స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Telangana SIR: ఓటర్లకు లాస్ట్ ఛాన్స్.. ఎస్‌ఐఆర్ అభ్యంతరాల గడువు రేపటితో క్లోజ్!తెలంగాణSwechaa06 Oct 2026, 09:51 PM

Telangana SIR: ఓటర్లకు లాస్ట్ ఛాన్స్.. ఎస్‌ఐఆర్ అభ్యంతరాల గడువు రేపటితో క్లోజ్!

Telangana SIR: తెలంగాణలో ఓటర్ల లిస్ట్ సవరణ గడువు రేపటితో (అక్టోబర్ 7) క్లోజ్ కానుంది. ఓట్ల గల్లంతుపై అభ్యంతరాలు చెప్పాలన్నా, కొత్తగా ఓటు కోసం అప్లై చేసుకోవాలన్నా బుధవారమే లాస్ట్ డేట్. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వే తర్వాత ఏకంగా 73.39 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో ఇప్పటిదాకా 7,56,180 మంది అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఎన్నికల సంఘానికి సమర్పించారు.

New IAF Chief: ఎయిర్‌ఫోర్స్ కొత్త బాస్‌గా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్ దీక్షిత్..NationalSwechaa06 Oct 2026, 09:30 PM

New IAF Chief: ఎయిర్‌ఫోర్స్ కొత్త బాస్‌గా ఎయిర్‌ మార్షల్‌ అశుతోష్ దీక్షిత్..

New IAF Chief: భారత వాయుసేన కొత్త ఎయిర్ చీఫ్‌గా ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్, ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఈ నెల 31న రిటైర్ కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం అశుతోష్ దీక్షిత్ అధికారికంగా వాయుసేనాధిపతిగా పగ్గాలు అందుకోనున్నారు. ఆయన 2028 డిసెంబర్ 31 వరకు ఈ అత్యున్నత హోదాలో కొనసాగుతారు.1966 డిసెంబర్‌లో జన్మించిన అశుతోష్ దీక్షిత్, 1986 డిసెంబర్‌లో భారత వైమానిక దళంలో కమీషన్డ్ ఆఫీసర్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. దాదాపు 40 ఏళ్ల తన సుదీర్ఘ సర్వీసులో ఎన్నో కీలక విభాగాలు, బాధ్యతలను సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. కీలక ఆపరేషన్లలో లీడింగ్ రోల్.. 3,500 గంటల ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆయన సొంతం.

Jailer 2: అల్లు అర్జున్ స్టామినా రజినీకాంత్‌కి లేదా?సినిమాSwechaa06 Oct 2026, 09:14 PM

Jailer 2: అల్లు అర్జున్ స్టామినా రజినీకాంత్‌కి లేదా?

Jailer 2: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ జైలర్ 2. ఈ అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాపై కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు మన టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా, ఈ సినిమా బ్లాక్ బస్టర్ జైలర్ కి సీక్వెల్ కావడం కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడానికి ఓ ముఖ్య కారణం.

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్క్రైమ్Swechaa06 Oct 2026, 09:04 PM

ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్

Uday Krishna Reddy: ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ లభించింది. రంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తోటి మహిళా ట్రైనీ IPSను లైంగికంగా వేధించారన్న ఆరోపణల కేసులో ఉదయ్ కృష్ణా రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. మహిళ ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ అనంతరం ఉదయ్ ని పోలీసులు చంచల్‌గూడ జైలుకి తరలించారు. 67 రోజుల పాటు ఉదయ్ జైలులోనే గడిపాడు. విచారణ, వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసింది కోర్టు. కేసు నేపథ్యంలో సస్పెన్షన్ వేటు పడింది.

ఏడాదిలోగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లుతెలంగాణSwechaa06 Oct 2026, 08:46 PM

ఏడాదిలోగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు

Indiramma Illu: మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు.. అర్హులైన పట్టణ పేద, మధ్య తరగతి కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం అని తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. పేదల అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.

Harmanpreet Kaur: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ గుడ్‌బై.. బీసీసీఐపై అలిగి తప్పుకుందా?క్రీడలుSwechaa06 Oct 2026, 08:25 PM

Harmanpreet Kaur: కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ గుడ్‌బై.. బీసీసీఐపై అలిగి తప్పుకుందా?

Harmanpreet Kaur: టీమిండియా మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ నుంచి హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకోవడం వెనుక అసలు గుట్టు విషయం బయటపడింది. బీసీసీఐ తీసుకున్న ఓ వివాదాస్పద నిర్ణయమే ఆమె తీసుకున్న ఈ సంచలన నిర్ణయానికి దారితీసినట్లు తెలుస్తోంది. బోర్డు తీరుపై తీవ్ర అసంతృప్తి చెందిన హర్మన్.. ఏకంగా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొని గట్టి షాకిచ్చిందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి.టీ20 జట్టు పగ్గాలను మరొకరికి అప్పగించి, హర్మన్‌ను కేవలం వన్డేలకే కెప్టెన్‌గా ఉంచాలని సెలక్టర్లు ప్రతిపాదించారు. అయితే ఈ స్ప్లిట్ కెప్టెన్సీ ఆఫర్‌ను హర్మన్‌ప్రీత్ ముఖం మీదే తిరస్కరించిందని తెలుస్తుంది. నాయకత్వం ఇస్తే అన్నింటికీ ఉండాలి కానీ, ఇలా అరకొరగా బాధ్యతలు తీసుకోవడం తనకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టిందని క్రీడా వర్గాలు పేర్కొంటున్నాయి. బోర్డు పెట్టిన ఈ కండిషన్‌ హర్మన్‌ప్రీత్‌కి నచ్చకపోవడంతోనే ఆమె అన్ని ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేసినట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Governor Quota MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో రసవత్తర ఫైట్! కాంగ్రెస్ పెద్దల ఫైనల్ లిస్ట్ లీక్?తెలంగాణSwechaa06 Oct 2026, 08:19 PM

Governor Quota MLC: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రేసులో రసవత్తర ఫైట్! కాంగ్రెస్ పెద్దల ఫైనల్ లిస్ట్ లీక్?

Governor Quota MLC: తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో గవర్నర్ కోటా నామినేటెడ్ ఎమ్మెల్సీల వ్యవహారం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ల పదవీకాలం నవంబర్ 14తో ముగియనుండటంతో, వారి స్థానాల్లో రాజ్ భవన్‌కు పంపే పేర్లను ఖరారు చేసేందుకు అధిష్ఠానం కసరత్తు కొలిక్కి తెచ్చినట్లు తెలుస్తుంది. ఉన్నవి 3 సీట్లు.. కానీ రేసులో డజన్ల కొద్దీ ఆశావహులు ఉండటంతో గాంధీ భవన్ నుంచి ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దల దాకా ముమ్మర లాబీయింగ్ సాగుతుందనే చర్చ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా సాగుతుంది. అయితే కేబినెట్ భేటీ వేదికగా గవర్నర్‌కు సిఫారసు చేయబోయే ముగ్గురి ఫైనల్ లిస్ట్ దాదాపు రెడీ అయ్యిందన్న లీక్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చకు తెరలేపింది.

Hyderabad: వందల కోట్లు ఖర్చు.. వేల చెట్ల తొలగింపు.. కేబీఆర్ ఫ్లైఓవర్ పనుల్లో లాభ నష్టాలు ఇవే?..తెలంగాణSwechaa06 Oct 2026, 08:09 PM

Hyderabad: వందల కోట్లు ఖర్చు.. వేల చెట్ల తొలగింపు.. కేబీఆర్ ఫ్లైఓవర్ పనుల్లో లాభ నష్టాలు ఇవే?..

కేబీఆర్ పార్క్ (KBR Park) చుట్టూ చేపట్టిన ప్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణ పనులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి రీడిజైన్ చేస్తూ ఆ బాధ్యతలను మేఘా సంస్థకు అప్పగిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Oman Coast: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై మిస్సైల్ దాడి.. 11 మంది ఇండియన్స్‌కి గాయాలు!NationalSwechaa06 Oct 2026, 07:37 PM

Oman Coast: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై మిస్సైల్ దాడి.. 11 మంది ఇండియన్స్‌కి గాయాలు!

Oman Coast: ఒమన్ సమీపంలోని హర్మూజ్ జలసంధిలో పనామా ఫ్లాగ్‌తో వెళ్తున్న ఓ కార్గో షిప్‌ను గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు. ఈ దాడిలో షిప్‌లో పనిచేస్తున్న 11 మంది భారతీయ క్రూ మెంబర్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సమాచారాన్ని న్యూఢిల్లీలోని భారత విదేశాంగ శాఖ (MEA) అధికారికంగా కన్ఫర్మ్ చేసింది.దాడి జరిగిన వెంటనే సమాచారం అందుకున్న ఒమన్ మారిటైమ్ అథారిటీస్, కోస్ట్‌గార్డ్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇండియన్ క్రూ మెంబర్స్‌ను షిప్ నుంచి సేఫ్‌గా ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం లోకల్ హాస్పిటల్స్‌లో వారికి ఎమర్జెన్సీ మెడికల్ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. టైంకి రియాక్ట్ అయ్యి మనవాళ్ల ప్రాణాలు నిలబెట్టిన ఒమన్ సర్కారుకు కేంద్ర ప్రభుత్వం థాంక్స్ చెప్పింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని మస్కట్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

పాకిస్తాన్‌కు దేశ రక్షణ సంస్థల రహస్యాలు.. భారీ కుట్రను బయటపెట్టిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ఏపీSwechaa06 Oct 2026, 07:22 PM

పాకిస్తాన్‌కు దేశ రక్షణ సంస్థల రహస్యాలు.. భారీ కుట్రను బయటపెట్టిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్

Spy Network: భారత నేవీలో గూఢచర్యం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. దేశ నేవీ, రక్షణ సంస్థల రహస్యాలను శత్రువుకి చేరవేసిన వైనం అలజడి సృష్టిస్తోంది. విశాఖ కేంద్రంగా జరిగిన ఈ భారీ గూఢచర్యం కుట్రను ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్ లో పాకిస్తాన్ స్పై నెట్ వర్క్ వ్యవహారం సంచలనంగా మారింది. ఆపరేషన్ ఫైర్ వాల్ 2026 పేరుతో ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేపట్టింది. ఈ ఆపరేషన్ ద్వారా భారీ కుట్రను బహిర్గతం చేసింది. శత్రువు చేతికి దేశ నేవీ, రక్షణ రహస్యాలను చేరవేస్తున్న ముఠాను వెలుగులోకి తెచ్చింది.

Tollywood: సినిమా తీయాలంటే 100 కోట్లు సరిపోదా?సినిమాSwechaa06 Oct 2026, 06:53 PM

Tollywood: సినిమా తీయాలంటే 100 కోట్లు సరిపోదా?

Tollywood: ఒక సినిమా తీయాలంటే అసలు బడ్జెట్ ఎంత కావాలి.? కాస్త నిశితంగా ఆలోచిస్తే చాలామందికి ఈ మధ్య కాలంలో వస్తోన్న అతిపెద్ద సందేహం. దీనికి కారణం, పాన్ ఇండియా సినిమా తీశామంటూ ప్రభుత్వాలను అడిగితే, ఒక్కసారిగా థియేటర్స్‌లో షోకి టికెట్ రేట్లను పెంచుకోమంటూ జీవో జారీ చేస్తున్నారు.

Telangana: ట్రబుల్ షూటర్ హరీషు.. నీ గిల్లుడు తక్కువేం కాదు!.. మామకు తగ్గ అల్లుడు.. బావకు తగ్గ బావమరిదివే!!..తెలంగాణSwechaa06 Oct 2026, 06:28 PM

Telangana: ట్రబుల్ షూటర్ హరీషు.. నీ గిల్లుడు తక్కువేం కాదు!.. మామకు తగ్గ అల్లుడు.. బావకు తగ్గ బావమరిదివే!!..

తెలంగాణ ఉద్యమంలో సాదాసీదా జీవితం నుంచి రాజకీయంగా ఎదిగిన హరీష్‌రావు.. ఇప్పుడు ఆస్తుల లెక్కలపై ప్రతిపక్షాల టార్గెట్‌గా మారారు. 2018లో తన అఫిడవిట్‌లో 11 కోట్ల 44 లక్షల ఆస్తులు చూపించిన హరీష్‌రావు.. 2023 నాటికి 24 కోట్ల 29 లక్షలుగా ప్రకటించారు. అంటే ఐదేళ్లలో ఆయన ఆస్తులు గణనీయంగా పెరిగాయి. సోషల్ మీడియాలో మాత్రం దీనికి మించి వేల కోట్ల బినామీ ఆస్తులు, ఫామ్‌హౌస్‌ల ఆరోపణలు వైరల్ అవుతున్నాయి.

RC17: త్రివిక్రమ్, సుకుమార్‌లలో ఈ మార్పు ఎందుకు?సినిమాSwechaa06 Oct 2026, 05:58 PM

RC17: త్రివిక్రమ్, సుకుమార్‌లలో ఈ మార్పు ఎందుకు?

RC17: టాలీవుడ్‌లో ఇప్పుడు రెండు క్రేజీ కాంబినేషన్స్ గురించి అటు అభిమానులు, ఇటు సినీ వర్గాలు ఎంతో ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఆ కాంబినేషన్సే త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్‌టిర్, సుకుమార్-రామ్ చరణ్. ఈ కాంబోలో సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వస్తుందో.. అనేదే అందరిలో జరుగుతున్న చర్చ. అయితే, సుకుమార్-చరణ్ ల ఆర్సీ 17 ఈ దసరాకి పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

CEC: దేశవ్యాప్తంగా రగులుతున్న ఎస్ఐఆర్ రగడ! సీఈసీ రాజీనామా చేయకతప్పదా?NationalSwechaa06 Oct 2026, 05:41 PM

CEC: దేశవ్యాప్తంగా రగులుతున్న ఎస్ఐఆర్ రగడ! సీఈసీ రాజీనామా చేయకతప్పదా?

CEC: భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా దావానలంలా రగులుతోంది. ఏకంగా 13 కోట్ల మంది ఓటర్లను అనుమానితుల జాబితాలో నెట్టేయడం, సాక్షాత్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలపై సుప్రీంకోర్టు విచారణకు తెరతీయడంతో విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సీఈసీ రాజీనామా అస్త్రం సంధించాయి. వ్యవస్థల స్వయంప్రతిపత్తికే సవాలుగా మారిన ఈ సంక్షోభంలో సీఈసీ తన పదవికి రాజీనామా చేయకతప్పదా అనే పరిస్థితి నెలకొందా అనే చర్చ సర్వత్రా మొదలైంది.ఓటర్ల జాబితాను సరిచేయాల్సిన ప్రక్రియ కాస్తా పౌరుల ఓటు హక్కును హరించే స్థాయికి దిగజారిందన్న ఆరోపణలు క్షేత్రస్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. 'షిఫ్టెడ్, ఆబ్సెంట్' పేరుతో ఏకంగా 13 కోట్ల మంది ఓటర్లను అనుమానాస్పద జాబితాలో చేర్చడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది.

Current Bill Hike: తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ ఇవ్వబోతుందా?తెలంగాణSwechaa06 Oct 2026, 03:59 PM

Current Bill Hike: తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ ఇవ్వబోతుందా?

Current Bill Hike: ఉచిత విద్యుత్, సంక్షేమ పథకాల ప్రచారాలతో ఊదరగొడుతున్న వేళ.. తెలంగాణ ప్రజలకు తెలియకుండానే వెనుక గుమ్మం నుంచి భారీ కరెంట్ షాక్ ఇవ్వడానికి రంగం సిద్ధమైందా? సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై ఏకంగా రూ.5,420 కోట్ల పిడుగు పడబోతోందా? అంటే అందుతున్న సంకేతాలు ‘అవుననే’ స్పష్టం చేస్తున్నాయి. గతంలో వాడిన విద్యుత్‌కు సంబంధించి లెక్కలు సరిచేయాలంటూ డిస్కంలు తెరపైకి తెచ్చిన ‘ట్రూ అప్’ బాదుడుకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) పచ్చజెండా ఊపడంతో, వచ్చే నవంబర్ నుంచి రాష్ట్రంలోని ప్రతి ఇంటా కరెంట్ బిల్లుల మోత మోగడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ భారం ఏదో ఒకటి, రెండు నెలలు ఉండి సర్దుకుంటుందంటే పొరపాటే. ప్రజల జేబులను ఏళ్ల తరబడి ఖాళీ చేసేలా ఒక పక్కా రోడ్‌మ్యాప్‌ను రెడీ చేశారు. వచ్చే నవంబర్ నుంచి జారీ చేసే బిల్లుల్లో ప్రతి యూనిట్‌పై 30 పైసల ఎక్స్‌ట్రా ఛార్జ్ పడనుంది. ఇక డిసెంబర్ నుంచి ఏకంగా యూనిట్‌కు 50 పైసలకు పెంచనున్నారు. దక్షిణ డిస్కం (TGSPDCL) పరిధిలో ఏకంగా 29 నెలల పాటు, ఉత్తర డిస్కం (TGNPDCL) పరిధిలో 26 నెలల పాటు ఈ ఎక్స్‌ట్రా బాదుడు నిర్విరామంగా కొనసాగనుంది.

Tollywood: కమర్షియల్ సినిమాలకి కాలం చెల్లిందా?సినిమాSwechaa06 Oct 2026, 03:56 PM

Tollywood: కమర్షియల్ సినిమాలకి కాలం చెల్లిందా?

Tollywood: కమర్షియల్ సినిమాలకి రానున్న రోజుల్లో కాలం చెల్లబోతుందా? ప్రస్తుతం మన సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు ఇతర భాషలలో రూపొందుతున్న సినిమాలను చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రతీ 10 ఏళ్లకి ఇండస్ట్రీలో ఒక జానర్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోను దృష్టిలో పెట్టుకొనే కథలు తయారయ్యేవి. ఆ కథలతోనే బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు.

కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆనాడు టీడీపీకి ప్రజలు షాకిచ్చారుతెలంగాణSwechaa06 Oct 2026, 03:47 PM

కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆనాడు టీడీపీకి ప్రజలు షాకిచ్చారు

Power Bills: విద్యుత్ ఛార్జీల మోతపై మాజీమంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఓవైపు పెరిగిన నిత్యావసరాల ధరలతో.. మరోవైపు కరవుతో సామాన్య ప్రజలు కుదేలయ్యారని వాపోయారు. ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచి వారిపై మరింత భారం మోపడం సరికాదన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు హరీశ్ రావు.

‘రియల్ హీరో’ స్మిత్ మచ్చార్ ఆరోగ్యంపై ఆందోళన.. డాక్టర్లు ఏం చెప్పారంటే?InternationalSwechaa06 Oct 2026, 03:25 PM

‘రియల్ హీరో’ స్మిత్ మచ్చార్ ఆరోగ్యంపై ఆందోళన.. డాక్టర్లు ఏం చెప్పారంటే?

 ఫ్లైదుబాయ్ విమానంలో ఒమనీ కో-పైలట్ దాడి నుంచి విమానాన్ని సురక్షితంగా కాపాడిన భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్చార్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాక్‌పిట్ గొడ్డలితో కో-పైలట్ జరిపిన దాడిలో మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనకు యూఏఈలోని అబుధాబిలో ఉన్న మిలిటరీ ఆసుపత్రి నిపుణులు అత్యవసర వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పుర్రెలో తీవ్ర ఫ్రాక్చర్ ఏర్పడినట్లు వైద్యులు తెలిపారు.

ఫారమ్ -6‌పై రాహుల్ గాంధీ అబద్ధాలు.. తెలంగాణ సీఈవో ఫ్యాక్ట్‌చెక్  క్లారిటీNationalSwechaa06 Oct 2026, 03:25 PM

ఫారమ్ -6‌పై రాహుల్ గాంధీ అబద్ధాలు.. తెలంగాణ సీఈవో ఫ్యాక్ట్‌చెక్ క్లారిటీ

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఫారమ్-6లో ఏకపక్షంగా మార్పులు చేసి కేంద్రంలోని మోడీ సర్కారుకు మేలు జరిగేలా సీఈసీ జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు తీసుకున్నారని.. అందుకే ఆయన రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై తెలంగాణ సీఈవో సుదర్శన్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన పోస్టును తోసిపుచ్చిన సీఈవో.. ఫారమ్-6 డిక్లరేషన్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ప్రతి నిర్ణయం కమిషన్ పూర్తి ఆమోదంతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడే జరిగిందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. బిహార్‌లో ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం 2025 జూన్ 24న జారీచేసిన ఆదేశాలను ఎన్నికల సంఘం సభ్యులు అందరి ఏకగ్రీవ ఆమోదంతోనే అమలు చేసిందన్నారు.

Ramappa Temple: రామప్పపై సింగరేణి పిడుగు.. 3 టీఎంసీల జలప్రళయం తప్పదా?తెలంగాణSwechaa06 Oct 2026, 03:05 PM

Ramappa Temple: రామప్పపై సింగరేణి పిడుగు.. 3 టీఎంసీల జలప్రళయం తప్పదా?

కాకతీయ శిల్పకళా వైభవానికి మకుటంలా నిలిచి, అంతర్జాతీయ వేదికపై తెలుగు ఖ్యాతిని రెపరెపలాడించిన రామప్ప గుడికి ఊహించని పిడుగులాంటి వార్త తగిలింది. ఎనిమిది శతాబ్దాలుగా ఎన్నో భూకంపాలను, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా చరిత్ర సృష్టించిన ఈ మహాద్భుత కట్టడంపై ఇప్పుడు సింగరేణి డైనమైట్లు గురిపెట్టాయి. ములుగు జిల్లా వెంకటాపూర్‌లో సింగరేణి తలపెట్టిన భారీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు.. పక్కనే ఉన్న చారిత్రక రామప్ప చెరువును పగలగొట్టి, ఆ నీటితో రామప్ప గుడి ఉనికినే శాశ్వతంగా కనుమరుగు చేయబోతోందా అనే భయం ఇప్పుడు యావత్ తెలంగాణను వణికిస్తోంది.

బినామీలు, స్కాములపై సమాధానం చెప్పలేకే నా అరెస్టు : మన్నెక్రిశాంక్తెలంగాణSwechaa06 Oct 2026, 02:57 PM

బినామీలు, స్కాములపై సమాధానం చెప్పలేకే నా అరెస్టు : మన్నెక్రిశాంక్

బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను పోలీసులు మరోసారి అరెస్టు చేశారు. ఇటీవల ఆయన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం క్రిశాంక్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు సికింద్రాబాద్ కోర్టుకు తరలించారు. అయితే, మన్నె క్రిశాంక్ అరెస్టుపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్ రెడ్డి కుటుంబం చేసిన రూ.50వేల కోట్ల అవినీతి సామ్రాజ్యం మీద ప్రెస్‌మీట్ పెడితే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించడంతో పాటు వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కోర్టు వద్దకు భారీ ఎత్తున నాయకులు,కార్యకర్తలు చేరుకుంటున్నారు.అయితే, గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు. ‘నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ములేకే అరెస్ట్ చేశారు.

AIWorkplace: 4 గంటలు పనిచేస్తే చాలు: '70 గంటల పని' చర్చపై రచయిత!వ్యాపారంSwechaa06 Oct 2026, 02:37 PM

AIWorkplace: 4 గంటలు పనిచేస్తే చాలు: '70 గంటల పని' చర్చపై రచయిత!

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువ గంటలు పనిచేయడం కంటే పని నాణ్యత, ఏకాగ్రతలే అత్యంత ముఖ్యమని ప్రముఖ రచయిత చేతన్ భగత్ స్పష్టం చేశారు. బెంగళూరులో జరిగిన 18వ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సౌత్ ఏషియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి అంతరాయాలు, సమావేశాలు, విరామాలు లేకుండా పూర్తి ఏకాగ్రత, క్రమశిక్షణతో రోజుకు 4 గంటలు పనిచేస్తే ఉత్తమ ఉత్పాదకత సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఆఫీసులో ఉద్యోగి ఎన్ని గంటలు గడిపారనే దానికంటే ఎంత నాణ్యమైన పని పూర్తి చేశారనేదే ప్రధానమని చేతన్ భగత్ పేర్కొన్నారు.

వంటగదిలో ఉల్లి మంట.. భారంగా మారిన నిత్యావసరాలు!తెలంగాణSwechaa06 Oct 2026, 02:21 PM

వంటగదిలో ఉల్లి మంట.. భారంగా మారిన నిత్యావసరాలు!

 తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా నిరంతరాయంగా పెరుగుతున్న ధరలతో కూరగాయల మార్కెట్లో ఉల్లిపాయలు కొనాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో సోమవారం ఉల్లి ధర ఏకంగా కిలో రూ.80కి చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జూలై మాసంలో కిలో రూ.20 నుంచి రూ.25 మధ్య పలికిన ధరలు, ప్రస్తుతం రూ.75నుంచి రూ.80 వరకు పెరగడంతో మార్కెట్లో నిత్యావసర వ్యయం విపరీతంగా పెరిగిపోయింది.

నిరుద్యోగులకు  అలర్ట్.. గ్రూప్-1  ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలఏపీSwechaa06 Oct 2026, 02:06 PM

నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ ఖాళీలు వెనువెంటనే భర్తీ చేస్తానని ప్రకటించిన విధంగానే కూటమి సర్కార్ వరుసగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తున్నది. మొన్నటివరకు డీఎస్సీ, పోలీసు ఉద్యోగాలు ప్రకటించిన ఏపీ సర్కార్ .. తాజాగా గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్ర పరిపాలనా విభాగాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూప్-1 సర్వీసుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌‌‌ను (ఏపీపీఎస్‌సీ) అధికారికంగా విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 విభాగాల్లో కలిపి 166 గ్రూప్-1 ఎగ్జిక్యూటివ్, నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది.అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కమిషన్ అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.in ద్వారా అక్టోబర్ 06 నుంచి అక్టోబర్ 27వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చని కమిషన్ కోరింది.

పెన్షన్ బ్రేక్.. దివ్యాంగుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటం : కవితతెలంగాణSwechaa06 Oct 2026, 01:40 PM

పెన్షన్ బ్రేక్.. దివ్యాంగుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటం : కవిత

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్యులు, దివ్యాంగులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వికలాంగులకు పెన్షన్ పెంచుతామని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇంతవరకూ అమలు చేయలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత దివ్యాంగుల పక్షాన గళం వినిపించారు. సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘అరాచక కాంగ్రెస్ ప్రభుత్వానికి దివ్యాంగులపై కనీస మానవత్వం లేదు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం వారిని చీకటిలోకి నెట్టేస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో 90 శాతం వైకల్యం ఉండి నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగురాలికి 3 నెలలుగా పెన్షన్ నిలిపివేయడం అన్యాయం.మరోవైపు జగిత్యాల జిల్లాలో ఒక దివ్యాంగ మహిళ డబుల్ బెడ్రూం, ట్రై సైకిల్ మంజూరు చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. తక్షణమే దీనస్థితిలో ఉన్న దివ్యాంగులకు పింఛన్ కొనసాగించడంతో పాటు డబుల్ బెడ్రూం, ట్రై సైకిల్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము’ అని రాసుకొచ్చారు.

తెలంగాణలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కలకలం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల డిస్మిస్!తెలంగాణSwechaa06 Oct 2026, 01:39 PM

తెలంగాణలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాల కలకలం.. 35 మంది జూనియర్ లెక్చరర్ల డిస్మిస్!

 నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో ప్రభుత్వ కొలువులు సాధించి ఏళ్లుగా చలామణి అవుతున్న విషయం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎట్టకేలకు గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం అక్రమార్కులపై ఉక్కుపాదం మోపింది. పీజీ నకిలీ సర్టిఫికెట్లతో జూనియర్ లెక్చరర్లుగా చెలామణి అవుతున్న 35మందిని ఇంటర్మీడియట్ విద్యా మండలి విధుల నుంచి తొలగిస్తూ (డిస్మిస్) సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వీరి సర్వీసులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయగా, అనంతరం చేపట్టిన పత్రాల సమగ్ర పరిశీలనలోనే ఈ అక్రమాల బాగోతం బట్టబయలైంది.

బారికేడ్ పైకి ఎక్కి నిరసన..  రాహుల్, ప్రియాంకగాంధీ అరెస్టుNationalSwechaa06 Oct 2026, 01:19 PM

బారికేడ్ పైకి ఎక్కి నిరసన.. రాహుల్, ప్రియాంకగాంధీ అరెస్టు

దేశరాజధాని ఢిల్లీలో ఎస్ఐఆర్‌, సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టగా.. రాహుల్, ప్రియాంకగాంధీలు,ఇతర ఇండియా ఎంపీలు సైతం ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే సీఈసీకి వ్యతిరేకంగా ఎంపీలు ఆందోళన చేస్తున్న క్రమంలోనే పోలీసు బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని రాహుల్ గాంధీ నిరసన తెలిపారు.పలువురు ఎంపీలు సైతం బారికేడ్లు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో ఢిల్లీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని ‘ఇండియా’ కూటమి ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం (ఈసీ) కార్యాలయం వరకు ఎంపీలు చేపట్టిన శాంతియుత ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

కుప్పకూలిన వైమానిక దళ విమానం.. 32 మంది దుర్మరణం!InternationalSwechaa06 Oct 2026, 01:03 PM

కుప్పకూలిన వైమానిక దళ విమానం.. 32 మంది దుర్మరణం!

 ఆఫ్రికా దేశమైన నైజీరియాలో అత్యంత విషాదకర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఆ దేశ వైమానిక దళానికి (Air Force) చెందిన మిలిటరీ విమానం గాల్లో ప్రయాణిస్తుండగా సాంకేతిక లోపంతో హఠాత్తుగా కుప్పకూలిపోయింది. ఈ భయంకర ప్రమాదంలో విమానంలో ఉన్న మొత్తం 32 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 25 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు విమాన సిబ్బంది ఉన్నారు. అధికారిక సమాచారం ప్రకారం, ఈ విమానం బెనిన్ సిటీ (Benin City) నుంచి లాగోస్ (Lagos) నగరానికి ప్రయాణిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

చిన్ననాటి ఫ్రెండ్ అని నమ్మితే నట్టేట ముంచాడు.. చివరకు!క్రైమ్Swechaa06 Oct 2026, 12:31 PM

చిన్ననాటి ఫ్రెండ్ అని నమ్మితే నట్టేట ముంచాడు.. చివరకు!

చిన్న నాటి స్నేహితుడు కదా అని నమ్మితే సదరు వ్యక్తి ఓ వివాహితను నట్టేట ముంచాడు.అంతటితో ఆగకుండా ఆమె మీద పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి బ్లాక్ మెయిల్‌కు దిగాడు.చివరకు బాధితురాలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఆ మోసగాడి బాగోతం బట్టబయలు అయ్యింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత తన 10వ తరగతి ఫ్రెండ్ ఉదయ్‌తో తరచూ ఫోన్లో మాట్లాడటం మొదలెట్టిన యువతి క్రమంగా అతనికి దగ్గరైనట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఉదయ్ ఆమెపై లైంగికదాడికి పాల్పడటంతో పాటు వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసినట్టు తెలిసింది.

1400 పైగా చిత్రాలు.. రమాప్రభ జీవిత విశేషాలతో ‘ఇదేనండి నా కథ'!సినిమాSwechaa06 Oct 2026, 12:27 PM

1400 పైగా చిత్రాలు.. రమాప్రభ జీవిత విశేషాలతో ‘ఇదేనండి నా కథ'!

 ప్రముఖ సీనియర్ నటి రమాప్రభ జీవిత ప్రయాణం పుస్తక రూపంలోకి వచ్చింది. 'ఇదేనండి నా కథ' పేరుతో రూపుదిద్దుకున్న ఈ ఆత్మకథా శైలి పుస్తకాన్ని ఆమె 81వ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లెలో ఘనంగా ఆవిష్కరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని బసినకొండ పంచాయతీ, గంగన్నగారిపల్లెలో ఉన్న రమాప్రభ నివాసంలో స్థానిక ప్రముఖులు, అభిమానుల మధ్య ఈ వేడుకను నిర్వహించారు. గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ రమాప్రభ ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడుపుతున్నారు.