స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మంత్రులు, ఎమ్మెల్యేలు టూర్లకు వెళ్తారా? : హరీశ్ రావుతెలంగాణSwechaa12 Oct 2026, 02:49 PM

మంత్రులు, ఎమ్మెల్యేలు టూర్లకు వెళ్తారా? : హరీశ్ రావు

రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. నీళ్లు లేక ఓవైపు పంటలు ఎండిపోతున్నాయని, తాగు నీటికి కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించారు. కరువు పరిస్థితులు నెలకొంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. సాగుకు నీళ్లు లేక అన్నదాతలు జనరేటర్ల ద్వారా పంటకు నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కనిపించడం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినో నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, జలాశయాల్లో నీరు ఎండిపొతున్నా రాష్ట్ర సర్కారు మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందని అన్నారు. తెలంగాణలో కరువు పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు.

టచ్‌లో 200 మంది అధికారులు.. ప్రకంపనలు సృష్టిస్తున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు!NationalSwechaa12 Oct 2026, 02:48 PM

టచ్‌లో 200 మంది అధికారులు.. ప్రకంపనలు సృష్టిస్తున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు!

 కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలోని సుమారు 200మంది ఉన్నతాధికారులు ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీరిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ (CBI)తో పాటు విదేశాంగ శాఖకు చెందిన అధికారులు కూడా ఉన్నారని, వారే ప్రభుత్వ అంతర్గత సమాచారాన్ని తమకు అందిస్తున్నారని వెల్లడించారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు వైపు ఇండీ (INDIA) కూటమి చేపట్టిన భారీ నిరసన మార్చ్‌కు ముందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మంచు కరగడానికి పెంగ్విన్ పక్షులే కారణమా!? అంటార్కిటికాలో ఏం జరుగుతోంది?InternationalSwechaa12 Oct 2026, 02:47 PM

మంచు కరగడానికి పెంగ్విన్ పక్షులే కారణమా!? అంటార్కిటికాలో ఏం జరుగుతోంది?

 శాశ్వత మంచు ఖండమైన అంటార్కిటికాలో ఉష్ణోగ్రతల పెరుగుదల కారణంగా మంచు వేగంగా కరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మంచు కరిగే ప్రక్రియను మరింత వేగవంతం కావడం వెనుక ఒక అనూహ్యమైన కారణం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అంటార్కిటికాలోని పెంగ్విన్ పక్షుల విసర్జితాలు (రెట్టలు) అక్కడి మంచు కరగడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అమెరికాలోని కొలరాడో విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. సముద్ర జీవుల ఆహార శృంఖలానికి, అంటార్కిటికాలోని వాతావరణ మార్పులకు మధ్య అత్యంత ఆసక్తికరమైన అనుబంధం ఉందని ఈ అధ్యయనం ద్వారా వెల్లడైంది.

Congress: రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత ఉందా??..NationalSwechaa12 Oct 2026, 01:35 PM

Congress: రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హత ఉందా??..

రాహుల్ గాంధీ కెరీర్ ప్రారంభంలో రాజకీయాల్లో పార్ట్-టైమ్ లీడర్‌గా వ్యవహరించారని, కీలక సమయాల్లో విదేశీ పర్యటనలకు వెళ్లేవారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ధోరణిలో మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక భారత ప్రజాస్వామ్యంలో ఏ నాయకుడైనా ప్రధాని పీఠాన్ని అధిరోహించాలంటే ఎన్నికల్లో స్పష్టమైన ప్రజాదరణ, లోక్‌సభలో మెజారిటీ సాధించాల్సి ఉంటుంది. రాహుల్ గాంధీ తన గత బలహీనతలను అధిగమిస్తూ, ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాతో ప్రజలను ఎంతవరకు మెప్పించగలరనే దానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు..

ఎట్టకేలకు ఐఏఎస్ ఆమ్రపాలిని కరుణించిన ఏపీ సర్కార్..ఏపీSwechaa12 Oct 2026, 01:24 PM

ఎట్టకేలకు ఐఏఎస్ ఆమ్రపాలిని కరుణించిన ఏపీ సర్కార్..

తెలంగాణలో పనిచేసి వెళ్లిన ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలిని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు కరుణించింది. మొన్నటివరకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఆమె ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణలో పనిచేయాలని ఆమె గత కొంతకాలంగా ఫైట్ చేస్తున్నారు. కానీ ‘క్యాట్’(CAT) ఆమె రిక్టెస్ట్‌ను పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత క్యాడర్ కేటాయింపు వివాదాల నేపథ్యంలో ఆమెను ఏపీకి కేటాయించారు. కానీ, ఆమె అక్కడ విధుల్లో చేరడానికి అయిష్టత చూపారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా ఆమెకు తిరిగి పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా కీలక బాధ్యతలను అప్పగించింది. మొత్తం 11 మంది ఐఏఎస్‌లకు పోస్టింగ్స్ ఇస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ సోమవారం ఉత్వర్వులు జారీ చేసింది.

రైతులకు నీళ్లు లేవు.. నేతల ముందు జీడిపప్పు, బాదం! ఏంటిది..?NationalSwechaa12 Oct 2026, 01:21 PM

రైతులకు నీళ్లు లేవు.. నేతల ముందు జీడిపప్పు, బాదం! ఏంటిది..?

తీవ్ర కరువు పరిస్థితుల్లో రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రజాప్రతినిధులు ఓ సమీక్ష నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ సమావేశంలో వారి ముందు ఉన్న ప్లేట్లలో జీడిపప్పు, బాదం కనిపించడంతో వివాదం మొదలైంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..?

ఔషధాల్లాగానే ఏఐపై కఠిన నియంత్రణలు అవసరం: బిల్ గేట్స్InternationalSwechaa12 Oct 2026, 01:17 PM

ఔషధాల్లాగానే ఏఐపై కఠిన నియంత్రణలు అవసరం: బిల్ గేట్స్

 కృత్రిమ మేధస్సు(Artificial Intelligence - AI) అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో, దాని వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా సరైన నియంత్రణలు ఉండాల్సిన అవసరం ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఔషధాలు, విమానాలు, మోటారు వాహనాలు వంటి రంగాల్లో ప్రజల భద్రత కోసం ప్రభుత్వాలు ఎలాంటి కఠినమైన నిబంధనలు విధిస్తున్నాయో, సరిగ్గా అదే తరహాలో ఏఐ సాంకేతికతపై కూడా స్పష్టమైన గ్లోబల్ నియంత్రణ వ్యవస్థలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రాహుల్, ఖర్గేకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్NationalSwechaa12 Oct 2026, 12:43 PM

రాహుల్, ఖర్గేకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్

ఎస్ఐఆర్, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను అపాయింట్‌మెంట్ కోరగా ఆయన నిరాకరించారు.అందుకు గల కారణాలను చీఫ్ జస్టిస్ సోమవారం ఉదయం మీడియాకు వెల్లడించారు. అయితే, రాహుల్ గాంధీ, తనకు మధ్య నడిచిన లేఖల రాయభారంపై వివరాలు వెల్లడించేందుకు జస్టిస్ సూర్యకాంత్ ఇష్టపడలేదు.కేంద్రప్రభుత్వం ‘ఓటు చోరీ’కి స్వస్తి పలకాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా, ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (SIR) నిలిపివేత, ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ విధానాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఒక వినతిపత్రాన్ని సమర్పించేందుకు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గేలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు ఆదివారం రాహుల్ గాంధీ సీజేఐకి లేఖ రాయగా.. కలువడం వీలు కాదని సీజేఐ తిరిగి లేఖ ద్వారా సమాధానం ఇచ్చారు.

హీలియం గ్యాస్ కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతితెలంగాణSwechaa12 Oct 2026, 12:11 PM

హీలియం గ్యాస్ కలకలం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతని పక్కనే హీలియం గ్యాస్ సిలిండర్, సూసైడ్ నోట్ లభ్యం అయినట్టు సమాచారం. హరియాణాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సౌరభ్ శేఖర్ (36) గత కొంతకాలంగా హైదరాబాద్‌లో జాబ్ చేస్తూ రాయదుర్గం పరిధిలో తన సోదరుడితో కలిసి నివాసం ఉంటున్నాడు.ఈ క్రమంలోనే స్నేహితుడిని కలిసేందుకు వెళ్తున్నానని శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన సౌరభ్.. కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలోని వీవీ హైట్స్ సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు.ఆదివారం ఉదయం వరకు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆ ఫ్లాట్‌ అడ్రస్‌కు అతని సోదరుడు వెళ్లాడు. తలుపులు పగలగొట్టి చూడగా సౌరభ్ విగతజీవిగా కనిపించాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ధరలపై పున:సమీక్ష!తెలంగాణSwechaa12 Oct 2026, 11:59 AM

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ధరలపై పున:సమీక్ష!

 హైదరాబాద్ నగరంలో ఇటీవల ప్రారంభించిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ వస్తున్న ప్రజా వ్యతిరేకతపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఫిర్యాదుల నేపథ్యంలో కామన్ పాస్ ధరలను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు త్వరలోనే రవాణా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.

ఆదిలాబాద్ ‘రిమ్స్’ పాపం ఎలుకలదా? సర్కారుదా?తెలంగాణSwechaa12 Oct 2026, 11:53 AM

ఆదిలాబాద్ ‘రిమ్స్’ పాపం ఎలుకలదా? సర్కారుదా?

ఆదిలాబాద్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS) హాస్పిటల్‌లో సంభవించిన ప్రమాదానికి కారణం ‘ఎలుకలు’ అని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ రిపోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 21, 2026 అర్ధరాత్రి సమయంలో ఏసీ పేలిన ఘటనలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఐదుగురు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. న్యూ బార్న్ కేర్ యూనిట్‌లో ఏసీ ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతో దట్టమైన పొగతో పాటు మంటలు చెలరేగాయి.ప్రమాదం సంభవించిన సమయంలో వార్డులో 23 మంది శిశువులు ఉండగా, సిబ్బంది,సెక్యూరిటీ గార్డులు, అంబులెన్స్ డ్రైవర్లు సాహసంతో 22 మంది పసికందులను రక్షించారు. అయితే, అగ్నిప్రమాదం, విశవాయువులు పీల్చడం మూలంగా రోజుల వ్యవధిలో మొత్తం ఐదుగురు శిశువులు చనిపోయారు.

బాలయ్య పెద్ద మనసు.. సగం ఇంటి స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగింత!తెలంగాణSwechaa12 Oct 2026, 11:40 AM

బాలయ్య పెద్ద మనసు.. సగం ఇంటి స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగింత!

 హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టి, ప్రయాణికులకు సులభతరమైన రవాణా సౌకర్యాలను కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్‌లోని ప్రఖ్యాత కేబీఆర్ పార్క్ చుట్టూ జరుగుతున్న రహదారుల విస్తరణ పనులకు టాలీవుడ్ ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన వంతుగా గొప్ప సహకారాన్ని అందించారు. నగర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమానికి ఆయన తన స్వగృహానికి సంబంధించిన విలువైన స్థలాన్ని స్వచ్ఛందంగా అందజేశారు.

Andhra Pradesh: వైసీపీ పతనానికి అప్పుడే పునాది పడిందా?.. జగన్ చేసిన పొరపాట్లు ఇవేనా?..ఏపీSwechaa12 Oct 2026, 11:35 AM

Andhra Pradesh: వైసీపీ పతనానికి అప్పుడే పునాది పడిందా?.. జగన్ చేసిన పొరపాట్లు ఇవేనా?..

కడప లోక్‌సభ స్థానం నుంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి రాజకీయాల్లో కీలక అడుగు వేసిన జగన్‌కు, అదే ఏడాది సెప్టెంబర్ 2న తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం పెద్ద మలుపుగా మారింది. వైఎస్సార్ తర్వాత జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్లు తెరపైకి వచ్చినప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం రోశయ్య వైపు మొగ్గు చూపి ఆయనకు బాధ్యతలు అప్పగించింది. అదేసమయంలో తన తండ్రి మరణ వార్తతో చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర కాంగ్రెస్ నాయకత్వంతో విభేదాలకు కారణమైంది. చివరకు 2010 నవంబర్‌లో కాంగ్రెస్‌కు, ఎంపీ పదవికి జగన్ రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 2011 మార్చి 12న స్థాపించారు. అదే సంవత్సరం కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారీ విజయాలు సాధించి తన రాజకీయ బలాన్ని చాటుకున్నారు.

SircillaPolitics: కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ.. సిరిసిల్లలో రేవంత్ సభ బెడిసికొట్టిందా?!తెలంగాణSwechaa12 Oct 2026, 11:06 AM

SircillaPolitics: కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ.. సిరిసిల్లలో రేవంత్ సభ బెడిసికొట్టిందా?!

 ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో పర్యటించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంచుకోట అయిన సిరిసిల్లలో సీఎం పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయమైంది. ఒక వైపు పార్టీ  సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. రేవంత్ పర్యటన పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపించింది. సరిగ్గా ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తిగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల జరిగిన ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.  ఈ ఎన్నికల్లో అధికార పార్టీ మద్దతు ఇచ్ఛిన 'టీడబ్ల్యూయూ' ఘోర పరాజయంపాలు కావడం స్థానిక రాజకీయాల్లో ఇప్పుడు పెను సంచలనంగా మారింది.

SS Rajamouli: రామాయణ సినిమాలేవీ జక్కన్నకి నచ్చలేదా?సినిమాSwechaa12 Oct 2026, 11:01 AM

SS Rajamouli: రామాయణ సినిమాలేవీ జక్కన్నకి నచ్చలేదా?

SS Rajamouli: సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడుగా ఎస్.ఎస్.రాజమౌళికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హీరోలను చూసి సినిమా కొనే స్థాయి మార్చేసిన దర్శకుడు రాజమౌళి. సినిమా పోస్టర్ మీద రాజమౌళి పేరు కనిపిస్తే బిజినెస్ పూర్తైపోతుంది. హీరో గురించి తర్వాత ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకూ రాజమౌళి తీసిన ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాలేదు. ఐతే, తాజాగా ఇప్పటి వరకూ వచ్చిన రామాయణ సినిమాల గురించి జక్కన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

రోహింగ్యా ఓట్ల కోసమే కదా?  పొన్నంకు బీజేపీ చీఫ్ కౌంటర్తెలంగాణSwechaa12 Oct 2026, 10:45 AM

రోహింగ్యా ఓట్ల కోసమే కదా? పొన్నంకు బీజేపీ చీఫ్ కౌంటర్

ఎస్ఐఆర్‌లో భాగంగా ఓట్లు కోల్పోయిన వారిని తీసుకొస్తానని, చర్చకు రావాలని మంత్రి పొన్నం విసిరిన సవా‌ల్‌కు తాజాగా బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బోగస్ ఓట్లు ఉన్నాయని గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీనే బహిరంగంగా ప్రకటించారని గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ముందుగా ఆ విషయంపై సింఘ్వీని వివరణ కోరాలని హితవు పలికారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల అక్రమ ఓట్లు తొలగిపోతున్నందుకే కాంగ్రెస్ పార్టీ రోడ్లెక్కి ధర్నాలు చేస్తోందని విమర్శించారు. కాగా, రాంచందర్ రావు కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హోర్ముజ్‌లో దాడులు.. ఇద్దరు భారతీయులు గల్లంతుInternationalSwechaa12 Oct 2026, 10:31 AM

హోర్ముజ్‌లో దాడులు.. ఇద్దరు భారతీయులు గల్లంతు

హోర్ముజ్ జలసంధిలో మరోసారి యుద్థవాతావరణం కనిపిస్తోంది. అందులో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై డ్రోన్ దాడి జరిగింది. ఎంటీ పెట్రో డాల్ఫిన్ అనే నౌకపై డ్రోన్‌ దాడి జరగగా ట్యాంకర్‌లో అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన టైంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 9మందిని సురక్షితంగా కాపాడగా, ఇద్దరు గల్లంతైనట్టు సమాచారం. వెంటనే అప్రమత్తమైన స్థానిక కోస్టు గార్డ్ దళం గల్లంతైన ఇద్దరు నావికుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.ఈ ఘటనపై ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనావాల ‘ఎక్స్’ వేదికగా రియాక్ట్ అయ్యారు. పెట్రో డాల్ఫిన్ అనే ట్యాంకర్‌పై సోహార్ యాంకరేజ్ వద్ద డ్రోన్ దాడి జరిగిందని తెలిపారు. నౌకలో 11మంది భారతీయ సిబ్బంది ఉంటే వారిలో ఇద్దరు గల్లంతయ్యారన్నారు.

గిరిజనులు ఇచ్చిన చికెన్ అందుకే తినలేదు: పవన్ కల్యాణ్ఏపీSwechaa12 Oct 2026, 10:22 AM

గిరిజనులు ఇచ్చిన చికెన్ అందుకే తినలేదు: పవన్ కల్యాణ్

 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోలవరం జిల్లాలో చేపట్టిన 'అడవితల్లి బాట 2.0' పర్యటన రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా గిరిజన ప్రాంతాలను సందర్శించిన ఆయన, అక్కడి స్థానిక గిరిజనులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను ఆరా తీశారు. ఈ సందర్భంగా గిరిజనులు తమ సంప్రదాయ పద్ధతిలో ఎంతో ప్రేమతో వండిన వెదురు బొంగు చికెన్(Baboo chichen), ఇతర వంటకాలను రుచి చూడాలని కోరారు.

ఏపీ కూటమిలో క్రెడిట్ వార్.. సీట్ల సర్దుబాటు వేళ పవన్ కామెంట్లతో మంటలు!ఏపీSwechaa12 Oct 2026, 10:19 AM

ఏపీ కూటమిలో క్రెడిట్ వార్.. సీట్ల సర్దుబాటు వేళ పవన్ కామెంట్లతో మంటలు!

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల పంపకంపై టీడీపీ, జనసేన మధ్య చర్చలు సాగుతున్నాయి. అయితే, అధినాయకత్వాలు పొత్తును పటిష్ఠం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం రెండు పార్టీల కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి.

పోలీసులపై గ్రామస్తుల మూకుమ్మడి దాడి..వాహనాలు, ఫోన్లు ధ్వంసంక్రైమ్Swechaa12 Oct 2026, 09:53 AM

పోలీసులపై గ్రామస్తుల మూకుమ్మడి దాడి..వాహనాలు, ఫోన్లు ధ్వంసం

గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై మూకుమ్మడి దాడి జరిగింది.ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయిపేట్‌లో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. సీఐ, ఏఎస్ఐ సహా నలుగురు పోలీసులకు గాయాలు అయ్యాయి. వివరాల్లోకివెళితే..ఓ వ్యక్తి తన పెరట్లో గుట్టుగా గంజాయి సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.కేసు తదుపరి విచారణ కోసం పోలీసు బృందం ఆ గ్రామానికి వెళ్లగా.. గంజాయి సమాచారం ఎవరిచ్చారంటూ పోలీసులనే గ్రామస్తులు నిలదీశారు. మహిళలతో కలిసి రాళ్లు, కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది.పోలీసు వాహనంతో పాటు వారి ఫోన్లు ధ్వంసమయ్యాయి.అయితే, పోలీసులే కులం పేరుతో తమను దూషించారంటూ ఆదివాసీల ఆరోపిస్తున్నారు.

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి భారీ నిరసన!NationalSwechaa12 Oct 2026, 09:40 AM

ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర మంత్రులు, ఎంపీలతో కలిసి భారీ నిరసన!

 సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్య పరిరక్షణను కాంక్షిస్తూ ఇండియా కూటమి(INDIA) సోమవారం ఢిల్లీలో ఒక భారీ నిరసన మార్చ్‌కు పిలుపునిచ్చింది. ఈ నిరసనలో పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్, పలువురు రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఎంపీలు కూడా ముఖ్యమంత్రితో పాటు భాగస్వామ్యం కానున్నారు.

గాయత్రీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు!తెలంగాణSwechaa12 Oct 2026, 09:14 AM

గాయత్రీదేవి అలంకరణలో కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తులు!

 విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో రెండో రోజుకు చేరుకున్నాయి. మొదటి రోజున లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, సోమవారం నాడు రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ తల్లి సకల వేద స్వరూపిణి అయిన గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సింగరేణి నైపుణ్య శిక్షణ కేంద్రం ఘనత.. 87 మంది మహిళలకు ఉద్యోగాలు!తెలంగాణSwechaa12 Oct 2026, 08:51 AM

సింగరేణి నైపుణ్య శిక్షణ కేంద్రం ఘనత.. 87 మంది మహిళలకు ఉద్యోగాలు!

 సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. రామగుండం-1 (ఆర్జీ-1) ఏరియాలోని సింగరేణి జీవీటీసీ (GVTC) నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలలో స్థానిక యువత అద్భుతమైన విజయం సాధించింది. తాజాగా నిర్వహించిన నియామకాల్లో మొత్తం 112 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. కాగా, అందులో హైదరాబాద్‌లోని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ 'ఫాక్స్కాన్' (Foxconn) కంపెనీలో ఏకంగా 87 మంది మహిళలకు ఉద్యోగాలు దక్కడం విశేషం.

మూడో టర్మ్‌లో ముచ్చెమటలు..? తొలిసారి మోదీకి పెను సవాళ్లు!NationalSwechaa11 Oct 2026, 10:51 PM

మూడో టర్మ్‌లో ముచ్చెమటలు..? తొలిసారి మోదీకి పెను సవాళ్లు!

2014లో మొదలైన మోదీ శకానికి ఇప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. 2014, 2019లో సొంత మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. 2024లో మెజారిటీ కోల్పోయి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు సర్ వివాదం, ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాల పోరు, ఢిల్లీలో వరుస నిరసనలు.. కేంద్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

Donald Trump: ‘ఎనర్జీ సీజ్‌ఫైర్‌’.. ట్రంప్‌ సంచలన ప్రకటన!NationalSwechaa11 Oct 2026, 10:08 PM

Donald Trump: ‘ఎనర్జీ సీజ్‌ఫైర్‌’.. ట్రంప్‌ సంచలన ప్రకటన!

Donald Trump: రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య తక్షణమే ‘ఎనర్జీ సీజ్‌ఫైర్’ అమల్లోకి వచ్చిందని ప్రకటించారు. విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ పైప్‌లైన్ల వంటి కీలక ఇంధన మౌలిక వనరులపై పరస్పర దాడులను ఆపేసేందుకు ఇరు దేశాలు అంగీకరించాయని ఆయన వెల్లడించారు.

Revanth Reddy: ప్రమోద్ కాదు.. ప్రాపర్టీ సావంత్.. గోవా సీఎంపై రేవంత్ రెడ్డి సెటైర్!తెలంగాణSwechaa11 Oct 2026, 09:42 PM

Revanth Reddy: ప్రమోద్ కాదు.. ప్రాపర్టీ సావంత్.. గోవా సీఎంపై రేవంత్ రెడ్డి సెటైర్!

Revanth Reddy: గోవా రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన పంచ్ డైలాగ్స్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన ‘ప్రాపర్టీ సావంత్’ కామెంట్ స్థానిక రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కాక రేపింది. బీజేపీ పాలనలో గోవాలో వేలాది ఎకరాల భూములు అన్యాక్రాంతమైపోతున్నాయని, ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని ఆరోపించిన రేవంత్.. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు చెరిగారు.గోవా పర్యటనలో భాగంగా నిర్వహించిన ‘గోయ్ రాఖోన్న్’ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "గోవా భవిష్యత్తును పూర్తిగా నాశనం చేశారు. యువతను డ్రగ్స్‌కు బానిసలుగా మార్చేసి, రాష్ట్రాన్ని డ్రగ్స్ పెడ్లర్లకు అడ్డాగా మార్చేశారు. రెండుసార్లు బీజేపీని నమ్మి ప్రజలు మోసపోయారు.. మూడోసారి కూడా ఆ పార్టీని నమ్మి మళ్లీ మోసపోవద్దు" అని పిలుపునిచ్చారు.

Vijayawada: దుర్గమ్మ సన్నిధిలో మీడియాకు నో ఎంట్రీ.. జర్నలిజం అంటే అంత చులకనా?ఏపీSwechaa11 Oct 2026, 09:39 PM

Vijayawada: దుర్గమ్మ సన్నిధిలో మీడియాకు నో ఎంట్రీ.. జర్నలిజం అంటే అంత చులకనా?

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో మీడియాకు ఎదురవుతున్న ఆంక్షలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఉత్సవాల విశేషాలు, అధికారుల ఏర్పాట్లు, భక్తుల సమస్యలను ప్రపంచానికి తెలియజేయాల్సిన మీడియాకు అవకాశం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Khammam: యాసంగి పంటలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి!?..తెలంగాణSwechaa11 Oct 2026, 09:05 PM

Khammam: యాసంగి పంటలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి!?..

ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో రానున్న రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాగైనా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం. కానీ రానున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగి పంటలు సాగు చేయకుండా సహకరించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు.

Telangana Credit War: తెలంగాణ క్రెడిట్ ఫైట్.. హస్తం వర్సెస్ గులాబీ!తెలంగాణSwechaa11 Oct 2026, 09:04 PM

Telangana Credit War: తెలంగాణ క్రెడిట్ ఫైట్.. హస్తం వర్సెస్ గులాబీ!

Telangana Credit War: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘సెంటిమెంట్’ అగ్గి రాజుకుంటోంది. అధికారం దక్కించుకోవడానికి ఒకరు, ఉన్న పవర్‌ను నిలబెట్టుకోవడానికి మరొకరు తెలంగాణ సెంటిమెంట్‌నే ఓట్ల పంట పండించే కామధేనువుగా మార్చుకునే పనిలో పడ్డారనే వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తుంది. “తెలంగాణ తెచ్చింది మేమే” అని గులాబీ దళం కాలర్ ఎగరేస్తుంటే.. “తెలంగాణ ఇచ్చింది మేమే కదా” అంటూ హస్తం పార్టీ ఎదురుదాడికి దిగుతోంది. అయితే ఈసారి సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహంతో కేసీఆర్‌ను ఆయన సొంత అడ్డాలోనే దెబ్బకొట్టేలా సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

The Lancet Report: అణు విస్ఫోటనం.. బయోవెపన్స్.. మానవాళి అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందా?NationalSwechaa11 Oct 2026, 08:50 PM

The Lancet Report: అణు విస్ఫోటనం.. బయోవెపన్స్.. మానవాళి అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందా?

The Lancet Report: అణు విస్ఫోటనం.. బయోవెపన్స్.. మానవాళి అంతానికి కౌంట్‌డౌన్ మొదలైందా? మనం సాధించిన సాంకేతిక పురోగతే ఇప్పుడు మన పాలిట శాపంగా మారుతోందంటూ అంతర్జాతీయ స్థాయి నిపుణులు హెచ్చరికల సైరన్ మోగించారు. 2100 నాటికి భూగోళంపై మనుషుల ఆనవాళ్లు గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని ప్రఖ్యాత మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ వెలువరించిన తాజా పరిశోధన ప్రపంచ దేశాలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.ఈ వినాశనానికి ప్రధాన కారణం సాంకేతికత అదుపు తప్పడమేనని శాస్త్రవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే కలిగే నష్టం ఊహకందనిది. ఆధునిక ఏఐని దుర్వినియోగం చేస్తూ రహస్య ప్రయోగశాలల్లో ప్రాణాంతక బ్యాక్టీరియాలు, కొత్త తరం వైరస్‌లను డిజైన్ చేసి బయోవెపన్స్‌గా మార్చే తీవ్ర ముప్పు పొంచి ఉంది. ఒక చిన్న ల్యాబ్ నుంచి లీక్ అయ్యే ఒక్క బయోవెపన్ క్షణాల వ్యవధిలో దేశాలకు దేశాలనే శ్మశానాలుగా మార్చగలదు.