స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

బ్లాక్‌ లిస్టులో 2500 ఎకరాల భూమి..  ఫార్మా సిటీ  రైతుల ఆందోళనతెలంగాణSwechaa28 Sep 2026, 03:49 PM

బ్లాక్‌ లిస్టులో 2500 ఎకరాల భూమి.. ఫార్మా సిటీ రైతుల ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు డిమాండ్లు వినాలని గత కొన్నిరోజులు ఫార్మాసిటీ రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నిరంత‌రాయంగా న్యాయ పోరాటం చేస్తున్న రైతులు..ఇవాళ ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫార్మాసిటీ బాధిత రైతులు, రైతు కూలీలు, గ్రామ ప్ర‌జ‌లు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయాల‌ని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు.ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి భూమి సేకరించిన విషయం తెలిసిందే. గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నప్పటికీ పోలీసుల బలగాల సాయంతో బలవంతంగా రేవంత్ సర్కార్ భూసేకరణ పూర్తి చేసింది. అయితే, తమకు చెందిన 2500 ఎకరాల పట్టా భూమిని సైతం ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిందని రైతులు ఆందోళనకు దిగారు. ఒప్పందం ప్రకారం తీసుకున్న భూమి కాకుండా తమకు చెందిన పట్టా భూములను ఎలా బ్లాక్ లిస్టులో పెడతారంటూ రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బహదూర్‌గూడ భూములపై సీఎం రేవంత్ కన్ను పడింది- కేటీఆర్తెలంగాణSwechaa28 Sep 2026, 03:41 PM

బహదూర్‌గూడ భూములపై సీఎం రేవంత్ కన్ను పడింది- కేటీఆర్

Ktr: బహదూర్ గూడ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ భూ బాధితులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. బహదూర్ గూడ రైతులతో మాట్లాడిన కేటీఆర్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రేవంత్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.

మూడేళ్లలో సీఎం రేవంత్ ఒక్క మంచి పనైనా చేశారా? అని కేటీఆర్ అడిగారు. బహదూర్ గూడ భూములపై రేవంత్ కన్ను పడిందన్న కేటీఆర్.. సుప్రీంకోర్టు వెళ్లి బహదూర్ గూడ భూములను కాపాడుతామని ప్రకటించారు. బుల్లెట్ ట్రైన్ పేరుతో రైతులను నిండా ముంచుతున్నారని, ఫ్యూచర్ సిటీ పేరుతో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్. రేవంత్ రెడ్డికి భూముల దందా తప్ప మరేమీ తెలియదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నాడనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోతున్నారన్న కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో ఏడాది మాత్రమే ఉందని గుర్తు చేశారు.

ఉజ్జయినిలో ఉద్రిక్తత.. మసీదు తొలగింపుపై తిరగబడ్డ నిరసనకారులు!NationalSwechaa28 Sep 2026, 03:39 PM

ఉజ్జయినిలో ఉద్రిక్తత.. మసీదు తొలగింపుపై తిరగబడ్డ నిరసనకారులు!

మధ్యప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని నగరంలో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ప్రతిష్టాత్మక రోడ్డు వెడల్పు పనుల కోసం చారిత్రక షాహీ మసీదులోని కొన్ని భాగాలను పాక్షికంగా తొలగించాలన్న మున్సిపల్ అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు చేపట్టిన నిరసన కాస్త హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు, భద్రతా సిబ్బంది మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పాటు పోలీసులపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వాతావరణం మరింత అదుపుతప్పింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు నిరసనకారులపై బాష్పవాయు ప్రయోగం చేశాయి.

కూకట్ పల్లిలో రూ.కోట్ల విలువైన భూ కుంభకోణం.. ఫోర్జరీ పత్రాలతో కుట్ర!స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa28 Sep 2026, 03:32 PM

కూకట్ పల్లిలో రూ.కోట్ల విలువైన భూ కుంభకోణం.. ఫోర్జరీ పత్రాలతో కుట్ర!

హైదరాబాద్ నగర పరిధిలోని కూకట్ పల్లి గ్రామానికి చెందిన సర్వే నంబర్ 1007లోని సుమారు 349 ఎకరాల భూమి చుట్టూ తిరుగుతున్న వివాదం వెనుక కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న కుట్రలు, ఫోర్జరీ పత్రాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నవాబ్ ఫఖ్ర్-ఉల్-ముల్క్ కు చెందిన ఇర్రంనుమా ప్యాలెస్ ఆస్తుల్లో భాగమైన దాదాపు 1500 ఎకరాల విస్తీర్ణానికి నవాబ్ రైస్యార్ జంగ్ బహదూర్ వివాదరహిత యజమానిగా గుర్తింపు పొందారు. 1960లో ఆయన మరణించిన అనంతరం చట్టబద్ధమైన వారసులకు పట్టా హక్కులు లభించగా, 1965-68 కాలంలో కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ (KHB) అభివృద్ధి కోసం ప్రభుత్వం 1110 ఎకరాలను సేకరించి వారసులకు పరిహారం చెల్లించింది.

సౌండ్ ఎక్కువ పెట్టాడని..  పూజారిపై పిడిగుద్దులువైరల్ న్యూస్Swechaa28 Sep 2026, 03:30 PM

సౌండ్ ఎక్కువ పెట్టాడని.. పూజారిపై పిడిగుద్దులు

ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్ వాడకం వలన కొందరు చిరాకు పడుతున్నట్టు తెలుస్తోంది. వినాయక చవితి నిమజ్జనాల సమయంలో డీజే శబ్దాలకు కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. రాత్రింబవళ్లు డీజే సౌండ్స్ వలన చిన్నారులు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గుండె జబ్బులు ఉన్న వారైతే డీజే సౌండ్స్‌కు దూరంగా రాత్రులు గడిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే లౌడ్ స్పీకర్లో భక్తి సాంగ్స్ పెట్టాడని, సౌండ్ తగ్గించడం లేదని ఇద్దరు వ్యక్తులు ఓ పూజారిని చితకబాదారు. పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఈ ఘటన రాజస్థాన్ జైపూర్‌లోని గణేశ్‌నగర్ మెయిన్‌ రోడ్ వద్దగల శివాలయంలో చోటుచేసుకుంది. పెద్ద సౌండ్‌తో పండిట్ రామకృష్ణ భక్తి పాటలు పెట్టడమే ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది.

Salman Khan: రామ్ చరణ్ రీమేక్ సినిమాలో సల్మాన్?సినిమాSwechaa28 Sep 2026, 03:27 PM

Salman Khan: రామ్ చరణ్ రీమేక్ సినిమాలో సల్మాన్?

Salman Khan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీలా నిలిచిన సినిమాల్లో ‘ధృవ’ ఒకటి. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘తని ఒరువన్’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా పోలీస్ ఆఫీసర్, తెలివైన విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2016లో విడుదలైన ఈ చిత్రంలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్‌గా, అరవింద్ స్వామి విలన్‌గా కనిపించారు. అయితే, ఇప్పుడు వంశీ పైడి పల్లి బాలీవుడ్ స్టార్సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న సినిమా దీనికి రీమేక్ అని ప్రచారం జరుగుతోంది.

ఈసీ మోసం వల్లే  ఆర్జేడీ, టీఎంసీ పార్టీల ఓటమి : టీపీసీసీ చీఫ్తెలంగాణSwechaa28 Sep 2026, 03:14 PM

ఈసీ మోసం వల్లే ఆర్జేడీ, టీఎంసీ పార్టీల ఓటమి : టీపీసీసీ చీఫ్

కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోడీ, అమిత్ షాల వైఖరితో దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందన్నారు.ప్రపంచ దేశాలలు భారత్ తీరును చూసి ముక్కున వేలేసుకుంటున్నాయని టీపీసీసీ చీఫ్ మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ సర్కార్ సూచనలతో ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ బీజేపీకి తొత్తుగా మారి, నిష్పాక్షికతను వదిలేసి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ తీరుతో ఓటర్ల భవిష్యత్ రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ఎన్నికల నిర్వహణ మ్యానిపులేట్ అయ్యేలా జరుగుతోందని విమర్శించారు.

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ మీద ట్విస్ట్.. హైకమాండ్ ఫైనల్ కాల్ ఎవరికో?తెలంగాణSwechaa28 Sep 2026, 02:39 PM

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ట్విస్ట్ మీద ట్విస్ట్.. హైకమాండ్ ఫైనల్ కాల్ ఎవరికో?

తెలంగాణలో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలిచి ప్రభుత్వ గ్రాఫ్‌ను నిరూపించుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీకి.. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మాత్రం ఊహించని తలనొప్పిగా మారింది. పీసీసీ పరిశీలించి పంపిన ప్రాథమిక జాబితాలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో గాంధీ భవన్ నుంచి ఢిల్లీ అధిష్ఠానం దాకా ఒకటే ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణలో స్థానికత వివాదం.. మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పుNationalSwechaa28 Sep 2026, 02:32 PM

తెలంగాణలో స్థానికత వివాదం.. మరోసారి సుప్రీంకోర్టు సంచలన తీర్పు

తెలంగాణలో స్థానికత అంశంపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కీలక తీర్పు వెలువరించింది. స్థానిక రిజర్వేషన్లు పొందాలంటే నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అయితే, స్థానికత అంశంపై బెల్లం అంకిత దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం సోమవారం విచారించి డిస్మిస్ చేసింది. నాలుగేళ్ల పాటు ఒకేచోట విద్యాభ్యాస నిబంధన ఏకపక్షంగా ఉందంటూ పిటిషనర్ తరఫున చేసిన వాదనలను కోర్టు తోసిపుచ్చింది.స్థానికత నిర్ధారణలో రాజ్యాంగబద్ధంగా జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల నిబంధనలే అంతిమమని కోర్టు స్పష్టంచేసింది. ఇదే అంశంపై గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుత ధర్మాసనం మరోసారి నొక్కిచెప్పింది.

ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. అప్పుల పాలై దంపతుల బలవన్మరణం!క్రైమ్Swechaa28 Sep 2026, 02:32 PM

ఆన్‌లైన్ గేమ్స్ వ్యసనం.. అప్పుల పాలై దంపతుల బలవన్మరణం!

ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం మరో రెండు ప్రాణాలను బలితీసుకున్న అత్యంత విషాదకర సంఘటన నంద్యాల జిల్లాలో వెలుగుచూసింది. గేమ్స్ ఆడటం సరదాగా మొదలై చివరకు అది ప్రాణాంతక వ్యసనంగా మారడంతో, చేసిన అప్పులు తీర్చలేక ఓ దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన గోస్పాడు మండలం సాంబవరం గ్రామంలో చోటుచేసుకోగా, స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. ఒకరు అరెస్టు!క్రైమ్Swechaa28 Sep 2026, 02:03 PM

హైదరాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. ఒకరు అరెస్టు!

హైదరాబాద్ మహానగరంలో నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు అయ్యింది. గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ కరెన్సీని నగరంలో చెలామణికి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ కరెన్సీ ఎక్కడ నుంచి వస్తుందని, ఎవరు సరఫరా చేస్తున్నారని పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. స్థానికంగా ఉండే చిరువ్యాపారులను నిందితుడు పలుమార్లు బురిడీ కొట్టించాడని తెలుస్తోంది. వివరాల్లోకివెళితే.. నగరంలోని బేగంబజార్‌లో నకిలీ రూ. 500 నోట్లను చెలామణి చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన విక్రమ్ (21) అనే యువకుడిని గోషామహల్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8 వేల విలువ గల 16 నకిలీ రూ.500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బేగంబజార్ పరిసరాల్లోని చిన్న చిన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకున్నట్టు విచారణలో తేలింది.

నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్న లైంగిక దాడులు.. సుప్రీంకోర్టు సీరియస్..!NationalSwechaa28 Sep 2026, 01:27 PM

నిర్భయ ఘటనను గుర్తుచేస్తున్న లైంగిక దాడులు.. సుప్రీంకోర్టు సీరియస్..!

దేశ రాజధాని ప్రాంతం (ఢిల్లీ-ఎన్సీఆర్) పరిధిలో మైనర్ బాలికలపై వరుసగా చోటుచేసుకుంటున్న దారుణ లైంగిక దాడుల ఘటనలపై దేశ అత్యున్నత నాయస్థానం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కదులుతున్న స్లీపర్ బస్సులో బాలికపై జరిగిన దారుణంతో పాటు, దక్షిణ ఢిల్లీలోని ఒక పార్కులో జరిగిన సామూహిక అత్యాచార సంఘటనలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.

విద్యుత్ కొరత విమర్శల వేళ రంగంలోకి కేంద్రం.. పశ్చిమ బెంగాల్ పర్యటనలో కిషన్ రెడ్డి!NationalSwechaa28 Sep 2026, 01:12 PM

విద్యుత్ కొరత విమర్శల వేళ రంగంలోకి కేంద్రం.. పశ్చిమ బెంగాల్ పర్యటనలో కిషన్ రెడ్డి!

దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడం, బొగ్గు సరఫరాపై రాజకీయంగా తీవ్ర చర్చ కొనసాగుతున్న వేళ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్నారు. తక్కువ రుతుపవన వర్షపాతం కారణంగా అనేక ప్రాంతాల్లో జలవిద్యుత్ ఉత్పత్తి తగ్గిపోవడంతో, గ్రిడ్ స్థిరత్వాన్ని కాపాడేందుకు థర్మల్ విద్యుత్ ప్లాంట్లపై భార అదనంగా పడింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు లభ్యతను, రవాణా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం.. ఐఎండీ వర్ష హెచ్చరికలు!ఏపీSwechaa28 Sep 2026, 01:00 PM

బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం.. ఐఎండీ వర్ష హెచ్చరికలు!

బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే వచ్చిన వరదల నుంచి కోలుకుంటున్న తీర ప్రాంత ప్రజలు తాజా వర్ష సూచనలతో మళ్లీ కలవరపడుతున్నారు. మయన్మార్, అండమాన్ దీవుల సమీపంలో ఏర్పడిన ఈ వాయుగుండం, ప్రస్తుతం అండమాన్‌లోని మాయాబందర్‌కు తూర్పు-ఈశాన్య దిశలో సుమారు 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Balakrishna: మోక్షజ్ఞ–వశిష్ఠ సినిమా స్క్రిప్ట్ విన్న బాలయ్య..ఏదో నచ్చలేదా?సినిమాSwechaa28 Sep 2026, 12:41 PM

Balakrishna: మోక్షజ్ఞ–వశిష్ఠ సినిమా స్క్రిప్ట్ విన్న బాలయ్య..ఏదో నచ్చలేదా?

Balakrishna: నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో మోక్షజ్ఞ హీరోగా తెరకెక్కనున్న సినిమా ఒకటి. యువ కథానాయకుడిగా మోక్షజ్ఞ ఎలాంటి కథతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడనే దానిపై ఇప్పటికే భారీ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాను యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్నారనే వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చగా మారింది.

సమ్మె వాయిదాతో బ్యాంకు ఉద్యోగులకు షాక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!వైరల్ న్యూస్Swechaa28 Sep 2026, 12:28 PM

సమ్మె వాయిదాతో బ్యాంకు ఉద్యోగులకు షాక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీమ్స్!

దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు జరగాల్సిన బ్యాంకుల సమ్మె అర్ధరాత్రి వేళ అనూహ్యంగా వాయిదా పడటంతో బ్యాంకింగ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక (UFBU), ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రతినిధుల మధ్య ఆదివారం అర్ధరాత్రి దాకా జరిగిన చర్చలు విజయవంతం కావడంతో సమ్మెను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. దీంతో సోమవారం ఉదయం నుంచి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి.

Asiangames: వర్షంతో క్వార్టర్స్ రద్దు.. నేరుగా సెమీఫైనల్స్‌కు టీమిండియా!క్రీడలుSwechaa28 Sep 2026, 12:15 PM

Asiangames: వర్షంతో క్వార్టర్స్ రద్దు.. నేరుగా సెమీఫైనల్స్‌కు టీమిండియా!

ఆసియా క్రీడల పురుషుల క్రికెట్ విభాగంలో భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరగాల్సిన రెండవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. కరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వల్ల టాస్ వేయడం కూడా సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్ రద్దు కాగా, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న కారణంగా టీమిండియా నేరుగా సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

చిత్రం లేదు
తెలంగాణSwechaa28 Sep 2026, 12:06 PM

Hyderabad: నగరానికి సమస్యగా మారిన వ్యర్థాలు.. నిమజ్జనం తర్వాత 13 వేల టన్నుల చెత్త!!..

గణేశ్‌ నిమజ్జనాల సందడి ముగిసింది.. కానీ నగరానికి మాత్రం భారీ చెత్త సమస్య మిగిలింది. నిమజ్జన పాయింట్లు, శోభాయాత్ర మార్గాల్లో జిడ్డు, ఆహార వ్యర్థాలు, పూజా సామగ్రి, కలర్‌ పేపర్లు పేరుకుపోయాయి. రోడ్లపై అతుక్కుపోయిన వ్యర్థాలతో వాహనాలు స్కిడ్‌ అవుతుండటంతో జీహెచ్‌ఎంసీ ఆరు వాటర్‌ ప్రెజర్‌ మెషీన్లతో ప్రత్యేక శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టింది. రెండు రోజుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే సుమారు 6 వేల మెట్రిక్‌ టన్నుల చెత్త సేకరించగా.. మూడు కార్పొరేషన్ల పరిధిలో ఈ మొత్తం 13 వేల మెట్రిక్‌ టన్నులకు చేరింది. ఈ వ్యర్థాలను జవహర్‌నగర్‌ డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నారు. మొత్తంగా 15 వేల మంది పారిశుధ్య సిబ్బంది క్లీనింగ్‌ పనుల్లో పాల్గొంటున్నారు.

ఈసీపై విపక్షాల మెగా భేటీ.. 30న ఏం జరగబోతోంది? జ్ఞానేశ్ కుమార్‌పై నెక్ట్స్ స్టెప్ ఇదేనా?NationalSwechaa28 Sep 2026, 12:04 PM

ఈసీపై విపక్షాల మెగా భేటీ.. 30న ఏం జరగబోతోంది? జ్ఞానేశ్ కుమార్‌పై నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై విపక్షాల ఒత్తిడి పెరుగుతోంది. సెప్టెంబర్ 30న ఢిల్లీలో 21కి పైగా విపక్ష పార్టీలు సమావేశమై తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నాయి. మరోవైపు సీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ కూడా అక్టోబర్ 2 నుంచి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.

'మన్ కీ బాత్'లో ఉసిరిపై ప్రధాని మోదీ ప్రశంసలుNationalSwechaa28 Sep 2026, 11:39 AM

'మన్ కీ బాత్'లో ఉసిరిపై ప్రధాని మోదీ ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో ప్రసంగ కార్యక్రమం 'మన్ కీ బాత్' తాజా ఎపిసోడ్‌లో భారతీయ సాంప్రదాయ ఫలమైన ఉసిరి విశిష్టతను ప్రత్యేకంగా కొనియాడారు. ఉసిరికాయను అద్భుతమైన 'సూపర్‌ఫుడ్'గా అభివర్ణించిన ఆయన, ఇది ఒకవైపు ఆరోగ్య సంపత్తిని అందిస్తూనే మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధికి, ఆదాయ మార్గాలకు ఎంతగానో తోడ్పడుతోందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు పౌష్టికాహార భద్రతను కూడా బలోపేతం చేయవచ్చని ఆయన పిలుపునిచ్చారు.

Kayadu Lohar: ఇంత బోల్డ్ సీన్స్ ఎందుకు ఒప్పుకుంది..అందుకే కీర్తి తప్పుకుందా?సినిమాSwechaa28 Sep 2026, 11:00 AM

Kayadu Lohar: ఇంత బోల్డ్ సీన్స్ ఎందుకు ఒప్పుకుంది..అందుకే కీర్తి తప్పుకుందా?

Kayadu Lohar: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ విడుదల తర్వాత సినిమాలోని కయాదు లోహర్ పాత్రపై పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా ఆమె పోషించిన సుబ్బు పాత్రలోని బోల్డ్, సజెసివ్ సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. దీంతో అసలు ఈ పాత్రను కయాదు ఎందుకు ఒప్పుకుంది? మొదట ఈ ప్రాజెక్ట్‌తో కీర్తి సురేష్ పేరు వినిపించిన నేపథ్యంలో.. ఆమె ఈ పాత్ర నుంచి తప్పుకోవడానికి ఇదే కారణమా? అనే చర్చ కూడా మొదలైంది.

Hyderabad: శంషాబాద్‌లో కలకలం.. క్యాబ్‌లో మహిళకు చేదు అనుభవం!..క్రైమ్Swechaa28 Sep 2026, 10:57 AM

Hyderabad: శంషాబాద్‌లో కలకలం.. క్యాబ్‌లో మహిళకు చేదు అనుభవం!..

హైదరాబాద్ శివారులో క్యాబ్ డ్రైవర్ దారుణ యత్నం కలకలం రేపింది. గచ్చిబౌలికి చెందిన 35 ఏళ్ల మహిళ ఆదివారం రాత్రి క్యాబ్‌లో ప్రయాణిస్తుండగా.. తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద డ్రైవర్ షార్ట్‌కట్ పేరుతో వాహనాన్ని సర్వీస్ రోడ్డువైపు మళ్లించాడు. కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కారును ఆపి, మహిళపై లైంగిక దాడికి యత్నించినట్లు ఫిర్యాదు నమోదైంది. భయంతో ఆమె కేకలు వేయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్లే సమయంలో ఆమె వద్ద ఉన్న రూ.60 వేల నగదు బ్యాగ్‌ను తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆర్‌జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Telangana: కొంగర ఖుర్ద్‌లో భూ బీభత్సం ఎవరిది?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa28 Sep 2026, 10:39 AM

Telangana: కొంగర ఖుర్ద్‌లో భూ బీభత్సం ఎవరిది?

తెలంగాణ భూ చట్టాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి. కోర్టులు కేసును బట్టి తీర్పులు ఇస్తున్నాయి. కోర్టుకు సమర్పించే పేపర్స్ ఒరిజినలా, ఫేకా గుర్తు పట్టలేని పరిస్థితులు ఉన్నాయి. వాటికి తోడుగా సుప్రీంకోర్టు, హైకోర్టు ఫుల్ బెంచ్‌లు కామన్ ఆర్డర్స్‌తో టైటిల్ లేకుంటే ఏనాటికైనా టైటిల్ దారుడుకే చెందుతుందని కొన్ని కేసుల్లో తీర్పులు ఇవ్వడంతో భూ వివాదాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. వీటికి తోడుగా ఇనాం చట్టాలు, పీటీ దారుల హక్కులు, అర్బన్ సిలింగ్ యాక్ట్ ఎత్తివేయడంతో 70 ఏండ్ల క్రితం నాటి టైటిల్ దారులు పుట్టుకొస్తున్నారు. దశాబ్దాల నుంచి పొజిషన్‌లో ఉన్నా కూడా, ఆ ఆస్తి నీది కాదని నోటీస్ ఇస్తే చాలు ఆ క్షణం నుంచి కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ప్రభుత్వ అండదండలు ఉంటే ఎలాంటి స్టాండెండ్ ఆపరేటివ్ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండానే కబ్జాలు చేసుకుంటూ భయాందోళనకు గురి చేస్తున్నారు.

LPUలో అసలేం జరిగింది..? రేప్ ఆరోపణలపై యూనివర్సిటీ వీడియో.. విద్యార్థినుల సంచలన ఆరోపణలు!NationalSwechaa28 Sep 2026, 09:54 AM

LPUలో అసలేం జరిగింది..? రేప్ ఆరోపణలపై యూనివర్సిటీ వీడియో.. విద్యార్థినుల సంచలన ఆరోపణలు!

లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ—ఎల్‌పీయూలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఓ విద్యార్థినిపై క్యాంపస్‌లో లైంగిక దాడి జరిగిందని, ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరగడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలు క్రమంగా హింసాత్మకంగా మారాయి.

SS Rajamouli: సూర్యతో రాజమౌళి సినిమా.. వారణాసి తర్వాత ప్రకటిస్తారా?సినిమాSwechaa28 Sep 2026, 09:42 AM

SS Rajamouli: సూర్యతో రాజమౌళి సినిమా.. వారణాసి తర్వాత ప్రకటిస్తారా?

SS Rajamouli: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా వస్తుందా? ఇప్పుడు సినీ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నోసార్లు ఈ కాంబినేషన్‌పై వార్తలు వచ్చినప్పటికీ.. తాజాగా రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చాయి.

విదేశీ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఎన్నిరోజులంటే?తెలంగాణSwechaa28 Sep 2026, 09:34 AM

విదేశీ పర్యటనకు స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఎన్నిరోజులంటే?

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. స్టడీ టూర్‌లో భాగంగా పలు దేశాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. ఆయన వెంట పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం వెళ్లనున్నట్టు సమాచారం. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 8 వరకు స్పీకర ప్రసాద్ పర్యటన కొనసాగనుంది. స్టడీ టూర్‌లో భాగంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్‌ దేశాల్లో స్పీకర్ బృందం పర్యటించనుంది. అందులో శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఆయన సతీమణి గుత్తా అరుంధతి, డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాశ్‌, ఆయన సతీమణి బండ అనితాప్రకాశ్‌, కౌన్సిల్‌ కార్యదర్శి డాక్టర్‌ వి.నరసింహాచార్యులు, అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్పీకర్‌ ఓఎస్డీ వెంకటేశ్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా ఆయా దేశాల్లోని పార్లమెంట్‌ హౌస్‌లను సందర్శించనున్నారు.అంతేకాకుండా, అక్కడి భారత రాయబార కార్యాలయాల సీనియర్ అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది.

‘ఇందిరమ్మ’ డిపాజిట్ ఇంకెప్పుడిస్తరు సీఎం సారూ?తెలంగాణSwechaa28 Sep 2026, 09:12 AM

‘ఇందిరమ్మ’ డిపాజిట్ ఇంకెప్పుడిస్తరు సీఎం సారూ?

హైదరాబాద్‌ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల టవర్లలో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకుని, డ్రాలో ఎంపిక కాని వారికి ప్రభుత్వం డిపాజిట్ సొమ్ము (EMD) రూ. 10,000 తిరిగి ఇచ్చే ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు (TGHB) ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తోంది.అయితే, చాలా మందికి డిపాజిట్ సొమ్ము రాలేదని టాక్ వినిపిస్తోంది. దీంతో తమకు రీఫండ్ ఎప్పుడు వస్తుందా? అని దరఖాస్తుదారులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌ లక్కీ డ్రాలో పాల్గొనేవారు రూ.10వేలు డిపాజిట్ కట్టాలని, లక్కీడ్రాలో ఇళ్లు వచ్చిన వారికి ఆ సొమ్ము తిరిగి ఇవ్వబడదని, పేరు రాని వారికి వెంటనే ప్రభుత్వం రీఫండ్ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, లక్కీ డ్రా నిర్వహించి నెల రోజులు పూర్తయినా ఇంకా దరఖాస్తు దారులకు టోకెన్ అమౌంట్ రాలేదు.

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్..అడ్డుకోబోయిన మహిళపై!క్రైమ్Swechaa28 Sep 2026, 08:52 AM

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్..అడ్డుకోబోయిన మహిళపై!

హైదరాబాద్ మహానగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచారం మరోసారి కలకలం రేపింది. మణికొండ నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్ వెనుక వైపున్న చెరువు ఫెన్సింగ్‌ను కత్తిరించి సుమారు ఆరుగురు సభ్యుల చెడ్డీ గ్యాంగ్ ముఠా లోపలికి చొరబడింది. సీ-బ్లాక్ మెట్ల మార్గం ద్వారా ఒక ఫ్లాట్‌లోకి ప్రవేశించి విలువైన వస్తువులను దోచుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో వారిని గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక మహిళపై ఆయుధాలతో దాడికి పాల్పడగా.. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరార్ అయినట్టు తెలుస్తోంది. తెల్లవారుజామున 3:20 గంటల ప్రాంతంలో ఆరుగురు అనుమానితులు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించినట్టు సీసీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. సదరు మహిళతో ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం.

డీజే సౌండ్స్‌పై అల్లు శిరీష్ ఆగ్రహం.. సంచలన ట్వీట్తెలంగాణSwechaa28 Sep 2026, 08:37 AM

డీజే సౌండ్స్‌పై అల్లు శిరీష్ ఆగ్రహం.. సంచలన ట్వీట్

రాష్ట్రంలో వినాయక చవితి పండుగ అయిపోయినా డీజే సౌండ్స్ మాత్రం ఆగడం లేదని సినీ నటుడు అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రుళ్లు డీజే సౌండ్స్ మోత మోగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పోలీసులు వెంటనే ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. వివరాల్లోకివెళితే.. అల్లు శిరీష్ నివాసం ఉంటున్న పరిసరాల్లో కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద శబ్దాలతో డీజే పెడుతున్నారని, ఫలితంగా పిల్లలు, పెద్దలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సోషల్ మీడియా వేదికగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వినోభా నగర్‌లోని హనుమాన్ ఆలయంలో రాత్రి 2/3 వరకు అనుమతించిన దాని కన్నా ఎక్కువ శబ్దంతో సంగీతం మోగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

Telangana: అమిత్ షా టూర్‌తో తెలంగాణలో పొలిటికల్ హీట్!.. బీజేపీ–బీఆర్ఎస్ పొత్తు పొడిచిందా?!..తెలంగాణSwechaa28 Sep 2026, 07:44 AM

Telangana: అమిత్ షా టూర్‌తో తెలంగాణలో పొలిటికల్ హీట్!.. బీజేపీ–బీఆర్ఎస్ పొత్తు పొడిచిందా?!..

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ–బీఆర్ఎస్ మధ్య పొత్తు చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానుండటంతో.. ఈ పర్యటన చుట్టూ రాజకీయ వర్గాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అధికారికంగా ఇది ఒక కార్యక్రమం కోసం జరుగుతున్న పర్యటనే అయినప్పటికీ.. రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం అమిత్ షా హాజరుకానున్న కార్యక్రమం ప్రతిమ గ్రూప్‌కు సంబంధించినది. ఆ సంస్థ ఛైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు.. అయితే బోయినపల్లి కుటుంబానికి బీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్‌తో ఉన్న రాజకీయ సంబంధాలను ప్రస్తావిస్తూ.. ఈ పర్యటనను బీజేపీ–బీఆర్ఎస్ మధ్య భవిష్యత్ సమీకరణాలకు సంకేతంగా కొందరు రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.