స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

హైదరాబాద్‌కు నీటి గండం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరిక!తెలంగాణSwechaa04 Oct 2026, 01:38 PM

హైదరాబాద్‌కు నీటి గండం.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హెచ్చరిక!

 హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సమస్య మళ్లీ తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం, జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా పడిపోవడంతో రాబోయే వేసవి కాలంలో నగరవాసులకు తీవ్ర నీటి కొరత ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. నీటి వృథాను నివారించి, పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Keerthy Suresh: నవంబర్ 20న "సత్యవాన్ సావిత్రి"..సినిమాSwechaa04 Oct 2026, 01:37 PM

Keerthy Suresh: నవంబర్ 20న "సత్యవాన్ సావిత్రి"..

Keerthy Suresh: "మహానటి" సినిమాతో తన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ వరుసగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. కథానాయికగా మాత్రమే కాకుండా, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఈ క్రమంలోనే కీర్తి నుంచి మరో విభిన్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సినిమానే ‘సత్యవాన్ సావిత్రి’.

Asaduddin: అడ్వకేట్ హత్య కేసు.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!తెలంగాణSwechaa04 Oct 2026, 01:25 PM

Asaduddin: అడ్వకేట్ హత్య కేసు.. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో తీవ్ర కలకలం రేపిన సీనియర్ అడ్వొకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రౌడీషీటర్‌కు జైలు సూపరింటెండెంట్ పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. సదరు రౌడీషీటర్ ఏకంగా రూ.2కోట్లు లంచంగా చెల్లించి బెయిల్ పొందాడని, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ అమాయకులపై దాడులు చేయడమే కాకుండా మరిన్ని హత్యలకు కుట్రలు పన్నుతున్నాడని ఒవైసీ బాహాటంగానే విమర్శించారు. వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం సుదీర్ఘ కాలంగా న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నందుకే లాయర్ ఖాజా మొయినుద్దీన్‌ను పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారని ఒవైసీ స్పష్టం చేశారు.

Anupama Parameswaran: స్కిన్ షోకి ఇకపై దూరం..అలాంటి పాత్రలకే గ్రీన్ సిగ్నల్..సినిమాSwechaa04 Oct 2026, 01:06 PM

Anupama Parameswaran: స్కిన్ షోకి ఇకపై దూరం..అలాంటి పాత్రలకే గ్రీన్ సిగ్నల్..

Anupama Parameswaran: తెలుగు ప్రేక్షకులకు అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రేమమ్ తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయళీ ముద్దుగుమ్మ..తెలుగులో అ.ఆ సినిమాతో ల్యాండ్ అయింది. ఆ తర్వాత శతమానం భవతి, హలోగురూ ప్రేమకోసమే, ఉన్నది ఒకటే జిందగీ లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది.

KBRParkProject: ‘పూటకో మాట.. రోజుకో నిర్ణయం..’ కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజాగ్రహం!తెలంగాణSwechaa04 Oct 2026, 12:44 PM

KBRParkProject: ‘పూటకో మాట.. రోజుకో నిర్ణయం..’ కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజాగ్రహం!

ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పూటకో మాట.. రోజుకో నిర్ణయం అనే విధంగా పాలన సాగుతోందని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో రవాణా రద్దీని తట్టుకునేందుకు ప్రణాళికలు వేయడం, కొన్ని రోజులకే వాటిని మార్చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అర్ధాంతరంగా రద్దు చేయడంపై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫారమ్-7 ఇస్తే ఓటు తొలగించనట్టు కాదు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావుతెలంగాణSwechaa04 Oct 2026, 12:38 PM

ఫారమ్-7 ఇస్తే ఓటు తొలగించనట్టు కాదు : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తవ్వగా.. మరికొన్ని రాష్ట్రాల్లో చివరిదశలో ఉన్నది. అయితే, కేంద్రం ఆదేశాలతో ఎన్నికల సంఘం అర్హుల ఓట్లు కూడా డిలీట్ చేస్తున్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ క్రమంలోనే ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు. ఇటీవలికాలంలో జరిగిన ఎన్నికలు అన్నీ చట్టవిరుద్ధమేనని, లోక్‌సభ, అసెంబ్లీలను రద్దు చేసి బ్యాలెట్‌తో మళ్లీ ఎన్నికలు జరపాలన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.ఆదివారం బీజేపీ చీఫ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాటలు ప్రజాస్వామ్యాన్ని, భారతీయ ఓటర్లను అవమానించడమేనని అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రభుత్వ ఉద్యోగులే చేస్తున్నారని, అభ్యంతరం ఉన్న ఓటర్ల విషయంలో ఫారమ్ -7 సమర్పిస్తే ఈసీ విచారణ చేసి చర్యలు తీసుకుంటుందన్నారు. ఫారమ్-7 ఇచ్చినంత మాత్రాన ఓటు తొలగించినట్టు కాదని చెప్పారు. ఫారమ్-7ను బీజేపీ బీఎల్ఏలు ఎవరూ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

Sampat Nandi: నవంబర్ 12న రిలీజ్ 'భోగి' రిలీజ్ ..సినిమాSwechaa04 Oct 2026, 12:37 PM

Sampat Nandi: నవంబర్ 12న రిలీజ్ 'భోగి' రిలీజ్ ..

Sampat Nandi: ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం ‘భోగి’. ఈ సినిమా కోసం ఆయన పూర్తి ఫిట్‌గా, స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నాడు. దర్శక-రచయిత, నిర్మాత సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ను జరుపుకుంటోంది. ఆల్మోస్ట్ షూటింగ్ కూడా పూర్తయింది.

ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలకు బ్రేక్.. అధికారుల కీలక నిర్ణయం!ఏపీSwechaa04 Oct 2026, 12:18 PM

ఇంద్రకీలాద్రిపై వీఐపీ దర్శనాలకు బ్రేక్.. అధికారుల కీలక నిర్ణయం!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుస సెలవుల నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ఆదివారం(నేడు) వీఐపీ, ప్రోటోకాల్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ప్రోటోకాల్ దర్శనాల నిలిపివేత అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌లో 49 మంది అక్రమ విదేశీయులు.. భారీగా కేసులు!క్రైమ్Swechaa04 Oct 2026, 12:17 PM

హైదరాబాద్‌లో 49 మంది అక్రమ విదేశీయులు.. భారీగా కేసులు!

హైదరాబాద్ మహానగరంలో ఇటీవల క్రైమ్ రేటు పెద్దఎత్తున పెరుగుతున్న తరుణంలో నగర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు.కొందరు విదేశీయులు నగరంలో అక్రమంగా నివాసం ఉంటూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారంటూ పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఉన్నతాధికారుల ఆదేశంతో రంగంలోకి దిగిన పోలీసులు క్రైమ్ రేటు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న విదేశీయులను పెద్దఎత్తున గుర్తించారు. ఆగస్టు 31 నుంచి నగరవ్యాప్తంగా కొనసాగిన స్పెషల్ ఆపరేషన్ మొత్తంగా 49 మంది అక్రమ విదేశీయులను పోలీసులు గుర్తించారు.వారిలో చాలా మంది వీసా గడువు ముగిసినా తమ దేశాలకు వెళ్లిపోకుండా నగరంలో నివాసం ఉంటున్నట్టు నిర్దారించారు.

రాహుల్ గాంధీ పోటీకి భయపడ్డారు.. ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు!NationalSwechaa04 Oct 2026, 12:04 PM

రాహుల్ గాంధీ పోటీకి భయపడ్డారు.. ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు!

 కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సమాజ్‌వాది పార్టీ నేత, ప్రతాప్‌గఢ్ ఎంపీ శివ్‌పాల్ సింగ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాయ్‌బరేలి స్థానం నుంచి పోటీ చేయడానికి రాహుల్ గాంధీ భయపడ్డారని విమర్శించారు. సమాజ్‌వాది పార్టీతో పొత్తు లేకపోయి ఉంటే గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయేదని ఆయన వ్యాఖ్యానించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ, 2024లో రాయ్‌బరేలితో పాటు వయనాడ్ నుంచి పోటీ చేసి రెండింట్లోనూ గెలుపొందిన సంగతి తెలిసిందే.

అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. తెలంగాణ యువతి మృతి!క్రైమ్Swechaa04 Oct 2026, 11:56 AM

అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. తెలంగాణ యువతి మృతి!

 అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ యువతి దుర్మరణం చెందింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలానికి చెందిన దారం సుప్రియ(31) ఉద్యోగరీత్యా అమెరికాలోని మిస్సోరిలో నివాసముంటోంది. ఆమె కారులో ప్రయాణిస్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సుప్రియ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో పాటు ప్రయాణిస్తున్న మరొక భారతీయ యువతికి తీవ్ర గాయాలయ్యాయి.

నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్.. నేరెళ్ల బాధితులను వంచించారు : కవితతెలంగాణSwechaa04 Oct 2026, 11:55 AM

నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్.. నేరెళ్ల బాధితులను వంచించారు : కవిత

గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారుపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.నేరెళ్ల బాధితులను బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ కుమ్మక్కై దగా చేస్తున్నాయని తెలంగాణ రక్షణ సేన చీఫ్ మండిపడ్డారు. ఆదివారం బంజారాహిల్స్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2017లో ఇసుక మాఫియాను అడ్డుకున్న నేరెళ్ల దళిత, బడుగు వర్గాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు సాగించిన దాష్టీకాలను మరోసారి గుర్తుచేశారు. నేరేళ్ల బాధితుల దుఃఖాన్ని రాజకీయంగా వాడుకుని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని, తీరా గద్దెనెక్కాక అసలు వాళ్లు బాధితులు అనడానికే ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెప్పడం చూస్తుంటే ప్రతిపక్ష, అధికార పార్టీలు కుమ్మక్కు అయ్యాయని స్పష్టంగా అర్థం అవుతోందన్నారు.

దొంగ సాయం.. కళ్ల ముందే యువతికి రూ.1.25 లక్షలు టోకరావైరల్ న్యూస్Swechaa04 Oct 2026, 11:43 AM

దొంగ సాయం.. కళ్ల ముందే యువతికి రూ.1.25 లక్షలు టోకరా

కొందరు ఘరానా దొంగలు రెచ్చిపోతున్నారు.సామాన్యులతో కలిసి పోయి మంచి వారిలా నటిస్తూ జేబులు కొల్లగొడుతున్నారు.రద్దీగా ఉండే ప్రాంతాలు, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, బ్యాంకులు, షాపింగ్ మాల్స్‌‌ను టార్గెట్‌గా చేసుకుంటున్నారు ఈ దొంగలు.సాయం చేసినట్టు నటిస్తూనే డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హర్యానా రాష్ట్రంలో వెలుగుచూసింది.వివరాల్లోకివెళితే..ఓ దొంగ సాయం చేస్తున్నట్టు నటించి బ్యాంకు వచ్చిన యువతి నుంచి రూ.1.25 లక్షల చోరీకి పాల్పడ్డాడు. హర్యానా రాష్ట్రంలోని జింద్ జిల్లా సఫిదో ప్రాంతంలో ఈ చోటు చేసుకున్నంది. మువానా గ్రామానికి చెందిన పాయల్ అనే యువతి రూ.1.25 లక్షలు డిపాజిట్ చేయడానికి సోదరుడితో కలిసి SBI బ్యాంక్‌కు వెళ్లగా.. ఆమె పక్కనే ఉన్న ఓ దొంగ సహాయం చేస్తున్నట్లు నటించాడు.అనంతరం రూ.1.25 లక్షలు తీసుకొని అక్కడి నుంచి ఉడాయించాడు.

SiyaGoyal: కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. చాట్ జీటీపీలో వింత ప్రశ్నలు!తెలంగాణSwechaa04 Oct 2026, 11:12 AM

SiyaGoyal: కేతన్ హత్య కేసులో షాకింగ్ నిజాలు.. చాట్ జీటీపీలో వింత ప్రశ్నలు!

 ప్రేమించి, నిశ్చితార్థం చేసుకున్న యువకుడిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేతన్ అగర్వాల్ కేసులో మైండ్ బ్లాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పుణే సమీపంలోని లోహగడ్ కోట వద్ద జరిగిన ఈ సంచలన మరణంపై పోలీసులు దాఖలు చేసిన 5,053 పేజీల సుదీర్ఘ ఛార్జిషీట్ నేరానికి సంబంధించిన పూసగుచ్చిన ప్రణాళికను బయటపెట్టింది. ఈ ఘోర హత్యకు కేతన్‌కు కాబోయే భార్య సియా గోయల్ ప్రధాన సూత్రధారిగా తేలగా, ఆమెతో పాటు స్నేహితులు చేతన్ చౌదరి, రితేష్ హంగేలను పోలీసులు నిందితులుగా పేర్కొంటూ విచారణ వేగవంతం చేశారు.

ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం..InternationalSwechaa04 Oct 2026, 10:56 AM

ఇండోనేషియాలో మరోసారి భారీ భూకంపం..

ద్వీపదేశమైన ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ స్థాయిలో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 05:07 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు భారత భూకంప అధ్యయన కేంద్రం అధికారికంగా వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.2గా నమోదైనట్టు ప్రకటించింది. భూ ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. తెల్లవారు జామున ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆ దేశ వాసులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసి రోడ్లపైకి చేరుకున్నారు.

flydubai:ఫ్లైదుబాయ్ ఘటన.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్!InternationalSwechaa04 Oct 2026, 10:24 AM

flydubai:ఫ్లైదుబాయ్ ఘటన.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్!

 దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో సెప్టెంబర్ 30న జరిగిన భయాందోళనకరమైన కాక్‌పిట్ దాడి ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఊహించని ప్రమాదం నుంచి వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ స్వయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడారు. ఈ ఘటన గురించి తెలుపుతూ స్మిత్ ఆసక్తికర విషయాలను ఆయనతో పంచుకున్నాడు. కో-పైలట్ హమామ్ అల్-హమ్మామీ ప్రార్థన చేసుకుంటానని చెప్పి, వెనుక నుంచి తనపై అనూహ్యంగా భౌతిక దాడి చేశాడని వెల్లడించాడు.

జోకర్.. వ్యవస్థ!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa04 Oct 2026, 10:08 AM

జోకర్.. వ్యవస్థ!

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 8 దశాబ్దాలు. ఇన్నేళ్లలో భారత రాజకీయ వ్యవస్థ ఎన్నో మలుపులు చూసింది. ప్రభుత్వాలు మారాయి. ప్రధానమంత్రులు మారారు. ముఖ్యమంత్రులు మారారు. పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ప్రతిపక్షంలోకి వెళ్లాయి. కానీ ఒక విషయం మాత్రం రాజకీయాలను పదేపదే వెంటాడుతూనే ఉంది. అదే అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు, దర్యాప్తులు, అరెస్టులు, కోర్టు కేసులు, తీర్పులు. ఏమిటీ అవినీతి కథా చిత్రమ్? ఎందుకీ అవినీతి బాగోతం? కొన్ని కేసులు ప్రభుత్వాలనే కుదిపేశాయి. కొన్ని కేసుల్లో మంత్రులు రాజీనామా చేశారు. కొందరు జైలుకెళ్లారు. మరికొందరిని కోర్టులు నిర్దోషులుగా విడుదల చేశాయి.

రేవంత్‌ రెడ్డి వెనుక   బినామీ సామ్రాజ్యంతెలంగాణSwechaa04 Oct 2026, 10:04 AM

రేవంత్‌ రెడ్డి వెనుక బినామీ సామ్రాజ్యం

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీల ముసుగులో ముఖ్యమంత్రి చేస్తున్న పెట్టుబడులను వివరిస్తూ ఆయన వెనుక పెద్ద సామ్రాజ్యమే నడుస్తోందని బహిర్గతం చేశారు. 'దుంప శిరీష' అనే మహిళను ముసుగుగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల బినామీ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. మెడికవర్ ఆస్పత్రిలో ప్రధాన షేర్‌హోల్డర్‌గా ఉన్న సదరు మహిళ పేరిట ఉన్న వాటాలను ఏకంగా రూ.13,300 కోట్లకు అమ్మేశారని తెలిపారు. రెండేళ్ల కాలంలో సహృదయ మాతృ సంస్థ ఆదాయం 689 శాతం మేర ఎలా పెరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘మేక్స్ బైన్’ ఫార్మా కంపెనీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడు సత్యనారాయణతో పాటు దుంప శిరీష ప్రధాన డైరెక్టర్లుగా ఉన్నారని క్రిశాంక్ వెల్లడించారు.

తెలంగాణలో రూ.50 వేల కోట్ల దోపిడీ!తెలంగాణSwechaa04 Oct 2026, 09:55 AM

తెలంగాణలో రూ.50 వేల కోట్ల దోపిడీ!

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయికి చేరింది. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఉద్యమం పేరుతో రూ.వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, వందల ఎకరాల భూములు కబ్జా చేశారని సీఎం రేవంత్ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి బీఆర్ఎస్ నాయకులు అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇస్తున్నారు.అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్, ఆయన కుటుంబం రూ.వేల కోట్లు దోచేసిందని సంచలన ఆరోపణలు గుప్పిస్తున్నారు. రెండున్నరేండ్లలో ఎనుముల కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకున్న సొమ్ము అక్షరాలా రూ.50 వేల కోట్లు అంటూ బీఆర్ఎస్ ఆరోపించింది.

22ఏ పరేషాన్.. ఎమ్మెల్యేల మాట వినని కలెక్టర్లు!తెలంగాణSwechaa04 Oct 2026, 09:40 AM

22ఏ పరేషాన్.. ఎమ్మెల్యేల మాట వినని కలెక్టర్లు!

తెలంగాణలో 22ఏ అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి 22ఏ అంశాన్ని ప్రస్తావించారు. నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యను పరిష్కరించే అధికారులను ఆర్డీవోలకు అప్పగించారు.అయితే, ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎటువంటి మార్గదర్శకాలు రాలేదని తెలుస్తోంది. దీంతో ఆర్డీవోలు, కలెక్టర్లు 22ఏ అంశంలో ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం.మరోవైపు నిషేధిత జాబితాలో ఉన్న తమ భూముల సమస్యను పరిష్కరించాలని నియోజకవర్గ ఎమ్మెల్యేల మీద ఒత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. మరోవైపు రాష్ట్రంలో 22ఏ సమస్య లేదన్నట్టుగా సీఎంవో, సీసీఎల్ఏ అధికారులు వ్యవహరిస్తున్నట్టు సమాచారం. వ్యవసాయ భూముల డేటాలో ఎలాంటి తప్పులు లేవని, పట్టణ ప్రాంతాల్లో యూఎల్సీ సమస్య మాత్రమే ఉందన్నట్టుగా సీఎం రేవంత్,మంత్రి పొంగులేటికి రిపోర్టులు ఇస్తున్నట్టు తెలిసింది. ఖారీజ్ ఖాతా పేరిట ప్రతి ఊరిలో 50 నుంచి 100 ఖాతాలను 22 ఏ లిస్టులో చేర్చినట్టు సమాచారం. లక్షలాది ఎకరాల పట్టా భూమిపై ఇంకా నిషేధం కొనసాగుతోంది. ఈ విషయంలో ఎమ్మెల్యేలు చెప్పినా కలెక్టర్లు, ఆర్డీవోలు పట్టించుకోవడం లేదని తెలిసింది.

Freebus: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు సౌకర్యం!తెలంగాణSwechaa04 Oct 2026, 09:32 AM

Freebus: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. త్వరలో ఉచిత బస్సు సౌకర్యం!

తెలంగాణలోని వయోవృద్ధులకు (సీనియర్ సిటిజన్లు) రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందిస్తున్న ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వయోవృద్ధులకు కూడా విస్తరించే అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిశీలిస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. వీలైనంత త్వరగా ఈ ప్రతిపాదనను కార్యరూపంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

సీఈసీపై విజిలెన్స్ విచారణ.. కేరళం సర్కార్ ఆదేశంNationalSwechaa04 Oct 2026, 09:24 AM

సీఈసీపై విజిలెన్స్ విచారణ.. కేరళం సర్కార్ ఆదేశం

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం సహకారం అందిస్తున్నదని, తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు డిలీట్ చేసే ప్రక్రియలో కేంద్రానికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ సాయం చేస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలోనే దేశప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ‘సత్యాగ్రహ’ దీక్షకు పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు తాజాగా కేరళం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.2006లో ఆయన కేరళం ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా పనిచేశారు. నాడు పలు అవకతవకలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ జరపాలని హోంమంత్రి రమేశ్ చెన్నిథాల విజిలెన్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు.

ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటే మా విజయానికి కారణం: వెస్టిండీస్ కెప్టెన్క్రీడలుSwechaa04 Oct 2026, 08:58 AM

ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటే మా విజయానికి కారణం: వెస్టిండీస్ కెప్టెన్

 మొహాలీలోని ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ జట్టు అసాధారణ రీతిలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. భారత్ నిర్దేశించిన 352పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 5వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే తమ అత్యంత సమర్థవంతమైన, అత్యధిక పరుగుల ఛేదనను విజయవంతంగా సాధించింది. ఈ సంచలన పోరాటంలో వెస్టిండీస్ కెప్టెన్, వికెట్ కీపర్ షాయ్ హోప్ 143బంతుల్లో అజేయంగా 162పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు.  ఈ భారీ విజయం అనంతరం విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. తనకు ఇంతటి ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడేలా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహా ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించాడు.

Chiranjeevi: తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలిసినిమాSwechaa04 Oct 2026, 07:32 AM

Chiranjeevi: తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి

Chiranjeevi: చుట్టమల్లే సాంగ్ ఏఐ డీప్‌ఫేక్స్ పై మెగాస్టార్ ఆగ్రహం..అవును, తాజాగా ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా ఓ సుధీర్ఘమైన నోట్ ను రాశారు. అందులో పలు అంశాలను వివరిస్తూ ఏఐ డీప్‌ఫేక్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అంతేకాదు, ఈ పోరాటానికి తెలుగు సినిమా కుటుంబమంతా ఒక్కటిగా ముందుకు రావాలి..అంటూ కోరారు.

Singeetham Srinivasa Rao: లెజండరీ డైరెక్టర్ కన్నుమూత!సినిమాSwechaa04 Oct 2026, 07:08 AM

Singeetham Srinivasa Rao: లెజండరీ డైరెక్టర్ కన్నుమూత!

Singeetham Srinivasa Rao: తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రయోగాల మాంత్రీకుడు, కొత్త కథలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అక్టోబర్ 3న కన్నుమూశారు. 94 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సింగీతం మృతి సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Sai Pallavi: ఫిదా బ్యూటీ కెరీర్ స్లో ఎందుకు అవుతోంది?సినిమాSwechaa04 Oct 2026, 06:43 AM

Sai Pallavi: ఫిదా బ్యూటీ కెరీర్ స్లో ఎందుకు అవుతోంది?

Sai Pallavi: గత కొంతకాలంగా సాయి పల్లవి కెరీర్‌ను పరిశీలిస్తే “కెరీర్ స్లో అయిపోయింది” అనే మాట టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది. దీనికి, కారణం ఈ మధ్య కాలంలో ఒక్క తెలుగు సినిమాను సైన్ చేయకపోవడమే. అయితే, అది పూర్తిగా వాసతవం కాదు. ప్రస్తుతం, సాయి పల్లవి సినిమాల సంఖ్య తగ్గింది, కానీ అందుకు ప్రధాన కారణం వరుస ఫ్లాపులు కంటే ఆమె ఎంచుకుంటున్న కథలు, పాత్రల స్వభావం, ప్రాజెక్టుల స్కేల్, షూటింగ్‌కు పడుతున్న సమయం అని చెప్పొచ్చు.

‘తొలిముద్ద’తో చిన్నారులకు పౌష్టికాహారం- మంత్రి జూపల్లితెలంగాణSwechaa03 Oct 2026, 10:42 PM

‘తొలిముద్ద’తో చిన్నారులకు పౌష్టికాహారం- మంత్రి జూపల్లి

Tholi Mudda: చిన్నారుల ఎదుగుదలకు తొలిదశ నుంచే పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో అల్పాహార పథకం ‘తొలిముద్ద’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అల్పాహార (‘తొలిముద్ద’) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలకు అల్పాహారాన్ని మంత్రి జూపల్లి స్వయంగా తినిపించారు.

Nani: జానర్ మార్చుకుంటున్న నాని.. మళ్లీ క్లాస్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్!సినిమాSwechaa03 Oct 2026, 10:33 PM

Nani: జానర్ మార్చుకుంటున్న నాని.. మళ్లీ క్లాస్ సినిమాలకే గ్రీన్ సిగ్నల్!

Nani: నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వచ్చిన ‘ది ప్యారడైజ్’ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో.. నాని తన తదుపరి సినిమాల విషయంలో మరోసారి ఆలోచనలో పడినట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, వరుసగా డిఫరెంట్ జానర్లను టచ్ చేస్తున్న నాని..

India - Pakistan Border: సరిహద్దులో పాక్ పౌరుల కాల్చివేత.. భారత రాయబారికి పాకిస్తాన్ సమన్లు!NationalSwechaa03 Oct 2026, 10:20 PM

India - Pakistan Border: సరిహద్దులో పాక్ పౌరుల కాల్చివేత.. భారత రాయబారికి పాకిస్తాన్ సమన్లు!

India - Pakistan Border: పంజాబ్ సరిహద్దుల్లో చొరబాటుదారులను భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) మట్టుబెట్టిన ఘటన ఇండియా - పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది. సరిహద్దు కంచె దాటి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఇద్దరు పాకిస్తానీయులను సైన్యం కాల్చిచంపడంపై పాక్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇస్లామాబాద్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన సీనియర్ దౌత్యవేత్తకు పాక్ విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది.శుక్రవారం ముగ్గురు పాకిస్తాన్ పౌరులు పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లా పరిధిలోని భారత్ - పాక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద కంచెను దాటి ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్ జవాన్లు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. తిరిగి తమ భూభాగంలోకి వెళ్లిపోవాలని పదేపదే హెచ్చరించినప్పటికీ.. వారు వినిపించుకోకుండా దూకుడుగా ముందుకొచ్చారు

చిత్రం లేదు
తెలంగాణSwechaa03 Oct 2026, 09:28 PM

OU: సీఎం చెప్పినా పైసా విదల్చని ఫైనాన్స్ శాఖ.. ఓయూ ఫండ్స్‌పై కొర్రీలు!

OU: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సైతం పక్కనపెడుతూ తెలంగాణ ఆర్థిక శాఖ వ్యవహరిస్తున్న తీరు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, వర్సిటీకి రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించి, విద్యాశాఖ ద్వారా జీవో కూడా ఇప్పించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నయాపైసా విదల్చకుండా కొర్రీల మీద కొర్రీలు వేస్తుండటంతో ఓయూ అభివృద్ధి నిధుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.