స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

సౌదీ యువరాజుకు భద్రతా ముప్పు.. బంకర్లలోకి మకాం!InternationalSwechaa13 Oct 2026, 10:11 AM

సౌదీ యువరాజుకు భద్రతా ముప్పు.. బంకర్లలోకి మకాం!

 యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై క్షిపణి, డ్రోన్ దాడులను విపరీతంగా పెంచడంతో ఆ దేశ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తీవ్ర ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. 'వాల్ స్ట్రీట్ జర్నల్' అంతర్జాతీయ మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. రియాద్‌లోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత, భూగర్భ బంకర్లు కలిగిన రాజప్రాసాదాల మధ్యే ఆయన రహస్యంగా సంచరిస్తున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన కమాండోల భద్రత నడుమ మకాం మారుస్తున్న ఆయన, గడిచిన మంగళవారం ఓ రక్తదాన శిబిరంలో పాల్గొన్న తర్వాత ఇప్పటివరకు బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం.

ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ దుర్మరణం!క్రైమ్Swechaa13 Oct 2026, 09:59 AM

ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ దుర్మరణం!

 హైదరాబాద్ నగర శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డు(ORR)పై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల సంబరాల్లో పాల్గొని తిరుగు ప్రయాణమైన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సత్యనారాయణ(40) ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కళాకారుడిగా ఎంతోమందిని అలరించిన ఆయన అకాల మరణంతో కుటుంబ సభ్యులు, తోటి కళాకారులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటన నగర వ్యాప్తంగా ఉన్న కళాభిమానులను తీవ్రంగా కలిచివేసింది.

టెకీలకు ఏమైంది?  30వ ఫ్లోర్ పైనుంచి పడి మరొక యువ టెకీ మృతిక్రైమ్Swechaa13 Oct 2026, 09:58 AM

టెకీలకు ఏమైంది? 30వ ఫ్లోర్ పైనుంచి పడి మరొక యువ టెకీ మృతి

నగరంలో హర్యానాకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నిన్న హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్యకు పాల్పడగా.. తాజాగా మరో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణాలు కోల్పోయాడు. 30వ ఫ్లోర్ పై నుంచి పడి చనిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని నానక్‌రామ్‌గూడలో ఉన్న గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్‌మెంట్స్‌లో మంగళవారం ఉదయం వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న భరత్(29) అనే యువకుడు 30వ ఫ్లోర్ నుంచి పడి అనుమానాస్పద కింద పడిపోయాడు. నేరుగా కారు మీద పడటంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే తీవ్ర గాయాలతో భరత్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. బెంగళూరులోని ఓ కంపెనీలో పని చేస్తున్న భరత్.. రెండు రోజుల క్రితమే గోల్ఫ్ ఎడ్జ్‌ అపార్ట్‌మెంట్స్‌లో మారినట్టు తెలిసింది. కిశోర్ అనే బంధువు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భరత్ మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

నారాయణ.. రంగారెడ్డిని  పిప్పి పీల్చేశావు కదయ్యా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa13 Oct 2026, 09:24 AM

నారాయణ.. రంగారెడ్డిని పిప్పి పీల్చేశావు కదయ్యా?

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. ఈయన చేసిన భూ క్లియరెన్స్ ఫైల్స్ అమోయ్ కుమార్‌ని మించి పోయాయని తెలుస్తోంది. ములుగు కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఇసుక క్వారీల్లో, రవాణలో ఏం చేశారో జనం ఇప్పుడు నెమరు వేసుకుంటున్నారు. విచ్చలవిడితనంతో ఎవరు ఏది చెప్పినా, నో అనకుండా వందల కోట్లు సంపాదించి భూముల ఫైల్స్ క్లియర్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని ప్రొత్సహించేలా కలెక్టర్ తీరు ఉన్నదని ఎప్పటి నుంచో బలమైన వాదన ఉంది.

RythuDiscom: ఉచిత విద్యుత్తుకు పాతరేసే కుట్ర: సర్కార్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు!తెలంగాణSwechaa13 Oct 2026, 08:58 AM

RythuDiscom: ఉచిత విద్యుత్తుకు పాతరేసే కుట్ర: సర్కార్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు!

 కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'రైతు డిస్కమ్' (జీవో 17) నిర్ణయంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు విరుచుకుపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సహా రైతు సంఘాలు, విద్యుత్ రంగ నిపుణులు, ఉద్యోగ సంఘాలు లేవనెత్తుతున్న తీవ్ర అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవో జారీ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు పాతరేసి, నాణ్యమైన కరెంట్ అందించకుండా రైతుల మెడకు ఉచ్చు బిగించేందుకే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిరంకుశ, దుర్మార్గపు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు.

Bollywood: బాలీవుడ్ స్టార్ కిడ్స్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారే?సినిమాSwechaa13 Oct 2026, 07:32 AM

Bollywood: బాలీవుడ్ స్టార్ కిడ్స్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారే?

Bollywood: బాలీవుడ్ స్టార్ కిడ్స్ టాలీవుడ్‌లో సక్సెస్ కాలేకపోతున్నారే? అవును బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగుతున్న నట వారసురాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం సక్సెస్ సాధించలేకపోతున్నారు. దీనికి, రక రకాల కారణాలుంటున్నాయి. హీరోల కంటే హీరోయిన్స్‌గా తెలుగు తెరకి పరిచయమై, ఇక్కడ అగ్ర కథానాయికగా వెలగాలనుకుంటున్నప్పటికీ.. ఆ అదృష్టం దక్కడం లేదు.

ఖగోళ విజ్ఞానం నుంచి ప్రజా ఉద్యమాల దాకా! జంతర్ మంతర్ చరిత్ర తెలుసా..?NationalSwechaa12 Oct 2026, 11:43 PM

ఖగోళ విజ్ఞానం నుంచి ప్రజా ఉద్యమాల దాకా! జంతర్ మంతర్ చరిత్ర తెలుసా..?

మూడు శతాబ్దాల క్రితం శాస్త్రీయ పరిశోధనల కోసం నిర్మించిన జంతర్ మంతర్.. దేశవ్యాప్త నిరసనలకు చిరునామాగా ఎలా మారింది? ఇప్పుడు నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడంతో మరోసారి ఎందుకు వార్తల్లోకి వచ్చింది? అసలు జంతర్ మంతర్ అంటే ఏమిటి?

రూ.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్, మండల సర్వేయర్తెలంగాణSwechaa12 Oct 2026, 10:50 PM

రూ.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్, మండల సర్వేయర్

ACB: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండల తహసీల్దార్‌, మండల సర్వేయర్‌ చిక్కారు. రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా మండల సర్వేయర్‌ బటుక శ్రీనివాసులును ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్‌ బి.సుదర్శన్‌రెడ్డిని కూడా నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు.

హెచ్‌ఎండీఏ నిబంధనల మేరకు భూమిని సర్వే చేసి, జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ సర్వే నివేదిక జారీ చేసేందుకు నిందితులు లంచం డిమాండ్‌ చేశారని ఏసీబీ అధికారులు తెలిపారు. రూ.30 లక్షలు డిమాండ్ చేయగా రూ.20 లక్షలకు డీల్ కుదిరింది. తహసీల్దార్‌ ఆదేశాల మేరకు మండల సర్వేయర్‌ ఫిర్యాదుదారుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

TG:  ‘NO’ అని ఒక్క మెసేజ్ ఇస్తే చాలు.. బ్యాంక్ ఖాతా ఖాళీ: సీపీ సజ్జనార్తెలంగాణSwechaa12 Oct 2026, 10:11 PM

TG: ‘NO’ అని ఒక్క మెసేజ్ ఇస్తే చాలు.. బ్యాంక్ ఖాతా ఖాళీ: సీపీ సజ్జనార్

TG: ఓటీపీ ఎవరికీ చెప్పలేదు.. ఎలాంటి అనుమానాస్పద లింక్‌లపైనా క్లిక్ చేయలేదు.. అయినా సరే అకౌంట్‌లోని డబ్బులు క్షణాల్లో మాయమైపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని వాడుకుంటూ కనివినీ ఎరుగని సరికొత్త దోపిడీ మార్గాన్ని ఎంచుకున్నారు. కేవలం వాట్సాప్‌లో 'NO' అని ఒకే ఒక్క రిప్లై ఇస్తే మీ ఖాతాలోని డబ్బంతా గోవిందా అంటున్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఈ సరికొత్త సైబర్ మాయాజాలంపై ఆయన 'ఎక్స్' వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు.సాధారణంగా బ్యాంక్ మోసాలు అంటే ఓటీపీలు అడగడం లేదా లింకులు పంపి క్లిక్ చేయించడం చూశాం. కానీ ఇక్కడ స్కెచ్ పూర్తిగా భిన్నం. గుర్తుతెలియని నంబర్ల నుంచి "మీ బ్యాంక్ ఖాతా నుంచి ఇంత నగదు కట్ అయ్యింది" అంటూ నకిలీ వాట్సాప్ మెసేజ్‌లు పంపుతున్నారు.

Ukraine: జెలెన్‌స్కీకి బిగ్ షాక్.. ఉక్రెయిన్ నయా లీడర్ ఇతనేనా?InternationalSwechaa12 Oct 2026, 10:06 PM

Ukraine: జెలెన్‌స్కీకి బిగ్ షాక్.. ఉక్రెయిన్ నయా లీడర్ ఇతనేనా?

Ukraine: ఉక్రెయిన్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రష్యాతో నాలుగేళ్లకు పైగా సాగుతున్న హోరాహోరీ యుద్ధం మధ్యలో అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కుర్చీ కదిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెలెన్‌స్కీ స్థానంలో సరికొత్త నాయకుడు రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే తన మనసులోని మాటను బయటపెట్టడంతో, కీవ

TG: ఢిల్లీలోనే ఉండండి.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సీఎం ఆదేశాలుతెలంగాణSwechaa12 Oct 2026, 09:15 PM

TG: ఢిల్లీలోనే ఉండండి.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సీఎం ఆదేశాలు

TG: దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ హిట్ ఒక్కసారిగా పీక్స్‌కి చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) నిర్ణయాలు, వివాదాస్పద సర్ అంశాలకు వ్యతిరేకంగా విపక్ష 'ఇండియా' కూటమి చేపట్టిన నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, ఆ వెంటనే చెలరేగిన తొక్కిసలాటలో పలువురు తెలంగాణ ప్రజాప్రతినిధులు కిందపడి గాయపడటం కలకలం రేపింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్ర నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ సహా మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో ఢిల్లీ బాట పట్టారు. అయితే సోమవారం ప్రతిపక్షాలు భారీ ఎత్తున నిర్వహించిన ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఆ ప్రచారంలో నిజం లేదు- హైదరాబాద్ వాటర్ బోర్డు క్లారిటీతెలంగాణSwechaa12 Oct 2026, 09:06 PM

ఆ ప్రచారంలో నిజం లేదు- హైదరాబాద్ వాటర్ బోర్డు క్లారిటీ

Fact Check Telangana: ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ లోని జలాశయాలు నవంబర్ చివరి నాటికి ఎండిపోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న ప్రచారం కలకలం రేపింది. ఈ ప్రచారం నగరవాసులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. దీంతో ఈ అంశంపై ఫ్యాక్ట్ చెక్ తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) స్పందించాయి. ఎల్ నినో ప్రభావంతో హైదరాబాద్ జలాశయాలు నవంబర్ చివరి నాటికి ఎండిపోతున్నాయి అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని HMWSSB స్పష్టం చేసింది. అది ఫేక్ న్యూస్ అని తేల్చి చెప్పింది.

Tollywood:మోక్షజ్ఞ డెబ్యూకి బాలయ్య ఎంటరైతే ఏంటి పరిస్థితి?సినిమాSwechaa12 Oct 2026, 08:48 PM

Tollywood:మోక్షజ్ఞ డెబ్యూకి బాలయ్య ఎంటరైతే ఏంటి పరిస్థితి?

Tollywood: డెబ్యూ హీరోగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళలో నట వారసులైతే ఓ లెక్క..సోలోగా వచ్చే వాళ్ళైతే ఓ లెక్క ఉంటుంది. ఈ విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరీ, పెద్ద కుటుంబ నుంచి వస్తున్న డెబ్యూ హీరో సినిమా అంటే వెనకాల ఉన్న వాళ్ళందరూ ప్రతీ విషయంలో కలగజేసుకొని..కథలో వేలు పెడితే దర్శకుడికి మెంటలెక్కుతుంది. ఇప్పుడు, బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా గురించి ఇదే జరగబోతోంది. ఈ సినిమాకి సంబందించిన ప్రతీ విషయంలో బాలయ్య ఎంటరవుతున్నాడట.

TG: మహాదేవుడి పేరిట రేవంత్ సర్కార్‌ మహా దోపిడీ: దాసోజు శ్రావణ్తెలంగాణSwechaa12 Oct 2026, 08:32 PM

TG: మహాదేవుడి పేరిట రేవంత్ సర్కార్‌ మహా దోపిడీ: దాసోజు శ్రావణ్

TG: ఒక్క అడుగు తవ్వలేదు.. ఒక్క ఇటుక పేర్చలేదు.. కానీ మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ అంచనా వ్యయం మాత్రం అమాంతం ఆకాశాన్ని తాకిందంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రావణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శంకుస్థాపన దశలోనే ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేయడం వెనుక రూ.250 కోట్ల గోల్‌మాల్ దాగుందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పనులు మొదలుకాకముందే అంచనాలు పెంచడం వెనుక ఉన్న మతలబేంటని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని నిలదీశారు.ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లెక్కలను బయటపెడుతూ దాసోజు శ్రావణ్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు. మంచిరేవుల ఓంకారేశ్వర ఆలయ ప్రాజెక్టును మొదట దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో చేపట్టాలని భావించారని, కానీ అధికారికంగా జీవో వెలువడేసరికి లెక్కలు పూర్తిగా మార్చేశారని ఆయన మండిపడ్డారు.

Vijayawada: విజయవాడ బైపాస్‌లో దారుణం.. ఈవీ కారు ప్రమాదంలో నలుగురు సజీవ దహనం!..ఏపీSwechaa12 Oct 2026, 08:11 PM

Vijayawada: విజయవాడ బైపాస్‌లో దారుణం.. ఈవీ కారు ప్రమాదంలో నలుగురు సజీవ దహనం!..

విజయవాడ బైపాస్ రోడ్డులో నడిరోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. బైపాస్‌ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న ఓ ఈవీ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన మరుక్షణమే కారులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి, వాహనం క్షణాల్లోనే తగులబడిపోయింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఉస్మానియాలో జూనియర్ డాక్టర్ల సమ్మెతెలంగాణSwechaa12 Oct 2026, 08:03 PM

ఉస్మానియాలో జూనియర్ డాక్టర్ల సమ్మె

Osmania: హైదరాబాద్ ఉస్మానియాలో సమ్మె సైరన్ మోగింది. జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టారు. ఆసుపత్రిలో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మౌలిక వసతుల లేమి, ఆరోగ్యశ్రీ బకాయిలతో వైద్య సేవలు స్తంభించిపోవడం, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియాలో రోగులకు వైద్యం చేసేందుకు సరైన వసతులు లేవని ఆరోపిస్తూ విధుల బహిష్కరించి ఆసుపత్రి ప్రాంగణంలో బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని, ఆసుపత్రికి అత్యవసర పరికరాలు, సర్జికల్స్, మందులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు.

Sudan: సూడాన్ బంగారు గనిపై బాంబుల వర్షం.. 72 మంది మృతి!InternationalSwechaa12 Oct 2026, 07:41 PM

Sudan: సూడాన్ బంగారు గనిపై బాంబుల వర్షం.. 72 మంది మృతి!

Sudan: సూడాన్ - ఈజిప్ట్ సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతంలో తీవ్ర రక్తపాతం చోటుచేసుకుంది. ఎడారి పర్వతాల నడుమ బంగారం కోసం తవ్వకాలు జరుపుతున్న అమాయక కార్మికులపై ఆకాశం నుంచి మృత్యువు బాంబుల రూపంలో విరుచుకుపడింది. జబల్ అల్ ఉఖైదాత్ ప్రాంతంలోని ఓ బంగారు గనిపై జరిగిన భీకర వైమానిక దాడిలో ఏకంగా 72 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.శనివారం ఉదయం వేలాది మంది కార్మికులు గనిలో పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో అకస్మాత్తుగా ఓ యుద్ధ విమానం గగనతలంలో ప్రత్యక్షమైంది.

Hyderabad: హైదరాబాద్‌లో విజృంభిస్తోన్న వైరస్‌.. వీరికి పొంచి ఉన్న ప్రమాదం!..తెలంగాణSwechaa12 Oct 2026, 07:39 PM

Hyderabad: హైదరాబాద్‌లో విజృంభిస్తోన్న వైరస్‌.. వీరికి పొంచి ఉన్న ప్రమాదం!..

నగరంలో ఫ్లూ వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తుంది.. ముఖ్యంగా చాపకింద నీరులా ఇన్‌ఫ్లూయెంజా A రకం వైరస్‌ విస్తరిస్తోంది. నిలోఫర్‌తో పాటు కొన్ని ప్రైవేటు చిన్న పిల్లల ఆసుపత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. అలాగే 60 ఏళ్లు దాటిన చాలామంది ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మరికొందరిలో అయితే వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాల మీదకు వస్తోందంటున్నారు.

GST Clarification: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై 5% జీఎస్టీ బాదుడు? కేంద్రం బిగ్ క్లారిటీ ఇదే!NationalSwechaa12 Oct 2026, 07:30 PM

GST Clarification: ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లపై 5% జీఎస్టీ బాదుడు? కేంద్రం బిగ్ క్లారిటీ ఇదే!

GST Clarification: జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కేంద్ర ప్రభుత్వం కొత్తగా 5 శాతం జీఎస్టీ భారం మోపిందంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ సాగుతోంది. నిత్యం ఆన్‌లైన్‌లో ఫుడ్ మొదలైన ఆర్డర్ చేసే సామాన్యుడి జేబుకు మళ్లీ చిల్లు పడనుందంటూ జరుగుతున్న ప్రచారంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యవహారంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించి పూర్తి స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేసింది.ఈ వివాదంలో అసలు సంచలన విషయం ఏమిటంటే.. ప్రభుత్వం పన్ను పెంచకపోగా, ఏకంగా 13 శాతం తగ్గించింది. కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ మండలి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇ-కామర్స్ డెలివరీ సర్వీస్‌లపై కొత్తగా ఎలాంటి పన్నులు విధించలేదు.

jagityala: రష్యా డ్రోన్ దాడిలో తెలంగాణ వాసి మృతి.. కుటుంబానికి రూ.6 లక్షల సాయం ప్రకటించిన సీఎం!తెలంగాణSwechaa12 Oct 2026, 06:53 PM

jagityala: రష్యా డ్రోన్ దాడిలో తెలంగాణ వాసి మృతి.. కుటుంబానికి రూ.6 లక్షల సాయం ప్రకటించిన సీఎం!

ఓ యువకుడు ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి యుద్ధానికి బలయ్యాడు. చివరికి కన్న కొడుకును కోల్పోయిన ఆ తల్లికి, భర్తను కోల్పోయిన భార్యకు తీరని దుఃఖం మిగిలింది. మరోవైపు, మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి నెల రోజులకు పైగా ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ వివరాలు చూస్తే.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన జగిత్యాల జిల్లా వాసి వావిలాల సుదర్శన్ గౌడ్ కుటుంబానికి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది.

Telangana: టామ్ అండ్ జెర్రీ రాజకీయాలు-తెలంగాణలో మారుతున్న సమీకరణాలు!!..తెలంగాణSwechaa12 Oct 2026, 06:15 PM

Telangana: టామ్ అండ్ జెర్రీ రాజకీయాలు-తెలంగాణలో మారుతున్న సమీకరణాలు!!..

ప్రతిరోజు కయ్యమే అంటే... ప్రజలకు కూడా అసహ్యమే.. తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ తీరు చూస్తుంటే సామాన్యుల నుంచి వస్తున్న ప్రధానమైన అభిప్రాయం ఇదే అని తెలుస్తుంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆలోచన లేదు... ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు పదునైన వ్యూహం లేదు... మధ్యలో ఉన్న బీజేపీకి సరిపడా బలం లేదు. అసలు తెలంగాణ రాజకీయాలకు ఇప్పుడు ఓ దిశా నిర్దేశమే లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలు, ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహాలు, బీజేపీ బలహీనతల మధ్య ప్రజా సమస్యలు పక్కకు వెళ్లిపోవడం. నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఆస్తుల పంచాయితీలు, పాత కేసుల ప్రస్తావనలతో రాజకీయాలు మతితప్పినట్టు సాగుతున్నాయని అంటున్నారు.

GenZ Protest: జెన్-జీ పోరాటాన్ని 'కుట్ర' అనడం న్యాయమా?NationalSwechaa12 Oct 2026, 05:57 PM

GenZ Protest: జెన్-జీ పోరాటాన్ని 'కుట్ర' అనడం న్యాయమా?

GenZ Protest: దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత రోడ్డెక్కితే చాలు.. వారి వెనుక ఏదో అదృశ్య హస్తం ఉందని, విదేశీ శక్తుల ప్రోద్బలం దాగుందని ముద్ర వేయడం పాలకులకు పరిపాటిగా మారింది. దశాబ్దాలుగా చదువు, కొలువు, ఈఎంఐల చక్రబంధంలో బతికేస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్న 'జెన్-జీ' తరం ఒక్కసారిగా ప్రశ్నించేసరికి.. దానికి రాజకీయ కుట్రల రంగు పులమడం ఎంతవరకు కరెక్ట్ ? కళ్లెదుట భవిష్యత్తు నాశనమవుతుంటే రోడ్డెక్కిన నిస్సహాయ యువత ఆక్రందనను 'వ్యవస్థలపై దాడి'గా చిత్రీకరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి.నీట్ పరీక్షల నిర్వహణలో డొల్లతనం బయటపడి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు అయోమయంలో పడినప్పుడు వారు మొదట కోరింది ఒక్కటే పరీక్షల నిర్వహణలో పారదర్శకత, వ్యవస్థాగత సంస్కరణలు. ఎవరి పదవులూ ఊడగొట్టాలని, ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఎవరూ రోడ్డెక్కలేదు.

అందుకే.. సెక్యూరిటీ గార్డు పాపను చంపేశాడు..క్రైమ్Swechaa12 Oct 2026, 04:29 PM

అందుకే.. సెక్యూరిటీ గార్డు పాపను చంపేశాడు..

Bollaram Child: రాష్ట్రంలో సంచలనం రేపిన బొల్లారం కౌకూర్ లో ఐదేళ్ల చిన్నారి అరేలియా మోజెస్ కిడ్నాప్, హత్య కేసుకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. డబ్బు కోసమే సెక్యూరిటీ గార్డు విక్రమ్ కుమార్ చిన్నారిని కిడ్నాప్ చేసి చంపేసినట్లు వెల్లడించారు. పాపను చంపాకే అతడు డబ్బు డిమాండ్ చేశాడని తెలిపారు. చిన్నారిని కిడ్నాప్ చేసి 20లక్షలు డిమాండ్ చేయాలని విక్రమ్ భావించాడని మల్కాజ్ గిరి సీపీ సుమతి తెలిపారు. చిన్న కుటుంబం, ధనిక కుటుంబం కావడంతో డబ్బులు ఇస్తారని విక్రమ్ భావించాడని పేర్కొన్నారు. పాపను చంపి నీటి సంపులో వేశాకే విక్రమ్ కుమార్ డబ్బు కోసం తల్లిదండ్రులకు ఫోన్ చేశాడని వెల్లడించారు.

Plastic Plates Risks: ప్లాస్టిక్ ప్లేట్‌లో తిండి.. విషాన్ని ఆహ్వానిస్తున్నట్లేనా?HealthSwechaa12 Oct 2026, 04:27 PM

Plastic Plates Risks: ప్లాస్టిక్ ప్లేట్‌లో తిండి.. విషాన్ని ఆహ్వానిస్తున్నట్లేనా?

Plastic Plates Risks: శుభకార్యాలు, దావత్‌లు, హోటళ్లు, చివరకు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ల దాకా ఎక్కడ చూసినా విస్తరాకుల స్థానాన్ని రంగురంగుల ప్లాస్టిక్ ప్లేట్లు ఆక్రమించేశాయి. వాడటం సులువు, కడిగే పనిలేదు అన్న ఒకే ఒక్క కారణంతో ప్లాస్టిక్ ప్లేట్లను విచ్చలవిడిగా వాడేస్తున్నాం. కానీ వేడి వేడి అన్నం, మసాలాలు నిండిన కూరలు, వేడి సాంబార్‌ను ఆ ప్లాస్టిక్ ప్లేట్లలో వేసుకుని తింటుంటే.. తెలియకుండానే శరీరంలోకి తీవ్రమైన విషాన్ని పంపుతున్నామని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.చాలావరకు వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్లు ఏమాత్రం ‘ఫుడ్ గ్రేడ్’ ప్రమాణాలతో తయారైనవి కావు. వాటిలో ప్లాస్టిక్ మెత్తగా, అనువుగా ఉండటానికి థాలైట్స్, బిస్‌ఫినాల్-ఎ (BPA) వంటి ప్రమాదకర కెమికల్స్ కలుపుతారు. వేడి వేడి ఆహార పదార్థాలు ఆ ప్లేట్లలో పడగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లోని విషపూరిత రసాయనాలు కరిగి ఆహారంలో కలిసిపోతాయి (కెమికల్ మైగ్రేషన్). ఈ రసాయనాలు నేరుగా కడుపులోకి చేరి రక్తంలో కలిసిపోవడం వల్ల శరీరంలోని కీలక వ్యవస్థలు క్రమంగా కుప్పకూలిపోతాయి.

తాగు, సాగు, బీర్లు.. రేవంత్ సర్కారుకు ఏది ప్రాధాన్యం?టాప్ న్యూస్Swechaa12 Oct 2026, 03:54 PM

తాగు, సాగు, బీర్లు.. రేవంత్ సర్కారుకు ఏది ప్రాధాన్యం?

రాష్ట్రంలో కరువు కోరలు చాస్తున్న సమయంలో పంటలకు హాలిడే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.అందుకే వరి పంటలు వేయొద్దని, వేస్తే నీళ్లు ఇవ్వడం కష్టతరం అవుతోందని మంత్రులు రాష్ట్ర రైతాంగానికి సూచించారు.ఎన్‌నినో కారణంగా రాష్ట్రంలో 17శాతం లోటు వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. వర్షాకాలంలో వేసవి మాదిరి ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి సామర్థ్యం తగ్గిపోతోంది. వర్షాలు లేక భూగర్భ జలాలు క్రమంగా అడుగంటిపోతున్నాయి. తెలంగాణ కేబినెట్ 235 మండలాలను కరవు మండలాలుగా ఇప్పటికే ప్రకటించింది. మున్ముందు ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

VIRAL: బైక్‌లతో దుర్గామాత రూపం.. బీచ్‌లో బైకర్ల అద్భుత ప్రదర్శన!వైరల్ న్యూస్Swechaa12 Oct 2026, 03:47 PM

VIRAL: బైక్‌లతో దుర్గామాత రూపం.. బీచ్‌లో బైకర్ల అద్భుత ప్రదర్శన!

 శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని గుజరాత్‌కు చెందిన బైకర్లు తమలోని సృజనాత్మకతను చాటుకుంటూ భక్తిని అత్యంత వినూత్నంగా ప్రదర్శించారు. సూరత్ నగరానికి చెందిన ‘సూరత్ బైకింగ్ కమ్యూనిటీ' (Surat Biking Community) సభ్యులు డభారీ బీచ్‌లో ఏకంగా 71 ప్రీమియం మోటార్‌సైకిళ్లతో భారీ దుర్గామాత చిత్రాన్ని రూపొందించారు. పండుగ సంప్రదాయాలకు భిన్నంగా తమకు ఇష్టమైన బైక్‌ల ద్వారా అమ్మవారికి అంకితమిచ్చిన ఈ రూపం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది.

Andhra Pradesh: ఏపీలో ఎన్నికలకు మొదలైన కౌంట్ డౌన్.. వర్గాల వారీగా సీట్ల వివరాలు ఇవే!..ఏపీSwechaa12 Oct 2026, 03:18 PM

Andhra Pradesh: ఏపీలో ఎన్నికలకు మొదలైన కౌంట్ డౌన్.. వర్గాల వారీగా సీట్ల వివరాలు ఇవే!..

మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై పురపాలక శాఖ ప్రాథమిక కసరత్తు పూర్తయింది. 17 నగరపాలక సంస్థలు, 106 పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల వారీగా కేటాయించే స్థానాలపై దాదాపు ఒక నిర్ణయానికి రాగా.. తుది కసరత్తు కొనసాగుతోంది. నిబంధనలు, జనాభా నిష్పత్తి, రొటేషన్ తదితర అంశాల ఆధారంగా అన్నీ సరిగా ఉన్నాయో లేదో అధికారులు సరిచూస్తున్నారు.

Congress vs BRS: అసెంబ్లీ తర్వాత దూకుడు పెంచిన కాంగ్రెస్.. డిఫెన్స్‌లో గులాబీ దళం!తెలంగాణSwechaa12 Oct 2026, 03:12 PM

Congress vs BRS: అసెంబ్లీ తర్వాత దూకుడు పెంచిన కాంగ్రెస్.. డిఫెన్స్‌లో గులాబీ దళం!

Congress vs BRS: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల ముగింపుతో రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్‌పై రాజకీయంగా పైచేయి సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాలకు పదును పెట్టింది. అసెంబ్లీ వేదికగా మొదలైన రగడను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో హస్తం పార్టీ పూర్తి దూకుడు కనబరుస్తుండగా, ఊహించని ఈ రాజకీయ ఎదురుదాడితో గులాబీ దళం పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయినట్లు కనిపిస్తోంది.కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వైఖరి, ఎస్ఐఆర్ వివాదంపై దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలన్నీ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతుంటే, బీఆర్‌ఎస్ అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మక మౌనం దాల్చడం కాంగ్రెస్‌కు బలమైన అస్త్రంగా మారింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు వంటి అగ్రనేతలు ఎస్ఐఆర్‌పై స్పందించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఎండగడుతోంది.

ఆస్పత్రుల దోపిడీ.. బిల్లులపై కేంద్రం కఠిన ఆంక్షలు: రాష్ట్రాలకు సంచలన ఆదేశాలు జారీ!NationalSwechaa12 Oct 2026, 03:04 PM

ఆస్పత్రుల దోపిడీ.. బిల్లులపై కేంద్రం కఠిన ఆంక్షలు: రాష్ట్రాలకు సంచలన ఆదేశాలు జారీ!

 దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్లు వసూలు చేసే వైద్య సేవల రుసుములపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆస్పత్రుల్లో అందించే ప్రతి చికిత్స, వైద్య పరీక్షలు, ఇతర సేవల చార్జీలను అందరికీ స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్య రవాణా, చికిత్స వ్యయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా కేంద్రం సోమవారం ఈ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది.

మంత్రులు, ఎమ్మెల్యేలు టూర్లకు వెళ్తారా? : హరీశ్ రావుతెలంగాణSwechaa12 Oct 2026, 02:49 PM

మంత్రులు, ఎమ్మెల్యేలు టూర్లకు వెళ్తారా? : హరీశ్ రావు

రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. నీళ్లు లేక ఓవైపు పంటలు ఎండిపోతున్నాయని, తాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. కరువు పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. సాగుకు నీళ్లు లేక అన్నదాతలు జనరేటర్ల ద్వారా పంటకు నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కనిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జలాశయాల్లో నీరు ఎండిపొతున్నా రాష్ట్ర సర్కారు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.