స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Bullet train: హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంపై బిగ్ అప్ డేట్!..NationalSwechaa08 Oct 2026, 05:31 PM

Bullet train: హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణంపై బిగ్ అప్ డేట్!..

ప్రతిష్టాత్మక హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు పడింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో హైదరాబాద్-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్, సబ్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక స్థలాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.

నీళ్లు అడిగిన రైతులపై కేసులా? రేవంత్ సర్కార్‌పై నిరంజన్ రెడ్డి ఆగ్రహంతెలంగాణSwechaa08 Oct 2026, 04:22 PM

నీళ్లు అడిగిన రైతులపై కేసులా? రేవంత్ సర్కార్‌పై నిరంజన్ రెడ్డి ఆగ్రహం

Jurala Farmers: జూరాల రైతులపై కేసుల నమోదు వ్యవహారం దుమారం రేపుతోంది. రేవంత్ సర్కార్ తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు. రైతులపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎండిపోతున్న పంట పొలాలను కాపాడుకోవడం కోసం నీళ్లు అడిగిన రైతులపై కేసులు నమోదు చేస్తారా? అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయింది

పొలాలు ఎండుతున్నాయని జూరాల గేట్లు తెరిచి నీటిని వదిలిన రైతులపై గుట్టుచప్పుడు కాకుండా కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. 14మంది రైతుల మీద నమోదైన కేసులు వెంటనే ఎత్తివేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో కరెంట్ బిల్లులు కట్టలేదని ఒక్క గట్టు మండలంలోనే రైతుల మీద 3 వేల కేసులు నమోదు చేశారు.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు.

Telangana: అన్నమో రామచంద్రా అనాల్సిందేనా?.. గంజి నీళ్లకైనా గతి ఉంటుందా?..తెలంగాణSwechaa08 Oct 2026, 03:57 PM

Telangana: అన్నమో రామచంద్రా అనాల్సిందేనా?.. గంజి నీళ్లకైనా గతి ఉంటుందా?..

బియ్యం కేజీ వంద రూపాయలు మార్క్ దాటుతోంది. మార్కెట్లో ఇతర వస్తువుల ధరలు పెరిగినా బియ్యం విషయంలో ఆ దూకుడు ఎపుడూ కనిపించలేదు, ఇపుడు ఎల్ నినో పుణ్యామని హద్దులు దాటేస్తోంది. బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలను చూసి బడుగు జీవులు ఠారెత్తుతున్నారు. సాధారణ సన్న బియ్యం ధర చూస్తే గత నాలుగు నెలల క్రితం కిలో యాభై రూపాయల నుంచి 55 గా ఉంటే ఇపుడు అది ఏకంగా 85 రూపాయల దాకా ఎగబాకేసింది. ఇక తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాలలో పండుగ సీజన్ నాటికి కొన్ని రకాల బియ్యం ధరలు కిలో ఏకంగా వంద రూపాయలు దాటే అవకాశం ఉందని మిల్లు యజమానులు ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారు. అదే సమయంలో బాస్మతి వంటి ప్రీమియం రకాల ధరలు ఇప్పటికే కిలో 130 నుండి 240 పైనే పలుకుతున్నాయి.

కరీంనగర్ జిల్లాలో లంచగొండి ఖాకీలపై వేటుక్రైమ్Swechaa08 Oct 2026, 03:44 PM

కరీంనగర్ జిల్లాలో లంచగొండి ఖాకీలపై వేటు

Police Suspend: బాధితులకు న్యాయం చేయాల్సిన పోలీసులే అన్యాయం చేస్తున్నారు. బాధ్యతగా డ్యూటీ చేయాల్సిన ఖాకీలు దారితప్పుతున్నారు. కొందరు పోలీసులు లంచాలకు రుచి మరిగారు. ఛాన్స్ చిక్కితే చాలు దోచుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి వ్యవహారం ఒకటి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. లంచం డిమాండ్ చేసిన పోలీసులు అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.

నేను రెడీ.. నువ్వు సిద్ధమా? కేటీఆర్‌కు దానం ఓపెన్ సవాల్తెలంగాణSwechaa08 Oct 2026, 03:18 PM

నేను రెడీ.. నువ్వు సిద్ధమా? కేటీఆర్‌కు దానం ఓపెన్ సవాల్

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఓపెన్ సవాల్ విసిరారు.గురువారం ఇండియా కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీకి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో తనపై బరిలోకి దిగి పోటీ చేయాలని కేటీఆర్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు.ఉపఎన్నికకు తాను పూర్తిగా సిద్ధంగా ఉన్నానని, ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకుందామన్నారు. దానం నాగేందర్ అంటేనే ఓ బ్రాండ్ అని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నిక కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాబోతోందని సంచలన కామెంట్స్ చేశారు.

‘తీర్థాన్ని స్వీకరించకుండా నటన’.. వైఎస్ భారతిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!ఏపీSwechaa08 Oct 2026, 02:57 PM

‘తీర్థాన్ని స్వీకరించకుండా నటన’.. వైఎస్ భారతిపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

 వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని ఉద్దేశించి పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు వ్యక్తులు ఆలయాలకు వెళ్లినప్పుడు అర్చకులు ఇచ్చే తీర్థాన్ని స్వీకరించకుండా, తాగినట్లు నటిస్తూ వేళ్ల సందుల్లోంచి కిందకు వదిలేస్తారని, ఇదేనా వారు పాటించే సెక్యులరిజం అని ఎద్దేవా చేశారు. తాను స్వచ్ఛమైన హిందువునని, అన్ని మతాల ప్రార్థనా స్థలాలను గౌరవిస్తానని తిరుపతిలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.

నెల క్రితమే వేరొకరితో పెళ్లి.. ప్రియురాలు కాదన్నదని!క్రైమ్Swechaa08 Oct 2026, 02:53 PM

నెల క్రితమే వేరొకరితో పెళ్లి.. ప్రియురాలు కాదన్నదని!

విజయవాడకు చెందిన నాగరాజు (31)కు మూడేళ్ల కిందట తన ఇంట్లో కుటుంబంతో కలిసి అద్దెకు దిగిన వివాహితతో పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.అయితే, నాగరాజుకి పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో మూడు నెలల కిందట పక్కనున్న డాబాలోకి సదరు మహిళ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యింది. పెళ్లయిన 35 రోజుల తర్వాత నాగరాజు భార్య 16 రోజుల పండుగకు పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే వివాహితను మర్చిపోలేక తన ఇంట్లోకి తిరిగి అద్దెకు రావాలని అతడు ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.అందుకు సదరు మహిళ నిరాకరించింది.ఎవరి జీవితాలు వాళ్లు చూసుకుందామని హితవు పలికింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన నాగరాజు ఆమెను కత్తితో పొడిచి హత్యచేసి ఆపై తానూ పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.

సేవ్ డెమోక్రసీ ఉద్రిక్తం.. మంత్రులు, నేతల అరెస్టుతెలంగాణSwechaa08 Oct 2026, 02:31 PM

సేవ్ డెమోక్రసీ ఉద్రిక్తం.. మంత్రులు, నేతల అరెస్టు

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ 'సేవ్ డెమోక్రసీ' పేరిట నగరంలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు సంయుక్తంగా ఆందోళనా కార్యక్రమం చేపట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు గురువారం భారీ ర్యాలీ చేపట్టారు.కాంగ్రెస్, వామపక్ష నేతలు కలిసి నెక్లెస్ రోడ్ మీదుగా లోకభవన్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. "ప్రజాస్వామ్యాన్ని కాపాడండి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.అయితే, నిరసన కారులు లోక్‌భవన్‌కు చేరుకోకుండా నెక్లెస్ రోడ్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన కారులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి పలువురు మంత్రులు, నేతలను అరెస్టు చేశారు.

అబ్బో సీతాఫలం.. మార్కెట్లో డజన్ కాయల రేటు చూస్తే మైండ్ బ్లాకే!తెలంగాణSwechaa08 Oct 2026, 02:04 PM

అబ్బో సీతాఫలం.. మార్కెట్లో డజన్ కాయల రేటు చూస్తే మైండ్ బ్లాకే!

 ఎల్‌నినో (El Nino) ప్రభావం అన్ని ఆహారపదార్థాలపై పడుతోంది. ఇప్పటికే నీళ్లు లేక రైతులు పంటలు సాగుచేయడం కష్టతరంగా మారింది. ఉద్యాన పంటలకు సైతం ఈ ప్రభావం పడుతోంది. ఎన్నో పోషకాలు ఉండే సీజనల్ పండు సీతాఫలం ధరలు ఇప్పుడు అందనంత ఎత్తుకెళ్తున్నాయి. దిగుబడి భారీగా పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గతంలో డజన్ సీతాఫలాలు రూ.150 నుంచి రూ. 200 వరకు లభించగా, ప్రస్తుతం మార్కెట్లో నాణ్యమైన కాయల డజన్ ధర ఏకంగా రూ.400 నుంచి రూ.500వరకు పలుకుతోంది.

ప్రతి జిల్లాలో 5జీ.. ఖాతాల్లోకి రూ.50 లక్షల కోట్లు : ప్రధాని మోడీNationalSwechaa08 Oct 2026, 01:52 PM

ప్రతి జిల్లాలో 5జీ.. ఖాతాల్లోకి రూ.50 లక్షల కోట్లు : ప్రధాని మోడీ

దేశంలోని ప్రతిజిల్లాలో 5జీ సేవలు విస్తరించాయని, ఫలితంగా మొబైల్ ద్వారానే అన్నిరకాల ప్రభుత్వ సేవలు అందుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ఇంటర్నెట్ వేగం టెలికాం రంగం, మొబైల్ ఫోన్స్, నెట్‌వర్క్‌, స్పెక్ట్రమ్‌లకే పరిమితం కాలేదని.. సుపరిపాలనకు, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించే అత్యంత కీలక సాధనంగా మారిందన్నారు. ఢిల్లీలోని యశోభూమిలో గురువారం ప్రారంభమైన 10వ ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో మోడీ ప్రసంగించారు. ఇంటర్నెట్ వినియోగంతో వందలాది ప్రభుత్వ సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్ల‌ ద్వారా అందుబాటులోకి వచ్చాయని, ప్రభుత్వ సాయం లబ్ధిదారుల మొబైల్ ఫోన్‌లకు అనుసంధానించిన బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ జరుగుతోందన్నారు. దీంతో డిజిటల్ అనుసంధానిత విద్యకు మరింత ఊతం లభించిందని తెలిపారు. అయితే, టెలికాం, డిజిటల్ టెక్నాలజీ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతున్న క్రమంలో భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని అభిప్రాయపడ్డారు.

సర్కార్ కర్కశత్వం.. జూరాల రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు!తెలంగాణSwechaa08 Oct 2026, 01:35 PM

సర్కార్ కర్కశత్వం.. జూరాల రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు!

అన్నదాతల పట్ల రేవంత్ సర్కార్ కర్కశత్వంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగు కోసం నీళ్లు ఇవ్వలేదని అన్నదాతలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే, పంటలకు నీళ్లు ఇవ్వని సర్కార్.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడం, నీటి కోసం పోరాటాలు చేస్తున్నందుకు రివర్స్‌లో వారిమీదే కేసులు పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆయకట్టు రైతులు జూరాల ప్రాజెక్టు వద్ద ఆందోళనకు దిగడం పాటు అధికారుల ప్రమేయం లేకుండా నీటిని దిగువకు వదిలిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ పరిధిలో పంటలు సాగు చేస్తున్న రైతులపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రైతులకు సాగునీటి విడుదలకు నిరాకరించడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

జంతర్‌మంతర్ రావొద్దనే చెప్పే అధికారం మీకెవరిచ్చారు? : సీజేపీNationalSwechaa08 Oct 2026, 01:25 PM

జంతర్‌మంతర్ రావొద్దనే చెప్పే అధికారం మీకెవరిచ్చారు? : సీజేపీ

ఎస్ఐఆర్ పేరిట ఏకపక్షంగా ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఓవైపు కాంగ్రెస్, మరోవైపు సీజేపీ పార్టీలు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్టోబర్ 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపేందుకు తరలిరావాలని సీజేపీ పార్టీ యువతకు పిలుపునిచ్చింది. అయితే, జంతర్ మంతర్ వద్దకు ఎవరూ రావొద్దని ఢిల్లీ పోలీసులు సూచించారు. అయితే, ఢిల్లీ పోలీసుల తీరును 'కాక్రోచ్ జనతా పార్టీ'(CJP) తీవ్రంగా ఖండించింది. సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ (Saurav Das) సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. జంతర్ మంతర్ వద్ద ధర్నాకు రావొద్దంటూ పిలుపు ఇవ్వడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ప్రజలు నిరసనలో పాల్గొనాలా? వద్దా? అని అప్పీల్ చేయడానికి పోలీసులకు ఎవరు అధికారం ఇచ్చారు? అని ప్రశ్నించారు.

Kamal Hassan: భారతీయుడు 3..అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్..మళ్ళీ రిస్క్ అవసరమా?సినిమాSwechaa08 Oct 2026, 01:19 PM

Kamal Hassan: భారతీయుడు 3..అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్..మళ్ళీ రిస్క్ అవసరమా?

Kamal Hassan: దర్శకుడు శంకర్ రూపొందించిన సినిమాలలో ఖచ్చితంగా భారతీయుడు సినిమాకి సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. కానీ, ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ మాత్రం ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా నిరాశపరిచింది. ఇండియన్ 2మీద అటు తమిళంలో ఇటు తెలుగులో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, శంకర్ ఆ అంచనాలను 10 శాతం కూడా అందుకోలేదు. ఆ తర్వాత వచ్చిన గేమ్మ్ ఛేంజర్ మరో భారీ డిజాస్టర్.

శాటిలైట్ ఇంటర్నెట్ నిబంధనల్లో వివక్ష లేదు: కేంద్రం క్లారీటీNationalSwechaa08 Oct 2026, 01:06 PM

శాటిలైట్ ఇంటర్నెట్ నిబంధనల్లో వివక్ష లేదు: కేంద్రం క్లారీటీ

 భారతదేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ (SatCom) సేవలకు సంబంధించి అమలు చేస్తున్న నియంత్రణ వ్యవస్థ అత్యంత న్యాయబద్ధంగా, ఎలాంటి వివక్ష లేకుండా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గురువారం అధికారిక వివరణ విడుదల చేసింది. నాన్-జియోసింక్రోనస్ శాటిలైట్ ఆర్బిట్ (NGSO) ఆధారిత కమ్యూనికేషన్ సేవల కోసం ఇప్పటివరకు మూడు గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (GMPCS) సంస్థలకు టెలికాం లైసెన్సులు మంజూరు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

ఫ్యామిలీతో కలిసి ప్రముఖ యూట్యూబర్ మధుమిత పరార్..!వైరల్ న్యూస్Swechaa08 Oct 2026, 12:29 PM

ఫ్యామిలీతో కలిసి ప్రముఖ యూట్యూబర్ మధుమిత పరార్..!

ప్రముఖ యూట్యూబర్ మధుమిత మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళనాడులోని నాగర్‌కోవిల్‌ సమీపంలోని తమ్మత్తుక్కోణంకు చెందిన ఆమె తన భర్తతో కలిసి సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. భార్యభర్తలు ఇద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మధుమిత తన భర్తతో కలిసి ఇన్ స్టా, యూట్యూబ్‌లో ఫన్ వీడియోలు, రీల్స్ వంటివి చేస్తూ పేరు సంపాదించుకుంది.వీరి ఖాతాలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, ఇటీవల హోం టూర్ చేసిన మధుమిత తన ఇంట్లో ఉన్న దొంగతనం జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మధుమిత ఫ్యామిలీతో కలసి కనిపించకుండా పోయారు.

Mamitha Baiju: ప్రశాంత్ వర్మ సినిమాలో మమితా బైజు!సినిమాSwechaa08 Oct 2026, 12:28 PM

Mamitha Baiju: ప్రశాంత్ వర్మ సినిమాలో మమితా బైజు!

Mamitha Baiju: అ.! సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలోను పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. సాధారణంగా యువ దర్శకులెవరైనా స్టార్ స్టేటస్ వచ్చే వరకూ పక్కా కమర్షియల్ సినిమాలనే చేస్తూ మార్కెట్‌ను పెంచుకుంటారు. కానీ, వాళ్ళకి భిన్నంగా ప్రశాంత్ వర్మ..తన యూనివర్స్ నుంచి కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

Mahesh-Lokesh: క్రేజీ కాంబోలో పాన్ ఇండియా మూవీ?సినిమాSwechaa08 Oct 2026, 12:04 PM

Mahesh-Lokesh: క్రేజీ కాంబోలో పాన్ ఇండియా మూవీ?

Mahesh-Lokesh: సూపర్‌స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్క్జెట్ సినిమా కి సన్నాహాలు చేతున్నారంటూ తాజాగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ కాంబినేషన్‌పై టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ హాట్ గా చర్చ మొదలైంది. ఇంతకీ, మహేష్–లోకేష్ సినిమా నిజంగానే ఉంటుందా? దీనిపై, క్లారిటీ రావాలంటే వారణాసి సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.

3.71 లక్షల పీఎం ఆవాజ్ యోజన ఇళ్లు రద్దు!ఏపీSwechaa08 Oct 2026, 12:02 PM

3.71 లక్షల పీఎం ఆవాజ్ యోజన ఇళ్లు రద్దు!

ఏపీలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (PMAY) అర్బన్ 1.0 పథకం కింద కేటాయించిన ఇండ్లను కేంద్రం తాజాగా రద్దు చేసింది. 2024 కంటే ముందు మంజూరై ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు ప్రారంభించని దాదాపు 3.71 లక్షల గృహాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పీఎంఏవై అర్బన్ 1.0 పథకం గడువు వాస్తవానికి 2024 డిసెంబర్‌తో ముగిసింది. కానీ, పలు రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కేంద్రం ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించింది. అయినా, నిర్దేశించిన గడువు 2026 జులై నాటికి కూడా క్షేత్రస్థాయిలో ఎలాంటి నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం చేపట్టకపోవడంతో కేంద్రం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

LPGCyberFraud: ‘గ్యాస్  ఇన్స్పెక్షన్’ అని కాల్ వచ్చిందా? అయితే జాగ్రత్త!తెలంగాణSwechaa08 Oct 2026, 12:00 PM

LPGCyberFraud: ‘గ్యాస్  ఇన్స్పెక్షన్’ అని కాల్ వచ్చిందా? అయితే జాగ్రత్త!

 దేశంలోని ప్రముఖ ఆయిల్ కంపెనీలైన హెచ్‌పీ(HP), ఇండేన్ (Indane), భారత్ గ్యాస్ (Bharat Gas) నిబంధనల ప్రకారం ప్రతీ 5 సంవత్సరాలకు ఒకసారి గ్యాస్ వినియోగదారుల ఇంట్లో తప్పనిసరిగా సేఫ్టీ ఇన్ స్పెక్సన్ (Mandatory Safety Inspection) నిర్వహించాల్సి ఉంటుంది. అయితే, ఈ క్రమాన్ని ఆసరాగా చేసుకుని అనేక ప్రాంతాల్లో నకిలీ ఏజెంట్లు, కేటుగాళ్లు నకిలీ ఐడీలతో వచ్చి అమాయక ప్రజలను మోసగిస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. నిజమైన తనిఖీలను ఎలా గుర్తించాలో, మోసగాళ్ల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్నారు.

తీన్మార్ మల్లన్న@ కారు కూతలు, రోత మాటలు..!టాప్ న్యూస్Swechaa08 Oct 2026, 11:45 AM

తీన్మార్ మల్లన్న@ కారు కూతలు, రోత మాటలు..!

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. ఈ పేరు వింటే చాలు జర్నలిజం మాటున అధికార పార్టీ నేతలను ఇష్టానుసారంగా బూతులు తిట్టడం, కారుకూతలు కూయడం కనిపిస్తుంటుంది. జర్నలిజం అనే ముసుగు కప్పుకుని తన పొలిటికల్ కెరీర్‌కు బాట వేసుకున్నాడని విమర్శలున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావును ఎక్కువగా టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కేసులు ఎదుర్కొవడం,పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగాడు. చింతపండు నవీన్ అనే పేరు కంటే తీన్మార్ మల్లన్నగా ఫేమస్ అయ్యాడు. నాడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాయింట్ ఔట్ చేసి ప్రజల గొంతుకగా నిలిచాడు. అయితే, కాలక్రమేణా ఆయన వాయిస్ మారుతూ వచ్చింది. జర్నలిజం నుంచి పొలిటికల్ ఎజెండాతో ముందుకు నడిచాడు. పార్టీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాడు.

చిత్రం లేదు
తెలంగాణSwechaa08 Oct 2026, 11:43 AM

StarlinkIndia: ‘వారెవరో పేర్లు బయటపెట్టండి..’ మస్క్ పోస్ట్‌పై కేటీఆర్ స్పందన!

 భారతీయ ఉపగ్రహ ఇంటర్నెట్ (సాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్) మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్న స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో మారుమూల గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలందించకుండా, తమ ఏకస్వామ్యాన్ని(Monopoly) కాపాడుకోవడానికి కొందరు వ్యాపార దిగ్గజాలు (ఒలిగార్క్స్) స్టార్‌లింక్ సేవలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఆయన ఎక్స్ (X) వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.  ఇది భారత ప్రజల హక్కులపై జరుగుతున్న నేరమంటూ మస్క్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అయితే, మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెంటనే స్పందించారు.

పేరు మారితే ఊరు మారుతుందా..! బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమిటీ గోల..?NationalSwechaa08 Oct 2026, 11:13 AM

పేరు మారితే ఊరు మారుతుందా..! బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏమిటీ గోల..?

ఒక నగరం పేరు మారితే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయా? ఒక జిల్లా పేరు మారితే రైతు ఆదాయం పెరుగుతుందా? ఒక రాష్ట్రం పేరు మారితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం మెరుగవుతుందా? పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెరుగుతాయా? రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, ప్రజా రవాణా సమస్యలు పరిష్కారమవుతాయా? అసలు బీజేపీ వ్యూహమేంటి..?

GoldPricetoday: పండుగల వేళ గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు!InternationalSwechaa08 Oct 2026, 11:09 AM

GoldPricetoday: పండుగల వేళ గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు!

 దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. అక్టోబరు 8 ఉదయం ట్రేడింగ్ సమయానికి దేశీయ మార్కెట్‌లో 24క్యారెట్ల పసిడి (10 గ్రాములు) ధర రూ.1,49,270గా నమోదవగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,36,831గా కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే, కిలో వెండి రూ.2,23,600గా ఉండగా, 925 స్టెర్లింగ్ సిల్వర్ కిలో రూ.2,06,830 వద్ద ట్రేడైంది. అమెరికా ట్రెజరీ ఈల్డ్స్ గణనీయంగా పెరగడం, గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడటమే అంతర్జాతీయంగా లోహాల ధరలు క్షీణించడానికి ప్రధాన కారణంగా మారాయి.

TelanganaVoterList: తెలంగాణ ఓటర్ల జాబితాలో 71.23 లక్షల మందికి చోటు!తెలంగాణSwechaa08 Oct 2026, 10:43 AM

TelanganaVoterList: తెలంగాణ ఓటర్ల జాబితాలో 71.23 లక్షల మందికి చోటు!

 తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(SIR) ప్రక్రియలో భాగంగా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అభ్యంతరాలు, పరిశీలనల అనంతరం తుది ఓటర్ల జాబితాలో చేర్చడానికి మొత్తం 71.23 లక్షల మందిని అర్హులుగా గుర్తించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. నోటీసుల ఆధారంగా చేపట్టిన విచారణ ప్రక్రియను అక్టోబర్ 7 నాటికి పూర్తి చేసి, వీరందరికీ అర్హత కల్పిస్తూ అధికారికంగా ఆమోదం తెలిపారు. ఓటర్ల వివరాల్లో తప్పులు, సాంకేతిక మార్పులు, అభ్యంతరాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 92.88లక్షల నోటీసులు జారీ చేయగా, అందులో 91.92 లక్షల నోటీసులను నేరుగా సంబంధిత ఓటర్లకు అందజేశారు.

Telangana: పరాకాష్టకు చేరిన మైనంపల్లి రోహిత్ కుర్ర చేష్టలు!!..తెలంగాణSwechaa08 Oct 2026, 10:35 AM

Telangana: పరాకాష్టకు చేరిన మైనంపల్లి రోహిత్ కుర్ర చేష్టలు!!..

ఒకరు ఎమ్మెల్యే.. ఇంకొకరు పార్టీ అధ్యక్షుడు.. రాజకీయాల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు మాట తీరు, వ్యవహారశైలి కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వ్యవహారం మాత్రం ఇప్పుడు సొంత పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతోందనే చర్చ మొదలైంది.. తాజాగా ఆర్‌టీవీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. తనపై వచ్చిన భూ వ్యవహారాల కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోహిత్ అక్కడికి వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు ఉందా లేదా.. పోలీసులు వెరిఫై చేయాలి అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి..

Tamilnadu: పసిమొగ్గల ప్రాణాలను చిదిమేసిన తల్లి క్షణికావేశం-తండ్రి నిర్లక్ష్యం!..క్రైమ్Swechaa08 Oct 2026, 10:33 AM

Tamilnadu: పసిమొగ్గల ప్రాణాలను చిదిమేసిన తల్లి క్షణికావేశం-తండ్రి నిర్లక్ష్యం!..

భర్త అవమానించాడని మనస్తాపానికి గురైన మహిళ.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు కుమారుల పై తనపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. ముగ్గురి కేకలు విన్న చుట్టుపక్కల వారు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. తీవ్రగాయాలకు గురైన మారియమ్మాళ్‌ ఘటనాస్థలంలోనే మృతిచెందింది. పిల్లలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందారు. శివగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Cinema: నిజంగా రివ్యూవర్స్ సినిమాను చంపేస్తున్నారా?సినిమాSwechaa08 Oct 2026, 10:20 AM

Cinema: నిజంగా రివ్యూవర్స్ సినిమాను చంపేస్తున్నారా?

Cinema: మనకున్న అతిపెత్త వ్యాపారాలలో సినిమా అనేది కూడా ఎంతో ముఖ్యమైనది. కేవలం ప్రేక్షకులకి వినోదాన్ని పంచేదే కాకుండా, ఒక సినిమా ప్రకటించినప్పటి నుంచి నిర్మాణంలో ఉన్నన్ని రోజులు..ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్స్‌లో ప్రదర్శించే వరకు కొన్ని వందల కుటుంబాలు ఆధారపడుతున్నాయి.

NarendraModiStadium: మ్యాచ్ జరుగుతుండగానే బాంబు బెదిరింపు!క్రైమ్Swechaa08 Oct 2026, 10:16 AM

NarendraModiStadium: మ్యాచ్ జరుగుతుండగానే బాంబు బెదిరింపు!

 అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి ఈ-మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం ఉదయం భారత్ అండర్-19, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) అధికారిక ఈ-మెయిల్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. వెంటనే అప్రమత్తమైన సైబర్ క్రైమ్ పోలీసులు, బాంబ్ డిటెక్షన్, డాగ్ స్క్వాడ్‌ల సహాయంతో స్టేడియంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి, ఇది కేవలం నకిలీ (ఫేక్) బెదిరింపు మాత్రమేనని తేల్చారు.

దసరా ‘స్పెషల్’ బాదుడు.. 6 రోజులు అదనపు చార్జీల వసూళ్లు!తెలంగాణSwechaa08 Oct 2026, 10:00 AM

దసరా ‘స్పెషల్’ బాదుడు.. 6 రోజులు అదనపు చార్జీల వసూళ్లు!

దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ మరోసారి బిగ్‌షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సులు వేశామని నిన్న ప్రకటించిన ఆర్టీసీ..‘స్పెషల్’ పేరిట అదనపు చార్జీల వసూళ్లకు మరోసారి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద పండుగలకు మాత్రమే అదనపు చార్జీలు వసూలు చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో చిన్న పండుగలకు కూడా అదనపు చార్జీలు వసూలు చేయడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దసరా పండుగ సమయంలో 6 రోజుల పాటు అదనపు చార్జీలు వసూలు చేయనున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం వరకు అదనపు చార్జీలు ఉంటాయని తెలిపింది. ఈసారి దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 7 వేల వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు టీజీఎస్ఆర్టీసీ నిన్న ప్రకటించింది. అయితే, ఈ నెల 9, 10, 16, 17 తేదీల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తామని తెలిపింది.

KitchenBudget: వంటింట్లో ధరల మంట.. ఒక్క నెలలోనే పైపైకి!వ్యాపారంSwechaa08 Oct 2026, 09:40 AM

KitchenBudget: వంటింట్లో ధరల మంట.. ఒక్క నెలలోనే పైపైకి!

 మార్కెట్‌లో నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్య కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతోంది. తాజాగా అందుబాటులో ఉన్న ధరల పట్టికను పరిశీలిస్తే.. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో పప్పులు, మిరపకాయలు, చక్కెర, డ్రైఫ్రూట్స్‌ తదితర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. నెల వ్యవధిలోనే పలు కీలక వస్తువుల ధరలు పైకి కదలడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో ధరల నియంత్రణపై ప్రభుత్వ చర్యలు అవసరమన్న చర్చ కొనసాగుతోంది.  సెప్టెంబర్‌లో కిలో కందిపప్పు ధర రూ.126 ఉండగా.. అక్టోబర్‌లో రూ.143కు చేరింది. అంటే కిలోకు రూ.17, సుమారు 13.5శాతం పెరుగుదల నమోదైంది.