స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

TBJP: తెలంగాణ బీజేపీలో మొదలైన గుబులు! ఆ బ్యాచ్‌కు ఉద్వాసన తప్పదా?తెలంగాణSwechaa07 Oct 2026, 03:44 PM

TBJP: తెలంగాణ బీజేపీలో మొదలైన గుబులు! ఆ బ్యాచ్‌కు ఉద్వాసన తప్పదా?

TBJP: ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడి చేయడం, టికెట్ల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కూర్చొని టైంపాస్ చేయడం.. తెలంగాణ బీజేపీలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన ఈ 'కంఫర్ట్ జోన్ బ్యాచ్‌'కి హైకమాండ్ ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని క్షేత్రస్థాయిలో చెమటోడ్చే కార్యకర్తలు ఒకవైపు ఉంటే, ఎలాంటి క్రియాశీల సభ్యత్వం లేకుండా కేవలం పైరవీలు, పైరాయిటీలతో రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్న నేతలపై అధిష్టానం కన్నెర్ర చేసిందని తెలుస్తుంది. దీంతో రాష్ట్ర కాషాయ దళంలో ఉన్నట్టుండి తీవ్ర గుబులు మొదలైందని జోరుగా చర్చ నడుస్తుంది.తాజాగా జరిగిన రాష్ట్ర పదాధికారుల అంతర్గత భేటీలో అధిష్టానం దూతలు అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ వ్యవహరించిన తీరు రాష్ట్ర నాయకులకు నిద్రపట్టకుండా చేస్తోందట. "ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క" అంటూ వాళ్లు నేరుగా ముఖం మీదే హెచ్చరికలు జారీ చేశారని చెబుతున్నారు.

ఉపాధి హామీలో ఆల్‌టైమ్ రికార్డు.. ఒక్కరోజే 2 లక్షలకుపైగా కూలీలు హాజరుతెలంగాణSwechaa07 Oct 2026, 03:12 PM

ఉపాధి హామీలో ఆల్‌టైమ్ రికార్డు.. ఒక్కరోజే 2 లక్షలకుపైగా కూలీలు హాజరు

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుతున్న పరిస్థితుల్లో గ్రామీణ కూలీలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ పనులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. అక్టోబర్‌ నెలలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. నిన్న ఒక్కరోజే 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. ‘వీబీ–జీ రామ్‌ జీ’ అమలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో నమోదైన అత్యధిక రోజువారీ కూలీల హాజరు ఇదే.గత ఐదేళ్ల అక్టోబర్‌ నెలలో రోజువారీ సగటు వేజ్‌ సీకర్ల సంఖ్యను పరిశీలిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.

దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరుతెలంగాణSwechaa07 Oct 2026, 02:54 PM

దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు

ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది. పండుగ నేపథ్యంలో ముందుగా ప్రకటించిన విధంగా వారికి రెండు డీఏలు (కరువు భత్యం) మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రెండు డీఏలు చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.తాజాగా దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. డీఏల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పెరిగిన కరువు భత్యం జనవరి 2024 నుంచి అమలు కానుంది.

Hyderabad: సైబరాబాద్ కమిషనరేట్‌లో స్కామ్.. యూజర్ ఛార్జీల అకౌంట్ నుండి కోట్ల ధనం గయాబ్!!..క్రైమ్Swechaa07 Oct 2026, 02:42 PM

Hyderabad: సైబరాబాద్ కమిషనరేట్‌లో స్కామ్.. యూజర్ ఛార్జీల అకౌంట్ నుండి కోట్ల ధనం గయాబ్!!..

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌కు చెందిన యూజర్ ఛార్జీల ఖాతా నుంచి దాదాపు రూ.2.76 కోట్ల ప్రజాధనం అనుమానాస్పదంగా పక్కదారి పట్టిన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నిధులను హైదరాబాద్ నగరంలోని ఓ ఖరీదైన ప్రైవేటు ప్రాపర్టీ కొనుగోలుకు వినియోగించారనే ఆరోపణలు తాజాగా పోలీసు వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత రెండు నెలల కాలంలో యూజర్ ఛార్జీల అకౌంట్ నుంచి "మహాకాల్ ఎంటర్‌ప్రైజెస్", "కేబీ ఎంటర్‌ప్రైజెస్" అనే రెండు ప్రైవేట్ ఏజెన్సీలకు కోట్ల రూపాయలు బదిలీ అయినట్టు ఆరోపణలు వస్తున్నాయి..

India - Russia: డాలర్ పెత్తనానికి భారత్ - రష్యా ఉమ్మడి చెక్.. ఢిల్లీ- మాస్కో సరికొత్త గేమ్‌ప్లాన్ ఇదేనా!NationalSwechaa07 Oct 2026, 02:41 PM

India - Russia: డాలర్ పెత్తనానికి భారత్ - రష్యా ఉమ్మడి చెక్.. ఢిల్లీ- మాస్కో సరికొత్త గేమ్‌ప్లాన్ ఇదేనా!

ఉక్రెయిన్ సంక్షోభం తర్వాత యావత్ ప్రపంచాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు అమెరికా, పాశ్చాత్య కూటమి విసిరిన అత్యంత బలమైన అస్త్రం ‘ఆర్థిక ఆంక్షలు’. రష్యాతో ఎవరు వాణిజ్యం సాగించినా తీవ్ర పరిణామాలుంటాయంటూ వాషింగ్టన్ జారీ చేసిన హెచ్చరికల ముందు చాలా దేశాలు మోకరిల్లాయి. కానీ, 140 కోట్ల జనాభా ప్రయోజనాలే పరమావధిగా నిలిచిన భారత్ మాత్రం ఆ ఒత్తిళ్లకు ఏమాత్రం తలొగ్గలేదు. "మా జాతీయ ఇంధన భద్రతే మాకు ప్రథమ ప్రాధాన్యం" అని కుండబద్దలు కొట్టిన ఢిల్లీ దౌత్యనీతి.. ఇప్పుడు రష్యాతో బంధాన్ని సరికొత్త వ్యూహాత్మక శిఖరాలకు చేర్చింది. ఇది కేవలం చౌకగా ముడిచమురు కొనడానికే పరిమితమైన బంధం కాదు.. అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థలో డాలర్ గుత్తాధిపత్యాన్ని బద్దలు కొడుతూ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రికార్డులు సృష్టిస్తున్న సరికొత్త భౌగోళిక రాజకీయ విప్లవం.

చెప్పుల విషయంలో గొడవ  ఎంత పని చేసింది!క్రైమ్Swechaa07 Oct 2026, 01:50 PM

చెప్పుల విషయంలో గొడవ ఎంత పని చేసింది!

చెప్పుల విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ ఇంటి పెద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భార్యభర్తల మధ్య గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని నిరాలినగర్‌లో గల బ్లాసమ్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సందీప్ సింగ్(47) ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకొని గదిలోకి రావడంతో భర్తను.. భార్య కంచన్ నిలదీసింది. బెడ్రూంలోకి బాత్రూం స్లిప్పర్స్ ఎలా వేసుకొచ్చాడని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దగా అయ్యింది. ఈ గొడవ ముదరడం.. భార్య అవమానకరంగా మాట్లాడిందని సందీప్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దాంతో లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఛాతిపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Telangana: దసరా సందర్భంగా TGSRTC బంపరాఫర్-ప్రయాణికుల కోసం అందుబాటులోకి కొత్త సేవలు..తెలంగాణSwechaa07 Oct 2026, 01:48 PM

Telangana: దసరా సందర్భంగా TGSRTC బంపరాఫర్-ప్రయాణికుల కోసం అందుబాటులోకి కొత్త సేవలు..

దసరా పండుగ వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఒకే ప్రాంతానికి వెళ్లే 30 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది గ్రూపుగా బుకింగ్ చేసుకుంటే.. వారి ఇంటి వద్దకే ప్రత్యేక బస్సును పంపి పికప్ చేసే సదుపాయాన్ని అందిస్తోంది. దీంతో బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో, టాక్సీ ఖర్చులతో పాటు సమయం కూడా ఆదా కానుంది. కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలతో పాటు విద్యార్థుల కోసం కాలేజీలు, హాస్టళ్ల నుంచి ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. ఇందుకోసం ఏరియాల వారీగా ప్రత్యేక నంబర్లను ఆర్టీసీ ప్రకటించింది.

రాజకీయాల్లోకి హీరో ధనుష్.. త్వరలో కొత్త పార్టీ ప్రకటన!టాప్ న్యూస్Swechaa07 Oct 2026, 01:31 PM

రాజకీయాల్లోకి హీరో ధనుష్.. త్వరలో కొత్త పార్టీ ప్రకటన!

తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనం చోటుచేసుకోనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాలను సినీరంగం నుంచి వచ్చిన వారే చక్రం తిప్పుతున్నారు. తమిళ ప్రజలు సైతం తమ అభిమాన నటీనటులకే అగ్రతాంబూలం ఇచ్చారు. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, మొన్న వచ్చిన జోసెఫ్ విజయ్ వరకు వీరంతా సినిమాల్లో ఓ వెలుగువెలికి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. , తాజాగా రాజకీయ రంగప్రవేశానికి నటుడు ధనుష్ సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. ‘తమిళగ ఎళుచ్చి కళగం’ (తమిళనాడు పురోగమన పార్టీ) పేరుతో కొత్త పార్టీని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ధనుష్ తన పార్టీ పేరును భారత ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించినట్లు తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే ధనుష్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని సన్నిహితులు చెబుతున్నారు.

Raviteja-Thularabharam: అసలు జేడీ ఒప్పుకున్నాడా?సినిమాSwechaa07 Oct 2026, 01:17 PM

Raviteja-Thularabharam: అసలు జేడీ ఒప్పుకున్నాడా?

Raviteja-Thularabharam: ఒక సినిమాకి ముందు సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి ప్రచారం జరుగుతుంటాయి. కంటెంట్ క్రియేటర్ అనుకుంటే ప్రతీ గాసిప్ కూడా ఒక వైరల్ న్యూస్ అవుతుంది. అది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం. ఇక, ఇటీవల కాలంలో సరికొత్త స్ట్రాటజీను ఉపయోగిస్తున్నారు. ఓపెనింగ్ కి ముందే సినిమాలో ఈ సీనియర్ నటుడున్నాడు.

Anil Ravipudi: అందరికీ నీ అంత టాలెంట్ ఉంటే బావుండు అనీలూ!సినిమాSwechaa07 Oct 2026, 12:47 PM

Anil Ravipudi: అందరికీ నీ అంత టాలెంట్ ఉంటే బావుండు అనీలూ!

Anil Ravipudi: టాలీవుడ్ లో వరుసగా నాలుగు హిట్స్ ఇచ్చారంటే ఆ తర్వాత ఫ్లాప్ పడి..కెరీర్ డైలమాలో పడుతున్న డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. ఒక్కొక్క దర్శకుడు సినిమా సినిమాకి కనీసం మూడేళ్ళైనా గ్యాప్ తీసుకుంటున్నాడు. ఒక సినిమా హిట్ అయితే, ఆ తర్వాత సినిమా కూడా హిట్ అవ్వాలనే ఒత్తిడి..మొదటి సినిమా కంటే రెండవ సినిమా హీరో బిగ్ స్టార్ అయితే బావుండు అనుకోవడం ఒకటి.

కరువొచ్చిన తగ్గేదెలే.. బీర్లకు కొరత రానివ్వం : మంత్రి జూపల్లి కృష్ణారావుతెలంగాణSwechaa07 Oct 2026, 12:46 PM

కరువొచ్చిన తగ్గేదెలే.. బీర్లకు కొరత రానివ్వం : మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్రంలో వర్షాలు లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. జలాశయాల్లో ఆశించిన మేర నీటి నిల్వ లేదు. గతంతో పోలిస్తే ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తెలంగాణలో 17 శాతానికి పైగా లోటు వర్షపాతం నమోదైంది. దీంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం గణనీయంగా పడిపోయింది.సాగు నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. భూగర్భ జలాలు కూడా అడుగుంటుకుపోయాయని తెలుస్తోంది. దిలాఉంటే రైతులు, ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీర్ల కంపెనీలకు నిత్యం నీటి సరఫరా చేసేందుకు ఓకే చెప్పింది. కరువు పరిస్థితులు ఉన్నా బీర్ల తయారీ కోసం కంపెనీలకు శ్రీశైలం నుండి నీటిని ఇస్తామని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజాగా ప్రకటించారు.బీర్ల ఉత్పత్తికి కొరత రాకుండా చూసుకుంటామని పేర్కొన్నారు.ఇందుకోసం శ్రీశైలం నుండి నీటిని సాధ్యమైనంత వరకు వాడుకుంటామని చెప్పారు.

ఇంజినీరింగ్ క్రేజ్ తగ్గుతోందా? డిగ్రీ వైపు పడుతున్న విద్యార్థుల అడుగులుతెలంగాణSwechaa07 Oct 2026, 12:40 PM

ఇంజినీరింగ్ క్రేజ్ తగ్గుతోందా? డిగ్రీ వైపు పడుతున్న విద్యార్థుల అడుగులు

మంచి ర్యాంక్‌ వస్తే ఇంజినీరింగ్‌ కాలేజీలో సీటు.. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. ఇదే ఒకప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోందా? ఇంజినీరింగ్‌ వైపు వెళ్లాల్సిందే అనే ధోరణి క్రమంగా తగ్గుతోందా? తాజా డిగ్రీ ప్రవేశాల గణాంకాలు చూస్తే.. ఈ ప్రశ్న మరోసారి తెరపైకి వస్తోంది.

బాంబు పేల్చిన  ఆర్బీఐ.. పెరగనున్న రుణాల వడ్డీ రేట్లు!వ్యాపారంSwechaa07 Oct 2026, 12:10 PM

బాంబు పేల్చిన ఆర్బీఐ.. పెరగనున్న రుణాల వడ్డీ రేట్లు!

సామాన్యులకు మరోసారి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో అల్లాడుతున్న ప్రజలపై రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(RBI) మరో భారం మోపింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీ రేట్లు ఇంతకాలం తటస్థంగా ఉండగా, ఇప్పుడు పెరగనున్నాయి. చాలిచాలనీ వేతనాలతో నెట్టుకొస్తున్న మధ్యతరగతి, పేదప్రజలకు తాజా ఆర్బీఐ నిర్ణయం పెనుభారంగా మారనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో 3 రోజుల పాటు జరిగిన ఎంపీసీ ద్వైమాసిక సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఉదయం వెల్లడించారు. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగా ‘రెపో రేటు’ను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 5.25 శాతంగా ఉన్న రెపోరేటు 5.5 శాతానికి పెరిగింది.

Mokshagna: ఆరోజెప్పుడు అంటున్న నందమూరి ఫ్యాన్స్..సినిమాSwechaa07 Oct 2026, 11:37 AM

Mokshagna: ఆరోజెప్పుడు అంటున్న నందమూరి ఫ్యాన్స్..

Mokshagna: నందమూరి అభిమానులు దాదాపు 4 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న రోజు దగ్గరపడుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొడుడు మోక్షజ్ఞ తేజ హీరోగా తెలుగుతెరకు పరిచయం కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని తెలుపుతూ ఇటీవలే నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా దర్శకుడు మల్లిడి వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.

అవినీతి జలగలు.. ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్తెలంగాణSwechaa07 Oct 2026, 11:35 AM

అవినీతి జలగలు.. ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

రాష్ట్రంలో అవినీతి అక్రమార్కులు పట్టుబడుతున్నా కొందరిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటూనే అక్రమార్జనకు ఎగబడుతున్నారు.ప్రతిరోజూ ఏదో మూల ఏసీబీకి అధికారులు చిక్కుతున్నారు. ఈ విషయం తెలిసినా లంచం తీసుకుంటే పట్టుబడతామేమో అన్న భయం వారిలో కనిపించడం లేదు. మరికొందరైతే పట్టుబడితే దొంగ? లేదంటే దొర అన్నట్టుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా మరో అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సబ్ ట్రెజరీ ఆఫీస్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మెడికల్ బిల్లులు క్లియర్ చేయడానికి జూనియర్ అసిస్టెంట్ రూ.25 వేలు లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో బాధిత వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. ప్లాన్ ప్రకారం లంచం తీసుకుంటుండగా అధికారిని పట్టుకున్నారు.

Directors: ఒక్క ఫ్లాప్‌తో టాలెంట్ లేనట్టేనా?సినిమాSwechaa07 Oct 2026, 11:13 AM

Directors: ఒక్క ఫ్లాప్‌తో టాలెంట్ లేనట్టేనా?

Directors: ఒక్క ఫ్లాప్.. ఒకే ఒక్క ఫ్లాప్ దర్శకుడినైనా, హీరోనైనా అడ్రస్ లేకుండా చేస్తుంది. వీరికి, ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తే మళ్ళీ సినిమా ఛాన్స్ రావచ్చేమో గానీ, నిర్మాత మాత్రం మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం. ఇలా, ఒక్క భారీ డిజాస్టర్ రాగానే ఇండస్ట్రీలో కనపడకుండాపోయిన వారెందరో ఉన్నారు. ఇక్కడ సక్సెస్ మాత్రమే కొలమానం. నాలుగు భారీ హిట్స్ అందుకున్న వాళ్ళు కూడా ఓ డిజాస్టర్ మూలంగా గడ్డుకాలాన్ని ఎదుర్కోక తప్పడం లేదు.

బీఆర్ఎస్ ఎన్‌కౌంటర్.. రేవంత్ రెడ్డి ఫ్యామిలీని వెంటాడుతున్న ఫ్లెక్సీలు!టాప్ న్యూస్Swechaa07 Oct 2026, 11:00 AM

బీఆర్ఎస్ ఎన్‌కౌంటర్.. రేవంత్ రెడ్డి ఫ్యామిలీని వెంటాడుతున్న ఫ్లెక్సీలు!

నేతల అవినీతి సామ్రాజ్యంపై జోరుగా చర్చ జరుగుతుండటంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.మొన్నటివరకు బీఆర్ఎస్ నేతలు, కల్వకుంట్ల కుటుంబసభ్యుల అక్రమాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవిత, సంతోష్ రావులు గత పదేండ్లలో ఎంతమేర అక్రమాస్తులు సంపాదించారో అసెంబ్లీ వేదికగా చిట్టా విప్పారు.అధికారంలోకి రాక ముందు కేసీఆర్ ఫ్యామిలీ ఆస్తులు ఎంత ఉన్నాయి? అధికారంలోకి వచ్చాక పదేండ్లలో ఎంతమేర పెరిగాయి అనే విషయాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ సైతం ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల ఆస్తులను టార్గెట్ చేసింది.అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి కుటుంబసభ్యుల ఆస్తులు ఎంతఉన్నాయి? సీఎం అయ్యాక ఆయిన ఈ మూడేండ్లలో ఆయన ఫ్యామిలీ ఎంత మేర పెరిగాయి? వారి అవినీతి సామ్రాజ్య చిట్టా విప్పి ప్రజల ముందు ఉంచేందుకు గులాబీ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తోంది.

మోదీ రాజకీయ ప్రస్థానానికి 25 ఏళ్లు.. బీజేపీలో ‘వన్ మ్యాన్ ఆర్మీ’గా ఎలా ఎదిగారు?NationalSwechaa07 Oct 2026, 10:27 AM

మోదీ రాజకీయ ప్రస్థానానికి 25 ఏళ్లు.. బీజేపీలో ‘వన్ మ్యాన్ ఆర్మీ’గా ఎలా ఎదిగారు?

మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని కేవలం ఒక నాయకుడి విజయగాథగా చూస్తే కథ అర్థం కాదు. ఒకప్పుడు ఉమ్మడి నాయకత్వంగా పేరున్న బీజేపీలో.. ఒక నాయకుడే పార్టీకి ప్రైమ్ ఫేస్ గా ఎలా మారారు? అన్నది అసలు ఆసక్తికరమైన ప్రశ్న.

Hyderabad: ఓటర్ లిస్ట్‌పై పొలిటికల్ ఫైట్.. SIRతో కాంగ్రెస్–బీజేపీ ఢీ!!..తెలంగాణSwechaa07 Oct 2026, 09:44 AM

Hyderabad: ఓటర్ లిస్ట్‌పై పొలిటికల్ ఫైట్.. SIRతో కాంగ్రెస్–బీజేపీ ఢీ!!..

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్ - SIR) ప్రక్రియలో అవకతవకలున్నాయనే విమర్శలు ఉన్న సమయంలో ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నకిలీ 'ఫామ్-7' దరఖాస్తులను ఉపయోగించి 30 మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నించిన బీజేపీ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ) ఎస్. బాలచందర్‌పై చిక్కడపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది.

మాటలతో కోటలు..హ్యాండిచ్చిన కర్ణాటక!తెలంగాణSwechaa07 Oct 2026, 09:31 AM

మాటలతో కోటలు..హ్యాండిచ్చిన కర్ణాటక!

జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ మంత్రుల బృందం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయి నీటి విడుదలకు ఒప్పించామని, జూరాలకు జలకళ తీసుకువచ్చామని హడావుడి చేశారు. అయితే, అక్కడ కర్ణాటక స్థానిక నేతలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఆ ప్రభుత్వం నీటి విడుదలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తీవ్ర పంట కష్టాలు ఎదురవుతున్నాయి.

ముంచుకొస్తున్న ‘విపత్తు’.. అన్నదాత గోడు సర్కారుకు పట్టదా?తెలంగాణSwechaa07 Oct 2026, 09:21 AM

ముంచుకొస్తున్న ‘విపత్తు’.. అన్నదాత గోడు సర్కారుకు పట్టదా?

తెలంగాణలో వానలు తగ్గాయి. పంటలపై ఒత్తిడి పెరుగుతోంది. జలాశయాల్లో గతంతో పోలిస్తే నీటి నిల్వలు తగ్గాయి. భూగర్భజలాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే భయంకరమైన కరువు తప్పదా? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి. అయితే, కరువు వచ్చాక స్పందించడమేనా? లేక కరువు రాకముందే రైతును కాపాడే చర్యలు మొదలవ్వాలా? ఇదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందున్న కీలక ప్రశ్న. వర్షం తగ్గితే పంట దెబ్బతింటుంది. రైతుకు కావాల్సింది కేవలం ఒక ప్రకటన కాదు. భరోసా. పంట నష్టపోతే పరిహారం వస్తుందనే నమ్మకం కావాలి. రబీకి నీరు ఉంటుందనే నమ్మకం కావాలి. తర్వాతి పంటకు పెట్టుబడి దొరుకుతుందనే నమ్మకం కావాలి. తక్కువ నీటితో పంట వేసినా మార్కెట్ ఉంటుందనే నమ్మకం కావాలి. అన్నింటికంటే తాను ఒంటరిగా లేననే నమ్మకం రైతుకు కలగాలి. ఇవన్నీ చేయాల్సింది ఎవరు..? ప్రభుత్వమే. అవును ప్రభుత్వం మాత్రమే.

BRS: కాంగ్రెస్​కు బీఆర్​ఎస్​ కౌంటర్​ ప్లాన్.. గులాబీలో జోష్ కోసం ​సీఎం అడ్డాలోనే భారీ దంగల్!!..తెలంగాణSwechaa07 Oct 2026, 07:40 AM

BRS: కాంగ్రెస్​కు బీఆర్​ఎస్​ కౌంటర్​ ప్లాన్.. గులాబీలో జోష్ కోసం ​సీఎం అడ్డాలోనే భారీ దంగల్!!..

రాష్ట్రంలో రాజకీయ పోరు రోజు రోజుకు ముదురుతుంది. మళ్ళీ అధికార పీఠం దక్కించుకోవాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ వ్యూహా రచనలో భాగంగా బీఆర్ఎస్ పై ఆరోపణలు, విమర్శల బాణాలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే..ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలకు ధీటుగా కౌంటర్ ఇచ్చేందుకు గులాబీ దళం వ్యూహాలు రచిస్తోంది.

ఏకంగా ముఖ్యమంత్రి సొంత అడ్డా అయిన కొడంగల్‌లోనే భారీ బహిరంగ సభ నిర్వహించి సవాల్ విసిరేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ప్రభుత్వ వైఫల్యాలు, హామీల అమల్లో జాప్యాన్ని ఎండగడుతూ రేవంత్ సర్కార్‌ను డిఫెన్స్‌లో పడేసేందుకు, గులాబీ కేడర్‌లో కొత్త జోష్ నింపేందుకు పావులు కదుపుతున్నారు!..

రాత్రి అయితే చాలు ఇళ్లపై రాళ్ల దాడులు.. అప్పాజీపేటలో భయంభయంఏపీSwechaa07 Oct 2026, 12:48 AM

రాత్రి అయితే చాలు ఇళ్లపై రాళ్ల దాడులు.. అప్పాజీపేటలో భయంభయం

Stone Attack: అనంతపురము జిల్లా పామిడి మండలం అప్పాజీపేట గ్రామంలో అంతుచిక్కని వింత జరుగుతోంది. రాత్రి అయితే చాలు గ్రామస్తుల ఇళ్లపై అకస్మాత్తుగా రాళ్లు పడుతున్నాయి. రాత్రి వేళ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియని రాళ్లు ఇళ్లపై వర్షంలా కురుస్తున్నాయి.

ఒకటి, రెండు రోజులు కాదు.. వారం రోజులుగా ఇదే పరిస్థితి. ఇళ్లపై రాళ్ల మోతతో గ్రామస్తులు భయం భయంగా గడుపుతున్నారు. వారికి కంటి మీద కనుకు లేకుండా పోయింది. రాత్రి అయితే చాలు తమ ఇళ్లపై రాళ్లు పడుతున్నాయని వాపోతున్నారు. అసలు ఎక్కడి నుంచి రాళ్లు వస్తున్నాయో తెలియక అయోమయం చెందుతున్నారు. ఇది ఆకతాయిల పనేమోనని భావించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రష్యాలో ప్లేగు కలకలం.. భారత్ అప్రమత్తం కావాల్సిందేనా?InternationalSwechaa06 Oct 2026, 11:45 PM

రష్యాలో ప్లేగు కలకలం.. భారత్ అప్రమత్తం కావాల్సిందేనా?

భారత్‌కు ప్లేగు కొత్త విషయం కాదు. 1994లో దేశంలో ప్లేగు కలకలం రేపింది. మహారాష్ట్రలోని బీడ్ ప్రాంతంలో కేసులు నమోదైన తర్వాత గుజరాత్‌లోని సూరత్‌లోనూ పరిస్థితి తీవ్రంగా మారింది. ఆ సమయంలో వందలాది కేసులు, మరణాలు నమోదయ్యాయి. అందుకే ఇప్పుడీ టెన్షన్.

స్టైల్ మార్చిన కాంగ్రెస్.. రోడ్డెక్కిన గాంధీ పరివార్!NationalSwechaa06 Oct 2026, 11:03 PM

స్టైల్ మార్చిన కాంగ్రెస్.. రోడ్డెక్కిన గాంధీ పరివార్!

కాంగ్రెస్ రాజకీయ శైలి నెమ్మదిగా మారుతోంది. రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. అవసరమైతే రోడ్డుపైకి వచ్చి పోరాడుతున్నారు. కార్యకర్తల మధ్య నిలబడుతున్నారు. పోలీసుల్ని ఎదుర్కొంటున్నారు. అసలు ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఎందుకు మారుస్తోంది..?

ఆ 45 ఎక‌రాల గుర్తింపున‌కు స‌ర్వే చేయండి- ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలుఅభిప్రాయంSwechaa06 Oct 2026, 10:54 PM

ఆ 45 ఎక‌రాల గుర్తింపున‌కు స‌ర్వే చేయండి- ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Erravalli Lands: సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల పరిధిలో 45 ఎక‌రాల భూముల ఆచూకీ ల‌భ్యం కానుందున, వాటి గుర్తింపున‌కు వెంట‌నే స‌ర్వే నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 22ఏపై శాసనసభలో గత నెల 16న నిర్వ‌హించిన చర్చలో ఆ భూముల‌పై విచార‌ణ‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ విచారణ పురోగతిపై ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్ లో ముఖ్యమంత్రి రేవంత్ మంగ‌ళ‌వారం రాత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ‌ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భూ అక్రమాలపై విచార‌ణ‌కు వేసిన కమిటీ, ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సభ్యులు ఈ స‌మీక్ష‌లో పాల్గొన్నారు.

Revanth Reddy: జ్ఞానేష్ రాజీనామా చేసేదాకా పోరాడుతాం.. రాహుల్ అరెస్ట్‌పై రేవంత్ ఫైర్..NationalSwechaa06 Oct 2026, 10:24 PM

Revanth Reddy: జ్ఞానేష్ రాజీనామా చేసేదాకా పోరాడుతాం.. రాహుల్ అరెస్ట్‌పై రేవంత్ ఫైర్..

Revanth Reddy: సర్ ప్రక్రియలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేవరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. ఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో పాటు ఎంపీలను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రస్థాయిలో తప్పుబట్టారు."రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు శాంతియుతంగా రోడ్డెక్కిన ప్రతిపక్ష నేతలను అన్యాయంగా అదుపులోకి తీసుకోవడం ముమ్మాటికీ అప్రజాస్వామికం" అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పోలీసులను అడ్డం పెట్టుకుని భయపెట్టాలని చూస్తోందని.. జైళ్లు, లాఠీఛార్జీలు, తప్పుడు కేసులు గాంధీ కుటుంబానికీ, కాంగ్రెస్ శ్రేణులకూ కొత్తేమీ కాదని గుర్తు చేశారు.

Rahul Gandhi Arrested: రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్.. 9 గంటల పాటు ఆకాశవాణి భవన్‌ వద్ద ధర్నా!NationalSwechaa06 Oct 2026, 10:09 PM

Rahul Gandhi Arrested: రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్ట్.. 9 గంటల పాటు ఆకాశవాణి భవన్‌ వద్ద ధర్నా!

Rahul Gandhi Arrested: దేశ రాజధానిలో మంగళవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని, సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ‘ఇండియా’ కూటమి చేపట్టిన పార్లమెంట్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. ఆకాశవాణి భవన్ ఆవరణలో దాదాపు 9 గంటల పాటు కూర్చున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ సహా పలువురు అగ్రనేతలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 50 మంది ఎంపీలతో పాటు సుమారు 250 మందిని పోలీసులు డిటెయిన్ చేశారు.పార్లమెంట్ మెయిన్ గేట్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్‌కు ఇండియా కూటమి ఎంపీలు పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు. నీతి ఆయోగ్, ఆకాశవాణి భవన్ వద్ద భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో రాహుల్ గాంధీ బారికేడ్లు ఎక్కి జాతీయ జెండా ఊపుతూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

OYO Rooms: ఓయో రూముల్లో భయంకర ఘటనలు.. తస్మాత్ జాగ్రత్త!తెలంగాణSwechaa06 Oct 2026, 10:03 PM

OYO Rooms: ఓయో రూముల్లో భయంకర ఘటనలు.. తస్మాత్ జాగ్రత్త!

OYO Rooms: ప్రైవసీ అనే ఒకే ఒక్క మాటను నమ్మి గది తలుపులు వేసుకుంటున్న యువతులకు, ఆ నాలుగు గోడలే సమాధులుగా మారుతున్న భయానక వాస్తవం ఇప్పుడు హైదరాబాద్‌ను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఒకప్పుడు ప్రేమ జంటలు బహిరంగ ప్రదేశాల్లో కలిసేవి.. కానీ నేడు ‘ప్రైవసీ’ ముసుగులో హోటల్ గదుల వైపు అడుగులు వేస్తున్నారు. తీరా ఆ తలుపులు మూసుకున్నాక ప్రేమ మాయమై, క్షణికావేశాలు, దురాశల రూపంలో మారణకాండ సాగుతోంది. కేవలం 12 రోజుల వ్యవధిలోనే ముగ్గురు యువతులు వేర్వేరు ఓయో హోటల్ గదుల్లో దారుణ హత్యకు గురికావడం రాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది.నగరంలోని మూడు వేర్వేరు ప్రాంతాలు, వేర్వేరు తేదీలు.. కానీ జరిగిన దారుణం మాత్రం ఒక్కటే. రక్తపు మడుగుల్లో ప్రాణాలు కోల్పోయిన యువతులు, తాళాలు వేసి పరారైన ప్రియుళ్లు. సెప్టెంబర్ 21, మాదాపూర్ సిద్దిఖీ నగర్ ఓయో రూమ్ నెంబర్ 303లో విశాఖకు చెందిన నికిత దారుణ హత్యకు గురైంది.

Telangana SIR: ఓటర్లకు లాస్ట్ ఛాన్స్.. ఎస్‌ఐఆర్ అభ్యంతరాల గడువు రేపటితో క్లోజ్!తెలంగాణSwechaa06 Oct 2026, 09:51 PM

Telangana SIR: ఓటర్లకు లాస్ట్ ఛాన్స్.. ఎస్‌ఐఆర్ అభ్యంతరాల గడువు రేపటితో క్లోజ్!

Telangana SIR: తెలంగాణలో ఓటర్ల లిస్ట్ సవరణ గడువు రేపటితో (అక్టోబర్ 7) క్లోజ్ కానుంది. ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు చెప్పాలన్నా, కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవాలన్నా బుధవారమే లాస్ట్ డేట్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే తర్వాత ఏకంగా 73.39 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఇప్పటిదాకా 7,56,180 మంది అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఎన్నికల సంఘానికి సమర్పించారు.