స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

SwissGlaciersMelting: వేగంగా కరిగిపోతున్న మంచు పర్వతాలు.. 2,100లో జరిగేది ఇదేనా?InternationalSwechaa03 Oct 2026, 10:04 AM

SwissGlaciersMelting: వేగంగా కరిగిపోతున్న మంచు పర్వతాలు.. 2,100లో జరిగేది ఇదేనా?

ప్రపంచంలోనే అత్యంత రమణీయమైన పర్యాటక ప్రాంతమైన స్విట్జర్లాండ్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణులు పర్యావరణ మార్పుల కారణంగా తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. శీతాకాలంలో తెల్లటి మంచు దుప్పటి కప్పుకుని పర్యాటకులను పరవశింపజేసే స్విస్ గ్లేసియర్లు చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా కరిగిపోతూ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. 'స్విస్ గ్లేసియర్ మానిటరింగ్ నెట్‌వర్క్ (గ్లామోస్)', 'స్విస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' ప్రచురించిన తాజా పరిశోధనాత్మక నివేదిక ప్రకారం, గడిచిన ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే స్విట్జర్లాండ్ తన పర్వతాలపై ఉన్న మంచులో ఏకంగా 20శాతాన్ని శాశ్వతంగా కోల్పోయింది.

ContemptOfCourt: సీపీ సజ్జనార్‌కు హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ!తెలంగాణSwechaa03 Oct 2026, 09:23 AM

ContemptOfCourt: సీపీ సజ్జనార్‌కు హైకోర్టు షాక్.. కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ!

 తలాబ్ కట్ట ప్రాంతానికి చెందిన షానవాజ్ ఆలం అనే వ్యక్తి పోలీస్ ఉన్నతాధికారులపై సంచలన ఆరోపణలు చేశాడు. తనపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు కాకపోయినప్పటికీ హైదరాబాద్ భవానీనగర్ ఎస్‌ఐ, సీఐలు తన కాళ్లు, చేతులు కట్టేసి, కళ్లల్లో కారం చల్లి దారుణంగా చిత్రహింసలకు గురిచేశారంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారుల తీరుపై తెలంగాణ ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వెంటనే పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, బాధ్యులైన అధికారులపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడంతో న్యాయం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపాడు.

Mahabubnagar: అర్హత లేకున్నా వైద్యం.. టీజీఎంసీ దాడుల్లో బయటపడిన సంచలన విషయాలు!..తెలంగాణSwechaa03 Oct 2026, 07:17 AM

Mahabubnagar: అర్హత లేకున్నా వైద్యం.. టీజీఎంసీ దాడుల్లో బయటపడిన సంచలన విషయాలు!..

ఉమ్మడి జిల్లాలో అర్హత లేకుండా వైద్యం చేస్తున్న క్లినిక్‌లపై తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ టాస్క్‌ఫోర్స్‌ కొరడా ఝళిపించింది. ఆయుర్వేద, హోమియోపతి వంటి ఆయూష్‌ వైద్య అర్హతలు ఉన్నప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఆధునిక వైద్యం చేస్తున్నవారు, సరైన రిజిస్ట్రేషన్‌ లేకుండా క్లినిక్‌లు నిర్వహిస్తున్నవారు, మందులు, ఇంజెక్షన్లు ఇస్తున్నవారిపై అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.

కల్వకుర్తి, ఆమన్‌గల్లు మండలాల్లోని పలు క్లినిక్‌లు, నర్సింగ్‌ హోంలు, ఆసుపత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లపై టీజీఎంసీ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఆధునిక వైద్యం చేయడానికి అవసరమైన అర్హత, రిజిస్ట్రేషన్‌ లేకుండానే రోగులకు చికిత్స అందిస్తున్నట్లు, అల్లోపతి మందులు రాస్తున్నట్లు గుర్తించారు.

Telangana: బీసీ ఓటు బ్యాంక్‌పై టీడీపీ కన్ను.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?..తెలంగాణSwechaa03 Oct 2026, 06:54 AM

Telangana: బీసీ ఓటు బ్యాంక్‌పై టీడీపీ కన్ను.. చంద్రబాబు వ్యూహం ఇదేనా?..

తెలంగాణ రాజకీయాల్లో టీడీపీ మళ్లీ యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు మొదలయ్యాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు బలమైన రాజకీయ పార్టీగా ఉన్న టీడీపీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రమంగా బలహీన పడి తన ఉనికిని కోల్పోయింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేసి 15 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆ బలం కూడా నిలబడలేదు. 15 మంది ఎమ్మెల్యేలలో 12 మంది టీఆర్ఎస్‌లో చేరడంతో 2016 నాటికే అసెంబ్లీలో టీడీపీ బలం మూడు స్థానాలకు పడిపోయింది.. ఆ తర్వాత తెలంగాణలో టీడీపీకి చెప్పుకోదగ్గ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.

Health: వెల్లుల్లి ఆరోగ్యానికి వరమా?.. నిపుణులు ఏం చెబుతున్నారు?..HealthSwechaa03 Oct 2026, 06:39 AM

Health: వెల్లుల్లి ఆరోగ్యానికి వరమా?.. నిపుణులు ఏం చెబుతున్నారు?..

వంటింట్లో నిత్యం ఉపయోగించే వెల్లుల్లికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆధునిక పరిశోధనలు కూడా వెల్లుల్లిలోని కొన్ని సహజ సమ్మేళనాలు శరీరంలోని కొలెస్ట్రాల్, రక్తపోటు, రక్తంలో చక్కెర వంటి అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే వెల్లుల్లిని ఎలా తీసుకుంటున్నామన్నది కూడా ముఖ్యమే అని అంటున్నారు ఆరోగ్యనిపుణులు..

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే ముఖ్యమైన బయోయాక్టివ్ సమ్మేళనం ఉంటుంది. వెల్లుల్లి రెబ్బను కోసినప్పుడు లేదా నలిపినప్పుడు దీనికి సంబంధించిన రసాయన చర్యలు ప్రారంభమవుతాయి. అందుకే నలిపిన లేదా మెత్తగా చేసిన వెల్లుల్లిని కొద్దిసేపు ఉంచి వంటలో ఉపయోగించడం వల్ల కొన్ని క్రియాశీల సమ్మేళనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

Health: పంచ కర్మ చికిత్స అంటే ఏమిటి ? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది..HealthSwechaa03 Oct 2026, 06:34 AM

Health: పంచ కర్మ చికిత్స అంటే ఏమిటి ? ఇది ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది..

ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సకు ప్రత్యేక స్థానం ఉంది. శరీరంలో పేరుకుపోయిన దోషాలను తగ్గించి, జీర్ణక్రియతో పాటు శరీర పనితీరును సమతుల్యం చేయడం దీని ప్రధాన ఉద్దేశంగా ఆయుర్వేదం చెబుతుంది. అయితే పంచకర్మ అంటే అందరికీ ఒకే విధంగా చేసే చికిత్స కాదు. వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి నిర్ణయిస్తారు.

పంచకర్మలో ప్రధానంగా ఐదు శుద్ధి విధానాలను ప్రస్తావిస్తారు. వమనంలో వైద్య పర్యవేక్షణలో వాంతి చేయించడం, విరేచనంలో మందుల ద్వారా విరేచనం కలిగించడం, బస్తిలో ఔషధ ద్రవాలను ప్రత్యేక విధానంలో ఉపయోగించడం, నస్యలో ముక్కు ద్వారా ఔషధాలను అందించడం, రక్తమోక్షణంలో నియంత్రిత పద్ధతిలో రక్తాన్ని తొలగించడం వంటి విధానాలు ఇందులో ఉంటాయి.

Spirituality: నూతన గృహాప్రవేశం బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిర్ణయిస్తారు?..SpiritualitySwechaa03 Oct 2026, 06:21 AM

Spirituality: నూతన గృహాప్రవేశం బ్రహ్మ ముహూర్తంలో ఎందుకు నిర్ణయిస్తారు?..

సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఇల్లు లేని వారికి ఉండే కల.. ఇందుకోసం ఎన్నో తిప్పలుపడి చివరికి నూతన గృహాన్ని నిర్మించుకుంటారు. అలా ఆ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే రోజు ప్రతి కుటుంబానికీ ఎంతో ప్రత్యేకమైనది. అందుకే మన సంప్రదాయంలో గృహప్రవేశానికి ఒక మంచి రోజు, మంచి సమయం చూసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో గృహప్రవేశం చేయాలని కొందరు పండితులు సూచిస్తుంటారు. ఇక బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు ఉండే పవిత్రమైన సమయం. సాధారణంగా సూర్యోదయానికి దాదాపు గంటన్నర ముందు ప్రారంభమయ్యే ఈ కాలాన్ని మన ధర్మశాస్త్ర సంప్రదాయంలో ప్రశాంతమైన, సాత్త్వికమైన సమయంగా భావిస్తారు.

Spirituality: ధర్మం క్షీణించిన ప్రతి యుగంలో పరమాత్మ అవతరిస్తాడని అంటారు నిజమేనా?..SpiritualitySwechaa03 Oct 2026, 06:16 AM

Spirituality: ధర్మం క్షీణించిన ప్రతి యుగంలో పరమాత్మ అవతరిస్తాడని అంటారు నిజమేనా?..

యుగయుగాల్లో పరమాత్మ భగవంతునిగా అవతరిస్తాడని మన ధార్మిక సంప్రదాయం చెబుతోంది. ఇక వేదాల్లో పరమాత్మను ఒకే రూపానికి పరిమితమైన వ్యక్తిగా కాకుండా.. సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్న పరమ సత్యంగా దర్శించారు. ఋగ్వేదంలోని పురుషసూక్తం విశ్వమంతటినీ ఆవరించి ఉన్న మహాపురుషుడి స్వరూపాన్ని వర్ణిస్తుంది.

అలాగే విష్ణు సూక్తం ప్రకారం... శ్రీమహావిష్ణువు వేసిన ఆ మూడు మహత్తర అడుగులు, ఈ సమస్త విశ్వాన్నీ ఆవరించిన అనంత తత్త్వానికి ప్రతీక. భగవంతుడనేవాడు ఏ ఒక్క స్థానానికో, నిర్దిష్ట ప్రాంతానికో పరిమితమైన శక్త్యంతరం కాదు... సమస్త విశ్వంలోనూ, అణువణువునా వ్యాపించి ఉన్న దివ్య చైతన్యమని వేదం స్పష్టం చేస్తోంది.

Spirituality: ఇంట్లో పూజ ఎవరు చేయాలి?.. మగవారా.. ఆడవారా?..SpiritualitySwechaa03 Oct 2026, 06:11 AM

Spirituality: ఇంట్లో పూజ ఎవరు చేయాలి?.. మగవారా.. ఆడవారా?..

ఇంట్లో పూజ ఎవరు చేయాలి?.. మగవారా.. ఆడవారా?.. అనే విషయంలో మన ఇళ్లలో ఎన్నో రకాల ఆచారాలు, నమ్మకాలు కనిపిస్తాయి. కానీ శాస్త్ర సంప్రదాయాలను పరిశీలిస్తే.. నిత్యపూజ విషయంలో ప్రధానంగా కనిపించేది లింగభేదం కాదు.. భక్తి, శుచిత్వం, నియమం.

వేద సంప్రదాయానికి అనుబంధమైన గృహ్యసూత్రాల్లో గృహస్థాశ్రమంలోని దంపతులిద్దరికీ ధార్మిక కర్మల్లో స్థానం ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని గృహ్యకర్మల్లో భర్తతో పాటు భార్య కూడా గృహాగ్నికి ఉదయం, సాయంత్రం ఆహుతులు సమర్పించవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో భర్త, భార్యతో పాటు కుమారుడు, కుమార్తె లేదా శిష్యుడు కూడా గృహాగ్ని సేవలో పాల్గొనవచ్చని వివరిస్తున్నాయి..

నాన్నా.. మనం చనిపోము కదా?.. ఆ చిన్నారి మాటే 174 మంది ప్రాణాలను కాపాడింది!InternationalSwechaa03 Oct 2026, 12:17 AM

నాన్నా.. మనం చనిపోము కదా?.. ఆ చిన్నారి మాటే 174 మంది ప్రాణాలను కాపాడింది!

కాక్‌పిట్‌లో కత్తులతో దాడి.. రక్తపు మడుగులో కెప్టెన్.. అదుపుతప్పిన విమానం.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు! సరిగ్గా అదే సమయంలో టాయిలెట్ నుంచి బయటకు వచ్చిన ఆరేళ్ల నినా.. తండ్రితో చెప్పిన ఒక్క మాట విమానంలో పెను పరిణామాలకు కారణమైంది.

పోరు మొదలైంది.. దేశం ఏకమైంది.. సీఈసీ రాజీనామా కోసం దండు కదిలింది!NationalSwechaa02 Oct 2026, 11:25 PM

పోరు మొదలైంది.. దేశం ఏకమైంది.. సీఈసీ రాజీనామా కోసం దండు కదిలింది!

ఓటరు జాబితా సవరణ చుట్టూ మొదలైన వివాదం ఇప్పుడు దేశవ్యాప్త రాజకీయ పోరుగా మారింది. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో విపక్షాలు, వివిధ సంఘాలు రోడ్డెక్కాయి. ఢిల్లీ జంతర్‌మంతర్ నుంచి ముంబై శివాజీ పార్క్ వరకు నిరసనల సెగ కనిపించింది.

AmitShah: తెలంగాణపై బీజేపీ చాణక్యుడి గురి! అక్టోబర్ 4న రాష్ట్రానికి అమిత్ షా.. ఆ ఎన్నికలపైనే ఫోకస్!తెలంగాణSwechaa02 Oct 2026, 10:41 PM

AmitShah: తెలంగాణపై బీజేపీ చాణక్యుడి గురి! అక్టోబర్ 4న రాష్ట్రానికి అమిత్ షా.. ఆ ఎన్నికలపైనే ఫోకస్!

AmitShah: తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడమే ఏకైక లక్ష్యంగా బీజేపీ అధిష్టానం సరికొత్త సమరానికి శంఖారావం పూరిస్తోంది. వరుస ఎన్నికల ముంగిట కమలం పార్టీ తన వ్యూహాలకు పదును పెడుతుండగా, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్ర వ్యూహకర్త అమిత్ షా అక్టోబర్ 4న రాష్ట్ర పర్యటనకు రానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పైకి ఇది సాధారణ అధికారిక, ప్రైవేట్ కార్యక్రమాల సందర్శనగానే కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక అసలైన పొలిటికల్ ఆపరేషన్‌కు షా శ్రీకారం చుడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది.తెలంగాణలో రానున్న రోజులు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఒకవైపు, త్వరలో రానున్న ఖైరతాబాద్ ఉపఎన్నిక మరోవైపు ముంచుకొస్తున్నాయి. వీటికితోడు గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్‌ఎంసీ) సహా వరంగల్, ఖమ్మం వంటి కీలక మున్సిపల్ కార్పొరేషన్ల పోరు కమలనాథుల ముందున్న పెను సవాళ్లు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఈ లోకల్ సమరాలే సెమీఫైనల్స్‌‌గా మారనున్నాయి. అందుకే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తుంది.

హైదరాబాద్‌లో రూ.52వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులుతెలంగాణSwechaa02 Oct 2026, 10:32 PM

హైదరాబాద్‌లో రూ.52వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు

ప్రజా ప్రభుత్వం పాలనలో హైదరాబాద్‌ నగరం అభివృద్ధికి రూ.52వేల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నగరంలో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు రోడ్లు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్ లు, అండర్‌పాస్‌లు, తాగునీటి వసతులు, ప్రజా రవాణా వ్యవస్థలు తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులతో పనులు చేపట్టామని చెప్పారు. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందన్నారు.

EPFO: శాలరీ అకౌంట్‌పై పీఎఫ్ బాంబ్.. చేతికి వచ్చేది ఇంతేనా?NationalSwechaa02 Oct 2026, 10:22 PM

EPFO: శాలరీ అకౌంట్‌పై పీఎఫ్ బాంబ్.. చేతికి వచ్చేది ఇంతేనా?

EPFO: నెల తిరిగేసరికి జీతం పడిందని మొబైల్‌కు వచ్చే శాలరీ క్రెడిట్ మెసేజ్ చూసి ఉద్యోగులు అవాక్కవుతున్నారు. ఎందుకు షాక్ అవుతున్నారని అనుకుంటున్నారు.. ఎప్పటిలా కాకుండా ఈసారి చేతికి వచ్చే జీతంలో భారీగా కోత పడటంతో దానికి కారణం. అసలు ఏం జరిగిందంటే.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) వేతన పరిమితిని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమే ఈ కోతకు ప్రధాన కారణం. ఈపీఎఫ్ వేజ్ సీలింగ్ పెరగడంతో అక్టోబర్ నెల నుంచి ఉద్యోగుల టేక్ హోమ్ శాలరీ ఒక్కసారిగా తగ్గిపోయింది.

RC 17: రామ్ చరణ్, సుకుమార్ ఆరీ 17 సినిమాకి డెడ్ లైన్..కేవలం 12 నెలల్లో పూర్తి చేస్తారా?సినిమాSwechaa02 Oct 2026, 10:20 PM

RC 17: రామ్ చరణ్, సుకుమార్ ఆరీ 17 సినిమాకి డెడ్ లైన్..కేవలం 12 నెలల్లో పూర్తి చేస్తారా?

RC 17: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ అంటేనే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘రంగస్థలం’ తర్వాత మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయబోతుండటంతో ఆర్‌సీ17పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

AP: మరో వందే భారత్ రైలు రెడీ.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే!NationalSwechaa02 Oct 2026, 09:36 PM

AP: మరో వందే భారత్ రైలు రెడీ.. ఏపీలో ఆగే స్టేషన్లు ఇవే!

AP: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. లగ్జరీ సదుపాయాలతో కూడిన సరికొత్త వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమైంది. బెంగళూరు - ముంబయి మధ్య నడవనున్న ఈ రైలుకు రైల్వే బోర్డు నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. దసరా పండుగ కానుకగా ఈ సూపర్ ఫాస్ట్ రైలు సేవలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రూట్‌లో నడిచే వందేభారత్ స్లీపర్ ఏపీ ప్రయాణికులకు సైతం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని అనంతపురం, గుంతకల్లు స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. వీటితో పాటు మార్గమధ్యంలో రాయచూర్, కలబురగి, సోలాపూర్, పుణె, కల్యాణ్ జంక్షన్లలో హాల్ట్‌లు ఇచ్చారు. దీంతో అనంతపురం, గుంతకల్లు పరిసర ప్రాంతాల వారికి ముంబయి, పుణె, బెంగళూరు నగరాలకు నేరుగా కనెక్టివిటీ దొరకనుంది.

AP: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్.. స్థానికతపై కీలక ఉత్తర్వులు!ఏపీSwechaa02 Oct 2026, 09:32 PM

AP: ఏపీ టీచర్లకు గుడ్ న్యూస్.. స్థానికతపై కీలక ఉత్తర్వులు!

AP: ఆంధ్రప్రదేశ్‌లోని టీచర్లకు కూటమి ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఉపాధ్యాయుల సర్వీసులు, పదోన్నతులు, ట్రాన్స్‌ఫర్ల విషయంలో ఎప్పటినుంచో నలుగుతున్న స్థానికత సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ఆర్డర్స్ రిలీజ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025ను బేస్ చేసుకుని విద్యాశాఖలో వర్క్ చేస్తున్న దాదాపు 1.70 లక్షల మంది టీచర్ల కేడర్‌ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.తాజా రూల్స్ ప్రకారం.. రాష్ట్రంలోని సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఇకపై పక్కాగా జిల్లా కేడర్ పరిధిలోనే కొనసాగుతారు. ప్రభుత్వ తాజా స్టెప్‌తో సుమారు లక్ష మంది ఎస్జీటీలకు, 70 వేల మంది వరకు ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు తమ సొంత జిల్లాల పరిధిలోనే పోస్టింగులు, ప్రమోషన్లు దక్కే రూట్ క్లియర్ అయింది. రాబోయే రోజుల్లో చేపట్టే సాధారణ బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో ఈ ఉత్తర్వులే ప్రామాణికంగా మారనున్నాయి.

Puri Jagannadh: పూరి జగన్నాధ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా?సినిమాSwechaa02 Oct 2026, 09:05 PM

Puri Jagannadh: పూరి జగన్నాధ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా?

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలను మాస్‌ ప్రేక్షకులకి మరింత దగ్గర చేసిన దర్శకుల్లో పూరి జగన్నాధ్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరో పాత్రను సరికొత్తగా డిజైన్ చేయడం, పవర్‌ఫుల్ డైలాగ్స్, వేగవంతమైన కథనం, మాస్ ఎలిమెంట్స్‌తో సినిమాను నడిపించడం పూరి స్టైల్. ఒకప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్లిన ఈ దర్శకుడు.. ప్రస్తుతం మాత్రం తన కెరీర్‌లో కాస్త డౌన్‌ఫాల్‌ను ఎదుర్కొంటున్నారు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే ప్రశ్నపై ఉంది.. పూరి జగన్నాధ్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా?

తెలంగాణలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ఆపండితెలంగాణSwechaa02 Oct 2026, 08:31 PM

తెలంగాణలో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ఆపండి

Harish Rao: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీమంత్రి హరీశ్ రావు లేఖాస్త్రం సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో తక్షణమే జోక్యం చేసుకోవాలని లేఖలో కోరారు. తెలంగాణలో విద్యుత్ సంస్థలు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలంటూ రాహుల్ గాంధీకి లేఖ రాశారు హరీశ్ రావు.

ట్రాన్స్ కో లో ప్రతిపాదిత 26శాతం ఈక్విటీ డైల్యూషన్ నిలిపివేయాలని రాహుల్ కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విద్యుత్ ప్రసార వ్యవస్థకు ట్రాన్స్ కో కీలకమైన సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. టీజీ జెన్ కో, ఎస్ సీసీఎల్, డిస్కంల విషయంలోనూ ఐపీవోలు, ఈక్విటీ డైల్యూషన్ ప్రైవేటీకరణను నిరోధించాలని హరీశ్ కోరారు. కాంగ్రెస్ 2019 మ్యానిఫెస్టోకు, 2023 రాయ్ పూర్ ఆర్థిక తీర్మానాలకు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు పూర్తిగా విరుద్ధం అని రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపై వెంటనే జోక్యం చేసుకోవాలని రాహుల్ ను కోరారు.

చిత్రం లేదు
తెలంగాణSwechaa02 Oct 2026, 08:31 PM

TCongress: ఓట్లకేమో బీసీలు.. సీట్లకేమో రెడ్లా? కాంగ్రెస్‌లో భగ్గుమన్న ఎమ్మెల్సీ లొల్లి!

TCongress: ఎన్నికల నామినేషన్ గడువు ముగిసే క్షణం దాకా జాబితాలు తేల్చని కాంగ్రెస్ శైలికి భిన్నంగా, ఏకంగా ఆరు నెలల ముందే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసి అందరికీ షాక్ ఇచ్చింది పీసీసీ. అయితే ముందస్తు వ్యూహంతో పైచేయి సాధించాలనుకున్న కాంగ్రెస్ పెద్దల ప్లాన్ ఇప్పుడు బెడిసికొట్టిందని చెబుతున్నారు.రెండు నియోజకవర్గాల్లోనూ ఒకే సామాజిక వర్గానికి టికెట్లు కేటాయించడంతో గాంధీభవన్‌లో అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. "ఓట్లు దండుకోవడానికి వెనుకబడిన వర్గాలు కావాలి.. పదవులు కట్టబెట్టేసరికి మాత్రం రెడ్డి సామాజిక వర్గమే గుర్తొస్తుందా?" అంటూ పార్టీలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు.

Big Update: సల్మాన్, వంశీ పైడిపల్లి సినిమాలో ఐశ్వర్య రాయ్?సినిమాSwechaa02 Oct 2026, 08:15 PM

Big Update: సల్మాన్, వంశీ పైడిపల్లి సినిమాలో ఐశ్వర్య రాయ్?

Big Update: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సల్మాన్‌ను వంశీ పైడిపల్లి ఏ తరహా పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది.

Online Hate: యూఎస్‌లో మనోళ్లపై 240% పెరిగిన హేట్రెడ్! జాబ్స్ లాక్కుంటున్నారంటూ టార్గెట్..InternationalSwechaa02 Oct 2026, 07:56 PM

Online Hate: యూఎస్‌లో మనోళ్లపై 240% పెరిగిన హేట్రెడ్! జాబ్స్ లాక్కుంటున్నారంటూ టార్గెట్..

Online Hate: అమెరికన్ డ్రీమ్ వెనుక ఇప్పుడు తీవ్ర అభద్రత, ఆందోళన అలముకుంటున్నాయి. దశాబ్దాలుగా సిలికాన్ వ్యాలీ నుంచి వాల్‌స్ట్రీట్ వరకు అమెరికా ప్రగతి రథాన్ని నడిపిస్తున్న భారతీయ నిపుణులు ఇప్పుడు తీవ్రమైన ఆన్‌లైన్ హేట్రెడ్‌ను ఎదుర్కొంటున్నారు. "మా ఉద్యోగాలు లాక్కుంటున్నారు" అనే తప్పుడు ప్రచారంతో కొందరు టార్గెట్ చేస్తుండటం ప్రస్తుతం యూఎస్‌లో పెను దుమారం రేపుతోంది.వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ‘సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్’ తాజా పరిశోధనలో చేదు నిజాలు వెలుగుచూశాయి. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో దక్షిణాసియా నిపుణులను టార్గెట్ చేసుకుని వస్తున్న ద్వేషపూరిత పోస్టులు రికార్డు స్థాయిలో 240 శాతం పెరిగాయి.

గతంలో నెలకు సగటున 12,904గా ఉన్న ఇలాంటి పోస్టులు, క్రమంగా పెరుగుతూ నెలకు ఏకంగా 43,843 మార్కును తాకాయి.

Vijay Devarakonda: ప్యారడైజ్ సినిమాకి ఉన్న రేంజ్ రణబాలికి ఉంది..ఫైనల్‌గా ఏమవుతుందో!సినిమాSwechaa02 Oct 2026, 07:48 PM

Vijay Devarakonda: ప్యారడైజ్ సినిమాకి ఉన్న రేంజ్ రణబాలికి ఉంది..ఫైనల్‌గా ఏమవుతుందో!

Vijay Devarakonda: మన టాలీవుడ్‌లో కొత్త కథలు, కొత్త టేకింగ్‌తో వచ్చే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా, కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమా కూడా పెద్ద స్థాయిలో ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘రణబాలి’ సినిమా గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Hanuman Ansh: హోంబలే చేతికి ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ రైట్స్!సినిమాSwechaa02 Oct 2026, 07:27 PM

Hanuman Ansh: హోంబలే చేతికి ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్ రైట్స్!

Hanuman Ansh: టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలకే కాదు.. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో వస్తున్న పాన్ ఇండియా చిత్రాలపై కూడా సినీ లవర్స్‌లో భారీ ఆసక్తి నెలకొంటోంది. ముఖ్యంగా, ఈ మధ్య కాలంలో వస్తోన్న పురాణాలు, దైవాంశాలతో ముడిపడిన కథలకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో..ఇటీవుల బాలీవుడ్ లో వచ్చి భారీ హిట్ సాధించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ‘హనుమాన్ అంశ్’

ప్రయాణికులకు షాక్.. భారీగా ఆటో ఛార్జీలు పెంపుతెలంగాణSwechaa02 Oct 2026, 07:20 PM

ప్రయాణికులకు షాక్.. భారీగా ఆటో ఛార్జీలు పెంపు

Auto Fares Hike: రాష్ట్రంలో ఆటో రిక్షా ఛార్జీలను సవరించింది ప్రభుత్వం. కొత్త ఛార్జీలను ఖరారు చేసింది. ఈ మేరకు జీవో నెంబర్ 46 జారీ చేసింది. కొత్త ఛార్జీల ప్రకారం కనీస ఛార్జీని 30 రూపాయలుగా నిర్ణయించారు. తొలి 1.6 కిలోమీటర్లకు ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు 14 రూపాయలు చొప్పున వసూలు చేయనున్నారు. వెయిటింగ్ ఛార్జీ (ప్రయాణికుల కోసం వేచి ఉండే ఛార్జీ) నిమిషానికి 75 పైసలుగా ఖరారు చేశారు.

రాత్రి 50శాతం అదనపు ఛార్జీలు

అలాగే రాత్రి సమయ ఛార్జీలను కూడా సవరించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ ఛార్జీపై ఒకటిన్నర రెట్లు అంటే 50శాతం అదనపు ఛార్జీ వసూలు చేస్తారు. సూట్ కేస్, హ్యాండ్ బ్యాగ్ మినహా ఇతర ప్యాకేజీలపై ప్రతి కిలోమీటర్ కు 50 పైసల ఛార్జీ నిర్ణయించారు. లగేజీ గరిష్ట పరిమితిని 100 కిలోలుగా నిర్ధారించారు.

Tollywood: శ్రీనిధి శెట్టి అందుకే, వరుస ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదా..ఈ ప్లాన్ కరెక్టేనా?సినిమాSwechaa02 Oct 2026, 06:37 PM

Tollywood: శ్రీనిధి శెట్టి అందుకే, వరుస ప్రాజెక్ట్స్ ఒప్పుకోలేదా..ఈ ప్లాన్ కరెక్టేనా?

Tollywood: హీరోయిన్ అన్న తర్వాత సక్సెస్ మాత్రమే ప్రధానం. హిట్ కొట్టినప్పుడే హీరోయిన్ కి ఛాన్సులు వస్తుంటాయి. అలా, వచ్చినప్పుడే చక చకా సినిమాలను ఒప్పుకుంటారు. సినిమా హిట్ అయితేనే లక్కీ హీరోయిన్ అంటారు. అదే సినిమా ఫ్లాపైతే ఐరెన్ లెగ్ అంటారు. అందుకే, ఇండస్ట్రీలో హీరోయిన్స్‌కి స్పాన్ చాలా తక్కువ. కేజీఎఫ్ తర్వాత కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ సమయంలో వరుసగా ఆఫర్స్ వచ్చాయి.

TG: ఆయుధాల చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. గన్ డీలర్‌తో మల్లేశ్ సీక్రెట్ లింకులు!తెలంగాణSwechaa02 Oct 2026, 06:29 PM

TG: ఆయుధాల చోరీ కేసులో ఊహించని ట్విస్ట్.. గన్ డీలర్‌తో మల్లేశ్ సీక్రెట్ లింకులు!

TG: మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో ఊహించని సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దోపిడీ కేవలం స్థానిక నేరస్థుల పని మాత్రమే కాదని, దీని వెనుక దేశవ్యాప్త అక్రమ ఆయుధాల మాఫియా హస్తం ఉందన్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. 10 రోజుల పోలీసు కస్టడీలో ప్రధాన నిందితుడు, మాజీ ఆర్మీ జవాన్ మల్లేశ్‌ విచారణలో వెల్లడించిన వివరాలతో ఈ కేసు సరికొత్త మలుపు తిరిగింది.ఆర్మీ నుంచి కొల్లగొట్టిన అత్యాధునిక తుపాకులను కోల్‌కతాకు చెందిన బడా ఆయుధ వ్యాపారి అవల్‌ దెయ్‌కు విక్రయించేందుకు మల్లేశ్ ముందే డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. 2022లోనే బీర్బల్ షా అనే మధ్యవర్తి ద్వారా అవల్ దెయ్‌తో మల్లేశ్‌కు పరిచయం ఏర్పడింది. గతంలోనే వారి వద్ద రూ.10 వేలకు ఓ తుపాకీని కొనుగోలు చేసి దోపిడీలకు యత్నించిన నేర చరిత్ర మల్లేశ్‌కు ఉంది. ఈ పాత పరిచయాలతోనే ఆర్మీ ఆయుధాగారం నుంచి దొంగిలించిన ఆయుధాలను భారీ మొత్తానికి వారికి అప్పగించేందుకు మల్లేశ్ ప్లాన్ రెడీ చేశాడు.

Trivikram: ఆదర్శ కుటుంబం సినిమాకి హైప్ రాకుండా చేస్తున్నారా?సినిమాSwechaa02 Oct 2026, 06:14 PM

Trivikram: ఆదర్శ కుటుంబం సినిమాకి హైప్ రాకుండా చేస్తున్నారా?

Trivikram: కొన్ని సినిమాలకి అంచనాలు చాలా అవసరం. కొన్ని సినిమాలకి మాత్రం అసలు ఏమాత్రం బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ థ్రిల్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. అలాంటి, సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపిన సందర్భాలెన్నో ఉన్నాయి. శర్వానంద్ నటించిన శతమానంభవతి సినిమా సంక్రాంతి బరిలో మెగాస్టార్, బాలయ్యతో పోటీ పడి వచ్చాడు.

బాపు బొమ్మ సాక్షిగా.. బరితెగించిన మందు మాఫియా.. డ్రైడే నాడు ‘బ్లాక్‌’ దందాతెలంగాణSwechaa02 Oct 2026, 06:08 PM

బాపు బొమ్మ సాక్షిగా.. బరితెగించిన మందు మాఫియా.. డ్రైడే నాడు ‘బ్లాక్‌’ దందా

Liquor Mafia: జాతిపిత మహాత్మా గాంధీ జీవితాంతం మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడారు. సమాజం మద్యానికి దూరంగా ఉండాలన్న ఆయన ఆశయాలను గౌరవిస్తూ ప్రభుత్వం ఏటా అక్టోబర్ 2న డ్రై డే పాటిస్తుంది. కానీ రాజధాని నగరంలో క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే జాతిపిత ఆశయాలు బస్తీ సందుల్లో బూడిదపాలవుతున్నాయి. అధికారికంగా వైన్‌షాపులు, బార్లకు తాళాలు పడినా.. గల్లీల్లో మాత్రం మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు పెగ్గులుగా సాగుతోంది. బోర్డులకే డ్రైడే పరిమితమైందని, తమ దందాకు కాదంటూ అక్రమార్కులు యథేచ్ఛగా బరితెగించి విక్రయాలు సాగిస్తున్నారు.

తుమ్మలూరులో రూ.300కోట్ల విలువైన భూమి కబ్జాయత్నం?తెలంగాణSwechaa02 Oct 2026, 05:41 PM

తుమ్మలూరులో రూ.300కోట్ల విలువైన భూమి కబ్జాయత్నం?

Land Grab: ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో భూ కబ్జా యత్నం ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. సర్వే నంబర్లు 371, 372, 373, 377లో మొత్తం 51.02 ఎకరాల భూమికి సంబంధించి అక్రమంగా హక్కులు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధిత రైతులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని రైతులు పేర్కొన్నారు. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు JB Infra, Concrete Infra, Bhuvana Infra తదితర సంస్థలు/వ్యక్తుల ప్రమేయంపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కోరారు.