news: ముంచుకొస్తున్న ముప్పు.. మరో 75 ఏండ్లలో మానవాళి అంతం.. షాకిస్తున్న నివేదికలు!!..ప్రపంచంSwechaa14 Oct 2026, 04:07 PM

International news: ముంచుకొస్తున్న ముప్పు.. మరో 75 ఏండ్లలో మానవాళి అంతం.. షాకిస్తున్న నివేదికలు!!..

ఒక ప్రాణి భూమి మీదికి రావాలంటే అమ్మ కడుపులో అజ్ఞాతవాసం చేయవలసిందే.. అలాంటి ప్రాణులు భూమి మీద అంతరించిపోవడానికి ఎక్కువ సమయం లేదనే నివేదికలు తరచుగా హెచ్చరించడం ఆందోళన కలిగిస్తున్నాయి.. ఊహించని అభివృద్ధిని భూమి మీద సాధించిన మనిషి ఒకవైపు.. అదే అభివృద్ధి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్న పరిణామాలు మరోవైపు. ఎన్నో ఏళ్ల నుండి జరుగుతున్న ఈ విధ్వంసం ఒక్కొక్కటిగా పేరుకుపోయి.. నేడు విపత్కర పరిస్థితులకు దారితీస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

HCA : ఉప్పల్ వేదికగా హెచ్‌సీఏ బాగోతం.. మళ్లీ పాత దందాయేనా?తెలంగాణSwechaa14 Oct 2026, 03:28 PM

HCA : ఉప్పల్ వేదికగా హెచ్‌సీఏ బాగోతం.. మళ్లీ పాత దందాయేనా?

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే ఒక పండుగ. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగబోతోంది. స్థానిక కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డితో పాటు ఎస్‌ఆర్‌హెచ్ స్టార్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. కానీ మ్యాచ్ ఆరంభానికి ముందే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) తీరు పాత కథనే గుర్తుచేస్తోంది. పారదర్శకత లేని విధానాలతో, ఎవరికీ తెలియని సరికొత్త యాప్‌ను తెరపైకి తెచ్చి క్రికెట్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

పెళ్లి కష్టం బ్రో.. విడాకులు చాలా సులభం!టాప్ న్యూస్Swechaa14 Oct 2026, 03:14 PM

పెళ్లి కష్టం బ్రో.. విడాకులు చాలా సులభం!

కాలం మారింది, రోజులు మారాయి, పెళ్లిబంధానికి బీటలు వారాయి. పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. చిన్న చిన్న మనస్పర్దలు, ఇగోలు చాలు. నా మాటే వినాలని భర్త..లేదు నా మాటే వినాలని భార్య వాదించడం.. పెళ్లయ్యాక ఉమ్మడి కుటుంబంతో కలిసి ఉండటం కంటే వేరు కాపురం పెట్టాలని అమ్మాయి కండిషన్స్ పెట్టడం, వారి కుటుంబానికే అధికప్రాధాన్యత ఇవ్వాలనుకోవడం, భర్త సంపాదనలో భాగం కోరడం, తన సంపాదనలో వేలు పెట్టొద్దనడం, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రైవసీ వంటి కారణాలతో ముడు ముళ్లతో ఒక్కటైన బంధాలు .. కొన్నాళ్లకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నాయి.విడాకుల కోసం పోటీ పడుతున్న జంటల్లో కొన్ని సార్లు అమ్మాయి సైడ్, మరికొన్ని సందర్భాల్లో అబ్బాయి సైడ్ తప్పులు ఉంటున్నట్టు తెలుస్తోంది.

Telangan: సన్న బియ్యం పథకంలో కొత్త చిక్కులు.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మిల్లర్ల వ్యవహారం!!..తెలంగాణSwechaa14 Oct 2026, 01:54 PM

Telangan: సన్న బియ్యం పథకంలో కొత్త చిక్కులు.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మిల్లర్ల వ్యవహారం!!..

తొండ ముదిరితే ఊసర వెళ్లి అవుతుందని పెద్దలు చెబుతుంటారు. తెలంగాణలో మిల్లర్లు కూడా అలాగే మారుతున్నారనే ఆరోపణలున్నాయి.. టూకీగా చెప్పాలంటే కుక్క తోకను ఆడించాలి కాని తోకే కుక్కను ఆడించొద్దంటారు. ఇక్కడ అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఆడిస్తామని చెప్పినట్లుగానే మిల్లర్లు ప్రభుత్వానికి చుక్కలు చూపించే స్ధాయికి చేరుకున్నట్టు ఆరోపణలున్నాయి.

హైదరాబాద్‌లో తిన్నారో చచ్చారే.. 4 హోటల్స్ లైసెన్సులు రద్దుతెలంగాణSwechaa14 Oct 2026, 01:44 PM

హైదరాబాద్‌లో తిన్నారో చచ్చారే.. 4 హోటల్స్ లైసెన్సులు రద్దు

హైదరాబాద్ నగరంలో ‘టీజే సేఫ్’ అధికారులు ఎన్ని దాడులు చేసినా హోటల్స్ నిర్వాహకులు మాత్రం మారడం లేదు. శుభ్రత పాటించకుండా, కల్తీ ఆహార పదార్థాలు వినియోగిస్తూ జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కిచెన్‌లో క్లీన్ నెస్ లేకుండా ఆహార పదార్థాలు తయారు చేయడం మొదలు, మూతలు లేకుండా వాటిని సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. కాగా, ఇటీవల కల్తీ మసాలలు, పలుమార్లు వాడిన ఆయిల్ వినియోగం పెరిగిపోయినట్టు అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు.ఈ క్రమంలోనే నగరంలో తాజాగా నిర్వహించిన దాడుల్లో 4 హోటళ్ల లైసెన్స్‌లు రద్దు చేశారు. మొత్తంగా 13 హోటల్స్‌, క్యాంటీన్స్‌లో తనిఖీలు నిర్వహించినట్టు తెలిసింది. ఆయా హోటల్స్‌లో అపరిశుభ్రత, బొద్దింకలు, ఈగలు, ఎలుకల సంచారాన్ని టీజీ సేఫ్ అధికారులు గుర్తించారు.దీంతో నాలుగు సంస్థల FSSAI లైసెన్స్‌లు రద్దు చేశారు. వెంటనే కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశాలు సైతం జారీ చేశారు.

మందుబాబులకు షాక్.. లిక్కర్ ధరలు భారీగా పెంపు!తెలంగాణSwechaa14 Oct 2026, 01:09 PM

మందుబాబులకు షాక్.. లిక్కర్ ధరలు భారీగా పెంపు!

దసరా పండుగ వేళ మందుబాబులకు బిగ్ షాక్ తగిలింది. మద్యం ధరలు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, లోకల్ బ్రాండ్స్, బీర్ల ధరలను టచ్ చేయకుండా కేవలం విదేశాల నుంచి దిగుమతి అయ్యే ప్రముఖ బ్రాండ్స్ స్కాచ్, సింగిల్ మాల్ట్ విస్కీలు, వోడ్కా, జిన్, టేకిలా, వైన్ రకాల గరిష్ఠ రిటైల్ ధరలను సవరించింది. ఈ మేరకు బుధవారం అబ్కారీ శాఖ నూతన ధరల జాబితాను విడుదల చేసింది.సవరించిన ధరల ప్రకారం పలు టాప్ బ్రాండ్ల మద్యం సీసాల రేట్లు భారీగా పెరిగాయి.ఇదిలాఉండగా, వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, డిస్ట్రిబ్యూటర్లు సవరించిన నూతన ఎంఆర్‌పీ (MRP) ధరలకే మద్యం విక్రయించాలని తెలంగాణ అబ్కారీ శాఖ తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. నిర్ణయించిన ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు విక్రయించినా, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు తమ దృష్టికి వస్తే షాపుల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ అధికారులు హెచ్చరించారు.

సీజేపీ వెనుక అమెరికా..  నిధుల వరద పారుతోంది : అమెరికా సింగర్ మేరీ మిల్బెన్NationalSwechaa14 Oct 2026, 12:37 PM

సీజేపీ వెనుక అమెరికా.. నిధుల వరద పారుతోంది : అమెరికా సింగర్ మేరీ మిల్బెన్

భారత్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిర్వహిస్తున్న ఆందోళనల వెనుక అమెరికా హస్తం ఉందని ఆ దేశానికి చెందిన సింగర్ మేరీ మిల్బెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా ఓటు చోరీ, ఎస్ఐఆర్‌లో సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ఓట్ల చోరీకి పాల్పడుతూ కేంద్రానికి సహకరిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్రఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజీత్ దీప్కే, ఆ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ సీజేపీ ఫౌండర్ అభిజీత్, విపక్ష కూటమి నిరసనలకు దిగుతున్న తరుణంలో అమెరికన్ సింగర్ ట్వీట్ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర మోడీకి, ఆయన నాయకత్వంలో భారత్ సాధిస్తున్న ప్రగతికి వ్యతిరేకంగా ఉన్న అమెరికా శక్తులే కాక్రోచ్ పార్టీ వెనుకండి నడిపిస్తున్నాయని మిల్బెన్ స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యాన్ని, దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు విదేశీ నిధులతో సాగుతున్న ఈ విద్రోహ చర్యలపై మౌనంగా ఉండే సమయం ఇది కాదని మేరీ మిల్బెన్ పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులు ఎందుకు తప్పుకుంటున్నారు..? మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి?NationalSwechaa14 Oct 2026, 12:28 PM

కేంద్ర మంత్రులు ఎందుకు తప్పుకుంటున్నారు..? మోదీ మాస్టర్ ప్లాన్ ఏంటి?

కేంద్రంలో ఏం జరుగుతోంది? ఒక్కొక్కరుగా మంత్రులు ఎందుకు తప్పుకుంటున్నారు? కొందరికి రాజ్యసభలో మళ్లీ అవకాశం దక్కకపోవడం.. మరికొందరు పార్టీ కోసం పదవులనే వదులుకోవడం.. ఇంకొందరికి రాజకీయంగా కొత్త బాధ్యతలు వస్తాయన్న ప్రచారం.. ఇవన్నీ కలిపి చూస్తే మోదీ మంత్రివర్గంలో ఏదో కీలక మార్పు జరగబోతోందన్న చర్చ మొదలైంది.

తీహార్ జైలుకు సౌరవ్, రంకా..  మోడీ ఇంత పిరికివాడా? : అభిజీత్ దీప్కేNationalSwechaa14 Oct 2026, 12:08 PM

తీహార్ జైలుకు సౌరవ్, రంకా.. మోడీ ఇంత పిరికివాడా? : అభిజీత్ దీప్కే

దేశంలో ఎస్ఐఆర్ రద్దు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలంటూ జరుగుతున్న నిరసన ఆగ్రహాజ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ప్రస్తుతం జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే సీజేపీ జాతీయ ప్రతినిధులు సౌరవ్ దాస్,ఆశుతోష్ రంకాలు నిన్న పోలీసుల అనుమతి లేకుండా జంతర్ మంతర్‌లో నిరసనలు చేపట్టారు. జాతీయ జెండాను చేతబట్టుకుని నిరననలు తెలపగా.. ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించారని వారి మీద అభియోగం మోపారు.ఈ క్రమంలోనే వారిని ఇవాళ ఉదయం న్యాయస్థానంలో హాజరుపరచగా.. సీజేపీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్‌లకు ఐదు రోజుల కస్టడీ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆ ఇద్దరిని తీహార్ జైలుకు తరలించారు.

Crime : కూతురికి వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి ఘోరంతెలంగాణSwechaa14 Oct 2026, 11:34 AM

Crime : కూతురికి వేధింపులు.. భర్తను చెట్టుకు కట్టేసి ఘోరం

కూతురు వరసయ్యే బాలికతో సవతి తండ్రి అసభ్యంగా ప్రవర్తించాడు. కొంతకాలం నుంచి ఈ వ్యవహారం జరుగుతుండగా బాధితురాలు ఆలస్యంగా తల్లి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది. దీంతో ఆగ్రహించిన తల్లి బుద్ధిమార్చుకోవాలని తన భర్తకు సూచించింది. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కుటుంబసభ్యులతో కలిసి దారుణానికి పాల్పడింది. సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలం సేవాలాల్ తండాకు చెందిన బానోతు రాజేశ్వరి(33)కి గతంలో పెళ్లి అవ్వగా.. భర్త చనిపోవడంతో కుమార్తెను పోషిస్తూ జీవనం కొనసాగిస్తోంది.ఈ క్రమంలోనే ఆమెకు జనగామకు చెందిన భగవాన్‌తో రెండో పెళ్లి జరిగింది. అయితే, సవతి తండ్రి ఆ బాలికను లైంగికంగా వేధిస్తుండటంతో బంధువులతో కలిసి అతన్ని చెట్టుకు కట్టేసి దాడి చేసి హతమార్చింది.

భారీగా పడిపోయిన సింగరేణి లాభాలు.. నేడు బీఆర్ఎస్ కార్మిక గర్జనతెలంగాణSwechaa14 Oct 2026, 10:30 AM

భారీగా పడిపోయిన సింగరేణి లాభాలు.. నేడు బీఆర్ఎస్ కార్మిక గర్జన

రాష్ట్రంలో వెలుగులు నింపుతున్న సింగరేణి సంస్థ లాభాలు నేలచూపులు చూస్తున్నాయి. గతేడాది రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించిన సంస్థ ఈ ఏడాది భారీ రాబడిని కోల్పోయింది. అందుకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. సింగరేణి నిధులను ఇతర అవసరాల కోసం మళ్లిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా సింగరేణి లాభాలు 72.6 శాతం పతనం అయినట్టు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,754 కోట్లకే లాభాలు పరిమితం అయినట్టు సమాచారం. 2024-25లో గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో రూ.6,394 కోట్లు ఆర్జించిన సంస్థ..ఈ ఏడాదిలోనే రూ.4,640 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఒక్క ఏడాదిలో ఇంతభారీ మొత్తంలో సింగరేణి లాభాలు తగ్గడానికి గల కారణాలు చెప్పాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. గత నాలుగేళ్లలోనే అత్యల్ప వార్షిక లాభం రావడానికి కారణాలు ఏమై ఉంటాయని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అందుకు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.

‘ఇందిరమ్మ’ లబ్దిదారులకు శుభవార్త.. మరో రూ.72 వేల ఆర్థిక సాయం!తెలంగాణSwechaa14 Oct 2026, 09:48 AM

‘ఇందిరమ్మ’ లబ్దిదారులకు శుభవార్త.. మరో రూ.72 వేల ఆర్థిక సాయం!

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు నాలుగు విడతల్లో రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే.అయితే, రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద రాష్ట్రానికి మంజూరైన ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇళ్లను అనుసంధానించాలని నిర్ణయించింది.ఈ క్రమంలోనే మొదటి విడత కింద ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన 1.75 లక్షల ఇందిరమ్మ ఇళ్ల వివరాలను అధికారులు పీఎం ఆవాస్ యోజన (PMAY) అధికారిక పోర్టల్‌లో నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేశారు. ఆ తర్వాత రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మట్టి గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లో జీవిస్తున్న మరో 25 వేల మంది లబ్ధిదారులను కూడా ఈ స్కీమ్‌ పరిధిలోకి తీసుకురానున్నారు.

National Politics: కాంగ్రెస్ క్రెడిట్‌కు CJP అడ్డు.. ప్రతిపక్షాల విభేదాలతో బీజేపీకి లాభమేనా?!NationalSwechaa14 Oct 2026, 09:26 AM

National Politics: కాంగ్రెస్ క్రెడిట్‌కు CJP అడ్డు.. ప్రతిపక్షాల విభేదాలతో బీజేపీకి లాభమేనా?!

ఒకప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యమాలకు, ఉద్యమ పార్టీలకు మద్దతు ఇవ్వడం కాంగ్రెస్ రాజకీయ వ్యూహంలో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ఉద్యమాలు, ఆ ఉద్యమాలు చేసే పార్టీలు సొంతంగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటున్నాయి.. ఒక పార్టీ అధికారం సొంతం చేసుకోవాలంటే వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని రాజకీయం చేయడం వేరు.. ఎలాగో అధికారంలోకి వచ్చాక అందరినీ తనలో కలిపేసుకుని నోరెత్తకుండా చేయడం రాజకీయాల్లో సర్వసాధారణం..

కానీ ప్రస్తుతం దేశ రాజకీయాలు కాంగ్రెస్ చుట్టూ కాకుండా బొద్దింకల చుట్టూ తిరుగుతున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి.. బీజేపీని పడగొట్టాలంటే కాంగ్రెస్ ఎత్తులు సరిపోవడం లేదని.. ఇది వరకు ఇండియా కూటమి అని ఏర్పాటు చేసి నవ్వులపాలైన హస్తం ఇప్పుడు బొద్దింకలను అడ్డుపెట్టుకుని కొత్త రాజకీయాలకు తెరతీసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

తెలంగాణలో పడకేస్తున్న పాలన?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa14 Oct 2026, 09:19 AM

తెలంగాణలో పడకేస్తున్న పాలన?

రాష్ట్రంలో రెండే విషయాలు నడుస్తున్నాయి. రైతుల కష్టాలు.. కాంగ్రెస్ ప్రభుత్వ అనుచరుల ఆగడాలు. అన్నింటినీ కంట్రోల్ చేయాల్సిన అడ్మినిస్ట్రేషన్ అధోగతిలా పడి ఉంటోంది.ఎవరు ఎవరి మాటా వినని పరిస్థితి కనిపిస్తోంది. డబ్బులు ఆశ చూపిన వారికి, ముఖ్యమంత్రికి వీళ్లు దగ్గర అనే వ్యక్తులకు మాత్రమే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు.రేవంత్ రెడ్డి ఎవరెవరికి ఎంత హెల్ప్ చేయాలో ఇప్పటికే చేసేశారని టాక్.కానీ,వాళ్లు రోడ్డు మీద పడి సెటిల్మెంట్లు అంటూ ఎన్నో ఆగడాలు సృష్టిస్తున్నారు. 1. జానారెడ్డి కుమారులు రాజకీయంగా ఎంపీ, ఎమ్మెల్యే అయ్యారు. స్కూల్స్ టెండర్స్‌లో ఎవరు ఎన్ని చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడంతో ఆ కోటాలో రూ.80 కోట్లు కొట్టేశారు.మరో టెండర్స్‌లో అలానే సంపాదించారు.ఇవి కాకుండా మరిన్ని చేసుకునేందుకు ఫైల్స్ సిద్ధమయ్యాయి.

Rashmika Mandanna: రణబాలికి ప్లస్ అవుతుంది ఆమె మాత్రమేనా!సినిమాSwechaa14 Oct 2026, 08:39 AM

Rashmika Mandanna: రణబాలికి ప్లస్ అవుతుంది ఆమె మాత్రమేనా!

Rashmika Mandanna: ప్రస్తుతం, మన టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది రణబాలి సినిమా. మరికొన్ని గంటల్లో ఈ సినిమా భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాకి గట్టి పోటీ ఇవ్వబోతుంది సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ బ్లాక్ బస్టర్ జైలర్ 2. నెలన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకి దర్శకుడు. తెలుగులో కూడా మంచి ఆసక్తి నెలకొంది. అయితే, ఇండస్ట్రీలో వినిపిస్తున్నదాని ప్రకారం రణబాలి సినిమాకి ప్రధాన బలంగా మారింది రష్మిక మందన్న..అంటున్నారు.

Prabhas: నిర్మాణ సంస్థలను ఆదుకుంటున్న రెబల్ స్టార్..సినిమాSwechaa14 Oct 2026, 07:35 AM

Prabhas: నిర్మాణ సంస్థలను ఆదుకుంటున్న రెబల్ స్టార్..

Prabhas: మన హీరోల్లో డార్లింగ్ ప్రభాస్ అంటే ప్రతీ ఒక్కరిలో ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. దీనికి, కారణం ఆయన మనస్తత్వం. రెబల్ స్టార్ కృష్ణం రాజు మాదిరిగానే ఆయన కొడుకు ప్రభాస్ కూడా అభిమానులన్నా, నిర్మాతలన్నా ఎంతో ప్రేమ చూపిస్తుంటాడు. తన అభిమానుల కోసం, ఇండస్ట్రీలో ఉన్న తోటి నటుల కోసం ఆయన ఇచ్చే విందు చాలు..ఎంత అభిమానం చూపిస్తారో. అలాగే, సినిమా పోతే నిర్మాతను ఆదుకునే పద్ధతి చూస్తే ఇలాంటి హీరో కదా.. ఉండాల్సింది అని చెప్పకుండా ఉండలేరు.

ఇక AI క్వశ్చన్ పేపర్స్.. లీకేజీలకు నీలేకని చెక్!NationalSwechaa14 Oct 2026, 12:07 AM

ఇక AI క్వశ్చన్ పేపర్స్.. లీకేజీలకు నీలేకని చెక్!

పరీక్ష జరిగే రోజే ప్రశ్నపత్రం సిద్ధం చేస్తే..? పేపర్ లీక్ చేసే అవకాశం తగ్గుతుందా? భారీ క్వశ్చన్ బ్యాంక్ నుంచి చివరి నిమిషంలో ప్రశ్నలను ఎంపిక చేసే విధానంతో పరీక్షల నిర్వహణలో కొత్త అధ్యాయం మొదలవుతుందా? నందన్ నీలేకని వ్యాఖ్యలు ఇప్పుడు విద్యా రంగంలో ఆసక్తికర చర్చకు తెరలేపుతున్నాయి.