స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

TBJP: ‘అభ్యర్థి కావలెను’ తెలంగాణ బీజేపీలో విచిత్ర రాజకీయం!తెలంగాణSwechaa10 Oct 2026, 03:17 PM

TBJP: ‘అభ్యర్థి కావలెను’ తెలంగాణ బీజేపీలో విచిత్ర రాజకీయం!

TBJP: తెలంగాణ బీజేపీ పార్టీలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. వచ్చే ఏడాది స్టార్టింగ్‌లో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కాషాయ శిబిరంలో ఒకవైపు విపరీతమైన పోటీ (అతివృష్టి), మరోవైపు కనీసం బరిలో నిలబడేందుకు నాయకులే ముందుకు రాని పరిస్థితి (అనావృష్టి) పార్టీ నాయకత్వాన్ని తలపట్టుకునేలా చేస్తోంది. రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఎదుర్కొంటున్న ఈ పరస్పర విరుద్ధ పరిస్థితులు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కోసం బీజేపీలో విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో టికెట్ కోసం ఏకంగా 28 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకున్నట్లు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. కొందరు నేతలు తమకే టికెట్ ఖాయమన్న ధీమాతో గ్రౌండ్‌ లెవల్‌లో ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. సంస్థాగత బలం, అర్బన్ ఓటర్ల మద్దతు పుష్కలంగా ఉండటంతో ఇక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువని భావించి నేతలంతా టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.

మూడేళ్లుగా చిల్లర దాచి.. రూ.10నాణేలతో డ్రీమ్ బైక్ కొన్న పాస్టర్!వైరల్ న్యూస్Swechaa10 Oct 2026, 03:05 PM

మూడేళ్లుగా చిల్లర దాచి.. రూ.10నాణేలతో డ్రీమ్ బైక్ కొన్న పాస్టర్!

 క్రమశిక్షణతో కూడిన చిన్న పొదుపుతో కూడా పెద్ద కలలను నెరవేర్చుకోవచ్చని నిరూపించారు మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక వ్యక్తి. లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందిన పాస్టర్ రవి జోసెఫ్ గత మూడేళ్లుగా ఎంతో కష్టపడి దాచుకున్న రూ.10నాణేలతో ఏకంగా రూ.1.23లక్షల విలువైన నూతన ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాస్టర్ రవి జోసెఫ్ తనకు వచ్చిన రూ.10 నాణేలను ఖర్చు చేయకుండా ప్రత్యేకంగా దాచుకోవడం ప్రారంభించారు.

Hyderabad: బల్మూర్ వెంకట్ బడా వ్యాపారం.. అక్రమంగా నెలకు లక్షల్లో ఆదాయం!!..తెలంగాణSwechaa10 Oct 2026, 02:57 PM

Hyderabad: బల్మూర్ వెంకట్ బడా వ్యాపారం.. అక్రమంగా నెలకు లక్షల్లో ఆదాయం!!..

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బల్మూరు వెంకట్ పేరుతో సాగుతున్న ఇల్లీగల్ హోర్డింగ్స్ దందా నెలకు ముప్పై లక్షల అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది! అధికారిక అడ్వటైజింగ్ పాలసీని అక్కడ ఎందుకు అమలు చేయడం లేదు? కోట్ల రూపాయల ఈ అక్రమ వ్యాపారంపై నిలదీయాల్సిన నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అనే ప్రశ్నలను ఈ సందర్భంగా లేవనెత్తుతుంది.

RadialRoad2Scam: టెండర్లలో రూ.600కోట్ల స్కాం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన రాజగోపాల్ రెడ్డి!తెలంగాణSwechaa10 Oct 2026, 02:21 PM

RadialRoad2Scam: టెండర్లలో రూ.600కోట్ల స్కాం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కిన రాజగోపాల్ రెడ్డి!

 మంత్రివర్గంలో పదవి దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మధ్య విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కినట్లు తెలుస్తోంది. రేడియల్ రోడ్-2 టెండర్ల ప్రక్రియ ఈ ఇద్దరి నేతల మధ్య అగ్గిరాజేసింది. ముఖ్యమంత్రి అండదండలతోనే ఈ టెండర్లలో దాదాపు రూ.600కోట్ల మేర భారీ కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ రాజగోపాల్ రెడ్డికి చెందిన 'సుశీ ఇన్‌ఫ్రా' సంస్థ తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని (హైకోర్టు) ఆశ్రయించింది. తమను అన్యాయంగా అనర్హులుగా ప్రకటించి, రూ.600కోట్లు ఎక్కువ కోట్ చేసిన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించారని సుశీ ఇన్‌ఫ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.

మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేవంత్ రెడ్డి టార్గెట్ అదేనా?తెలంగాణSwechaa10 Oct 2026, 01:28 PM

మళ్లీ తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేవంత్ రెడ్డి టార్గెట్ అదేనా?

 తెలంగాణలో రోజురోజుకు తీవ్రతరమవుతున్న ప్రజా సమస్యలు, కరెంటు కోతలు, తాగునీటి ఇబ్బందులు, ఉమ్మడి ఉద్యోగ నోటిఫికేషన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రజలు, వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాలకు తెరతీశారనే విమర్శలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.  ప్రజల దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించే కుట్రలో భాగంగానే తాజాగా అత్యంత సున్నితమైన 'ఫోన్ ట్యాపింగ్' కేసును మళ్లీ తెరపైకి తీసుకురావాలని ప్రభుత్వం వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Hyderabad: చింతల్‌లో విషాదం.. చిన్నారిని బలి తీసుకున్న నిర్లక్ష్యం!!క్రైమ్Swechaa10 Oct 2026, 01:23 PM

Hyderabad: చింతల్‌లో విషాదం.. చిన్నారిని బలి తీసుకున్న నిర్లక్ష్యం!!

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంగారం మెరుగుపెట్టే కెమికల్ నోట్లో పెట్టుకుని రెండేళ్ల బాలిక మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం.. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం చింతల్‌లోని విష్ణు జువెలరీస్‌కు రెండు రోజుల క్రితం గోపికృష్ణ, జానకి దంపతులు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్లారు. వారితో పాటు తమ రెండేళ్ల కూతురు మిషాను కూడా వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రులు షాప్‌లో బంగారు ఆభరణాలను పరిశీలిస్తుండగా.. అక్కడే ఉన్న బంగారం చెక్ చేసే కెమికల్‌ను ఆ చిన్నారి నోట్లో పెట్టుకుంది. వెంటనే గమనించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ పాప మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని శోకంగా మారింది.

LandFraud: ఎమ్మెల్సీకే భూమి పేరుతో భారీ మోసం.. రూ.25లక్షల టోకరా!తెలంగాణSwechaa10 Oct 2026, 12:54 PM

LandFraud: ఎమ్మెల్సీకే భూమి పేరుతో భారీ మోసం.. రూ.25లక్షల టోకరా!

 హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన మాదాపూర్ 100ఫీట్ల రోడ్డులో తమది కాని భూమిని తమదేనని నమ్మించి, ఏపీ  కూటమి ప్రభుత్వ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యను రూ.25లక్షల మేర బురిడీ కొట్టించిన ఉదంతం కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే ఎమ్మెల్సీ రామచంద్రయ్యను లక్ష్యంగా చేసుకుని కొందరు కేటుగాళ్లు పక్కా వ్యూహంతో ఈ రియల్ ఎస్టేట్ మోసానికి తెగబడ్డారు. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. పేరూరి తులసీగోపాల్, అతని కుమారుడు గిరిధర్‌లు మాదాపూర్ 100 ఫీట్ల రోడ్డులోని ప్రైమ్ లొకేషన్‌లో తమకు 5.5ఎకరాల భూమి ఉందని ప్రచారం చేసుకున్నారు.

SIR.. సెగ! ఎవరు హిట్‌? ఎవరు ఫట్‌?NationalSwechaa10 Oct 2026, 12:49 PM

SIR.. సెగ! ఎవరు హిట్‌? ఎవరు ఫట్‌?

ఎన్నికల సంఘంపై కాంగ్రెస్‌, ఇండియా కూటమి పోరు.. వీధుల్లోకి సీజేపీ.. ధ్రువ్‌ రాఠీ ఎంట్రీతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఒకవైపు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌, ఇండియా కూటమి.. మరోవైపు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సీజేపీ హల్ చల్ చేస్తున్నాయి.

RythuBima: బిగ్ షాక్.. ‘రైతుబీమా’కు కాంగ్రెస్ మంగళం పాడిందా?తెలంగాణSwechaa10 Oct 2026, 12:23 PM

RythuBima: బిగ్ షాక్.. ‘రైతుబీమా’కు కాంగ్రెస్ మంగళం పాడిందా?

 తెలంగాణ(Telangana)లో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన ‘రైతుబీమా’(RythuBima) పథకం అమలుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) గత రెండు నెలలుగా బీమా ప్రీమియం సొమ్మును ఎల్‌ఐసీ(LIC)కి చెల్లించకపోవడంతో పథకం అమలు నిలిచిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రూ.5లక్షల బీమా పరిహార పథకాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

Telangana: బీఆర్ఎస్ ఆస్తుల లెక్కలు చెప్పావ్.. బీజేపీ నేతల ఆస్తుల సంగతేంటి రేవంత్?!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa10 Oct 2026, 12:04 PM

Telangana: బీఆర్ఎస్ ఆస్తుల లెక్కలు చెప్పావ్.. బీజేపీ నేతల ఆస్తుల సంగతేంటి రేవంత్?!

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఆస్తుల వివాదం రాజకీయంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. అంతే కాదు.. ఈ వివాదం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధానికి కొత్త అస్త్రంగా మారింది. ఇక గతంలో అధికారంలో ఉన్నవాళ్లు ఎంత సంపాదించారు.. ఎవరి ఆస్తులు ఎంత పెరిగాయి.. ప్రజాప్రతినిధుల ఆర్థిక ఎదుగుదల వెనుక ఉన్న కథేంటి.. అనే అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రస్తావించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

jantar-mantar-2.0: ఢిల్లీలో సీజేపీ ఆందోళన తీవ్రం.. అభీజీత్ దిప్కే, ధృవ్ రాఠీ అరెస్ట్!NationalSwechaa10 Oct 2026, 11:42 AM

jantar-mantar-2.0: ఢిల్లీలో సీజేపీ ఆందోళన తీవ్రం.. అభీజీత్ దిప్కే, ధృవ్ రాఠీ అరెస్ట్!

 కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలో తలపెట్టిన భారీ నిరసన ప్రదర్శన ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతిభద్రతల పేరుతో ఢిల్లీ పోలీసులు ముందస్తు అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసనకారులు ఆందోళనకు దిగడంతో పోలీసులు ప్రతిఘటించి భారీ ఎత్తున ముందస్తు అరెస్టులు చేపట్టారు. విమానంలో ముంబై నుంచి ఢిల్లీ చేరుకున్న సీజేపీ వ్యవస్థాపకుడు అభీజీత్ దిప్కే, కీలక నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, యూట్యూబర్ ధ్రువ్ రాఠీలను విమానాశ్రయం, నివాసాల వద్దనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

250 రోజుల ఆలస్యం.. విద్యాశాఖ అధికారులకు హైకోర్టు షాక్!తెలంగాణSwechaa10 Oct 2026, 11:30 AM

250 రోజుల ఆలస్యం.. విద్యాశాఖ అధికారులకు హైకోర్టు షాక్!

 ఒక కేసులో అప్పీల్ దాఖలు చేయడానికి ఏకంగా 250 రోజుల కాలయాపన చేసిన తెలంగాణ పాఠశాల విద్యాశాఖపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారుల నిర్లక్ష్య వైఖరిని తప్పుబడుతూ విద్యాశాఖకు రూ.25వేల జరిమానా విధిస్తూ డివిజన్ బెంచ్ చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఈ జరిమానా మొత్తాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా, అప్పీల్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆలస్యానికి కారకులైన అధికారుల జీతాల నుంచే వసూలు చేయాలని స్పష్టం చేసింది.

పక్షం.. పక్షపాతంస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa10 Oct 2026, 10:47 AM

పక్షం.. పక్షపాతం

బల్మూర్ బలాదూర్ ఎతులు

జుట్టుపై జూలాయి మాటలు

పేర్లు వద్దని అంటూనే ఒట్టి మాటలు

హెయిర్ ప్లాంటేషన్ చేసుకుంటే ఇంత గోల ఎందుకు?

పెద్దల సభకు ఎన్నికైన నువ్వు సభలో సమస్యల గురించి ఏనాడైనా మాట్లాడావా?

రెండేండ్లలో దోచుకున్నది ఎంతో చెప్పాలా?

ఖాళీగా కనిపించే యాడ్ బోర్డులపై బతికేస్తున్నతీరు తెలియదా?

ఎవరి మెప్పుకోసం చప్పటి సబ్జెక్ట్‌తో మీడియా ముందుకు వస్తున్నావ్?

అన్నింటిని ఒకే తాటిపై కడితే, ప్రజల సొమ్ము తినే మిమ్మల్ని ఎక్కడ కట్టాలి బల్మూర్?

ఉంగరాల దోస్తులకు వాచీల విలువ తెలియదా?

రాజకీయ నాయకులకు బంగారం సోకు ఉండదు అంట?

కాంగ్రెస్ నేతల భూములపై మక్కువ ఏంటో చెబుతావా?

రాహుల్, కేటీఆర్ అంటావు.. రేవంత్, హరీష్ రావు అని ఆ నోట ఎందుకు రాదు?

లోపాయికారి ఒప్పందాలు ఇంకా ఎన్నాళ్లు?

అందరి నేతలను ఒకే తాటిపై ఎప్పుడు చూస్తావు?

డబ్బులు తీసుకుని చేసే ఈ యాత్రలో ఆ లీడర్స్‌పై నీ అస్త్రాలు ఏవి?

అప్డేట్ రేవంత్ వెర్షన్ బీసీ రాజకీయాలేనా, డబ్బులు ఇచ్చే వారిపై ఉండవా?

అంబానీయే అసలు ప్రధానా..? మోదీ సర్కార్‌పై మస్క్ మాస్టర్ ప్లాన్ ఏంటి..?NationalSwechaa10 Oct 2026, 10:40 AM

అంబానీయే అసలు ప్రధానా..? మోదీ సర్కార్‌పై మస్క్ మాస్టర్ ప్లాన్ ఏంటి..?

భారతదేశంలో ఇంటర్నెట్ వ్యాపారం ఇప్పుడు మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్.. భారత పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీని లక్ష్యంగా చేసుకుని చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. అంబానీనే భారతదేశాన్ని పాలిస్తున్నారా? అన్న అర్థం వచ్చేలా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Telangana: తెలంగాణను ఏం చేద్దాం.. అనుకుంటున్నావ్.. రేవంత్?..తెలంగాణSwechaa10 Oct 2026, 10:39 AM

Telangana: తెలంగాణను ఏం చేద్దాం.. అనుకుంటున్నావ్.. రేవంత్?..

తెలంగాణ రైతాంగానికి ప్రకృతి పరీక్ష పెట్టబోతోందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.. ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావ పరిస్థితులు.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. సాగునీటి అవసరాలు.. విద్యుత్ డిమాండ్.. ఇవన్నీ రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగానికి సవాళ్ళు విసరనున్నాయనే చర్చ మొదలైంది.. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక అవసరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

150 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. దూసుకొస్తున్న సూపర్ ఎల్‌నినో!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa10 Oct 2026, 10:37 AM

150 ఏళ్ల రికార్డ్ బ్రేక్.. దూసుకొస్తున్న సూపర్ ఎల్‌నినో!

శీతాకాలంలో చలి గాలులు వీచాల్సిన వేళ భానుడు భగ్గుమంటున్నాడు. కాలచక్రం గతి తప్పి మధ్యాహ్నపు ఉష్ణోగ్రతలు చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటివరకు సాధారణ ఎల్‌నినోగా స్టార్ట్ అయిన ప్రకృతి వైపరీత్యం.. క్రమంగా ‘సూపర్ ఎల్‌నినో’గా, ఆపై ‘గాడ్జిల్లా ఎల్‌నినో’గా మారి, ఇప్పుడు విశ్వరూపం దాల్చింది. ఏకంగా 150 ఏళ్ల క్రితం నాటి చేదు రికార్డులను సైతం తుడిచిపెట్టేస్తూ భూమండలంపై ‘సూపర్ డూపర్ ఎల్‌నినో’ విరుచుకుపడుతోంది. ప్రపంచ వాతావరణ సంస్థతో పాటు అంతర్జాతీయ వాతావరణ పరిశోధకులు వెల్లడిస్తున్న తాజా నివేదికలు యావత్ ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

పూల పండుగ.. పితృ అమావాస్య!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa10 Oct 2026, 10:13 AM

పూల పండుగ.. పితృ అమావాస్య!

ప్రకృతిని మురిపించే పూలు ప్రాణంగా చూసుకున్న కుటుంబ పెద్దలు..

కాలగర్భంలో ఎప్పుడు కలిసిపోయినా,

ఈనాడు పూజలో నిలిచే పవిత్రాత్మలు

పేరున పితృ అమావాస్య.. పెద్దలకు బియ్యం అర్పించే పుణ్యదినం

బతుకు నేర్పిన పూల ఆటకు, పాటకు..

“మా బతుకే మీ వాళ్లది” అంటూ స్మరించుకునే రోజు

అరుదైన, పవిత్రమైన పూల ఆశీస్సులు.. పెద్దల దీవెనలు

పూలను పూజించే పండుగ శుభాకాంక్షలు

-దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

చైర్మన్, స్వేచ్ఛ న్యూస్

పేదరికం నుంచి నోబెల్ దాకా.. దక్షిణాఫ్రికాలో భారతీయుల కథేంటి?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa10 Oct 2026, 10:05 AM

పేదరికం నుంచి నోబెల్ దాకా.. దక్షిణాఫ్రికాలో భారతీయుల కథేంటి?

చెరకు తోటల్లో కూలీలుగా అడుగుపెట్టిన భారతీయులు.. వివక్షను ఎదుర్కొని నిలదొక్కుకున్న తరాలు.. అదే నేలపై పుట్టి అంతర్జాతీయ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించిన నవీ పిళ్లై. 2026 నోబెల్ శాంతి బహుమతితో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆమె నేపథ్యం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అసలు భారతీయులు దక్షిణాఫ్రికాకు ఎందుకు వెళ్లారు? అక్కడ వారి ప్రయాణం ఎలా సాగింది? దక్షిణాఫ్రికాలో జన్మించిన ఓ మహిళకు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఆమె పేరు నవీ పిళ్లై. పేరు వినగానే భారతీయ మూలాలు ఉన్న మహిళ అని చాలామందికి అనిపించవచ్చు.

Telangana: తెలంగాణలో ఏసీబీ ఉక్కుపాదం.. మూడేళ్ల అవినీతి ఆస్తుల లెక్కలు ఇవే!..తెలంగాణSwechaa10 Oct 2026, 09:55 AM

Telangana: తెలంగాణలో ఏసీబీ ఉక్కుపాదం.. మూడేళ్ల అవినీతి ఆస్తుల లెక్కలు ఇవే!..

తెలంగాణలో ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతోంది.. లంచగొండులు, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్న అవినీతి నిరోధక శాఖ వలలో తాజాగా మరో భారీ తిమింగళం పడింది.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబాబాద్ పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వాసంశెట్టి నరసింహారావును ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ నేతృత్వంలో ఏడు ప్రత్యేక బృందాలు... ఖమ్మంలోని నరసింహారావు నివాసంతో పాటు గరిడేపల్లి, మహబూబాబాద్, నేలకొండపల్లి, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ తో పాటు మొత్తం ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి.

JagtialMedicalCollege: రేకుల షెడ్డులోనే క్లాసులు!తెలంగాణSwechaa10 Oct 2026, 09:39 AM

JagtialMedicalCollege: రేకుల షెడ్డులోనే క్లాసులు!

రేకుల షెడ్డులోనే క్లాసులు, ఒక్కో రూమ్ లో 10 మంది అమ్మాయిలు, కామన్ వాష్ రూమ్స్.. చదువుకోవడానికి లైబ్రరీ లేదు, రవాణ సౌకర్యం లేదు, మెస్ కూడా లేదు.. ఇదీ జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులు. కనీస వసతులు కూడా లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్లు కావొస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

ఉపఎన్నికల్లో గెలిచి 109కి చేరిన టీవీకే బలం.. తప్పని మద్దతు పర్వం!NationalSwechaa10 Oct 2026, 09:16 AM

ఉపఎన్నికల్లో గెలిచి 109కి చేరిన టీవీకే బలం.. తప్పని మద్దతు పర్వం!

 తమిళనాడులో ఇటీవల జరిగిన మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఘనవిజయం సాధించింది. ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్(CM vijay) నాయత్వంలోని టీవీకే అభ్యర్థులు ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యంతో గెలుపొందడంతో, శాసనసభలో ఆ పార్టీ బలం 107 నుంచి 109కి పెరిగింది. అన్నాడీఎంకే తరఫున గతంలో గెలిచి, ఆ పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో చేరిన మరగతం కుమారవేల్ (మధురాంతకం), పి.సత్యభామ (ధారాపురం) మళ్లీ అదే స్థానాల నుంచి 'విజిల్' గుర్తుపై పోటీ చేసి విజయం సాధించడం విశేషం.

పోలీసుల దిగ్బంధంలో ఢిల్లీ.. జంతర్ మంతర్ వద్ద ఏడు అంచెల భద్రతా వలయం!NationalSwechaa10 Oct 2026, 08:52 AM

పోలీసుల దిగ్బంధంలో ఢిల్లీ.. జంతర్ మంతర్ వద్ద ఏడు అంచెల భద్రతా వలయం!

 దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతిపాదించిన భారీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో జంతర్ మంతర్ పరిసర ప్రాంతాలను పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, నిరసనకారులు పెద్ద ఎత్తున జంతర్ మంతర్‌కు తరలివస్తారనే పక్కా సమాచారంతో రాజధానిని ఒక సైనిక కోటగా మార్చేశారు. ఈ భద్రతా ఆంక్షలతో మధ్య ఢిల్లీలో అప్రకటిత బంద్ వాతావరణం నెలకొంది.

Hyderabad: ప్రజా రవాణా మెరుగుదలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. సమీక్షలో కీలక సూచనలు!..తెలంగాణSwechaa10 Oct 2026, 08:26 AM

Hyderabad: ప్రజా రవాణా మెరుగుదలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. సమీక్షలో కీలక సూచనలు!..

క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా స‌దుపాయాలు భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా మెరుగుప‌ర్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. క్యూర్ ప‌రిధిలో ప్ర‌జా ర‌వాణా మెరుగు, వివిధ ర‌హ‌దారుల అనుసంధాన‌త‌, రీసైకిల్డ్ వాట‌ర్ వినియోగంపై శుక్ర‌వారం రాత్రి ముఖ్య‌మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. న‌గ‌రంలో విప‌రీత‌మైన ర‌ద్దీ ఉన్న ప్రాంతాల్లో ప‌ర్స‌న‌ల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (PRT) సిస్ట‌మ్ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన అంశాల‌పై అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఆవేదన..కారణం ఇదేనా?సినిమాSwechaa10 Oct 2026, 07:47 AM

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ఆవేదన..కారణం ఇదేనా?

Vijay Devarakonda: ఈ మధ్య సినిమా ఇండస్ట్రీలో 'తొక్కేస్తున్నారు' అనే పదం చాలామంది స్టార్స్ వాడటం హాట్ టాపిక్‌గా మారింది. ఉదయ్ కిరణ్‌ని మెగాస్టార్ చిరంజీవి తొక్కేశాడని..అందుకే, మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పటికే చాలాసార్లు వార్తలు వచ్చాయి. ఇటీవల, ఓ ఈవెంట్‌లో కూడా చిరు ఈ మాటచెప్పి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ప్యారడైజ్ సినిమా ఈవెంట్‌లో మంచు మోహన్ బాబు కూడా ఇదే మాట అంటూ కామెట్స్ చేశాడు.

Allu-Lokesh: అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది?సినిమాSwechaa10 Oct 2026, 06:52 AM

Allu-Lokesh: అసలు ఈ వార్త ఎందుకు వచ్చింది?

Allu-Lokesh: ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ప్రతీ విషయంలో ముమ్మరంగా ఉంది. ఒక చిన్న విషయం కూడా నిజమో అబద్దమో తెలియకుండానే వైరల్ అవుతోంది. ముఖ్యంగా సినిమాలకి సంబందించిన విషయం ఐతే మరీ దారుణం. ఏకంగా, భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అనే ప్రచారం చేసేస్తున్నారు. ఈ మధ్య ఒక వార్త బాగా వైరల్ అయింది. అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందాల్సిన సినిమా క్యాన్సిల్ అయిందని వార్త వచ్చి వైరల్ అయింది. ఇది, మరీ విస్తృతం అవడంతో అల్లు అర్జున్ పిఆర్ టీమ్ రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.

పెత్రమాసం నుంచి తెలంగాణ ఆత్మగా బతుకమ్మ.. తొమ్మిది రోజుల పూల పండుగ వెనుక అసలు కథ ఇదే!తెలంగాణSwechaa10 Oct 2026, 12:31 AM

పెత్రమాసం నుంచి తెలంగాణ ఆత్మగా బతుకమ్మ.. తొమ్మిది రోజుల పూల పండుగ వెనుక అసలు కథ ఇదే!

తెలంగాణలో బతుకమ్మ అంటే కేవలం పూలను పేర్చి ఆడుకునే పండుగ కాదు. అది ఆడబిడ్డల అనుబంధం.. ప్రకృతితో ముడిపడిన జీవన విధానం.. తరతరాలుగా వస్తున్న జానపద సంపద. పెత్రమాసం రోజున ప్రారంభమయ్యే ఈ పూల పండుగ.. తొమ్మిది రోజులపాటు తెలంగాణ పల్లెలు, పట్టణాలను పాటలతో, పూల సోయగాలతో నింపేస్తుంది.

పేదరికం నుంచి నోబెల్ దాకా.. దక్షిణాఫ్రికాలో భారతీయుల కథేంటి?InternationalSwechaa09 Oct 2026, 11:51 PM

పేదరికం నుంచి నోబెల్ దాకా.. దక్షిణాఫ్రికాలో భారతీయుల కథేంటి?

చెరకు తోటల్లో కూలీలుగా అడుగుపెట్టిన భారతీయులు.. వివక్షను ఎదుర్కొని నిలదొక్కుకున్న తరాలు.. అదే నేలపై పుట్టి అంతర్జాతీయ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించిన నవీ పిళ్లై. 2026 నోబెల్ శాంతి బహుమతితో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆమె నేపథ్యం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. అసలు భారతీయులు దక్షిణాఫ్రికాకు ఎందుకు వెళ్లారు..?

Srinidhi Shetty: శ్రీనిధి విషయంలో ముందు నుంచీ అదే రూమర్స్!సినిమాSwechaa09 Oct 2026, 10:53 PM

Srinidhi Shetty: శ్రీనిధి విషయంలో ముందు నుంచీ అదే రూమర్స్!

Srinidhi Shetty: పాపం కొందరు హీరోయిన్స్ కి అనవసరమైన రూమర్స్, నెగిటివీతో కెరీర్ డ్యామేజ్ అవుతుంది. కొందరికి ఆశించిన అవకాశాలు రాకుండా పోతాయి. డెబ్యూ సినిమా భారీ హిట్ సాధించిందంటే ఆ తర్వాత ఎవరికి వాళ్ళు, ఈ హీరోయిన్ ఇంత డిమాండ్ చేస్తుందట..అంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. దాంతో, అసలు వాస్తవాలు తెలుసుకోకుండా మేకర్స్ అప్రోచ్ అవడం మానేస్తారు. బహుషా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కెరీర్‌లో కూడా ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.

Payal Rajput: ఒక సినిమాలో ఒప్పుకుంటే అన్నీ అలాంటివే చేస్తానా?సినిమాSwechaa09 Oct 2026, 10:12 PM

Payal Rajput: ఒక సినిమాలో ఒప్పుకుంటే అన్నీ అలాంటివే చేస్తానా?

Payal Rajput: ఒక హీరోయిన్ డెబ్యూ సినిమాలో చేసిన ప్రభావం..ఆ తర్వాత సినిమాల మీద ఎంతగా పడుతుందో చెప్పడానికి, పెద్ద ఉదాహరణ పాయల్ రాజ్‌పుత్. అప్పట్లో సావిత్రి మించిన హీరోయిన్స్ ఉన్నా కూడా ఆమెకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. మిగతా హీరోయిన్స్‌లా సినిమా మాత్రమే చేసి ఊరుకోలేదు. వ్యాపారంలోనూ అందవేసిన చెయ్యి. కార్రేసుంగ్‌లోనూ ఆమెను మించిన వాళ్ళు లేరని నిరూపించుకున్నారు.

Donald Trump: నోబెల్ పీస్ ప్రైజ్ మిస్సవ్వడంపై ట్రంప్ రియాక్షన్ వైరల్..NationalSwechaa09 Oct 2026, 10:08 PM

Donald Trump: నోబెల్ పీస్ ప్రైజ్ మిస్సవ్వడంపై ట్రంప్ రియాక్షన్ వైరల్..

Donald Trump: ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నోబెల్ శాంతి బహుమతి 2026’ మిస్ కావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పేందుకు తానే అసలైన అర్హుడినని భావిస్తున్న ఆయనకు ఈ అవార్డు దక్కకపోవడం ఇప్పుడు గ్లోబల్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం పిళ్లైకి నోబెల్ శాంతి బహుమతి వరించడంపై ఆయన పరోక్షంగా తన అసహనాన్ని బయటపెట్టారు.నోబెల్ శాంతి పురస్కారానికి తాను పూర్తి అర్హుడినని, అయితే రాజకీయ కారణాల వల్ల ఆ కమిటీ తనకు అవార్డు ఇవ్వకపోవచ్చని ట్రంప్ గతంలోనే కామెంట్స్ చేశారు. ఊహించినట్లే ఈసారి అవార్డు నవనీతం పిళ్లైకి దక్కడంతో, ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఓ సంచలన పోస్టును రీపోస్ట్ చేసి తన నిరసనను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ సీనియర్ అటార్నీ డేవిడ్ షొయెన్ పెట్టిన పోస్ట్‌ను ఆయన షేర్ చేయడంతో వివాదం మరింత రాజుకుంది.