స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

India vs West Indies T20 2026: టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. సిరీస్‌లో ఆధిక్యం ఎవరిదో!!..క్రీడలుSwechaa11 Oct 2026, 08:42 PM

India vs West Indies T20 2026: టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. సిరీస్‌లో ఆధిక్యం ఎవరిదో!!..

భారత్, వెస్టిండీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న చివరి, మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో టీమిండియా గెలవగా, రెండో మ్యాచ్ లో విండీస్ నెగ్గింది. దాంతో సిరీస్ 1-1తో సమం కాగా, నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.

Smriti Mandhana: చిన్నారుల హక్కులకై మంధాన ముందడుగు.. సచిన్ టెండూల్కర్ ప్రశంసలు!NationalSwechaa11 Oct 2026, 08:10 PM

Smriti Mandhana: చిన్నారుల హక్కులకై మంధాన ముందడుగు.. సచిన్ టెండూల్కర్ ప్రశంసలు!

Smriti Mandhana: భారత మహిళా క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన గ్రౌండ్ బయట కూడా తన పెద్ద మనసును చాటుకున్నారు. కేవలం బ్యాట్‌తో పరుగుల వరద పారించడమే కాకుండా, సమాజంలో మార్పు కోసం కీలక అడుగు వేశారు. పిల్లల హక్కులు, లింగ సమానత్వం లక్ష్యంగా ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘యూనిసెఫ్ ఇండియా’ సెలెబ్రిటీ అడ్వకేట్‌గా ఆమె అధికారికంగా నియమితులయ్యారు. దేశంలోని ప్రతీ బాలికకు సమాన అవకాశాలు దక్కాలని, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించాలనే సంకల్పంతో మంధాన ఈ నూతన బాధ్యతలను స్వీకరించారు.

Hyderabad: నగరంలో మొదలైన దసరా సందడి.. ట్రాఫిక్ జామ్ తో నిండిపోయిన హైవేలు!!..తెలంగాణSwechaa11 Oct 2026, 07:58 PM

Hyderabad: నగరంలో మొదలైన దసరా సందడి.. ట్రాఫిక్ జామ్ తో నిండిపోయిన హైవేలు!!..

దసరా సందడి మొదలైంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వడంతో సొంతూళ్లకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. వీరి రద్దీతో జాతీయ రహదారి-65పై వాహనాలు బారులు తీరాయి. లక్కారం నుంచి ధర్మోజీగూడెం వరకు చాలా దూరం వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే జాతీయ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ పురపాలిక పరిధిలో వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చౌటుప్పల్‌లో నూతనంగా నిర్మిస్తున్న ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులు కూడా ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతున్నాయి.

Telangana: తెలంగాణా ప్రజలకు డబుల్ బొనాంజా ప్రకటించిన ప్రజా ప్రభుత్వం!..తెలంగాణSwechaa11 Oct 2026, 07:10 PM

Telangana: తెలంగాణా ప్రజలకు డబుల్ బొనాంజా ప్రకటించిన ప్రజా ప్రభుత్వం!..

తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించే ఇందిరమ్మ బీమా పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. నవంబర్ 19న ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.

Megastar Chiranjeevi: ఏపీ వేగంగా డెవలప్‌ అవుతోంది.. కూటమి పాలనపై చిరంజీవి కామెంట్స్ఏపీSwechaa11 Oct 2026, 07:05 PM

Megastar Chiranjeevi: ఏపీ వేగంగా డెవలప్‌ అవుతోంది.. కూటమి పాలనపై చిరంజీవి కామెంట్స్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నోటి నుంచి వచ్చే ప్రతి మాటా పాలిటిక్స్‌లోనూ సెగలు రేపుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతున్నాయి. “గతంతో పోలిస్తే ఇప్పుడు ఏపీలో క్లియర్ చేంజ్ కనిపిస్తోంది.. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ఫుల్ స్పీడ్‌తో దూసుకుపోతోంది” అంటూ కూటమి పాలనపై చిరు వేసిన మార్క్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.చాలా రోజుల తర్వాత కోనసీమ గడ్డపై చిరంజీవి అడుగుపెట్టడంతో కపిలేశ్వరపురంలో అభిమానుల సందడి మామూలుగా లేదు. జీఎస్‌ఎల్‌ ఆస్పత్రి, సూర్య ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా నిర్మించిన హెల్త్‌ కేర్‌ సెంటర్‌ను ఆయన గ్రాండ్‌గా ప్రారంభించారు.

KCR: సర్‌పై సార్ గప్‌చుప్.. ‘దేశ్ కీ నేత’ మౌనం వెనుక మతలబేంటి?తెలంగాణSwechaa11 Oct 2026, 06:07 PM

KCR: సర్‌పై సార్ గప్‌చుప్.. ‘దేశ్ కీ నేత’ మౌనం వెనుక మతలబేంటి?

KCR: "తెలంగాణే కాదు.. యావత్ దేశాన్ని మార్చేస్తాం.. దేశ్ కీ నేతగా ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం!" అంటూ గులాబీ జెండాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మాజీ సీఎం కే.చంద్రశేఖర రావు ఇప్పుడు ఎక్కడ? దేశ రాజధాని వేదికగా ఎన్నికల కమిషన్ తీరుపై, 13 కోట్ల ఓట్ల గల్లంతుపై సమస్త విపక్షాలు ఏకమై పోరాడుతుంటే.. జాతీయ రాజకీయాలను శాసిస్తానన్న కేసీఆర్ ఎందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు? ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రజాస్వామ్య ఉద్యమం హోరెత్తుతుంటే, దేశ్ కీ నేత నోటికి తాళం పడటం వెనుక అసలు మతలబు ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.అఖిలపక్షాలు పార్టీ జెండాలను పక్కనపెట్టి నిరసన గళం విప్పుతుంటే, కేసీఆర్ మాత్రం కనీసం ఒక్క ప్రెస్‌మీట్ పెట్టే సాహసం కూడా చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టుతో చేతులు దులుపుకోవడం గులాబీ బాస్ మార్క్ రాజకీయానికి పూర్తి భిన్నం. "కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కత్తి తలపై వేలాడుతుండటంతోనే కేసీఆర్ అడుగు ముందుకు వేయడం లేదా?

Telangana: కేసీఆర్ కు తలనొప్పిగా మారిన కవిత పొలిటికల్ గేమ్?!.. తండ్రి చరిత్ర మరచినట్టు ఉంది!..తెలంగాణSwechaa11 Oct 2026, 05:58 PM

Telangana: కేసీఆర్ కు తలనొప్పిగా మారిన కవిత పొలిటికల్ గేమ్?!.. తండ్రి చరిత్ర మరచినట్టు ఉంది!..

కవిత దూకుడు కొత్త పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు తగ్గలేదని అంటున్నారు. నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు బీఆర్ఎస్ తో కలవను అంటూ ఆమె తేల్చిచెప్పారు. సొంత కూతురే ప్రధాన ప్రతిపక్షంగా మారుతుండడం, కేసీఆర్ ఓటమిని, బీఆర్ఎస్ పతనాన్ని ఆమె బహిరంగంగానే శాసిస్తున్నట్టు చర్చలు మొదలైయ్యాయని అంటున్నారు. దీంతో కవిత తీరు గులాబీ బాస్‌కు ఇటు వ్యక్తిగతంగానూ, అటు రాజకీయంగానూ తలనొప్పిగా మారిందని అంటున్నారు..

BRS: 10 ఏళ్ల కొత్త జిల్లాలు.. తెరపైకి గులాబీ దళం సరికొత్త వ్యూహం!తెలంగాణSwechaa11 Oct 2026, 05:46 PM

BRS: 10 ఏళ్ల కొత్త జిల్లాలు.. తెరపైకి గులాబీ దళం సరికొత్త వ్యూహం!

BRS: తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు మాజీ సీఎం కేసీఆర్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రంలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగి దశాబ్దం పూర్తవుతున్న సందర్భాన్ని బీఆర్‌ఎస్ అత్యంత వ్యూహాత్మకంగా మలచుకుంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల ముంగిటకే పాలన తీసుకొచ్చిన చారిత్రక ఘట్టాన్ని గుర్తుచేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ‘జిల్లా దశాబ్ది ఉత్సవాలు’ పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు గులాబీ బాస్ సిద్ధం చేసిన ప్లాన్ ఇప్పుడు హస్తం పార్టీకి సరికొత్త సవాలుగా మారింది.

TBJP: బిజెపి పెద్దల ఇష్టారాజ్యం.. కేడర్ ఫైర్తెలంగాణSwechaa11 Oct 2026, 05:40 PM

TBJP: బిజెపి పెద్దల ఇష్టారాజ్యం.. కేడర్ ఫైర్

TBJP: తెలంగాణ కాషాయ కోటలో గ్రౌండ్ లెవల్ కేడర్ రగిలిపోతోంది. రోడ్లపైకి వచ్చి లాఠీ దెబ్బలు తిన్నది మేము.. కేసులు ఎదుర్కొని జైళ్లకు వెళ్లింది మేము.. తీరా పదవుల పంపకాల వేళ అధిష్టానం కనీసం పట్టించుకోకపోవడమేంటని క్షేత్రస్థాయి కార్యకర్తలు, లీడర్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ.. మకిచ్చే గిఫ్ట్ ఇదా అని ప్రశ్నిస్తున్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా, తెలంగాణలో పార్టీని ప్రాణాలకు తెగించి నిలబెట్టిన కేడర్‌కు గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తి ఇప్పుడు కాషాయ దళం అంతర్గత సమావేశాల్లో బాహాటంగానే పేలుతోంది.

Telangana Politics: హరీష్ అడ్డాపై రేవంత్ కన్ను.. గులాబీ కోటలో పోటాపోటీ రచ్చ!తెలంగాణSwechaa11 Oct 2026, 04:33 PM

Telangana Politics: హరీష్ అడ్డాపై రేవంత్ కన్ను.. గులాబీ కోటలో పోటాపోటీ రచ్చ!

Telangana Politics: సిరిసిల్లలో కేటీఆర్‌కు చెక్ పెట్టిన జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు బీఆర్‌ఎస్‌కు అత్యంత పటిష్టమైన కంచుకోట సిద్దిపేటపై దృష్టి సారించింది. మాజీ మంత్రి హరీష్ రావు స్వంత ఇలాకాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభకు రంగం సిద్ధమవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. సిద్దిపేటలో గులాబీ జెండాను పీకేసి కాంగ్రెస్ జెండా ఎగరేసిన నేతకు ఏకంగా మంత్రి పదవి ఇస్తానంటూ గతంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఓపెన్ ఆఫర్‌ను గుర్తుచేస్తూ హస్తం శ్రేణులు కదనరంగానికి దిగుతున్నాయి.సీఎం రేవంత్ రెడ్డి సభ ఖరారయ్యేలోపే తన పట్టును నిరూపించుకునేందుకు హరీష్ రావు శరవేగంగా పావులు కదిపారు. సిద్దిపేట జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ‘దశాబ్ది ఉత్సవాల’ పేరిట మూడు రోజుల పాటు భారీ కార్యక్రమాలను ప్రకటించారు.

సికింద్రాబాద్‌లో చిన్నారి కిడ్నాప్, హత్యకేసులో బిగ్ ట్విస్ట్!క్రైమ్Swechaa11 Oct 2026, 03:28 PM

సికింద్రాబాద్‌లో చిన్నారి కిడ్నాప్, హత్యకేసులో బిగ్ ట్విస్ట్!

సికింద్రాబాద్‌‌‌‌లో చిన్నారి కిడ్నాప్, హత్య కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. సెక్యూరిటీ గార్డుతో పాటు మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా పోలీసులు తేల్చారు. డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినట్టు నిర్దారణకు వచ్చారు. చిన్నారి మృతితో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన నిన్న చోటుచేసుకోగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. వివరాల్లోకివెళితే.. కౌకూర్‌లోని 'విల్లా ఆర్చిడ్స్' అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న విక్రమ్.. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఆరేళ్ల చిన్నారి అరులియా మోజెస్‌ను కిడ్నాప్ చేసి రూ.20 లక్షలు ఇవ్వాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశాడు. డబ్బులు సర్దుబాటు చేస్తామని, పాపను క్షేమంగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకున్నా నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పోలీసులను గమనించిన నిందితుడు ఎక్కడ దొరికిపోతానో అన్న భయంతో చిన్నారిని హత్య చేశాడు.అనంతరం అపార్ట్‌మెంట్ క్లబ్‌హౌస్ సెల్లార్‌లోని నీళ్ల సంపులో పడేసి పరారయ్యాడు.

చిత్రం లేదు
NationalSwechaa11 Oct 2026, 02:51 PM

Rahul Gandhi: ఢిల్లీలో రాహుల్ వన్ మ్యాన్ షో? మిత్రపక్షాలకు చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ డ్రామానా!

Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆందోళనల వెనుక సరికొత్త రాజకీయ చక్రవ్యూహం దాగుందా? ప్రధాన ఎన్నికల కమిషనర్‌పై నిరసనల పేరుతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చేస్తున్న రచ్చ ఇప్పుడు సొంత ‘ఇండియా’ కూటమిలోనే తీవ్ర అనుమానాలకు ఆజ్యం పోస్తోంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ముసుగులో జరుగుతున్న ఈ ఆందోళనలన్నీ కేవలం 'గాంధీ కుటుంబం పబ్లిసిటీ స్టంట్' మాత్రమేనని, విపక్షాల్లోని ఇతర ప్రాంతీయ పార్టీల ప్రాభవాన్ని దెబ్బకొట్టేందుకే కాంగ్రెస్ ఈ మైలేజ్ డ్రామాకు తెరలేపిందన్న చర్చ హస్తిన వర్గాల్లో జోరుగా సాగుతోంది.గత కొద్ది రోజులుగా ఢిల్లీ రోడ్లపై సాగుతున్న ధర్నాల్లో మరే ఇతర విపక్ష నేతకూ కనీస ప్రాధాన్యం దక్కడం లేదు. టీవీ కెమెరాలు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా లైవ్‌లు.. ఇలా సమస్త ప్రచార వేదికలను రాహుల్, ప్రియాంక మాత్రమే హైజాక్ చేసేశారన్న ఆగ్రహం మిత్రపక్షాల్లో కనిపిస్తుంది.

చెన్నై మెట్రో ఫేజ్ 2 ప్రారంభం.. ప్రధాని మోదీతో కలిసి సీఎం విజయ్‌ తొలి ప్రయాణం!NationalSwechaa11 Oct 2026, 02:45 PM

చెన్నై మెట్రో ఫేజ్ 2 ప్రారంభం.. ప్రధాని మోదీతో కలిసి సీఎం విజయ్‌ తొలి ప్రయాణం!

 చెన్నై మహానగర ప్రజా రవాణా రంగంలో చారిత్రాత్మక మైలురాయి ఆవిష్కృతమైంది. చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఫేజ్-2లో అత్యంత కీలకమైన పూనమల్లి - వడపళని మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సంయుక్తంగా ప్రారంభించారు. పోరూర్ బైపాస్ స్టేషన్‌లో ఇరువురు నేతలు పచ్చజెండా ఊపి తొలి మెట్రో రైలు సర్వీసును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం అదే రైలులో కలిసి ప్రయాణించి, అందుబాటులోకి వచ్చిన అధునాతన ప్రయాణ వసతులు, స్టేషన్ల నిర్మాణ శైలిని పరిశీలించారు.

2 గంటల్లో సమస్యలు తీర్చడానికి ఇది సినిమా కాదు : పవన్ కళ్యాణ్ఏపీSwechaa11 Oct 2026, 02:35 PM

2 గంటల్లో సమస్యలు తీర్చడానికి ఇది సినిమా కాదు : పవన్ కళ్యాణ్

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఎదురైన సమస్యలు, వాటి పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వివరించారు. సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, సినిమాల్లో వలే రెండు గంటల్లో పూర్తి చేయడం సాధ్యం కాదని సంచలన కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ మాత్రం తెలియకుండానే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారని, సినిమాల్లో లాగా డైలాగ్స్ కొడితే పని జరగదని ఇంతకాలానికి తెలుసుకున్నారా? అని పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆదివారం పోలవరం జిల్లాలో పర్యటించిన ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. రంపచోడవరంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో బ్యా గ్రౌండ్ పాట పెట్టి కేవలం రెండున్నర గంటల్లోనే చాలా చేసేయవచ్చని అన్నారు. కానీ, నిజ జీవితంలో మాత్రం అలా కుదరదన్నారు. పన్నెండు, పదిహేను సంవత్సరాలు కింద మీద పడుతూ కష్టపడాల్సి ఉంటుందన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..ఏపీSwechaa11 Oct 2026, 02:17 PM

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రూట్ క్లియర్ అయ్యింది. రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల మేరకు పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఇటీవల బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవో 105కు సవరణలు చేసి కొత్తగా జీవో నెంబర్ 153ను జారీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.దీంతో త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉండగా, ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కూటమి సర్కార్ సిద్ధపడగా..ఇది రాజ్యంగం స్ఫూర్తికి విరద్ధమంటూ కొందరు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని తీర్పుచెప్పింది. దాంతో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును సమర్ధించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని ప్రకటించింది.

Samantha: మోడల్‌ టు హీరోయిన్..'సమంత' ఒంటరి పోరాటంసినిమాSwechaa11 Oct 2026, 02:16 PM

Samantha: మోడల్‌ టు హీరోయిన్..'సమంత' ఒంటరి పోరాటం

Samantha: అందరూ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో సక్సెస్ కాలేరు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నవాళ్ళే స్టార్స్‌గా ఎదుగుతారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సమంత. 500 రూపాయల కోసం వెల్కం గర్ల్‌గా ఎంట్రన్స్ లో నిలుచున్న సమంత, ఇప్పుడు పలు బ్రాండ్స్‌కి అంబాసిడర్, స్టార్ హీరోయిన్, నిర్మాత, బిజినెస్ ఉమెన్. సమంత జీవితాన్ని గనక ఆదర్శంగా తీసుకుంటే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో నిలబడతారు.

జంతర్‌మంతర్ చేరెదెలా? చక్రవ్యూహంలో బొద్దింకలు!టాప్ న్యూస్Swechaa11 Oct 2026, 01:55 PM

జంతర్‌మంతర్ చేరెదెలా? చక్రవ్యూహంలో బొద్దింకలు!

ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, కేంద్రఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి జంతర్ మంతర్ వద్ద నిరసనలకు పిలుపునివ్వడంతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా కేంద్రంలోని మోడీ సర్కార్ పటిష్ట చర్యలు చేపట్టింది. నీట్ పేపర్ లీకేజీ సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతల కారణంగా భారీగా ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. నిరసనకారులు రాళ్లు రువ్వడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో ఇరువర్గాలు గాయపడ్డాయి. ఈసారి అలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది.ఈ క్రమంలోనే ఆందోళనలు తెలిపేందుకు నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకోకుండా ఉండేందుకు కేంద్రం ‘చక్రవ్యూహాన్ని’ అమలు చేస్తున్నట్టు తెలిసింది.దీంతో యువత, నిరసనకారులు జంతర్ మంతర్ వద్దకు చేరుకునేలోపే వారిని బలగాలు నియంత్రిస్తున్నాయి.

Flash flood Nepal: మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్న ప్రకృతి..నేపాల్​లో మళ్లీ వరదలు!!..InternationalSwechaa11 Oct 2026, 01:41 PM

Flash flood Nepal: మానవాళి మనుగడకు ముప్పుగా మారుతున్న ప్రకృతి..నేపాల్​లో మళ్లీ వరదలు!!..

నేపాల్‌ గోర్ఖా జిల్లాలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. బుధిగండకి నదిలో ఒక్కసారిగా వరద పోటెత్తి 35కి పైగా ఇళ్లు, పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అప్రమత్తమైన అధికారులు నదీ పరివాహక ప్రాంత ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. నదిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్!తెలంగాణSwechaa11 Oct 2026, 01:19 PM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్!

 తెలంగాణ రాజకీయాల్లో ఓటర్ల జాబితా తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న పౌరులపై పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేయించడం సరికాదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నాయకత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి ఆయన బహిరంగ సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను, వారి వద్ద ఉన్న ఆధారాలతో సహా నేరుగా మీ ముందే హాజరుపరుస్తానని, దమ్ముంటే చర్చకు సిద్ధం కావాలని సవాల్ చేశారు.

RT 78-Thulabharam: కొత్త జానర్‌లో రవితేజ 'తులాబారం' మొదలు..సినిమాSwechaa11 Oct 2026, 01:13 PM

RT 78-Thulabharam: కొత్త జానర్‌లో రవితేజ 'తులాబారం' మొదలు..

RT 78-Thulabharam: టాలీవుడ్‌లో మాస్ మహారాజా రవితేజ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలలో ఈ మాస్ రాజాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న రవితేజ.. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ, టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ.

సస్పెండ్ అయిన వారే టార్గెట్.. హడలెత్తిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు!క్రైమ్Swechaa11 Oct 2026, 01:02 PM

సస్పెండ్ అయిన వారే టార్గెట్.. హడలెత్తిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు!

 అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఏసీబీ (Anti-Corruption Bureau) పేరును అడ్డుపెట్టుకుని కొందరు కేటుగాళ్లు భారీ వసూళ్ల దందాకు తెరలేపారు. సూర్యాపేట జిల్లాలో నకిలీ ఏసీబీ అధికారులంటూ ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్లు చేసి, అవినీతి కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. అందులోనూ ప్రత్యేకించి సస్పెండైన ఉద్యోగులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను లక్ష్యంగా చేసుకుని ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అభిజీత్ దీప్కే, సీజేపీ ప్రతినిధులకు కండిషనల్ బెయిల్..NationalSwechaa11 Oct 2026, 12:45 PM

అభిజీత్ దీప్కే, సీజేపీ ప్రతినిధులకు కండిషనల్ బెయిల్..

'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నేతలు అభిజీత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోశ్ రంకాలకు ఆదివారం ఉదయం షరతులతో కూడిన బెయిల్ మంజూరు అయ్యింది. రాబోయే ఒక సంవత్సరం పాటు శాంతిభద్రతలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు పాల్పడమనే షరతుపై ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్‌స్టేషన్‌లోని ఎగ్జిక్యూటీవ్ మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. మున్ముందు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు కూడా చేసినట్టు సమాచారం. కాగా, కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండుతో నిన్న జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు సీజేపీ పిలుపునివ్వగా.. వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్దఎత్తున హాజరయ్యారు. సీజేపీ ప్రతినిధులను మందస్తు అరెస్టులు చేసిన విషయం తెలిసిందే.

అట్టహాసంగా ‘ విజయవాడ ఉత్సవ్ 2.0’.. చంద్రబాబుకు మోదీ ప్రశంసలు!NationalSwechaa11 Oct 2026, 12:17 PM

అట్టహాసంగా ‘ విజయవాడ ఉత్సవ్ 2.0’.. చంద్రబాబుకు మోదీ ప్రశంసలు!

 ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక రాజధాని విజయవాడ నగరం దసరా వేడుకల శోభతో ముస్తాబైంది. శరన్నవరాత్రుల శుభవేళ విజయవాడలో అత్యంత వేడుకగా తలపెట్టిన ‘విజయవాడ ఉత్సవ్ 2.0’, దసరా వేడుకలు, 'సరస్ మేళా' అక్టోబర్ 11న ఒకే రోజు రావడంతో వేడుకలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రాండ్‌గా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల వేడుకలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా లేఖ రాస్తూ ప్రశంసలు గుప్పించారు.

సెంచరీ కొడతాం.. ఈసారి వారికే టికెట్లు : మాజీ సీఎం కేసీఆర్తెలంగాణSwechaa11 Oct 2026, 11:58 AM

సెంచరీ కొడతాం.. ఈసారి వారికే టికెట్లు : మాజీ సీఎం కేసీఆర్

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తన సన్నిహితుల వద్ద కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలోని ముఖ్యనేతలతో ఇటీవల సమావేశమైన కేసీఆర్.. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికల్లో వస్తే బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని, ‘సెంచరీ’ (వందకు పైగా సీట్లు) కొడతామని పేర్కొన్నట్టు సమాచారం. ఆరు గ్యారెంటీల పేరుతో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయడంలో ఫెయిల్ అయ్యిందని గుర్తుచేసినట్టు తెలిసింది. అంతేకాకుండా, రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులు నెలకొనగా వర్షాలు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, సాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకోవడం లేదని, అన్నదాతలు ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నట్టు సమాచారం.వర్షాలు లేక ప్రాజెక్టుల్లో నీళ్లు లేవని, సాగుకు నీరివ్వకపోవడంతో పంట పొలాలు ఎండుతున్నాయని, దీంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారని పార్టీ ముఖ్యలతో చర్చించినట్టు తెలుస్తోంది.

గజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు.. రైతును అవహేళన చేయడంపై కలెక్టర్ సీరియస్!తెలంగాణSwechaa11 Oct 2026, 11:49 AM

గజ్వేల్ తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు.. రైతును అవహేళన చేయడంపై కలెక్టర్ సీరియస్!

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకున్నాయి. భూ సమస్యతో కార్యాలయానికి వచ్చిన రైతును చూసి ‘నువ్వింకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?’ అంటూ అవహేళన చేసిన తహసీల్దార్ చిట్టంపల్లి స్వామి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన రెవెన్యూ డివిజనల్ అధికారి (RDO) సమర్పించిన నివేదిక ఆధారంగా కలెక్టర్ తహసీల్దార్‌ను సస్పెండ్ చేస్తూ తక్షణ ఉత్తర్వులు జారీ చేశారు.

Andhra Pradesh: ఫిరాయింపుల జోరు.. టీడీపీలో మొదలైన పోరు!!..ఏపీSwechaa11 Oct 2026, 11:37 AM

Andhra Pradesh: ఫిరాయింపుల జోరు.. టీడీపీలో మొదలైన పోరు!!..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పార్టీ మార్పుల వ్యవహారం ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపుతోంది. ఓవైపు వైసీపీ నుంచి టీడీపీలోకి నేతలు, కార్యకర్తల వలసలు కొనసాగుతుంటే.. మరోవైపు అధికార పార్టీలో పాత నేతలు, కొత్తగా చేరుతున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

VirenderSehwag: వైభవ్ ఆలోచనా విధానం నాలాగే ఉంది: సెహ్వాగ్క్రీడలుSwechaa11 Oct 2026, 11:32 AM

VirenderSehwag: వైభవ్ ఆలోచనా విధానం నాలాగే ఉంది: సెహ్వాగ్

 క్రికెట్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్ ప్రారంభంలో తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే వైభవ్ బ్యాటింగ్ శైలి, ఆలోచనా విధానం సరిగ్గా తనను పోలి ఉన్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన 'పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ' వార్షిక సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్.. యువ క్రికెటర్ సూర్యవంశీ ప్రతిభపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

దయచేసి నా భర్తను విడిచిపెట్టండి : ధ్రువ్ రాఠీ భార్యNationalSwechaa11 Oct 2026, 11:30 AM

దయచేసి నా భర్తను విడిచిపెట్టండి : ధ్రువ్ రాఠీ భార్య

కేంద్ర ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ నిన్న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వీరికి తోడు పలు లెఫ్ట్ వింగ్ విద్యార్థి సంఘాలు సైతం ఆందోళనల్లో పాల్గొన్నాయి. నిరసన కారుల్లో కొందరు రాళ్లు రువ్వగా వారిని చెదరగొట్టిన ఢిల్లీ పోలీసులు.. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి తరలించారు. ఇదిలాఉండగా, తన భర్తను విడిచిపెట్టాలని కోరుతూ యూట్యూబర్ ధృవ్ రాఠీ భార్య జ్యూలీ రాథీ సోషల్ మీడియా వేదికగా ఢిల్లీ పోలీసులను రిక్వెస్ట్ చేసింది. తన భర్త ఆచూకీ లభించడంలేదని, తన భర్తతో పాటు అతడి స్నేహితుల ఫోన్స్ కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దయచేసి ఢిల్లీ పోలీసులు కస్టడీ నుంచి తన భర్తను విడిచిపెట్టాలని వేడుకుంటూ కన్నీటి పర్యంతమైంది.

ఉక్రెయిన్ నాయకత్వం మారాల్సిందే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!InternationalSwechaa11 Oct 2026, 11:12 AM

ఉక్రెయిన్ నాయకత్వం మారాల్సిందే.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

 రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నాయి. రష్యాలోని కీలక ఆయిల్ రిఫైనరీలపై ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులు చేయడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో డీజిల్ ధరకు విపరీతమైన కొరత ఏర్పడి ధరలు మండిపోతున్నాయని ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ ప్రజలు తమ కోసం రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోగల కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జేబులోంచి ఫోన్ తీసే పనిలేదు.. కంటిచూపుతోనే యూపీఐ పేమెంట్స్!వ్యాపారంSwechaa11 Oct 2026, 10:55 AM

జేబులోంచి ఫోన్ తీసే పనిలేదు.. కంటిచూపుతోనే యూపీఐ పేమెంట్స్!

 డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతూ ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న 'ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) 2026' వేదికగా ఈ జియో ఏఐ గ్లాసెస్‌ను ప్రదర్శించింది. షాపింగ్ చేసినప్పుడు జేబులోంచి స్మార్ట్‌ఫోన్, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు బయటకు తీయాల్సిన అవసరం లేకుండా, కేవలం క్యూఆర్ కోడ్ వైపు చూసి మౌఖిక ఆదేశాలిస్తే చెల్లింపులు పూర్తయ్యేలా ఈ సాంకేతికతను రూపొందించారు.