స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

FreeBus: ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం.. మహిళలకు సీఎం హామీ!ఏపీSwechaa30 Sep 2026, 05:09 PM

FreeBus: ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం.. మహిళలకు సీఎం హామీ!

ఆంధ్రప్రదేశ్‌లో 'స్త్రీశక్తి' పథకం ద్వారా ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం, త్వరలోనే ఏసీ బస్సుల్లోనూ ఉచిత జర్నీ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది. విజయవాడలో బుధవారం నిర్వహించిన 'పేదలకు పట్టాభిషేకం' కార్యక్రమంలో భాగంగా 26,400 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సంచలన ప్రకటన చేశారు. మహిళల సంక్షేమం, ప్రయాణ సౌకర్యాన్ని మరింత వేగవంతం చేయడంలో భాగంగా భవిష్యత్తులో నూతనంగా ఏసీ బస్సులను కొనుగోలు చేసి, వాటిలోనూ ఉచిత ప్రయాణాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు.

చిత్రం లేదు
తెలంగాణSwechaa30 Sep 2026, 04:50 PM

minister seethakka: వీబీ-జీ రామ్ జీ అమలుపై మంత్రి సీతక్క కీలక ఆదేశాలు!

తెలంగాణలో గ్రామీణ ఉపాధి హామీ పథకం (వీబీ-జీ రామ్ జీ - VB-G RAM G) అమలే లక్ష్యంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బుధవారం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనుల పురోగతి, కూలీలకు పనుల కల్పన, ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై హైదరాబాద్ నుంచి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో 12 వేల మందికి పైగా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఉపాధి పనుల ఎంపిక, ఆమోదంలో గ్రామసభల నిర్ణయాలకే అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు.

DSPBheemReddy: దేశంలోనే తొలిసారి.. భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో కీల‌క ప‌రిణామం!క్రైమ్Swechaa30 Sep 2026, 04:20 PM

DSPBheemReddy: దేశంలోనే తొలిసారి.. భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో కీల‌క ప‌రిణామం!

అక్రమాస్తుల వ్యవహారంలో సస్పెండైన తెలంగాణ మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసులో దర్యాప్తు సంస్థలు వేగాన్ని పుంజుకున్నాయి. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జరుపుతున్న విచారణకు తోడుగా తాజాగా ఐటీ సైతం ఈ కేసులో నేరుగా రంగంలోకి దిగింది. భీమ్‌రెడ్డికి బినామీలుగా వ్యవహరించినట్లు బలమైన ఆధారాలు లభించిన 8 మందిపై 'బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్ యాక్ట్' కింద ఐటీ శాఖ కేసులు నమోదు చేయడం సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే ఈ స్థాయి అధికారి బినామీ నెట్‌వర్క్‌పై బినామీ చట్టం కింద ఈ తరహా కేసులు నమోదు కావడం అత్యంత అరుదైన పరిణామంగా అధికారులు పేర్కొంటున్నారు. డీజీపీ కార్యాలయ పరిధిలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పని చేసిన సమయంలో భీమ్‌రెడ్డిపై ఏసీబీ అధికారులు ప్రాథమిక కేసు నమోదు చేశారు.

ఇండియా కూట‌మి సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాహుల్‌, ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు!NationalSwechaa30 Sep 2026, 04:08 PM

ఇండియా కూట‌మి సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాహుల్‌, ఖ‌ర్గే కీల‌క వ్యాఖ్య‌లు!

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ, ఈవీఎంల వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘంతో కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో ప్రతిపక్ష 'ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా అక్టోబర్ 2 (గాంధీ జయంతి) నుంచి అక్టోబర్ 8 వరకు వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా 'సేవ్ డెమోక్రసీ మార్చ్' పేరుతో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు కూటమి అగ్రనేతలు ప్రకటించారు. ఈ క్రమంలోనే వివాదాస్పద నిర్ణయాలకు బాధ్యత వహిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.

చిక్కుల్లో వీఆర్‌కే డైట్ సృష్టికర్త వీరమాచినేని.. క్రిమినల్ కేసు నమోదుతెలంగాణSwechaa30 Sep 2026, 04:07 PM

చిక్కుల్లో వీఆర్‌కే డైట్ సృష్టికర్త వీరమాచినేని.. క్రిమినల్ కేసు నమోదు

VRK Diet: ప్రముఖ డైట్ స్పెషలిస్ట్, వీఆర్‌కే డైట్ (VRK Diet) సృష్టికర్త వీరమాచినేని రామకృష్ణ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. వీరమాచినేని ఇచ్చిన తప్పుడు వైద్య సలహా కారణంగా తన ప్రాణాలకు ముప్పు కలిగిందని ఓ లా విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

Khairatabad Bypoll: ఖైరతాబాద్ లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుద్దా?తెలంగాణSwechaa30 Sep 2026, 03:47 PM

Khairatabad Bypoll: ఖైరతాబాద్ లో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. వర్కౌట్ అవుద్దా?

Khairatabad Bypoll: గ్రేటర్ హైదరాబాద్ గడ్డపై మరో ఉప ఎన్నిక రసవత్తర పోరుకు తెరలేపింది. కంటోన్మెంట్‌లో బోణీ కొట్టి, జూబ్లీహిల్స్‌లో పాగా వేసి జోరుమీదున్న కాంగ్రెస్.. ఇప్పుడు ఖైరతాబాద్ బైపోల్‌‌లోనూ జెండా ఎగరేసి ‘గ్రేటర్ హ్యాట్రిక్’ పూర్తి చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి పక్కా మైక్రో మేనేజ్‌మెంట్‌తో కూడిన మాస్టర్ ప్లాన్‌ను రచిస్తున్నారు. అయితే గతంలో కలిసివచ్చిన సమీకరణాలు ఖైరతాబాద్‌లోనూ అదే స్థాయిలో పనిచేస్తాయా? లేక కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడలు క్షేత్రస్థాయిలో బెడిసికొడతాయా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

#NC 25: 'వృషకర్మ' రిలీజ్ తర్వాతే చైతూ 25వ సినిమా ప్రకటన..సినిమాSwechaa30 Sep 2026, 03:06 PM

#NC 25: 'వృషకర్మ' రిలీజ్ తర్వాతే చైతూ 25వ సినిమా ప్రకటన..

#NC25: అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో మరో మైల్ స్టోన్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం, వరుస సినిమాలతో బిజీగా ఉన్న చైతూ.. తన 25వ సినిమాను ఎప్పుడు ప్రకటిస్తారన్న ఆసక్తి అక్కినేని అభిమానుల్లో నెలకొంది. అయితే, ఈ స్పెషల్ ప్రాజెక్ట్ ప్రకటన విషయంలో మేకర్స్ ఓ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నట్లు తాజాగా క్లారిటీ ఇచ్చారు. మేము అధికారికంగా ప్రకటన ఇచ్చే వరకూ సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దు..అంటూ చైతూ పీఆర్ టీమ్ స్పష్టం చేసింది.

CEC: సీఈసీ జ్ఞానేష్ కుమార్ కుర్చీకి ఎసరు తప్పదా? క్లైమాక్స్ కౌంట్‌డౌన్ మొదలైందా!NationalSwechaa30 Sep 2026, 03:02 PM

CEC: సీఈసీ జ్ఞానేష్ కుమార్ కుర్చీకి ఎసరు తప్పదా? క్లైమాక్స్ కౌంట్‌డౌన్ మొదలైందా!

CEC: దేశ ఎన్నికల వ్యవస్థను కుదిపేస్తున్న "స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్" (ఎస్ఐఆర్) వ్యవహారం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరిత క్లైమాక్స్‌కు చేరుకుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ నిర్ణయాలు, ఓటర్ల జాబితా సవరణ పేరుతో రేగిన అలజడి దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒకవైపు ఆయన ఏకపక్ష వైఖరిని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, మరోవైపు అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి విపక్షాలు 'జైల్ భరో' ఉద్యమానికి పిలుపునివ్వడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. సీఈసీ పదవిలో జ్ఞానేష్ కుమార్ కొనసాగుతారా? లేక మునుపెన్నడూ లేని విధంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తనుందా? అనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జోరందుకుంది.

ఆటో‌డ్రైవర్‌తో ఇద్దరు అమ్మాయిల ఫైటింగ్.. వీడియో వైరల్తెలంగాణSwechaa30 Sep 2026, 03:01 PM

ఆటో‌డ్రైవర్‌తో ఇద్దరు అమ్మాయిల ఫైటింగ్.. వీడియో వైరల్

ఆటో డ్రైవర్ , ఇద్దరు అమ్మాయిలు పరస్పరం రోడ్డు మీద దాడులు చేసుకున్న ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆటో చార్జీల విషయంలోనే ఈ ఘర్షణ వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే... ఇద్దరు అమ్మాయిలు ఆటోలో ఓ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ డబ్బులు విషయంలో ఆటో డ్రైవర్‌తో వాగ్వాదం జరిగినట్టు సమాచారం. ముందుగా అనుకున్న అమౌంట్ కంటే డ్రైవర్ ఎక్కువగా డిమాండ్ చేశాడని యువతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య మాట మాట పెరిగి దాడులు చేసుకునే వరకు వెళ్లినట్టు తెలిసింది. ఇద్దరు అమ్మాయిలు, ఆటో డ్రైవర్ పరస్పరం దాడులు చేసుకుంటున్న సమయంలో గుర్తుతెలియని వాహనదారుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది.

The Paradise: ‘ప్యారడైజ్’లో KCRను పోలిన పాత్ర.. ప్రియదర్శికి హరీష్ రావు సన్మానం!సినిమాSwechaa30 Sep 2026, 02:56 PM

The Paradise: ‘ప్యారడైజ్’లో KCRను పోలిన పాత్ర.. ప్రియదర్శికి హరీష్ రావు సన్మానం!

The Paradise: ప్రియదర్శి.. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ ఈ పేరు బాగా వినిపిస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా..యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో కమెడియన్ ప్రియదర్శి పోషించిన "ఎమ్మెల్యే శంకరన్న" పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాత్ర మేకోవర్, తెలంగాణ యాస, బాడీ లాంగ్వేజ్, హావభావాలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గుర్తు చేసేలా ఉండటంతో సినిమా విడుదలకు ముందు, ఆ తర్వాత కూడా భారీ స్థాయిలో చర్చ జరిగింది.

కాంగ్రెస్‌ను స్థాపించింది బిట్రీష్ వాడు..‘డివైడ్ అండ్ రూల్’ దాని సిద్ధాంతం : రఘునందన్ రావుతెలంగాణSwechaa30 Sep 2026, 02:36 PM

కాంగ్రెస్‌ను స్థాపించింది బిట్రీష్ వాడు..‘డివైడ్ అండ్ రూల్’ దాని సిద్ధాంతం : రఘునందన్ రావు

దేవుళ్ల మీద సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. రాముడు ధనవంతుల దేవుడు అయితే భద్రచాలం రామయ్య వద్దకు తన సతీమణితో కోలిసి సీఎం ఎందుకు తలంబ్రాలు తీసుకువెళ్లారో సమాధానం చెప్పాలన్నారు. తాము ద్రవిడులం, శివుడిని కొలుస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఎప్పుడైనా శ్రీశైలం వెళ్లారా? కొమురవెల్లి మల్లన్నకు ఏమైనా చేశారా? అని రఘునందన్ రావు ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పార్టీని స్థాపించింది బ్రిటీష్ వ్యక్తి అని.. బ్రిటీష్ వారు చెప్పినట్టు ‘డివైడ్ అండ్ రూల్’ ప్రకారమే ఆ పార్టీ నడుస్తుందని వివరించారు. చివరకు దేవుళ్లను విభజించాలనే రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు తాము చింతిస్తున్నట్టు పేర్కొన్నారు.

Tollywood: నాని–సుజీత్ ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్ ఎవరు?సినిమాSwechaa30 Sep 2026, 02:35 PM

Tollywood: నాని–సుజీత్ ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్ ఎవరు?

Tollywood: నేచురల్ స్టార్ నాని, ‘ఓజీ’ ఫేమ్ సుజీత్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘బ్లడీ రోమియో’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. నాని బర్త్‌డే సందర్భంగా టైటిల్, యానిమేటెడ్ ప్రమోషనల్ వీడియోతో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచారు మేకర్స్. యాక్షన్, డార్క్ హ్యూమర్, గ్యాంగ్‌స్టర్ అంశాలతో సుజీత్ తన స్టైల్‌లో ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌కు విద్యార్థినుల చుక్కలు..ఎందుకంటే?NationalSwechaa30 Sep 2026, 02:01 PM

ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌కు విద్యార్థినుల చుక్కలు..ఎందుకంటే?

‘జెన్ జీ, జెన్ అల్ఫా’ వంటి నేటితరం పిల్లలు, యువకులు ప్రశ్నించడంలో ముందుంటున్నారు. వారికి సమస్య మీద పూర్తిగా అవగాహన ఉన్నా లేకున్నా గట్టిగా నిలదీయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్వాలిటీ, ప్రశ్నించేతత్వం లేకపోవడం వల్లే దేశం,రాష్ట్రాల్లోని వివిధ ప్రభుత్వాలు జవాబుదారీతనం పాటించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే పాఠశాలకు వెళ్లేందుకు స్టాప్‌లో ఎదురుచూస్తుండగా బస్సు ఆపలేదని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగెత్తుకుంటూ వెళ్లి మరి బస్సును ఆపారు. అనంతరం ముగ్గురు విద్యార్థినులు బస్సుకు ఎదురుగా నిలబడి డ్రైవర్, కండక్టర్‌ను నిలదీశారు. బస్సు ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. ఈ కర్ణాటకలోని కొప్పళ తాలూకా బి.హొసహళ్లిలో వెలుగుచూసింది.

భర్త వైద్యం కోసం భార్య దారుణం.. ఆమె లేదని భర్త ఘోరం!క్రైమ్Swechaa30 Sep 2026, 01:27 PM

భర్త వైద్యం కోసం భార్య దారుణం.. ఆమె లేదని భర్త ఘోరం!

భర్త వైద్యం కోసం ఓ భార్య మర్డర్ చేసి బంగారం,నగదు దొంగిలించింది. పోలీసులు ఆమెను అరెస్టు చేయగా.. భార్య తనకు దూరం అయ్యిందనే బాధ భరించలేక ఆ భర్త తనువు చాలించాలని షాకింగ్ నిర్ణయం తీసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైరల్ అవుతోంది. భర్త కోసం భార్య త్యాగం చేస్తే ఆమె దూరమైందని ఏకంగా భర్త ప్రాణాలనే తీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. జిల్లాలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేటలో ఈ నెల 24న వృద్ధురాలు పోచమ్మ(75) దారుణ హత్యకు గురైంది. ఈ మర్డర్ చేసింది నర్సమ్మ(46)గా నిర్దారించారు. ఆమెను అరెస్టు చేయగా.. భర్త యాదయ్య వైద్యం కోసం డబ్బులు లేక నేరం చేసినట్టు అంగీకరించింది. భార్య అరెస్టు అయ్యిందని తెలిసి యాదయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు

రెడ్‌బుక్ కావాలా? రప్పా రప్పా కావాలా?.. విజయసాయి రెడ్డి సూటి ప్రశ్న!ఏపీSwechaa30 Sep 2026, 12:50 PM

రెడ్‌బుక్ కావాలా? రప్పా రప్పా కావాలా?.. విజయసాయి రెడ్డి సూటి ప్రశ్న!

ఏపీ రాజకీయాలపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులు, అధికార ప్రతిపక్షపార్టీల నడుమ సాగుతున్న రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఏపీలో కమ్మ, క్రిస్టియన్ వర్గాలకే అధికారం దక్కిందని అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కాకుండా రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందని చెప్పారు. ఇప్పుడున్నవి రెండు కూడా కుటుంబ పార్టీలేనని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ విభజన హామీలు నెరవేర్చకపోయినా, వాటిని అమలు చేయకపోయినా ఇప్పుడున్న రెండు పార్టీలు కేంద్రాన్ని అడగవు అని చెప్పారు.

ఏపీకే ఫైల్, ఓటీపీలు రాలేదు.. క్రెడిట్ కార్డులో రూ.2 లక్షలకు పైగా ఖాళీ.. ఎలా?క్రైమ్Swechaa30 Sep 2026, 12:25 PM

ఏపీకే ఫైల్, ఓటీపీలు రాలేదు.. క్రెడిట్ కార్డులో రూ.2 లక్షలకు పైగా ఖాళీ.. ఎలా?

టెక్నాలజీ వినియోగం పెరగడంతో పనులు సులభంగా, త్వరగా, ఖచ్చితత్వంతో అవుతున్నాయని సంతోషపడలా? లేక కష్టపడి సంపాదించుకుని, దాచుకున్న సొమ్ము దొంగల పాలవుతోందని బాధపడలా? అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి తన వద్దనున్న క్రెడిట్ కార్డుల తనకు తెలియకుండానే రూ.2.59 లక్షలు ఖాళీ అయినట్టు గుర్తించాడు. ఉప్పల్ బేరప్పగడ్డకు చెందిన జి. పిచ్చయ్య రావు (42)కు ఆర్బీఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సెప్టెంబర్ 5న ఈ రెండు క్రెడిట్ కార్డుల నుంచి తనకు తెలియకుండా మూడు అనధికారిక లావాదేవీలు జరిగి మొత్తం రూ.2,59,240 డెబిట్ అయినట్లు గుర్తించాడు. పోలీసులకు అసలు వివరాలు వెల్లడించారు.

Nagarjuna: ‘కింగ్ 100’లో విలన్‌గా అశోక్ సెల్వన్!సినిమాSwechaa30 Sep 2026, 12:25 PM

Nagarjuna: ‘కింగ్ 100’లో విలన్‌గా అశోక్ సెల్వన్!

Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు, కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అందులో ముఖ్యంగా ఆయన నటిస్తున్న ‘కింగ్ 100’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది నాగ్ నటిస్తోన్న వందవ సినిమా కావడం విశేషం. ఈ మైల్ స్టోన్ మూవీకి తమిళ యువ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగార్జునను సరికొత్త యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు మేకర్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో విలన్ పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. కింగ్ 100 లో తమిళ నటుడు విలన్‌గా అశోక్ సెల్వన్ ఎంపికైనట్టుగా సమాచారం.

ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం.. జైశంకర్ హెచ్చరిక వెనుక అసలు కథేంటి?InternationalSwechaa30 Sep 2026, 12:12 PM

ఆహార సంక్షోభం దిశగా ప్రపంచం.. జైశంకర్ హెచ్చరిక వెనుక అసలు కథేంటి?

విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన హెచ్చరిక చర్చనీయాంశంగా మారింది. రాబోయే నెలల్లో ప్రపంచం ఒక పెద్ద ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఇది కేవలం ఒక మాట కాదు. ప్రపంచ ఆహార వ్యవస్థలో ఇప్పటికే పేరుకుపోతున్న అనేక సమస్యలను కలిపి చూస్తే.. ఎంత తీవ్రమైన హెచ్చరికో అర్థమవుతుంది.

అరేబియాలో భారీ ఆపరేషన్.. రూ.3 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనంNationalSwechaa30 Sep 2026, 11:56 AM

అరేబియాలో భారీ ఆపరేషన్.. రూ.3 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం

ఇండియాలోకి సముద్ర మార్గం గుండా డ్రగ్స్ తీసుకురావడానికి ప్రయత్నించిన దుండగులను కోస్ట్ గార్డు బలగాలు పట్టుకున్నాయి.దేశానికి పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉంది.అయితే, భారత్ మీద నిలువెల్లా విషం కక్కే పాకిస్తాన్.. సముద్ర జలాల గుండా, సరిహద్దు బోర్డర్స్ నుంచి మత్తుపదార్థాలను దేశంలోకి పంపుతోంది. ఇక బంగ్లాదేశ్ నుంచి కూడా పెద్దఎత్తున దేశంలోకి మత్తు పదార్థాలు వస్తున్నాయి.మనదేశంలోనే కొందరు వ్యాపారులు, నేతలు కాసులకు కక్కుర్తి పడి వాటిని దేశంలోనికి అనుమతించడంతో యువత మత్తుకు బానిసవుతోంది. ఫలితంగా నేరాలు, దారుణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ భారీ ఆపరేషన్‌ చేపట్టి భారీగా మాదకద్రవ్యాలను పట్టుకుంది. వీటిని తరలిస్తున్న ముఠాను సైతం అదుపులోకి తీసుకుంది. లక్షద్వీప్ దీవులకు సమీపంలోని సముద్ర జలాల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో సుమారు రూ.3 వేల కోట్లు పలికే భారీ డ్రగ్స్ కన్సైన్‌మెంట్‌ను అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు.

గుట్టుగా వివాహం హోటల్‌లో కాపురం.. వీడిన ఓయో మర్డర్ మిస్టరీ!క్రైమ్Swechaa30 Sep 2026, 11:41 AM

గుట్టుగా వివాహం హోటల్‌లో కాపురం.. వీడిన ఓయో మర్డర్ మిస్టరీ!

హైదరాబాద్‌ మహానగరం ఎస్‌ఆర్ నగర్ పరిధిలోని గోకుల్ ప్రైడ్‌‌ హోటల్ (ఓయో)గదిలో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే.హోటల్‌ స్టాఫ్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. వివరాల్లోకివెళితే.. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసమందర్ గ్రామంలో నివాసముండే శిరీష(34)కు 2013లో వివాహం జరిగింది. మనస్పర్థల కారణంగా 2016లో భర్తకు విడాకులు ఇచ్చి, తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఎస్‌బీఐ కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తోంది.ఈ క్రమంలోనే శిరీషకు శ్రీనివాస్(38) అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. కొంతకాలానికి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో గుడిలో శిరీషను పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్.. అయితే,ఏం జరిగిందో తెలీదు ఓయో రూంలో శిరీషను శ్రీనివాస్ హత్యచేసినట్టు పోలీసులు నిర్దారించారు.

సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లు.. పోలీసుల క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తాచ‌ర్య‌లు!తెలంగాణSwechaa30 Sep 2026, 11:17 AM

సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప‌ర్య‌ట‌న‌లు.. పోలీసుల క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తాచ‌ర్య‌లు!

సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి సిరిసిల్ల నియోజకవర్గానికి రానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల, పొరుగు జిల్లా కరీంనగర్‌లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిన క్రమంలో, సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానిక నేతలు, నిరసనకారుల నుంచి ఎదురయ్యే ఆందోళనలను కట్టడి చేసేందుకు రెండు జిల్లాల పరిధిలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా పరంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుమారు 1,600 మంది పోలీసు సిబ్బందిని మోహరించగా, కరీంనగర్ జిల్లా పరిధిలో మరో 550 మంది పోలీసులను బందోబస్తుకు కేటాయించారు.

Chandoo Mondeti: భన్సాలీ నిర్మాణంలో చందు మొండేటి దర్శకుడిగా హిందీ సినిమా!సినిమాSwechaa30 Sep 2026, 11:16 AM

Chandoo Mondeti: భన్సాలీ నిర్మాణంలో చందు మొండేటి దర్శకుడిగా హిందీ సినిమా!

Chandoo Mondeti: తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చందు మొండేటి. ఈ టాలెంట్ డైరెక్టర్ ఇప్పుడు బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నాగ చైతన్యతో ‘తండేల్’ నిఖిల్‌తో ‘కార్తికేయ 2’, వంటి సినిమాలతో తన కథ-రచనా శైలిని ప్రేక్షకులకు పరిచయం చేసిన చందు.. త్వరలోనే హిందీలో ఓ భారీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయనే వార్తలు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

రెండు ఎమ్మెల్సీలు ‘రెడ్ల’కే..ఇది సామాజిక అన్యాయం కాదా? : కవితతెలంగాణSwechaa30 Sep 2026, 11:15 AM

రెండు ఎమ్మెల్సీలు ‘రెడ్ల’కే..ఇది సామాజిక అన్యాయం కాదా? : కవిత

సామాజిక న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అవుతుందని పదే పదే లీడర్లు చెబుతుంటారు. కానీ, తీరా సమయం వచ్చే సరికి ఆ విషయం వారికి గుర్తుకురాదేమో అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు. రాష్ట్రంలో బీసీ కులాలు ఎక్కువ. ఎన్నికలు వచ్చినా, పదవుల పంపకంలో మాత్రం వారికి అన్యాయం జరుగుతోందని ఆ వర్గం ప్రజలు తమ వాయిస్ వినిపిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లోనూ బీసీలకు న్యాయం జరగలేదని ఇటీవల టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సైతం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ విషయంపై స్పందించారు. రెడ్లకే రెండు సీట్లు కేటాయించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు.. రెండు చోట్లా ‘రెడ్డి’ నాయకులకే టికెట్.. ఇది ముమ్మాటికీ సామాజిక అన్యాయం కాదా?’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో సబ్బండ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత అధికార పార్టీపై ఉందని గుర్తుచేశారు. అలా కాకుండా ఒకే వర్గానికి పెద్దపీట వేయడం తెలంగాణ ఆత్మగౌరవానికే విరుద్ధమని ఘాటు విమర్శలు చేశారు.

సాగరహారానికి 14 ఏండ్లు.. స్వరాష్ట్ర కాంక్షకు నిలువెత్తు నిదర్శనం : కేసీఆర్తెలంగాణSwechaa30 Sep 2026, 10:48 AM

సాగరహారానికి 14 ఏండ్లు.. స్వరాష్ట్ర కాంక్షకు నిలువెత్తు నిదర్శనం : కేసీఆర్

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన ఘట్టం 'సాగరహారం'(తెలంగాణ మార్చ్). ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ మహా ప్రదర్శనను చేపట్టారు. ఈ కార్యక్రమం జరిగి నేటితో 14 సంవత్సరాలు పూర్తయింది. ఇది 2012 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ (ట్యాంక్ బండ్), నెక్లెస్ రోడ్డు పరిసరాల్లో పెద్దఎత్తున నిర్వహించారు. ఈ క్రమంలోనే నాటి సాగరహారాన్ని గుర్తుచేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా చాటిచెప్పిన పోరాట రూపం సాగరహారం. ఆంక్షలను, నిర్బంధాలను, ముళ్లకంచెలను, లాఠీచార్జీలను, రబ్బర్ బుల్లెట్లను లెక్క చేయకుండా... తెలంగాణవాదులు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 30, 2012 నాటి సాగరహారం. సబ్బండ వర్గాలు హుస్సేన్ సాగర్ తీరాన చేసిన చారిత్రాత్మక సాగరహారానికి 14 ఏళ్లు నిండిన సందర్భంగా... తెలంగాణ ప్రజలకు ఉద్యమాభివందనాలు’ అని రాసుకొచ్చారు.

TruecallerScam: మహాత్మా గాంధీ' పేరిట వింత కాల్స్.. సైబర్ నిపుణుల హెచ్చరిక!క్రైమ్Swechaa30 Sep 2026, 10:31 AM

TruecallerScam: మహాత్మా గాంధీ' పేరిట వింత కాల్స్.. సైబర్ నిపుణుల హెచ్చరిక!

గాంధీ జయంతి (అక్టోబర్ 2) సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఓ కొత్త రకం సైబర్ ముప్పు ముంచుకొచ్చింది. ప్రజల ఫోన్లకు వచ్చే తెలియని కాల్స్ కాలర్ ఐడీలో ఉన్నట్టుండి 'మహాత్మా గాంధీ' అని పేరు కనిపిస్తుండటంతో పలువురు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. అయితే ఇదే క్యూరియాసిటీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు పన్నిన కొత్త రకం వాయిస్ ఫిషింగ్ ('విషింగ్') మోసమని, వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని భద్రతా నిపుణులు స్పష్టం చేశారు. ట్రూకాలర్ వంటి కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్‌లు క్రౌడ్ సోర్సింగ్ ఆధారంగా పనిచేస్తాయి. ఎక్కువ మంది వినియోగదారులు ఒక ప్రత్యేక నంబర్‌ను ఏ పేరుతో సేవ్ చేసుకుంటారో, అదే పేరును యాప్ ఇతరులకు ప్రదర్శిస్తుంది.

IndVsWi: రెండో వన్డే సమరానికి టీమిండియా సిద్ధం.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు?తెలంగాణSwechaa30 Sep 2026, 10:30 AM

IndVsWi: రెండో వన్డే సమరానికి టీమిండియా సిద్ధం.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు?

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా నేడు గౌహతిలోని బర్సపార స్టేడియం వేదికగా రెండో వన్డే జరగనుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో ఆల్రౌండ్ ప్రదర్శనతో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా, ప్రస్తుతం సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. నేటి మ్యాచ్‌లోనూ విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉండగా, సిరీస్‌లో నిలవాలంటే విండీస్‌కు ఇది 'డూ ఆర్ డై' మ్యాచ్‌గా మారింది. టీమిండియా టాప్ ఆర్డర్ ప్రస్తుత ఫామ్ జట్టుకు అతిపెద్ద బలంగా మారింది.

Suryapet: ముదిరిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వివాదం.. లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం!!..తెలంగాణSwechaa30 Sep 2026, 09:55 AM

Suryapet: ముదిరిన డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల వివాదం.. లబ్ధిదారుల ఎంపికపై గ్రామస్తుల ఆగ్రహం!!..

సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామంలో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కేటాయింపు కోసం చేపట్టిన డ్రా ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. 58 ఇళ్లను లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. అర్హుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.

మద్దిరాల గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన 58 డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కోసం రెండేళ్ల క్రితం దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఇళ్ల కోసం 500 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. 300 మందికి పైగా అర్హులుగా గుర్తించినట్లు సమాచారం. అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉండటంతో.. ఈలోగా కొంతమంది దరఖాస్తుదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి.

చెత్తే కదా అని తేలికగా తీసిపడేయద్దు.. కాసులు కురిపిస్తుంది!తెలంగాణSwechaa30 Sep 2026, 09:54 AM

చెత్తే కదా అని తేలికగా తీసిపడేయద్దు.. కాసులు కురిపిస్తుంది!

రాష్ట్రంలో వినాయక చవితి వేడుకలు ముగిశాయి. నవరాత్రులు పూర్తయ్యాక గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. అయితే, చెరువులు, కెనాల్స్, హుస్సేన్ సాగర్‌లో భారీ గణనాథుల వ్యర్థ్యాలు (ఐరన్ మెటీరియల్)పెద్దఎత్తున బయటకు తీశారు. వాటిని అలాగే అక్కడే వదిలేశారు.రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పట్టణాల శుద్ధి, జలాల శుద్ధికి రూ. కోట్లు వెచ్చిస్తోంది. కానీ, వ్యర్థాల రూపంలో ఉన్న ఐరన్ మెటీరియల్స్‌ను రీ సైక్లింగ్, రీ యూజ్ విషయంలో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఈ ఐరన్ వ్యర్థాలు పక్కదారి పడుతున్నాయి. వీటి విలువ సైతం రూ. కోట్లు పలుకుతోందని సమాచారం. కాగా, విగ్రహాల వ్యర్థాల తొలగింపు బాధ్యత మాది కాదంటూ జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఫలితంగా ఏడేళ్లుగా రూ.కోట్ల విలువైన స్క్రాప్ ప్రైవేటు వ్యక్తుల పరం అవుతోంది.

AsianGames2026: చైనాను చిత్తు చేసి.. మ‌రో స్వ‌ర్ణం కైవ‌సం చేసుకున్న భార‌త్‌!క్రీడలుSwechaa30 Sep 2026, 09:44 AM

AsianGames2026: చైనాను చిత్తు చేసి.. మ‌రో స్వ‌ర్ణం కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు త‌మ స‌త్తా చాటారు. చైనాపై మొద‌టి నుంచి అద్భుత‌మైన ప్ర‌తిభ‌ను కొనసాగిస్తూ దేశానికి మరో చిరస్మరణీయ స్వర్ణ పతకాన్ని అందించారు. బుధవారం నిర్వహించిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ ఫైనల్ టీమ్ ఈవెంట్‌లో భారత త్రయం సంచలన ప్రదర్శనతో చైనా జట్టును మట్టికరిపించి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన భారత క్రీడాకారిణులు, ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆది నుంచి పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించి విజేతలుగా నిలిచారు. ఈ చారిత్రాత్మక విజయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ, తెలంగాణకు చెందిన తనిపర్తి చికిత, మహారాష్ట్రకు చెందిన ప్రీతిక ప్రదీప్ అద్భుతమైన సమన్వయంతో విల్లు గురిపెట్టారు.

Telangana: ACBకి షాక్‌.. ప్రాసిక్యూషన్‌ అనుమతి లేక 20 కేసులు క్లోజ్‌!!తెలంగాణSwechaa30 Sep 2026, 09:30 AM

Telangana: ACBకి షాక్‌.. ప్రాసిక్యూషన్‌ అనుమతి లేక 20 కేసులు క్లోజ్‌!!

అవినీతి నిరోధక శాఖ (ACB) నమోదు చేసిన కేసుల్లో కనీసం 20 ఎఫ్‌ఐఆర్‌లు మూసివేయబడ్డాయి. 2021 నుంచి నమోదైన ఈ కేసుల్లో నిందితులపై క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో.. క్రిమినల్‌ విచారణకు బదులుగా శాఖాపరమైన చర్యలు, విచారణలు, దర్యాప్తులకు సంబంధిత విభాగాలు మొగ్గుచూపినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. మూసివేసిన కేసుల్లో కనీసం ఐదు లంచం తీసుకుంటూ పట్టుబడిన ట్రాప్‌ కేసులు ఉండటం గమనార్హం.