స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Telangana: అమిత్ షా టూర్‌తో తెలంగాణలో పొలిటికల్ హీట్!.. బీజేపీ–బీఆర్ఎస్ పొత్తు పొడిచిందా?!..తెలంగాణSwechaa28 Sep 2026, 07:44 AM

Telangana: అమిత్ షా టూర్‌తో తెలంగాణలో పొలిటికల్ హీట్!.. బీజేపీ–బీఆర్ఎస్ పొత్తు పొడిచిందా?!..

తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ–బీఆర్ఎస్ మధ్య పొత్తు చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అక్టోబర్ 4న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు రానుండటంతో.. ఈ పర్యటన చుట్టూ రాజకీయ వర్గాల్లో కొత్త లెక్కలు మొదలయ్యాయి. అధికారికంగా ఇది ఒక కార్యక్రమం కోసం జరుగుతున్న పర్యటనే అయినప్పటికీ.. రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం అమిత్ షా హాజరుకానున్న కార్యక్రమం ప్రతిమ గ్రూప్‌కు సంబంధించినది. ఆ సంస్థ ఛైర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు.. అయితే బోయినపల్లి కుటుంబానికి బీఆర్ఎస్ నేత వినోద్‌కుమార్‌తో ఉన్న రాజకీయ సంబంధాలను ప్రస్తావిస్తూ.. ఈ పర్యటనను బీజేపీ–బీఆర్ఎస్ మధ్య భవిష్యత్ సమీకరణాలకు సంకేతంగా కొందరు రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు.

Health: అసిడిటీతో ఇబ్బందా.. జీర్ణవ్యవస్థకు మేలు చేసే యోగాసనాలు ఇవే!..HealthSwechaa28 Sep 2026, 07:39 AM

Health: అసిడిటీతో ఇబ్బందా.. జీర్ణవ్యవస్థకు మేలు చేసే యోగాసనాలు ఇవే!..

తిన్న ప్రతిసారీ ఛాతీలో మంట.. కడుపులో ఉబ్బరం.. గొంతులోకి పుల్లటి ద్రవం వచ్చినట్టుగా అనిపిస్తుందా?.. అయితే తరచూ వేధించే అసిడిటీకి ఆహారపు అలవాట్లలో మార్పులు ఎంత ముఖ్యమో.. శరీరాన్ని చురుగ్గా ఉంచడం కూడా అంతే కీలకం. ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై సానుకూల ప్రభావం చూపించే కొన్ని యోగాసనాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల అసిడిటీ లక్షణాల నుంచి ఉపశమనం పొందేందుకు కొంత సహాయం లభించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Health: దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రిస్తున్నారా..?  అయితే ఈ విషయం తెలుసుకోండి! ..HealthSwechaa28 Sep 2026, 07:31 AM

Health: దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రిస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసుకోండి! ..

నిద్రించే సమయంలో ఫోన్‌ను దిండు కింద పెట్టుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. అలారం కోసం కావొచ్చు.. వెంటనే నోటిఫికేషన్లు చూసేందుకు కావొచ్చు.. ఫోన్‌ను మాత్రం తలకు అతి దగ్గరగా పెట్టుకుని నిద్రించే పద్ధతి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా ఫోన్‌ను దిండు కింద పెట్టుకుని ఛార్జింగ్ చేయడం మరింత ప్రమాదకరం. దిండు, దుప్పటి వంటి వస్తువులు ఫోన్ చుట్టూ వేడిని బయటకు వెళ్లకుండా అడ్డుకుంటాయి. దీంతో పరికరం అధికంగా వేడెక్కే అవకాశం ఉంటుంది. బ్యాటరీ దెబ్బతినడంతో పాటు, అరుదైన సందర్భాల్లో బ్యాటరీలో సమస్యలు తలెత్తి అగ్ని ప్రమాదానికి కూడా దారితీయవచ్చు. అందుకే ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్‌ను ఎప్పుడూ దిండు కింద లేదా మంచం మీద పెట్టకూడదని అంటున్నారు.

National: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా సేవలు!NationalSwechaa28 Sep 2026, 07:27 AM

National: బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా.. నేటి నుంచి యథావిధిగా సేవలు!

అయిదు రోజుల పనివారంతో పాటు తమ డిమాండ్లపై ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) హామీ ఇవ్వడంతో బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల దేశవ్యాప్త సమ్మెను వాయిదా వేశాయి. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యూఎఫ్‌బీయూ) పిలుపునిచ్చిన ఈ సమ్మె నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. సమ్మె వాయిదా పడటంతో సోమవారం బ్యాంకులు యథావిధిగా పనిచేయనున్నాయి.

Spirituality: ప్రతి రోజూ దైవస్మరణ ఎందుకు.. దైవ పూజ ఎప్పుడు చేయాలి!..SpiritualitySwechaa28 Sep 2026, 07:12 AM

Spirituality: ప్రతి రోజూ దైవస్మరణ ఎందుకు.. దైవ పూజ ఎప్పుడు చేయాలి!..

మనిషి జీవితంలో దైవస్మరణకు సమయం అంటూ ప్రత్యేకమైన ముహూర్తం అవసరం లేదు. సుఖంలో ఉన్నా.. దుఃఖంలో ఉన్నా.. సంపద ఉన్నా.. సమస్యలు ఎదురైనా.. దైవాన్ని స్మరించడం భారతీయ సంప్రదాయంలో జీవన విధానంగా భావించారు. ఎందుకంటే పూజ అనేది కష్టాలను తొలగించుకోవడానికి మాత్రమే చేసే ప్రార్థన కాదు.. మనిషి తన కర్మను పవిత్రం చేసుకునే సాధన..

వేదాంత సంప్రదాయం మనిషి జీవితాన్ని కర్మతో విడదీయరాని బంధంగా చూస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్మ, కర్తవ్యబోధ, యజ్ఞభావనలను వివరిస్తూ.. ఫలితంపై మాత్రమే ఆసక్తి పెట్టకుండా ధర్మబద్ధంగా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని ఉపదేశిస్తాడు. అంటే దైవారాధన అనేది ఆలయంలో దీపం వెలిగించడంతో ముగిసిపోదు. మనం చేసే ప్రతి పనిలో ధర్మాన్ని నిలబెట్టడం కూడా దైవపూజలో భాగమే.

Spirituality: పితృపక్షాల వెనుక ఉన్న సనాతన సందేశం ఇదే!..SpiritualitySwechaa28 Sep 2026, 07:01 AM

Spirituality: పితృపక్షాల వెనుక ఉన్న సనాతన సందేశం ఇదే!..

ఒక తరం వెళ్లిపోతుంది.. మరో తరం ఈ భూమిపైకి వస్తుంది. కానీ తరాలు మారినా చెదరిపోని ఒక బంధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. అదే పూర్వీకుల జ్ఞాపకం.. అదే వంశ మూలాలతో మనిషికి ఉన్న అనుబంధం. ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకోవడానికి భారతీయ సంస్కృతి ప్రత్యేకంగా కేటాయించిన పవిత్ర కాలమే పితృపక్షం.. మహాలయ పక్షం.మనిషి తన పుట్టిన రోజును గుర్తు చేసుకుంటాడు.. వివాహ దినోత్సవాన్ని జరుపుకుంటాడు.. పండుగలను వైభవంగా నిర్వహిస్తాడు. కానీ తనకు ముందు తరాల పూర్వీకులను స్మరించుకోవడానికి కూడా ఒక ప్రత్యేక కాలాన్ని ఏర్పాటు చేసుకున్న సంస్కృతి మన భారతీయ సంప్రదాయంలో కనిపిస్తుంది. అందుకే పితృపక్షం అంటే కేవలం మరణించిన వారిని తలచుకునే కాలం కాదు.. మన ఉనికికి మూలమైన వంశాన్ని, మనకు జీవితం అందించిన తరాలను స్మరించుకునే ఆధ్యాత్మిక పర్వంగా చెబుతారు.

Spirituality: తిరుమలలో ఏకైక శైవ క్షేత్రం.. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత తెలుసా?..SpiritualitySwechaa28 Sep 2026, 06:57 AM

Spirituality: తిరుమలలో ఏకైక శైవ క్షేత్రం.. ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత తెలుసా?..

భూలోక వైకుంఠంగా భక్తులు భావించే తిరుమల క్షేత్రానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంప్రదాయం ఉంది. శ్రీవేంకటేశ్వరుడు కొలువైన ఈ వైష్ణవ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా పరమేశ్వరుడు ఉన్నాడని స్థలపురాణం చెబుతోంది. అందుకే తిరుమల యాత్రలో కపిలతీర్థానికి ప్రత్యేక స్థానం ఏర్పడింది.

తిరుపతిలోని అలిపిరికి సమీపంలో ఉన్న కపిలతీర్థం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఏకైక శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వయంభువుగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వరస్వామి శివలింగం గుహాలయంలో దర్శనమిస్తుంది. కపిలేశ్వరుడితో పాటు కామాక్షి అమ్మవారు, నరసింహస్వామి తదితర దేవతామూర్తులను కూడా భక్తులు దర్శించుకోవచ్చు.

KTR: పాలమూరు బిడ్డ కాదు.. రైతుల పాలిట శత్రువు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!తెలంగాణSwechaa27 Sep 2026, 10:13 PM

KTR: పాలమూరు బిడ్డ కాదు.. రైతుల పాలిట శత్రువు.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్!

KTR: పాలమూరు ముద్దుబిడ్డనని, నల్లమల పులినని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి వాస్తవానికి అన్నదాతల పాలిట ప్రథమ శత్రువుగా మారారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సొంత జిల్లాలోనే పంటలు నిలువునా ఎండిపోతుంటే ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. "ఇక్కడేమో నల్లమల పులిబిడ్డనని గొప్పలు చెప్పుకోవడం.. తీరా ఏపీలో చంద్రబాబు దగ్గరికి వెళ్లేసరికి పిల్లిలా మారిపోవడం రేవంత్‌కే చెల్లింది" అంటూ కేటీఆర్ చేసిన ఘాటు విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి దశదినకర్మ ముగించుకుని తిరుగుపయనమైన కేటీఆర్ కాన్వాయ్‌ను దేశీ ఇటిక్యాల శివారులో రైతులు ఆపారు. సాగునీరు అందక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్నాయని, తమ గోడు వినాలని కన్నీటి పర్యంతమయ్యారు. అన్నదాతల ఆవేదన చూసి చలించిపోయిన కేటీఆర్.. వెంటనే వాహనం దిగి స్వయంగా పత్తి, మొక్కజొన్న పొలాల్లోకి వెళ్లి నష్టాన్ని పరిశీలించారు.

TG: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. 41 కొత్త 2బీ బార్లకు గ్రీన్ సిగ్నల్, 28 నుంచే దరఖాస్తులు!తెలంగాణSwechaa27 Sep 2026, 10:01 PM

TG: మద్యం ప్రియులకు కిక్కిచ్చే న్యూస్.. 41 కొత్త 2బీ బార్లకు గ్రీన్ సిగ్నల్, 28 నుంచే దరఖాస్తులు!

TG: తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 41 మద్యం బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అధికారికంగా అనుమతులు మంజూరు చేసింది. పెరిగిన జనాభా, కొత్త పురపాలక సంఘాల ఆవిర్భావం, మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం నేపథ్యంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది. అర్హులైన వ్యాపారుల నుంచి 2బీ బార్ల లైసెన్సుల నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తూ పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను తాజాగా రిలీజ్ చేసింది. ఒక్కో అప్లికేషన్‌కు నాన్-రీఫండబుల్ ఫీజుగా ఏకంగా రూ.1 లక్ష నిర్ణయించడం ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఈ నెల 28 నుంచి అక్టోబర్ 12 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఈ గడువు అందుబాటులో ఉంటుంది. క్యూర్‌ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ఏరియాల్లో ఏర్పాటయ్యే 14 బార్లకు సంబంధించి హైదరాబాద్‌లోని అబ్కారీ భవన్ కమిషనర్ కార్యాలయంతో పాటు స్థానిక డీసీ ఆఫీసుల్లో దరఖాస్తులు సమర్పించవచ్చు.

Kedarnath: కేదార్‌నాథ్‌లో కొండచరియల బీభత్సం.. ఘాట్ రోడ్డులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు!తెలంగాణSwechaa27 Sep 2026, 09:55 PM

Kedarnath: కేదార్‌నాథ్‌లో కొండచరియల బీభత్సం.. ఘాట్ రోడ్డులో చిక్కుకున్న తెలుగు యాత్రికులు!

Kedarnath: కేదార్‌నాథ్ ఘాట్ రోడ్‌లో ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. గౌరీకుండ్ సమీపంలోని కొండ ప్రాంతం ఒక్కసారిగా కుప్పకూలి పడటంతో రాళ్లు, మట్టి పెళ్లలు రోడ్డుపైకి వచ్చాయి. ఘాట్ రోడ్డుపై రాకపోకలు హఠాత్తుగా స్తంభించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, దాదాపు 10 వేల మంది భక్తులు ఘాట్ మార్గంలోనే చిక్కుకుపోయారు.

EPFO: కన్నీటి వేళ కొండంత అండ! ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ ప్రాసెస్.. సభ్యుడు మరణిస్తే కుటుంబం ఏం చేయాలి?NationalSwechaa27 Sep 2026, 09:28 PM

EPFO: కన్నీటి వేళ కొండంత అండ! ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ ప్రాసెస్.. సభ్యుడు మరణిస్తే కుటుంబం ఏం చేయాలి?

EPFO: ఇంట్లో సంపాదించే వ్యక్తి ఉన్నట్లుండి తనువు చాలిస్తే.. ఆ కుటుంబం ఎదుర్కొనే వేదన మాటల్లో వర్ణించలేనిది. కంటిముందు బతుకు శూన్యమై, రేపటి జీవనంపై ప్రశ్నార్థకం మిగిలిన వేళ, చాలామందికి తమ హక్కులేమిటో తెలియక మరింత కుంగిపోతుంటారు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో వేతన జీవులుగా పని చేస్తున్న ఉద్యోగుల కుటుంబాల కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కల్పిస్తున్న రక్షణ కవచంపై సమాజంలో ఇప్పటికీ ఎంతో మందికి సరైన అవగాహన లేదుపీఎఫ్ అంటే కేవలం ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే పొదుపు పైసలే అనుకుంటారు చాలా మంది. కానీ సర్వీసులో ఉండగా సదరు ఉద్యోగి ప్రాణాలు కోల్పోతే, బాధిత కుటుంబానికి ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మూడు కీలక ఆర్థిక ఊరటలు చట్టబద్ధంగా లభిస్తాయని ఎంత మందికి తెలుసు. ఆ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ఎలాంటి అడుగులు వేయాలి? బెనిఫిట్స్ ఎలా పొందాలి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం..

Allu Arjun: లోకేష్ కనగరాజ్ మూవీలో స్టైలిష్ కాప్‌గా ఐకాన్ స్టార్?సినిమాSwechaa27 Sep 2026, 09:17 PM

Allu Arjun: లోకేష్ కనగరాజ్ మూవీలో స్టైలిష్ కాప్‌గా ఐకాన్ స్టార్?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘పుష్ప’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న బన్నీ.. ఇకపై మరింత భారీ స్థాయి సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి రోజుకో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐకాన్ స్టార్ స్టైలిష్ కాప్‌గా నటించనున్నట్టుగా ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

NBK-DaDa: మైసూర్‌లో ‘దాదా’ సందడి..కొత్త షెడ్యూల్‌లో బాలయ్యసినిమాSwechaa27 Sep 2026, 08:56 PM

NBK-DaDa: మైసూర్‌లో ‘దాదా’ సందడి..కొత్త షెడ్యూల్‌లో బాలయ్య

NBK-DaDa: గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే వరుస విజయాలతో దూసుకెళ్తున్న బాలయ్య.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘దాదా’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మైసూర్‌లో ప్రారంభమైనట్లు సమాచారం.

Venkatesh: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’.. మాస్ సాంగ్ రిలీజ్.!సినిమాSwechaa27 Sep 2026, 08:40 PM

Venkatesh: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’.. మాస్ సాంగ్ రిలీజ్.!

Venkatesh: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ‘నారాయణమ్మ’.. మాస్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండవుతూ క్షణాల్లో వందలకొద్దీ వ్యూస్ రాబడుతోంది. ముఖ్యంగా డాన్స్ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ అందించిన మాసివ్ స్టెప్స్ బావున్నాయి. వెంకీకి ఎలాంటి సాంగ్ పడితే థియోటర్స్‌లో ఆడియన్స్ లేచి డాన్స్ చేస్తారో అలాంటి మాస్ స్టెప్స్‌ను కంపోజ్ చేశారు భాను.

Boxing Medals: రింగ్‌లో భారత్‌ పంచ్ పవర్.. 3 మెడల్స్ ఖాయం చేసుకున్న బాక్సర్లు!క్రీడలుSwechaa27 Sep 2026, 08:36 PM

Boxing Medals: రింగ్‌లో భారత్‌ పంచ్ పవర్.. 3 మెడల్స్ ఖాయం చేసుకున్న బాక్సర్లు!

Boxing Medals: ఆసియా క్రీడల్లో భారత బాక్సింగ్ దళం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ పంచ్‌ల వర్షం కురిపించిన భారత బాక్సర్లు ఒకే రోజు ఏకంగా మూడు పతకాలను భారత్ ఖాతాలో లాక్ చేసి సంచలనం సృష్టించారు. 18వ ఆసియా క్రీడల ఎనిమిదో రోజున రింగ్‌లోకి దిగిన మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లి దేశానికి కనీసం మూడు కాంస్య పతకాలను ఖాయం చేశారు.నగోయా వేదికగా సాగుతున్న పోటీల్లో ఆదివారం భారత బాక్సర్లు రెచ్చిపోయారు. పురుషుల 80 కిలోల విభాగం క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన కామన్వెల్త్ స్వర్ణ పతక విజేత అంకుశ్ పంగల్ స్టార్టింగ్ నుంచే పంజా విసిరాడు. తజకిస్థాన్‌కు చెందిన నెక్రుజ్ సలొమోవ్‌పై తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 5-0 తేడాతో ఏకపక్ష విజయాన్ని నమోదు చేశాడు.

వానాకాలాన్ని మింగేసిన ఎల్‌నినో.. తెలంగాణలో కరువు ఛాయలు!తెలంగాణSwechaa27 Sep 2026, 08:32 PM

వానాకాలాన్ని మింగేసిన ఎల్‌నినో.. తెలంగాణలో కరువు ఛాయలు!

తెలంగాణలో ఈసారి వానాకాలం కలిసి రాలేదు. వర్షాలు పడాల్సిన సమయంలో పడకపోవడం.. పడిన చోట భారీగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా కురవడంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. ఇదే టైమ్ లో 2027 సీజన్ ఆశలు రేకెత్తిస్తోంది.

Manasa Varanasi: శర్వా-శ్రీను వైట్ల సినిమాలో లక్కీ ఛాన్స్సినిమాSwechaa27 Sep 2026, 08:01 PM

Manasa Varanasi: శర్వా-శ్రీను వైట్ల సినిమాలో లక్కీ ఛాన్స్

Manasa Varanasi: దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాలో శర్వానంద్ జార్జ్ అండ్ క్రిష్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడు. రెండు వేర్వేరు పాత్రల్లో కామెడీ తో పాటు హీరోయిన్‌తో లవ్ ట్రాక్..ఫ్యామిలీ ఎమోషన్స్ భాగా ఉండబోతున్నాయి. ఆ మధ్య వచ్చిన కపుల్ ఫ్రెండీ సినిమాతో ఆకట్టుకున్న హీరోయిన్ మానస వారణాసి కి ఈ సినిమా గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

Pan-India Hype: మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్స్.. పెద్ద సినిమాల బాగోతం!సినిమాSwechaa27 Sep 2026, 07:49 PM

Pan-India Hype: మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్స్.. పెద్ద సినిమాల బాగోతం!

Pan-India Hype: సినిమా మొదలయ్యేటప్పుడు ‘పాన్ ఇండియా సెన్సేషన్’ అంటారు. రిలీజ్‌కు ముందు నగరాలు చుట్టేస్తూ ‘ఇలాంటి విజువల్స్ ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చూడలేదు’ అని మైకులు పగలగొడతారు. కట్ చేస్తే.. ఫస్ట్ షో ముగిసేసరికే థియేటర్ల ముందు జనం ముఖాలు మాడిపోతాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ వరద మొదలవుతుంది. ఈ తంతు ఈనాటిది కాదు. ఇటీవల కాలంలో భారీ చిత్రాల పట్ల సర్వసాధారణమైన బాగోతంగా మారిపోయింది. ప్రచారంలో ఉన్న ఆర్భాటం కంటెంట్‌లో ఉండకపోవడం, స్క్రీన్ మీద మ్యాటర్ ఏమీ లేకపోయినా పబ్లిసిటీతో పీక్స్‌కు తీసుకెళ్లడం వల్ల బాక్సాఫీస్ వద్ద కోట్లు కుమ్మరించిన సినిమాలు కుదేలవుతున్నాయి.

మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. జీతాలు, నగదు లావాదేవీలపై ప్రభావం! ఏ సేవలు పనిచేస్తాయి?NationalSwechaa27 Sep 2026, 07:26 PM

మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. జీతాలు, నగదు లావాదేవీలపై ప్రభావం! ఏ సేవలు పనిచేస్తాయి?

మూడు రోజుల పాటు బ్యాంకులు సమ్మెకు వెళ్లనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకు శాఖల ద్వారా జరిగే పలు సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా నెలాఖరు కావడంతో ఉద్యోగుల జీతాలు, నగదు లావాదేవీలు, చెక్కుల క్లియరెన్స్ వంటి వాటిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది.

Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్ ఎక్కడ స్వామీ?సినిమాSwechaa27 Sep 2026, 07:23 PM

Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ ప్రమోషన్స్ ఎక్కడ స్వామీ?

Trivikram: ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం సినిమాకి ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే సినిమా జనాలలోకి వెళ్ళడం కష్టంగా మారింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఇంకా ప్రమోషన్స్ మొదలవక పోతే ఎలా అని వెంకీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట. విక్టరీ వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. అక్టోబర్ 9న రిలీజ్ అన్న ఈ మూవీకి ప్రమోషన్స్ నిల్ గా కనిపిస్తున్నాయి.

Srikanth Odela: రాజమౌళితో పోల్చుకున్నా కరెక్టే చెప్పాడు!సినిమాSwechaa27 Sep 2026, 07:01 PM

Srikanth Odela: రాజమౌళితో పోల్చుకున్నా కరెక్టే చెప్పాడు!

Srikanth Odela: సినిమా అంటేనే ఒక మ్యాజిక్. కొన్ని సన్నివేశాలు..పాత్రలు చిత్రీకరించినప్పుడు దర్శకులు లాజిక్‌లు వదిలేస్తారు. ఎందుకంటే అక్కడ ఏదో మ్యాజిక్ చూపించారు కాబట్టి. కానీ, ప్రేక్షకుల్లో కొంతమంది పక్కా లాజిక్కులే చూస్తారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కూడా ఇప్పుడు ఆయన తీసిన ది ప్యారడైజ్ సినిమాలోని ఓ షాట్ ను రాజమౌళి తీసిన మగధీర సినిమాలోని షాట్‌తో పోల్చి స్మూత్‌గా కౌంటర్ ఇచ్చాడు.

Delhi: ఢిల్లీ డిప్యూటీ సీఎం వీరంగం.. యువకుడిని కొట్టిన పర్వేశ్ వర్మ!తెలంగాణSwechaa27 Sep 2026, 06:31 PM

Delhi: ఢిల్లీ డిప్యూటీ సీఎం వీరంగం.. యువకుడిని కొట్టిన పర్వేశ్ వర్మ!

Delhi: రోడ్ల అభివృద్ధిని పరిశీలిస్తున్న సమయంలో ఒక యువకుడు సమస్యలపై నిలదీయగా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం పర్వేశ్ వర్మ ఎమోషనల్ బ్యాలెన్స్ కోల్పోయి అతడి చెంప చెళ్లుమనిపించిన ఘటన దేశ రాజధానిలో తీవ్ర కలకలం రేపుతోంది. పశ్చిమ ఢిల్లీ పరిధిలో రహదారి పనుల పరిశీలన నిమిత్తం జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పర్వేశ్ వర్మ పాల్గొన్నారు. అదే సమయంలో సాహిబ్ అనే లోకల్ యువకుడు తన మొబైల్‌లో వీడియో రికార్డ్ చేస్తూ, వేస్తున్న రోడ్ల నాణ్యత ఏమాత్రం బాగోలేదని, నాసిరకంగా ఉన్నాయంటూ మంత్రిని నేరుగా ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన పర్వేశ్ వర్మ ఒక్కసారిగా సహనం కోల్పోయి ఆ యువకుడి చెంపపై బలంగా కొట్టారు. ప్రజాప్రతినిధిగా ఉండి బహిరంగంగా ఒక పౌరుడిపై చేయి చేసుకోవడంతో అక్కడ ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో రాజకీయ దుమారం చెలరేగింది. మంత్రి తీరుపై విపక్షాలు భగ్గుమన్నాయి. "ప్రజాస్వామ్యంలో మంత్రులు తమను తాము రాచరికపు రాజుల్లా భావిస్తున్నారు.. ప్రశ్నించే గొంతులపై భౌతిక దాడులు చేస్తారా?" అని కాంగ్రెస్ నిప్పులు చెరిగింది.

NTRIVIKRAM: త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా లేటెస్ట్ అప్‌డేట్!సినిమాSwechaa27 Sep 2026, 06:14 PM

NTRIVIKRAM: త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా లేటెస్ట్ అప్‌డేట్!

NTRIVIKRAM: దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్– యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందనున్న భారీ మైథలాజికల్ చిత్రం నుంచి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే నందమూరి అభిమానుల్లో, సినీ లవర్స్‌లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక, తాజా సమాచారం మేరకు ఈ సినిమా 2027, జనవరి నుంచి సెట్స్‌పైకి రాబోతోందట.

Balakrishna: రౌడీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న బాలయ్య!సినిమాSwechaa27 Sep 2026, 05:55 PM

Balakrishna: రౌడీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న బాలయ్య!

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నట సింహం నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులర్ అయిన విజయ్ దేవరకొండకి సంబందించిన రౌడీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నారా! బాలయ్య లేటెస్ట్ పిక్స్ చూస్తే అదే అనిపిస్తోంది. ఒక హీరో బ్రాండ్ ను ఇంకో హీరో..అది కూడా బాలయ్య లాంటి సీనియర్ హీరో ప్రమోట్ చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

BJP: మిషన్ తెలంగాణపై కాషాయ దళం సర్జికల్ ఆపరేషన్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ లీక్!తెలంగాణSwechaa27 Sep 2026, 05:29 PM

BJP: మిషన్ తెలంగాణపై కాషాయ దళం సర్జికల్ ఆపరేషన్.. బీజేపీ మాస్టర్ ప్లాన్ లీక్!

BJP: తెలంగాణలో అధికారం దక్కించుకోవడమే పరమావధిగా అడుగులు వేస్తున్న బీజేపీ పార్టీ తన కార్యాచరణను అనూహ్యంగా మార్చేసింది. రాష్ట్రంలో బీజేపీకి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో అన్ని ప్రాంతాల్లో సమానమైన బలం లేదన్న వాస్తవాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది.

ముఖ్యంగా పార్టీ ఉనికికే సవాలుగా మారిన ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలపై ఇక తాడోపేడో తేల్చుకోవాలని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే పార్టీ జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు అత్యంత సన్నిహితుడైన కీలక నేతను నేరుగా రంగంలోకి దించడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.గత ఎన్నికలను పరిశీలిస్తే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఓట్ షేర్ పెరిగినప్పటికీ, అది కొన్ని బలమైన ప్రాంతాలకే మాత్రమే పరిమితమైంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల విషయానికి వచ్చేసరికి కాషాయ పార్టీ పనితీరు ఏమాత్రం ఆశాజనకంగా లేదు. గత మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈ మూడు జిల్లాల్లో ఆశించిన రిజల్ట్ రాలేదు. ఈ ప్రాంతాల్లో పాగా వేయకుండా తెలంగాణలో అధికారం చేపట్టడం అసాధ్యమని క్లారిటీకి వచ్చిన అధిష్ఠానం.. ఇప్పుడు ఇక్కడే ప్రయోగాత్మకంగా ‘ట్రయల్ రన్’ స్టార్ట్ చేయాలని భావిస్తోంది.

Devara 2: దేవర 2 లేనట్టేనా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో పెరుగుతున్న అనుమానాలు!సినిమాSwechaa27 Sep 2026, 04:47 PM

Devara 2: దేవర 2 లేనట్టేనా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో పెరుగుతున్న అనుమానాలు!

Devara 2: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రాల్లో ‘దేవర’ ఒకటి. రచయిత, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని మొదటి నుంచే ప్రచారం జరిగింది. పార్ట్ 1 క్లైమాక్స్‌లో కూడా ఈ విషయాన్ని రివీల్ చేశారు. అయితే, ఇప్పుడు ‘దేవర 2’ విషయంలో వస్తున్న కొన్ని వార్తలు అభిమానుల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అసలు నిజంగానే ‘దేవర 2’ ఉంటుందా? లేక ఈ ప్రాజెక్ట్‌కు బ్రేక్ పడినట్టేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

SS.Rajamouli: జక్కన్న సక్సెస్ ఫార్ములా ఇదేనా?సినిమాSwechaa27 Sep 2026, 04:23 PM

SS.Rajamouli: జక్కన్న సక్సెస్ ఫార్ములా ఇదేనా?

SS.Rajamouli: ఒక్కో దర్శకుడికి ఒక్కో బలం ఉంటుంది. కొందరు కామెడీ బాగా డీల్ చేయగలరు. కాబట్టి, కథలో ఎక్కువ స్పేస్ కామెడీకే ఇస్తుంటారు. ఆ జానర్ సినిమాలతో అగ్ర దర్శకులుగా వెలిగింది అంటే జంధ్యాల, ఈవీవీ సత్యనారాయణ. సుకుమార్ అంటే కొన్ని లెక్కలుంటాయి. సినిమా కథ చుట్టూ మ్యాథ్స్ కనిపిస్తుంటుంది. పూరి జగన్నాధ్ అంటే ఆయన కథలో హీరోలు చాలా రఫ్ అండ్ ఠఫ్‌గా ఉంటారు. దాదాపుగా ఆయన సినిమాలో హీరో ఓ అనాధగా కనిపిస్తుంటాడు.

Food Safety Telangana: కుళ్లిన మాంసం, దరిద్రంగా కిచెన్లు.. జనాల ఆరోగ్యంతో  హోటళ్ల చెలగాటంతెలంగాణSwechaa27 Sep 2026, 04:12 PM

Food Safety Telangana: కుళ్లిన మాంసం, దరిద్రంగా కిచెన్లు.. జనాల ఆరోగ్యంతో హోటళ్ల చెలగాటం

Food Safety Telangana: వెన్న పూసినట్లు మాట్లాడే బేరర్లు, డిమ్ లైట్ల మధ్య అందమైన మ్యూజిక్, టేబుల్ నిండా కలర్‌ఫుల్ ప్లేట్లు.. ఇదీ బయటి ప్రపంచానికి కనిపించే స్టార్ హోటళ్ల దర్పం. కానీ మీరు వేలకు వేలు బిల్లు కట్టి లొట్టలేసుకుంటూ తింటున్న ఆ బిర్యానీలు, స్టార్టర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలిస్తే మాత్రం పచ్చి మంచినీళ్లు కూడా గొంతు దిగవు. ఐటీ కారిడార్‌లోని బడా రెస్టారెంట్లు, పబ్‌లలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన తాజా తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే నిజాలు బయటపడ్డాయి. వంటగదుల్లో కనిపించిన దరిద్రం, ఆహార తయారీ విధానం చూసి తనిఖీలకు వెళ్లిన అధికారులే వాంతి చేసుకోనంత పనైంది.అందమైన బిల్డింగులు, ఏసీ గదులు చూసి మోసపోతే ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని ఈ దాడులు స్పష్టం చేశాయి. తిన్న ఆహారం విషమై ఆసుపత్రుల పాలవుతున్న కేసుల వెనుక అసలు రహస్యం ఈ స్టార్ హోటళ్ల కిచెన్లలో దాగిన దరిద్రమేనని తేలిపోయింది. కస్టమర్ల బలహీనతలను ఆసరాగా చేసుకుని కుళ్లిన మాంసం, కల్తీ వంటకాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి యాజమాన్యాలపై కేవలం మూసివేతలే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నగరవాసులు డిమాండ్

ఏడాదికి 13 కాదు 12 రీచార్జులే..  30 డేస్ ప్లాన్స్ వచ్చేశాయ్!టాప్ న్యూస్Swechaa27 Sep 2026, 03:56 PM

ఏడాదికి 13 కాదు 12 రీచార్జులే.. 30 డేస్ ప్లాన్స్ వచ్చేశాయ్!

దేశంలోని మొబైల్ యూజర్లకు ట్రాయ్ శుభవార్త చెప్పింది. ఇంతకాలం డేటా వినియోగం అవసరం లేకున్నా 1జీబీ లేదా 2జీబీ డేటా ప్లాన్లతో కూడిన రీచార్జ్ ప్లాన్లను ఎంచుకోవాల్సి వచ్చేది.ఇకమీదట దాని అవసరం లేదని సమాచారం.కేవలం ఏడాదికి 12 సార్లు.. అనగా నెలకు ఒకసారి రీచార్జ్ చేసుకుంటే సరిపోతుందని.. ఈ మేరకు కొత్త ప్లాన్స్ అందుబాటులోకి వచ్చినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు నెలలో 28 రోజులకు మాత్రమే డేటా ప్లాన్స్ అందుబాటులో ఉండేవి. ఇకమీదట నెలలో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు టెలికాం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ (13వ సవరణ) రెగ్యులేషన్స్-2026ను ప్రభుత్వం తీసుకొచ్చిందని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆదివారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు.

యూఎల్‌సీ పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్: మంత్రి పొంగులేటితెలంగాణSwechaa27 Sep 2026, 03:39 PM

యూఎల్‌సీ పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్: మంత్రి పొంగులేటి

 దశాబ్దాలుగా నానబెడుతూ పెండింగ్‌లో ఉంచిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం కలిగిస్తూ ప్రజా ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ULC కేసులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం వెంటనే క్రమబద్ధీకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.