స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

రేవంత్.. సోనియా చెప్పారని ప్రజలను విడగొట్టొద్దు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావుతెలంగాణSwechaa29 Sep 2026, 02:55 PM

రేవంత్.. సోనియా చెప్పారని ప్రజలను విడగొట్టొద్దు : బీజేపీ చీఫ్ రాంచందర్ రావు

‘పేదోళ్ల దేవుడు శివుడు.. ఉన్నోళ్ల దేవుడు రాముడు’ అందుకే బీజేపీ వాల్లు పదే పదే జై శ్రీరాం అంటారని సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా మీట్‌లో మాట్లాడిన విషయం తెలిసిందే. తాము పేదల వైపు ఉంటే బీజేపీ సంపన్నుల వైపు ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ‘సైమన్ గో బ్యాక్’ అని నినదించి దేశమంతా ఏకమైనట్టు ఇప్పుడు ‘ఎస్‌ఐఆర్’​ గోబ్యాక్ అని నినదిస్తూ దేశమంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందన్నారు.తాము హరహర మహాదేవ్ అని అంటే బీజేపీకి నచ్చడంలేదని, వారు జై శ్రీరామ్ అనడానికే మొగ్గు చూపుతున్నారన్నారు. శివుడు పేదల దేవుడు,రాముడు ధనికుల దేవుడు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు కౌంటర్ ఇచ్చారు. సోనియా గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి ప్రజలను విడగొట్టే మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని మంచి డాక్టర్‌కు చూపించాలని సెటైర్లు వేశారు. సౌత్, నార్త్ అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samantha: ప్రగ్నెంట్ అయినా..ఈ రెండు విషయాల్లో అస్సలు తగ్గని సమంత!సినిమాSwechaa29 Sep 2026, 02:27 PM

Samantha: ప్రగ్నెంట్ అయినా..ఈ రెండు విషయాల్లో అస్సలు తగ్గని సమంత!

Samantha: సమంత పేరు చెప్పగానే గుర్తొచ్చేవి ఆమె నటించిన సినిమాలు, వెబ్ సిరీస్, టాక్ షోస్ మాత్రమే కాదు.. ఫిట్‌నెస్, స్టైల్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తీరు కూడా. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల వచ్చిన మా ఇంటి బంగారం సినిమా ప్రమోషన్స్‌లో స్వయంగా సమంత గర్భంతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది.

RationCardUpdate: రేష‌న్ ల‌బ్ధిదారుల‌కు అల‌ర్ట్‌.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!తెలంగాణSwechaa29 Sep 2026, 02:27 PM

RationCardUpdate: రేష‌న్ ల‌బ్ధిదారుల‌కు అల‌ర్ట్‌.. అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు!

దేశవ్యాప్తంగా ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రేషన్ వ్యవస్థలోని నకిలీ, డూప్లికేట్, ఇన్-యాక్టివ్ ఉన్న లబ్ధిదారులను గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం ప్రక్షాళన చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని దాదాపు 1.58 (15.8 మిలియన్లు) మంది లబ్ధిదారుల రేషన్ కేటాయింపులను అక్టోబర్ 1, 2026 నుంచి తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది.

నీలాగా విషనాగుల మాటలు వినను..  కేటీఆర్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్తెలంగాణSwechaa29 Sep 2026, 02:14 PM

నీలాగా విషనాగుల మాటలు వినను.. కేటీఆర్‌కు కవిత స్ట్రాంగ్ కౌంటర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కవిత ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?’ అని ప్రశ్నించారు. ‘మీరు మీ పార్టీ అధినేత కేసీఆర్‌ను విమర్శించడం.. ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?.. మీ ఫామ్‌హౌస్‌లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?’ అని నిలదీశారు.

The Paradise: హెవీ డ్రాప్స్..బ్రేకీవెన్ చాలా కష్టమా?సినిమాSwechaa29 Sep 2026, 02:09 PM

The Paradise: హెవీ డ్రాప్స్..బ్రేకీవెన్ చాలా కష్టమా?

The Paradise: నేచురల్ స్టార్ నాని నటించిన ‘ది ప్యారడైజ్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో నాని చేసిన సినిమా కావడంతో మొదటి నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, సినిమాపై ఎంతటి హైప్ ఉందో.. అదే స్థాయిలో బిజినెస్ కూడా జరిగింది. అయితే, సినిమా రిలీజైయ్యాక మాత్రం డివైడ్ టాక్ వచ్చింది. దీంతో ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? దాన్ని అందుకోవడం అంత ఈజీనా? అనే చర్చ మొదలైంది.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. తులంపై రూ. 4,000కు పైగా తగ్గుదల!వ్యాపారంSwechaa29 Sep 2026, 01:52 PM

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. తులంపై రూ. 4,000కు పైగా తగ్గుదల!

అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా దిగివస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిల్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్యులకు, ముఖ్యంగా పండగ వేళ కొనుగోలుదారులకు గొప్ప ఊరటనిస్తోంది. బలమైన అమెరికన్ డాలర్ సూచీతో పాటు వచ్చే ఏడాది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న వార్తలతో గ్లోబల్ మార్కెట్‌లో బులియన్ వ్యాపారంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. గత నాలుగైదు రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ.4వేల‌కు పైగా తగ్గగా, వారం రోజుల్లో మొత్తంగా రూ.6వేల నుంచి రూ. 7,000 వరకు పడిపోయింది. మంగళవారం ఒక్కరోజే తులంపై రూ.1,370 మేర తగ్గుదల నమోదైంది.

తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ లేఖ!తెలంగాణSwechaa29 Sep 2026, 01:43 PM

తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోండి.. కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ లేఖ!

తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసినట్టు తెలుస్తోంది. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకోవాలని, అక్టోబర్ 1వ తేదీన జరిగే కేఆర్ఎంబీ సమావేశం అజెండాలో ఈ అంశాన్ని చేర్చాలని కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంపై తీవ్రవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, అచ్చంపేట ఎత్తిపోతల పథకం, మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు పథకంలోని రేలంపాడు రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించడం, గూడెందొడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం, పులిచింతల బ్యాక్‌వాటర్‌పై నిర్మించనున్న రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం (బుద్ధమాధవరం), జాన్‌పహాడ్ ఎత్తిపోతల పథకం, బెట్టెతాండా ఎత్తిపోతల పథకం, నక్కగూడెం, ముక్త్యాల పథకాలను సైతం అడ్డుకోవాలని లేఖ రాసినట్టు తెలిసింది.

చిత్రం లేదు
తెలంగాణSwechaa29 Sep 2026, 01:42 PM

TelanganaCoalScam: తెలంగాణలో భారీ కుంభకోణం? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు!

తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమంగా బొగ్గు కొరతను సృష్టించి, తద్వారా విద్యుత్ కోతలకు దారితీసేలా చేసి ఒక భారీ విదేశీ బొగ్గు కొనుగోలు కుంభకోణానికి తెలంగాణ ప్రభుత్వం తెరలేపుతోందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశీయంగా నాణ్యమైన బొగ్గు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నప్పటికీ, కావాలని విదేశాల నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు కాంట్రాక్టర్లు ముడుపుల ఆశ చూపి ఇంధన శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తుండటంతోనే ఈ ప్రతిపాదనలు ముమ్మరమయ్యాయని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Rajinikanth: జైలర్ 2 నుంచి ప్రమోషన్స్ షురూసినిమాSwechaa29 Sep 2026, 01:20 PM

Rajinikanth: జైలర్ 2 నుంచి ప్రమోషన్స్ షురూ

Rajinikanth: సౌత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్ 2’. ఇప్పటికే, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ‘జైలర్’ బ్లాక్‌బస్టర్ కావడంతో సీక్వెల్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా మొదలవబోతున్నాయి. ‘జైలర్ 2’ షూటింగ్, నిర్మాణ పనులు ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు మేకర్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌పై దృష్టి పెట్టారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు.

వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న అక్టోబర్ నెల!NationalSwechaa29 Sep 2026, 01:16 PM

వినియోగదారులకు షాక్ ఇవ్వనున్న అక్టోబర్ నెల!

వినియోగదారులకు అక్టోబర్ నెల షాక్ ఇవ్వనుంది. మేజర్ హిందూ పండుగలు వచ్చే నెల నుంచే ప్రారంభం కానున్నాయి. దసరా, దీపావళికి ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్ కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల పెంపు షాక్ తగలనుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఏసీ ధరలు సుమారు 5–8 శాతం, కొన్ని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్ల ధరలు 3–4 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం. రాగి, అల్యూమినియం, ఉక్కు, క్రూడ్ డెరివేటివ్స్ ధరలు, ఫ్రైట్ ఖర్చులు, కరెన్సీ మార్పులు ఈ పెంపునకు కారణాలుగా చెబుతున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులే ఇందుకు కారణమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎలక్ట్రానిక్స్‌ వస్తువుల ధరలపై దాని ప్రభావం ఉండనుంది. టీవీ, ఏసీల తయారీకి ఉపయోగించే ముడిచమురు కొరత, దిగుమతి చేసుకోవడంలో ఇబ్బందులే ఇందుకు కారణమని సమాచారం.

షాహీ దర్గా తొలగింపు..  మరోమారు ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తతNationalSwechaa29 Sep 2026, 12:55 PM

షాహీ దర్గా తొలగింపు.. మరోమారు ఉజ్జయినిలో తీవ్ర ఉద్రిక్తత

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. "సింహస్థ కుంభమేళా" ఏర్పాట్లలో భాగంగా నగరంలో రోడ్డు విస్తరణ పనులను అక్కడి ప్రభుత్వం చేపట్టింది. అయితే, విస్తరణ మార్గంలో అడ్డుగా ఉన్న 'షాహి దర్గా'కు చెందిన కొంత భాగాన్ని తొలగించేందుకు ఉజ్జయిని మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీంతో అక్కడ వివాదం చెలరేగింది. దర్గా తొలగింపు విషయంలో ముస్లిం వర్గాలు ఎదురుతిరిగాయి.దర్గాను టచ్ చేయవద్దని ఆందోళనకు దిగాయి. ఒక వర్గం వారు రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న హనుమాన్ ఆలయాన్ని స్వయంగా తొలగించేందుకు సిద్ధపడగా.. ముస్లిం వర్గం వారు మాత్రం షాహీ దర్గాను తొలగించేందుకు అడ్డుపడుతున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది.

TheParadiseTeam: ములుగు గట్టమ్మ ఆలయంలో "ది ప్యారడైజ్" చిత్ర బృందం ప్రత్యేక పూజలు!సినిమాSwechaa29 Sep 2026, 12:50 PM

TheParadiseTeam: ములుగు గట్టమ్మ ఆలయంలో "ది ప్యారడైజ్" చిత్ర బృందం ప్రత్యేక పూజలు!

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెర‌కెక్కిన‌"ది ప్యారడైజ్" సినిమా చిత్ర బృందం వరంగల్-ములుగు రహదారిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ములుగు గట్టమ్మ ఆలయాన్ని దర్శించుకుంది. చిత్ర యూనిట్ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకున్నారు. దేవాలయానికి చేరుకున్న హీరో నాని, న‌టుడు సంపూర్ణేశ్ బాబు, ఇత‌ర‌ సినీ బృందానికి ఆలయ అధికారులు, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ వారికి వేదాశీర్వచనం అందించారు.

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించండి :  హైకోర్టుతెలంగాణSwechaa29 Sep 2026, 12:36 PM

మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించండి : హైకోర్టు

ఈనెల 7న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున అసెంబ్లీ ప్రధాన ద్వారం వద్దే పోలీసులు, బీఆర్ఎస్ చట్టసభ సభ్యుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. స్లోగన్స్ రాసి ఉన్న నల్లటి దుస్తులు, ప్లకార్డులు పట్టుకుని సభలోనికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో వివాదం రాజుకుంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్మేలు, ఎమ్మెల్సీలు, మహిళా శాసనసభ్యులకు మధ్య తోపులాట జరిగింది. అయితే, తమ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారని మహిళా ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తన చీర లాగారని ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టి పోలీసులు లాగినట్టు విజువల్స్ వైరల్ అయ్యాయి. ఈ విషయంలో రాష్ట్ర పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు అటు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముందుగా ఫిర్యాదు చేశారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం ..తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులను గుర్తించాలని రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

Palapitta: పాలపిట్టను పంజరంలో బంధిస్తే జైలు శిక్షే.. తెలంగాణ అటవీ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ!తెలంగాణSwechaa29 Sep 2026, 12:15 PM

Palapitta: పాలపిట్టను పంజరంలో బంధిస్తే జైలు శిక్షే.. తెలంగాణ అటవీ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ!

విజయదశమి (దసరా) పండుగ నేపథ్యంలో తెలంగాణ అటవీ శాఖ ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు అత్యంత కీలకమైన హెచ్చరికలు జారీ చేసింది. పండుగ వేళ సెంటిమెంట్ పేరుతో తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ‘పాలపిట్ట’ను పంజరాల్లో బంధించి ప్రదర్శించే అక్రమ చర్యలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. నిబంధనలను అతిక్రమించి పాలపిట్టలను బంధిస్తే చట్టపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అటవీ దళాల ప్రధాన అధికారి (PCCF) వినయ్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలిచే పాలపిట్టను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని పిసిసిఎఫ్ గుర్తుచేశారు. దసరా రోజున పాలపిట్ట దర్శనం శుభప్రదంగా భావించినప్పటికీ, వాటిని బోనుల్లో బంధించి ఇబ్బంది పెట్టడం తీవ్రమైన నేరమని పేర్కొన్నారు

Tirupati airport: కేంద్రం కీలక నిర్ణయం.. తిరుప‌తి ఎయిర్ పోర్టు ప్రైవేటీక‌ర‌ణ‌కు ప‌చ్చ‌జెండా!ఏపీSwechaa29 Sep 2026, 11:59 AM

Tirupati airport: కేంద్రం కీలక నిర్ణయం.. తిరుప‌తి ఎయిర్ పోర్టు ప్రైవేటీక‌ర‌ణ‌కు ప‌చ్చ‌జెండా!

దేశవ్యాప్తంగా ప్రయాణికుల సేవలను మెరుగుపరచడం, మౌలిక వసతులను ఆధునికీక‌రించే లక్ష్యంతో 11విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) జారీ చేసింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (PPP) పద్ధతిలో నిర్వహణ, అభివృద్ధి, ఆధునికీకరణ బాధ్యతలను ప్రైవేటు రంగానికి కట్టబెట్టనున్నారు. ఈ విడతలో కేంద్రం తొలిసారిగా 'బండ్లింగ్' అనే వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. వాణిజ్యపరంగా ఎక్కువ రద్దీ, లాభాలు ఉన్న విమానాశ్రయంతో తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాన్ని కలిపి ప్రైవేట్‌ రంగానికి ఇస్తున్నారు.

సిరిసిల్లలో రేవంత్ సభ.. మహిళా సంఘాలు, నేతలకు టార్గెట్లు!తెలంగాణSwechaa29 Sep 2026, 11:54 AM

సిరిసిల్లలో రేవంత్ సభ.. మహిళా సంఘాలు, నేతలకు టార్గెట్లు!

రేపు సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్‌ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా కరీంనగర్‌ నుంచి నేరుగా సిరిసిల్లలోని కళాశాల మైదానానికి సీఎం చేరుకుంటారు.ఈ క్రమంలోనే సీఎం సభకోసం జనసమీకరణకు నేతలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. గత వారం రోజులుగా సిరిసిల్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్‌ మకాం వేసినట్టు తెలుస్తోంది. భారీగా జనసమీకరణ చేయాలంటూ నేతలకు టార్గెట్లు ఇస్తున్నట్టు సమాచారం. మహిళా సంఘాలకు ప్రత్యేకంగా జనసమీకరణ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. సభకు వచ్చే మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని రావాలంటూ ఆదేశాలు సైతం జారీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.

Tirumala: శ్రీవారి ద‌ర్శ‌నానికి 24గంట‌లు.. కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు క్యూలైన్!ఏపీSwechaa29 Sep 2026, 11:35 AM

Tirumala: శ్రీవారి ద‌ర్శ‌నానికి 24గంట‌లు.. కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు క్యూలైన్!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. వరుస సెలవులు, పండగ వాతావరణం నేపథ్యంలో మంగళవారం సైతం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తిరుమలకు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, సర్వదర్శనం క్యూలైన్లు ఆలయం వెలుపల ఉన్న శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, సోమవారం (సెప్టెంబర్ 28) ఒక్కరోజే 84,171 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం నాడు శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 4.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

పండుగ‌కు ముందే మండుతున్న ప‌ప్పుధాన్యాల ధ‌ర‌లు.. నెల‌రోజుల్లో 11శాతం పెంపు!వ్యాపారంSwechaa29 Sep 2026, 11:26 AM

పండుగ‌కు ముందే మండుతున్న ప‌ప్పుధాన్యాల ధ‌ర‌లు.. నెల‌రోజుల్లో 11శాతం పెంపు!

దేశవ్యాప్తంగా పండుగ‌లు స‌మీపిస్తున్న వేళ నిత్యావసరాల ధరలు పెరిగి సామాన్య ప్రజలకు పెను భారంగా మారుతున్నాయి. రాబోయే ద‌స‌రా, దీపావళి పండగల‌ను దృష్టిలో ఉంచుకుని ఇళ్లలో నిల్వలు పెంచుకుంటున్న తరుణంలో కీలకమైన పప్పుధాన్యాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇండియన్ పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ (IPGA) గణాంకాల ప్రకారం గత కొన్ని వారాల్లోనే శనగ, కంది, పెసర, బఠాణీ వంటి నిత్యావసర పప్పుల హోల్‌సేల్ ధరలు ఏకంగా 11 శాతం వరకు పెరగడం మార్కెట్‌లో కలకలం రేపుతోంది. గత నెల రోజుల్లోనే అత్యధికంగా వినియోగించే శనగపప్పు ధర 11 శాతం పెరగ్గా, పెసరపప్పు 10.6శాతం, కందిపప్పు 6.5శాతం, బఠాణీ 6 శాతం మేర ప్రియమయ్యాయి.

YoutuberMadhumitha: ఇంట్లో రూ.కోటి చోరీ జరిగిన క్షణాల్లోనే రీల్స్.. యూట్యూబర్ మధుమిత తీరుపై నెటిజన్లు షాక్‌!క్రైమ్Swechaa29 Sep 2026, 10:59 AM

YoutuberMadhumitha: ఇంట్లో రూ.కోటి చోరీ జరిగిన క్షణాల్లోనే రీల్స్.. యూట్యూబర్ మధుమిత తీరుపై నెటిజన్లు షాక్‌!

తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మధుమిత ఇంట్లో భారీ దొంగతనం జరిగినప్పటికీ ఆమె ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం కలకలం రేపుతోంది. కోట్ల రూపాయల విలువైన బంగారం, నగదు చోరీకి గురైన కొద్ది గంటల్లోనే ఆమె ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన రీల్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ అయి దాదాపు కోటిన్నర వ్యూస్‌ను సాధించడం గమనార్హం. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణంలో మధుమిత తన భర్త వినోద్ కుమార్, రెండేళ్ల కుమార్తెతో కలిసి నివాసముంటోంది.

కార్పొరేట్ కొలువు వదిలి ఆటో స్టీరింగ్ పట్టి.. బెంగళూరు మహిళ స్ఫూర్తిదాయక కథ వైరల్!వైరల్ న్యూస్Swechaa29 Sep 2026, 10:58 AM

కార్పొరేట్ కొలువు వదిలి ఆటో స్టీరింగ్ పట్టి.. బెంగళూరు మహిళ స్ఫూర్తిదాయక కథ వైరల్!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని, నైట్ షిఫ్ట్ ఒత్తిళ్లను వదిలేసి ఓ మహిళ రాపిడో ఆటో డ్రైవర్‌గా మారిన వినూత్న ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. సొంత కుటుంబానికి, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న తల్లికి సమయం కేటాయించడం కోసం ఆమె తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అవుతోంది. సాంకేతిక రంగాన్ని వీడి ఆటో డ్రైవర్‌గా మారిన ఆమె ధైర్యాన్ని, జీవితాశయాన్ని నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు.

కొంగరఖుర్దులో అక్రమ లేఅవుట్ల కలకలం.. ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదుస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa29 Sep 2026, 10:15 AM

కొంగరఖుర్దులో అక్రమ లేఅవుట్ల కలకలం.. ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కొంగరఖుర్దు గ్రామంలో భూకబ్జా యత్నాలు, అక్రమ లేఅవుట్ల వ్యవహారంపై బాధితుల ఫిర్యాదు మేరకు ఆదిభట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్న భూములకు నకిలీ ఓఆర్‌సీ (ORC) పత్రాలు, ఫోర్జరీ సంతకాలు సృష్టించి విక్రయాలకు తెగబడుతున్న కబ్జాదారులపై పోలీసులు చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, గతంలోనే ఈ అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన అధికారులు తాజాగా కేసు నమోదు చేసి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి రమ్మని పిలుస్తున్నాడని..!తెలంగాణSwechaa29 Sep 2026, 10:09 AM

చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి రమ్మని పిలుస్తున్నాడని..!

హైదరాబాద్ మహానగరంలో మరో తీవ్ర విషాదం నెలకొంది. ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి బలవన్మరణానికి పాల్పడింది. గత కొద్ది రోజులుగా సదరు యువతి డిప్రెషన్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మరణించిన తన ప్రియుడు కలలోకి వచ్చి తనను రమ్మంటున్నాడని కుటుంబీలకు చెప్పిన యువతి.. ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటన శంషాబాద్‌ పరిధిలోని సిద్ధార్థ కాలనీలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద.. నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌తో కొంతకాలంగా ప్రేమలో ఉంది.ఇటీవల సిద్ధార్థ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుండి నర్మద డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే దారుణానికి ఒడిగట్టింది.

ఎల్‌నినో ఎఫెక్ట్.. కిలో రూ.80 దాటిన బియ్యం ధరతెలంగాణSwechaa29 Sep 2026, 09:54 AM

ఎల్‌నినో ఎఫెక్ట్.. కిలో రూ.80 దాటిన బియ్యం ధర

తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. ఈ ఏడాది వర్షాలు అనుకున్నంతమేర కురవకపోవడం, ఎల్‌నినో ప్రభావమే కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఆరు తడి పంటలు కాకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ప్రభుత్వాలు, వ్యయసాయ నిపుణులు రైతులకు సూచించారు.దీంతో ఈ ఏడాది వరి దిగుబడి గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు కురవకపోయినా రైతులు మాత్రం ధాన్యం సాగుకే అధికప్రాధాన్యత ఇచ్చినట్టు సమాచారం.అయితే, ఈసారి వరుసాగు దిగుబడి తగ్గుతుందని తెలుస్తుండగా.. మార్కెట్లో బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. మూడు నెలల్లో కిలో బియ్యంపై రూ.15-20 పెరుగుదల నమోదైనట్టు సమాచారం. సన్నబియ్యం ప్రస్తుతం మార్కెట్లో రూ.70, నాణ్యమైన బియ్యం రూ.80కి పైగా ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది.

తిరుమలలో సింగపూర్ హోం మంత్రి.. స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లిన నారా లోకేశ్!ఏపీSwechaa29 Sep 2026, 09:21 AM

తిరుమలలో సింగపూర్ హోం మంత్రి.. స్వాగతం పలికి శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లిన నారా లోకేశ్!

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, రియల్ నాలెడ్జ్ కంపెనీల శాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. సింగపూర్ దేశ హోం మంత్రి కే.షణ్ముగంతో కలసి ఆయన తిరుమలేశుడి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన విశిష్ట అతిథులకు టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు మహాద్వారం వద్ద సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Yadadri Bhuvanagiri: రూటు మారుతున్న భూ భారతి.. యజమానులకు తెలియకుండానే 7.18 ఎకరాలు మాయం!..తెలంగాణSwechaa29 Sep 2026, 09:06 AM

Yadadri Bhuvanagiri: రూటు మారుతున్న భూ భారతి.. యజమానులకు తెలియకుండానే 7.18 ఎకరాలు మాయం!..

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరులో భూ భారతి రికార్డులపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు రైతులకు చెందిన సుమారు 7.18 ఎకరాల భూమి.. తమకు తెలియకుండానే మరో వ్యక్తి పేరుపై నమోదైందని రైతులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి విక్రయ లావాదేవీ, రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ లేకుండానే పట్టా ఎలా మారిందని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా బింగి మల్లయ్యకు చెందిన 1.32 ఎకరాల భూమి బింగి కరుణాకర్ పేరుపై నమోదైందని చెబుతున్నారు. దీనిపై రైతులు గ్రీవెన్స్ డేలో తహసీల్దార్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

Telangana: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు బిగ్ షాక్.. కోర్టు కీలక ఆదేశం!!..తెలంగాణSwechaa29 Sep 2026, 08:31 AM

Telangana: ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు బిగ్ షాక్.. కోర్టు కీలక ఆదేశం!!..

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్టులను తక్షణమే తాత్కాలికంగా జప్తు (ఇంపౌండ్) చేయాలంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కోర్టు హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయాన్ని (ఆర్‌పీవో) ఆదేశించింది. ఈ మేరకు న్యాయస్థానం ఆర్‌పీవోకు అధికారికంగా లేఖ రాసింది. కోర్టు ఆదేశాలతో ఈ కేసు మరోసారి రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Telangana: భాగ్యనగర్ సొసైటీ భూములకు రెక్కలు!!.. బౌండరీ వేసేందుకు క్లీన్ చేస్తున్న గ్రీన్ కో అండ్ టీం?తెలంగాణSwechaa29 Sep 2026, 08:16 AM

Telangana: భాగ్యనగర్ సొసైటీ భూములకు రెక్కలు!!.. బౌండరీ వేసేందుకు క్లీన్ చేస్తున్న గ్రీన్ కో అండ్ టీం?

కూకట్ పల్లి సర్వే నెంబర్‌ 1007కు కొత్తగా రేకులు పాతి బౌండరీ ఫిక్స్ చేస్తున్నారు. ప్రైం ప్రాపర్టీకి చెందిన ఆస్తులు అగ్రిమెంట్ చేసుకున్న గ్రీన్ కో అండ్ టీం అంతా నడిపిస్తోంది. ఈ టీంలో కీ రోల్ పోషించిన పొనుగొంటి శ్రీనివాసరావుపై ఏడాది క్రితం 5 కేసులు నమోదు అయ్యాయి. నిత్యం సివిల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ భూములపై ఏదో ఒక విచారణ జరుగుతూనే ఉంటుంది. అందుకే ఆసియాలోనే అత్యంత వివాదాస్పద భూములుగా వీటిని చెప్పవచ్చు. అలాగే అత్యంత విలువైన భూమిగా భావిస్తారు. 240 ఎకరాలు కాగా ఎకరం 300 కోట్లు అని చెప్పినా కళ్లు మూసుకుని కొనేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. ప్రైవేట్ ఆస్తి కావడంతో ఎన్నో లిటిగేషన్స్ వచ్చి పడ్డాయి.

New Delhi: గుజరాత్ వర్సెస్ దేశం.. మోదీ సర్కార్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!..NationalSwechaa29 Sep 2026, 07:58 AM

New Delhi: గుజరాత్ వర్సెస్ దేశం.. మోదీ సర్కార్‌పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!!..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం దేశంలో ఉత్తర, దక్షిణ భారత్ మధ్య కాకుండా, 'గుజరాత్ వర్సెస్ దేశం' అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు. అసోంకు చెందిన 'ప్రతిదిన్' దినపత్రిక "భారత్ తదుపరి అధ్యాయం" అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

National: రైతులకు అలర్ట్.. పారాక్వాట్ డైక్లోరైడ్‌ పై కేంద్రం కీలక నిర్ణయం!!..NationalSwechaa29 Sep 2026, 07:35 AM

National: రైతులకు అలర్ట్.. పారాక్వాట్ డైక్లోరైడ్‌ పై కేంద్రం కీలక నిర్ణయం!!..

మనుషులు, జంతువుల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన కలుపు సంహారకం (హెర్బిసైడ్) పారాక్వాట్ డైక్లోరైడ్‌ను భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఈ రసాయనాన్ని నిషేధించిన దాదాపు 70 దేశాల సరసన భారత్ చేరింది. నిపుణుల కమిటీ సిఫార్సులు, రిజిస్ట్రేషన్ కమిటీ సంప్రదింపుల అనంతరం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Telangana: కవిత కథలు.. మల్లన్న మాటలు ఓట్లు రాబడుతాయా?..తెలంగాణSwechaa29 Sep 2026, 07:18 AM

Telangana: కవిత కథలు.. మల్లన్న మాటలు ఓట్లు రాబడుతాయా?..

తెలంగాణ రాజకీయాల్లో కొత్త లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. ఒకప్పుడు ఒకే రాజకీయ శిబిరంలో కనిపించిన నాయకులు ఇప్పుడు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సామాజిక సమీకరణాల పేరుతో కొత్త నినాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ మొత్తం పరిణామంలో ఎవరి మాటకు ఎంత బలం ఉంది.. ఎవరి వెంట ఎంతమంది నడుస్తారు.. అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం చర్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన రాజకీయ వేదికను ప్రత్యేకంగా నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన రాజకీయ వ్యవస్థపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పాలన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశాలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ పెంచుతున్నాయి.