స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Revanth vs KTR: సీఎం తొలి సిరిసిల్ల పర్యటనపై ఉత్కంఠ.. కేటీఆర్ బహిరంగ లేఖతో రాజ‌కీయ దుమారం!తెలంగాణSwechaa30 Sep 2026, 09:20 AM

Revanth vs KTR: సీఎం తొలి సిరిసిల్ల పర్యటనపై ఉత్కంఠ.. కేటీఆర్ బహిరంగ లేఖతో రాజ‌కీయ దుమారం!

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనకు వెళ్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీకి అత్యంత బలమైన కంచుకోటగా భావించే సిరిసిల్ల నియోజకవర్గంలో సీఎం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా సిరిసిల్ల ప‌ట్ట‌ణంతో పాటు పరిసర ప్రాంతాల్లో సుమారు రూ.345 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి సంక్షేమ పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన కేవలం అభివృద్ధి పనులకే పరిమితం కాకుండా, రాజకీయ ప‌రంగా పాగా వేసేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం.. తెలంగాణ‌లో 48.88లక్షల మంది అర్హత పొందినట్లు ప్రకటన!తెలంగాణSwechaa30 Sep 2026, 09:02 AM

ఓటర్ల జాబితా సవరణ వేగవంతం.. తెలంగాణ‌లో 48.88లక్షల మంది అర్హత పొందినట్లు ప్రకటన!

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఎస్‌ఆర్) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగవంతంగా సాగుతోందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. సవరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు నిర్వహించిన పరిశీలనల ఆధారంగా మొత్తం 48,88,076 మంది పౌరులను తుది ఓటర్ల జాబితాలో చేర్చేందుకు అర్హులుగా గుర్తించినట్లు మంగళవారం ఆయన అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. జాబితాలో పొరపాట్లు, సాంకేతిక లోపాలను సరిదిద్దేందుకు మొత్తం 92.88 లక్షల నోటీసులు సిద్ధం చేయగా, అందులో 88.52 లక్షలకు పైగా నోటీసులను ఇప్పటికే ఓటర్లకు అందించినట్లు సీఈఓ వివరించారు.

KalkiBhagawanPassedAway: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ క‌న్నుమూత‌!SpiritualitySwechaa30 Sep 2026, 08:49 AM

KalkiBhagawanPassedAway: ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ క‌న్నుమూత‌!

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఒనెనెస్ (ఏకం) ఉద్యమ స్థాపకుడైన కల్కి భగవాన్(77) కన్నుమూశారు. గత పది రోజులుగా చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్ప‌త్రిలో వ‌యోభారం, తీవ్ర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తుదిశ్వాస విడిచిన‌ట్లు ట్రస్టు వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఆయన అసలు పేరు విజయ్ కుమార్ నాయుడు. కల్కి భగవాన్ మరణ వార్త తెలియగానే దేశ విదేశాల్లో ఉన్న ఆయన లక్షలాది మంది భక్తులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని బుధవారం ఉదయం 11గంటలకు తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలంలోని బత్తులవల్లంలో ఉన్న ప్రసిద్ధ ఏకం క్షేత్రానికి (గోల్డెన్ సిటీ) తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Telangana By-elections: తెలంగాణ సెమీ ఫైనల్స్.. బరి గీసిన రేవంత్ రెడ్డి!..తెలంగాణSwechaa30 Sep 2026, 08:34 AM

Telangana By-elections: తెలంగాణ సెమీ ఫైనల్స్.. బరి గీసిన రేవంత్ రెడ్డి!..

ఎల్ నినోతో వేడి ముందే పుట్టుకొచ్చినట్లు, తెలంగాణలో కావాలనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి. యథావిధిగా జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్గి పుట్టించింది. ఒక సీట్ బీసీలకు, మరొక స్థానం ఓసీలకు అంటూ ప్రచారం జరిగినా, చివరికి నమ్మిన కాంగ్రెస్ కార్యకర్తలకే సీట్లు ఇచ్చింది. ఒకే పార్టీలో ఉండి కట్టుబడి పని చేసిన వారికి సీట్లు ఇస్తామనే సంకేతాలు ఇచ్చింది. అయితే బీసీ డిక్లరేషన్ పెట్టి అన్నింట్లో బీసీలకు వాటాలు పెంచుతామని చెప్పిన అధిష్టానం, ఇక్కడ రాజకీయంగా పోటీలో బీసీకి టికెట్ ఇవ్వడంలో వెనుకడుగు వేసిందనే విమర్శలు తావిస్తున్నాయి.

Telangana: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్ రెడీ..రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారు!..తెలంగాణSwechaa30 Sep 2026, 08:07 AM

Telangana: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరుకు కాంగ్రెస్ రెడీ..రెండు స్థానాలకు అభ్యర్థులు ఖరారు!..

రాష్ట్రంలో జరగబోయే రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో పోటీ చేయనున్న అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, నల్గొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిలను రంగంలోకి దింపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో వీరిద్దరినీ ఎంపిక చేసినట్లు పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ఛార్జి కేసీ వేణుగోపాల్‌ మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

National Politics: పార్టీలకు తప్పని అసమ్మతి సెగ.. రాష్ట్రాలు దాటుతున్న వివాదం!!..రాజకీయాలుSwechaa30 Sep 2026, 07:43 AM

National Politics: పార్టీలకు తప్పని అసమ్మతి సెగ.. రాష్ట్రాలు దాటుతున్న వివాదం!!..

ఒక పార్టీ టికెట్‌పై గెలిచి.. ఆ పార్టీని వీడి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం ఇప్పుడు ఒక్క తెలంగాణకే పరిమితమైన అంశంగా కనిపించడం లేదు. తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లిన వివాదం.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో పది మంది టీఎంసీ ఎమ్మెల్యేల వ్యవహారంతో మరోసారి జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది.

ఒక పార్టీ తరఫున ప్రజల తీర్పుతో అసెంబ్లీలోకి వచ్చిన సభ్యుడు.. మధ్యలో పార్టీ మారితే ఆ ఎమ్మెల్యే పదవి కొనసాగాలా? లేక ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కొత్తగా ప్రజల ముందుకే వెళ్లాలా? అనే ప్రశ్న మరోసారి న్యాయస్థానం ముందుకొచ్చింది. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి తర్వాత కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిన ఎమ్మెల్యేల వ్యవహారం దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.

Health: పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్‌.. ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!..HealthSwechaa30 Sep 2026, 07:36 AM

Health: పెయిన్ కిల్లర్, యాంటీబయాటిక్‌.. ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!..

తలనొప్పి వచ్చింది.. ఒళ్లు నొప్పిగా ఉందని తరచుగా పెయిన్ కిల్లర్ వేసుకోవడం. జలుబు, గొంతునొప్పి వచ్చిందంటే డాక్టర్‌ను సంప్రదించకుండానే యాంటీబయాటిక్ మొదలుపెట్టడం. చాలమందిలో సాధారణంగా కనిపించే ఈ అలవాట్లపై కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ CDSCO హెచ్చరిక జారీ చేసింది. పెయిన్ కిల్లర్లు, ముఖ్యంగా NSAIDsను అవసరం లేకుండా పదేపదే లేదా ఎక్కువకాలం తీసుకోవడం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందని CDSCO స్పష్టం చేసింది. ఈ మందుల్లో కొన్ని కిడ్నీలకు వెళ్లే రక్తప్రవాహాన్ని తగ్గించగలవు. దీంతో కిడ్నీల పనితీరుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కిడ్నీ సమస్యలు ఉన్నవారు, డీహైడ్రేషన్‌తో ఉన్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు లేదా కిడ్నీలను ప్రభావితం చేసే ఇతర మందులు వాడుతున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Health: హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గాలంటే.. డైట్‌లో ఇవి తప్పనిసరి!..HealthSwechaa30 Sep 2026, 07:28 AM

Health: హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గాలంటే.. డైట్‌లో ఇవి తప్పనిసరి!..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మందులకంటే ముందుగా మన రోజువారీ ఆహార అలవాట్లు, జీవనశైలిపై దృష్టి పెట్టాలి. గుండె కేవలం రక్తాన్ని పంప్ చేసే అవయవం మాత్రమే కాదు.. శరీరంలోని ప్రతి భాగానికి ఆక్సిజన్ అందించే కీలకమైన అవయవం. అందుకే గుండెను కాపాడుకోవడం అంటే మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే.

చిన్న వయసులోనే గుండె జబ్బులు కనిపించడానికి అధిక బరువు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ధూమపానం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అధిక ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

Spirituality: దేహమేరా దేవాలయం అని చెప్పడంలో అర్థం ఏమిటి?..SpiritualitySwechaa30 Sep 2026, 07:18 AM

Spirituality: దేహమేరా దేవాలయం అని చెప్పడంలో అర్థం ఏమిటి?..

మన సనాతన ధర్మం ఈ దేహం వెనుక ఉన్న ప్రాణశక్తిని, చైతన్యాన్ని, ఆత్మతత్త్వాన్ని గుర్తించమని చెబుతుంది. అందుకే మనిషి శరీరాన్ని సాధారణమైన భౌతిక రూపంగా కాకుండా, దైవతత్వాన్ని అనుభవించడానికి లభించిన పవిత్ర సాధనంగా ఈ జన్మను సనాతన సంప్రదాయం భావించింది.

ఈ భావంతో మన శరీరాన్ని కూడా భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయం ఒక పవిత్ర క్షేత్రంగా చూసింది. అందుకే "దేహో దేవాలయః ప్రోక్తః.. జీవో దేవః సనాతనః" అనే భావన మన సంప్రదాయంలో కనిపిస్తుంది. అంటే ఈ దేహమే దేవాలయం... ఇందులో ఉన్న జీవచైతన్యమే సనాతనమైన దైవస్వరూపం.

Spirituality: మనిషి మరణించిన తర్వాత తల దగ్గర దీపం ఎందుకు పెడతారు?SpiritualitySwechaa30 Sep 2026, 07:09 AM

Spirituality: మనిషి మరణించిన తర్వాత తల దగ్గర దీపం ఎందుకు పెడతారు?

మనిషి ప్రాణం విడిచిన తర్వాత ఇంట్లో ఒక దీపం వెలిగించడం... తరతరాలుగా వస్తున్న సనాతన సంప్రదాయం. చాలామందికి అది ఒక ఆచారంగా మాత్రమే తెలుసు. కానీ గరుడ పురాణంలో మరణానంతరం జీవుడి ప్రయాణాన్ని వర్ణించినప్పుడు... దీపానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం కనిపిస్తుంది. మరణంతో స్థూల దేహం మాత్రమే విడిచిపోతుంది. జీవుడి తదుపరి గతి అతని కర్మలను అనుసరించి సాగుతుందని గరుడ పురాణం వివరిస్తుంది. ఈ ప్రయాణాన్ని ప్రేత ఖండంలో మహావిష్ణువు గరుత్మంతుడికి వివరించినట్లు పురాణ సంప్రదాయం చెబుతుంది. మరణించిన జీవుడు యమమార్గంలో ప్రయాణించాల్సి ఉంటుందని... ఆ మార్గం సులభమైనది కాదని గరుడ పురాణం వర్ణిస్తుంది.

Spirituality:  మనిషిని బంధించే అసలైన సంకెళ్లు ఏవో తెలుసా?..SpiritualitySwechaa30 Sep 2026, 07:03 AM

Spirituality: మనిషిని బంధించే అసలైన సంకెళ్లు ఏవో తెలుసా?..

మనిషి చేతులకు వేసే సంకెళ్లు కనిపిస్తాయి. వాటిని తెంచుకోవడానికి మార్గం కూడా కనిపిస్తుంది. కానీ మనిషిని జీవితాంతం బంధించే కొన్ని సంకెళ్లు మాత్రం కంటికి కనిపించవు. అవే కోరికలు, మమకారం, అహంకారం, ఇష్టాయిష్టాలు. వేదాంత దృష్టిలో వీటన్నింటికీ మూలకారణం అవిద్య.. అంటే మన అసలైన స్వరూపాన్ని మనమే మరచిపోవడం.

సనాతన ధర్మ తత్వం ప్రకారం జీవుడి అసలు స్వరూపం శాశ్వతమైన ఆత్మ. శరీరం మారుతుంది, పరిస్థితులు మారతాయి, సంబంధాలు మారతాయి. కానీ ఆత్మ నిత్యమైనదని ఉపనిషత్తులు బోధిస్తాయి. అయితే మనిషి తనను తాను శరీరంతోనే గుర్తించుకోవడం మొదలుపెట్టినప్పుడు బంధం మొదలవుతుంది. నేను ఈ శరీరం, ఇది నాది, నాకు ఇది కావాలి, అది నాకు వద్దు అనే భావనలు క్రమంగా మనసుపై పట్టు సాధిస్తాయి.

AI కాదు.. SI.. ట్రంప్ నోట సూపర్ ఇంటలిజెన్స్ మాటInternationalSwechaa29 Sep 2026, 11:46 PM

AI కాదు.. SI.. ట్రంప్ నోట సూపర్ ఇంటలిజెన్స్ మాట

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ AI పేరునే మార్చాలని అంటున్నారు. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదానికి బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ అనే పేరును ఉపయోగించాలన్న తన ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణాలేంటి..?

ఢిల్లీలో ఇండి కూటమి పవర్ షోకు అంతారెడీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఉద్యమం!NationalSwechaa29 Sep 2026, 11:11 PM

ఢిల్లీలో ఇండి కూటమి పవర్ షోకు అంతారెడీ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం ఉద్యమం!

ఎన్నికల సంఘంపై పోరాటం.. ఇప్పుడు క్రమంగా విపక్షాల ఉమ్మడి రాజకీయ పోరాటంగా మారుతున్న దృశ్యం కనిపిస్తోంది. ఇండి కూటమి సమావేశంలో ఉమ్మడి కార్యాచరణ ఖరారైతే.. ఈ వివాదం మరింత పెద్ద రాజకీయ ఉద్యమంగా మారే అవకాశం ఉంటుంది.

Mythri Ravi Shankar: డ్రాగన్ చెప్పిన డేట్ కే వస్తాడు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!సినిమాSwechaa29 Sep 2026, 10:00 PM

Mythri Ravi Shankar: డ్రాగన్ చెప్పిన డేట్ కే వస్తాడు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత!

Mythri Ravi Shankar: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డ్రాగన్’. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు, సినీ లవర్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీతో విధ్వంసం క్రియేట్ చేయడం గ్యారెంటీ అనేలా ఈ సినిమా రూపొందుతోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఎన్టీఆర్ హిట్ కొట్టలేకపోయాడు.

అక్టోబర్ 21లోగా.. రేవంత్ సర్కార్‌కు బీజేపీ ఎమ్మెల్యే డెడ్‌లైన్..తెలంగాణSwechaa29 Sep 2026, 09:24 PM

అక్టోబర్ 21లోగా.. రేవంత్ సర్కార్‌కు బీజేపీ ఎమ్మెల్యే డెడ్‌లైన్..

Payal Shankar: ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ రైతాంగం సంక్షోభంలో కూరుకుపోయిందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని రైతులను ఆదుకునే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు. ఇందుకు గాను అక్టోబర్ 21 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన డెడ్ లైన్ విధించారు. వచ్చే నెల 21వ తేదీ లోపు తెలంగాణలో ప్రధానమంత్రి పంటల బీమా అమలు చేయకపోతే 22వ తేదీ నుంచి బీజేపీ కిసాన్ మోర్చా నేతృత్వంలో ఆదిలాబాద్ కేంద్రంగా రైతు భరోసా యాత్ర చేపడతామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. ఆదిలాబాద్ నుంచి రైతులతో కలిసి యాత్రగా వచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు.

Ranabaali: సెట్స్ నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్-రష్మిక!సినిమాSwechaa29 Sep 2026, 09:03 PM

Ranabaali: సెట్స్ నుంచే ప్రమోషన్స్ మొదలుపెట్టిన విజయ్-రష్మిక!

Ranabaali: టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆసక్తిని పెంచుతున్న సినిమాల్లో ‘రణబాలి’ కూడా ఒకటి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ఈ సినిమా షూటింగ్ దశలోనే ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది చిత్రబృందం. ఇక, విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ప్రారంభించారు. రణబాలి సినిమా కోసం వేసిన భారీ సెట్స్ నుంచే సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేస్తున్నారు.

గద్వాల మున్సిపాలిటీలో ముగ్గురు ఉద్యోగులపై వేటుతెలంగాణSwechaa29 Sep 2026, 08:47 PM

గద్వాల మున్సిపాలిటీలో ముగ్గురు ఉద్యోగులపై వేటు

Gadwal: గద్వాల మున్సిపాలిటీలో మున్సిపల్‌ షాపుల అద్దెల రూపంలో వసూలైన రూ.11.28 లక్షలను ఖాతాలో జమ చేయకపోవడం, నిధుల దుర్వినియోగం, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగితో అద్దె వసూళ్లు చేయించిన వ్యవహారంలో ముగ్గురు ఉద్యోగులపై సస్పెన్షన్‌ వేటు పడింది. జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ ఆదేశాల మేరకు ఆర్వో రాజేష్ కుమార్, సీనియర్‌ అసిస్టెంట్‌/ఇంచార్జ్‌ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ రాజవర్ధన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌/ ఇంచార్జ్‌ ష్రాఫ్ రాజవర్ధన్‌ నాయుడులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Chiranjeevi: టాక్ షో కోసం మెగాస్టార్‌కి 200 కోట్ల రెమ్యునరేషన్?సినిమాSwechaa29 Sep 2026, 08:28 PM

Chiranjeevi: టాక్ షో కోసం మెగాస్టార్‌కి 200 కోట్ల రెమ్యునరేషన్?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి సంబందించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డిజిటల్ రంగంలోకి హోస్ట్‌గా అడుగుపెట్టబోతున్నారని గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు, ఈ టాక్ షో కోసం చిరంజీవికి ఏకంగా 200 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.

CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక తీర్మానాలుNationalSwechaa29 Sep 2026, 08:07 PM

CWC: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక తీర్మానాలు

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) విషయంలో ఎన్నికల సంఘంలో అభిప్రాయభేదాలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష తీరు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం 5 కీలక తీర్మానాలు చేసింది.

ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా వెంటనే చేయాలని సీడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. తక్షణమే సర్ ప్రక్రియను నిలిపివేయాలని తీర్మానం చేసింది. తొలగించిన 13 కోట్ల 30 లక్షల పేర్లను ఓటర్ల జాబితాలో పునరుద్ధరించాలంది. ఓటర్ల జాబితాలో చేపట్టే మార్పుల డేటాను తక్షణమే బహిరంగపరచాలంది. ఎన్నికల్లో అక్రమాలు వెలుగుచూసిన చోట స్వతంత్ర విచారణకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల వ్యవస్థను కాపాడుకునేందుకు పార్లమెంటు, కోర్టులు, ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామని ప్రకటించింది.

Trivikram: ఎన్టీఆర్ మూవీపై ఇట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్!సినిమాSwechaa29 Sep 2026, 07:13 PM

Trivikram: ఎన్టీఆర్ మూవీపై ఇట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్!

Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనుంది. వీరి కాంబినేషన్‌లో సెట్స్ పైకి రాబోయో ఈ సినిమాను త్వరలోనే పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి, ఈ సినిమాకి ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఇక, ఈ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ స్వయంగా తాజాగా కీలకమైన అప్డేట్ ఇచ్చారు.

Dharman: మైసూర్ షెడ్యూల్‌లో రజినీ-రామ్-రాశీ!సినిమాSwechaa29 Sep 2026, 06:43 PM

Dharman: మైసూర్ షెడ్యూల్‌లో రజినీ-రామ్-రాశీ!

Dharman: సూపర్‌స్టార్ రజినీకాంత్, యంగ్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ధర్మన్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో శరవేగంగా జరుగుతుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ముందు నుంచి వార్తలు వచ్చినట్టుగానే మన టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇందులో విలన్‌గా నటిస్తున్న విషయం కన్‌ఫర్మ్ అయింది.

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం..క్రైమ్Swechaa29 Sep 2026, 06:29 PM

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం..

Bollaram: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ హవల్దార్ మల్లేష్‌కు మరో ఇద్దరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాగారం ఇంచార్జ్‌లుగా ఉన్న వినోద్, శేషు.. ఆయుధాల చోరీలో మల్లేష్‌కు సహకరించినట్లు విచారణలో తేలింది. అంతేకాదు మల్లేష్‌తో వారికి భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలుసుకున్నారు. దీంతో వెపన్స్‌ గోడౌన్‌ కీపర్లు వినోద్‌, శేషులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తిరుపతిలో ఘోర ప్రమాదం.. భారీ క్రేన్ పడి ముగ్గురు మృతిక్రైమ్Swechaa29 Sep 2026, 06:03 PM

తిరుపతిలో ఘోర ప్రమాదం.. భారీ క్రేన్ పడి ముగ్గురు మృతి

Tirupati: తిరుపతిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. భవన నిర్మాణ పనుల్లో భారీ క్రేన్ బోల్తా పడింది. స్పాట్ లోనే ముగ్గురు చనిపోయారు. ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం కోసం పునాదులు తీస్తుండగా ఈ ఘోరం జరిగింది. డీబీఆర్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సమీపంలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనుల్లో ఉపయోగించేందుకు భారీ క్రేన్ తెచ్చారు. ఆ క్రేన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగి బోల్తా పడింది. ఈ క్రమంలో పునాదుల దగ్గర పని చేస్తున్న ముగ్గురు వ్యక్తులు క్రేన్ కింద చిక్కుకుని చనిపోయారు.

Rawindra Pulle: అప్పుడే నా మైసా(రష్మిక) దొరికింది!సినిమాSwechaa29 Sep 2026, 05:03 PM

Rawindra Pulle: అప్పుడే నా మైసా(రష్మిక) దొరికింది!

Rawindra Pulle: టాలీవుడ్‌లోనే కాదు.. పాన్ ఇండియా స్థాయిలోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు మరో డిఫరెంట్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రష్మిక ప్రధాన పాత్రలో దర్శకుడు రవీంద్ర పుల్లె తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మైసా’. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నోరు జారితే ఊరుకునేది లేదు.. ఆడవాళ్లతో కొట్టిస్తాతెలంగాణSwechaa29 Sep 2026, 04:47 PM

నోరు జారితే ఊరుకునేది లేదు.. ఆడవాళ్లతో కొట్టిస్తా

Konda Surekha: మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయారు. తనను, తన వర్గాన్ని విమర్శించే రాజకీయ ప్రత్యర్థులకు మాస్ వార్నింగ్ ఇచ్చారామె. మా జోలికి రావొద్దు.. జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోకపోతే మహిళలతో కొట్టిస్తామని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. మంగళవారం వరంగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడారు.

ఓయోలో యువతి అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?క్రైమ్Swechaa29 Sep 2026, 03:32 PM

ఓయోలో యువతి అనుమానాస్పద మృతి.. హత్యా? ఆత్మహత్యా?

ఓయో హోటల్లో ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో గల గోకుల్ ప్రైడ్‌ హోటల్ గదిలో విగతజీవిగా కనిపించింది. అంతకుముందు సీ గణేశ్ పేరుతో గోకుల్ ప్రైడ్‌లో యువతి, యువకుడు రూమ్ నం.103 తీసుకున్నట్టు హోటల్ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, తెల్లారేసరికి యువతి అనుమానాస్పద మృతి చెందగా.. యువకుడు కనిపించలేదు. అయితే, ఆ రాత్రి ఏం జరిగింది? ఆ యువకుడే యువతిని హత్యచేశాడా? అనంతరం అక్కడి నుంచి పరార్ అయ్యాడా? అనేది తెలియాల్సి ఉంది.ఉదయం హోటల్ సిబ్బంది వెళ్లే సరికి గది తలుపులు తెరిచి ఉండటం, అందులో యువతి విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఆధార్ కార్డులో యువతి పేరు ‘దుర్గ’అని ఉందని గుర్తించారు.

Aadarsha Kutumbam: వెంకీ-త్రివిక్రమ్-శ్రీనిధిల స్పెషల్ ఇంటర్వ్యూస్ మొదలు..సినిమాSwechaa29 Sep 2026, 03:15 PM

Aadarsha Kutumbam: వెంకీ-త్రివిక్రమ్-శ్రీనిధిల స్పెషల్ ఇంటర్వ్యూస్ మొదలు..

Aadarsha Kutumbam: మన టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. కుటుంబ కథాంశానికి తనదైన కామెడీ, ఎమోషన్‌ను జోడించి చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా, ఈ మూవీ ప్రమోషన్స్‌ను మరింత వేగవంతం చేసే పనిలో మేకర్స్ బిజీ అయ్యారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వెంకీ–త్రివిక్రమ్–శ్రీనిధి స్పెషల్ ఇంటర్వ్యూస్ మొదలు పెట్టారు.

కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా రేవంత్ రెడ్డి : హరీశ్ రావుతెలంగాణSwechaa29 Sep 2026, 03:05 PM

కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా రేవంత్ రెడ్డి : హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం పాలనపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దలను వదిలేసి పేదల ఇళ్లు, భూముల మీద సీఎం రేవంత్ రెడ్డి పడుతున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. కొడంగల్‌లో ఇండ్లు కోల్పోయిన బాధితుల పక్షాన హరీశ్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొడంగల్ బిడ్డను అంటూ కొడంగల్ ప్రజల ఇళ్లనే కూల్చేస్తావా రేవంత్ రెడ్డి? అని నిలదీశారు. మద్దూరులో రాత్రికి రాత్రే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను నడిపించే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? అంటూ మండిపడ్డారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఇంత కర్కశంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అని అడిగారు. ‘న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా గౌరవించరా?ఒక్కసారిగా ఇండ్లు కూల్చితే, ఏండ్ల నుండి నివాసం ఉన్నవారు ఒక్కసారిగా ఎక్కడికి వెళ్తారు’ అని నిలదీశారు.

Pooja Hegde: ఐటమ్ సాంగ్స్‌లో కూడా నో ఛాన్స్!సినిమాSwechaa29 Sep 2026, 02:59 PM

Pooja Hegde: ఐటమ్ సాంగ్స్‌లో కూడా నో ఛాన్స్!

Pooja Hegde: ఒకప్పుడు టాలీవుడ్‌లో ‘గోల్డెన్ లెగ్’ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన బ్యూటీ పూజా హెగ్డే. ఇప్పుడు వరుసగా సినిమాలు, స్పెషల్ అప్పియరెన్స్‌ల విషయంలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారా? ఇదే ఇప్పుడు అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన సమయంలో.. కనీసం స్పెషల్ సాంగ్స్ ద్వారా అయినా మళ్లీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవుతారని భావించిన అభిమానులకు తాజా పరిణామాలు కొంత నిరాశ కలిగిస్తున్నాయి.

రేవంత్.. సోనియా చెప్పారని ప్రజలను విడగొట్టొద్దు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతెలంగాణSwechaa29 Sep 2026, 02:55 PM

రేవంత్.. సోనియా చెప్పారని ప్రజలను విడగొట్టొద్దు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

‘పేదోళ్ల దేవుడు శివుడు.. ఉన్నోళ్ల దేవుడు రాముడు’ అందుకే బీజేపీ వాల్లు పదే పదే జై శ్రీరాం అంటారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా మీట్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాము పేదల వైపు ఉంటే బీజేపీ సంపన్నుల వైపు ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ‘సైమన్ గో బ్యాక్’ అని నినదించి దేశమంతా ఏకమైనట్టు ఇప్పుడు ‘ఎస్‌ఐఆర్’​ గోబ్యాక్ అని నినదిస్తూ దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు.తాము హరహర మహాదేవ్ అని అంటే బీజేపీకి నచ్చడంలేదని, వారు జై శ్రీరామ్ అనడానికే మొగ్గు చూపుతున్నారన్నారు. శివుడు పేదల దేవుడు,రాముడు ధనికుల దేవుడు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి ప్రజలను విడగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని మంచి డాక్టర్‌కు చూపించాలని సెటైర్లు వేశారు. సౌత్, నార్త్ అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.