స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

స్టార్ లింక్ ఎంట్రీతో అంబానీ లాభాలు తగ్గుతాయి.. కానీ! : ఎలాన్ మస్క్NationalSwechaa11 Oct 2026, 10:49 AM

స్టార్ లింక్ ఎంట్రీతో అంబానీ లాభాలు తగ్గుతాయి.. కానీ! : ఎలాన్ మస్క్

ప్రపంచ కుబేరుడు టెస్లా కార్ల సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ‘అంబానీ’ని టార్గెట్ చేస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ‘స్టార్ లింక్’ ఇండియాలో అడుగుపెట్టకుండా ఆయన అడ్డుకుంటున్నారని ఆరోపించారు. స్టార్‌లింక్ వస్తే ఇండియాలోని వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ దొరుకుతుందని పేర్కొన్నారు. అయితే, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, చవకైన ఇంటర్నెట్ భారత్‌లో ఇప్పటికే దొరుకుతోందని ఓ నెట్టిజన్ పోస్టు పెట్టారు. నెలకు 4 డాలర్లతో 60 జీబీ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ లభిస్తుందని రాసుకొచ్చాడు. స్టార్‌లింక్ అంటే కూడా ఇష్టమేనని భారత్‌లో వారికి లైసెన్స్ ఇవ్వాలని కోరారు. ఆ ట్వీట్‌‌కు మరో వ్యక్తి స్పందిస్తూ .. స్టార్ లింక్ భారత్‌లోకి వస్తే ఎలాంటి లాభం ఉండదని ట్వీట్ చేశారు. నెటిజన్ల ట్వీట్‌లపై ఎలాన్ మస్క్ స్పందించారు. అంబానీకి చెందిన ఇంటర్నెట్ దళారుల సైన్యం చేస్తున్న హాస్యాస్పద వాదనలకు ఏ మాత్రం అర్థం లేదని పేర్కొన్నారు. స్టార్ లింక్ ఇండియాలో ఎంట్రీ ఇవ్వడం వలన అంబానీ లాభాలు తగ్గుతాయి కానీ, ఆయన వ్యాపారం మూతపడదని స్పష్టంచేశారు.

ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ దర్శనం!SpiritualitySwechaa11 Oct 2026, 10:07 AM

ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరిగా కనకదుర్గమ్మ దర్శనం!

 విజయవాడలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ప్రతిరోజూ ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో తొలిరోజైన నేడు శ్రీ కనకదుర్గమ్మ తల్లి బాలాత్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దివ్యమంగళ రూపంలో అభయమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థాన అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

పూజలు చేయకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం.. నిరాశలో భక్తులు!తెలంగాణSwechaa11 Oct 2026, 09:46 AM

పూజలు చేయకుండానే దుర్గామాత విగ్రహం నిమజ్జనం.. నిరాశలో భక్తులు!

 నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ తీవ్ర కలకలం రేగింది. దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్ఠించాల్సిన దుర్గామాత విగ్రహానికి కనీసం ఒక్క పూజ కూడా చేయకుండానే నిమజ్జనం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీసింది. గ్రామ పరిధిలో అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడ ప్రతిష్ఠించాలనే ప్రతిపాదిత స్థలంపై రెండు స్థానిక రాజకీయ వర్గాల మధ్య ఏర్పడిన తీవ్ర వివాదమే ఈ దుస్థితికి కారణమైంది.

అమెరికాలో తెలుగు యువకుడికి 50  నెలల జైలు శిక్ష!ఏపీSwechaa11 Oct 2026, 09:35 AM

అమెరికాలో తెలుగు యువకుడికి 50 నెలల జైలు శిక్ష!

ఏపీకి చెందిన సత్తారు వెంకటేశ్ అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అక్కడ తనకు సాయం కోసం స్వరాష్ట్రానికి చెందిన మరో వ్యక్తిని పిలిపించుకుని టార్చర్ చేసిన కేసులో నిందితుడిగా తేలాడు. దీంతో అమెరికా ఫెడరల్ కోర్టు వెంకటేశ్ రెడ్డికి 50 నెలల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకివెళితే.. ఏపీలో వైసీపీ పార్టీకి సానుభూతి పరుడిగా ఉన్న సత్తారు వెంకటేశ్.. మిస్సోరిలోని సెయింట్ చార్లెస్ కౌంటీలో నివాసం ఉంటున్నాడు. అక్కడ పని ఉందని మరో వ్యక్తిని ఏపీ నుంచి రప్పించుకున్నాడు. అక్కడ సదరు వ్యక్తి సరిగ్గా పని చేయలేదనే నెపంతో విద్యుత్ తీగలు, పీవీసీ పైపులతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అంతేకాకుండా అతను బయట ఉన్నప్పుడు ఫోన్ చేసి ఇతరులతోనూ తీవ్రంగా దాడి చేయించినట్టు అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనలో మానవ అక్రమ రవాణా , బలవంతపు కార్మికుల చట్టాల ఉల్లంఘన, తీవ్ర భౌతికదాడుల అభియోగాలతో పాటు ఫెడరల్ ప్రభుత్వ నిధులను అక్రమంగా కాజేసిన ఆరోపణలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ అరాచకానికి పాల్పడిన వెంకటేష్ రెడ్డికి 50 నెలల జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధించింది.

హైదరాబాద్‌లో డ్రైవర్ లేకుండానే ట్యాక్సీలు.. సీఎం చేతిలో నివేదిక!తెలంగాణSwechaa11 Oct 2026, 09:18 AM

హైదరాబాద్‌లో డ్రైవర్ లేకుండానే ట్యాక్సీలు.. సీఎం చేతిలో నివేదిక!

 తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు, ప్రయాణికులకు మెరుగైన ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలు దిగిన ప్రయాణికులు కిందికి రాకుండానే, నేరుగా స్టేషన్ నుంచే గమ్యస్థానానికి చేరుకునేలా డ్రైవర్‌రెస్ పాడ్ ట్యాక్సీల (పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్-PRTS) ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఐటీ కారిడార్, సచివాలయం పరిసర ప్రాంతాల్లో మొత్తం 40.82 కిలోమీటర్ల మేర ఈ అధునాతన నెట్‌వర్క్‌ను నిర్మించాలని ప్రతిపాదిస్తూ ‘లీ అసోసియేట్స్’ సంస్థ రూపొందించిన సాధ్యాసాధ్యాల నివేదికను హెచ్‌ఎంఆర్‌ఎల్ (HMRL) అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశారు.

'పురుగుల మందు తాగలేదా?' అన్న వివాదంలో ట్విస్ట్.. ఎమ్మార్వోకు మద్దతుగా రైతు!తెలంగాణSwechaa11 Oct 2026, 09:00 AM

'పురుగుల మందు తాగలేదా?' అన్న వివాదంలో ట్విస్ట్.. ఎమ్మార్వోకు మద్దతుగా రైతు!

 సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ పీహెచ్ స్వామి ఓ రైతును ఉద్దేశించి ‘బతికే ఉన్నావా నువ్వు? పురుగుల మందు తాగలేదా?’ అన్న మాటలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వివాదంపై తాజాగా సదరు రైతు స్వయంగా స్పందించి నిజం ఏంటో చెప్పగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Saudi Arabia missile strike: కింగ్ ఖలీద్ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడి..12 మంది మృతి పలువురికి గాయాలు..InternationalSwechaa11 Oct 2026, 08:51 AM

Saudi Arabia missile strike: కింగ్ ఖలీద్ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడి..12 మంది మృతి పలువురికి గాయాలు..

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం పై ఇవాళ హౌతీలు జరిపిన క్షిపణి దాడిలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 300 మందికి పైగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వెల్లడించింది. మృతి చెందిన వారిలో నలుగురు సౌదీ పౌరులు కాగా.. మిగతా వారు బంగ్లాదేశ్ , అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఫెలిస్తీన్, సూడాన్‌లకు చెందిన విదేశీ నివాసితులు ఉన్నారని తెలిపింది..

Mythri Movie Makers: రణబాలికి ఇరుముడి స్ట్రాటజీ..!సినిమాSwechaa11 Oct 2026, 08:50 AM

Mythri Movie Makers: రణబాలికి ఇరుముడి స్ట్రాటజీ..!

Mythri Movie Makers: ఇటీవల వచ్చిన మాస్ మహారాజ్ రవితేజ నటించిన ఇరుముడి సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఇన్స్పిరేషన్‌గా నిలిచింది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకి ఈ సినిమా సాలీడ్ కంబ్యాక్ ఇచ్చింది. మైత్రీ వారు ఊహించని లాభాలను అందుకున్నారు. ఇరుముడి సినిమాకి వచ్చిన లాభాలలో మీడియం బడ్జెట్ సినిమాలు కనీసం 5 తీయోచ్చు. అంతగా, ఈ మూవీ నిర్మాణ సంస్థను పైకి తీసుకువచ్చింది.

అప్పుడు సమంత-నాగ చైతన్య, ఇప్పుడు విజయ్-రష్మిక!సినిమాSwechaa11 Oct 2026, 08:28 AM

అప్పుడు సమంత-నాగ చైతన్య, ఇప్పుడు విజయ్-రష్మిక!

టాలీవుడ్ స్టార్ కపుల్స్ గనక కలిసి సినిమా చేస్తే, ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అదే, రెమ్యునరేషన్. అంతేకాదు, ఇద్దరి డేట్స్ కూడా కలిసి ఇచ్చేయొచ్చు. దీని, వల్ల వీరికి సంబందించిన షూట్ మొత్తం ఏకాధాటిగా పూర్తి చేసుకొని ఇంకో సినిమాకి డేట్స్ సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు, టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న అదే చేస్తున్నారట.

Tollywood: రీషూట్ అంటే సినిమా ఫ్లాపేనా?సినిమాSwechaa10 Oct 2026, 11:31 PM

Tollywood: రీషూట్ అంటే సినిమా ఫ్లాపేనా?

Tollywood: ఎలాంటి టెక్నికల్ సపోర్ట్ లేనప్పుడు కూడా 35 నుంచి 40 రోజుల్లో సినిమాను పూర్తి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి స్టార్ హీరోలు అప్పట్లో మూడు షిఫ్టుల్లో పని చేసి ఏడాదికి అరడజను సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే వారు. దర్శకులు కూడా రాత్రికి రాత్రే కథ రాసేసేవాళ్ళు. దాసరి గారు నైట్ మొత్తం కూర్చొని సీన్స్ రాస్తుంటే, కోడి రామకృష్ణ వాటిని ఫెయిర్ చేసి బౌండెడ్ చేసేవారు.

Krishna Vamsi: నిజంగా రమ్య డేట్స్ చూస్తున్నాడా..మరి సినిమాలు?సినిమాSwechaa10 Oct 2026, 11:11 PM

Krishna Vamsi: నిజంగా రమ్య డేట్స్ చూస్తున్నాడా..మరి సినిమాలు?

Krishna Vamsi: ఎన్నో కష్టాలు పడి నాలుగైదు రోజుల పాటు తిండి కూడా తినకుండా సినిమా అంటే ఇష్టం, ప్రేమ, పిచ్చితో ఇండస్ట్రీలోనే నిలబడాలని రేయింబవళ్ళు కలలు కన్న దర్శకుల్లో కృష్ణ వంశీ ఒకరు. క్రియేటివ్ డైరెక్టర్‌గా పాపులర్ అయ్యాడు. రాంగోపాల్ వర్మ దగ్గర సహాయకుడిగా చేసి, ఆ తర్వాత దర్శకుడిగా బ్లాక్ బస్టర్స్ తీశాడు. కానీ, గత కొంతకాలంగా ఆయన నుంచి సినిమా రాలేదు. నిజంగా, ఒక దశలో స్వయంగా కృష్ణ వంశీ చెప్పినట్టుగానే భార్య రమ్య కృష్ణ డేట్స్ చూసుకుంటూ ఉండిపోయారా? ఇదే, ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో మాట్లాడుకుంటున్నారు.

Tollywood: కొందరు దర్శకులు చేస్తున్న తప్పే అది!సినిమాSwechaa10 Oct 2026, 11:00 PM

Tollywood: కొందరు దర్శకులు చేస్తున్న తప్పే అది!

Tollywood: దర్శకుడు అన్న తర్వాత అన్నీ జానర్ సినిమాలను చేయగల సత్తా ఉండాలి. అందరు హీరోలతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విషయంలో ఆర్జీవీ గ్రేట్ అని చెప్పాలి. ఆయన అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్ తో సినిమా చేశారు. సునీల్ లాంటి చిన్న హీరోతోనూ సినిమా తీశాడు. అంతేకాదు, అసలు క్రేజ్ లేని వాళ్ళతోనూ సినిమాలు తీశాడు.

Tollywood: కథ రాసుకోలేని దర్శకుల పరిస్థితేంటి?సినిమాSwechaa10 Oct 2026, 10:45 PM

Tollywood: కథ రాసుకోలేని దర్శకుల పరిస్థితేంటి?

Tollywood: కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్..ఇవి ఒక్కొక్కటి ఒక్కరు రాస్తుంటారు. అయితే, జనరేషన్ మారుతున్నా కొద్దీ ఈ మూడు రాసుకొని డైరెక్షన్ చేస్తున్న దర్శకులు ఇండస్ట్రీలో ఎక్కువైపోయారు. పూరి జగన్నాధ్ లాంటి వాళ్ళు బయట కథల మీద ఆధారపడింది లేదు. ఒక్క టెంపర్ సినిమా తప్ప. మిగతా సినిమాలన్నిటికీ పూరి కథకుడు, స్క్రీన్ ప్లే రైటర్, డైలాగ్ రైటర్. అందుకే, పూరి సినిమాలో హీరోలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు.

KTR: నచ్చినోళ్లకే దోచిపెట్టారు.. రేడియల్ టెండర్లను రద్దు చేయాల్సిందే: కేటీఆర్తెలంగాణSwechaa10 Oct 2026, 10:04 PM

KTR: నచ్చినోళ్లకే దోచిపెట్టారు.. రేడియల్ టెండర్లను రద్దు చేయాల్సిందే: కేటీఆర్

KTR: రేడియల్ రోడ్ల ప్రాజెక్టు కేటాయింపుల్లో పారదర్శకతను తుంగలో తొక్కి తమకు కావాల్సిన వారికే టెండర్లు కట్టబెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఏకంగా రూ.600 కోట్ల మేర లాస్ వచ్చేలా సాగిన ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రూల్స్‌కి విరుద్ధంగా పెద్ద పెద్ద పనులను చిన్న చిన్న ప్యాకేజీలుగా ముక్కలు చేసి, తక్కువ కోట్ చేసిన బిడ్డర్లను పక్కనపెట్టి ఎక్కువ రేట్లకు కోట్ చేసిన కాంట్రాక్టర్లకే దక్కేలా చక్రం తిప్పారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎల్ నినోపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలుతెలంగాణSwechaa10 Oct 2026, 09:54 PM

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్.. ఎల్ నినోపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

TG: తెలంగాణలో కరువు పరిస్థితులు, ఎల్ నినో ప్రభావంతో రైతులు, సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులపై స్వేచ్ఛ న్యూస్ వరుస కథనాలు రాసింది. పంటలు పండించడానికి చుక్కనీరు లేక రైతులు పడుతున్న అవస్థలు కళ్ళకు కట్టినట్టు వివరించింది. పెరిగిన ధరలు, బతుకు భారంతో సతమతమవుతున్న సామాన్య జనాల ఆవేదనను వరుస కథనాల్లో ప్రచురించింది. ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదని, చర్యలు చేపట్టడం లేదని విమర్శిస్తూనే.. ఇందుకు ఏమేం చేయాలో కూడా సూచనలు సలహాలతో స్వేచ్ఛ వివరించింది. ఎట్టకేలకు స్వేచ్ఛ కథనాలతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.

US: ట్రంప్ డబుల్ గేమ్! రష్యాతో అమెరికా డిజిల్ డీల్..NationalSwechaa10 Oct 2026, 09:20 PM

US: ట్రంప్ డబుల్ గేమ్! రష్యాతో అమెరికా డిజిల్ డీల్..

US: అంతర్జాతీయ వేదికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆడుతున్న డబుల్ గేమ్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు బట్టబయలైంది. ఉక్రెయిన్ సంక్షోభం సాకుతో రష్యా నుంచి చమురు కొంటున్న దేశాలపై అదనపు పన్నులు వేసిన అగ్రరాజ్యం.. సొంత దేశంలో తిప్పలు మొదలయ్యేసరికి అదే మాస్కో కాళ్ల వద్దకు చేరింది. ఏకంగా రష్యా నుంచే డీజిల్ కొనుగోలు చేసేందుకు ట్రంప్ ప్రభుత్వం డీల్ కుదుర్చుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని అవాక్కయ్యేలా చేసింది.రష్యా నుంచి ముడి చమురు కొనడం వల్ల పుతిన్ యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నారంటూ గత కొద్ది నెలలుగా ట్రంప్ గగ్గోలు పెట్టారు. భారత్‌పై ఏకంగా 25 శాతం అదనపు సుంకాలు విధించడమే కాకుండా, రష్యా ఇంధనాన్ని ముట్టుకుంటే 100 శాతం పన్నులు బాదుతామంటూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ప్రపంచాన్ని బెదిరించారు.

Sonam Wangchuk: 24 గంటల్లో వదలకపోతే నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్NationalSwechaa10 Oct 2026, 08:48 PM

Sonam Wangchuk: 24 గంటల్లో వదలకపోతే నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్

Sonam Wangchuk: ఢిల్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో అన్‌డిక్లేర్డ్ ఎమర్జెన్సీ తరహా వాతావరణం నెలకొందని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ఆరోపణలు చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో తలపెట్టిన నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపి కీలక నాయకులను అదుపులోకి తీసుకోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టయిన నేతలను 24 గంటల్లోగా విడుదల చేయకపోతే తాను స్వయంగా నిరాహార దీక్ష లేదా పాదయాత్ర చేపట్టే ఆలోచన చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

TG: జూబ్లీహిల్స్‌లో ఆడి కారు యవ్వారం.. తాగిన మైకంలో 4 గంటల హైడ్రామాతెలంగాణSwechaa10 Oct 2026, 08:16 PM

TG: జూబ్లీహిల్స్‌లో ఆడి కారు యవ్వారం.. తాగిన మైకంలో 4 గంటల హైడ్రామా

TG: జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి వేళ భారీ హైడ్రామా చోటుచేసుకుంది. వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఓ లగ్జరీ కారు డ్రైవర్, ఏకంగా నాలుగు గంటల పాటు నడిరోడ్డుపై పోలీసులకే ముచ్చెమటలు పట్టించాడు. కారు దిగడానికి నిరాకరిస్తూ, విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి తీవ్ర గందరగోళం సృష్టించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి సాధారణ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన AP 15 BL 0555 నంబర్ ఆడి కారును పోలీసులు ఆపారు. డ్రైవర్‌కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా, అతడు తాగి వాహనం నడుపుతున్నట్లు నిర్ధారణ అయింది.

ఏపీలో అస్సాం యువతి అనుమానాస్పద మృతి.. రైల్వే ట్రాక్ పక్కన డెడ్‌బాడీ..క్రైమ్Swechaa10 Oct 2026, 08:12 PM

ఏపీలో అస్సాం యువతి అనుమానాస్పద మృతి.. రైల్వే ట్రాక్ పక్కన డెడ్‌బాడీ..

Himashree Boro: అస్సాంకు చెందిన యువతి ఆంధ్రప్రదేశ్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే ట్రాక్ పక్కన యువతి డెడ్ బాడీ లభించింది. అస్సాం యువతి హిమశ్రీ బోరో మరణం ఏపీలో సంచలనంగా మారింది. యవతి మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిమశ్రీ డెత్ మిస్టరీ చేధించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఏపీ, అస్సాం ప్రభుత్వాలు ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించాయి.

విచారణకు అస్సాం సీఎం ఆదేశం

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆదేశాలతో ఆ రాష్ట్రానికి చెందిన ఐజీ శివప్రసాద్ శ్రీకాకుళం చేరుకున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 7 పోలీసు బృందాలు దర్యాఫ్తు చేస్తున్నాయి. హిమశ్రీ విగతజీవిగా పడి ఉన్న పెనుబర్తి, బొడ్డేపల్లి రైల్వే ట్రాక్ ను అస్సాం ఐజీ, శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి పరిశీలించారు. హిమశ్రీ మృతిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

చిత్రం లేదు
NationalSwechaa10 Oct 2026, 08:12 PM

Rahul Gandhi: యువత పోరాటాన్ని చూసి గర్విస్తున్నా.. రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం: రాహుల్ గాంధీ

Rahul Gandhi: రోడ్లెక్కి నిలదీస్తున్న యువత ధైర్యాన్ని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. అక్రమ కేసులతోనో, పోలీసుల బెదిరింపులతోనో ప్రజల గొంతు నొక్కడం ఎవరి వల్లా కాదని కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ, ఆరెస్సెస్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Bloody Romeo: షాకింగ్ మేకోవర్‌లో నానీ, జడల్ కట్!సినిమాSwechaa10 Oct 2026, 06:16 PM

Bloody Romeo: షాకింగ్ మేకోవర్‌లో నానీ, జడల్ కట్!

Bloody Romeo: టాలీవుడ్‌లో నేచురల్ స్టార్ గా నానికి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇటీవలే, ఈ యంగ్ హీరో ది ప్యారడైజ్ సినిమాతో వచ్చాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సినిమాను రెడీ చేస్తున్నాడు.

Tollywood: అంచనాలు పెంచితే సినిమాకి మైనసే కదా!సినిమాSwechaa10 Oct 2026, 06:00 PM

Tollywood: అంచనాలు పెంచితే సినిమాకి మైనసే కదా!

Tollywood: కొన్ని సినిమాలకి అంచనాలు పెంచడం అవసరం. కొన్ని సినిమాలకి అసలు ఎలాంటి అంచనాలు పెంచకపోతేనే మంచిది. బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతుంది. ఇలాంటి, మాటలు వినిపించేది మన టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్‌లోనే. అవును..కథా బలం ఉన్న సినిమాకి అంచనాలు పెంచితే అది రెట్టింపు స్థాయిలో వసూళ్ళను రాబడుతుంది. అలా, కాకుండా కథలో అసలు దమ్మే లేకుండా తీసిన సినిమాకి మరింత హైప్ ఇవ్వడం బూడిదలో పోసే పన్నీరే అవుతుంది.

MLC Elections: ఇదేనా పొత్తు ధ‌ర్మం టీడీపీని నిలదీస్తున్న జ‌న‌సేన!!..తెలంగాణSwechaa10 Oct 2026, 05:58 PM

MLC Elections: ఇదేనా పొత్తు ధ‌ర్మం టీడీపీని నిలదీస్తున్న జ‌న‌సేన!!..

ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మధ్య తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విభేదాలు భగ్గుమన్నాయి. నల్గొండ-ఖమ్మం-వరంగల్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి జనసేన అభ్యర్థి బరిలో నిలవగా.. టీడీపీ మాత్రం కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తోందని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.

ఏపీలో తమ మద్దతుతోనే చంద్రబాబు సీఎం అయ్యారని, మరి తెలంగాణలో తమకు టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కంటే పవన్ తమకు ఎక్కువ కాదనేలా టీడీపీ వ్యవహరిస్తోందంటూ జనసేన కార్యకర్తలు ఆ పార్టీ తీరును తప్పుపడుతున్నారు.

ఆర్టీసీ ఎన్నికల్లో ఓటమిపై మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్..తెలంగాణSwechaa10 Oct 2026, 05:52 PM

ఆర్టీసీ ఎన్నికల్లో ఓటమిపై మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్..

RTC Elections: తెలంగాణలో 10ఏళ్ల తర్వాత ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆర్టీసీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమాగా ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ మద్దతు తెలిపిన తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూ) ఓటమి పాలైంది. దీనిపై కాంగ్రెస్ పోస్టుమార్టం చేపట్టింది.

మంత్రులు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే ఓటమి!

ఆర్టీసీ ఎన్నికల్లో వైఫల్యంపై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. ఎన్నికల సరళిపై నివేదిక తెప్పించుకున్నారు. సొంత పార్టీ నేతలే ప్రత్యర్థి యూనియన్ కు మద్దతిచ్చారన్న విషయం నివేదికలో వెల్లడైంది. 4 జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల నిర్లక్ష్యం వల్లే ఓడిపోయామని మహేశ్ కుమార్ గౌడ్ కు నివేదిక అందినట్లు సమాచారం. ఖమ్మం, నల్గొండ మినహా మిగతా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లు ఆర్టీసీ ఎన్నికలను పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై పార్టీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో త్వరలో ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులతో మహేశ్ గౌడ్ భేటీ కానున్నారని తెలుస్తోంది.

టికెట్ రేట్లు పెంపు కూడా సినిమాను చంపినట్టేనా?సినిమాSwechaa10 Oct 2026, 05:31 PM

టికెట్ రేట్లు పెంపు కూడా సినిమాను చంపినట్టేనా?

Tollywood: కొత్తగా వచ్చే సినిమాకి టికెట్ రేట్లు పెంచడం అనేది సర్వ సాధారణం అయిపోయింది. 100 కోట్లు దాటితే, ఆ సినిమాకి టికెట్ రేట్లను పెంచేస్తున్నారు. ప్రీమియర్స్ అని, బెనిఫిట్ షోస్ అని 500 నుంచి 1000 రూపాయల వరకూ వసూలు చేస్తున్నారు. దీని వల్ల అభిమానులకే ఈ స్పెషల్ షోస్ తప్ప కామన్ ఆడియన్‌కి కాదని అర్థమవుతోంది. పోనీ సినిమా టికెట్ ఖరీదు ఉంటుందా.! అంటే అదీ లేదు. అసలు, టికెట్ రేట్లను ఎందుకు పెంచాలి.?

TCongress Incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్ ఉన్నట్టా? లేనట్టా?తెలంగాణSwechaa10 Oct 2026, 04:35 PM

TCongress Incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు ఇన్‌ఛార్జ్ ఉన్నట్టా? లేనట్టా?

TCongress Incharge: తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఓ విచిత్రమైన రాజకీయ సందిగ్ధత నెలకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల నిరీక్షణకు మాత్రం తెరపడటం లేదు. కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి, రాష్ట్ర నాయకత్వానికి మధ్య వారధిగా ఉండే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పాత్ర అత్యంత కీలకం. అయితే ప్రస్తుతం రాష్ట్ర పార్టీకి ఆ స్థాయి పెద్దదిక్కు ఉన్నారా లేరా అన్న చర్చ గాంధీ భవన్‌లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నెల రోజుల క్రితం ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారు. ఆమె విదేశాలకు వెళ్లి ఇంతకాలమైనా అధిష్టానం ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ చేయకపోవడంతో పార్టీ శ్రేణుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఆమె విదేశాల్లో ఉన్నప్పటికీ పార్టీ వ్యవహారాలను అక్కడి నుంచే పర్యవేక్షించే వెసులుబాటును అధిష్టానం ఇచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

BRS: అటు కాంగ్రెస్‌తో కలవలేక.. ఇటు బీజేపీ ముద్ర పడనీయక.. గులాబీ పార్టీలో డైలమా!NationalSwechaa10 Oct 2026, 04:18 PM

BRS: అటు కాంగ్రెస్‌తో కలవలేక.. ఇటు బీజేపీ ముద్ర పడనీయక.. గులాబీ పార్టీలో డైలమా!

BRS: దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చి ఎన్నికల సంఘం తీరుపై, 'స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్' (సర్) వ్యవహారంపై కేంద్రంపై యుద్ధం ప్రకటిస్తుంటే.. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ మాత్రం ఎటూ తేల్చుకోలేక తీవ్ర అయోమయంలో పడింది. అటు కాంగ్రెస్ నడుపుతున్న ఆందోళనల్లో భాగస్వామ్యం కాలేక, ఇటు బీజేపీకి అనుకూలమనే ముద్ర పడకుండా కాపాడుకోలేక గులాబీ బాస్‌లు తీవ్ర సందిగ్ధాన్ని ఎదుర్కొంటున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి దుమ్మురేపుతున్న వేళ, బీఆర్‌ఎస్ వైఖరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి.. నిద్రలోనే గుండెపోటుఏపీSwechaa10 Oct 2026, 04:08 PM

అమెరికాలో మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి.. నిద్రలోనే గుండెపోటు

Kiran: కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం నేత ఎంఏ గఫూర్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. గఫూర్, ఐద్వా నాయకురాలు నిర్మల కుమారుడు కిరణ్ అమెరికాలో మృతి చెందారు. కిరణ్ వయసు 41ఏళ్లు. కిరణ్ కాలిఫోర్నియాలో జాబ్ చేస్తున్నారు. అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. ఈ నెల 1వ తేదీన నిద్రలోనే కిరణ్ కు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన చనిపోయారు. ఈ విషయం కుటుంబసభ్యులకు ఆలస్యంగా తెలిసింది.

సీనియర్ డేటా సైంటిస్ట్

మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసిన కిరణ్.. న్యూయార్క్ యూనివర్సిటీలో డేటా సైన్స్ విభాగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. కాలిఫోర్నియాలోని పే పాల్ సంస్థలో సీనియర్ డేటా సైంటిస్ట్ గా పని చేస్తున్నారు. శాన్ జోస్ లో అపార్ట్ మెంట్ లో ఒంటరిగా నివాసం ఉంటున్నారు. కాగా, కొన్ని రోజులుగా కిరణ్ డ్యూటీకి రాకపోవడంతో కంపెనీ ప్రతినిధులు కిరణ్ ఫ్రెండ్స్ కి సమాచారం ఇచ్చారు.

Siddipet: మానవత్వం మరచిన గజ్వేల్ ఎమ్మార్వో.. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా?.. పురుగుల మందు తాగలేదా?..తెలంగాణSwechaa10 Oct 2026, 03:42 PM

Siddipet: మానవత్వం మరచిన గజ్వేల్ ఎమ్మార్వో.. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా?.. పురుగుల మందు తాగలేదా?..

అన్నదాత సుఖీభవ అంటాం.. దేశానికి వెన్నెముక రైతు అంటాం. కానీ అదే రైతు తన గోడును వెళ్లబోసుకోవడానికి ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే.. అతనికి ఎదురయ్యే చేదు అనుభవాలు ఎన్నో.. పొలంలో కలుపు తీసినంత సులువుగా సమాజంలోని అధికారుల్లో పెరుగుతున్న కలుపును తుంచలేక లోలోన కుమిలి పోయే రైతులు ఎందరో.. ఇక తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మార్వోకు సంబంధించినదిగా చెబుతున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన సమస్యను చెప్పుకునేందుకు వచ్చిన రైతుతో అధికారి మాట్లాడిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూమి కోల్పోతున్నానని, బ్రతుకుదెరువు ప్రశ్నార్థకమైందని తన గోడు వెళ్లబోసుకోవడానికి వెళ్లిన ఓ సామాన్య రైతును చూసిన ఎమ్మార్వో.. నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా.. అంటూ ప్రశ్నించడం సంచలనంగా మారింది.

TBJP: ‘అభ్యర్థి కావలెను’ తెలంగాణ బీజేపీలో విచిత్ర రాజకీయం!తెలంగాణSwechaa10 Oct 2026, 03:17 PM

TBJP: ‘అభ్యర్థి కావలెను’ తెలంగాణ బీజేపీలో విచిత్ర రాజకీయం!

TBJP: తెలంగాణ బీజేపీ పార్టీలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాషాయ శిబిరంలో ఒకవైపు విపరీతమైన పోటీ (అతివృష్టి), మరోవైపు కనీసం బరిలో నిలబడేందుకు నాయకులే ముందుకు రాని పరిస్థితి (అనావృష్టి) పార్టీ నాయకత్వాన్ని తలపట్టుకునేలా చేస్తోంది. రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఎదుర్కొంటున్న ఈ పరస్పర విరుద్ధ పరిస్థితులు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం ఏకంగా 28 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. కొందరు నేతలు తమకే టికెట్ ఖాయమన్న ధీమాతో గ్రౌండ్‌ లెవల్‌లో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. సంస్థాగత బలం, అర్బన్ ఓటర్ల మద్దతు పుష్కలంగా ఉండటంతో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువని భావించి నేతలంతా టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.