స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

యూఎల్‌సీ పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్: మంత్రి పొంగులేటితెలంగాణSwechaa27 Sep 2026, 03:39 PM

యూఎల్‌సీ పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్: మంత్రి పొంగులేటి

 దశాబ్దాలుగా నానబెడుతూ పెండింగ్‌లో ఉంచిన అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తులకు మోక్షం కలిగిస్తూ ప్రజా ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అర్హత ఉన్న ULC కేసులన్నింటినీ సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం వెంటనే క్రమబద్ధీకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రజల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ సూటి ప్రశ్నలు!తెలంగాణSwechaa27 Sep 2026, 03:33 PM

సిరిసిల్లకు సీఎం రేవంత్.. కేటీఆర్ సూటి ప్రశ్నలు!

సిరిసిల్లకు వస్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సూటి ప్రశ్నలు సంధించారు. తన నియోజకవర్గంలో 8 వేల ఎకరాలను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని సీఎం రేవంత్ ఇటీవల ఆరోపించగా.. ఆ భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు ఓ లేఖ రాశారు.ఆ 8 వేల ఎకరాల్లో 2,400 ఎకరాలు రికవరీ చేసినట్లు చెబుతున్న వివరాలను బయటపెట్టాలన్నారు. నేతన్న, రైతన్న, విద్యార్థి, అన్ని వర్గాల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు.హామీల అమలుపై స్పష్టమైన తేదీలు ప్రకటించాలన్నారు. సిరిసిల్ల అభివృద్ధిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయిన తర్వాత తొలిసారిగా సిరిసిల్లకు వస్తున్న సీఎం రేవంత్ ‌రెడ్డికి కేటీఆర్ స్వాగతం పలికారు.సీఎం హోదాలో సిరిసిల్లకు వస్తున్నందున రాజకీయ విమర్శలు, వ్యక్తిగత దూషణలకు కాకుండా ప్రజల సమస్యలకు సమాధానం చెప్పాలని కోరారు.

చిత్రం లేదు
స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa27 Sep 2026, 03:18 PM

ఫేక్ ORCల దందా.. దర్యాప్తునకు రేవంత్ సిద్ధమా?

 రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న భూ ఆక్రమణలు, నకిలీ ఆక్యుపేషన్ రైట్స్ సర్టిఫికేట్ (ORC) ల వ్యవహారంపై మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇటీవల 'నమస్తే తెలంగాణ', ఈరోజు 'సాక్షి' దినపత్రికల్లో వెలువడిన ఇన్వెస్టిగేషన్ స్టోరీలకు సంబంధించిన అసలు నిజాలను 2023 జనవరిలోనే ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు చింతకుంట్ల దేవేందర్ రెడ్డి(స్వేచ్ఛ చైర్మన్)  సంచలన విషయాలను బయటపెట్టారు.  ప్రధాన మీడియా ఈ ఘోర అక్రమాలను గుర్తించి వార్తలు రాయడానికి దాదాపు మూడేళ్ల 8 నెలల సుదీర్ఘ సమయం పట్టింది. గతంలో ఓ బీఆర్ఎస్ నేత పేరు మీద ఉన్న భూమి, తదనంతరం ఇనాం చేసిన భూమిగా మారడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వివాదాస్పద భూమిలోకి దానం, ఠాకూర్, షకీల్ వంటి వ్యక్తులు ఎలా ప్రవేశించారనే దానిపై స్పష్టమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది.

కాంగ్రెస్ గెలిస్తే ఈసీ తప్పులేదు.. ఓడితే తప్పా : కిషన్ రెడ్డితెలంగాణSwechaa27 Sep 2026, 03:09 PM

కాంగ్రెస్ గెలిస్తే ఈసీ తప్పులేదు.. ఓడితే తప్పా : కిషన్ రెడ్డి

ఓటు చోరీకి కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మద్దతుగా నిలుస్తున్నారని, ఎస్ఐఆర్ పేరిట ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలిసిందే.ఆయన రాజీనామాకు కాంగ్రెస్ పార్టీ పట్టుడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈసీ అంశంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ఈసీ సరిగా పని చేస్తుందని.. అదే కాంగ్రెస్ ఓటమి చెందితే ఈసీ సరిగా పనిచేయట్లేదని అంటున్నారని విమర్శించారు. రాహుల్‌ను ప్రధానమంత్రి చేసేందుకు ఈసీ పని చేయదని స్పష్టంచేశారు.

BRS: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ దళం వ్యూహం ఇదేనా?తెలంగాణSwechaa27 Sep 2026, 02:44 PM

BRS: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై గులాబీ దళం వ్యూహం ఇదేనా?

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక సమరానికి నగారా మోగింది. ఉమ్మడి మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి స్థానాలకు ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టికెట్ల కోసం గులాబీ గూటిలో భారీ పోటీ నెలకొంది. టికెట్ తమకే వస్తుందన్న ఆశతో తెలంగాణ భవన్ చుట్టూ చక్కర్లు కొడుతున్న ఆశావహులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనూహ్య ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పుడే అభ్యర్థుల ప్రకటన ఉండబోదని కుండబద్దలు కొడుతూ, గ్రౌండ్‌లో సరికొత్త పొలిటికల్ మైండ్‌గేమ్‌కు ఆయన తెరలేపారట.ఎన్నికలకు ముందే అభ్యర్థిని ఖరారు చేస్తే పార్టీకి జరిగే నష్టాలను అధిష్టానం లోతుగా బేరీజు వేస్తోందని తెలుస్తుంది. బీఆర్ఎస్‌లో ఒక్కో స్థానానికి డజను మందికి పైగా కీలక నేతలు పోటీ పడుతున్నారు. ఇప్పుడే ఒకరి పేరు ప్రకటిస్తే మిగిలిన ఆశావహులు అసంతృప్తితో దూరమయ్యే ప్రమాదం ఉందని అగ్ర నాయకత్వం ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. వారు ఓటర్ల నమోదును పట్టించుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం తప్పదని భావిస్తున్నట్లు తెలుస్తుంది.

‘ఎస్ఐఆర్’ కరెక్ట్ కాదు..సుప్రీంకోర్టు సమర్థించడం ఆశ్చర్యకరం : ఎంపీ అసద్తెలంగాణSwechaa27 Sep 2026, 02:29 PM

‘ఎస్ఐఆర్’ కరెక్ట్ కాదు..సుప్రీంకోర్టు సమర్థించడం ఆశ్చర్యకరం : ఎంపీ అసద్

ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అమలు తీరుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్ వలన దేశంలోని పేదప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. డాక్యుమెంట్ల కోసం తిరుగుతూ వారి ఆత్మగౌరవం మంటగలుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మొదటి నుంచీ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఒవైసీ స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్ విషయంలో తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. అయితే, ఎస్ఐఆర్ ప్రక్రియను సుప్రీంకోర్టు సమర్థించడం ఆశ్చర్యకరం అని గుర్తుచేశారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలు మెజారిటీ ఓటింగ్ ఆధారంగా జరగాలని ఓవైసీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆస్తి కోసం బరితెగింపు.. మంచం పట్టిన తల్లిని కూడా వదల్లేదుతెలంగాణSwechaa27 Sep 2026, 02:18 PM

ఆస్తి కోసం బరితెగింపు.. మంచం పట్టిన తల్లిని కూడా వదల్లేదు

ఆస్తి కోసం కొందరు బరితెగిస్తున్నారు.రక్తసంబంధం, తల్లిదండ్రులు అని చూడటం లేదు. తమకు ఆస్తి రాలేదు అన్న కోపంలో కన్నవారి మీదే దాడులకు పాల్పడుతున్నారు. కొందరు ఇంట్లో నుంచి బయటకు గెంటివేస్తున్నారు. మరికొందరు భౌతికంగా దాడులకు పాల్పడటం, ఆహారం ఇవ్వకుండా తీవ్ర వేధింపులకు గురిచేయడం వంటివి చేస్తున్నారు. మరికొన్ని ఘటనల్లో ఆస్తి కోసం ఏకంగా హత్యలు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కాగా, ఆస్తి కోసం పక్షవాతంతో మంచానికే పరిమితమైన తల్లిపైన కొడుకు అతని భార్య దాడికి పాల్పడినట్టు తెలిసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డు అయ్యాయి.వివరాల్లోకివెళితే.. కూకట్‌పల్లి అల్విన్ కాలనీకి చెందిన బ్యాంకు ఉద్యోగి టి. నాగార్జునను గత కొంతకాలంగా అన్న, వదిన, ఆమె సోదరుడి వేధిస్తున్నట్టు ఆరోపించాడు. ఆస్తి వివాదంలో వాళ్లంతా ఇబ్బందులకు గురిచేయడంతో పాటు దాడులకు పాల్పడుతున్నారని వాపోయాడు.తనతో పాటు పక్షవాతంతో బాధపడుతున్న తల్లిపైనా పలుమార్లు భౌతిక దాడులు చేశారని ఆవేదన వ్యక్తంచేశాడు.

2 లక్షల ఉద్యోగాల పేరిట మోసం చేశారు : హరీష్ రావుతెలంగాణSwechaa27 Sep 2026, 01:35 PM

2 లక్షల ఉద్యోగాల పేరిట మోసం చేశారు : హరీష్ రావు

రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, ఆ తర్వాత అమలు చేస్తున్న విధానాలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీమంత్రి హరీష్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఇప్పుడు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ భవన్‌లో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల కోసం కేసీఆర్ ఉచిత శిక్షణా శిబిరాన్ని హరీష్ రావు లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేదని అన్నారు. రాష్ట్రంలో వాస్తవానికి 25 వేల పోలీసు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగులు, బీఆర్ఎస్ పార్టీ నేతల పోరాటం ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 7 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిందని చెప్పారు. ‘ఖాళీలు లేక కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మనసు లేక నిరుద్యోగాలను మోసం’ చేస్తుందని విమర్శలు చేశారు.

గూడు చెదిరే.. వృద్ధులను రోడ్డున పడేసిన ఇందిరమ్మ ఇళ్లుతెలంగాణSwechaa27 Sep 2026, 12:53 PM

గూడు చెదిరే.. వృద్ధులను రోడ్డున పడేసిన ఇందిరమ్మ ఇళ్లు

ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని ఆశించిన ఓ వృద్ధ జంటకు నిరాశే ఎదురైంది. ముందుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యిందని చెప్పడంతో ఆశగా ఉన్న ఆ దంపతులు.. ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూల్చివేశారు. ఆ స్థలంలోనే కొత్త ఇంటిని నిర్మించుకోవాలని భావించారు.తీరా చూస్తే వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు.ఇంకేముంది ఉన్న ఇళ్లు పోయి.. ఇందిరమ్మ ఇళ్ల రాక ఈ వయస్సులో రోడ్డు మీద పడ్డారు. తమకు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

తెలంగాణలో గడ్డిపోచ కూడా గడ్డపారవుతుంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!తెలంగాణSwechaa27 Sep 2026, 12:32 PM

తెలంగాణలో గడ్డిపోచ కూడా గడ్డపారవుతుంది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

 రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్లు పెట్టి గణేష్ నిమజ్జనంలో ఏ పాటలు పెట్టాలి, ఏ పాటలు పెట్టకూడదో ఆదేశాలు జారీ చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ‌భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పండగ వాతావరణంలో ప్రజలు ఉత్సాహంగా జరుపుకునే ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సరికాదని పేర్కొన్నారు. నిమజ్జన శోభాయాత్రల్లో వివాదాలు, గొడవలు జరగకుండా నివారించాల్సిన పోలీసులు, కేసీఆర్ పాటలు ప్లే చేస్తే డీజే సిస్టమ్‌లను బలవంతంగా నిలిపివేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఓటు చోరీ  కాదు.. రాహుల్ గాంధీ బుద్ధి చోరీ : ఎంపీ అర్వింద్తెలంగాణSwechaa27 Sep 2026, 12:24 PM

ఓటు చోరీ కాదు.. రాహుల్ గాంధీ బుద్ధి చోరీ : ఎంపీ అర్వింద్

దేశంలో ఓటు చోరీ జరిగిందని, కేంద్రంలోని బీజేపీ ఎన్నికల కమిషన్ సాయంతో అధికారంలోకి వస్తుందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో ఓట్ చోరీ కాదు.. రాహుల్ గాంధీ అఖల్ చోరీ’ జరుగుతోందని సెటైర్లు వేశారు. విపక్ష పార్టీలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చేస్తున్న ఆరోపణలపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఎలక్షన్ కమిషన్‌లో అభిప్రాయభేదాలు ఉండటం సహజమని పేర్కొన్న ఎంపీ అర్వింద్.. రాజ్యాంగబద్ధంగానే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. గాంధీ కుటుంబానికి ఇలాంటివి ఏవీ అర్థం కావని ఫైర్ అయ్యారు. SIRలో భాగంగా ఎన్‌రోల్‌మెంట్ కోసం వస్తే మహేశ్ గౌడ్ స్పందించలేదని గుర్తుచేశారు.

పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సరిగ్గా రెండేళ్లు.. యాక్షన్ ఏది? : కేటీఆర్తెలంగాణSwechaa27 Sep 2026, 11:54 AM

పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సరిగ్గా రెండేళ్లు.. యాక్షన్ ఏది? : కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో భారీగా అవినీతి జరుగుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు పెద్దఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించి రుజువులను సైతం ఏదో ఒక సందర్భంలో మీడియా ముందు పెడుతున్నారు. అందుకు అధికార పార్టీ నుంచి సైతం దీటుగా సమాధానాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా స్పందించారు. సరిగ్గా రెండేండ్ల కిందట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద జరిగిన ఈడీ దాడులను ఆయన ప్రస్తావించారు. ‘రాష్ట్రంలో ‘కాంగ్రెస్-బీజేపీ’ మధ్య అపవిత్ర పొత్తు అధికారికమై నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది’ అంటూ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదిగా స్పందించారు. మనీలాండరింగ్ కేసులో 2024 సెప్టెంబర్ 27న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇళ్లు,ఆయన బినామీ ఇళ్లపై ఏకకాలంలో 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారని, ఆ టైంలో మంత్రి ఇంటికి నగదు లెక్కింపు యంత్రాలు తరలించినట్టు వార్తలు వచ్చాయని గుర్తుచేశారు. మరి యాక్షన్ ఏది? అని నిలదీశారు.

చనిపోయాడనుకున్న వ్యక్తి పునర్జన్మ.. అంత్యక్రియల దారిలో లేచి కూర్చున్న వృద్ధుడు!వైరల్ న్యూస్Swechaa27 Sep 2026, 11:48 AM

చనిపోయాడనుకున్న వ్యక్తి పునర్జన్మ.. అంత్యక్రియల దారిలో లేచి కూర్చున్న వృద్ధుడు!

 వైద్యులు మృతి చెందాడని నిర్ధారించిన వ్యక్తి, అంత్యక్రియలకు శవాన్ని తరలిస్తుండగా అకస్మాత్తుగా లేచి కూర్చున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం రేపింది. చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన చీకటి శంకరయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతున్న శంకరయ్య శనివారం మృతి చెందినట్లు అక్కడ పనిచేస్తున్న వైద్యులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఈ ఉత్కంఠ భరిత ఘటనకు దారితీసింది.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. సీడబ్ల్యూసీ భేటీపై సర్వత్రా ఉత్కంఠతెలంగాణSwechaa27 Sep 2026, 11:13 AM

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. సీడబ్ల్యూసీ భేటీపై సర్వత్రా ఉత్కంఠ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు,పార్టీ పరమైన పలు అంశాలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం.రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ టూర్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి సీఎం ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. సోమవారం ఉదయం ఢిల్లీలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. అనంతరం మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.

రూ.500 టికెట్‌తో మారిన తలరాత.. రూ.30కోట్ల జాక్‌పాట్!NationalSwechaa27 Sep 2026, 10:59 AM

రూ.500 టికెట్‌తో మారిన తలరాత.. రూ.30కోట్ల జాక్‌పాట్!

కేరళ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ప్రసిద్ధ 'తిరువోణం బంపర్ లాటరీ' (BR-111) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాదికి సంబంధించి ఏకంగా రూ.30 కోట్ల భారీ ప్రథమ బహుమతిని ఓ అదృష్టశాలి గెలుచుకున్నారు. శనివారం మధ్యాహ్నం తిరువనంతపురంలోని గోర్కీ భవన్‌లో అధికారుల సమక్షంలో అత్యంత పారదర్శకంగా ఈ లాటరీ డ్రా ప్రక్రియను పూర్తి చేశారు. రూ.500 విలువ చేసే టికెట్‌తో ఒక సామాన్యుడిని ఒక్కసారిగా కోటీశ్వరుడిని చేసిన ఈ విజయం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ డ్రాలో 'TL 360615' నంబర్ గల లాటరీ టిక్కెట్‌కు మొదటి బహుమతి రూ.30కోట్లు వరించింది. కన్నూర్ జిల్లా చక్కరక్కల్ ప్రాంతంలో ఉన్న ముత్తు లాటరీ ఏజెన్సీ ప్రతినిధి ఈ విజేత టిక్కెట్‌ను విక్రయించినట్లు లాటరీ శాఖ అధికారులు వెల్లడించారు.

వారంలో భారీగా తగ్గిన పసిడి.. హైదరాబాద్‌లో ఇవే తాజా రేట్లు!వ్యాపారంSwechaa27 Sep 2026, 10:32 AM

వారంలో భారీగా తగ్గిన పసిడి.. హైదరాబాద్‌లో ఇవే తాజా రేట్లు!

 గత కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో పసిడి ప్రియులు, కొనుగోలుదారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లోనే 10 గ్రాముల తులానికి ఏకంగా రూ.3,160 మేర తగ్గుదల నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న కీలక పరిణామాల కారణంగానే దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు వరుసగా క్షీణిస్తున్నాయని బులియన్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే బలమైన అంచనాలతో పాటు యూఎస్ ట్రెజరీ బాండ్ల రాబడులు (యీల్డ్స్) గణనీయంగా పెరిగాయి.

తిరుమలలో భక్తుల కిటకిట.. సర్వదర్శనానికి 24 గంటలు!ఏపీSwechaa27 Sep 2026, 09:49 AM

తిరుమలలో భక్తుల కిటకిట.. సర్వదర్శనానికి 24 గంటలు!

 కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం భక్తుల రద్దీ ఒక్కసారిగా వెల్లువెత్తింది. వారాంతపు సెలవులు కావడం, ఇటీవల కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టి వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. ఆదివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, స్వామివారి సర్వదర్శనం పొందడానికి భక్తులు సుమారు 24 గంటల పాటు వేచి చూడాల్సి వస్తోంది.

Telangana: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల ఖరారు.. హైకమాండ్‌ పరిశీలనలో ఆరుగురి పేర్లు!తెలంగాణSwechaa27 Sep 2026, 09:44 AM

Telangana: కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థుల ఖరారు.. హైకమాండ్‌ పరిశీలనలో ఆరుగురి పేర్లు!

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలపై అధికార కాంగ్రెస్ కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు పీసీసీ జాబితాను సిద్ధం చేసింది. రెండు సీట్లకు సంబంధించి మొత్తం ఆరుగురి పేర్లతో కూడిన ప్రతిపాదనలను పార్టీ హైకమాండ్‌కు పంపింది.

విమాన ప్రమాదం దర్యాప్తులో భాగమవుతాం: పైలట్ల విజ్ఞప్తి!NationalSwechaa27 Sep 2026, 09:26 AM

విమాన ప్రమాదం దర్యాప్తులో భాగమవుతాం: పైలట్ల విజ్ఞప్తి!

 గతేడాది దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన ఎయిర్ ఇండియా ఏఐ-171 విమాన ప్రమాద దర్యాప్తు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘోర దుర్ఘటనకు సంబంధించిన తుది దర్యాప్తు నివేదికను ఖరారు చేసే క్రమంలో తమ సాంకేతిక సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని 'ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్' (FIP) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ నివేదిక సమీక్ష కోసం ప్రభుత్వం ఏదైనా స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తే, అందులో పైలట్ల సంఘానికి 'స్వతంత్ర సాంకేతిక భాగస్వామి'గా స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

Ration-Rice: ఖమ్మం జిల్లాలో వెలుగుచూసిన కొత్త మోసం!..తెలంగాణSwechaa27 Sep 2026, 09:15 AM

Ration-Rice: ఖమ్మం జిల్లాలో వెలుగుచూసిన కొత్త మోసం!..

రేషన్ బియ్యం దందా చేసే అక్రమార్కులు కొత్త రకం మోసానికి తెరలేపారు. వేరే రాష్ట్రానికి వెళ్లాల్సిన సాంబ మసూరి బియ్యం లోడ్ లారీ ఇక్కడే బ్రేక్ డౌన్ అయ్యింది తక్కువ ధరకే ఇచ్చేస్తున్నాం. మార్కెట్‌లో రూ.1200 నుంచి రూ.1300 వరకు పలికే 25 కేజీల ప్రీమియం రైస్ బ్యాగు కేవలం రూ.600 నుంచి రూ.700 లకే ఇస్తామని ఆశ పెడుతున్నారు. తీరా ఆ మాటలు రైస్ బ్యాగులు కొనుగోలు చేసిన ప్రజలు. వాటిని విప్పి చూస్తే నాణ్యమైన బియ్యానికి బదులు రేషన్ బియ్యం నింపి ఉండటంతో షాక్‌కు గురవుతున్నారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కేటీఆర్ సందడి.. బీఆర్ఎస్ నేతలతో కలిసి 'ది ప్యారడైజ్' వీక్షణం!తెలంగాణSwechaa27 Sep 2026, 09:11 AM

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో కేటీఆర్ సందడి.. బీఆర్ఎస్ నేతలతో కలిసి 'ది ప్యారడైజ్' వీక్షణం!

 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సందడి చేశారు. ఆయిన స్థానిక సుదర్శన్ థియేటర్‌కు వెళ్లి, నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ యాక్షన్ చిత్రం 'ది ప్యారడైజ్'ను ప్రత్యేకంగా వీక్షించారు. చాలా కాలం తర్వాత థియేటర్‌లో సినిమా చూడటానికి వెళ్తున్నానని కేటీఆర్ ముందే సోషల్ మీడియా వేదికగా ప్రకటించడంతో థియేటర్ ప్రాంగణంలో అభిమానులు, కార్యకర్తలు భారీగా సమకూరారు.

Hyderabad: హైదరాబాద్ మెట్రో స్వాధీనం పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!!..తెలంగాణSwechaa27 Sep 2026, 08:53 AM

Hyderabad: హైదరాబాద్ మెట్రో స్వాధీనం పై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!!..

దసరా నాటికి హైదరాబాద్ మెట్రో మొదటిదశ స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.. అయితే, ఎల్ అండ్ టీ కి చెందిన రూ. 13,600 కోట్ల రుణాలను చెల్లించడమే ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది. ఏడెనిమిది శాతం వడ్డీ భారాన్ని తగ్గించుకోవడానికి ఎస్‌బీఐ క్యాప్స్ తక్కువ వడ్డీ రుణాల కోసం కసరత్తు చేస్తోంది. ఒకవేళ బ్యాంకుల నుంచి ఆశించిన రీతిలో స్పందన రాకపోతే.. హెచ్‌ఎమ్‌డీఏ నిధుల సమీకరణతో పాటు, ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు పొందే ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది.

Telangana: కేసీఆర్ మౌనం.. బీఆర్‌ఎస్‌కు ప్లస్సా? మైనస్సా?..తెలంగాణSwechaa27 Sep 2026, 08:22 AM

Telangana: కేసీఆర్ మౌనం.. బీఆర్‌ఎస్‌కు ప్లస్సా? మైనస్సా?..

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ రాజకీయంగా సవాళ్ళు ఎదుర్కొంటుంది. అధికారం కోల్పోయి దాదాపు మూడేళ్లు కావస్తున్నా.. పార్టీ ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నాలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌, హరీశ్‌రావు మాత్రం తమ ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ప్రభుత్వంపై అప్పుడప్పుడు పోరాడుతున్నారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తున్నారు. జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నిరసనలు చేస్తున్నారు. కానీ పార్టీ అధినేత కేసీఆర్‌ మాత్రం ఎక్కువగా తెరవెనుకే ఉండటం చర్చాంశనీయంగా మారింది.

Health: శరీరంలో యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది?..HealthSwechaa27 Sep 2026, 07:55 AM

Health: శరీరంలో యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది?..

మనం తినే కొన్ని రకాల ఆహారంలో ఉండే 'ప్యూరిన్స్' అనే కాంపౌండ్స్‌ను శరీరం జీర్ణం చేసుకునేటప్పుడు ఈ యూరిక్ యాసిడ్ తయారవుతుంది. సాధారణంగా ఇది రక్తం ద్వారా మూత్రపిండాలకు చేరి, మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. కానీ, మనం మటన్ వంటి రెడ్ మీట్, సీఫుడ్, ఆల్కహాల్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు... లేదా కిడ్నీలు దీన్ని సరిగ్గా బయటకు పంపలేనప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతాయి. అయితే శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల కీళ్లలో అకస్మాత్తుగా నొప్పి, వాపు, ఎర్రబడటం వంటి సమస్యలు కనిపించవచ్చు.

Health: షుగర్ కంట్రోల్‌కు అద్భుతమైన ఔషదం.. ఇది ఎంతవరకు పనిచేస్తుందంటే?..HealthSwechaa27 Sep 2026, 07:49 AM

Health: షుగర్ కంట్రోల్‌కు అద్భుతమైన ఔషదం.. ఇది ఎంతవరకు పనిచేస్తుందంటే?..

డయాబెటిస్ అనేది నేటి కాలంలో సాధారణంగా మారింది. ఒత్తిడితో కూడిన లైఫ్, నియంత్రణలో లేని అలవాట్ల వల్ల రోజు రోజుకు డయాబెటిస్ పేషెంట్స్ పెరుగుతున్నారు. అయితే షుగర్ వ్యాధిని కంట్రోల్ ల్లో ఉంచడానికి ఆరోగ్యనిపుణులు మనింట్లోని వంటింట్లో దొరికే వస్తువుల గురించి చెప్పడం తెలిసిందే.. అలాంటి వాటిలో కసూరి మేతి ఒకటి. ఇక రోజువారీ వంటల్లో రుచి, సువాసన కోసం ఉపయోగించే కసూరి మేతి.. అంటే ఎండిన మెంతి ఆకులు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొంతమేర సహాయపడే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. మెంతిలో ఫైబర్‌తో పాటు కొన్ని బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదించడం ద్వారా భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా కొంతమేర సహాయపడవచ్చు.

Spirituality: ఇంట్లోకి గబ్బిలం వస్తే.. శుభమా? అశుభమా?..SpiritualitySwechaa27 Sep 2026, 07:36 AM

Spirituality: ఇంట్లోకి గబ్బిలం వస్తే.. శుభమా? అశుభమా?..

ఇంట్లోకి గబ్బిలం వస్తే చాలామందిలో ఒక భయం మొదలవుతుంది. ఏదైనా అశుభం జరగబోతుందా అనే ఆలోచన కలుగుతుంది. అయితే సనాతన ఆధ్యాత్మిక దృష్టిలో ప్రతి సంఘటనను నేరుగా శుభం, అశుభం అని నిర్ణయించడం సరైన పద్ధతి కాదని అంటున్నారు.

గబ్బిలం ప్రధానంగా రాత్రివేళ సంచరించే జీవి. చీకటి ప్రదేశాలు, చెట్లు, పాత భవనాలు, ప్రశాంతమైన ప్రదేశాలలో ఇవి ఎక్కువగా ఉంటాయి.. అందువల్ల ఇంటి తలుపులు లేదా కిటికీలు తెరిచి ఉండటం, చుట్టుపక్కల ఎక్కువగా చెట్లు ఉంటటం వంటి కారణాలతో కూడా గబ్బిలం ఇంట్లోకి రావచ్చు.

Spirituality: మహాలయ పక్షంలో ఈ 9 తప్పులు మాత్రం అస్సలు చేయకండి!SpiritualitySwechaa27 Sep 2026, 07:32 AM

Spirituality: మహాలయ పక్షంలో ఈ 9 తప్పులు మాత్రం అస్సలు చేయకండి!

సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజులు మహాలయ పక్షాలు. మన మూలాలను, మనల్ని ఈ లోకంలోకి తెచ్చిన మన పూర్వీకులను స్మరించుకుని, వారి ఆశీస్సులు పొందే అత్యంత ప్రాశస్త్యమైన సమయం ఇది. అయితే, ఈ పవిత్ర దినాలలో తెలియక చేసే కొన్ని పొరపాట్లు పితృదేవతల ఆగ్రహానికి, పితృదోషాలకు కారణమవుతాయని పండితులు చెబుతున్నారు. అందుకే, ఈ మహాలయ పక్షంలో అస్సలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్న ఆ 9 ముఖ్యమైన తప్పులేంటో తెలుసుకుందాం.

Spirituality:కాలసర్ప యోగం అంటే ఏమిటి?..SpiritualitySwechaa27 Sep 2026, 07:21 AM

Spirituality:కాలసర్ప యోగం అంటే ఏమిటి?..

మనిషి జీవితంలో కొన్ని గ్రహస్థితులు సాధారణ జ్యోతిష ఫలితాలకు భిన్నంగా ప్రత్యేకమైన మానసిక, ఆధ్యాత్మిక అనుభూతులను కలిగిస్తాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. అలాంటి వాటిలో ఎక్కువగా చర్చకు వచ్చే పేరు.. కాలసర్ప యోగం.జన్మకుండలిలో సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, శని అనే ఏడు గ్రహాలు రాహు, కేతువుల మధ్య ఒకే వైపున ఉండే గ్రహస్థితిని కాలసర్ప యోగంగా జ్యోతిష సంప్రదాయంలో పేర్కొంటారు. రాహు, కేతువులను ఛాయాగ్రహాలుగా పరిగణిస్తారు. ఈ స్థితికి కాలం అంటే సమయం, సర్పం అంటే పాము అనే అర్థం ఉంది. అందుకే కాలసర్పం అనే ప్రతీకలో కాలచక్రం, కర్మ, పరివర్తన అనే భావాలు కనిపిస్తాయి.

Danam Nagender: ఆందోళనలో దానం నాగేందర్‌.. ఖైరతాబాద్‌ టికెట్‌ ఎవరికి?..తెలంగాణSwechaa27 Sep 2026, 07:13 AM

Danam Nagender: ఆందోళనలో దానం నాగేందర్‌.. ఖైరతాబాద్‌ టికెట్‌ ఎవరికి?..

ఖైరతాబాద్‌ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే పార్టీ ఫిరాయించి అనర్హత వేటుతో శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన ఆయనకు కాంగ్రెస్‌ నుండి ఊహించని షాక్ తగిలినట్టు ప్రచారం మొదలైంది. పార్టీ మరోసారి టికెట్‌ ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని సమాచారం. ఆయన స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన రోహిన్‌రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనున్నట్టు పొలిటికల్ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఈ మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం.

మాట తప్పిన రేవంత్ రెడ్డి.. జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం..తెలంగాణSwechaa26 Sep 2026, 10:53 PM

మాట తప్పిన రేవంత్ రెడ్డి.. జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం..

Petbasheerabad Land: సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారు. 13 కోట్లు కట్టిన జర్నలిస్టుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/2 లో JNJHS కు (జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి) 2008లో కేటాయించిన స్థలాన్ని ప్రభుత్వం ఇటీవలే గురుకుల పాఠశాల నిర్మాణానికి కేటాయించినట్లు బయటపడింది.

పోలీస్ బందోబస్తు నడుమ నిర్మాణాలు!

ఈ స్థలంలో గురుకుల పాఠశాల నిర్మాణానికి కొడంగల్ నుంచి వర్చువల్ గా శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. వెంటనే సంబంధిత అధికారులు పేట్ బషీరాబాద్ స్థలంలో గురుకుల పాఠశాల నిర్మాణానికి పూనుకున్నారు. అయితే, అక్కడున్న ముస్లింలు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రెవెన్యూ అధికారులు నిర్మాణాలను సజావుగా జరిపించేందుకు పోలీస్ బందోబస్తు ఇవ్వాలని పోలీసు అధికారులను కోరారు.