స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

చిత్రం లేదు
తెలంగాణSwechaa03 Oct 2026, 09:28 PM

OU: సీఎం చెప్పినా పైసా విదల్చని ఫైనాన్స్ శాఖ.. ఓయూ ఫండ్స్‌పై కొర్రీలు!

OU: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సైతం పక్కనపెడుతూ తెలంగాణ ఆర్థిక శాఖ వ్యవహరిస్తున్న తీరు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, వర్సిటీకి రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించి, విద్యాశాఖ ద్వారా జీవో కూడా ఇప్పించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నయాపైసా విదల్చకుండా కొర్రీల మీద కొర్రీలు వేస్తుండటంతో ఓయూ అభివృద్ధి నిధుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

TGSAFE: లైసెన్సులు రద్దయినా డోంట్ కేర్.. దర్జాగా తెరిచి మరీ కల్తీ దందా!తెలంగాణSwechaa03 Oct 2026, 09:24 PM

TGSAFE: లైసెన్సులు రద్దయినా డోంట్ కేర్.. దర్జాగా తెరిచి మరీ కల్తీ దందా!

TGSAFE: హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లోని కార్పొరేట్ అద్దాల మేడలు, జిగేల్మనే ఏసీ రెస్టారెంట్ల అసలు రంగు బయటపడినా నిర్వాహకుల్లో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం మెరుపు దాడులు చేసి, లైసెన్సులు క్యాన్సల్ చేసినా.. "మాకేం కాదు.. మా బిజినెస్ ఆగదు" అన్నట్లుగా నిర్వాహకులు దర్జాగా బోర్డులు తెరిచి కల్తీ దందాను కొనసాగిస్తున్నారు. లక్షల్లో లాభాలు గడించే హోటళ్ల ఓనర్స్‌కి అధికారుల తనిఖీలు, నామమాత్రపు జరిమానాలు లెక్కే కాకుండా పోయాయి.గచ్చిబౌలిలోని ప్రముఖ రెస్టారెంట్ ‘అంతేరా కిచెన్ అండ్ బార్’ లైసెన్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు రూల్స్ బ్రేక్ చేసిన కారణంగా క్యాన్సల్ చేశారు. అయితే అధికారులు వెళ్లిన మరుసటి రోజే ఎటువంటి బెరుకు లేకుండా ఆ రెస్టారెంట్ మళ్లీ తెరుచుకుని వ్యాపారం సాగించడమే ఓనర్ల బరితెగింపునకు నిదర్శనంగా నిలుస్తుంది. నిబంధనలను కాలరాసినందుకు 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దవగా, మరికొన్నింటికి నోటీసులు అందాయి. కానీ చట్టాల్లోని లొసుగులు, నామమాత్రపు పెనాల్టీలను అడ్డుపెట్టుకుని అదే అపరిశుభ్ర కిచెన్లలో మళ్లీ వంటలు మొదలుపెట్టేస్తున్నారు. రోజుకు వేలల్లో పడే జరిమానాలు.. వాళ్లు గడించే లక్షల లాభాల ముందు కంటితుడుపుగానే మిగులుతున్నాయి.

OU: సీఎం చెప్పినా పైసా విదల్చని ఫైనాన్స్ శాఖ.. ఓయూ ఫండ్స్‌పై కొర్రీలు!తెలంగాణSwechaa03 Oct 2026, 09:20 PM

OU: సీఎం చెప్పినా పైసా విదల్చని ఫైనాన్స్ శాఖ.. ఓయూ ఫండ్స్‌పై కొర్రీలు!

OU: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలను సైతం పక్కనపెడుతూ తెలంగాణ ఆర్థిక శాఖ వ్యవహరిస్తున్న తీరు సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని, వర్సిటీకి రూ.1000 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించి, విద్యాశాఖ ద్వారా జీవో కూడా ఇప్పించారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నయాపైసా విదల్చకుండా కొర్రీల మీద కొర్రీలు వేస్తుండటంతో ఓయూ అభివృద్ధి నిధుల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది.

Talasani Srinivas Yadav: ఖైరతాబాద్ ఉపఎన్నికను తలసాని పర్సనల్ ప్రెస్టేజ్‌గా తీసుకుంటున్నారా !తెలంగాణSwechaa03 Oct 2026, 09:11 PM

Talasani Srinivas Yadav: ఖైరతాబాద్ ఉపఎన్నికను తలసాని పర్సనల్ ప్రెస్టేజ్‌గా తీసుకుంటున్నారా !

Talasani Srinivas Yadav: రాష్ట్ర రాజకీయాల్లో ఉప ఎన్నిక నగారా మోగకముందే ఖైరతాబాద్ నియోజకవర్గం కేంద్రంగా పొలిటికల్ హీట్ పీక్స్‌కి చేరింది. గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాలను దశాబ్దాలుగా శాసిస్తున్న సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజా అడుగులు చూస్తుంటే.. ఈ ఉపఎన్నికను ఆయన అత్యంత వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం పార్టీ గెలుపు మాత్రమే కాకుండా, తన రాజకీయ వారసుడైన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ భవిష్యత్తుకు బలమైన పునాది వేసేందుకు ఈ ఎన్నికను ఒక 'లిట్మస్ టెస్ట్'గా భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.

Keerthy Suresh: ‘అక్క’ గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తున్న మహానటి..సినిమాSwechaa03 Oct 2026, 09:04 PM

Keerthy Suresh: ‘అక్క’ గా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చేస్తున్న మహానటి..

Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన సత్తా చూపించేందుకు సిద్ధమవుతోంది. ఇన్నాళ్లు వెండితెరపై విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న కీర్తి.. తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. ఆ సిరీస్ పేరే ‘అక్క’.

TG: వీసా ముగిసినా దర్జాగా నేరాలు.. హైదరాబాద్‌లో విదేశీయుల ముఠా గుట్టురట్టు!తెలంగాణSwechaa03 Oct 2026, 09:02 PM

TG: వీసా ముగిసినా దర్జాగా నేరాలు.. హైదరాబాద్‌లో విదేశీయుల ముఠా గుట్టురట్టు!

TG: వీసా గడువు ముగిసిపోయినా నగరంలో తిష్ఠవేసి అక్రమ దందాలు, నేరాలకు పాల్పడుతున్న విదేశీయులపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ నజర్ పెట్టారు. తాజాగా స్పెషల్ బ్రాంచ్ (ఫారెనర్స్ మానిటరింగ్ సెల్), ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ, శాంతిభద్రతల పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో నగరవ్యాప్తంగా అక్రమంగా నివసిస్తున్న 49 మంది విదేశీయులను గుర్తించారు. వీరిలో ఇప్పటికే 12 మందిని స్వదేశాలకు డిపోర్ట్ చేయగా, మిగతా వారిని తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. అత్యధికంగా ఒక్క టోలిచౌకి ప్రాంతంలోనే 30 మంది పట్టుబడటం కలకలం రేపింది.

రెండున్నరేళ్లలో రూ.50వేల కోట్లు దోచేశారు.. సీఎం రేవంత్ కుటుంబంపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలుతెలంగాణSwechaa03 Oct 2026, 08:43 PM

రెండున్నరేళ్లలో రూ.50వేల కోట్లు దోచేశారు.. సీఎం రేవంత్ కుటుంబంపై బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య ఆస్తుల వివాదం తారస్థాయికి చేరింది. గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని, ఉద్యమం పేరుతో వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, వందల ఎకరాల భూములు కబ్జా చేశారని చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. దీనికి బీఆర్ఎస్ నాయకులు అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు.

అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్, ఆయన కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచేసిందని సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ రెండున్నరేళ్లలో అనుముల కుటుంబం తెలంగాణ మీద పడి దోచుకున్న సొమ్ము అక్షరాల రూ.50వేల కోట్లు అంటూ ఆరోపించింది. ముఖ్యమంత్రి పదవిని వాడుకుని రేవంత్ రెడ్డి తెలంగాణను లూటీ చేస్తున్నారని విరుచుకుపడింది. ఈ మేరకు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన పోస్టు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది.

ఆసుపత్రుల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి..తెలంగాణSwechaa03 Oct 2026, 08:13 PM

ఆసుపత్రుల నిర్మాణం త్వరగా పూర్తి చేయండి..

Cm Revanth: విద్య, వైద్యం రంగాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రధాన ఆసుపత్రుల పురోగతిపై ఆరా తీశారు. ఆసుపత్రుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్, అల్వాల్, వరంగల్ తో పాటు ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులతో చెప్పారు. శనివారం సీఎంవో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్.. విద్య, వైద్య రంగాలకు సంబంధించిన క్షేత్ర పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

TG: రైస్ మిల్లర్లకు సర్కార్ వార్నింగ్.. అక్రమాలకు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్!తెలంగాణSwechaa03 Oct 2026, 07:48 PM

TG: రైస్ మిల్లర్లకు సర్కార్ వార్నింగ్.. అక్రమాలకు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్!

TG: ప్రభుత్వానికి ధాన్యం బకాయిలు ఎగ్గొడుతూ టైం పాస్ చేస్తున్న అక్రమ రైస్ మిల్లర్లపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ గట్టిగా జవాబు చెప్పడానికి రెడీ అయ్యింది. ప్రజాధనంతో కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిన ధాన్యాన్ని దారిమళ్లించినా, సీఎంఆర్ ధాన్యం లెక్క తేల్చకపోయినా ఇకపై ఊరుకునేది లేదని ప్రభుత్వం స్పష్టమైన వార్నింగ్ ఇచ్చింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం.స్టీఫెన్ రవీంద్ర ఆదేశాల మేరకు రెవెన్యూ రికవరీ (ఆర్ఆర్) చట్టం ద్వారా మిల్లర్ల ఆస్తులను జప్తు చేసేందుకు అధికారులు పక్కా ప్లాన్ రెడీ చేశారు.ఈ సరికొత్త ప్రణాళిక ప్రకారం.. గోదాముల్లో తనిఖీలు నిర్వహించి ధాన్యం తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. సమాధానం ఇచ్చేందుకు కేవలం 7 రోజుల గడువు మాత్రమే ఉంటుంది. ఆ గడువులోగా రెస్పాన్స్ లేకపోతే జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో మిల్లులు, యంత్రాలు, వాహనాలు, బ్యాంకు ఖాతాలను వెంటనే సీజ్ చేస్తారు. ప్రభుత్వం నష్టపోయిన మొత్తం రాబట్టుకోలేకపోతే మిల్లర్ల ఇళ్లు, వ్యవసాయ భూములను సైతం స్వాధీనం చేసుకుని బహిరంగ వేలం వేసేందుకు అధికారులు రంగంలోకి దిగుతోంది.

Aishwarya Lekshmi: రాకా మూవీలో ఐశ్వర్య లక్ష్మి..ఇదే అసలు ట్విస్ట్!సినిమాSwechaa03 Oct 2026, 07:36 PM

Aishwarya Lekshmi: రాకా మూవీలో ఐశ్వర్య లక్ష్మి..ఇదే అసలు ట్విస్ట్!

Aishwarya Lekshmi: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాకా. కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ, ఇందులో నిజం లేదని స్వయంగా ఐశ్వర్య క్లారిటీ ఇచ్చింది.

Tollywood: టాలీవుడ్‌లో లేట్ మేకింగ్ సిండ్రోమ్.. నిర్మాతలను ముంచుతున్న బద్ధకం!సినిమాSwechaa03 Oct 2026, 07:12 PM

Tollywood: టాలీవుడ్‌లో లేట్ మేకింగ్ సిండ్రోమ్.. నిర్మాతలను ముంచుతున్న బద్ధకం!

Tollywood: ఒకప్పుడు సినిమా అంటే స్పష్టమైన ప్రణాళిక, క్రమశిక్షణ, బౌండ్ స్క్రిప్ట్‌తో కూడిన పరుగులు. ఇప్పుడు సినిమా అంటే నెలల తరబడి లొకేషన్ల ఎంపికలు, సెట్స్ మీద కబుర్లు, ఎడిటింగ్ టేబుల్ వద్ద తర్జనభర్జనలు అనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి అత్యాధునిక డిజిటల్ కెమెరాలు, హై-ఎండ్ ఎడిటింగ్ సూట్లు, విలాసవంతమైన కారవాన్లు అందుబాటులోకి వచ్చాక సినిమా పనులు రెట్టింపు వేగంతో పూర్తి కావాలి. కానీ టాలీవుడ్‌ను ప్రస్తుతం పట్టిపీడిస్తున్న అసలు సమస్య ‘లేట్ మేకింగ్ సిండ్రోమ్’. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దర్శకుల్లో, నిర్మాణ బృందాల్లో ఆలోచనల క్లారిటీ తగ్గి.. బద్ధకం, అలసత్వం పెరిగిపోతుండటం ఇప్పుడు చిత్ర పరిశ్రమను ఆర్థిక సంక్షోభం వైపు నెడుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Keerthy Suresh: మహానటి తర్వాత కీర్తి సురేష్ కథల ఎంపికలో ఎందుకు తడబడుతోంది?సినిమాSwechaa03 Oct 2026, 06:59 PM

Keerthy Suresh: మహానటి తర్వాత కీర్తి సురేష్ కథల ఎంపికలో ఎందుకు తడబడుతోంది?

Keerthy Suresh: మహానటి తర్వాత కీర్తి సురేష్ కథల ఎంపికలో ఎందుకు తడబడుతోంది? అవును..ఇదే ప్రశ్న ఇండస్ట్రీ ప్రముఖుల్లో ప్రథమంగా వినిపిస్తోంది. దీనికి, కారణం తాజాగా వచ్చిన కల్ట్ మూవీ డోరతీ. తమిళంలో వచ్చిన ఈ సినిమా అక్కడ ప్రేక్షకులను నిరాశపరచడమే కాదు..విశ్లేషకుల నుంచి విమర్శలను కూడా ఎదుర్కుంది. అయినా, ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు రానా దగ్గుబాటి. ఇక్కడ, కూడా ఫలితం తేడా కొట్టింది.

Kalyani Priyadarshan: ప్రళయ్ మూవీ కోసం ముంబైకి మకాం మార్చిన కళ్యాణి!సినిమాSwechaa03 Oct 2026, 06:45 PM

Kalyani Priyadarshan: ప్రళయ్ మూవీ కోసం ముంబైకి మకాం మార్చిన కళ్యాణి!

Kalyani Priyadarshan: మలయాళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే ‘ప్రళయ్’.

బ్యాంకులు, నగల షాపుల్లో చోరీలు చేసేందుకే.. బొల్లారం ఆర్మీ ఆయుధాల కేసులో సంచలన విషయాలుక్రైమ్Swechaa03 Oct 2026, 06:26 PM

బ్యాంకులు, నగల షాపుల్లో చోరీలు చేసేందుకే.. బొల్లారం ఆర్మీ ఆయుధాల కేసులో సంచలన విషయాలు

Bollaram: బొల్లారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 20వ బెటాలియన్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ కోటే, మ్యాగజైన్‌ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి చోరీకి గురైన కేసులో మిస్టరీని మల్కాజ్‌గిరి పోలీసులు ఛేదించారు. ఆయుధాల చోరీ వెనుక కుట్రను పోలీసులు వెల్లడించారు. చోరీ చేసిన ఆర్మీ ఆయుధాలతో దోపిడీలు చేయాలనుకున్నారని తెలిపారు. ఆర్మీ ఆయుధాల కేసులో ఉగ్ర లింకులు లేవని స్పష్టం చేశారు.

చోరీ చేసిన ఆయుధాలతో బ్యాంకులు, నగల దుకాణాలు, సంపన్నులను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడాలని నిందితులు ప్రణాళిక రూపొందించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆర్మీ ఆయుధాలను ఉపయోగించి భారీ మొత్తంలో డబ్బు సంపాదించాలన్నదే వారి ఉద్దేశం అని వెల్లడించారు. ఈ కేసులో నిందితుల ఉద్దేశం భారీ ఆస్తి నేరాలకు పాల్పడటమేనన్న పోలీసులు.. ఇందులో ఎటువంటి ఉగ్రవాద లేదా తీవ్రవాద సంబంధాలు గుర్తించలేదని దర్యాఫ్తు అధికారులు ప్రకటించారు.

Official: ధనుష్, మమ్ముట్టి ‘ఓం’ రిలీజ్ డేట్ లాక్.. నవంబర్‌లో భారీ యాక్షన్ ట్రీట్!సినిమాSwechaa03 Oct 2026, 06:17 PM

Official: ధనుష్, మమ్ముట్టి ‘ఓం’ రిలీజ్ డేట్ లాక్.. నవంబర్‌లో భారీ యాక్షన్ ట్రీట్!

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓం: చాప్టర్ 1’ రిలీజ్ డేట్ ఎట్టకేలకు లాక్ అయింది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా మేకర్స్ కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 20, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ఓం’ విడుదల కానుంది. తాజాగా, ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

RohitSharma: అంతర్జాతీయ క్రికెట్‌ లో మరో చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మక్రీడలుSwechaa03 Oct 2026, 06:11 PM

RohitSharma: అంతర్జాతీయ క్రికెట్‌ లో మరో చరిత్ర సృష్టించిన రోహిత్‌ శర్మ

RohitSharma: వెస్టిండీస్‌తో జరుగుతున్న ఆఖరి వన్డే మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ పరుగుల సునామీ సృష్టించాడు. క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే విండీస్ బౌలర్లను చెడుగుడు ఆడుతూ ప్రపంచ క్రికెట్‌లోనే అదిరిపోయే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న భారీ రికార్డును హిట్‌మ్యాన్ దాటేశాడు.వన్డేల్లో ఇన్నింగ్స్‌లో స్టార్ట్ చేసే బ్యాటర్‌గా అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయిని చేరిన మొట్టమొదటి ప్లేయర్‌గా రోహిత్ సరికొత్త మార్క్ సెట్ చేశాడు. ఈ ఘనత అందుకోవడానికి సచిన్‌కు 214 ఇన్నింగ్స్‌లు పడితే, రోహిత్ కేవలం 202 ఇన్నింగ్స్‌ల్లోనే దాన్ని బ్రేక్ చేసి టాప్‌లోకి దూసుకెళ్లాడు.

సీఎన్‌జీ నింపుతుండగా భారీ పేలుడు.. ముక్కలైన కారు..NationalSwechaa03 Oct 2026, 05:35 PM

సీఎన్‌జీ నింపుతుండగా భారీ పేలుడు.. ముక్కలైన కారు..

CNG Car Explode: గుజరాత్‌లోని వడోదర జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కారులో సీఎన్‌జీ నింపుతుండగా భారీ పేలుడు సంభవించింది. కారు ముక్కలు ముక్కలైంది. కర్జన్‌ టోల్ ప్లాజా సమీపంలో నేషనల్ హైవే 48పై ఈ ఘటన జరిగింది. అక్టోబర్‌ 1న ఈ ఘటన జరిగింది. జిందాల్‌ కంపెనీకి ఎదురుగా ఉన్న ఫ్యూయల్ స్టేషన్ లో కారులో సీఎన్ జీ నింపుతుండగా ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ ట్యాంక్ పేలిపోయింది. దీంతో కారు వెనుక భాగం ముక్కలుముక్కలైంది.

ప్రాణభయంతో పరుగులు

కాగా, ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడం.. బంకు సిబ్బంది కూడా కొంత దూరంలో ఉండటంతో ప్రాణనష్టం తప్పింది. సీఎన్‌జీతో నడిచే కారు భారీ శబ్దంతో పేలడంతో బంకు సిబ్బంది, చుట్టుపక్కల వారు ఉలిక్కిపడ్డారు. బంకు సిబ్బంది, ఇతర వాహనదారులు ప్రాణభయంతో అక్కడి నుంచి దూరంగా పరుగులు తీశారు. ఈ ఘటనలో కారుకు సమీపంలోనే ఉన్న మరో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

Telangana Politics: మాజీలైనా.. తాజాలమన్నట్టే పెత్తనం! పవర్ పోయినా.. పోజులు తగ్గని బ్యాచ్తెలంగాణSwechaa03 Oct 2026, 04:37 PM

Telangana Politics: మాజీలైనా.. తాజాలమన్నట్టే పెత్తనం! పవర్ పోయినా.. పోజులు తగ్గని బ్యాచ్

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ‘ఫెవికాల్ బ్యాచ్’ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. పదవిలో ఉన్నన్నాళ్లూ అధికారం అనుభవించిన కొందరు నేతలు.. పదవీ కాలం ముగిసి మాజీలుగా మారినా కుర్చీలను వదిలిపెట్టేందుకు ససేమిరా అంటున్నారట. "పదవి పోయినా పవర్ మాదే.. కుర్చీ పోయినా పెత్తనం మాదే" అన్నట్లుగా వ్యవహరిస్తూ కార్పొరేషన్లలో ఇంకా పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. మాజీలు అయ్యాక కూడా ప్రజాధనంతో దర్జాగా జల్సాలు చేస్తూ, అధికారిక హోదాల్లో తిరుగుతున్నారన్న విమర్శలు ఇప్పుడు సచివాలయ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.

స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. దిగివస్తున్న ప్రభుత్వం.. 22ఏ సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగుతెలంగాణSwechaa03 Oct 2026, 03:48 PM

స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. దిగివస్తున్న ప్రభుత్వం.. 22ఏ సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగు

22A Lands: స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. గత నెల రోజుల పాటు స్వేచ్ఛ న్యూస్ చేసిన పోరాటం ఫలించింది. ప్రభుత్వం దిగి వస్తోంది. 22ఏ నిషేధిత భూముల సమస్యల పరిష్కారంలో మరో కీలక అడుగు పడింది. నాలా అనుమతి లేకుండా నివాస వినియోగంలోకి వచ్చిన పట్టా భూముల రిజిస్ట్రేషన్లకు తీపి కబురు చెప్పింది. నాలా రుసుము చెల్లింపుతో అర్హత ఉన్న భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మెమో నెం 48062/ULC/A1/2026 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్న దరఖాస్తులను కాలపరిమితిలో పరిష్కరించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

Tollywood: డీప్ ఫేక్ ఏఐ వీడియో తో దేవరా సినిమాలోని "చుట్టమల్లె " పాట..సినిమాSwechaa03 Oct 2026, 03:05 PM

Tollywood: డీప్ ఫేక్ ఏఐ వీడియో తో దేవరా సినిమాలోని "చుట్టమల్లె " పాట..

Tollywood: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, క్రేజీ హీరోయిన్ జాన్వి కపూర్ జంటగా నటించిన మాస్ అండ్ యాక్షన్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. 2024, సెప్టెంబర్ 27న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజై నందమూరి అభిమానులనే కాకుండా సినీ లవర్స్‌తో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Telangana Politics: అంగట్లో నామినేటెడ్ పోస్టులు.. సొసైటీ చైర్మన్ పీఠానికి రూ.20 లక్షల రేటు!తెలంగాణSwechaa03 Oct 2026, 03:04 PM

Telangana Politics: అంగట్లో నామినేటెడ్ పోస్టులు.. సొసైటీ చైర్మన్ పీఠానికి రూ.20 లక్షల రేటు!

రాజకీయాల్లో పదవి అంటే ప్రజాసేవకు దక్కిన గుర్తింపు. పార్టీ కోసం చెమటోడ్చిన కార్యకర్తలకు దక్కే గౌరవం. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో మాత్రం పదవులంటే పక్కా కమర్షియల్ బిజినెస్‌గా మారిపోయిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. "క్యాష్ కొట్టు.. కుర్చీ పట్టు.. ఆలసించిన ఆశాభంగం" అన్నట్లుగా అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం సాగుతోందని ఆ పార్టీ నాయకలే చెబుతున్నారు. ప్రజా సమస్యలు, పార్టీ సిద్ధాంతాలు పక్కనపెట్టి, ప్రతీ నామినేటెడ్ పోస్టుకూ బహిరంగంగానే రేటు కట్టి అంగట్లో సరుకులా అమ్మకానికి పెట్టారన్న ఆరోపణలు ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో సంచనలంగా మారింది.

Ananthagiri: బస్సు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి.. సీఎం దిగ్భ్రాంతి !క్రైమ్Swechaa03 Oct 2026, 02:42 PM

Ananthagiri: బస్సు ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి.. సీఎం దిగ్భ్రాంతి !

 వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఘాట్ రోడ్డుపై నుంచి కిందకు దిగుతున్న సమయంలో అదుపుతప్పి లోయవైపు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.  సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన గ్రామస్థులంతా కలిసి వికారాబాద్ జిల్లా ధరూర్‌ మండలం చింతకుంట గ్రామంలో జరుగుతున్న తమ బంధువుల అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బస్సులో బయల్దేరగా ఈ ప్రమాదం జరిగింది.

CyberSafetyForChildren: పిల్లల ఆన్‌లైన్ భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు!తెలంగాణSwechaa03 Oct 2026, 02:17 PM

CyberSafetyForChildren: పిల్లల ఆన్‌లైన్ భద్రతపై సీఎం రేవంత్ రెడ్డి కీలక పిలుపు!

 నేటి ఆధునిక యుగంలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవ జీవితాలను ఎంతో సులభతరం చేస్తున్నప్పటికీ, అదే ఇంటర్నెట్ వలయంలో అమాయకులైన పిల్లలు చిక్కుకుని సైబర్ నేరగాళ్ల బారినపడే ముప్పు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) దక్షిణ మండల ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. నిరుపేదలు, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించి, న్యాయాన్ని ఒక ఆయుధంగా మలిచిన మహాత్మా గాంధీ స్ఫూర్తితో న్యాయ సేవా సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన కొనియాడారు.

మెట్రో రైలులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు!తెలంగాణSwechaa03 Oct 2026, 01:31 PM

మెట్రో రైలులో ప్రయాణించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు!

 హైదరాబాద్ నగరంలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆర్టీసీ – మెట్రో కామన్ మొబిలిటీ పాస్' నూతన విధానాన్ని ప్రోత్సహించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేబినెట్ మంత్రులు శనివారం మెట్రో రైలులో ప్రయాణించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజారుద్దీన్‌లు కలిసి సాధారణ ప్రయాణికుల్లా మెట్రో రైలు ఎక్కి ప్రయాణించి కామన్ పాస్ వినియోగాన్ని పరిశీలించారు.

రేవంత్‌రెడ్డి వెనుక రూ.13,300 కోట్ల బినామీ సామ్రాజ్యం.. బీఆర్ఎస్ నేత సంచలన ఆరోపణలు!తెలంగాణSwechaa03 Oct 2026, 01:12 PM

రేవంత్‌రెడ్డి వెనుక రూ.13,300 కోట్ల బినామీ సామ్రాజ్యం.. బీఆర్ఎస్ నేత సంచలన ఆరోపణలు!

 సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. బినామీల ముసుగులో ముఖ్యమంత్రి చేస్తున్న బినామీ పెట్టుబడులను వివరిస్తూ ఆయన వెనుక బినామీ సామ్రాజ్యమే నడుస్తోందని బహిర్గతం చేశారు. 'దుంప శిరీష' అనే మహిళను ముసుగుగా పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల బినామీ పెట్టుబడులు పెట్టారని క్రిశాంక్ ఆరోపించారు. మెడికవర్ (Medicover) ఆస్పత్రిలో ప్రధాన షేర్‌హోల్డర్‌గా ఉన్న సదరు మహిళ పేరిట ఉన్న వాటాలను ఏకంగా రూ.13,300కోట్లకు అమ్మేశారని తెలిపారు.

చిత్రం లేదు
స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa03 Oct 2026, 12:39 PM

సైబరాబాద్‌లో ఏజెంట్లకే రూ.2.5కోట్లు ఖర్చు అయ్యాయా?

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సంచలన వ్యవహారం వెలుగుచూసింది. దాదాపు 2 నెలల వ్యవధిలోనే రూ.2.5 కోట్లు బదిలీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. అదికూడా ఒకే కంపెనీకి, ఒకేరోజు దాదాపు రూ.90 లక్షల వరకు బదిలీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం 2 నెలల్లోనే రూ.2.5 కోట్లను 2 కంపెనీలకు ట్రాన్స్‌ఫర్ చేయడంపై పోలీస్ వర్గాల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి. నిజానిజాలు బయటకు రావాలని పలువురు అడుగుతున్నారు. ఇంత మొత్తంలో డబ్బు బయటకు వెళ్లిందంటే సీపీకి తెలిసే ఇది జరిగిందా? డీజీపీకి తెలియకుండా జరిగిందా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఆదాయం కంటే అప్పులే ఎక్కువ.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ!తెలంగాణSwechaa03 Oct 2026, 12:34 PM

ఆదాయం కంటే అప్పులే ఎక్కువ.. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ!

 తెలంగాణ ఆర్థిక స్థితిగతులు ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో ఆదాయం కంటే అప్పుల సమీకరణాలు పెరిగిపోతుండటంతో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన బహిరంగ మార్కెట్ రుణాల షెడ్యూల్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) మూడో త్రైమాసికంలో (అక్టోబర్ నుంచి డిసెంబర్) మరో రూ.13,000 కోట్ల భారీ రుణం సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనతో డిసెంబర్ నాటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ లక్ష్యాన్ని దాటిపోనుంది.

ఆసియా క్రీడలు.. గోల్ఫ్, ఆర్చరీలలో రెండు స్వర్ణ పతకాలు!క్రీడలుSwechaa03 Oct 2026, 12:06 PM

ఆసియా క్రీడలు.. గోల్ఫ్, ఆర్చరీలలో రెండు స్వర్ణ పతకాలు!

 ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో ఇవాళ (శనివారం) రెండు ప్రతిష్టాత్మక బంగారు పతకాలను గెలుచుకున్నారు. మహిళల గోల్ఫ్ విభాగంలో ప్రణవి ఉర్స్ చారిత్రాత్మక స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, రికర్వ్ ఆర్చరీలో కుంకుమ్ మొహోద్ పసిడి పతకంతో మెరిశారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర పోటీ నెలకొన్న ఈ పోటీల్లో భారత మహిళా అథ్లెట్లు ప్రతిభ చాటి దేశానికి గర్వకారణంగా నిలిచారు. పతకాల పట్టికలో భారత్ తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంటూ దూసుకుపోతోంది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే గోల్ఫ్ ఈవెంట్‌లో ప్రణవి ఉర్స్ 15-అండర్ పార్ స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని ముద్దాడింది.

ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హోటల్ రూమ్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి!క్రైమ్Swechaa03 Oct 2026, 10:57 AM

ప్రాణం తీసిన ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హోటల్ రూమ్‌లో విద్యార్థిని అనుమానాస్పద మృతి!

ఇన్‌స్టాగ్రామ్ పరిచయం ఓ పీజీ మెడికల్ విద్యార్థిని ప్రాణాలను బలిగొంది. హన్మకొండలో పీజీ (పీడియాట్రిషన్) మొదటి సంవత్సరం చదువుతున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన కె.సృజన (27) అనే విద్యార్థిని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉన్న ఓ హోటల్‌ గదిలో దారుణ హత్యకు గురైంది. పథకం ప్రకారమే ఆమెను హోటల్‌కు పిలిపించిన నిందితుడు, దిండుతో ముఖంపై నొక్కి ఊపిరాడకుండా చేసి దారుణంగా కడతేర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడేళ్ల క్రితం సృజనకు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా రవికుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు.

Dasara Holidays: పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ ఖరారు.. ఎన్ని రోజులంటే?తెలంగాణSwechaa03 Oct 2026, 10:19 AM

Dasara Holidays: పాఠశాలలకు దసరా సెలవుల షెడ్యూల్ ఖరారు.. ఎన్ని రోజులంటే?

 తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలకు దసరా,  బతుకమ్మ పండుగల సెలవుల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ అధికారికంగా ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 10వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. పండుగ వాతావరణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో ఆనందంగా గడిపేందుకు వీలుగా విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. పాఠశాలలకు అక్టోబర్ 10వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు దసరా సెలవులు కొనసాగుతాయి. దీర్ఘకాలిక విరామం అనంతరం పాఠశాలలు తిరిగి అక్టోబర్ 23వ తేదీన పునఃప్రారంభం కానున్నాయి.