National
09 Oct 2026, 08:58 PMNew Delhi: ఉత్కంఠ వాతావరణంలో న్యూఢిల్లీ.. లాక్ డౌన్ విధించిన అధికారులు!..
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఓట్ల చోరీ ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనకు అక్టోబర్ 10న పిలుపునిచ్చింది. గతంలో నీట్ అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాను కోరుతూ సీజేపీ చేపట్టిన ఆందోళనల్లో హింస చెలరేగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని, ఈసారి కేంద్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.





























