స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ట్యాంక్ బండ్ మీద పుట్టినరోజు వేడుకలు వద్దు  : సీపీ సజ్జనార్తెలంగాణSwechaa09 Oct 2026, 01:38 PM

ట్యాంక్ బండ్ మీద పుట్టినరోజు వేడుకలు వద్దు : సీపీ సజ్జనార్

హైదరాబాద్‌లో అర్ధరాత్రి వేళ ట్యాంక్ బండ్, సచివాలయం ఎదుట కొందరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. కార్లు, బైకుల మీద వచ్చి కేకు కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటుండంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.దీనికి తోడు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ తాజాగా ఈ వేడుకలపై ఘాటుగా స్పందించారు. ట్యాంక్ బండ్‌ మీద పుట్టిన రోజు సెలబ్రేషన్స్, కేక్ కటింగ్స్ చేయొద్దంటూ తల్లిదండ్రులు, యువతకు పిలుపునిచ్చారు. నగరంలోని ప్రధాన రహదారులు, చెరువులు, పార్కుల వద్ద కూడా రాత్రిళ్లు బర్త్ డే వేడుకలు జరపవద్దన్నారు. సంతోషంగా జరుపుకోవాల్సిన పుట్టినరోజు వేడుకలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తుండటంపై ఆయన స్పందించారు. రెండు రోజుల క్రితం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ట్యాంక్‌బండ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతుర్లు మరణించిన విషయాన్ని గుర్తుచేశారు.

ఎకరం రూ.200 కోట్లు.. రూ.10 వేల కోట్లు తెచ్చిన రేవంత్ రెడ్డి : మన్నె క్రిశాంక్తెలంగాణSwechaa09 Oct 2026, 01:13 PM

ఎకరం రూ.200 కోట్లు.. రూ.10 వేల కోట్లు తెచ్చిన రేవంత్ రెడ్డి : మన్నె క్రిశాంక్

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు.శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన భూముల కబ్జాలు, సీఎం తెచ్చిన అప్పులపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తాను ప్రెస్‌మీట్ నిర్వహించిన ప్రతిసారి పోలీసులు అరెస్టు చేయడం, బెదిరింపులకు గురిచేయడం చేస్తునన్నారని, అయినప్పటికీ వెనకడుగు వేసేది లేదని స్పష్టంచేశారు.అయితే, హైదరాబాద్ మహానగరం పరిధిలోని 818 ఎకరాల భూములు తాకట్టు పెట్టి సీఎం రేవంత్ రెడ్డి రూ.10 వేల కోట్లు అప్పు తెచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క ఎకరం విలువ రూ.200 కోట్లు ఉండగా.. ఎకరానికి కేవలం రూ.17 కోట్లకే తాకట్టు పెట్టారని ఆరోపించారు.ఏరియాల తాకట్టు పెట్టిన భూముల వివరాలు వెల్లడించారు.

JailorArrested: జైలర్‌గా విధులు.. అదే జైలులో ఖైదీ అయిన అధికారి!క్రైమ్Swechaa09 Oct 2026, 01:05 PM

JailorArrested: జైలర్‌గా విధులు.. అదే జైలులో ఖైదీ అయిన అధికారి!

 రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మహిళా ఖైదీల వేధింపులు, అధికార దుర్వినియోగం కేసులో పరారీలో ఉన్న మాజీ జైలర్ దివ్య చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా ఖైదీలను జైలు నిబంధనలకు విరుద్ధంగా బయటకు తీసుకెళ్లి తన సొంతింట్లో పనులు చేయించుకున్న కేసులో గత రెండు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఆమెను సైబర్ సెల్ సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఢిల్లీని చుట్టుముట్టిన నిరసనలు.. 57 మెట్రో స్టేషన్లపై ఆంక్షలు, రైళ్ల రద్దు! CJP వ్యూహమేంటి..?NationalSwechaa09 Oct 2026, 12:47 PM

ఢిల్లీని చుట్టుముట్టిన నిరసనలు.. 57 మెట్రో స్టేషన్లపై ఆంక్షలు, రైళ్ల రద్దు! CJP వ్యూహమేంటి..?

దేశ రాజధాని ఢిల్లీలో ఏం జరుగుతోంది..? ఒకవైపు నిరసనల పిలుపు.. మరోవైపు భారీ భద్రతా ఏర్పాట్లు.. ఇంకోవైపు మెట్రో స్టేషన్ల మూసివేత.. రైళ్ల రద్దు. ఇవన్నీ చూస్తుంటే రేపటి పరిణామాలపై అధికార యంత్రాంగం ఎంత అప్రమత్తంగా ఉందో అర్థమవుతోంది.

కర్ణాటక రాజకీయం హీట్.. మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ల కుట్ర?InternationalSwechaa09 Oct 2026, 12:46 PM

కర్ణాటక రాజకీయం హీట్.. మంత్రులపై స్టింగ్ ఆపరేషన్ల కుట్ర?

 కర్ణాటక రాజకీయాల్లో స్టింగ్ ఆపరేషన్లు (Sting Operations) ఆ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేబినెట్‌లోని ముఖ్యమైన మంత్రులను లక్ష్యంగా చేసుకుని రహస్యంగా నిఘా పెట్టడం, స్టింగ్ ఆపరేషన్లు నిర్వహించే కుట్రలు జరుగుతున్నాయంటూ ఏకంగా సీఎం ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామంపై కేంద్ర మంత్రి, జేడీఎస్ (JDS) అగ్రనేత హెచ్‌డీ కుమారస్వామి తీవ్రంగా మండిపడుతూ, ఇది డీకే శివకుమార్ ఆడుతున్న రాజకీయంలో భాగమేనంటూ తీవ్రస్థాయిలో ఎదురుదాడికి దిగారు.

రేవంత్‌  సొంతజిల్లాలో ఫుడ్ పాయిజన్.. బుద్ధితెచ్చుకోని సర్కార్!తెలంగాణSwechaa09 Oct 2026, 12:34 PM

రేవంత్‌ సొంతజిల్లాలో ఫుడ్ పాయిజన్.. బుద్ధితెచ్చుకోని సర్కార్!

రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కలుషిత ఆహారం తిని సాంఘీక సంక్షేమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.ఫుడ్ పాయిజన్‌తో పలువురు విద్యార్థులు మరణించిన ఘటనలు కూడా రాష్ట్రంలో చోటుచేసుకున్నాయి.అయినప్పటికీ సర్కార్ తీరులో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో ఫుడ్ పాయిజన్‌ జరిగింది.ఈ ఘటనలో 50 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.నొప్పి తట్టుకోలేక విద్యార్థినులు కంటతడి పెట్టుకుని విలవిల్లాడారు.బుధవారం రాత్రి ఘటన జరిగితే వీడియోలు బైటికి రాకుండా అధికార పార్టీ నేతలు తొక్కి పెట్టే ప్రయత్నం చేసినట్టు సమాచారం.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టుఏపీSwechaa09 Oct 2026, 12:12 PM

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సంచలన తీర్పు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు కల్పించిన 34 శాతం రిజర్వేషన్ల జీవోలను రద్దు చేస్తూ గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సరైనదే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను దేశఅత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానంలో వాడీవేడిగా వాదనలు జరిగాయి. క్షేత్రస్థాయి జనాభా లెక్కలు, ఎంపిరికల్ డేటా ఆధారంగానే బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని, స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కలుగజేసుకున్న ధర్మాసనం.. రాజ్యాంగబద్ధమైన 50 శాతం రిజర్వేషన్ల సీలింగ్‌ను అస్సలు దాట కూడదని తేల్చి చెప్పింది.

UPIPaymentsBan: తల్లిదండ్రులకు షాక్.. స్కూల్ బస్ ఫీజులకు యూపీఐ బంద్!NationalSwechaa09 Oct 2026, 11:43 AM

UPIPaymentsBan: తల్లిదండ్రులకు షాక్.. స్కూల్ బస్ ఫీజులకు యూపీఐ బంద్!

 మహారాష్ట్రలో స్కూల్ బస్ ఫీజుల చెల్లింపులకు సంబంధించి అక్టోబర్ 15 నుంచి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన డిజిటల్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో, యూపీఐ (UPI) ద్వారా ఫీజుల స్వీకరణను నిలిపివేయాలని స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ (SBOA) నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్ బస్ ఆపరేటర్లకు అధికారిక సర్క్యులర్ జారీ చేసింది.

‘సీఈసీ’ మెడపై వేలాడుతున్న కత్తి .. కాంగ్రెస్, సీజీపీకి తోడుగా బీఆర్ఎస్!టాప్ న్యూస్Swechaa09 Oct 2026, 11:40 AM

‘సీఈసీ’ మెడపై వేలాడుతున్న కత్తి .. కాంగ్రెస్, సీజీపీకి తోడుగా బీఆర్ఎస్!

దేశవ్యాప్తంగా ‘ఎస్ఐఆర్’ ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బీజేపీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను కాపాడుతూ.. ఇతర పార్టీల అనుకూల (అర్హుల) ఓట్లు తొలగిస్తున్నారని ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపిస్తున్నది. ఇండియా కూటమిలోని పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్.. ఈసీ సాయంతో ‘ఓట్ చోరీ’కి పాల్పడుతున్నదని ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే సీఈసీ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కాంగ్రెస్, ఇండియా కూటమిలోని పార్టీలు, సీజేపీతో పాటు తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ సైతం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీమామా చేయాలని డిమాండ్ చేశారు.

తమిళనాడులో విజయ్‌ దూకుడు.. ఉపఎన్నికల్లోనూ ముందంజ!NationalSwechaa09 Oct 2026, 11:06 AM

తమిళనాడులో విజయ్‌ దూకుడు.. ఉపఎన్నికల్లోనూ ముందంజ!

 తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్లు, తొలి రౌండ్ కౌంటింగ్ సరళి ప్రకారం రెండు స్థానాల్లోనూ టీవీకే అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. విపక్ష డీఎంకే (DMK) ద్వితీయ స్థానంలో, అన్నాడీఎంకే (AIADMK) మూడో స్థానంలో నిలిచాయి.

బండి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట.. గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు కీలక ఆదేశాలు!తెలంగాణSwechaa09 Oct 2026, 10:58 AM

బండి భగీరథ్‌కు హైకోర్టులో ఊరట.. గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు కీలక ఆదేశాలు!

 కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై నమోదైన పోక్సో (POCSO) కేసుకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌ను, వార్తలను టీవీ ఛానెళ్లు, సోషల్ మీడియా వేదికల్లో ప్రసారం చేయవద్దని న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ధర్మాసనం గురువారం సంచలన తీర్పునిచ్చింది. సదరు కేసులో తనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజూరైనప్పటికీ, కొన్ని టీవీ ఛానెళ్లు, ప్రైవేట్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నిరంతరం ఈ అంశాన్ని ప్రసారం చేస్తూ మీడియా ట్రయల్ నిర్వహిస్తున్నాయని భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు.

రైతుల గోడు కనిపించడం లేదా? మొద్దు నిద్రలో తెలంగాణ సర్కార్!తెలంగాణSwechaa09 Oct 2026, 10:36 AM

రైతుల గోడు కనిపించడం లేదా? మొద్దు నిద్రలో తెలంగాణ సర్కార్!

కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్లముందే ఎండిపోతుంటే రైతన్న గుండె చెరువవుతున్నది. అప్పులు చేసి, ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట చేతికందకపోతే ఆ రైతు పరిస్థితి ఏమిటి? రైతు ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా? అన్నదాతల గోడు సర్కార్‌కు పట్టడం లేదా?

30-40 ఏళ్ల నినాదం.. సిద్దిపేట జిల్లా కల సాకారం చేసిన కేసీఆర్ : హరీశ్ రావుతెలంగాణSwechaa09 Oct 2026, 10:26 AM

30-40 ఏళ్ల నినాదం.. సిద్దిపేట జిల్లా కల సాకారం చేసిన కేసీఆర్ : హరీశ్ రావు

సిద్ధిపేట జిల్లాగా ఏర్పడి పదేళ్లు పూర్తి చేసుకోనున్న తరుణంలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్థానికంగా ఏర్పాటు చేసిన 10కే రన్‌లో పాల్గొన్నారు.అంతకుముందు ‘పదేళ్ల సిద్దిపేట జిల్లా పండుగ’ వేడుకలను ఘనంగా ప్రారంభించారు.సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి 10K రన్‌ను జెండా ఊపి ప్రారంభించగా.. భారీ సంఖ్యలో పాల్గొన్న యువత, క్రీడాకారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జిల్లా ‘దశాబ్ది పండుగ’ సంబురాలు వైభవంగా సాగుతాయని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 30-40 ఏళ్ల నాటి ఎన్నికల నినాదం, సిద్దిపేటను జిల్లా చేయాలనే గోడ రాతల కలను కేసీఆర్ నిజం చేశారు. 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లాగా ఏర్పడగా.. 2026 అక్టోబర్ 11తో పదేళ్లు నిండుతున్నాయి. 1983లో ఎన్టీఆర్‌కు అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం ఇచ్చిన కేసీఆర్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అదే చేతితో సంతకం చేసి జిల్లాను ప్రసాదించారు.

దేశంలోనే అధిక ఓట్లకోత.. బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసిందా?NationalSwechaa09 Oct 2026, 10:26 AM

దేశంలోనే అధిక ఓట్లకోత.. బీజేపీ తెలంగాణను టార్గెట్ చేసిందా?

తెలంగాణలో చేపట్టిన ముందస్తు ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (SIR) ప్రక్రియ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఈ సమగ్ర సవరణ ద్వారా దాదాపు 95 లక్షల ఓట్లను (27.8 శాతం) ఎన్నికల సంఘం తొలగించినట్లు సమాచారం అందుతోంది. సవరణ ప్రక్రియ ప్రారంభానికి ముందు తెలంగాణలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉండగా, పరిశీలన ముగిసేసరికి ఈ సంఖ్య కేవలం 2.43 కోట్లకు పడిపోనుంది. విదేశాల్లో నివసించే భారతీయుల (NRI) ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 6,270 మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉంది. అయితే, తొలగింపుల శాతం దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్‌లో ఉండటం చర్చకు దారితీస్తోంది.

చిన్నారిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన తల్లి.. ఎందుకంటే?తెలంగాణSwechaa09 Oct 2026, 09:59 AM

చిన్నారిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన తల్లి.. ఎందుకంటే?

హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఆరేళ్ల కూతురిని హుస్సేన్ సాగర్‌లో విసిరేసి వెళ్లిపోయింది. బాధిత చిన్నారి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోందని సమాచారం. వైద్యం చేయించడానికి డబ్బులు లేక, సాయం చేసేవారు రాక నిస్సహాయత వల్లే ఇలా చేసినట్టు తెలుస్తోంది. నగరంలోని ఓల్డ్ బోయినపల్లి హస్మత్‌పేట్‌లో నివాసం ఉంటున్న షబానాకు ఇద్దరు కూతుళ్లు. తన భర్త వదిలేయడంతో ఇళ్లల్లో పని చేస్తూ కూతుళ్లను పోషించుకుంటోంది.అయితే, రెండో కూతురు రుక్సానా (6) గత కొంతకాలంగా పేగు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతోందని తెలిసింది. వైద్యం చేయించే స్థోమత ఆమెకు లేదు. సాయం కోసం చేతులు చాచినా ఎవరూ ముందుకు రాలేదని తెలుస్తోంది.కట్టుకున్న వాడు వదిలేసిపోవడంతో ఒంటరైన షబానా.. ఎవరి నుంచి సాయం అందకపోవడంతో చివరకు కన్న బిడ్డను హుస్సేన్ సాగర్‌లో విసిరేసింది.

ఆదివాసీ భూముల్లో  అగ్రి మినిస్టర్ కుట్రలు!తెలంగాణSwechaa09 Oct 2026, 09:09 AM

ఆదివాసీ భూముల్లో అగ్రి మినిస్టర్ కుట్రలు!

ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉన్న 30 ఎకరాల భూదాన్ భూముల్లో ఈ ఏడాది ఫిబ్రవరి 25 (25-02-2026)న 600 ఇళ్లను కూల్చివేశారు. 2014లోనే పట్టాలు ఇచ్చి, హౌస్ నెంబర్స్‌తో పాటు సీసీ రోడ్లు ఉన్నాయి. అయినా కానీ నకిలీ పట్టాలిచ్చి లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో 10 ఎకరాల్లో నిర్మాణాలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. పామాయిల్ పంట ప్రొత్సహించాలనే ఉద్దేశంతో ఆదివాసీలకు చెందిన భూములను పెద్ద ఎత్తున లీజులకు తీసుకున్నారు. అందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బంధువులు భద్రాది కొత్తగూడెం ఏజెన్సీ గ్రామాల్లో 2 వేల ఎకరాలను చేతుల్లోకి తీసుకున్నారు.

YashasviJaiswal: కొత్త అవతారంలో టీమిండియా ఓపెనర్.. వికెట్ కీపింగ్‌పై ఫోకస్!క్రీడలుSwechaa09 Oct 2026, 08:50 AM

YashasviJaiswal: కొత్త అవతారంలో టీమిండియా ఓపెనర్.. వికెట్ కీపింగ్‌పై ఫోకస్!

 టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఆటలో మరొక నూతన నైపుణ్యాన్ని జోడించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే తన విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు అప్పుడప్పుడు లెగ్ స్పిన్ బౌలింగ్ వేసే జైస్వాల్, ప్రస్తుతం వికెట్ కీపింగ్‌పై దృష్టి సారించాడు. రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌కు ముందు ముంబై రంజీ జట్టు కొత్త కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ విలేకరుల సమావేశంలో ఈ ఆసక్తికర విషయాన్ని అధికారికంగా వెల్లడించాడు. ఆధునిక టీ20, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రతీ ఆటగాడూ బహుముఖ ప్రజ్ఞ (All-round Abilities) కలిగి ఉండటం అత్యంత అవసరంగా మారింది.

Telangana:రాష్ట్రంలో విద్యుత్ కోతలకు త్వరలో చెక్-రేవంత్ రెడ్డి కేబినెట్ కీలక నిర్ణయం!!తెలంగాణSwechaa09 Oct 2026, 08:31 AM

Telangana:రాష్ట్రంలో విద్యుత్ కోతలకు త్వరలో చెక్-రేవంత్ రెడ్డి కేబినెట్ కీలక నిర్ణయం!!

రాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్​సిస్టమ్​(BESS​) ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. 4 వేల మెగావాట్ల బీఈఎస్​ఎస్​ ప్లాంట్ల ఏర్పాటుకు త్వరలో టెండర్లు పిలవనుంది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్​మీటింగ్​లో నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల పీక్​ టైమ్​లో కరెంట్​ కోతలు లేకుండా గ్రీన్​ఎనర్జీ వాడుకునేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 375 మెగావాట్ల బీఈఎస్ఎస్ కరెంట్ గ్రిడ్ కు అనుసంధానం చేశారు.

Telangana: భానుడి భగభగలు.. తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక!..తెలంగాణSwechaa09 Oct 2026, 07:45 AM

Telangana: భానుడి భగభగలు.. తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక!..

మానవ తప్పిదాలు, విపరీతమైన కాలుష్యం కారణంగా పసిఫిక్ మహాసముద్రం గత కొన్నేళ్లుగా తనలో నిల్వ చేసుకున్న వేడిని ఒక్కసారిగా వాతావరణంలోకి విడుదల చేస్తోందని, ఈ క్రమంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో తూర్పు, మధ్య ఉష్ణమండల పసిఫిక్ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2.7 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశం ఉందని.. దీని వల్ల రాబోయే డిసెంబర్ నాటికి ఈ ఎల్ నినో గరిష్ఠ స్థాయికి చేరుకుని, ఫిబ్రవరి వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

కేసులకు రైతులు భయపడరు- ఎంపీ డీకే అరుణతెలంగాణSwechaa09 Oct 2026, 12:30 AM

కేసులకు రైతులు భయపడరు- ఎంపీ డీకే అరుణ

DK Aruna: జూరాల నీటి విడుదల కోసం పోరాటం చేసిన రైతులు, రైతుల పక్షాన పోరాటం చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని.. ఇలాంటి బెదిరింపులకు రైతులు భయపడరని ఎంపీ డీకే అరుణ అన్నారు. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయాల్సిందే.. పంటలు కచ్చితంగా కాపాడాల్సిందే అని తేల్చి చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కర్ణాటకకు వెళ్లి నీళ్ళు తెస్తామని పెద్ద డ్రామా చేశారని, వాళ్ల మాటలన్నీ పచ్చి అబద్దాలని మండిపడ్డారు.

హస్తినలో రాహుల్ గాంధీగిరి.. మరి ఆ మిత్రులేరి?NationalSwechaa09 Oct 2026, 12:05 AM

హస్తినలో రాహుల్ గాంధీగిరి.. మరి ఆ మిత్రులేరి?

ఎన్నికల సంఘం తీరును ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరుసగా ఆందోళనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల జాబితాలపై ఆయన చేస్తున్న ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. రాహుల్ రోడ్డెక్కారు.. మరి ఆయనతో కలిసి ఇండియా కూటమి మొత్తం ఎందుకు రోడ్డెక్కడం లేదు?

అమెరికా షాక్.. మన ఐటీ నిపుణుల గ్రీన్‌కార్డ్‌కు బ్రేక్?InternationalSwechaa08 Oct 2026, 11:17 PM

అమెరికా షాక్.. మన ఐటీ నిపుణుల గ్రీన్‌కార్డ్‌కు బ్రేక్?

అమెరికాలో ఉద్యోగం.. అక్కడే స్థిరపడాలనే కల.. గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఇది సర్వసాధారణం. అయితే ఇప్పుడు అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం ఈ ప్రయాణాన్ని మరింత కఠినంగా మార్చేలా కనిపిస్తోంది.

దేశంలో ఎల్‌‌‌‌‌‌‌‌నినో ఎఫెక్ట్ షురూ.. 10% నీటి కోతNationalSwechaa08 Oct 2026, 11:07 PM

దేశంలో ఎల్‌‌‌‌‌‌‌‌నినో ఎఫెక్ట్ షురూ.. 10% నీటి కోత

El nino: ఎల్ నినో.. పెను ప్రభావమే చూపుతోంది. దేశంలో అప్పుడే నీటి ఎద్దడి మొదలైపోయింది. ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావంతో రుతుపవనాలు ముఖం చాటేశాయి. చాలా చోట్ల వర్షాలే కురవలేదు. దీంతో తాగు నీటి సమస్య ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటకలో తాగునీటికి కటకట ఏర్పడబోతోంది. జలాశయాల్లో నిల్వలు అడుగంటుతుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16 నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 10 శాతం తాగునీటి కోత విధించనుంది.

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు 10 నుంచే దసరా సెలవులుతెలంగాణSwechaa08 Oct 2026, 10:33 PM

తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు 10 నుంచే దసరా సెలవులు

Dasara Holidays: తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణలో అక్టోబర్ 10వ తేదీ నుండి 22 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 23న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10 వ తేదీ నుండి 21 వరకు సెలవులు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో వారాంతపు సెలవులతో కలిపి అక్టోబర్ 10 నుండి 21 వరకు పాఠశాలలకు సెలవులు వర్తిస్తాయి. అక్టోబర్ 22న స్కూల్స్ తిరిగి ప్రారంభమవుతాయి. కాగా, సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని విద్యాశాఖ ఆదేశించింది.

జూరాల రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన 3 టీఎంసీల హామీ ఏమైంది?తెలంగాణSwechaa08 Oct 2026, 09:32 PM

జూరాల రైతులకు.. ప్రభుత్వం ఇచ్చిన 3 టీఎంసీల హామీ ఏమైంది?

Jurala Water: కళ్ల ముందే పంటలు ఎండిపోతుండటంతో జూరాల ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కొరతతో భూములు నెర్రలువారుతుండగా, పొట్టదశలో ఉన్న పంటలకు సాగునీరు అందక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాగునీటిని విడుదల చేయాలంటూ గత నెలలో రైతులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో కర్ణాటక జలాశయాల నుంచి 3 టీఎంసీల నీటిని తెప్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, పది రోజులు గడిచినా ఇప్పటివరకు నీరు ఎందుకు విడుదల కాలేదన్న ప్రశ్నలు రైతుల్లో వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీ ప్రకారం నీటిని తీసుకురావడంలో జాప్యానికి కారణమేంటి? కర్ణాటకతో జరిగిన చర్చలు ఏ మేరకు ఫలించాయి? నీటి విడుదలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.

ఒక్కో గదిలో 10మంది అమ్మాయిలు, రేకుల షెడ్డులోనే క్లాసులుతెలంగాణSwechaa08 Oct 2026, 08:23 PM

ఒక్కో గదిలో 10మంది అమ్మాయిలు, రేకుల షెడ్డులోనే క్లాసులు

Jagtial: రేకుల షెడ్డులోనే క్లాసులు, ఒక్కో రూమ్ లో 10మంది అమ్మాయిలు, కామన్ వాష్ రూమ్స్.. చదువుకోవడానికి లైబ్రరీ లేదు, రవాణ సౌకర్యం లేదు, మెస్ కూడా లేదు.. ఇదీ జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో నెలకొన్న దారుణ పరిస్థితులు. కనీస వసతులు కూడా విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నాలుగేళ్లు కావొస్తున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

కనీస వసతులు కరవు..

జగిత్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. రెండో రోజు కూడా ఆందోళన కొనసాగించారు. కనీస వసతులు లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. నాలుగేళ్లు అవుతున్నా.. ఇంకా రేకుల షెడ్డులోనే క్లాసులు జరుగుతున్నాయని, హాస్టల్ లో వసతులు సరిగా లేవని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్, కాలేజీ కొత్త బిల్డింగ్ నిర్మాణ పనుల్లో పురోగతి లేదని తెలిపారు.

Tollywood-Cinema: సొంత కథ ఎక్కడుంది..?సినిమాSwechaa08 Oct 2026, 07:09 PM

Tollywood-Cinema: సొంత కథ ఎక్కడుంది..?

Tollywood-Cinema: మన అగ్ర దర్శకులే ఇతర భాషలలో హిట్ అయిన సినిమా కథ లైన్ పట్టుకొని ఇక్కడ హీరోలకి తగ్గట్టుగా కథను చుట్టేస్తున్నారు. కాబట్టే, ప్రతీసారి కాపీ కథ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు, ఒక భాషలో హిట్ అయిన సినిమాను కథ కొనుక్కొని ఇక్కడ హీరోల ఇమేజ్‌కి తగ్గట్టుగా మార్పులు చేసి రీమేక్ చేసేవారు. కానీ, ఇప్పుడు కొరియన్ భాషలో హిట్ అయిన సినిమాలను ఇక్కడ ఈజీగా దింపేస్తున్నారు.

National: నిరసనల వెనుక విపక్షాల కుట్ర?!.. వీరి అంతిమ అజెండా ఇదేనా?..NationalSwechaa08 Oct 2026, 06:51 PM

National: నిరసనల వెనుక విపక్షాల కుట్ర?!.. వీరి అంతిమ అజెండా ఇదేనా?..

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణపై విడుదల చేసిన గణాంకాలు, దానికి ప్రతిపక్షాలు చూపిస్తున్న నిరసన తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు 13 కోట్ల 39 లక్షల ఓట్లను తొలగించింది. ఇందులో మరణించిన వారివి 2 కోట్ల 80 లక్షలు కాగా, రెండు చోట్ల ఉన్న నకిలీ ఓట్లు కోటి రెండు లక్షలు. ఇక 6 కోట్ల 30 లక్షల మంది శాశ్వతంగా స్థానం మారగా, 3 కోట్ల లక్ష మంది ఇచ్చిన చిరునామాలో లేరు. మరో 26 లక్షల ఓట్లను ఇతర సాంకేతిక కారణాలతో తొలగించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.. అయితే వీటన్నింటికీ కేంద్ర ఎన్నికల సంఘం ఈ పక్కా ఆధారాలు చూపిస్తున్నప్పటికి విపక్షాలు మాత్రం ఏ ఒక్క నిరూపణా లేకుండా 13 కోట్ల ఓట్లను అక్రమంగా తొలగించారంటూ వీధుల్లో ఆందోళనలకు దిగడం వెనుక ఉన్న కారణం ఏంటనేది అర్థం కానీ ప్రశ్నలా మిగిలిందనే సందేహాలు తలెత్తుతున్నాయి..

Tollywood: గ్రాఫిక్స్ లేకుండా సినిమా చేయలేరా?సినిమాSwechaa08 Oct 2026, 06:31 PM

Tollywood: గ్రాఫిక్స్ లేకుండా సినిమా చేయలేరా?

Tollywood: పాన్ ఇండియా సినిమా..ఈ పదం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో భారీగా వినిపిస్తున్న మాట. హీరోలందరూ పాన్ ఇండియా సినిమాలను చేయాలనే తాపత్రయంతో ఉన్నారు. ఒక్క ఇండియాలో మాత్రమే కాకుండా ఇతర దేశాలలోనూ అభిమానులను సంపాదించుకున్న మన స్టార్స్ ..దాదాపుగా రీజనల్ సినిమాలను చేయడం మానేశారు. కథ మాత్రం ఇక్కడిదే, కానీ దానికి జోడిస్తున్న హంగులు మాత్రం దేశాలు దాటుతున్నాయి.

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు- హరీశ్ రావు సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa08 Oct 2026, 06:18 PM

సింగరేణి ప్రైవేటీకరణకు కుట్రలు- హరీశ్ రావు సంచలన ఆరోపణలు

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. సింగరేణి ప్రైవేటీకరణకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణిలో లాభాలు తగ్గిస్తూ, ఉత్పత్తిని తగ్గిస్తూ, దీన్ని ఒక ఫెయిల్యూర్ సంస్థగా చూపించి ప్రైవేటేజేషన్ వైపుగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. అటువంటి చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు హరీశ్ రావు.

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుడుతుందని హరీశ్ రావు ప్రకటించారు. అందులో భాగంగా ఈ నెల 14న రామగుండంలో భారీ బహిరంగ సభ పెట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ భవన్ లో సింగరేణి కార్మికులు, నేతలతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు హరీశ్ రావు.