స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

TG: ఆసుపత్రి అనుమతుల కోసం రూ. లక్ష లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన డీఎంహెచ్‌వో!తెలంగాణSwechaa05 Oct 2026, 07:10 PM

TG: ఆసుపత్రి అనుమతుల కోసం రూ. లక్ష లంచం.. ఏసీబీకి అడ్డంగా దొరికిన డీఎంహెచ్‌వో!

TG: రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (డీఎంహెచ్‌వో) డాక్టర్ స్వర్ణకుమారి కాసుల కక్కుర్తి పడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. మూతపడిన ఆసుపత్రిని రీ ఓపెన్ చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చే క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం సంచలనంగా మారింది.ఎల్‌బీనగర్ పరిధిలో సరైన లైసెన్స్ లేదనే కారణంతో ఇటీవల ఓ ఫిజియోథెరపీ హాస్పట్‌ని వైద్య శాఖ అధికారులు క్లోజ్ చేశారు. ఆసుపత్రిని మళ్లీ రీ ఓపెన్ చేయడానికి పర్మిషన్స్ జారీ చేయాలంటే రూ. 2 లక్షలు లంచం ఇవ్వాలని డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి డిమాండ్ చేశారు. అంత భారీ మొత్తం ఇచ్చుకోలేని సదరు ఆసుపత్రి యజమాని చివరకు తొలి విడతగా రూ.లక్ష ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే అధికారుల వేధింపులను భరించలేకపోయిన బాధితుడు, లంచం అడిగిన వీడియో ఎవిడెన్స్‌తో నేరుగా ఏసీబీని ఆశ్రయించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాంగ్రెస్ సీనియర్ నేత విచారణతెలంగాణSwechaa05 Oct 2026, 07:07 PM

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కాంగ్రెస్ సీనియర్ నేత విచారణ

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్‌ కోదండరెడ్డిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాఫ్తులో కోదండరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దీంతో అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు.

BJP: కేంద్ర మంత్రులకే నో ఛాన్స్.. రాజ్యసభ లిస్ట్‌లో బీజేపీ బిగ్ ట్విస్ట్!NationalSwechaa05 Oct 2026, 07:06 PM

BJP: కేంద్ర మంత్రులకే నో ఛాన్స్.. రాజ్యసభ లిస్ట్‌లో బీజేపీ బిగ్ ట్విస్ట్!

BJP: ఉత్తరప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రులకే షాక్ ఇచ్చింది. కేంద్ర కేబినెట్‌లో కీలక శాఖలు నిర్వహిస్తున్న హర్దీప్ సింగ్ పూరి, బన్వారీలాల్ వర్మ వంటి ప్రముఖులకు మళ్లీ ఛాన్స్ ఇవ్వకుండా పక్కన పెట్టి, కొత్త వారికి అవకాశం కల్పించడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అక్టోబర్ 16న జరగనున్న ఎన్నికల కోసం కాషాయ దళం ప్రకటించిన ఎనిమిది మంది అభ్యర్థులలో ఒక్క సిట్టింగ్ ఎంపీ కూడా తిరిగి స్థానం దక్కలేదు. కేంద్ర మంత్రులతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, మాజీ డీజీపీ బ్రిజ్‌లాల్, సీమా ద్వివేదీ, నీరజ్ శేఖర్, గీతా శాక్య వంటి కీలక నేతల పదవీకాలం ముగుస్తున్నప్పటికీ వారిని పక్కన పెట్టారు.

Telangaan: దొరల ఆస్తులపై దుమారం.. కేటీఆర్ కౌంటర్‌తో ముదిరిన పొలిటికల్ వార్!రాజకీయాలుSwechaa05 Oct 2026, 06:47 PM

Telangaan: దొరల ఆస్తులపై దుమారం.. కేటీఆర్ కౌంటర్‌తో ముదిరిన పొలిటికల్ వార్!

రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్దం ఏకే 47 తూటాల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణను కేసీఆర్ అండ్ ఫ్యామిలీ అడ్డంగా దోచుకుందని, ప్రత్యేక రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ అవుతుందని చెప్పిన పెద్ద దొర.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల కుటుంబం, ఆయన అనుచర వర్గం మాత్రమే బంగారుమయంగా మారారని కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారు..

AI: ‘చుట్టమల్లె’ ఏఐ మార్ఫింగ్ చిచ్చు .. టాలీవుడ్‌లో సరికొత్త దుమారం!NationalSwechaa05 Oct 2026, 06:16 PM

AI: ‘చుట్టమల్లె’ ఏఐ మార్ఫింగ్ చిచ్చు .. టాలీవుడ్‌లో సరికొత్త దుమారం!

AI: ఒకప్పుడు సినిమా తెరపై ఊహాలోకాలను ఆవిష్కరించేందుకు, విజువల్ ఎఫెక్ట్స్‌తో అద్భుతాలు సృష్టించేందుకు టెక్నాలజీని వాడేవారు. నేడు ‘కృత్రిమ మేధ’ రూపంలో వచ్చిన విప్లవం పరిశ్రమ రూపురేఖలనే మార్చేస్తోంది. అయితే, అదే టెక్నాలజీ ఒకరి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు, అబద్ధాన్ని నిజంలా భ్రమింపజేసేందుకు రాక్షస సాధనంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. 'దేవర' సినిమాలోని ‘చుట్టమల్లె’ పాటకు సంబంధించిన అసభ్యకర ఏఐ మార్ఫింగ్ ఉదంతం.. టెక్నాలజీ దుర్వినియోగం ఏ స్థాయికి చేరిందో కళ్లకు కట్టిన తాజా ఉదాహరణ మాత్రమే.ఒక వ్యక్తి ప్రవర్తన, హావభావాలు, గొంతు, శరీర కదలికలను కంప్యూటర్ అల్గారిథమ్స్ ద్వారా విశ్లేషించి.. వారు ఎన్నడూ చేయని పనులను చేసినట్లుగా, మాట్లాడని మాటలను మాట్లాడినట్లుగా సృష్టించడమే డీప్‌ఫేక్ సాంకేతికత. గతంలో ఒక వీడియోను మార్ఫింగ్ చేయాలంటే నిపుణులైన ఎడిటర్లు, ఖరీదైన సాఫ్ట్‌వేర్ అవసరమయ్యేది. కానీ నేడు ఓపెన్ సోర్స్ ఏఐ టూల్స్, స్మార్ట్‌ఫోన్ యాప్స్ పుణ్యమా అని ఎవరైనా నిమిషాల వ్యవధిలోనే ఎవరి ముఖాన్ని, శరీరాన్నైనా మార్చేసే వీలు ఏర్పడింది. హెయిర్ మూవ్‌మెంట్స్, లైటింగ్, కంటి రెప్పల కదలికలను కూడా సహజంగా మార్చగలగడం వల్ల ఏది అసలు? ఏది ఏఐ సృష్టి? అనేది సాధారణ కంటితో గుర్తించడం దాదాపు అసాధ్యంగా మారుతోంది.

5 నిమిషాల్లో భారీ చోరీ.. 3కోట్ల విలువైన డైమండ్స్, బంగారు నగలు అపహరణక్రైమ్Swechaa05 Oct 2026, 06:04 PM

5 నిమిషాల్లో భారీ చోరీ.. 3కోట్ల విలువైన డైమండ్స్, బంగారు నగలు అపహరణ

CaratLane: మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. క్యారెట్ లేన్ (Carat Lane) జువెలరీ షోరూమ్ లో దొంగలు పడ్డారు. సుమారు 3కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఎత్తుకెళ్లారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో షట్టర్ వంచి షాపులోకి చొరబడిన దుండగులు డైమండ్స్ తో పాటు బంగారు నగలు దోచుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు షోరూమ్ కి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించింది. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

వారసత్వ కట్టడాలను కూల్చే కుట్రలు- రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa05 Oct 2026, 05:08 PM

వారసత్వ కట్టడాలను కూల్చే కుట్రలు- రేవంత్ సర్కార్ పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Ktr: కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను కూల్చే కుట్రలు జరుగుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటుపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. తవ్వకాలు, బ్లాస్టింగ్స్ వల్ల రామప్ప ఆలయానికి ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.

Telangana Congress: పవిత్రవాణికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ? కాంగ్రెస్ సంచలన నిర్ణయం!తెలంగాణSwechaa05 Oct 2026, 04:59 PM

Telangana Congress: పవిత్రవాణికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీ? కాంగ్రెస్ సంచలన నిర్ణయం!

Telangana Congress: కాంగ్రెస్ సర్కార్ సామాజిక సమీకరణాల్లో అత్యంత వ్యూహాత్మక అడుగు వేయబోతున్నట్లు కనిపిస్తుంది. వచ్చే నెలలో ఖాళీ కానున్న మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకదానికి తెలంగాణ తొలితరం ఉద్యమ రథసారథి, దివంగత ప్రొఫెసర్ కొండా లక్ష్మణ్ బాపూజీ కుమార్తె డాక్టర్ పవిత్రవాణి పేరును హస్తం పార్టీ పరిశీలిస్తోందని జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం వైద్య వృత్తిలో సేవలందిస్తున్న ఆమెను పెద్దల సభకు పంపడం ద్వారా అటు ఉద్యమకారులకు, ఇటు బీసీ వర్గాలకు బలమైన సందేశం పంపాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తోందట.

ఆకాశాన్ని అంటుతున్న సన్నబియ్యం ధరలు- రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని హరీశ్ రావు ధ్వజంతెలంగాణSwechaa05 Oct 2026, 03:09 PM

ఆకాశాన్ని అంటుతున్న సన్నబియ్యం ధరలు- రేవంత్ సర్కార్ ఏం చేస్తోందని హరీశ్ రావు ధ్వజం

Rice Prices: నిత్యావసరాల ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణం అని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పర్యవేక్షణ వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని వాపోయారు. సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే 25 శాతం పెరగడం ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం... మరి ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి.. బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయి? అని నిలదీశారు.

శ్రీచైతన్య స్కూల్‌‌లో దారుణం..తెలంగాణSwechaa05 Oct 2026, 02:52 PM

శ్రీచైతన్య స్కూల్‌‌లో దారుణం..

Nacharam: హైదరాబాద్ నాచారంలోని శ్రీచైతన్య స్కూల్‌ హాస్టల్ లో దారుణం జరిగింది. హాస్టల్‌ వార్డెన్‌ 8వ తరగతి చదువుతున్న విద్యార్థిపై పాశవికంగా దాడి చేశాడు. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థి చెవి కర్ణభేరి పగిలి రక్తస్రావమైంది. వెంటనే విద్యార్థిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యంత అమానుషంగా దాడికి పాల్పడ్డ హాస్టల్ వార్డెన్ పై విద్యార్థి తల్లిదండ్రులు నాచారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తమ కుమారుడికి అయిన గాయం చూసి తల్లిదండ్రులు కంటతడి పెట్టారు. హాస్టల్ వార్డెన్ దాడిలో తమ కుమారుడికి 50శాతం వినికిడి లోపం ఏర్పడిందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై వారు ఆందోళన చెందుతున్నారు.

‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డి అరెస్ట్క్రైమ్Swechaa05 Oct 2026, 02:22 PM

‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డి అరెస్ట్

Rosi Reddy Arrest: ‘ఫార్చ్యూన్ 99 హోమ్స్’ నిర్వాహకుడు మదిరాల రోసిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల పేరుతో రోసిరెడ్డి పలువురి మోసగించినట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. బోగస్ పత్రాలతో ప్లాట్ల విక్రయాలు చేసినట్లు మదిరాల రోసిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. జడ్చర్లలో ప్లాట్ పేరుతో బాధితుడి నుంచి 25 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా రోసిరెడ్డి తప్పించుకుని తిరిగాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు ఆరా తీస్తే స్థలంపై హక్కులే లేవని వెల్లడైంది.

Fauzi-Imanvi: ఫౌజీ అగ్రిమెంట్‌లో ఏముంది..రెండేళ్ళు ఆగాల్సివచ్చిందా?సినిమాSwechaa05 Oct 2026, 09:58 AM

Fauzi-Imanvi: ఫౌజీ అగ్రిమెంట్‌లో ఏముంది..రెండేళ్ళు ఆగాల్సివచ్చిందా?

Fauzi-Imanvi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన మార్కెట్‌ను మరింత పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది.

హైదరాబాద్ తాగునీటికి తీవ్ర ముప్పు.. 8 నెలలు ఎలా గట్టెక్కాలి?తెలంగాణSwechaa04 Oct 2026, 11:41 PM

హైదరాబాద్ తాగునీటికి తీవ్ర ముప్పు.. 8 నెలలు ఎలా గట్టెక్కాలి?

హైదరాబాద్‌కు మరోసారి తాగునీటి టెన్షన్‌ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవైపు తగ్గుతున్న రిజర్వాయర్‌ నిల్వలు.. మరోవైపు పెరుగుతున్న నగర నీటి అవసరాలు.. ఇంకోవైపు దంచికొడుతున్న ఎండలు. ఈ మూడు అంశాలు ఇప్పుడు హైదరాబాద్‌ నీటి భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తికి డెడ్ లైన్ ఫిక్స్.. పనులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ!తెలంగాణSwechaa04 Oct 2026, 10:11 PM

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పూర్తికి డెడ్ లైన్ ఫిక్స్.. పనులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ!

TG: దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు సొరంగం తవ్వకాల్లో అతిపెద్ద అడ్డంకి తొలగిపోయిందని, పనుల్లో ఊహించని పురోగతి కనిపిస్తోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అత్యంత క్లిష్టమైన, ప్రమాదకరమైన ‘షియర్ జోన్’ను దాటుకుని తవ్వకం యంత్రాలు ముందుకు సాగుతున్నాయని, ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

TG: సంచలనం.. కేయూ లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ రచ్చ!తెలంగాణSwechaa04 Oct 2026, 10:08 PM

TG: సంచలనం.. కేయూ లా పరీక్షల్లో మాస్ కాపీయింగ్ రచ్చ!

TG: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో సాగుతున్న లా పరీక్షల్లో వెలుగుచూసిన మాస్ కాపీయింగ్ బాగోతం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. సమాజానికి న్యాయాన్ని నేర్పించి, చట్టాన్ని కాపాడాల్సిన కాబోయే న్యాయవాదులే పరీక్ష హాల్స్‌లో అడ్డదారులు తొక్కుతూ పట్టుబడటం విస్మయానికి గురిచేస్తోంది. పకడ్బందీగా జరగాల్సిన పరీక్షల్లో జోరుగా సాగుతున్న చూచిరాతలు కేయూ పరువును బజారున పడేస్తున్నాయని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కేయూ మహిళా ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో ఇటీవల ఓ విద్యార్థిని కాపీ కొడుతూ అడ్డంగా ఇన్విజిలేటర్‌కు దొరికిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన పని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆన్సర్ షీట్‌ను లాక్కొని ఏకంగా పరీక్ష హాల్ నుంచే ఉడాయించింది.

India - Russia Relations: ప్రపంచమంతా పాక్ వైపు ఉన్నప్పుడు మాకు తోడుగా నిలిచింది ఒక్క రష్యానే: జైశంకర్NationalSwechaa04 Oct 2026, 09:40 PM

India - Russia Relations: ప్రపంచమంతా పాక్ వైపు ఉన్నప్పుడు మాకు తోడుగా నిలిచింది ఒక్క రష్యానే: జైశంకర్

India - Russia Relations: రష్యాతో భారత్‌కు ఉన్న సంబంధాలపై ప్రశ్నలు వేస్తున్న పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరిపై విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మా దేశానికి కష్టం వచ్చినప్పుడు ఎవరు అండగా నిలబడ్డారు, ఎవరు ప్రత్యర్థి పక్షాన నిలిచారనే వాస్తవాన్ని భారతీయులు ఎప్పటికీ మరిచిపోరని కుండబద్దలు కొట్టారు. ఢిల్లీ వేదికగా జరిగిన 62వ మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాస్కోతో న్యూఢిల్లీ బంధం వెనుక ఉన్న అసలు కారణాలను ఆయన కుండబద్దలు కొట్టినట్లు వివరించారు.

Mrunal Thaakur: ఆ ఒక్క ఫ్లాప్ వల్ల మృణాల్ ఠాకూర్‌కి తెలుగులో గ్యాప్ వచ్చినట్టేనా?సినిమాSwechaa04 Oct 2026, 09:04 PM

Mrunal Thaakur: ఆ ఒక్క ఫ్లాప్ వల్ల మృణాల్ ఠాకూర్‌కి తెలుగులో గ్యాప్ వచ్చినట్టేనా?

Mrunal Thaakur: హీరోకి నాలుగు ఫ్లాపులొచ్చినా మళ్ళీ సాలీడ్ కంబ్యాక్ ఇచ్చి తన మార్కెట్‌ను నిలబెట్టుకుంటాడు. కానీ, హీరోయిన్ పరిస్థితి అలా కాదు. ఒక్క ఫ్లా్‌తో మళ్ళీ ఛాన్స్ దక్కించుకోవాలంటే చాలా నెలలు ఎదురుచూడాల్సి వస్తుంది. ప్రస్తుతం, మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా ఇదే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. డెకాయిట్ తర్వాత మళ్ళీ తెలుగులో ఈ బ్యూటీ సైన్ చేయలేకపోయింది.

Rajashekhar: బాలయ్యకి విలన్‌గా స్టార్ హీరో!సినిమాSwechaa04 Oct 2026, 08:49 PM

Rajashekhar: బాలయ్యకి విలన్‌గా స్టార్ హీరో!

Rajashekhar: సీనియర్ హీరోలు ఈ మధ్య కాలంలో విలన్ పాత్రల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి, కారణాలు ప్రధానంగా మూడు అని చెప్పుకోవచ్చు. ఒకటి, కొందరు హీరోలకి మార్కెట్ తగ్గడం..దాంతో, హీరోగా అవకాశాలు కరువవడం. రెండు..ఏజ్ ఫ్యాక్టర్‌తో హీరో వేషాలు రాకపోవడం. మూడవది..బాలీవుడ్ తరహాలో హీరోలకి విలన్ ఛాన్సులు వస్తే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగడానికి మంచి అవకాశం ఉండటం.

TG: రూ. 2 కోట్ల లంచం ఆరోపణలు అవాస్తవం.. ఒవైసీకి తెలంగాణ జైళ్ల శాఖ కౌంటర్!తెలంగాణSwechaa04 Oct 2026, 08:06 PM

TG: రూ. 2 కోట్ల లంచం ఆరోపణలు అవాస్తవం.. ఒవైసీకి తెలంగాణ జైళ్ల శాఖ కౌంటర్!

TG: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన సంచలన ఆరోపణలను తెలంగాణ జైళ్ల శాఖ తీవ్రంగా ఖండించింది. చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ రూ. 2 కోట్ల లంచం తీసుకుని నిందితుడికి బెయిల్ ఇప్పించారంటూ ఒవైసీ చేసిన కామెంట్స్‌లో ఎలాంటి వాస్తవం లేదని తెలంగాణ జైళ్ల శాఖ స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ప్రధాన నిందితుడి విడుదలకు సంబంధించి జరుగుతున్న ప్రచారానికి అధికారులు అఫీషియల్‌గా తెరదించారు.చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై వచ్చిన ఆరోపణలపై జైళ్ల శాఖ అధికారులు సూటిగా స్పందించారు. "ఏదైనా కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసే అధికారం కేవలం కోర్టులకు మాత్రమే ఉంటుంది. లా ప్రకారం సంబంధిత న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేస్తేనే జైలు నుంచి విడుదల చేస్తాం. ఇందులో జైలు అధికారుల ప్రమేయం గానీ, బెయిల్ ఇచ్చే విచక్షణాధికారం గానీ ఉండదు. రూల్స్ ప్రకారం కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్ వచ్చిన తర్వాతే ఖైదీని విడుదల చేశాం తప్ప, లంచం తీసుకుని బయటకు పంపే ప్రశ్నే తలెత్తదు" అని అధికారులు స్పష్టం చేశారు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి హిట్ పడి 8 ఏళ్ళవుతోంది..రణబాలి గట్టెక్కిస్తేనే..!సినిమాSwechaa04 Oct 2026, 07:57 PM

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి హిట్ పడి 8 ఏళ్ళవుతోంది..రణబాలి గట్టెక్కిస్తేనే..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండకి హిట్ పడి 8 ఏళ్ళవుతోంది..రణబాలి గట్టెక్కిస్తేనే..! అవును మన టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు, గీత గోవిందం లాంటి సినిమాలతో క్లాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా పాపులర్ అయ్యాడు. కానీ, మళ్ళీ ఆ స్థాయి హిట్ ఇన్నేళ్ళలో ఇప్పటి వరకూ హిట్ దక్కలేదు.

Delhi Police: జంతర్‌‌మంతర్‌లో మహిళా జర్నలిస్టులపై ఏసీపీ లైంగిక వేధింపులు!NationalSwechaa04 Oct 2026, 06:38 PM

Delhi Police: జంతర్‌‌మంతర్‌లో మహిళా జర్నలిస్టులపై ఏసీపీ లైంగిక వేధింపులు!

Delhi Police: దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న జంతర్‌మంతర్ సాక్షిగా ఢిల్లీ పోలీసులు అత్యంత హేయమైన చర్యకు ఒడిగట్టారు. విధి నిర్వహణలో ఉన్న ముగ్గురు మహిళా జర్నలిస్టులపై ఓ ఉన్నతస్థాయి పోలీస్ అధికారి అసభ్యకరంగా ప్రవర్తించి, లైంగిక దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి, ప్రజా సంఘాలు చేపట్టిన నిరసనల లైవ్ కవరేజ్ టైంలో ఈ అరాచకం చోటుచేసుకుంది. యూనిఫాంలో ఉన్న ఏసీపీ స్థాయి అధికారే అంత బహిరంగంగా మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడం మీడియా వర్గాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది.

TG: బాధేస్తోంది.. తెలంగాణలో కరవు విలయంపై కవిత తీవ్ర ఆవేదన!తెలంగాణSwechaa04 Oct 2026, 05:39 PM

TG: బాధేస్తోంది.. తెలంగాణలో కరవు విలయంపై కవిత తీవ్ర ఆవేదన!

TG: తెలంగాణ గడ్డపై పచ్చని పైర్లు నెర్రెలు బారుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నానని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలు కష్టపడి వేసిన పంటలు నీళ్లందక కళ్లెదుటే మాడిపోతుంటే కాంగ్రెస్ పెద్దలు మాత్రం పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. క్షేత్రస్థాయిలో నెలకొన్న తీవ్ర కరవు, తాగునీటి సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.పల్లెల్లో రైతులు నీటిబొట్టు కోసం అల్లాడుతుంటే సీఎం రేవంత్‌రెడ్డి వరుణయాగం చేసి చేతులు దులుపుకున్నారని కవిత మండిపడ్డారు. యాగాల పేరిట కాలయాపన చేయడమే తప్ప, ఎండిన పైర్లను కాపాడేందుకు సర్కారు వద్ద ఎలాంటి స్పష్టమైన కార్యాచరణ లేదని ఎద్దేవా చేశారు. కరవు కోరల్లో చిక్కుకున్న మండలాలను అధికారికంగా గుర్తించి ప్రకటిస్తే కేంద్ర నిధులైనా రైతులకు అందుతాయని, ఆ పని చేయడానికి ప్రభుత్వానికి ఎందుకు మనసొప్పడం లేదని నిలదీశారు.

Telangana Politics: కంచుకోటలో వణుకు.. బీఆర్‌ఎస్ మాజీలకు కేసీఆర్ బిగ్ షాక్!తెలంగాణSwechaa04 Oct 2026, 05:33 PM

Telangana Politics: కంచుకోటలో వణుకు.. బీఆర్‌ఎస్ మాజీలకు కేసీఆర్ బిగ్ షాక్!

Telangana Politics: తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్‌ఎస్‌కు కంచుకోటగా నిలిచిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా గులాబీ శిబిరంలో ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ ప్రకంపనలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ఒకప్పుడు వరుస విజయాలతో ఎదురులేని ఆధిపత్యం చలాయించిన మాజీ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేల గుండెల్లో ఇప్పుడు టికెట్ భయం పట్టుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో మార్పులు చేయకుండా సిట్టింగ్‌లందరికీ మూకుమ్మడిగా టికెట్లు ఇవ్వడమే పార్టీ ఓటమికీ ప్రధాన కారణమనే క్లారిటీకి వచ్చిన గులాబీ బాస్ కేసీఆర్, ఈసారి పాత తప్పులను రిపీట్ చేయకూడదని గట్టి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల కోసం జిల్లావ్యాప్తంగా సాగుతున్న అంతర్గత రహస్య సర్వేలు, అధిష్ఠానం చేపట్టిన సీక్రెట్ ప్రక్షాళన మాజీ నేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Krithi Shetty: బేబమ్మ కోరిక పెద్దదే..తిర్చేదెవరో మరి?సినిమాSwechaa04 Oct 2026, 05:18 PM

Krithi Shetty: బేబమ్మ కోరిక పెద్దదే..తిర్చేదెవరో మరి?

Krithi Shetty: ‘ఉప్పెన’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటీ కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, వాటిలో బంగార్రాజు తప్ప మిగతావన్నీ యావరేజ్ సినిమాలుగా నిలిచాయి. ఇక, దాంతో, కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.

Shiva Nirvana: నానితో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న 'ఇరుముడి' డైరెక్టర్?సినిమాSwechaa04 Oct 2026, 04:49 PM

Shiva Nirvana: నానితో హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్న 'ఇరుముడి' డైరెక్టర్?

Shiva Nirvana: దర్శకుడు శివ నిర్వాణ గురించే ఇప్పుడు సినీ పరిశ్రమలో ప్రముఖులంతా మాట్లాడుకుంటున్నారు. మాస్ మహారాజ్ రవితేజకి ఇరుముడి లాంటి సున్నితమైన కథ-కథనాలతో రూపొందిన సినిమాను చేసి భారీ హిట్ ఇచ్చాడు. దాదాపు మూడు నాలుగేళ్ళ నుంచి రవితేజ ఎదురుచూస్తున్న హిట్ ఇచ్చాడు శివ.

Home Appliances: పండుగ ఆఫర్ల ఆశలపై పిడుగు.. భారీగా పెరిగిన ధరలు!NationalSwechaa04 Oct 2026, 04:32 PM

Home Appliances: పండుగ ఆఫర్ల ఆశలపై పిడుగు.. భారీగా పెరిగిన ధరలు!

Home Appliances: దసరా, దీపావళి వచ్చిందంటే చాలు.. ఇళ్లలోకి కొత్త కాంతులు తెచ్చుకోవాలని, పాత టీవీ స్థానంలో స్మార్ట్ టీవీ, వంటింట్లోకి కొత్త రిఫ్రిజిరేటర్ లేదా వాషింగ్ మెషీన్ కొనుక్కోవాలని మధ్యతరగతి కుటుంబాలు ఏడాదంతా ఎదురుచూస్తుంటాయి. పండుగ వేళ కంపెనీలు ప్రకటించే భారీ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎంఐలు, ఎక్స్చేంజ్ బోనస్‌లు తమ బడ్జెట్‌కు సరిపోతాయని కలలు కంటారు. కానీ ఈసారి మాత్రం ఆ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆఫర్ల పలకరింపులకు బదులు, పండుగ రాకముందే నిత్యావసర ఎలక్ట్రానిక్స్ ధరలకు రెక్కలు వచ్చాయి. పండుగ ఆఫర్ల ఆశలపై కంపెనీలు ఒక్కసారిగా ధరల పిడుగు విసిరాయి.సాధారణంగా పండుగల సమయంలో మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరల్లో కొద్దిగా మార్పులుంటాయి. కానీ ఈ ఏడాది గృహోపకరణాల ధరలు పెరగడం ఇది ముచ్చటగా మూడోసారి. గతంతో పోలిస్తే ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్ రేట్లు ఏకంగా 30 శాతం వరకు ప్రియమయ్యాయి. గతంలో రూ.10,000 పలికిన బేసిక్ మోడల్స్ ఇప్పుడు ఏకంగా రూ.13,000 కడితే తప్ప దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పలు ఉపకరణాలపై 23 శాతం వరకు ధరలు పెరగ్గా, తాజాగా మరో 5 నుంచి 8 శాతం అదనపు భారం పడింది. పండుగ బోనస్‌లు చేతికొచ్చే లోపే మార్కెట్లో ధరలు ఆకాశాన్ని తాకడం మధ్యతరగతి ప్రజలను తీవ్ర అయోమయంలో పడేసింది.

ఇండిగో విమానానికి బర్డ్ హిట్.. శంషాబాద్‌లో పైలట్ సురక్షిత ల్యాండింగ్!తెలంగాణSwechaa04 Oct 2026, 03:10 PM

ఇండిగో విమానానికి బర్డ్ హిట్.. శంషాబాద్‌లో పైలట్ సురక్షిత ల్యాండింగ్!

 పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి గాల్లో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విమానం ఆకాశంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక పక్షి అత్యంత బలంగా విమానాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ చాకచక్యంతో పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తీసుకుని విమానాన్ని హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అందరూ తీవ్ర భయాందోళనల నుంచి తేరుకుని ఊపిరి పీల్చుకున్నారు.  ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. ఇండిగో సంస్థకు చెందిన '6ఈ352' (6E352) సర్వీస్ విమానం పుణె నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో ఊహించని విధంగా పక్షి విమానాన్ని ఢీకొట్టడంతో సాంకేతిక అలర్ట్ వచ్చింది.

BRS : కొడంగల్‌లోనే సీఎంకు చెక్.. గులాబీ దళం పక్కా స్కెచ్ ఇదేనా!తెలంగాణSwechaa04 Oct 2026, 03:04 PM

BRS : కొడంగల్‌లోనే సీఎంకు చెక్.. గులాబీ దళం పక్కా స్కెచ్ ఇదేనా!

తెలంగాణ రాజకీయ సంగ్రామంలో ఇప్పుడు ఊహించని సభల యుద్ధం తారస్థాయికి చేరింది. కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వాన్నే లక్ష్యంగా చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎదురుదాడికి దిగారు. కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో నిప్పులు చెరిగి, తదుపరి లక్ష్యంగా హరీశ్ రావు అడ్డా సిద్దిపేటను ఎంచుకోవడంతో గులాబీ శిబిరం ఆత్మరక్షణలో పడిందని భావించిన వారికి.. బీఆర్‌ఎస్ ఇప్పుడు ఊహించని ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిని ఆయన సొంత గడ్డపైనే సవాలు చేస్తూ.. కొడంగల్‌లోనే భారీ పొలిటికల్ బాంబు పేల్చేందుకు గులాబీ దళం పక్కా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.

నేడు స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి రేట్లు ఇవే!వ్యాపారంSwechaa04 Oct 2026, 02:25 PM

నేడు స్థిరంగా బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పసిడి రేట్లు ఇవే!

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు(ఆదివారం) బంగారం ధరలు ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ ప్రధాన మార్కెట్లలో పసిడి ధరలు మార్పు లేకపోవడంతో కొనుగోలుదారులు, పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ విశ్లేషణల ప్రకారం ఈరోజు వివిధ నాణ్యత కలిగిన బంగారం రేట్ల వివరాలు లభ్యంగా ఉన్నాయి. అత్యంత శుద్ధమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,49,180 వద్ద కొనసాగుతుండగా, ఒక్క గ్రాము ధర రూ. 14,918 గా నమోదైంది.

జాన్వీ ‘చుట్టమల్లే’ డీప్‌ఫేక్ రగడ.. సెలబ్రిటీల ట్వీట్లపై ఆర్జీవీ చురకలు!సినిమాSwechaa04 Oct 2026, 01:52 PM

జాన్వీ ‘చుట్టమల్లే’ డీప్‌ఫేక్ రగడ.. సెలబ్రిటీల ట్వీట్లపై ఆర్జీవీ చురకలు!

 ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' పాట డీప్‌ఫేక్ వీడియో వివాదంపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ‘ఎక్స్’లో స్పందించారు.  ఈ అభ్యంతరకర వీడియోపై స్పందించిన సినీ ప్రముఖులు, న్యాయం చేయకపోగా దానికి అనవసర ప్రచారం కల్పించారని తీవ్ర విమర్శలు చేశారు. సెలబ్రిటీల వరుస ట్వీట్ల వల్లే ఈ వీడియో గురించి తెలియని కోట్లాది మంది కూడా దాని కోసం వెతికి చూసేలా చేశారని చురకలంటించారు. ఇది బాధితురాలికి మరింత నష్టం కలిగించడమేనని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.