స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Telangana: కవిత కథలు.. మల్లన్న మాటలు ఓట్లు రాబడుతాయా?..తెలంగాణSwechaa29 Sep 2026, 07:18 AM

Telangana: కవిత కథలు.. మల్లన్న మాటలు ఓట్లు రాబడుతాయా?..

తెలంగాణ రాజకీయాల్లో కొత్త లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. ఒకప్పుడు ఒకే రాజకీయ శిబిరంలో కనిపించిన నాయకులు ఇప్పుడు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సామాజిక సమీకరణాల పేరుతో కొత్త నినాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ మొత్తం పరిణామంలో ఎవరి మాటకు ఎంత బలం ఉంది.. ఎవరి వెంట ఎంతమంది నడుస్తారు.. అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.

ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం చర్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన రాజకీయ వేదికను ప్రత్యేకంగా నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన రాజకీయ వ్యవస్థపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పాలన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశాలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ పెంచుతున్నాయి.

Health: చర్మంపై పులిపిర్లు వస్తున్నాయా..? ఆయుర్వేదంలో ఏం చెబుతున్నారు?SpiritualitySwechaa29 Sep 2026, 07:07 AM

Health: చర్మంపై పులిపిర్లు వస్తున్నాయా..? ఆయుర్వేదంలో ఏం చెబుతున్నారు?

చర్మంపై కనిపించే చిన్న చిన్న పులిపిర్లు చాలామందికి సాధారణ సమస్యగానే అనిపిస్తాయి. కానీ ప్రతి పులిపిరి ఒకే రకమైనది కాదు. కొన్ని వైరస్ వల్ల వచ్చే వార్ట్స్ అయితే.. మరికొన్ని స్కిన్ ట్యాగ్స్ కావచ్చు. అందుకే పులిపిరి కనిపించగానే ఏదో ఒక ఇంటి చిట్కాతో కాల్చేయడం లేదా రాల్చేయడం సరైన పద్ధతి కాదు.

ఆయుర్వేదంలో చర్మ సమస్యలను కేవలం పైపైన కనిపించే లక్షణం ఆధారంగా కాకుండా, దోషాలు, ధాతువులు, లక్షణాలు, రోగి పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని చికిత్స చేయాలని ఆయుష్‌కు చెందిన ఆయుర్వేద గ్రంథాధారిత సమాచారంలో పేర్కొంటారు. కొన్ని పరిస్థితుల్లో లేపనం, క్షారకర్మ వంటి స్థానిక చికిత్సా విధానాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అయితే క్షారకర్మ అంటే ఇంట్లో సున్నం లేదా ఇతర క్షార పదార్థాలు కలిపి పులిపిరిపై రాసుకోవడం కాదు. అది వైద్య పర్యవేక్షణలో నిర్వహించే చికిత్సా విధానం.

Spirituality: రోజులో ఏ వేళ ఏ దేవుడిని దర్శించాలి?..SpiritualitySwechaa29 Sep 2026, 06:58 AM

Spirituality: రోజులో ఏ వేళ ఏ దేవుడిని దర్శించాలి?..

మనిషి జీవితం కేవలం కాలంతో నడిచేది కాదు.. కాలాన్ని అనుసరించే ఒక ఆధ్యాత్మిక క్రమంతో నడుస్తుంది. అందుకే సనాతన ధర్మంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళలకు ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇచ్చారు. ప్రకృతిలో మారే ప్రతి దశను దైవతత్వంతో అనుసంధానించి.. ఆ సమయానికి తగిన సాధన, ఉపాసన, దేవతా ఆరాధనలను సూచించారు.

ఉదయే విష్ణుం, సాయాహ్నే తు మహేశ్వరం... కాలచక్రంలో ఉదయించే ప్రతి సూర్యకిరణం జగద్రక్షకుడైన శ్రీమహావిష్ణువు చైతన్యానికి సంకేతం. అందుకే ప్రాతఃకాలంలో ఆ వైకుంఠవాసుని దర్శిస్తే, రోజంతా సాగే జీవన యాత్రకు కావలసిన కార్యసిద్ధి, రక్షణ లభిస్తాయి. ఇక పగటి అశాంతి ముగిసి సమస్త లోకమూ ప్రశాంతత వైపు అడుగులేసే సాయంసంధ్య... సాక్షాత్తు ఆ ప్రదోష కాల మూర్తి అయిన పరమేశ్వరుని సన్నిధి..

Spirituality: భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకూడదట!..మన సంస్కృతిలో దాగిన ధర్మసూత్రమిదే!..SpiritualitySwechaa29 Sep 2026, 06:53 AM

Spirituality: భోజనం చేసేటప్పుడు ఈ తప్పులు చేయకూడదట!..మన సంస్కృతిలో దాగిన ధర్మసూత్రమిదే!..

అన్నం బ్రహ్మ, రసో విష్ణుః, భోక్తా దేవో జనార్దనః అని మన శాస్త్రం చెబుతుంది. భారతీయ సంస్కృతిలో భోజనం చేయడం అంటే ఏదో ఆకలి తీర్చుకోవడానికి శరీరాన్ని నింపే లౌకిక కార్యం కాదు.. శరీరమనే యజ్ఞకుండంలో, అంతర్యామియైన జఠరాగ్నికి అర్పించే ఒక దివ్యమైన ఆహుతి.. సాక్షాత్తు ఆ కాశీ అన్నపూర్ణా దేవి ప్రసాదాన్ని స్వీకరించేటప్పుడు మనస్సు ఎలా ఉండాలి? ఏ దిక్కున కూర్చొని భుజించాలి? మన పూర్వీకులు ఏర్పరచిన ఆ సనాతన భోజన నియమాల వెనుక ఉన్న అంతరార్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

Spirituality: సుందరకాండ పారాయణం ఎందుకు చేస్తారు?.. సంప్రదాయంలో ఉన్న విశిష్టత ఇదే!..SpiritualitySwechaa29 Sep 2026, 06:49 AM

Spirituality: సుందరకాండ పారాయణం ఎందుకు చేస్తారు?.. సంప్రదాయంలో ఉన్న విశిష్టత ఇదే!..

మనిషి జీవితంలో ఎంతటి కష్టకాలం వచ్చినా.. ధర్మాన్ని, భక్తిని, ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదని బోధించే మహత్తర ఆధ్యాత్మిక గాథే సుందరకాండ. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్రామాయణంలోని ఏడు కాండల్లో సుందరకాండకు విశిష్టమైన స్థానం ఉంది. ఇందులో శ్రీరాముడి కార్యాన్ని తన ప్రాణకర్తవ్యంగా స్వీకరించిన ఆంజనేయుడి పరాక్రమం, బుద్ధి, ధైర్యం, వినయం, అచంచలమైన భక్తి దర్శనమిస్తాయి.

సముద్రాన్ని దాటి లంకకు చేరిన హనుమంతుడు.. సీతాదేవిని అన్వేషించి, అశోకవనంలో ఆమెను దర్శించి, శ్రీరాముడి సందేశాన్ని అందిస్తాడు. ఈ ఘట్టాలన్నీ భక్తికి, సేవకు, ధర్మనిష్ఠకు ప్రతిరూపాలుగా నిలుస్తాయి. అందుకే సుందరకాండ పారాయణం అంటే కేవలం శ్లోకాలను చదవడం మాత్రమే కాదు.. హనుమంతుడి భక్తి మార్గాన్ని మనసులో ఆవిష్కరించుకోవడం.

ట్రాఫిక్ చలాన్ పెండింగా..? ఐతే మీ ఇంటికి కరెంట్ కట్..!NationalSwechaa29 Sep 2026, 12:39 AM

ట్రాఫిక్ చలాన్ పెండింగా..? ఐతే మీ ఇంటికి కరెంట్ కట్..!

దేశవ్యాప్తంగా పేరుకుపోయిన పెండింగ్ చలాన్లు ఇప్పుడు భారీ మొత్తానికి చేరాయి. ఈ సమస్యపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. చలాన్లు విధించడం మాత్రమే కాదు, వాటిని వసూలు చేయడానికి కూడా కఠినమైన మార్గాలను అన్వేషించాలని అధికారులకు సూచించింది.

టాటా సన్స్‌ రూపమే మారనుందా..? టాటా ట్రస్ట్స్ కీలక ప్లాన్!వ్యాపారంSwechaa28 Sep 2026, 11:57 PM

టాటా సన్స్‌ రూపమే మారనుందా..? టాటా ట్రస్ట్స్ కీలక ప్లాన్!

టాటా గ్రూప్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్‌కు పెద్ద అంబ్రెల్లాలా ఉండే టాటా సన్స్ భవిష్యత్ నిర్మాణాన్ని మార్చే ప్రతిపాదనను టాటా ట్రస్ట్స్ తెరపైకి తీసుకొచ్చాయి. ఈ ప్రతిపాదన అమలైతే.. టాటా సన్స్ కేవలం టాటా గ్రూప్ కంపెనీలను నియంత్రించే హోల్డింగ్ కంపెనీగా కాకుండా, సొంతంగా వ్యాపారాలు చేసే సంస్థగా మారనుంది.

Nayanathara: లేడీ సూపర్ స్టార్ క్రేజీ లైనప్..స్టార్ హీరోలు కూడా తక్కువే!సినిమాSwechaa28 Sep 2026, 10:38 PM

Nayanathara: లేడీ సూపర్ స్టార్ క్రేజీ లైనప్..స్టార్ హీరోలు కూడా తక్కువే!

Nayanathara: సౌత్ ఇండియన్ సినిమా దగ్గర తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్ తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక కథలు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా నయనతార చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకు సంబంధించిన సినిమాల్లో ఆమె నటిస్తున్నారు. 2026–27లో ప్రేక్షకుల ముందుకు రానున్న నయన్ సినిమాలను ఓసారి చూద్దాం.

Kedarnath: పుణ్యక్షేత్రాన్ని కాస్తా చెత్తకుప్పగా మార్చారు.. 5 నెలల్లోనే 135 శాతం పెరిగిన వ్యర్థాలు!NationalSwechaa28 Sep 2026, 09:49 PM

Kedarnath: పుణ్యక్షేత్రాన్ని కాస్తా చెత్తకుప్పగా మార్చారు.. 5 నెలల్లోనే 135 శాతం పెరిగిన వ్యర్థాలు!

Kedarnath: సముద్ర మట్టానికి దాదాపు 3,583 మీటర్ల ఎత్తులో కొలువైన పవిత్ర శైవక్షేత్రం కేదార్‌నాథ్ ఇప్పుడు తీవ్ర పర్యావరణ విలయంలో చిక్కుకుంది. పాండవుల కాలం నాటి ఘన చరిత్ర కలిగిన ఈ పుణ్యభూమికి ఏటా లక్షలాది మంది భక్తులు మోక్షం కోసం తరలివస్తుంటారు. అయితే, భక్తి ముసుగులో జరుగుతున్న విచ్చలవిడి కాలుష్యం హిమాలయాల ఉనికికే ముప్పు తెచ్చిపెడుతోంది. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే కేదార్‌నాథ్ కొండలు చెత్త దిబ్బలుగా మారిన భయానక వాస్తవం సమాచార హక్కు చట్టం ద్వారా తాజాగా బట్టబయలైంది.కేదార్‌నాథ్ నగర పంచాయతీ వెల్లడించిన అధికారిక గణాంకాలు పర్యావరణ ప్రేమికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. 2026 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కేవలం ఐదు నెలల కాలంలోనే ఏకంగా 50.30 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. గత మూడేళ్ల వ్యర్థాల లెక్కలతో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైన స్థాయికి చేరుకుంది.

Sri Vashishta Institutions: శ్రీ వశిష్ట విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘనల పర్వం.. అధికారులు నిద్రపోతున్నారా?తెలంగాణSwechaa28 Sep 2026, 09:36 PM

Sri Vashishta Institutions: శ్రీ వశిష్ట విద్యాసంస్థల్లో నిబంధనల ఉల్లంఘనల పర్వం.. అధికారులు నిద్రపోతున్నారా?

Sri Vashishta Institutions: నగరంలో విద్యా వ్యాపారం నిబంధనల హద్దులు దాటుతున్న వేళ, శ్రీ వశిష్ట ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూల్స్‌ను యథేచ్ఛగా గాలికి వదిలేస్తూ, విద్యార్థుల భద్రతను ప్రమాదంలోకి నెడుతున్నట్లు వస్తున్న ఫిర్యాదులపై పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ లింగమనేని ప్రమీల రాణి నాయకత్వంలో నడుస్తున్న ఈ విద్యాసంస్థల్లో బోర్డు రూల్స్ బేఖాతరు అవుతున్నా, విద్యాశాఖ నిద్రమత్తు వీడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

షాద్‌నగర్‌లో కృష్ణజింక మాంసం కలకలం.. 9మంది అరెస్ట్క్రైమ్Swechaa28 Sep 2026, 09:19 PM

షాద్‌నగర్‌లో కృష్ణజింక మాంసం కలకలం.. 9మంది అరెస్ట్

Deer Meat: కృష్ణ జింకను వేటాడి చంపి, దాని మాంసాన్ని ముక్కలుగా చేసి నగరానికి తరలిస్తున్న తొమ్మిది మంది సభ్యుల ముఠాను షాద్‌నగర్‌ పోలీసులు, ఎస్‌వోటీ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి లైసెన్స్‌డ్‌ తుపాకీ, బుల్లెట్లు, కృష్ణజింక మాంసం, రెండు కార్లు, నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ డీసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో డీసీపీ శిరీష రాఘవేంద్ర కేసు వివరాలు వెల్లడించారు.

మరికల్‌ అటవీ ప్రాంతంలో జింక వేట

సెప్టెంబర్‌ 26న అర్ధరాత్రి హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులు కార్లలో నారాయణపేట జిల్లా మరికల్‌ అటవీ ప్రాంతానికి వెళ్లారు. సెప్టెంబర్‌ 27న ఉదయం లైసెన్స్‌డ్‌ తుపాకీతో కృష్ణజింకను వేటాడి చంపారు. అనంతరం దాని మాంసాన్ని ముక్కలుగా నరికి ప్యాక్‌ చేసుకుని హైదరాబాద్‌ వైపు బయలుదేరినట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాయకల్‌ టోల్‌ప్లాజా సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా నిందితుల ముఠా పట్టుబడింది. విచారణలో కృష్ణజింకను తామే వేటాడినట్లు నిందితులు వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

Prabhas: కల్కి 2పై భారీ అప్‌డేట్.. షూటింగ్ అక్టోబర్ లోనా?సినిమాSwechaa28 Sep 2026, 08:41 PM

Prabhas: కల్కి 2పై భారీ అప్‌డేట్.. షూటింగ్ అక్టోబర్ లోనా?

Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘కల్కి 2898 ఏడీ పార్ట్ 2’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి భాగం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో పాటు భారీ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళను రాబట్టింది. ఇక, ఇప్పుడు సీక్వెల్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ ఇచ్చిన తాజా అప్‌డేట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

గద్వాల జిల్లాలో తప్పిన పెను ప్రమాదం.. బోల్తా పడిన బస్సుక్రైమ్Swechaa28 Sep 2026, 08:37 PM

గద్వాల జిల్లాలో తప్పిన పెను ప్రమాదం.. బోల్తా పడిన బస్సు

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు బోల్తా పడింది. అయితే, ఈ ఘటనలో విద్యార్థులు అంతా ప్రాణాలతో బయటపడ్డారు. వారికి స్పల్పంగా గాయాలయ్యాయి. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మానవపాడు మండలం బోరవెల్లి స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి NH44పై బస్సు బోల్తా పడింది.

తమిళనాడు రాష్ట్రం సేలంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్రకు హైదరాబాద్ కు వస్తున్నారు. బస్సులో విద్యార్థులు, టీచర్లు అంతా కలిపి 37మంది ఉన్నారు. హైదరాబాద్ కు వస్తున్న క్రమంలో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. మానవపాడు మండలం బోరవెల్లి శివారులో జాతీయ రహదారిపై ఒక్కసారిగా బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది.

Trivikram: గురూజీ డింపుల్ ని మేయిన్ హీరోయిన్ చేస్తాడా?సినిమాSwechaa28 Sep 2026, 08:17 PM

Trivikram: గురూజీ డింపుల్ ని మేయిన్ హీరోయిన్ చేస్తాడా?

Trivikram: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేసిన తాజా చిత్రం ' ఆదర్శ కుటుంబం - AK47'. తాజాగా ఈ సినిమా నుంచి నారాయణమ్మ సాంగ్ రిలీజై యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇక, వీరి కాంబో అంటే టాలీవుడ్ లో అందరికీ గుర్తొచ్చేవి బ్లాక్ బస్టర్స్ 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలే.

TG : ‘బిల్లులు ఇస్తారా.. ఇవ్వరా?’.. డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు ఆందోళన!తెలంగాణSwechaa28 Sep 2026, 07:39 PM

TG : ‘బిల్లులు ఇస్తారా.. ఇవ్వరా?’.. డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందు ఆందోళన!

TG : సచివాలయంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏళ్లు గడుస్తున్నా తమ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగులు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగారు. "మా బిల్లులు ఇస్తారా.. ఇవ్వరా?" అంటూ నినాదాలు చేస్తూ నేలపై బైఠాయించడంతో సచివాలయ కారిడార్లలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.బాధితుల వివరాల ప్రకారం.. ఎంతో కాలంగా తమకు రావాల్సిన బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యను వివరించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా డిప్యూటీ సీఎం అపాయింట్‌మెంట్ దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”?తెలంగాణSwechaa28 Sep 2026, 07:12 PM

ఇదేనా కాంగ్రెస్ చెప్పిన “ప్రజా పాలన”?

Harish Rao: పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన రాష్ట్ర సచివాలయం కాంగ్రెస్ పాలనలో నిరసనల అడ్డాగా మారడం సిగ్గుచేటు అని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు సచివాలయం వేదికగా ఆందోళనకు దిగాల్సిన దుస్థితి రావడం సీఎం రేవంత్, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తలదించుకోవాల్సిన విషయం అన్నారు. ఏళ్ల తరబడి బిల్లులు పెండింగ్‌లో పెట్టి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా.. ఇంకెంత కాలం తప్పించుకు తిరుగుతారు? అని రేవంత్ ను నిలదీశారు.

కమీషన్లు ఇవ్వలేదనే బిల్లులు ఆపుతున్నారా?

బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ.. చిన్న కాంట్రాక్టర్లు, రిటైర్డ్ ఉద్యోగుల బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం దారుణం అని హరీశ్ రావు ధ్వజమెత్తారు. పెండింగ్ బిల్లుల మంజూరు కోసం 20-30% కమీషన్ డిమాండ్ చేస్తున్నారంటూ గతంలో సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు ఆందోళనకు దిగారని గుర్తు చేసిన హరీశ్ రావు.. అంటే కమీషన్లు ఇవ్వలేదనే కారణంతోనే వారి బిల్లులు ఆపుతున్నారా? అని ప్రశ్నించారు.

TG : చేతబడి అనుమానంతో 60 ఏళ్ల వృద్ధురాలిపై దాడి.. రంగారెడ్డి జిల్లాలో అమానుషం!తెలంగాణSwechaa28 Sep 2026, 07:05 PM

TG : చేతబడి అనుమానంతో 60 ఏళ్ల వృద్ధురాలిపై దాడి.. రంగారెడ్డి జిల్లాలో అమానుషం!

TG : చేతబడి చేస్తోందన్న మూఢనమ్మకంతో ఓ వృద్ధురాలిపై గ్రామస్థులు కర్కశంగా దాడి చేసిన అమానుష ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. 60 ఏళ్ల వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

వివరాల్లోకి వెళ్తే.. మంచాల మండలం నోముల గ్రామానికి చెందిన పల్లటి వెంకటమ్మ (60) చేతబడులు చేస్తోందంటూ కొందరు గ్రామస్థులు అనుమానం పెంచుకున్నారు.

ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు ఖాయం.. ఉపఎన్నిక‌పై దానం  ధీమా!తెలంగాణSwechaa28 Sep 2026, 06:53 PM

ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు ఖాయం.. ఉపఎన్నిక‌పై దానం  ధీమా!

హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నికపై మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ విజయాన్ని సాధిస్తుందని, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే రీతిలో ప్రజలు నిర్ణయాత్మకమైన తీర్పు ఇవ్వబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు.

TG: ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్తెలంగాణSwechaa28 Sep 2026, 06:27 PM

TG: ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్

TG: ఖైరతాబాద్ ఉప ఎన్నిక నగారా మోగడానికి మార్గం సుగమమైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ సర్కార్ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనసభ కార్యదర్శి తిరుపతి పేరిట సెప్టెంబర్ 26వ తేదీతో ఈ గెజిట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్‌పై కోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది.

షాద్‌నగర్‌లో జింక మాంసం కలకలం..! 13 కిలోల మాంసం, రైఫిల్ స్వాధీనంక్రైమ్Swechaa28 Sep 2026, 06:14 PM

షాద్‌నగర్‌లో జింక మాంసం కలకలం..! 13 కిలోల మాంసం, రైఫిల్ స్వాధీనం

Deer Meat: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో జింక మాంసం తరలింపు కలకలం రేపింది. షాద్‌నగర్ పట్టణ శివారులోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద జింక మాంసాన్ని పట్టుకున్నారు. అటవీశాఖ అధికారులకు అందిన సమాచారం మేరకు ఎస్ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టి జింక మాంసాన్ని తరలిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల అదుపులో 8మంది

8మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 13 కిలోల జింక మాంసంతో పాటు వేటకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న రైఫిల్, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కొత్తూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. అటవీశాఖకు చెందిన ప్రత్యేక బృందం పోలీస్ స్టేషన్ కు చేరుకుంది. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అనుమానితులను విచారిస్తున్నారు.

TG: సిరిసిల్లలో హైటెన్షన్..‘నా చావుకు కేటీఆరే కారణం’.. పెట్రోల్ పోసుకున్న దళిత రైతు!తెలంగాణSwechaa28 Sep 2026, 05:39 PM

TG: సిరిసిల్లలో హైటెన్షన్..‘నా చావుకు కేటీఆరే కారణం’.. పెట్రోల్ పోసుకున్న దళిత రైతు!

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తమ భూమిని అన్యాయంగా లాక్కుని రోడ్డున పడేశారంటూ ఓ దళిత రైతు రోడ్డెక్కి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. "నా చావుకు మాజీ మంత్రి కేటీఆరే కారణం" అంటూ బాధిత రైతు వినోద్ నినదించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. వెంటనే అప్రమత్తమైన తోటి రైతులు, స్థానికులు అతడి చేతిలోని పెట్రోల్ డబ్బాను లాగేసి అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

NBK 112: కొరటాల శివ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్!సినిమాSwechaa28 Sep 2026, 05:36 PM

NBK 112: కొరటాల శివ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్!

NBK 112: నట సింహం నందమూరి బాలకృష్ణ సినిమాలంటేనే మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఇక బాలయ్యను తనదైన స్టైల్‌లో చూపించే దర్శకుడు కొరటాల శివ అయితే ఆ అంచనాలు మరింత పెరగడం ఖాయం. తాజాగా, వీరిద్దరి కాంబినేషన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

రేవంత్.. ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?తెలంగాణSwechaa28 Sep 2026, 05:35 PM

రేవంత్.. ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

Ktr: సీఎం రేవంత్ సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. రేవంత్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించారు. ఈ నెల 30న సిరిసిల్లకు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు మూడేళ్లు కావస్తున్నా ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాలని కేటీఆర్ నిలదీశారు.

సీఎం రేవంత్ తన సిరిసిల్ల పర్యటనలో ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి బీసీ-ఏ కు మార్చే హామీపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ముదిరాజ్‌లు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముదిరాజ్‌ల న్యాయమైన డిమాండ్ అమలయ్యేవరకు బీఆర్ఎస్ పార్టీ అన్నివిధాలుగా అండగా ఉంటుందని కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు. ముదిరాజ్‌ల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని కేటీఆర్ హామీ ఇవ్వడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంక్షేమ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Chiranjeevi: నెట్‌ఫ్లిక్స్ కోసం హోస్ట్‌గా మారబోతున్న మెగాస్టార్!సినిమాSwechaa28 Sep 2026, 05:16 PM

Chiranjeevi: నెట్‌ఫ్లిక్స్ కోసం హోస్ట్‌గా మారబోతున్న మెగాస్టార్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటేనే తెలుగు ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్. హీరోగా ఎన్నో దశాబ్దాలుగా అలరిస్తున్న చిరు.. ఇప్పుడు మరో కొత్త అవతార్‌లో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కోసం మెగాస్టార్ హోస్ట్‌గా కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో ఆయన మీలో ఎవరు కోటీశ్వరులు కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించారు.

Rummy Culture: ఫోన్ స్క్రీన్ వెనుక వేల కోట్ల మాఫియా.. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఆగని దందా!NationalSwechaa28 Sep 2026, 05:13 PM

Rummy Culture: ఫోన్ స్క్రీన్ వెనుక వేల కోట్ల మాఫియా.. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉన్నా ఆగని దందా!

Rummy Culture: చేతిలో స్మార్ట్‌ఫోన్ ఆన్ కాగానే చాలు.. ‘లక్షలు గెలవండి.. జీవితాన్ని మార్చుకోండి’ అంటూ ప్రత్యక్షమయ్యే ఆకర్షణీయమైన ప్రకటనలు. ఒక్క క్లిక్‌తో మొదలయ్యే సరదా, క్షణాల్లోనే వ్యసనంగా మారి సామాన్యుడి జేబులను గుల్ల చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆన్‌లైన్ పేకాట, రియల్ మనీ గేమింగ్‌పై కఠిన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, కార్పొరేట్ ముసుగులో సాగుతున్న ఈ డిజిటల్ దోపిడీకి అడ్డే లేకుండా పోయింది. చట్టాల కళ్లుగప్పి తెరవెనుక సాగుతున్న వేల కోట్ల అక్రమ దందాపై ఎట్టకేలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పంజా విసిరింది. ‘రమ్మీ కల్చర్’ అక్రమ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన మెరుపు దాడులు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ల ఇండ్లలో ఐటీ దాడులుతెలంగాణSwechaa28 Sep 2026, 04:10 PM

Rakul Preet Singh: హీరోయిన్ రకుల్, బాలీవుడ్ ప్రొడ్యూసర్ల ఇండ్లలో ఐటీ దాడులు

Rakul Preet Singh: బాలీవుడ్ ప్రముఖ నిర్మాతల నివాసాలు, వారి కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ అధికారులు) చేపట్టిన ఆకస్మిక తనిఖీలు సినీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అత్తింటితో పాటు పలువురు అగ్రశ్రేణి నిర్మాతలే లక్ష్యంగా ముంబైలోని 12 కీలక ప్రాంతాల్లో అధికారులు సోమవారం ఉదయం నుంచి ఏకకాలంలో దాడులు నిర్వహిస్తున్నారు. సినిమా ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ పేరిట భారీ మొత్తంలో నిధులను అక్రమంగా విదేశాలకు మళ్లించారనే పక్కా సమాచారంతోనే ఈ మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలుస్తుంది.

యూపీఐపై ఎండీఆర్ చార్జీలు.. కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు షాక్NationalSwechaa28 Sep 2026, 04:07 PM

యూపీఐపై ఎండీఆర్ చార్జీలు.. కేంద్రం, ఆర్బీఐకి సుప్రీంకోర్టు షాక్

యూపీఐ లావాదేవీలు రూ.2 వేలకు మించితే చార్జీలు వసూలు చేసేందుకు బ్యాంకులకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నిరుపేదలు, చిరు వ్యాపారులను దోచుకునేందుకు కేంద్రం చార్జీలు వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఈ వివాదం కాస్త సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడంతో కేంద్రప్రభుత్వం, ఆర్బీఐకి న్యాయస్థానం షాక్ ఇచ్చింది. రూ.2 వేలకు మించిన యూపీఐ (UPI) చెల్లింపులపై ఎండీఆర్‌ (MDR) చార్జీల విధింపునకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ వివాదాస్పద అంశంపై స్పందించాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)లకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

22-A భూములపై నిషేధం తొలగించండి.. : సీఎం చంద్రబాబుకు లేఖ!ఏపీSwechaa28 Sep 2026, 04:03 PM

22-A భూములపై నిషేధం తొలగించండి.. : సీఎం చంద్రబాబుకు లేఖ!

ఆంధ్రప్రదేశ్‌లో నిషేధిత జాబితా అయిన సెక్షన్ 22-A పరిధిలో ఉన్న అర్హత కలిగిన భూములపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. చట్టబద్ధత, అర్హత కలిగిన ప్రైవేట్, ఫ్రీహోల్డ్ భూములను తక్షణమే 22-A జాబితా నుంచి మినహాయించాలని ఆయన కోరారు. ఆయా భూ యజమానులకు గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వెంటనే పునరుద్ధరించి వారి హక్కులను కాపాడాలని ఈ సందర్భంగా లేఖలో విజ్ఞప్తి చేశారు.

Slum Dog: అమ్మ ఉన్నది అడుక్కోవాడానికి కాదు అన్నం పెట్టడానికి..సినిమాSwechaa28 Sep 2026, 03:50 PM

Slum Dog: అమ్మ ఉన్నది అడుక్కోవాడానికి కాదు అన్నం పెట్టడానికి..

Slum Dog: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ నుంచి వస్తున్న మరో డిఫరెంట్ మూవీ ‘SlumDog: 33 Temple Road’. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, మిస్టరీ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ టబు, సంయుక్త, దునియా విజయ్, జరీనా వహాబ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా, ఈ సినిమా నుంచి జరీనా వహాబ్ పాత్రను రివీల్ చేస్తూ వీడియోను వదిలారు.

బ్లాక్‌ లిస్టులో 2500 ఎకరాల భూమి..  ఫార్మా సిటీ  రైతుల ఆందోళనతెలంగాణSwechaa28 Sep 2026, 03:49 PM

బ్లాక్‌ లిస్టులో 2500 ఎకరాల భూమి.. ఫార్మా సిటీ రైతుల ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు డిమాండ్లు వినాలని గత కొన్నిరోజులు ఫార్మాసిటీ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిరంత‌రాయంగా న్యాయ పోరాటం చేస్తున్న రైతులు..ఇవాళ ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫార్మాసిటీ బాధిత రైతులు, రైతు కూలీలు, గ్రామ ప్ర‌జ‌లు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూమి సేకరించిన విషయం తెలిసిందే. గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నప్పటికీ పోలీసుల బలగాల సాయంతో బలవంతంగా రేవంత్ సర్కార్ భూసేకరణ పూర్తి చేసింది. అయితే, తమకు చెందిన 2500 ఎకరాల పట్టా భూమిని సైతం ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిందని రైతులు ఆందోళనకు దిగారు. ఒప్పందం ప్రకారం తీసుకున్న భూమి కాకుండా తమకు చెందిన పట్టా భూములను ఎలా బ్లాక్ లిస్టులో పెడతారంటూ రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.