స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Telangana: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!!..తెలంగాణSwechaa02 Oct 2026, 08:04 AM

Telangana: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు!!..

తెలంగాణ కేబినెట్‌ భేటీలో ఉద్యోగులు, రైతులు, కరువు, విద్యుత్‌ రంగాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను ఉద్యోగులు, పెన్షనర్లకు విడుదల చేయడంతో పాటు బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. 65 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని 7,800 మెగావాట్ల కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Health: యాంజియోగ్రామ్ అంటే ఏమిటి ఇది ఎలా చేస్తారు!..HealthSwechaa02 Oct 2026, 07:30 AM

Health: యాంజియోగ్రామ్ అంటే ఏమిటి ఇది ఎలా చేస్తారు!..

గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఉన్నాయా.. రక్తప్రసరణకు ఎంతమేరకు ఆటంకం ఉందో తెలుసుకోవడానికి చేసే ముఖ్యమైన పరీక్ష యాంజియోగ్రామ్. కోరోనరీ యాంజియోగ్రామ్‌లో సాధారణంగా మణికట్టు లేదా తొడలోని ధమని ద్వారా సన్నని కేథెటర్‌ను గుండె రక్తనాళాల వరకు తీసుకెళ్లి, కాంట్రాస్ట్ డై పంపిస్తారు. ప్రత్యేక ఎక్స్‌రే ఇమేజింగ్‌తో బ్లాకేజీ ఉన్న ప్రాంతం, దాని తీవ్రతను గుర్తిస్తారు.

Health: కూరలో కరివేపాకని తీసేయకండి.. ఆరోగ్యానికి ఉపయోగపడే గుణాలివే!..HealthSwechaa02 Oct 2026, 07:08 AM

Health: కూరలో కరివేపాకని తీసేయకండి.. ఆరోగ్యానికి ఉపయోగపడే గుణాలివే!..

మన వంటింట్లో నిత్యం ఉపయోగించే కరివేపాకులో పాలీఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్, కార్బజోల్ ఆల్కలాయిడ్స్ వంటి సహజ బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను ఎదుర్కోవడంలో సహాయపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కరివేపాకులోని కొన్ని సమ్మేళనాలు రక్తంలో చక్కెర నియంత్రణ, వాపు తగ్గింపు, కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన ప్రభావాలపై కూడా పరిశోధించబడ్డాయి. అయితే వీటిలో చాలావరకు ప్రయోగశాల, జంతు అధ్యయనాల ఆధారంగానే ఉన్నాయి. అందుకే కరివేపాకును మందుగా కాకుండా సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Spirituality: మానవ జీవితాన్ని శాసించే కర్మ సిద్ధాంతం.. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల రహస్యమేంటి?..SpiritualitySwechaa02 Oct 2026, 07:02 AM

Spirituality: మానవ జీవితాన్ని శాసించే కర్మ సిద్ధాంతం.. సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల రహస్యమేంటి?..

సనాతన ధర్మంలో మానవ జీవితాన్ని అర్థం చేసుకునే ప్రధాన భావనల్లో కర్మ సిద్ధాంతం ఒకటి. వేదాంతంలో కర్మను ప్రధానంగా మూడు రకాలుగా వివరిస్తారు. గత జన్మల నుంచి పోగైన కర్మల సమాహారం సంచిత కర్మ. అందులో ఈ జన్మలో అనుభవించేందుకు సిద్ధమైన భాగమే ప్రారబ్ధ కర్మ. ఇక ఈ జన్మలో మన ఆలోచనలు, మాటలు, చేతల ద్వారా ఏర్పడే కొత్త కర్మ ఆగామి కర్మ. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూనే, ధర్మబద్ధమైన జీవనం, సత్కార్యాలు, ఆధ్యాత్మిక సాధన ద్వారా మన ఆగామి కర్మను మలచుకోవచ్చని వేదాంతం చెబుతుంది.

Spirituality: అకాల మరణాలు ఎందుకు ప్రాప్తిస్తాయి?..SpiritualitySwechaa02 Oct 2026, 06:55 AM

Spirituality: అకాల మరణాలు ఎందుకు ప్రాప్తిస్తాయి?..

సనాతన ధర్మంలో మానవ జన్మను అత్యంత విలువైన అవకాశంగా భావిస్తారు. అకాల మరణానికి కర్మ, ప్రారబ్ధం, అధర్మ జీవనం వంటి అంశాలను ఆధ్యాత్మిక గ్రంథాలు కారణాలుగా వివరిస్తాయి. సదాచారాన్ని పాటించడం, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలను గౌరవించడం, జీవహింసకు దూరంగా ఉండటం మనిషి ధర్మంగా చెబుతాయి. అపమృత్యువు నుంచి రక్షణ కోసం ఈశ్వర స్మరణ, ధర్మాచరణ, మహా మృత్యుంజయ మంత్ర జపాన్ని కూడా పురాణ సంప్రదాయం ప్రాధాన్యంగా పేర్కొంటుంది. ధర్మబద్ధమైన జీవనమే మనిషికి ఆధ్యాత్మికంగా రక్షణనిస్తుందని సనాతన ధర్మం బోధిస్తుంది.

Spirituality: మంగళవారం ఇల్లు దులపడం మంచిదేనా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?..SpiritualitySwechaa02 Oct 2026, 06:49 AM

Spirituality: మంగళవారం ఇల్లు దులపడం మంచిదేనా? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి?..

మంగళవారం ఇంటిని పెద్ద ఎత్తున శుభ్రం చేయడం, బూజులు తీయడం, పాత సామాన్లు కదిలించడం వంటి పనులను చాలామంది సంప్రదాయంగా నివారిస్తుంటారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇల్లు దులపకూడదని పెద్దలు చెప్పే ఆచారం కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ విషయాన్ని శాస్త్రం, సంప్రదాయం అనే రెండు కోణాల్లో చూడాలని పండితులు అంటున్నారు.

సీఈసీపై సమరభేరి!NationalSwechaa01 Oct 2026, 11:41 PM

సీఈసీపై సమరభేరి!

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు పార్లమెంట్‌, ప్రెస్‌మీట్లు, లేఖలు, న్యాయస్థానాల వేదికగా సాగిన పోరు.. ఇక నేరుగా ప్రజాక్షేత్రంలోకి రానుంది. గాంధీ జయంతి రోజైన నేటి నుంచే దేశవ్యాప్తంగా ఆందోళనలకు విపక్షాలు సిద్ధమయ్యాయి.

ప్రియుడే హంతకుడు.. నర్సింగ్ విద్యార్థిని హత్య కేసులో వీడిన మిస్టరీక్రైమ్Swechaa01 Oct 2026, 11:10 PM

ప్రియుడే హంతకుడు.. నర్సింగ్ విద్యార్థిని హత్య కేసులో వీడిన మిస్టరీ

Harini Mystery: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో తీవ్ర సంచలనం రేపిన హరిణి మర్డర్ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రియుడే హంతకుడు అని తేల్చారు. తనను దూరం పెడుతోందని, పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న ప్రియుడు పవన్ కుమార్ హరిణిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు. జూలూరుపాడులో పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగన్నపాలెంలో సెప్టెంబర్ 22న హరిణి (18) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పవన్ ఆమెను మర్డర్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు మీడియాకు తెలిపారు.

TG: ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో జనం విసిగిపోయారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు!’: డీకే అరుణతెలంగాణSwechaa01 Oct 2026, 10:11 PM

TG: ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లతో జనం విసిగిపోయారు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు!’: డీకే అరుణ

TG: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల సహా ఇన్‌ఛార్జ్ గువ్వల బాలరాజుతో కలిసి ఆమె పాల్గొన్నారు.

BhagyaSri Borse: మోహన్ లాల్ సరసన భాగ్యశ్రీ బోర్సే..సినిమాSwechaa01 Oct 2026, 10:00 PM

BhagyaSri Borse: మోహన్ లాల్ సరసన భాగ్యశ్రీ బోర్సే..

BhagyaSri Borse: మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను మరింతగా పెంచుకుంటున్న ఆయన.. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమానే ‘ఆపరేషన్ గంగా’. ఈ సినిమాలో మోహన్ లాల్ సరసన టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయమైన హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.

TG: ఉద్యోగులకు పండుగ గిఫ్ట్ .. రెండు డీఏల విడుదలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్!తెలంగాణSwechaa01 Oct 2026, 09:36 PM

TG: ఉద్యోగులకు పండుగ గిఫ్ట్ .. రెండు డీఏల విడుదలకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

TG: దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గురువారం సచివాలయంలో సమావేశమైన మంత్రివర్గం.. 2024 నుంచి రావాల్సిన బకాయిల్లో రెండు డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌లు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. ఈ రెండు డీఏల మంజూరు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.2,500 కోట్ల మేర అదనపు భారం పడుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం కోసమే సర్కార్ ఈ ముందడుగు వేసిందని స్పష్టం చేశారు.

మంత్రి జూపల్లిని ఘెరావ్ చేసిన కళాకారులుతెలంగాణSwechaa01 Oct 2026, 09:30 PM

మంత్రి జూపల్లిని ఘెరావ్ చేసిన కళాకారులు

Jupally Krishna Rao: మంత్రి జూపల్లి కృష్ణారావుని కళాకారులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. హైదరాబాద్ రవీంద్రభారతిలోని మంత్రి జూపల్లి ఆఫీస్ ముందు కళాకారులు ఆందోళనకు దిగారు. అర్హులైన కళాకారులకు ఉపాధి కల్పించాలని, తెలంగాణ సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మంత్రి జూపల్లి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మహిళా కళాకారిణులు కన్నీళ్లతో మంత్రి కాళ్ల మీద పడి వేడుకున్నారు.

TG Politics: మిత్రపక్షాల చేతుల్లోనే కాంగ్రెస్ భవిష్యత్తు.. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ ఏం చేయబోతున్నాయి?తెలంగాణSwechaa01 Oct 2026, 08:17 PM

TG Politics: మిత్రపక్షాల చేతుల్లోనే కాంగ్రెస్ భవిష్యత్తు.. సీపీఐ, సీపీఎం, టీజేఎస్ ఏం చేయబోతున్నాయి?

TG Politics: తెలంగాణలో రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారిన వేళ సరికొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. అభ్యర్థుల పేర్లను అందరికంటే ముందుగానే ప్రకటించి దూకుడు ప్రదర్శించిన హస్తం పార్టీకి.. ఇప్పుడు మిత్రపక్షాల మద్దతు కూడగట్టుకోవడమే అతిపెద్ద సవాలుగా మారిందని అంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన మిత్రపక్షాలు ఈసారి ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ వెంట నడుస్తాయా లేక సొంతంగా పోటీకి దిగి షాక్ ఇస్తాయా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్నకు సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి (టీజేఎస్) సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఈ ఐక్యత కొనసాగింది.

Tollywood: ఆదర్శ కుటుంబం, బ్లాస్ట్ సినిమాల కథ ఒకటేనా?సినిమాSwechaa01 Oct 2026, 07:59 PM

Tollywood: ఆదర్శ కుటుంబం, బ్లాస్ట్ సినిమాల కథ ఒకటేనా?

Tollywood: ఆదర్శ కుటుంబం, బ్లాస్ట్ సినిమాల కథ ఒకటేనా? అవును..ప్రస్తుతం ఈ టాక్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన బ్లాస్ట్ సినిమా వచ్చి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా టైటిల్ సరిగ్గా అర్థం కాక ఆడియన్స్‌కి అంతగా ఆసక్తి పెరగలేదు గానీ, సినిమా రిలీజ్ కి ముందు గనక కథలో ఉన్న కంటెంట్ ఏంటో తెలిస్తే భారీ హిట్ సాధించి ఉండేది.

ఖైరతాబాద్ ఉపఎన్నికకు బ్రేక్? ఎన్నికల సంఘం కీలక ప్రకటనతెలంగాణSwechaa01 Oct 2026, 07:41 PM

ఖైరతాబాద్ ఉపఎన్నికకు బ్రేక్? ఎన్నికల సంఘం కీలక ప్రకటన

Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక వ్యవహారంలో హైడ్రామా నడుస్తోంది. ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున ఖైరతాబాద్ కు ఉపఎన్నిక ఇప్పుడే నిర్వహించబోమని తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక నోటిఫికేషన్‌ ను ఇప్పట్లో జారీ చేయబోము అని కోర్టుకు స్పష్టం చేసింది ఈసీ.

Tollywood: 'ది ప్యారడైజ్' ఫ్లాప్ ఎఫెక్ట్.. మెగాస్టార్‌తో శ్రీకాంత్ ఓదెల సినిమా లేనట్టేనా?సినిమాSwechaa01 Oct 2026, 07:21 PM

Tollywood: 'ది ప్యారడైజ్' ఫ్లాప్ ఎఫెక్ట్.. మెగాస్టార్‌తో శ్రీకాంత్ ఓదెల సినిమా లేనట్టేనా?

Tollywood: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పేరు ‘దసరా’తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా మార్మోగిపోయింది. నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా రూపొందిన ఈ సినిమా మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకోవడంతో శ్రీకాంత్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత, ఆయన దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన ‘ది ప్యారడైజ్’పై కూడా మొదటి నుంచే భారీ హైప్ నెలకొంది. అయితే, విడుదల తర్వాత సినిమాకు ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల తదుపరి ప్రాజెక్టు గురించి డిస్కర్షన్స్ మొదలైయ్యాయి.

పంచాయతీల్లో చెక్ పవర్ పై ప్రభుత్వం కీలక ఆదేశాలుతెలంగాణSwechaa01 Oct 2026, 07:20 PM

పంచాయతీల్లో చెక్ పవర్ పై ప్రభుత్వం కీలక ఆదేశాలు

TG: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారం చూపుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు (డీపీఓలకు) స్పష్టమైన మార్గదర్శకాలు అందాయి. సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య అంతర్గత వివాదాల వల్ల పల్లెల్లో అభివృద్ధి పనులు నిలిచిపోకుండా, చెక్కుల జారీ సజావుగా సాగేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.గ్రామాల్లో అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపుల కోసం ఇచ్చే చెక్కులపై సంతకాలు చేయకుండా ఉప సర్పంచ్‌లు కావాలని కాలయాపన చేస్తే ఇకపై చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిర్దిష్టమైన, సరైన కారణం లేకుండా ఏడు రోజులకు మించి సంతకాలు చేయకుండా లేట్ చేస్తే, జిల్లా కలెక్టర్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టాల్సి ఉంటుంది. ఆ జాప్యం ఉద్దేశపూర్వకంగా జరిగినట్లు నిర్ధారణ అయితే, చట్ట ప్రకారం ఉప సర్పంచ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటారు.

TG: కేంద్రం 25 శాతమే కొంటే మిగతా రైతులు ఏమైపోవాలి.. మంత్రి తుమ్మల సూటి ప్రశ్న!తెలంగాణSwechaa01 Oct 2026, 06:54 PM

TG: కేంద్రం 25 శాతమే కొంటే మిగతా రైతులు ఏమైపోవాలి.. మంత్రి తుమ్మల సూటి ప్రశ్న!

TG: రైతులు పండించిన పంటలకు నామమాత్రంగా మద్దతు ధరలు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటే సరిపోదని, ప్రకటించిన ప్రతి పైసా అన్నదాత చేతికి చేరేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర సర్కార్‌పై ధ్వజమెత్తారు. ప్రకటనలతో సరిపెట్టడం కాకుండా, మద్దతు ధర ఖరారు చేసిన ప్రతి పంటనూ నూటికి నూరు శాతం కేంద్రమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంతో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీ పాలకుల చిత్తశుద్ధి రైతులకు రక్షణగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.

కరెంటు లేక పంటలు ఎండుతుంటే.. విద్యుత్ అమ్ముకుంటారా?తెలంగాణSwechaa01 Oct 2026, 06:48 PM

కరెంటు లేక పంటలు ఎండుతుంటే.. విద్యుత్ అమ్ముకుంటారా?

Harish Rao: రేవంత్ సర్కార్ పై మాజీమంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. మన రాష్ట్రంలో కరెంటు లేదు కానీ.. సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌‌కు అమ్ముతామని జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారు? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు. రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వకుండా పక్క రాష్ట్రానికి ఎందుకు అమ్ముతున్నారు? అని హరీశ్ రావు నిలదీశారు. మీరు చెప్పిందేమో 24 గంటల కరెంటు, కానీ ఇస్తున్నది కేవలం తొమ్మిది గంటలే. అందులోనూ మధ్యమధ్యలో ట్రిప్ అవుతోంది. మెటీరియల్ లేదనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను సంవత్సరకాలంగా పెండింగ్ లో పెట్టారు అని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

Aadarsha Kutumbam: వెంకీ - త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం' సినిమాకి 'No' టికెట్ హైక్స్?సినిమాSwechaa01 Oct 2026, 06:43 PM

Aadarsha Kutumbam: వెంకీ - త్రివిక్రమ్ ల 'ఆదర్శ కుటుంబం' సినిమాకి 'No' టికెట్ హైక్స్?

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్–మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం’. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, ఈ సినిమాకు సంబంధించిన టికెట్ రేట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఎల్‌నినో పరిస్థితులపై క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ..తెలంగాణSwechaa01 Oct 2026, 06:20 PM

ఎల్‌నినో పరిస్థితులపై క్యాబినెట్‌లో సుదీర్ఘ చర్చ..

El Nino: రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపై క్యాబినెట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. తక్షణం చేపట్టాల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న ఎల్‌నినో పరిస్థితులు, చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై సలహాలు సూచనలు స్వీకరించాలని నిర్ణయించారు. కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయనున్నారు. త్వరలోనే ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర పరిస్థితిని నివేదించాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.

నువ్వు నల్లమల పులి కాదు.. చంద్రబాబు పిల్లితెలంగాణSwechaa01 Oct 2026, 06:07 PM

నువ్వు నల్లమల పులి కాదు.. చంద్రబాబు పిల్లి

KTR: సిరిసిల్లలో బహిరంగ సభలో తనను ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పచ్చి అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ధ్వజమెత్తారు. సిరిసిల్లలో రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అవాస్తవలే అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రశ్నిస్తున్నామనే తమపై రేవంత్ రెడ్డికి కోపం అని చెప్పారు కేటీఆర్. సిరిసిల్ల పర్యటనలో రేవంత్ రెడ్డి ఏదైనా కొత్త పథకం ప్రకటిస్తారని అనుకున్నాం.. నాలుగు మంచి మాటలు చెబుతారని.. రైతులకు స్వాంతన కలిగించే ప్రకటన చేస్తారని ఆశించాము.. కానీ అదేమీ లేదు. మళ్లీ అవే తిట్లు, పుక్కిటి పురాణాలు అంటూ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్.

Tollywood: రవితేజ, వివేక్ ఆత్రేయ సినిమాకి "తులాబారం" టైటిల్ ఫికైందా?సినిమాSwechaa01 Oct 2026, 06:03 PM

Tollywood: రవితేజ, వివేక్ ఆత్రేయ సినిమాకి "తులాబారం" టైటిల్ ఫికైందా?

Tollywood: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. రీసెంట్‌గా వచ్చిన ‘ఇరుముడి’ మూవీతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో ‘సరిపోదా శనివారం’ ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రవితేజ నటించబోయే సినిమాపై ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.

BC Strategy: కాంగ్రెస్ ‘రెడ్డి’ కార్డుకు కేసీఆర్ బీసీ కౌంటర్.. ఎమ్మెల్సీ పోరులో ఊహించని ట్విస్ట్!తెలంగాణSwechaa01 Oct 2026, 06:00 PM

BC Strategy: కాంగ్రెస్ ‘రెడ్డి’ కార్డుకు కేసీఆర్ బీసీ కౌంటర్.. ఎమ్మెల్సీ పోరులో ఊహించని ట్విస్ట్!

BC Strategy: తెలంగాణ రాజకీయాలు మరో రసవత్తర ఎన్నికల సమరానికి వేదికవుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరగనున్న రెండు కీలక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల పోరు ప్రధాన పార్టీల మధ్య జీవన్మరణ సమస్యగా మారింది. అధికార కాంగ్రెస్ ఓవైపు కండబలంతో పావులు కదుపుతుంటే, అసెంబ్లీ ఓటమి నుంచి కోలుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ క్షేత్రస్థాయి వ్యూహాలతో సమరశంఖం పూరించింది. రాబోయే 2028 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎమ్మెల్సీ సమరమే అసలైన 'రిఫరెండం'గా మారబోతోందన్న అంచనాల నడుమ, గులాబీ అధినేత కేసీఆర్ వేస్తున్న సోషల్ ఇంజినీరింగ్ ఎత్తుగడలు అధికార పక్షానికి సవాల్ విసురుతున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Congress MLC Candidates: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పూర్తి బ్యాక్‌గ్రౌండ్ ఇదేతెలంగాణSwechaa01 Oct 2026, 05:53 PM

Congress MLC Candidates: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల పూర్తి బ్యాక్‌గ్రౌండ్ ఇదే

Congress MLC Candidates: తెలంగాణలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల సమరానికి కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా, విద్యావంతులు మాత్రమే ఓటు వేసే ఈ నియోజకవర్గాల్లో పార్టీ సాంప్రదాయ రాజకీయ నాయకులను పక్కనపెట్టింది. అత్యున్నత విద్యార్హతలు, అంతర్జాతీయ కార్పొరేట్ అనుభవం, లీగల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఇద్దరు నేతలను బరిలోకి దించింది. ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్‌‌తో సమరానికి సిద్ధమైన ఆ ఇద్దరు అభ్యర్థుల పూర్తి ప్రొఫైల్స్, వారి రాజకీయ నేపథ్యాలు ఇవే.హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానానికి ఎంపికైన సామ రామ్మోహన్ రెడ్డికి విద్యార్థి దశ నుంచే బలమైన పోరాట నేపథ్యం ఉంది.

విద్యార్హతలు & వృత్తి: ఇంజినీరింగ్ (బీటెక్) పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్‌బీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో ప్రాక్టీసింగ్ లాయర్‌గా కొనసాగుతున్నారు. పలు కీలక రాజ్యాంగపరమైన అంశాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, పార్టీ న్యాయ విభాగం తరఫున వాదనలు వినిపించిన అనుభవం ఆయన సొంతం.

స్మిత్‌‌కు సెల్యూట్.. భారత పైలట్‌పై మోదీ, నెతన్యాహు ప్రశంసల వర్షంNationalSwechaa01 Oct 2026, 04:44 PM

స్మిత్‌‌కు సెల్యూట్.. భారత పైలట్‌పై మోదీ, నెతన్యాహు ప్రశంసల వర్షం

Captain Smith Machar: 31 వేల అడుగుల ఎత్తులో గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో జరిగిన ఊహించని దాడిని సమర్థంగా ఎదుర్కొని, వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను నిలబెట్టిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యసాహసాలను ప్రపంచ నేతలు కొనియాడుతున్నారు. తీవ్ర గాయాలపాలైనా ప్రాణాలకు తెగించి విమానాన్ని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన ఆయన తీరుపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ‘ఎక్స్’ వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను ‘రియల్ హీరో’గా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన అసమాన పోరాట పటిమను కొనియాడారు. కాక్‌పిట్‌లో కో-పైలట్ మారణాయుధంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచినప్పటికీ, ఏమాత్రం వెరవకుండా ఆయన ప్రదర్శించిన సాహసం వల్లే పెను ముప్పు తప్పిందని పేర్కొన్నారు. గగనంలో వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన స్మిత్ మచ్చర్‌ను చూసి యావత్ దేశం గర్విస్తోందని చెబుతూ, ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.

అవును నాకు హోటళ్లు ఉన్నాయి.. రేవంత్ రెడ్డికి థ్యాంక్స్తెలంగాణSwechaa01 Oct 2026, 04:39 PM

అవును నాకు హోటళ్లు ఉన్నాయి.. రేవంత్ రెడ్డికి థ్యాంక్స్

KTR: సిరిసిల్ల బహిరంగ సభలో తనను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ నగరంలో తనకు ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. అవును.. నాకు హోటల్స్ ఉన్నాయి, అది నిజమే అని అన్నారు. 2006లోనే తాను ఒక హోటల్ పెట్టానని కేటీఆర్ తెలిపారు. ఈ 20ఏళ్లలో అది పెరిగి మూడు హోటళ్లు అయ్యిందని వెల్లడించారు. వ్యాపారం చేయడం తప్పా? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు కేటీఆర్. అంతేకాదు.. తన హోటల్స్ కు ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చారంటూ రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ కూడా చెప్పారు కేటీఆర్.

Rajinikanth: రజినీకాంత్ జైలర్ 2లో ఐటమ్ సాంగ్సే ఎక్కువున్నాయా?సినిమాSwechaa01 Oct 2026, 04:06 PM

Rajinikanth: రజినీకాంత్ జైలర్ 2లో ఐటమ్ సాంగ్సే ఎక్కువున్నాయా?

Rajinikanth: సూపర్‌స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘జైలర్ 2’ కూడా ఒకటి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘జైలర్’లో రజినీకాంత్ మాస్ స్వాగ్, కామెడీ, యాక్షన్‌తో పాటు అనిరుధ్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణంగా నిలిచాయి. తాజాగా, ఈ సినిమా నుంచి బాలీవుడ్ హాట్ బాంబ్ నోరా ఫతేహీ డాన్స్ నంబర్ రిలీజైంది.

Rajamouli: బాహుబలి 3, ఆర్ఆర్ఆర్ 2 కథలు సిద్ధమయ్యాయా?సినిమాSwechaa01 Oct 2026, 03:55 PM

Rajamouli: బాహుబలి 3, ఆర్ఆర్ఆర్ 2 కథలు సిద్ధమయ్యాయా?

Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి సినిమా అంటేనే భారీ అంచనాలు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్న.. ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా ‘వారణాసి’ తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ మహేష్ పార్ట్ షూట్ కంప్లీట్ అయింది. అయితే, అభిమానుల్లో మాత్రం మరో రెండు ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి.

AP: బీసీ రిజర్వేషన్ల బిల్లును కొట్టేసిన హైకోర్టు.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వంఏపీSwechaa01 Oct 2026, 03:21 PM

AP: బీసీ రిజర్వేషన్ల బిల్లును కొట్టేసిన హైకోర్టు.. సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం

AP: రాష్ట్రంలో బీసీలకు ప్రకటించిన 34 శాతం రిజర్వేషన్ల అంశం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించిపోతోందన్న కారణంతో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పక్కనపెట్టింది. తీర్పు వెలువడిన కొద్దిసేపట్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు, బీసీలకు ఇచ్చిన మాట నుంచి వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. వెంటనే దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.స్థానిక సమరానికి సిద్ధమవుతున్న వేళ వెనుకబడిన వర్గాలకు 34 శాతం వాటా కల్పిస్తూ జారీ చేసిన రెండు కీలక సర్క్యులర్లపై కొందరు కోర్టును ఆశ్రయించారు.