స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

తుమ్మలూరులో రూ.300కోట్ల విలువైన భూమి కబ్జాయత్నం?తెలంగాణSwechaa02 Oct 2026, 05:41 PM

తుమ్మలూరులో రూ.300కోట్ల విలువైన భూమి కబ్జాయత్నం?

Land Grab: ఫ్యూచర్ సిటీ ప్రాంతంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో భూ కబ్జా యత్నం ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. సర్వే నంబర్లు 371, 372, 373, 377లో మొత్తం 51.02 ఎకరాల భూమికి సంబంధించి అక్రమంగా హక్కులు సృష్టించి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ బాధిత రైతులు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.

ఈ భూముల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ.300 కోట్ల వరకు ఉంటుందని రైతులు పేర్కొన్నారు. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు JB Infra, Concrete Infra, Bhuvana Infra తదితర సంస్థలు/వ్యక్తుల ప్రమేయంపై సమగ్ర విచారణ జరపాలని రైతులు కోరారు.

Khairatabad By Election: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా.. ఏం జరగబోతోంది?తెలంగాణSwechaa02 Oct 2026, 04:56 PM

Khairatabad By Election: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా.. ఏం జరగబోతోంది?

Khairatabad By Election: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు, అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఖైరతాబాద్‌లో బైపోల్ నగారా మోగడం లాంఛనమేనని అంతా భావించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు టికెట్ల లెక్కలు వేసుకుంటూ, గ్రౌండ్‌లో ప్రచారానికి సైతం సిద్ధమయ్యాయి. అయితే, హైకోర్టు సాక్షిగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన ప్రకటనతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేది లేదని ఈసీ తేల్చిచెప్పడంతో.. "ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా? అసలేం జరగబోతోంది?" అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Gandhi Jayanti: గాంధీ జయంతి రోజు చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా..?తెలంగాణSwechaa02 Oct 2026, 03:55 PM

Gandhi Jayanti: గాంధీ జయంతి రోజు చికెన్ తింటే ఏమవుతుందో తెలుసా..?

Gandhi Jayanti: ప్రతి ఏటా అక్టోబర్ 2 వచ్చిందంటే చాలు.. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తుంది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశమంతా ఆయన సేవలను, అహింసా సిద్ధాంతాలను స్మరించుకుంటుంది. అయితే ఈ రోజు నాన్‌వెజ్ లవర్స్‌లో, ముఖ్యంగా చికెన్ ప్రియుల్లో ఒక ఆసక్తికరమైన చర్చ స్టార్ట్ అవుతుంది. "గాంధీ జయంతి రోజున పొరపాటున చికెన్ తింటే ఏదైనా కీడు జరుగుతుందా? ఆరోగ్యానికి హాని కలుగుతుందా? అసలు ఎందుకు ఈ రోజు నాన్‌వెజ్ తినకూడదంటారు?" అనే డౌట్స్ చాలామందిని తొలుస్తుంటాయి. మరి ఇందులో సైన్స్ ఏంటి? సమాజం చెప్పే మాటేంటి? అసలు నిజాలేంటో తెలుసుకుందాం.

పండుగ వేళ సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గనున్న చక్కెర ధరలు!వ్యాపారంSwechaa02 Oct 2026, 03:53 PM

పండుగ వేళ సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గనున్న చక్కెర ధరలు!

 దేశంలో రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని సామాన్య ప్రజలకు నిత్యావసరాల ధరల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పండుగల సమయంలో మార్కెట్‌లో చక్కెర కృత్రిమ కొరత ఏర్పడకుండా నిరోధించడం, వినియోగదారులకు సరసమైన ధరలకే అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా పంచదార నిల్వలపై (Sugar Stock Limits) నూతన నిబంధనలను విధించింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం, డీలర్లు తమ వద్ద ఉన్న నిల్వలను గరిష్టంగా 15 రోజుల్లోగా విక్రయించాల్సి ఉంటుంది.

TBJP: ఆ ఎమ్మెల్సీ సీటుపై కమలం స్పెషల్ ఫోకస్! బరిలోకి స్వయంగా స్టేట్ చీఫ్?తెలంగాణSwechaa02 Oct 2026, 02:58 PM

TBJP: ఆ ఎమ్మెల్సీ సీటుపై కమలం స్పెషల్ ఫోకస్! బరిలోకి స్వయంగా స్టేట్ చీఫ్?

తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సైరన్ మోగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోరును అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే ఇప్పుడు అందరి కళ్లూ హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ గ్రాడ్యుయేట్ స్థానంపైనే ఉన్నాయి. ఈ కీలక సీటును ఎలాగైనా కైవసం చేసుకుని రాష్ట్రంలో తమ సత్తా చాటాలని కాషాయ దళం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపేలా స్వయంగా పార్టీ రాష్ట్ర నాయకుడే ఈ ఎన్నికల సమరంలోకి దిగుతున్నాడనే ప్రచారం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో కాకరేపుతోంది.

‘దానం’ ఎన్నిక చెల్లకపోతే నేనే ఎమ్మెల్యే : విజయారెడ్డితెలంగాణSwechaa02 Oct 2026, 02:48 PM

‘దానం’ ఎన్నిక చెల్లకపోతే నేనే ఎమ్మెల్యే : విజయారెడ్డి

ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే అసెంబ్లీ సెక్రెటరీ ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఖాళీ ఏర్పడిందని గెజిట్ విడుదల చేశారు.సరిగ్గా ఉపఎన్నికకు సంబంధించిన ప్రక్రియను ఈసీ చేపట్టిన తరుణంలో 2023 ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి దానం నాగేందర్ (బీఆర్ఎస్) చేతిలో ఓడిపోయి రెండో స్థానానికి పరిమితమైన విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. దానం నాగేందర్ తన ఎన్నికల అఫిడవిట్ (ఫామ్ -26)లో తన భార్య, డిపెండెంట్ల ఆస్తుల వివరాలను పూర్తిగా వెల్లడించకుండా కీలక సమాచారాన్ని దాచిపెట్టారని ఆరోపిస్తూ 2024 జనవరిలో విజయారెడ్డి హైకోర్టులో మొదటిసారి ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు.దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ఆమె అందులో కోరారు. ఒకవేళ కోర్టు విచారణలో దానం నాగేందర్ ఎన్నిక తప్పు అని తేలితే, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తననే ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉంటుందని విజయారెడ్డి భావిస్తున్నారు.

స్థానిక ఎన్నికల జీవోపై హైకోర్టు తీర్పు.. చంద్రబాబుపై బొత్స ఘాటు వ్యాఖ్యలు!ఏపీSwechaa02 Oct 2026, 02:25 PM

స్థానిక ఎన్నికల జీవోపై హైకోర్టు తీర్పు.. చంద్రబాబుపై బొత్స ఘాటు వ్యాఖ్యలు!

 ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు రద్దు చేయడంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మరోసారి బీసీలకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు. న్యాయపరంగా ఈ జీవో కోర్టులో నిలవదని ముందే తెలిసినప్పటికీ, కేవలం రాబోయే స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రతోనే ప్రభుత్వం ఈ డ్రామాకు తెరలేపిందని ఆయన విమర్శించారు.

Tollywood: హోస్టులుగా కూడా పోటీ పడుతున్న స్టార్స్..సినిమాSwechaa02 Oct 2026, 02:13 PM

Tollywood: హోస్టులుగా కూడా పోటీ పడుతున్న స్టార్స్..

Tollywood: మన టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాలతో మాత్రమే బిజీగా గడపడం లేదు. ప్రేక్షకులను అలరించినేందుకు ఇతర ఎంటర్‌టైంగ్ మార్గాలను ఎంచుకుంటున్నారు. వీటిలో రియాలిటీ షోస్, హోస్ట్‌గా సెలబ్రిటీ టాక్ షోస్ వంటివి ఒప్పుకుంటున్నారు. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలే కాదు, మన సౌత్ అండ్ నార్త్ స్టార్స్ కూడా ఇలాంటి రియాలిటీ షోస్‌తో ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

రూ. 1,100 కోట్ల అవినీతి..మీ మంత్రులపై చర్యలేవి రేవంత్ రెడ్డి? : శ్రీనివాస్ గౌడ్తెలంగాణSwechaa02 Oct 2026, 01:59 PM

రూ. 1,100 కోట్ల అవినీతి..మీ మంత్రులపై చర్యలేవి రేవంత్ రెడ్డి? : శ్రీనివాస్ గౌడ్

అధికార కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు, జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పులు ఎత్తి చూపిస్తున్న ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని, వారి ఆస్తుల మీద తప్పులు ఆరోపణలు చేస్తున్నారని, మరి అధికార పార్టీ మంత్రులు రూ. వందల కోట్లు దోచేస్తున్నా వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన ఈపీఎఫ్, ఈఎస్ఐ డబ్బులు కాంట్రాక్టర్లు తిన్నారని ప్రభుత్వం వేసిన నిజనిర్దారణ కమిటీ తేల్చిందని మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లను పిలిచి ఓ మంత్రి మీటింగ్ పెట్టారని, వారి నుంచి పెద్దఎత్తున డబ్బులు వసూలు చేశారని.. ఆ నిధులు అన్ని ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రభుత్వ ఖజానాలో జమ చేశారా? ఎవరి జేబులోకి వెళ్లాయని ప్రశ్నించారు.

కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్.. ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం!NationalSwechaa02 Oct 2026, 01:36 PM

కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్.. ధైర్యసాహసాలపై ప్రశంసల వర్షం!

 దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (Flydubai) విమానాన్ని కూల్చేందుకు ఒమన్ కో-పైలట్ చేసిన కుట్రను అత్యంత ధైర్యసాహసాలతో తిప్పికొట్టి, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్, కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.  ప్రస్తుతం స్మిత్ మచ్ఛార్ అత్యుత్తమ వైద్య చికిత్స కోసం సౌదీ అరేబియా నుంచి అబుదాబికి తరలించగా ఆయన ఆరోగ్య పరిస్థితిని ప్రధాని అడిగి తెలుసుకున్నారు.  సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

గృహ నిర్మాణంలో కొత్త టెక్నాలజీ..  పైలట్ ప్రాజెక్టుగా 177 వినూత్న ఇళ్ల నిర్మాణం!ఏపీSwechaa02 Oct 2026, 01:18 PM

గృహ నిర్మాణంలో కొత్త టెక్నాలజీ..  పైలట్ ప్రాజెక్టుగా 177 వినూత్న ఇళ్ల నిర్మాణం!

 ఏపీలో పేదల సొంతింటి కలను మరింత నాణ్యతతో, వేగవంతంగా నెరవేర్చేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం వినూత్న సాంకేతికతకు శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ 2.0 పథకం కింద 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ తొలిదశలో 177 ఇళ్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఆధునిక నిర్మాణ సరళిని ప్రోత్సహించడంతో పాటు అత్యల్ప వ్యవధిలోనే దృఢమైన, నాణ్యమైన ఇళ్లను అందించడమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. తులం బంగారం దేవుడెరుగు..స్కీం నీరుగార్చొద్దు : హరీశ్ రావుతెలంగాణSwechaa02 Oct 2026, 01:17 PM

కళ్యాణలక్ష్మికి 12 ఏళ్లు.. తులం బంగారం దేవుడెరుగు..స్కీం నీరుగార్చొద్దు : హరీశ్ రావు

కళ్యాణలక్ష్మి పథకానికి నేటితో 12 ఏళ్లు పూర్తి అయ్యాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘కళ్యాణ లక్ష్మీ పథకం.. సామాజిక సంస్కరణ పథం. బాల్య వివాహాలను అడ్డుకుని పేదింటి ఆడబిడ్డలకు, తల్లిదండ్రులకు అండగా నిలిచిన ఈ గొప్ప కార్యక్రమానికి నేటితో 12 ఏళ్లు పూర్తి.. ఒక తండ్రి కన్నీటి వేదనను చూసి కేసీఆర్ మదిలో పుట్టిన ఆలోచనే కళ్యాణ లక్ష్మీ/షాదీ ముబారక్.

2002 మార్చిలో ములుగు మండలం గుత్తూరు తండాలో జరిగిన అగ్నిప్రమాద ఘటన కేసీఆర్‌ను తీవ్రంగా కలచివేసింది. బిడ్డ పెళ్లి కోసం దాచుకున్న రూ.50 వేల నగదు, బంగారం అగ్నికి ఆహుతయ్యాయి. గుండెలవిసేలా రోదిస్తున్న బానోతు కీమానాయక్‌ను చూసిన కేసీఆర్ చలించిపోయారు.ఇచ్చిన మాట ప్రకారం దగ్గరుండి ఆ బిడ్డ పెళ్లి జరిపించారు. అవసరమైన ఆర్థిక సాయం అందించారు.ఆ ఘటనతో కార్యాచరణ రూపం దాల్చిన పథకమే.. కళ్యాణ లక్ష్మీ–షాదీ ముబారక్.

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా మోదీ ఆలోచనలు.. పుతిన్ సంచలన వ్యాఖ్యలు!InternationalSwechaa02 Oct 2026, 01:10 PM

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా మోదీ ఆలోచనలు.. పుతిన్ సంచలన వ్యాఖ్యలు!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ శాంతి ప్రయత్నాలను, ఉక్రెయిన్ యుద్ధ నివారణ ఆలోచనలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు త్వరితగతిన ముగింపు పలికేందుకు మోదీ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ఆయన వద్ద అత్యుత్తమ ప్రణాళికలు ఉన్నాయని పుతిన్ కొనియాడారు. ఉక్రెయిన్ వివాదం మొదలైనప్పటి నుంచి భారత్ దౌత్యం, చర్చల మార్గాన్నే నమ్ముకుంటూ శాంతియుత పరిష్కారానికి పిలుపునిస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో 235.. ఏపీలో 388 కరువు మండలాలుటాప్ న్యూస్Swechaa02 Oct 2026, 12:53 PM

తెలంగాణలో 235.. ఏపీలో 388 కరువు మండలాలు

ఎన్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు మండలాల్లో కరువు పరిస్థితులు ఏర్పాడ్డాయి. నిన్న సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో కరువుపై ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది.కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ వానాకాలంలో దాదాపు 17శాతం లోటు వర్షపాతం నమోదైందని ప్రకటించారు. దీంతో దాదాపు 235 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. వర్షాభావపరిస్థితుల కారణంగా ఏపీలోనూ తీవ్ర కరువు ఏర్పడినట్టు సమాచారం. రాష్ట్రంలోని 21 జిల్లాల పరిధిలో మొత్తం 388 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో 283 మండలాలు తీవ్ర కరువు ప్రాంతాలుగా, మరో 105 మండలాలను మధ్యస్త కరువు మండలాలుగా వర్గీకరించింది. రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి (ఎఫ్‌ఏసీ)జి.సాయిప్రసాద్ ఈ మేరకు గెజిట్ ఉత్తర్వులు విడుదల చేశారు.

కేంద్రహోంశాఖ కీలక నిర్ణయం.. లడక్‌లోని ఆ ప్రాంతాలకు అధికారిక పేర్లుNationalSwechaa02 Oct 2026, 12:50 PM

కేంద్రహోంశాఖ కీలక నిర్ణయం.. లడక్‌లోని ఆ ప్రాంతాలకు అధికారిక పేర్లు

పొరుగుదేశాలతో సరిహద్దు వివాదాలు మరోసారి తెరమీదకు వస్తున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చైనాతో సరిహద్దు పంచుకుంటున్న జమ్మూకశ్మీర్‌లో విభజించబడిన కేంద్రపాలిత ప్రాంతం లడక్‌లో కేంద్రం పలు ముఖ్యనిర్ణయాలు తీసుకుంది. లడక్‌లోని 28 కీలక ప్రదేశాలు, భౌగోళిక విశేషాలను ప్రామాణిక పేర్లతో భారత అధికారిక చిత్రపటంలో నమోదు చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కేంద్ర హోంశాఖ సమన్వయంతో లడక్‌లోని అధికార యంత్రాంగంతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరం సర్వే ఆఫ్ ఇండియా (SoI) అధికారిక మ్యాప్‌లో ఈ 28 ప్రాంతాలను అధికారిక పేర్లతో పొందుపరిచినట్లు కేంద్ర హోంశాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు వ్యూహాత్మక ప్రాంతాలు, పర్వత కనుమలు, నివాస ప్రాంతాలు, భౌగోళిక విశేషాలను కచ్చితమైన వివరాలతో జాతీయ మ్యాప్‌లో ప్రామాణీకరించినట్టు తెలిపింది.

స్మిత్ మచ్చర్.. ది రియల్ హీరో! 9/11 తరహా ప్రమదాన్ని తప్పించిన ఇండియన్ పైలట్.. ఎవరీ మచ్చర్?NationalSwechaa02 Oct 2026, 12:17 PM

స్మిత్ మచ్చర్.. ది రియల్ హీరో! 9/11 తరహా ప్రమదాన్ని తప్పించిన ఇండియన్ పైలట్.. ఎవరీ మచ్చర్?

ఒక క్షణం ఆలస్యమై ఉంటే ఏం జరిగేదో ఊహించుకోవడం కూడా కష్టం. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మచ్చర్‌ పేరు మార్మోగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వరకు పలువురు ఆయన ధైర్యాన్ని ప్రశంసించారు.

స్కెచ్ వేసి లేపేశారు.. అడ్డంగా దొరికిపోయిన ప్రియుడు, ప్రియురాలు..!క్రైమ్Swechaa02 Oct 2026, 12:00 PM

స్కెచ్ వేసి లేపేశారు.. అడ్డంగా దొరికిపోయిన ప్రియుడు, ప్రియురాలు..!

వివాహేతర సంబంధాలు కుటుంబాలను ముక్కలు చేస్తున్నాయి. ప్రియుడి కోసం కట్టుకున్న వాడిని కడతేరుస్తున్న ఘటనలు అనేకంగా వెలుగుచూస్తున్నాయి.ఇటీవలి కాలంలో ఇటువంటి నేరాలు గణనీయంగా పెరుగుతుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి రాష్ట్రంలోని భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను హతమార్చింది ఓ భార్య. మద్యంలో పురుగుల మందు కలిపి తాగించి హత్య చేయడంతో పాటు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. మృతుడి తల్లి ఫిర్యాదుతో హత్యోదంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.

జీవో 317 రద్దు చేయండి.. గాంధీభవన్ వద్ద హై అలర్ట్తెలంగాణSwechaa02 Oct 2026, 11:38 AM

జీవో 317 రద్దు చేయండి.. గాంధీభవన్ వద్ద హై అలర్ట్

ప్రభుత్వ టీచర్లు, ఉద్యోగులు మరోసారి భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తెచ్చిన జీవో 317ను రద్దు చేయాలని వారు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఈ జీవోను అధికారిలోకి వస్తే రద్దు చేస్తామని, టీచర్ల అభిప్రాయాలు తీసుకుని బదిలీలు చేపడతామని నాటి పీసీసీ చీఫ్ రేవంత్ .. ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చి మూడేండ్లు అయినా తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని జీవో 317 బాధిత ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన గాంధీ భవన్‌‌ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు.. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Gold price today: తడబడుతున్న పసిడి..  హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి రేట్లు ఇవే!వ్యాపారంSwechaa02 Oct 2026, 11:11 AM

Gold price today: తడబడుతున్న పసిడి..  హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా నేటి రేట్లు ఇవే!

అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న తీవ్ర పరిణామాలు, ద్రవ్యోల్బణ అంచనాల నేపథ్యంలో పసిడి, వెండి ధరల్లో నిరంతరం హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ గురువారం ఉదయానికి హైదరాబాద్ విపణిలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,49,230 వద్ద స్థిరంగా నమోదైంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,36,790గా ఉండగా, 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,11,920 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు వెండి ధరలు కూడా పసిడి తోపాటు భారీ స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

నాకు ఎమ్మెల్సీ వద్దు.. ఎమ్మెల్యే టికెట్ కావాలి : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితెలంగాణSwechaa02 Oct 2026, 11:09 AM

నాకు ఎమ్మెల్సీ వద్దు.. ఎమ్మెల్యే టికెట్ కావాలి : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అన్ని పార్టీల కంటే ముందే అధికార కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. కానీ, ఇప్పుడు ఓ అభ్యర్థి హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. తనకు ఎమ్మెల్సీ వద్దు అని.. ఎమ్మెల్యే సీటు కావాలని పట్టుబట్టి కూర్చున్నట్టు సమాచారం. దీంతో ఏం చేయాలో తెలియక హైమాండ్ తలపట్టుకున్నట్టు సమాచారం. ‘నల్గొండ–ఖమ్మం–వరంగల్’ కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి తాను ఎమ్మెల్సీగా పోటీ చేయలేనంటూ చేతులు ఎత్తేసినట్టు ప్రచారం జరుగుతోంది. గ్రాడ్యుయేట్ టికెట్ కావాలంటూ ఎవరిని అడగలేదని, పోటీ చేయమంటూ పార్టీ పెద్దలు కూడా తనను సంప్రదించలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. తనను ఒక్కమాట కూడా అడుగకుండా అభ్యర్థిగా ప్రకటించడం ఏంటని ఆయన పార్టీలోని కీలక నేతలను కలిసి ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

swechaanews monthly report: స్వేచ్ఛ న్యూస్ మంత్లీ రిపోర్ట్!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa02 Oct 2026, 10:55 AM

swechaanews monthly report: స్వేచ్ఛ న్యూస్ మంత్లీ రిపోర్ట్!

సామాజిక పారదర్శకత, అవినీతి నిర్మూలనే ప్రాథమిక ధ్యేయంగా ముందుకు సాగుతున్న డిజిటల్ వార్తా సంస్థ 'స్వేచ్ఛ న్యూస్' సెప్టెంబర్ నెలకు సంబంధించిన ప్రత్యేక ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్టిగేటివ్ కథనాల సమగ్ర నివేదిక అందిస్తోంది. ఛైర్మన్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల సారథ్యంలో సామాన్యుల సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వ వైఫల్యాలు, భూమాఫియా అక్రమాలను ఎండగట్టడంలో స్వేచ్ఛ న్యూస్ ట్రెండ్ సెట్టర్‌‌గా నిలిచింది. రాజకీయం, రెవెన్యూ, రియల్ ఎస్టేట్, పరిపాలనా విభాగాల్లో జరుగుతున్న పలు భారీ కుంభకోణాలను చట్టబద్ధమైన ఆధారాలు, కోర్టు తీర్పుల ప్రతులతో సహా వెలుగులోకి తెచ్చి ప్రజాక్షేత్రంలో భారీ సంచలనం సృష్టిస్తోంది. 'Swechaanews.com' పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు వార్తా కథనాలు, ఇ-పేపర్, లఘు వార్తలను అందిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత పదునైన శైలిలో వార్తలను అందించేందుకు మా టీమ్ కృషి చేస్తుంది.

ఢిల్లీలో హై అలెర్ట్.. కీలక మెట్రోస్టేషన్ల మూసివేతNationalSwechaa02 Oct 2026, 10:41 AM

ఢిల్లీలో హై అలెర్ట్.. కీలక మెట్రోస్టేషన్ల మూసివేత

దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. నీట్ పేపర్ లీకేజీ సమయంలో జరిగిన ఉద్రిక్తతలు మరోసారి రిపీట్ కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలకమైన 11 మెట్రో స్టేషన్లలో ఎంట్రీ, ఎగ్జిట్ (రాకపోకల) గేట్లను తాత్కాలికంగా మూసివేసింది. ఎన్నికల సంఘం సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే మరోసారి దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. నేడు గాంధీ జయంతి సందర్భంగా నిరసన చేపడతామని ముందే ప్రకటించారు. ఈ మేరకు యువత మరోసారి నడుం బిగించాలని కోరారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ ‌కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇతర శ్రేణులు సైతం జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలకు పిలుపునిచ్చాయి.

నేడు ‘కామన్ టికెట్’ ప్రారంభం.. ఒకే ధరకు రెండు ప్రయాణాలుతెలంగాణSwechaa02 Oct 2026, 10:17 AM

నేడు ‘కామన్ టికెట్’ ప్రారంభం.. ఒకే ధరకు రెండు ప్రయాణాలు

‘క్యూర్’ పరిధిలో నేటి నుంచి కామన్ టికెట్ అందుబాటులోకి రానుంది. ప్రయాణిలకు మెరుగైన రవాణా కోసం ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టడంతో పాటు హైదరాబాద్ మెట్రో భాగస్వామ్యంతో రోజువారీ, నెలవారీ కామన్ పాస్‌ను టీజీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రగతి భవన్‌లో ఇవాళ ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సు, మెట్రో సేవలను అనుసంధానించే ఉమ్మడి ప్రయాణ సౌకర్యం కోసం డిజిటల్ పాస్‌ను తీసుకురానున్నారు. హైదరాబాద్‌లో టీజీఎస్‌ఆర్టీసీ రోజుకు సుమారు 25 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. మెట్రో రైల్ మూడు కారిడార్లలో రోజుకు సుమారు 4.50 లక్షల మందిని చేరవేస్తోంది. ఈ క్రమంలోనే ఈ రెండు సేవలను మరింత సులభతరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘కామన్ టికెట్’ను ఉమ్మడి పాస్‌ను తీసుకురానుంది.

ఇండిగో విమానంలో ప్రయాణికుడి వీరంగం.. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!తెలంగాణSwechaa02 Oct 2026, 09:49 AM

ఇండిగో విమానంలో ప్రయాణికుడి వీరంగం.. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు యత్నం!

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) నుంచి కడపకు బయలుదేరాల్సిన ఇండిగో విమానంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. విమానం టేకాఫ్ కాబోతున్న సమయంలో హఠాత్తుగా తన సీటు నుంచి లేచి అత్యవసర ద్వారాన్ని (ఎమర్జెన్సీ డోర్) తెరిచేందుకు ఆ ప్రయాణికుడు తెగబడ్డాడు. రన్‌వేపై సాంకేతికంగా అత్యవసరమైన ఈ సమయంలో సదరు వ్యక్తి చేసిన ప్రమాదకర చేష్టతో తోటి ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

warangal: హోటల్ ఫుడ్‌పై షాకింగ్ నిజాలు.. తనిఖీల్లో బయటపడుతున్న కల్తీ బాగోతం!..తెలంగాణSwechaa02 Oct 2026, 09:47 AM

warangal: హోటల్ ఫుడ్‌పై షాకింగ్ నిజాలు.. తనిఖీల్లో బయటపడుతున్న కల్తీ బాగోతం!..

చూస్తే నోరూరిస్తుంది.. కానీ తింటే ఆరోగ్యానికి ముప్పుగా మారుతోంది. హనుమకొండలో ఆహార భద్రతా అధికారుల తనిఖీల్లో రసాయనాలు కలిపిన చికెన్‌తో పాటు పలు ఆహార పదార్థాల్లో నాణ్యతా లోపాలు బయటపడటం కలకలం రేపుతోంది. హోటళ్లలో మాంసం నిల్వ చేసే విధానం, మిఠాయిల్లో హానికర రంగులు, పండ్లను త్వరగా పండించేందుకు రసాయనాల వినియోగం, ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగించడం వంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలు పెరుగుతున్న సమయంలో.. ఆహార నాణ్యతపై నిర్లక్ష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది.

Telangana: గుంటూరు మస్తాన్‌‌పై ఎందుకంత ప్రేమ?!..స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa02 Oct 2026, 09:13 AM

Telangana: గుంటూరు మస్తాన్‌‌పై ఎందుకంత ప్రేమ?!..

మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఒకే ఆస్తికి సంబంధించి నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబర్ 12న నమోదైన కేసులో నాన్ జెన్యూన్ పత్రాలు, తప్పుడు సమాచారం, భవన అనుమతుల అంశాలపై బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద గుంటూరు మస్తాన్‌‌పై కేసు నమోదైంది. అయితే సెప్టెంబర్ 30న ప్రహరీ గోడ కూల్చివేత, ఆక్రమణ ప్రయత్నం, బెదిరింపుల ఆరోపణలతో నమోదైన మరో ఎఫ్‌ఐఆర్‌లో తక్కువ శిక్షలు కలిగిన సెక్షన్లే ఎందుకు పెట్టారన్నది ఫిర్యాదుదారుడి ప్రధాన ప్రశ్న. గోడకు జరిగిన నష్టాన్ని సరిగ్గా అంచనా వేసి, అందుబాటులో ఉన్న ఆధారాలన్నింటినీ పరిశీలించి, రెండు కేసుల దర్యాప్తును నిష్పక్షపాతంగా నిర్వహించాలని బాధితుడు కోరుతున్నారు.

Shocking video: విమానం కూల్చేందుకు ఉగ్రకుట్ర.. భారతీయ పైలట్ సమయస్ఫూర్తితో 174మంది సేఫ్!InternationalSwechaa02 Oct 2026, 09:07 AM

Shocking video: విమానం కూల్చేందుకు ఉగ్రకుట్ర.. భారతీయ పైలట్ సమయస్ఫూర్తితో 174మంది సేఫ్!

 యూఏఈ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం (FZ1073)లో కో-పైలట్ జరిపిన భయానక ఉగ్ర కుట్రకు సంబంధించిన కీలక దృశ్యాలు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. ఒమన్‌కు చెందిన కో-పైలట్ విమానాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నుతూ, దానిని అడ్డుకోబోయిన భారతీయ సంతతికి చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై కత్తితో దారుణంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావమవుతున్నా కెప్టెన్ స్మిత్ సాహసంతో కాక్‌పిట్ డోర్ తెరిచి ప్రయాణికులకు విషయం చెప్పడంతో, ప్రయాణికులు, సిబ్బంది కలిసి ఉగ్ర కుట్రను భగ్నం చేసి 174మంది ప్రాణాలను కాపాడారు.

Asian Games 2026: ఆర్చరీలో భారత్‌ జోరు.. రికర్వ్‌లో తొలి స్వర్ణం!..క్రీడలుSwechaa02 Oct 2026, 08:42 AM

Asian Games 2026: ఆర్చరీలో భారత్‌ జోరు.. రికర్వ్‌లో తొలి స్వర్ణం!..

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొట్టారు. మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో అంకితా భకత్‌, కీర్తి శర్మ, కుంకుమ్‌ మొహద్‌ త్రయం స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్‌లో పది సార్లు ఛాంపియన్‌గా నిలిచిన దక్షిణకొరియాను 5-3తో ఓడించి సంచలన విజయం నమోదు చేసింది. అంతకుముందు సెమీస్‌లో చైనాను 5-1తో చిత్తు చేసింది. హాంగ్జౌలో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత్‌.. ఈసారి రికర్వ్‌లో ఏకంగా గోల్డ్‌ సాధించింది. తాజా స్వర్ణంతో భారత్‌ పతకాల పట్టికలో ఏడో స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్యాలతో మొత్తం 67 పతకాలు భారత్‌ ఖాతాలో ఉన్నాయి.

Health: అధిక బరువు వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏమిటి?..HealthSwechaa02 Oct 2026, 08:23 AM

Health: అధిక బరువు వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఏమిటి?..

అధిక బరువు కేవలం లావుగా కనిపించడానికే పరిమితం కాదు.. ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బరువు పెరిగినవారిలో రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర పెరిగి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, ఫ్యాటీ లివర్, మోకాళ్ల నొప్పులు, నిద్రలో శ్వాసకు ఇబ్బంది వంటి సమస్యలు కూడా రావచ్చు. అందుకే బరువు పెరుగుతున్న విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. ఆహార నియమాలు పాటిస్తూ, రోజూ వ్యాయామం చేస్తూ బరువును నియంత్రించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Telangana: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!!..తెలంగాణSwechaa02 Oct 2026, 08:04 AM

Telangana: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!!..

తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఉద్యోగులు, రైతులు, కరువు, విద్యుత్‌ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను ఉద్యోగులు, పెన్షనర్లకు విడుదల చేయడంతో పాటు బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.