స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Telangana Politics: అడవిని వదిలి అసెంబ్లీ వైపు.. తెలంగాణలో మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ!తెలంగాణSwechaa01 Oct 2026, 02:51 PM

Telangana Politics: అడవిని వదిలి అసెంబ్లీ వైపు.. తెలంగాణలో మాజీ మావోయిస్టుల కొత్త పార్టీ!

తెలంగాణ గడ్డపై మరో రాజకీయ సంచలనానికి తెరలేస్తోంది. దశాబ్దాల పాటు దండకారణ్యంలో తుపాకీ చేతబట్టి రాజ్యాధికారం కోసం నెత్తురోడ్చిన విప్లవ దళాలు.. ఇప్పుడు తమ వ్యూహాన్ని మార్చాయి. తూటాల గర్జనతో రాని మార్పును.. ప్రజాస్వామ్య పద్ధతిలో బ్యాలెట్ బాక్సుల ద్వారా సాధించేందుకు పావులు కదుపుతున్నాయి. నక్సలైట్ ఉద్యమాలకు చారిత్రక కేంద్ర బిందువైన ఉమ్మడి వరంగల్ నేలను అడ్డాగా చేసుకుని సరికొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు మాజీ మావోయిస్టుల అగ్ర నాయకత్వం కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.

‘అన్నా ఆకలేస్తుంది.. ఇంటికి తీసుకెళ్లండి’ బోరున ఏడ్చేసిన పిల్లాడు!అభిప్రాయంSwechaa01 Oct 2026, 02:40 PM

‘అన్నా ఆకలేస్తుంది.. ఇంటికి తీసుకెళ్లండి’ బోరున ఏడ్చేసిన పిల్లాడు!

ఏపీలో హృదయాన్ని కలిచివేసే ఓ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ బాలుడు మేకలు కాస్తూ తిరుగుతుండగా.. అతన్ని పలకరించిన వ్యక్తులకు తన గోడును చెప్పుకోని కంటతడిపెట్టాడు. ఏడుస్తూ తన బాధను చెప్పుకోగా ఆ వ్యక్తుల నోటి వెంట మాట రాలేదని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘అన్నా ఆకలేస్తుంది ఇంటికి తీసుకెళ్లండి’ అంటూ ఆ బాలుడు కంటతడి పెట్టుకున్నాడు. సుమారు 8 ఏళ్ల వయస్సులో అతను పడుతున్న కష్టాన్ని చూసిన వారంతా అయ్యో పాపం..అంటున్నారు. వివరాల్లోకివెళితే.. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం రాచవారిపాలెంలో రామయ్య అనే బాలుడుమేకలు మేపుతూ కనిపించాడు. అప్పటికే ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న రామయ్యను ఇద్దరు వ్యక్తులు గమనించారు.అతని వద్దకు వెళ్లి పలకరిస్తే ఆకలిగా ఉందని, ఇంటికి తీసుకెళ్లండని బోరున ఏడ్చేశాడు. తనకు సరిగ్గా అన్నం పెట్టడం లేదని, చాలా ఆకలేస్తోందంటూ కన్నీరుమున్నీరయ్యాడు.

నీకు జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డి.. నేతన్నలను మోసం చేశావ్ : జీవన్ రెడ్డితెలంగాణSwechaa01 Oct 2026, 02:28 PM

నీకు జ్ఞానం ఉందా రేవంత్ రెడ్డి.. నేతన్నలను మోసం చేశావ్ : జీవన్ రెడ్డి

సిరిసిల్ల సభలో మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలు, ఉపయోగించిన పదజాలంపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్మమంత్రి సభకు జనాలను తీసుకొచ్చేందుకు కిందిస్థాయి జిల్లా నేతలు తీవ్రఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. గురువారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మీదల తీవ్ర విమర్శలు గుప్పించారు.సిరిసిల్ల సభకు 10, 15 జిల్లాల నుంచి జనాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతుల అంశం, నీళ్ల అంశం మాట్లాడుతారని అనుకున్నామని.. కానీ, ఆయనకు రాజకీయాలే ప్రాధాన్యత అని తెలిసిందన్నారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌పై కడుపులో విషం నింపుకొని మాట్లాడినట్టు అర్ధం అవుతోందని అన్నారు.ముఖ్యమంత్రి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు.

ఏం బూతులు.. ఏం భాష.. సీఎం రేవంత్‌కు ‘గంగుల’ కౌంటర్తెలంగాణSwechaa01 Oct 2026, 02:08 PM

ఏం బూతులు.. ఏం భాష.. సీఎం రేవంత్‌కు ‘గంగుల’ కౌంటర్

నిన్న ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తాజాగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ‘సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌కు వస్తున్నారంటే ఆశపడ్డాం. గత పదేళ్లలో కెసీఆర్ కరీంనగర్‌కు వచ్చినప్పుడల్లా నిధుల వరద పారింది. అలాగే రేవంత్ రెడ్డి వస్తుంటే అదే మాదిరిగా ఉంటుంది అనుకున్నాం. కానీ, ఆరోపణలు, విధ్వంసం..వ్యక్తిగత విమర్శలు తప్ప ఏం లేదు. 1000 రోజుల పాలనలో ప్రశ్నిస్తే డైవర్షన్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. చాలా ముఖ్యమంత్రలను చూశాం. కానీ, ఇలాంటి సీఎంను ఎన్నడూ చూడలేదు..ఏం బూతులు, ఏం బాషా’ అని తీవ్ర విమర్శలు గుప్పించారు.

రియల్ హీరో.. భారతీయ పైలట్‌పై ట్రంప్ ప్రశంసలు!InternationalSwechaa01 Oct 2026, 01:49 PM

రియల్ హీరో.. భారతీయ పైలట్‌పై ట్రంప్ ప్రశంసలు!

ఘోర విమాన ప్రమాదం సంభవించకుండా భారత పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. దుబాయ్ నుండి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమామాన్ని కూల్చివేసేందుకు యత్నించిన ఒమన్ దేశానికి చెందిన కో పైలట్‌ చర్యలను అడ్డుకుని 180 మంది ప్రాణాలను రక్షించాడు. కాక్‌పిట్‌లో ఉన్న కో పైలట్ ఆగ్రహంతో భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై కత్తితో దాడి చేశాడు. పలుమార్లు ముఖం, చేతులపై దాడికి పాల్పడటంతో పాటు విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ భారత పైలట్ అతడితో పోరాడి సేఫ్ ‌గా విమానం ల్యాండ్ చేశాడు. దీంతో ఆయనకు ప్రముఖులు అభినందనలు తెలిపారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ‘రియల్ హీరో’ అని కొనియాడారు. ‘ధైర్యవంతుడైన మచ్చార్‌పై ఉగ్రవాది దాడి చేశాడు.అయినా ప్రాణాలకు తెగించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పైలట్ పరిస్థితి విషమంగా ఉన్నా, అద్భుతమైన సమయస్పూర్తితో వ్యవహరించి ఒకరకంగా హీరోగా నిలిచారు’ అని పేర్కొన్నారు.

రైతులకు శుభవార్త.. ఆ పంటలకు కనీస మద్దతు ధర పెంపు !NationalSwechaa01 Oct 2026, 01:22 PM

రైతులకు శుభవార్త.. ఆ పంటలకు కనీస మద్దతు ధర పెంపు !

దేశంలోని అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రబీ సీజన్‌‌లో తప్పనిసిరి చేసిన ఆరు పంటలకు కనీసమద్దతు ధర (MSP)ని పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంత్రం ప్రధాని మోడీ నేతృత్వంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2027-28 మార్కెటింగ్ సీజన్‌కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయి. ఆయిల్ గింజలు, పప్పు దినుసులకు కనీస మద్దతు ధర కల్పించడంతో పాటు గోధుమలు క్వింటాకు ధర రూ.25 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కుసుమ పువ్వు ధర క్వింటాకు రూ.675 పెరగ్గా.. ఆవాల ధర క్వింటాకు రూ.413, పప్పుదినుసులు (కందిపప్పు) ధర క్వింటాకు రూ.390 పెంచినట్లు తెలిపారు. బార్లీ కనీస ధర క్వింటాకు రూ.136, శనగలు రూ.83 పెరగ్గా.. గోధుమల కనీస ధర క్వింటాకు రూ.25 మాత్రమే పెంచినట్టు వెల్లడించారు.

ఎస్ఐఆర్ వివాదం.. ‘ఫారమ్ -6’ ఉపసంహరణ వెనుక ఎవరున్నారు? :  రాహుల్ గాంధీNationalSwechaa01 Oct 2026, 12:56 PM

ఎస్ఐఆర్ వివాదం.. ‘ఫారమ్ -6’ ఉపసంహరణ వెనుక ఎవరున్నారు? : రాహుల్ గాంధీ

దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) మీద తీవ్రదుమారం రేగుతున్న విషయం తెలిసిందే. తమకు అనుకూలంగా ఉండే ఓట్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కాపాడుకుంటుందని, ప్రతిపక్షపార్టీల అనుకూల ఓట్లను డిలీట్ చేస్తుందని పొలిటికల్ పార్టీల లీడర్లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇండియా కూటమిలోని పార్టీలు, నాయకులు ఎలక్షన్ కమిషన్ చీఫ్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన రాజీనామా కోరుతూ రేపటి నుంచి కాక్రోచ్ జనతా పార్టీ మరోసారి దేశవ్యాప్త పిలుపునిచ్చింది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ ఫారమ్-6(తాతముత్తాలకు సంబంధించిన పత్రాలు)అడగటాన్ని ఉపసంహరించకుంది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆన్‌లైన్ ఫారం-6ను చట్టవిరుద్ధంగా మార్చారు? ఈసీ సొంత కమిషనర్లే ఈ విషయంపై అభ్యంతరం తెలిపారు. ఈసీఐలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌కు ఆ మార్పు చేయమని ఎవరు ఆదేశించారు?’ అని అడిగారు.

RSSలో భారీ మార్పులకు రంగం సిద్ధం.. నవంబర్ భేటీ ఎందుకంత కీలకం?NationalSwechaa01 Oct 2026, 12:56 PM

RSSలో భారీ మార్పులకు రంగం సిద్ధం.. నవంబర్ భేటీ ఎందుకంత కీలకం?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో కీలక సంస్థాగత మార్పులకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెలలో ఇండోర్‌లో జరగనున్న అఖిల భారతీయ కార్యనిర్వాహక మండలి సమావేశంలో సంఘ్‌ నిర్మాణంలో మార్పులను అమలు చేయడంతో పాటు.. వచ్చే ఏడాది జరగనున్న సర్కార్యవాహ్ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియపై కూడా చర్చ జరగనుంది.

Tollywood: వారణాసి, డ్రాగన్ సినిమాలు చెప్పిన తేదీకే వస్తాయా?!సినిమాSwechaa01 Oct 2026, 12:41 PM

Tollywood: వారణాసి, డ్రాగన్ సినిమాలు చెప్పిన తేదీకే వస్తాయా?!

Tollywood: మన టాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు ‘వారణాసి’, ‘డ్రాగన్’. అయితే, గత కొన్ని రోజుల నుంచి ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో రక రకాల రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో, తాజాగా నిర్మాత రవి శంకర్.వై ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్స్‌కి చెక్ పడింది.

Allu Arjun: ‘రాకా’ రెండు భాగాలుగా రానుందా? ముంబైలో ఏం జరుగుతోంది!సినిమాSwechaa01 Oct 2026, 12:29 PM

Allu Arjun: ‘రాకా’ రెండు భాగాలుగా రానుందా? ముంబైలో ఏం జరుగుతోంది!

Allu Arjun: మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యువ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై ఇప్పటికే, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో మరింత గ్రాండ్‌గా ఉండబోతుందని మేకింగ్ వీడియోస్‌తో అర్థ మైంది. ముఖ్యంగా, అట్లీ మార్క్ భారీ యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా నిర్మిస్తుందట.

వినియోగదారుడిపై గుది ‘బండ’..మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు!NationalSwechaa01 Oct 2026, 12:29 PM

వినియోగదారుడిపై గుది ‘బండ’..మళ్లీ పెరిగిన గ్యాస్ ధరలు!

వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది.ఊహించని విధంగా గ్యాస్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతినెలా మొదటి వారంలో చమురు సంస్థలు ధరలను రివైజ్ చేస్తాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కమిర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ వినియోగదారులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.తాజా పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార సంస్థలపై ఆర్థిక భారం మరింత పడనుంది. పండుగల ఆర్డర్స్ వచ్చే సమయంలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌‌పై ఒక్కసారిగా రూ.62.50 పెంచారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర ప్రస్తుతం రూ.2,837.50కి చేరుకుంది. ఇక ముంబై నగరంలో రూ.2,764, చెన్నైలో రూ.2,983, బిహార్‌లోని పాట్నాలో రూ.3,100, హైదరాబాద్ నగరంలో రూ.3,065కి, విజయవాడలో 2,932.50, విశాఖపట్నంలో రూ.2,827.50కి ధరలు పలుకుతున్నాయి.

Nagarjuna: నవంబర్ 13న ‘గీతాంజలి’ రీ రిలీజ్..సినిమాSwechaa01 Oct 2026, 12:08 PM

Nagarjuna: నవంబర్ 13న ‘గీతాంజలి’ రీ రిలీజ్..

Nagarjuna: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాల్లో ‘గీతాంజలి’ ఒకటి. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాగార్జున, గిరిజ జంటగా నటించిన ఈ సినిమా.. ప్రేమ, భావోద్వేగాలు, సంగీతం, విజువల్స్ కలగలిపిన అందమైన ప్రేమకావ్యంగా నిలిచిపోయింది. అయితే, ఈ సినిమాను ఈ ఏడాది నవంబర్ 13న మళ్ళీ థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు. తాజాగా, ఈ విషయాన్ని కన్‌ఫర్మ్ చేస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

కాంగ్రెస్‌లో భారీ కుదుపు.. పంజాబ్ పీసీసీ చీఫ్ రాజీనామాNationalSwechaa01 Oct 2026, 12:06 PM

కాంగ్రెస్‌లో భారీ కుదుపు.. పంజాబ్ పీసీసీ చీఫ్ రాజీనామా

వచ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీపీసీసీ) అధ్యక్ష పదవికి అమరీందర్ సింగ్ రాజా వారింగ్ నిన్న రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా రాజా వారింగ్, మాజీ సీఎం చరణ్‌‌జీత్ సింగ్ చన్నీ వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు సాగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పార్టీ నాయకత్వం విషయంలో ఇరువర్గాల నాయకులు, ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయి హైకమాండ్ వద్ద బలాన్ని నిరూపించుకునే ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఎన్నికల ముందు నేతల మధ్య ఇలాంటి విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్ అధినాయకత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే దిశగా పావులు కదిపింది. అధినాయకత్వం ఆదేశాల మేరకు పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజీనామా చేశారు.

రాముడి చుట్టూ రాజకీయం.. శివుడి చుట్టూ సమరం! తెలంగాణలో కొత్త పొలిటికల్ యాంగిల్తెలంగాణSwechaa01 Oct 2026, 11:20 AM

రాముడి చుట్టూ రాజకీయం.. శివుడి చుట్టూ సమరం! తెలంగాణలో కొత్త పొలిటికల్ యాంగిల్

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటివరకు ఎన్నికలు, అభివృద్ధి, ప్రాంతీయ హక్కులు, సంక్షేమం, కుల సమీకరణాలు, హామీలు.. ఇలా ఎన్నో అంశాలు రాజకీయ అజెండాగా మారాయి. కానీ ఇప్పుడు సీన్ కొంచెం కొత్తగా కనిపిస్తోంది. రాజకీయ చర్చ నేరుగా దేవుళ్ల చుట్టూ తిరుగుతోంది. అది కూడా రాముడు, శివుడి చుట్టూ.

ఖైరతాబాద్ టికెట్ అడిగే రైట్ నాకు ఉంది : చింతల రామచంద్రా రెడ్డితెలంగాణSwechaa01 Oct 2026, 10:37 AM

ఖైరతాబాద్ టికెట్ అడిగే రైట్ నాకు ఉంది : చింతల రామచంద్రా రెడ్డి

ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారి మరో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినప్పుడే ఆయన శాసనసభ సభ్యత్వం రద్దు కావాల్సిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి అన్నారు. దానం శాసనసభ సభ్యత్వం రద్దు కోసం బీజేపీ ఎంతగానో న్యాయపోరాటం చేసిందన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లి ఫైట్ చేశామని, ఎట్టకేలకు తమ కృషి ఫలించిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు , 8 ఎమ్మెల్యేలు, గ్యాట్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ సైతం గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసారి ఖైరతాబాద్ నియోజకవర్గంలో తాము తప్పకుండా గెలుస్తామని వెల్లడించారు.అయితే, ఖైరతాబాద్ నుంచి ఎవరు పోటీ చేస్తారనేదానిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.అయితే, ఖైరతాబాద్ నుంచి పోటీ చేయడానికి, టికెట్ అడిగే హక్కు తనకు ఉందన్నారు. మిగితా వాళ్లు కూడా టికెట్ అడగవచ్చని చెప్పారు. తాను ఖైరతాబాద్ వదిలి ఇప్పటి వరకు ఎక్కడకు పోలేదని గుర్తుచేశారు. టికెట్ ఇస్తే కచ్చితంగా బరిలోదిగి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్, మమత సొంతగూటికి రండి : భట్టి విక్రమార్కతెలంగాణSwechaa01 Oct 2026, 10:03 AM

వైఎస్ జగన్, మమత సొంతగూటికి రండి : భట్టి విక్రమార్క

దేశంలో సమగ్ర ఓటరు జాబితా(ఎస్ఐఆర్)పేరిట లక్షల ఓట్లు డిలీట్ చేస్తున్నారని, కేంద్రప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు.నిన్న మధ్యాహ్నం కేరళం కొచ్చిలో నిర్వహించిన ఇండియా టు టే కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాలు, మతాలను సమైక్యంగా ఉంచి అభివృద్ధి పథంలో నడిపించే విజన్ ఒక్క కాంగ్రెస్‌కే ఉందని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మమతా బెనర్జీ, శరద్‌పవార్ సహా పాత కాంగ్రెస్ నేతలంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ఓటు చోరీ జరిగిందని ప్రజలు అనుమానిస్తున్న వేళ ఎన్నికల సంఘం పారదర్శకత మీద కేంద్రం ప్రభుత్వం స్పందించి సమాధానం చెప్పాలని కోరారు. ఎన్నికల సంఘం తన నిష్పాక్షికతను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీతో పొత్తు ఉండదు.. రెండేండ్లలో కేసీఆరే సీఎం : కేటీఆర్తెలంగాణSwechaa01 Oct 2026, 09:38 AM

బీజేపీతో పొత్తు ఉండదు.. రెండేండ్లలో కేసీఆరే సీఎం : కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండబోదని, మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భావజాలం, సైద్ధాంతికంగా తాము బీజేపీకి వ్యతిరేకమని.. అలాంటప్పుడు ఎలా పొత్తు పెట్టుకుంటామని అన్నారు. నిన్న సాయంత్రం కేరళంలో నిర్వహించిన ‘ఇండియా టుడే’ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ..26ఏళ్లలో ఒక్కసారి కూడా బీజేపీతో తాము పొత్తు పెట్టుకోలేదన్నారు. గత మూడు జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీచేసిందని పేర్కొన్నారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ విధానంతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా గతంలో సుమారు 24 శాతం నుంచి 19 శాతానికి తగ్గిందని, ఇప్పుడు జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే అనేక రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. చట్టసభల్లో సీట్లు పెంచాలనుకుంటే అసెంబ్లీ సీట్లను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. కేవలం పార్లమెంట్ సీట్లను పెంచడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

వర్షాలకు బ్రేక్.. పంటలకు షాక్! 12.6% వర్షపాతం లోటు.. తెలంగాణలోనూ దారుణ పరిస్థితిNationalSwechaa01 Oct 2026, 12:07 AM

వర్షాలకు బ్రేక్.. పంటలకు షాక్! 12.6% వర్షపాతం లోటు.. తెలంగాణలోనూ దారుణ పరిస్థితి

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌ తీవ్ర లోటుతో ముగిసింది. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతంతో పోలిస్తే 12.6 శాతం తక్కువ వర్షం నమోదైంది. 2001 తర్వాత చూస్తే ఇది నాలుగో అత్యల్ప నైరుతి సీజన్‌గా నమోదైంది.

ఉద్యోగమంటున్నారు.. రష్యా సైన్యంలో చేరుస్తున్నారు.. భారతీయుల్లారా బీ అలర్ట్!NationalSwechaa30 Sep 2026, 11:28 PM

ఉద్యోగమంటున్నారు.. రష్యా సైన్యంలో చేరుస్తున్నారు.. భారతీయుల్లారా బీ అలర్ట్!

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లాలని చూస్తున్నారా..? రష్యాలో మంచి జీతంతో ఉద్యోగం వస్తుందని ఎవరైనా ఆఫర్ చేస్తున్నారా..? అయితే ఒక్కసారి ఆగి ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఉద్యోగం పేరుతో రష్యాకు వెళ్లి.. అక్కడి సైన్యంలో చిక్కుకున్న భారతీయుల వ్యవహారం ఇప్పుడు మరింత తీవ్రమవుతోంది.

TG: బొగ్గు మనది.. కరెంట్ రాజస్థాన్‌కా? రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్!తెలంగాణSwechaa30 Sep 2026, 10:09 PM

TG: బొగ్గు మనది.. కరెంట్ రాజస్థాన్‌కా? రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్!

TG: "సింగరేణి గనుల్లోని బొగ్గు మనది.. గోదావరి నుంచి తీసుకుంటున్న నీళ్లు మనవి.. కర్మాగారానికి ఇచ్చిన నేల మనది.. మరి ఇక్కడ తయారయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు ఎందుకు అప్పనంగా రాసిస్తున్నారు?" అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆస్తులను, సహజ వనరులను పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రికి ఘాటు లేఖ సంధించారు.

Modi Trump Talks: ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోన్ కాల్.. ఏం మాట్లాడారో తెలుసా?NationalSwechaa30 Sep 2026, 09:57 PM

Modi Trump Talks: ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోన్ కాల్.. ఏం మాట్లాడారో తెలుసా?

Modi Trump Talks: భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య ఫ్రెండ్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకునే దిశగా సాగిన ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ టెలిఫోనిక్ మంతనాల వివరాలను స్వయంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.భారత్ - అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిపై ఇద్దరు నేతలు లోతుగా సమీక్షించారు. ముఖ్యంగా వ్యాపార వాణిజ్యాలు, రక్షణ రంగ సహకారం, ఇంధన భద్రతతో పాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంపై కీలక సమాలోచనలు జరిపారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు భుజం భుజం కలిపి పనిచేయాలని సంయుక్తంగా నిర్ణయించుకున్నాయి.

వెళ్లిపోతున్న ఫారెన్ ఇన్వెస్టర్లు.. ఇండియా ఎకానమీపై నమ్మకం పోయిందా?NationalSwechaa30 Sep 2026, 09:46 PM

వెళ్లిపోతున్న ఫారెన్ ఇన్వెస్టర్లు.. ఇండియా ఎకానమీపై నమ్మకం పోయిందా?

Economy Analysis: భారత స్టాక్ మార్కెట్లలో మొన్నటిదాకా నిధుల వర్షం కురిపించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఇప్పుడు ఒక్కసారిగా రివర్స్ గేర్ వేశారు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ దేశీయ మార్కెట్ల నుంచి తట్టాబుట్టా సర్దుకుని పారిపోతున్నారు. భారత వృద్ధి రేటు ప్రపంచానికే ఆదర్శమంటూ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు కితాబులిస్తున్న వేళ.. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎందుకు భారత్‌పై నమ్మకం కోల్పోయి విక్రయాల సునామీ సృష్టిస్తున్నారు? కేవలం మధ్యప్రాచ్య యుద్ధాలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరుగుదలే దీనికి కారణమా? లేక కాగితాలపై కనిపిస్తున్న భారత వృద్ధి గణాంకాల వెనుక దాగిన లోపాలను వాళ్లు ముందే పసిగట్టారా? అసలేమైంది..

TG:  బండి సంజయ్ తో కలిసి అభివృద్ధిలో పనిచేస్తున్నా : సీఎం రేవంత్తెలంగాణSwechaa30 Sep 2026, 09:31 PM

TG: బండి సంజయ్ తో కలిసి అభివృద్ధిలో పనిచేస్తున్నా : సీఎం రేవంత్

TG: రాజకీయాలు ఎన్నికల వరకేనని, రాష్ట్ర ప్రగతి కోసం ప్రత్యర్థి పార్టీ నేతలతో సైతం కలిసి పనిచేసేందుకు రెడీ అని సీఎం రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్‌తో కలిసి తాను తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు రేవంత్ చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.కరీంనగర్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధిలో ఎలాంటి సంకుచిత రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు

కేటీఆర్‌ సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చాడు : సీఎం రేవంత్తెలంగాణSwechaa30 Sep 2026, 09:12 PM

కేటీఆర్‌ సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చాడు : సీఎం రేవంత్

TG: "సింగరేణి గనుల్లోని బొగ్గు మనది.. గోదావరి నుంచి తీసుకుంటున్న నీళ్లు మనవి.. కర్మాగారానికి ఇచ్చిన నేల మనది.. మరి ఇక్కడ తయారయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు ఎందుకు అప్పనంగా రాసిస్తున్నారు?" అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆస్తులను, సహజ వనరులను పొరుగు రాష్ట్రాల ప్రయోజనాలకు తాకట్టు పెడుతున్నారంటూ ముఖ్యమంత్రికి ఘాటు లేఖ సంధించారుమంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణలో భాగంగా కుదుర్చుకున్న డీల్ వెనుక భారీ లొసుగులు దాగి ఉన్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. రాజస్థాన్ విద్యుత్ సంస్థతో సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం కొత్త ప్లాంట్‌లో ఉత్పత్తయ్యే చౌక విద్యుత్‌లో ఏకంగా 800 మెగావాట్లను ఆ రాష్ట్రానికే దారాదత్తం చేయాలని నిర్ణయించడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల రక్తం, చెమటతో నిర్మితమైన సింగరేణి సంపదను పక్క రాష్ట్రానికి కట్టబెట్టే హక్కు ప్రభుత్వానికి ఎవరిచ్చారని నిలదీశారు.

Flydubai: 180 మందిని కాపాడిన భారత పైలట్..!NationalSwechaa30 Sep 2026, 08:15 PM

Flydubai: 180 మందిని కాపాడిన భారత పైలట్..!

Flydubai: ఆకాశంలో వేల అడుగుల ఎత్తున 180 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో కో-పైలట్ ఒక్కసారిగా ఉన్మాదిలా మారాడు. ఒళ్లంతా గాయాలవుతున్నా, చావు అంచుల వరకు వెళ్లినా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఓ భారత కెప్టెన్ చూపిన అసాధారణ తెగువ 180 మంది ప్రయాణికులకు ప్రాణదానం చేసింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానం టేకాఫ్ అయిన సుమారు రెండున్నర గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. కాక్‌పిట్ లోపల ఉన్న ఒమన్ జాతీయుడైన కో-పైలట్ అకస్మాత్తుగా తోటి భారత కెప్టెన్‌పై కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. విమానాన్ని కూల్చేయడమే లక్ష్యంగా అతను దాడికి యత్నించినట్లు స్పష్టమవుతోంది. రక్తమోడుతున్నా సరే ఆ భారత పైలట్ మాత్రం విమానం స్టీరింగ్ వదలకుండా నిలబడటంతో పాటు, ప్రాణాలకు తెగించి ఆ ఉన్మాదిని ఎదుర్కొన్నారు.

నాకు మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా మీ వల్లేతెలంగాణSwechaa30 Sep 2026, 07:53 PM

నాకు మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా మీ వల్లే

Cm Revanth: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులు ఉద్యోగులే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడితేనే పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఉద్యోగుల పాత్ర కీలకం అని చెప్పారు. పేదల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కార్యాలయం ఉపయోగపడాలని సూచించారు. సమస్యలతో వచ్చిన పేదలకు వెంటనే పరిష్కారం దొరకాలన్నారు.

ప్రజలకు సాయం చేయటం మన బాధ్యత

సాయం కోసం వచ్చిన వాళ్లను కుటుంబసభ్యుల్లా చూడాలని అధికారులకు సూచించారు సీఎం రేవంత్. ప్రజల సమస్యలే మన సమస్యలు అని చెప్పిన సీఎం రేవంత్.. సమస్యలతో వచ్చే ప్రజలకు సాయం చేయటం మన బాధ్యత అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికైనా, దేశ ప్రధానమంత్రికైనా మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అది ప్రభుత్వ ఉద్యోగుల వల్లే అని ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు బాగా పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు.

AP : సీఎం సభాస్థలి దగ్గర పేలిన సిలిండర్ఏపీSwechaa30 Sep 2026, 07:05 PM

AP : సీఎం సభాస్థలి దగ్గర పేలిన సిలిండర్

AP : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభ సమీపంలో గ్యాస్ సిలిండర్ పేలడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం సాయంత్రం విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.ముఖ్యమంత్రి సభ జరుగుతున్న ప్రాంతానికి సమీపంలోనే ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో సభకు హాజరైన ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక కొద్దిసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. అయితే రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది, పోలీసులు తక్షణమే అప్రమత్తమై నిమిషాల వ్యవధిలోనే పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

తెలంగాణ రాజకీయాల్లో 'శివ - రామ' పంచాయితీ..తెలంగాణSwechaa30 Sep 2026, 06:30 PM

తెలంగాణ రాజకీయాల్లో 'శివ - రామ' పంచాయితీ..

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల హామీలు, పాలనా వైఫల్యాల చుట్టూ సాగాల్సిన సమరం ఒక్కసారిగా ఆధ్యాత్మిక అస్తిత్వ ఘర్షణగా రూపాంతరం చెందింది. ఇప్పటిదాకా హిందూత్వ అజెండాతో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త పంథాను ఎంచుకున్నట్లు కనిపిస్తుంది.

తెలంగాణకు అమిత్ షా.. పూర్తి షెడ్యూల్ ఇదేతెలంగాణSwechaa30 Sep 2026, 06:14 PM

తెలంగాణకు అమిత్ షా.. పూర్తి షెడ్యూల్ ఇదే

Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. అక్టోబర్ 3న అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్, తూప్రాన్, కరీంనగర్ లో ఆయన పర్యటించనున్నారు. అక్టోబర్ 3న రాత్రి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా.. కాకతీయ హోటల్ లో బస చేయనున్నారు. అక్టోబర్ 4న మెదక్ జిల్లా తూప్రాన్ లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్ లో డెయిరీ మిల్క్ ప్లాంట్ నిర్మాణానికి అమిత్ షా శంకుస్థాపన చేయనున్నారు.

Fly dubai: దుబాయ్ విమానం హైజాక్ అయిందా? 17వేల అడుగులు కింద‌కు ఎందుకు వ‌చ్చింది? అస‌లు కార‌ణం ఇదే!!InternationalSwechaa30 Sep 2026, 05:27 PM

Fly dubai: దుబాయ్ విమానం హైజాక్ అయిందా? 17వేల అడుగులు కింద‌కు ఎందుకు వ‌చ్చింది? అస‌లు కార‌ణం ఇదే!!

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరిన 'ఫ్లై దుబాయ్' (FZ1073) విమానంలో బుధవారం ఆకాశంలో అనూహ్య, ప‌రిణామం చోటుచేసుకుంది. సుమారు 33,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో ఉన్న ఇద్దరు పైలట్ల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో విమానం హఠాత్తుగా కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 17,000 అడుగుల కిందకు పడిపోవడంతో పాటు విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడటంతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. పరిస్థితి చేయిదాటడంతో విమానం నుంచి మొదట సాధారణ అత్యవసర సంకేతం (Code 7700), ఆ తర్వాతి సెకన్లలోనే హైజాకింగ్ లేదా అక్రమ జోక్యాన్ని సూచించే సంకేతం (Code 7500) పంపబడింది.