స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

భారత్‌లో SIR.. అమెరికాలో SAVE! ట్రంప్‌ ప్లాన్‌ ఇదేనా..?InternationalSwechaa08 Oct 2026, 09:28 AM

భారత్‌లో SIR.. అమెరికాలో SAVE! ట్రంప్‌ ప్లాన్‌ ఇదేనా..?

భారత్‌లో SIRపై రాజకీయ దుమారం కొనసాగుతుండగానే.. అమెరికాలో కూడా ఓటర్ల జాబితాలపై కొత్త చర్చ మొదలైంది. ట్రంప్‌ ప్రభుత్వం.. ఓటర్ల జాబితాలో ఉన్న ప్రతి వ్యక్తి నిజంగా అమెరికా పౌరుడేనా కాదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకోసం SAVE అనే ఫెడరల్‌ డేటాబేస్‌ను ఉపయోగించే అవకాశం రాష్ట్రాలకు కల్పించింది.

Nana Patekar: "నట సామ్రాట్" కన్నుమూత..చిత్ర పరిశ్రమకి తీరని లోటు!సినిమాSwechaa08 Oct 2026, 09:24 AM

Nana Patekar: "నట సామ్రాట్" కన్నుమూత..చిత్ర పరిశ్రమకి తీరని లోటు!

Nana Patekar: భారతీయ చిత్ర పరిశ్రమలో నటనతో తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూశారు. ఆయన వయసు 75 ఏళ్ళు. ఈ అక్టోబర్ 8 (గురువారం) తెల్లవారుజామున గోవాలోని డోనా పౌలా ప్రాంతంలోని తన నివాసంలో ఆయనకు తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న నానాను వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. వైద్యులు సుమారు 45 నిమిషాల పాటు సిపీఅర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు.

Telangana: అంతా అధికారుల మహిమే? ..స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa08 Oct 2026, 09:14 AM

Telangana: అంతా అధికారుల మహిమే? ..

ఇటీవల కాలంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో యూజర్ ఛార్జీల నిధులు విచ్చలవిడిగా పక్కదారి పట్టాయనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రజల నుంచి వసూలు చేసిన యూజర్ ఛార్జీల సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేశారంటూ స్వేచ్ఛ న్యూస్ తన ప్రధాన పేజీలో సంచలనాత్మక వార్తా కథనాన్ని ప్రచురించింది.

DonaldTrump: నోబెల్ శాంతి బహుమతికి నేనే అర్హుడిని: ట్రంప్InternationalSwechaa08 Oct 2026, 09:04 AM

DonaldTrump: నోబెల్ శాంతి బహుమతికి నేనే అర్హుడిని: ట్రంప్

 ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి తాను మాత్రమే సంపూర్ణ అర్హుడినని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన అంతర్జాతీయ వివాదాలను పరిష్కరించడంలో తాను క్రియాశీలక పాత్ర పోషించానని, అందువల్ల ఈ ఏడాది శాంతి బహుమతి తనకే దక్కాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే, నార్వేజియన్ నోబెల్ కమిటీ తనలాంటి సిద్ధాంతాలు కలిగిన వ్యక్తులకు ఈ బహుమతిని ఇచ్చే అవకాశం చాలా తక్కువని అనుమానం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Saroornagar: మాస్టర్‌ ప్లాన్‌నే మాయ చేసిన HMDA..ప్రభుత్వానికి దమ్ము లేదా?!..తెలంగాణSwechaa08 Oct 2026, 08:09 AM

Saroornagar: మాస్టర్‌ ప్లాన్‌నే మాయ చేసిన HMDA..ప్రభుత్వానికి దమ్ము లేదా?!..

హెచ్‌ఎండీఏ భూముల వేలంలో మరో అవకతవకలు వెలుగుచూశాయి. సరూర్‌నగర్‌ సర్వే నంబరు 9/1పి లోని స్థలాన్ని ఆన్‌లైన్‌లో వేలం వేసి రూ.71.44 కోట్ల ఆదాయం పొందిన అధికారులు.. మాస్టర్‌ప్లాన్‌నే మార్చేశారు.. 2030 మాస్టర్‌ప్లాన్‌లో 100 అడుగులుగా ఉన్న రహదారిని.. వేలం డాక్యుమెంట్‌లో మాత్రం 80 అడుగులుగా చూపించారు. రోడ్డు వెడల్పు తగ్గించి చూపడంతో బడా సంస్థలు పోటీకి దూరమై, ప్రభుత్వానికి రావాల్సిన మరింత ఆదాయానికి గండి పడిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి

UV Creations: నష్టాల్లో బడా నిర్మాణ సంస్థ..విశ్వంభర కి బడ్జెట్ లేదా?సినిమాSwechaa07 Oct 2026, 11:17 PM

UV Creations: నష్టాల్లో బడా నిర్మాణ సంస్థ..విశ్వంభర కి బడ్జెట్ లేదా?

UV Creations: ప్రభాస్ స్నేహితులతో నిర్మించిన బ్యానర్ యూవీ క్రియేషన్స్. ఇప్పుడు, ఈ సంస్థ తీవ్ర నష్టాలలో ఉన్నట్టుగా ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఒకప్పుడు, ఈ సంస్థ నుంచి మంచి హిట్ చిత్రాలొచ్చాయి. ఒక్క హిట్ సినిమా వస్తే వెంటనే రెండు ప్రాజెక్ట్స్‌ను ప్రకటించారు. అలా, యూవీ వారు మీడియం బడ్జెట్ నుంచి పాన్ ఇండియా సినిమాల వరకూ భారీ బడ్జెట్‌తో సినిమాలను నిర్మించారు. ఇప్పుడు కూడా ఈ సంస్థలో నిర్మిస్తున్న సినిమాలున్నాయి.

మోదీ 25 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ రణరంగం! ఢిల్లీలో రెండు సీన్లు.. ఇదేం పొలిటికల్ ట్విస్ట్?NationalSwechaa07 Oct 2026, 11:11 PM

మోదీ 25 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ రణరంగం! ఢిల్లీలో రెండు సీన్లు.. ఇదేం పొలిటికల్ ట్విస్ట్?

ఒకవైపు నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానానికి పాతికేళ్లు పూర్తి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ భారీ నిరసన. ఒకరు 25 ఏళ్ల రాజకీయ జర్నీని సెలబ్రేట్ చేసుకునే మైలురాయి దగ్గర ఉంటే.. ఇంకొకరు అధికారాన్ని టార్గెట్ చేస్తూ రోడ్డెక్కారు. దీంతో దేశ రాజకీయాల్లో హీట్ ఒక్కసారిగా పెరిగింది.

Sai Dharam Tej: మెగా హీరోకి మార్కెట్ తగ్గిందా?సినిమాSwechaa07 Oct 2026, 10:38 PM

Sai Dharam Tej: మెగా హీరోకి మార్కెట్ తగ్గిందా?

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్ సినిమాలకి బడ్జెట్ కష్టాలా? అవును ఇప్పుడు ఇదే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. యాక్సిడెంట్‌కి ముందు వరకూ సాయిధరమ్ తేజ్ సినిమాలకి మంచి బిజినెస్ అయ్యేది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్‌ను అందుకున్నాయి. కానీ, యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ కంబ్యాక్ ఇచ్చి విరూపాక్ష చేశాడు. ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.

Smriti Mandhana: ట్రోల్స్‌కు ఫుల్‌స్టాప్.. హర్మన్‌పై మంధాన ఎమోషనల్ పోస్ట్!NationalSwechaa07 Oct 2026, 10:34 PM

Smriti Mandhana: ట్రోల్స్‌కు ఫుల్‌స్టాప్.. హర్మన్‌పై మంధాన ఎమోషనల్ పోస్ట్!

Smriti Mandhana: టీమిండియా మహిళా జట్టు కెప్టెన్సీ మార్పుపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌కు కొత్త కెప్టెన్ స్మృతి మంధాన తనదైన స్టైల్‌లో ఫుల్‌స్టాప్ పెట్టారు. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న వెంటనే స్మృతి పగ్గాలు చేపట్టడంతో, వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్మృతి పెట్టిన ఎమోషనల్ పోస్ట్ విమర్శలకూ గట్టి సమాధానమిచ్చింది.

పండక్కి శుభవార్త చెబుతారనుకుంటే ఉసూరుమనిపించారుతెలంగాణSwechaa07 Oct 2026, 09:40 PM

పండక్కి శుభవార్త చెబుతారనుకుంటే ఉసూరుమనిపించారు

True Up Charges: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీల భారం తగ్గించాలంటే దానిపై భట్టి విక్రమార్క సమాధానం దాటవేశారని విమర్శించారు. కుంటి సాకులు చెప్పి సంబంధం లేని కాగితాలు చూపిస్తారా అంటూ మండిపడ్డారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడం మానుకోవాలన్నారు. లేదంటే ప్రజా ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమని హెచ్చరించారు హరీశ్ రావు.

బీజేపీ, కాంగ్రెస్ లో మహిళలకు రక్షణ లేదు : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్తెలంగాణSwechaa07 Oct 2026, 09:40 PM

బీజేపీ, కాంగ్రెస్ లో మహిళలకు రక్షణ లేదు : ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

TG: రాష్ట్రంలో మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వేధింపుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు. బీజేపీ యువమోర్చా జాతీయ కోశాధికారి టి.ఎం.సాయిప్రసాద్‌పై బీజేపీ ఎస్సీ మోర్చా నాయకురాలు డి.పద్మిని చేసిన లైంగిక, కుల వివక్ష వేధింపుల ఉదంతం రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. కేంద్ర, రాష్ట్ర పాలకుల అండదండలతోనే ఈ దారుణాలు సాగుతున్నాయని ఆధారాలతో సహా ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.మల్కాజిగిరి పరిధిలోని అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 5న బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్‌పై సాధారణ సెక్షన్లతో ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయడం వెనుక కుట్ర దాగి ఉందని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణలో పోలీస్ మాన్యువల్ కాకుండా ‘రేవంత్ మాన్యువల్’ నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు 30 పేజీల సమగ్ర ఆధారాలతో ఫిర్యాదు సమర్పిస్తే, నిందితుడిని రక్షించేలా కేసును పలుచన చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే రాష్ట్రంలో చార్జ్‌షీట్లు పడవు, నిందితులను అరెస్ట్ చేయరని మండిపడ్డారు.

Revanth Reddy: జ్ఞానేశ్‌ రాజీనామా చేసేదాకా వదిలిపెట్టం : సీఎం రేవంత్ రెడ్డితెలంగాణSwechaa07 Oct 2026, 09:36 PM

Revanth Reddy: జ్ఞానేశ్‌ రాజీనామా చేసేదాకా వదిలిపెట్టం : సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్ తన పదవి నుంచి తప్పుకునేంత వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శాంతియుతంగా చేపట్టిన నిరసనను అణచివేయడం ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. అరెస్టు అనంతరం పోలీస్ స్టేషన్‌లో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను పరామర్శించేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేరళ సీఎం వీడీ సతీశన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Airtel Postpaid Plans: కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్ .. ఒక్కో ప్లాన్‌పై రూ.50 హైక్!NationalSwechaa07 Oct 2026, 08:53 PM

Airtel Postpaid Plans: కస్టమర్లకు షాకిచ్చిన ఎయిర్‌టెల్ .. ఒక్కో ప్లాన్‌పై రూ.50 హైక్!

Airtel Postpaid Plans: టెలికాం రంగంలో ప్రముఖ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తమ పోస్ట్‌పెయిడ్ యూజర్స్‌కి గట్టి షాకిచ్చింది. అన్ని రకాల పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల ధరలను ఉన్నపళంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో ప్లాన్‌పై ఏకంగా రూ.50 చొప్పున భారం మోపడంతో యూజర్స్‌కి నెలవారీ బిల్లులు మరింత పెరగనున్నాయి. పెరిగిన చార్జీల ప్రకారం.. ఇండివిడ్యువల్ ప్లాన్ కనీస ధర ఇప్పుడు రూ.499కి చేరింది. ఫ్యామిలీ ప్యాక్‌ల విషయానికి వస్తే, ఇద్దరు వ్యక్తుల ప్లాన్ రూ.749 కాగా, ముగ్గురు వ్యక్తుల ప్లాన్ రూ.1,049కి పెరిగింది. నలుగురు సభ్యుల ప్లాన్లు రూ.1,249, రూ.1,449గా మారగా, ఐదుగురు సభ్యుల ప్లాన్ ఏకంగా రూ.1,799కి చేరుకుంది.

Kollapur: యంగ్‌ ఇండియా స్కూల్‌పై జూపల్లి కీలక ఆదేశాలు.. అధికారులకు మంత్రి దిశానిర్దేశం!..తెలంగాణSwechaa07 Oct 2026, 08:42 PM

Kollapur: యంగ్‌ ఇండియా స్కూల్‌పై జూపల్లి కీలక ఆదేశాలు.. అధికారులకు మంత్రి దిశానిర్దేశం!..

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలను నాణ్యతగా చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Chiranjeevi: లైనప్ మార్చిన చిరు! వాళ్ళిద్దరినీ ముందుకు లాగాడా?సినిమాSwechaa07 Oct 2026, 08:21 PM

Chiranjeevi: లైనప్ మార్చిన చిరు! వాళ్ళిద్దరినీ ముందుకు లాగాడా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో కాకా సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. విశ్వంభర సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమాల తర్వాత వాస్తవానికి యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తో సినిమా చేయాల్సింది. ఆ సినిమాను అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ, ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా ఫలితంతో చిరు..ప్రస్తుతానికి శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్‌ను హోల్డ్‌లో పెట్టారట. ఆ ప్లేస్‌లో మరో ఇద్దరు డైరెక్టర్స్ రానున్నట్టు తాజా సమాచారం.

Bio-war: ప్రపంచంలో మరో బయో వార్.. మానవ మనుగడకు ముప్పు మొదలైందా?..InternationalSwechaa07 Oct 2026, 08:16 PM

Bio-war: ప్రపంచంలో మరో బయో వార్.. మానవ మనుగడకు ముప్పు మొదలైందా?..

సరిగ్గా కొన్ని ఏళ్ల క్రితం... చైనాలోని ఊహాన్ నగరంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ... అబ్బే మా దగ్గర ఏమీ లేదు, అంతా ప్రశాంతం అంటూ చైనా ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ, ఆ మౌనం, ఆ అబద్ధం... చివరికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చింది. ఇక తాజాగా రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న ఓ ప్లేగూ పరిశోధనా కేంద్రానికి చెందిన యువ ల్యాబొరేటరీ ఉద్యోగి అనుమానాస్పదంగా న్యుమోనియాతో మరణించడం కలకలం రేపింది. ఆమె పనిచేసిన సంస్థలో ప్లేగూతో పాటు ఇతర ప్రమాదకరమైన అంటువ్యాధులపై పరిశోధనలు జరుగుతుండటంతో.. ఇప్పటికే కరోనా వైరస్ విధ్వంసాన్ని మర్చిపోలేకపోతున్న ప్రపంచానికి తాజా ఘటనపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.

ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం.. రూ.500కోట్లు వసూలుక్రైమ్Swechaa07 Oct 2026, 08:07 PM

ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం.. రూ.500కోట్లు వసూలు

Pre Launch Scam: ప్రీలాంచ్ ఆఫర్ అని ఊరించారు. తక్కువ ధరకే ప్లాట్లు అంటూ ఊదరగొట్టారు. ఇంకేముంది జనాలు టెంప్ట్ అయ్యారు. భలే మంచి బేరం అంటూ ఎగబడ్డారు. సొంతింటి కల నెరవేరుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. కట్ చేస్తే దారుణంగా మోసపోయారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. తక్కువ ధరకే ప్లాట్లు అంటూ వందలాది మంది నుంచి 500 కోట్లు వసూలు చేసి చీట్ చేసిన వైనం బయటపడింది. త్రిపురా కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ చైర్మన్ పసుపులేటి సుధాకర్ తమను నిండా ముంచేశాడు అంటూ బాధితులు లబోదిబోమంటుననారు.

TG: దసరాకు ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులుతెలంగాణSwechaa07 Oct 2026, 07:40 PM

TG: దసరాకు ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్.. 7 వేల స్పెషల్ బస్సులు

TG: దసరా పండుగ వేళ ఊరెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తెలంగాణ ఆర్టీసీ పక్కా ప్లాన్ రెడీ చేసింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏకంగా 7,000 ప్రత్యేక బస్సులను రోడ్డెక్కించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. రద్దీ తీవ్రతకు అనుగుణంగా ఎక్కడికక్కడ సర్వీసులు అందుబాటులో ఉండేలా అధికారులు పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు.కరీంనగర్ జోన్ పరిధిలో 3,533 బస్సులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కరీంనగర్‌కి 1,175, నిజామాబాద్‌కి 719, ఖమ్మంకి 678, వరంగల్‌కి 530, ఆదిలాబాద్‌కి 431 బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక హైదరాబాద్ జోన్ పరిధిలో 2,155 బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. నల్గొండ 815, మహబూబ్ నగర్ 645, రంగారెడ్డి 440, మెదక్ 255 స్పెషల్ బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదనంగా మరో 1,312 ప్రత్యేక బస్సులను కేటాయించినట్లు వెల్లడించారు.

Bommarillu Bhaskar: "బొమ్మరిల్లు" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జీతానికి పనిచేసిన భాస్కర్!సినిమాSwechaa07 Oct 2026, 07:37 PM

Bommarillu Bhaskar: "బొమ్మరిల్లు" లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత జీతానికి పనిచేసిన భాస్కర్!

Bommarillu Bhaskar: 'బొమ్మరిల్లు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఏ దర్శకుడైనా ఇండస్ట్రీలో వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటారు. అలాగే, భాస్కర్ కూడా మంచి ఆఫర్స్ అందుకున్నాడు. కానీ, 'బొమ్మరిల్లు' లాంటి సాలీడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. దిల్ రాజు నిర్మాతగా భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'బొమ్మరిల్లు' అందరి కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీ. నిర్మాతగా దిల్ రాజుకి విపరీతమైన లాభాలను తెచ్చిన సినిమా ఇది.

Hyderabad: నగరంలో NRIల ఆస్తులే టార్గెట్ గా నకిలీ డాక్యుమెంట్ల రాకెట్ గుట్టురట్టు!..తెలంగాణSwechaa07 Oct 2026, 07:21 PM

Hyderabad: నగరంలో NRIల ఆస్తులే టార్గెట్ గా నకిలీ డాక్యుమెంట్ల రాకెట్ గుట్టురట్టు!..

నగరంలో నకిలీ డాక్యుమెంట్లతో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ, విదేశాల్లో ఉన్న వారి ఆస్తులను కాజేస్తున్న ముఠాను తాజాగా స్పెషల్ ఆపరేషన్ టీమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్, ఎల్‌బీ నగర్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టిన పోలీసులు.. ముఠాలోని కీలక సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి భారీగా నకిలీ స్టాంప్ పేపర్లతో పాటు స్టాంపులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

చందానగర్‌లోని మై హోమ్ జెవెల్‌లో అగ్నిప్రమాదంక్రైమ్Swechaa07 Oct 2026, 07:18 PM

చందానగర్‌లోని మై హోమ్ జెవెల్‌లో అగ్నిప్రమాదం

My Home Jewel: హైదరాబాద్ చందానగర్‌లోని మై హోమ్ జెవెల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మైహోమ్ జెవెల్ 12వ బ్లాకులోని 14వ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. సకాలంలో అగ్నిమాపక పైప్ లైన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదంతో అందులో ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. మంటలు చూసి కంగారు పడ్డారు. అయితే సిబ్బంది మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, అగ్నిప్రమాదం జరగడానికి కారణాలు తెలియాల్సి ఉంది.

West Bengal: బెంగాల్ పేరు మారుతోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సంచలన ప్రకటన!NationalSwechaa07 Oct 2026, 07:10 PM

West Bengal: బెంగాల్ పేరు మారుతోంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సంచలన ప్రకటన!

West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పేరు మార్పుపై ఆ రాష్ట్ర స్టేట్ బీజేపీ చీఫ్ సమిక్ భట్టాచార్య సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్ర చారిత్రక వారసత్వం, గుర్తింపును ప్రతిబింబించేలా ‘పశ్చిమ బెంగాల్’ పేరును ‘పశ్చిమ బంగా’గా మార్చాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. "ఇంకెన్ని సార్లు స్పష్టత ఇవ్వాలి? రాష్ట్ర పేరు ఇకపై 'పశ్చిమ బంగా'గానే ఉంటుంది. అసెంబ్లీలో త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక బిల్లును ప్రవేశపెడతాం" అని ఆయన స్పష్టం చేశారు.రాష్ట్ర పేరు మార్పు ప్రక్రియ త్వరలోనే స్టార్ట్ కానుందని తెలిపిన సమిక్ భట్టాచార్య.. ఇకపై ‘పశ్చిమ బంగ్లా’, ‘బంగ్లా’, ‘బంగా’ వంటి అయోమయ పేర్లను యూజ్ చేయాల్సిన పని ఉండదని తేల్చిచెప్పారు.

ఢిల్లీలో కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలు!!..NationalSwechaa07 Oct 2026, 06:39 PM

ఢిల్లీలో కూలిన ఐదంతస్తుల భవనం.. శిథిలాల కింద కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలు!!..

దేశ రాజధాని ఢిల్లీ లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి (Seemapuri) ప్రాంతంలో ఐదు అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పలువురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకున్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమాచారాన్ని అందుకున్న అధికారులు వెంటనే 4 ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను తరలించేందుకు వీలుగా రాజీవ్ గాంధీ ఆసుపత్రి (Rajiv Gandhi Hospital) సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు.

Vaishnav Tej: "ఉప్పెన" తర్వాత ఉసూరుమంటున్న వైష్ణవ్ తేజ్!సినిమాSwechaa07 Oct 2026, 06:37 PM

Vaishnav Tej: "ఉప్పెన" తర్వాత ఉసూరుమంటున్న వైష్ణవ్ తేజ్!

Vaishnav Tej: మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలలో కెరీర్ మరీ నత్త నడకన సాగుతుంది పంజా వైష్ణవ్ తేజ్‌దే. శంకర్ దాదా సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆకట్టుకున్న వైష్ణవ్..ఉప్పెన సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమాతో ఒక డెబ్యూ హీరోగా మొత్తం సౌత్ అండ్ నార్త్ ఇండస్ట్రీలలో ఉన్న డెబ్యూ హీరో రికార్డ్స్‌ను బ్రేక్ చేశాడు. కానీ, ఆ క్రేజ్ తర్వాత సినిమాలకి కంటిన్యూ చేయలేకపోయాడు.

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పాపం ఎవరిది? బీఆర్ఎస్‌పై భట్టి విక్రమార్క ఆగ్రహంతెలంగాణSwechaa07 Oct 2026, 05:50 PM

యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పాపం ఎవరిది? బీఆర్ఎస్‌పై భట్టి విక్రమార్క ఆగ్రహం

Power Supply: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో మీడియాతో మాట్లాడారు భట్టి విక్రమార్క.

క్లిష్ట పరిస్థితుల్లోనూ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా

ఎల్ నినో ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే విద్యుత్‌ డిమాండ్‌ అత్యధిక స్థాయికి చేరిందని ఆయన తెలిపారు. విద్యుత్ వినియోగం 19,892 మెగావాట్లకు చేరిందన్నారు. అయినప్పటికీ విద్యుత్ కోతలు లేకుండా నిరంతర కరెంటు అందిస్తున్నామని వివరించారు. దాదాపు 20 వేల మెగావాట్ల డిమాండ్‌ను కూడా సమర్థవంతంగా తట్టుకుని కరెంట్ అందిస్తున్నామన్నారు.

Delhi: ఢిల్లీలో మరోసారి టెన్షన్ వాతావరణం..ఎఫ్ఐఆర్‌లో సెంచరీ కొట్టడమే లక్ష్యమన్న రాహుల్!!..NationalSwechaa07 Oct 2026, 05:39 PM

Delhi: ఢిల్లీలో మరోసారి టెన్షన్ వాతావరణం..ఎఫ్ఐఆర్‌లో సెంచరీ కొట్టడమే లక్ష్యమన్న రాహుల్!!..

ఢిల్లీలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఈసీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు ఐక్యపోరాటానికి సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలోని సాగర్ రత్న హోటల్ లో విపక్ష పార్టీల లంచ్ మీటింగ్ జరిగింది. ఈ భేటీ అనంతరం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ జంతర్ మందర్ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

Graduates MLC Elections: కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టికెట్ చిచ్చు.. బీఆర్ఎస్‌తో టచ్‌లోకి అసమ్మతి నేత.. కారెక్కుతారా?తెలంగాణSwechaa07 Oct 2026, 05:00 PM

Graduates MLC Elections: కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ టికెట్ చిచ్చు.. బీఆర్ఎస్‌తో టచ్‌లోకి అసమ్మతి నేత.. కారెక్కుతారా?

Graduates MLC Elections:తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రధాన పార్టీల్లో అసమ్మతి మంటలను రాజేస్తున్నాయి. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్ పట్టభద్రుల స్థానానికి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డిని ప్రకటించడంతో గాంధీ భవన్‌లో ఒక్కసారిగా అసంతృప్తి భగ్గుమంది. ఈ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. "త్యాగం ఒకరిది.. భోగం మరొకరిదా?" అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేందుకు గులాబీ బాస్‌లతో రాయబారాలు మొదలుపెట్టడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.తనకు దక్కని సీటు మరెవరికీ దక్కకూడదన్న వ్యూహంతో హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ అగ్ర నాయకత్వంతో టచ్‌లోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌ అధికారిక అభ్యర్థిని దెబ్బకొట్టేందుకు కారెక్కడానికి సైతం సిద్ధపడినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడే ఆయనకు గులాబీ నేతలు షాక్ ఇచ్చినట్లు సమాచారం. నిజానికి కాంగ్రెస్ పార్టీ రెండు పట్టభద్రుల స్థానాలనూ (వరంగల్-నల్గొండ-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్) ఒకే సామాజిక వర్గానికి కేటాయించింది.

ఎట్టి పరిస్థితుల్లో పవర్ సెక్టార్‌ను ప్రైవేట్‌పరం చేయంతెలంగాణSwechaa07 Oct 2026, 04:33 PM

ఎట్టి పరిస్థితుల్లో పవర్ సెక్టార్‌ను ప్రైవేట్‌పరం చేయం

Power Sector: విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది అంటూ బీఆర్ఎస్ చేసిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. వారి మాటల్లో నిజం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలది తప్పుడు ప్రచారం ఎదురుదాడికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో పవర్ సెక్టార్ ను ప్రైవేటుపరం చేయము అని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అటువంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు.

Tollywood: అక్టోబర్ 23 కోసం ఎదురుచూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్!సినిమాSwechaa07 Oct 2026, 04:21 PM

Tollywood: అక్టోబర్ 23 కోసం ఎదురుచూస్తోన్న ప్రభాస్ ఫ్యాన్స్!

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23. ఈ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా..అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం..ఆయన సినిమాల నుంచి ఎప్పుడూ సరైన అప్‌డేట్స్ రావు. కానీ, బర్త్ డేకి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక అప్‌డేట్ ప్రభాస్ సినిమాల నుంచి వస్తుంది. అందుకే, డార్లింగ్ ఫ్యాన్స్‌కి ఈ తేదీ చాలా ఇంపార్టెంట్.

కడియం శ్రీహరి నన్ను దూషించారు, అందుకే ప్రతిస్పందించాతెలంగాణSwechaa07 Oct 2026, 03:45 PM

కడియం శ్రీహరి నన్ను దూషించారు, అందుకే ప్రతిస్పందించా

Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి తన వివరణ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. 16 పేజీల్లో ఎథిక్స్ కమిటీకి వివరణ అంజేశారు. కడియం శ్రీహరి నన్ను దూషించారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. కడియం శ్రీహరి దూషణలకు నేను ప్రతిస్పందించాను అని తెలిపారు. ఎథిక్స్ కమిటీ ముందుకు తనను, తన అడ్వకేట్ ను పిలవాలన్నారు.

కడియం శ్రీహరి వీడియో కూడా ఇవ్వండి

నా ఒక్కడి వీడియో మాత్రమే ఇచ్చారన్న పాడి కౌశిక్ రెడ్డి.. కడియం శ్రీహరి వీడియో కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరిని తాను బెదిరించానన్న ఆరోపణలు నిరాధారం అని స్పష్టం చేశారు. వీడియోను తప్పుగా అర్థం చేసుకుని తనపై అభియోగాలు మోపారని పాడి కౌశిక్ రెడ్డి వాపోయారు. తోటి శాసనసభ్యుల పట్ల తనకు ఎప్పుడూ గౌరవం ఉంటుందని తేల్చి చెప్పారు. పాక్షిక వీడియో ఆధారంగా తీర్పు ఇవ్వద్దని ఎథిక్స్ కమిటీకి విజ్ఞప్తి చేశారు పాడి కౌశిక్ రెడ్డి. పూర్తి ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకోవద్దని ఎథిక్స్ కమిటీని కోరారు.