స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

కొరడా ఝళిపించిన టీజీ సేఫ్.. 11 ప్రధాన హోటల్స్ లైసెన్స్ రద్దుతెలంగాణSwechaa26 Sep 2026, 10:28 PM

కొరడా ఝళిపించిన టీజీ సేఫ్.. 11 ప్రధాన హోటల్స్ లైసెన్స్ రద్దు

TG Safe: హైదరాబాద్ నగరంలో ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించిన హోటల్స్ పై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. 11 ప్రధాన హోటళ్ల లైసెన్స్ లు రద్దు చేసింది. మాదాపూర్, గచ్చిబౌలి పరిధిలోని పలు హోటళ్లు, రెస్టారెంట్స్ లో నాసిరకం ఆహార పదార్థాలను గుర్తించారు. వంట గదులు దుర్గంధపూరితంగా ఉన్నాయి. దీంతో టీజీ సేఫ్ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న హోటళ్ల లైసెన్సులు రద్దు చేశారు.

హైటెక్‌ సిటీ

* మొనాస్ట్రీ

* కోల్ స్పార్క్ రెస్టారెంట్‌

* కాంచి కేఫ్‌

గచ్చిబౌలి

* శివాణి బార్ అండ్ రెస్టారెంట్‌

* అల్‌సబా రెస్టారెంట్

* ఉడిపీస్ ఉపహార్

* అంటెరా కిచెన్ అండ్ బార్

మాదాపూర్‌

* లక్కీ రెస్టారెంట్

* సాయిరామ్‌ మెస్‌

* ఇనార్బిట్ మాల్‌లోని అమ్ ఆహా తెలుగు కిచెన్ అండ్ బార్

* మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లోని ఫ్యూజన్9, అమ్నీషియా స్కై బార్ లైసెన్స్ రద్దు

KTR:  ప్రజల మూడ్ మారింది.. ఎక్కడ చూసినా 'దేఖ్‌ లేంగే' అంటున్నారు: కేటీఆర్తెలంగాణSwechaa26 Sep 2026, 10:01 PM

KTR: ప్రజల మూడ్ మారింది.. ఎక్కడ చూసినా 'దేఖ్‌ లేంగే' అంటున్నారు: కేటీఆర్

KTR: తెలంగాణలోని పల్లెపల్లెనా కాంగ్రెస్ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, ఎక్కడికెళ్లినా ప్రజల నోట ఒకటే నినాదం వినిపిస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి ప్రాంతానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అనంతరం కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదంటూ ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కేసీఆర్ ఎక్కడున్నాడు అని కాంగ్రెసోళ్లు అడుగుతుంటారు.. కేసీఆర్ మూడేళ్లు కనబడకపోయినా ప్రజల గుండెల్లో భద్రంగా ఉంటాడు.

ATM: సమ్మె టైంలో ఏటీఎం బాదుడు బంద్.. కస్టమర్ల కోసం ప్రత్యేక వెసులుబాటు!NationalSwechaa26 Sep 2026, 09:46 PM

ATM: సమ్మె టైంలో ఏటీఎం బాదుడు బంద్.. కస్టమర్ల కోసం ప్రత్యేక వెసులుబాటు!

ATM: వారంలో అయిదు పనిదినాలు అమలు చేయాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకుల సిబ్బంది చేపడుతున్న సమ్మె నేపథ్యంలో ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం వెలువడింది. ఈ నెల 28 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో, ఖాతాదారులు నగదు కష్టాలు పడకుండా ఉండేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా ఇతర జాతీయ బ్యాంకులు ప్రత్యేక సడలింపులను ప్రకటించాయి. సమ్మె కాలంలో ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు లేకుండా ఏటీఎంలను ఫ్రీగా వాడుకునేందుకు పచ్చజెండా ఊపాయి.సమ్మె కొనసాగే ఆ మూడు రోజులు సామాన్యులపై పైసా భారం పడకుండా ప్రభుత్వ బ్యాంకులు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా ఏ బ్యాంకు ఏటీఎం సెంటర్ నుంచి డబ్బులు డ్రా చేసుకున్నా ఎలాంటి చార్జీలు వర్తించవు. సాధారణంగా ఉండే లావాదేవీల పరిమితితో సంబంధం లేకుండా ఉచితంగా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు.

OG 2: 70 రోజుల పవన్ డేట్స్..సుజీత్ ఎలా వాడతాడు?సినిమాSwechaa26 Sep 2026, 09:29 PM

OG 2: 70 రోజుల పవన్ డేట్స్..సుజీత్ ఎలా వాడతాడు?

OG 2: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది పండుగ లాంటి వార్త. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెర‌కెక్క‌నున్న‌ అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా 'ఓజీ2' నుంచి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్. పవన్ కళ్యాణ్-సుజీత్ కాంబినేషన్‌లో వచ్చిన ఓజీ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు, ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తుండగా.. ఇందుకోసం పవన్ కళ్యాణ్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ 70 రోజుల కాల్ షీట్స్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి.

KTR:  ఖైరతాబాద్‌ బైపోల్ ఎన్నిక.. కేటీఆర్ కు పెద్ద ఛాలెంజ్..?తెలంగాణSwechaa26 Sep 2026, 09:01 PM

KTR: ఖైరతాబాద్‌ బైపోల్ ఎన్నిక.. కేటీఆర్ కు పెద్ద ఛాలెంజ్..?

KTR: తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉప ఎన్నిక వేడితో రగులుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ బైపోల్ ఆసక్తి రేపుతున్నప్పటికీ, గులాబీ దళపతి కేటీఆర్‌కు మాత్రం ఇది సాధారణ ఎన్నిక కాదు; తన రాజకీయ భవిష్యత్తును, నాయకత్వ పటిమను తేల్చే జీవన్మరణ సమస్యగా మారనుంది. హైదరాబాద్‌లో ఇప్పటికే ఎదురైన పరాభవాలు, పార్టీ అధినేత కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్‌కు ఈ ఉప ఎన్నిక పెద్ద సవాలుగా నిలవనుంది.హైదరాబాద్ అంటే బీఆర్‌ఎస్‌కు ఒకప్పుడు కంచుకోట. గ్రేటర్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా గులాబీ జెండా రెపరెపలాడేది. కానీ అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. గ్రేటర్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

చిత్రం లేదు
ఏపీSwechaa26 Sep 2026, 08:27 PM

TTD: ఆ రూమర్లకు చెక్ పెట్టిన టీటీడీ.. మా ఆన్‌లైన్ సిస్టమ్ పక్కా సేఫ్!

TTD: శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ వ్యవహారంపై సోషల్ మీడియాలో జోరుగా వస్తున్న రూమర్స్‌పై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) గట్టిగా క్లారిటీ ఇచ్చింది. తమ ఆన్‌లైన్ వ్యవస్థ అత్యంత పటిష్టంగా, పూర్తి భద్రతా ప్రమాణాలతో పనిచేస్తోందని స్పష్టం చేసింది. టికెట్ లభించకపోవడానికీ, వ్యవస్థలో లోపాలు ఉండటానికీ మధ్య చాలా వ్యత్యాసం ఉందని పేర్కొంటూ ఆధారాలతో సహా లెక్కలు విడుదల చేసింది.టికెట్లు నిమిషాల వ్యవధిలోనే ఎందుకు అయిపోతున్నాయో టీటీడీ అధికారిక గణాంకాలతో సహా వివరించింది. టికెట్ల విడుదల సమయంలో ఒకేసారి దాదాపు 6 లక్షల మంది యూజర్లు వెబ్‌సైట్‌లోకి వస్తున్నారు. ఒక్కొక్కరు సగటున 4 టికెట్ల కోసం ప్రయత్నిస్తుండటంతో, క్షణాల వ్యవధిలోనే 24 లక్షల టికెట్లకు డిమాండ్ ఏర్పడుతోంది. దేవస్థానం వద్ద నెలకు అందుబాటులో ఉండేది దాదాపు 2.69 లక్షల టికెట్లు మాత్రమే. అంటే అందుబాటులో ఉన్న కోటా కంటే 9 రెట్లు అధికంగా పోటీ ఉంటోంది.

విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్రతెలంగాణSwechaa26 Sep 2026, 08:17 PM

విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు ప్రభుత్వం కుట్ర

Jagadish Reddy: విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటీకరణ చేసే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెర లేపిందని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. లాభాల్లో ఉన్న ట్రాన్స్ కో సంస్థను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్లాన్ ప్రభుత్వం చేస్తోందన్నారు. విద్యుత్ ను ప్రైవేట్ పరం చేస్తే రాష్ట్రం బాగుపడదన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ సర్కార్ భూములను సైతం అమ్ముకుంటోందని ఆయన మండిపడ్డారు.

''విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోంది. లాభాల్లో ఉన్న ట్రాన్స్ కోను వాళ్లకు ఇష్టమైన వాళ్లకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ట్రాన్స్ కో ను ఎందుకు ప్రైవేట్ వాళ్లకి ఇవ్వాలి? ఏం అవసరం వచ్చింది? ట్రాన్స్ కో లాభాల్లోనే ఉంది. అవసరమైనప్పుడు డిస్కంలకు కూడా సాయం చేస్తోంది.

TG: మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డితెలంగాణSwechaa26 Sep 2026, 08:15 PM

TG: మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్‌రెడ్డి

TG: మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపకర్త డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్‌ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని విప్రో సర్కిల్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశ పురోగతికి బాటలు వేసిన మన్మోహన్‌కు భారతరత్న ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి ఉన్న అడ్డంకి ఏంటని సూటిగా ప్రశ్నించారు.రాజకీయ విభేదాలను పక్కనబెట్టి మేధావుల సేవలను స్మరించుకోవడమే నిజమైన పరిణితి అని సీఎం పేర్కొన్నారు. "దేశం క్లిష్ట ఆర్థిక, రాజకీయ ఒడిదొడుకుల్లో చిక్కుకున్న సమయాల్లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకుని పాలనను గాడిన పెట్టారు. మౌనంగా ఉంటూనే పరిపాలనలో విప్లవాత్మక నిర్ణయాలు అమలు చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తికి ఇప్పటివరకు భారతరత్న దక్కకపోవడం బాధాకరం. ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే స్పందించి మన్మోహన్‌ సింగ్‌కు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి" అని విజ్ఞప్తి చేశారు.

The Paradise: 2026 మొత్తం ప్యారడైజ్ గురించే మాట్లాడతారా? నాని అన్నదేంటి!సినిమాSwechaa26 Sep 2026, 08:00 PM

The Paradise: 2026 మొత్తం ప్యారడైజ్ గురించే మాట్లాడతారా? నాని అన్నదేంటి!

The Paradise: గుడ్ నాయిస్, బ్యాడ్ నాయిస్ కాదు ఓన్లీ నాయిస్..అది ప్యారడైజ్ సినిమాకి వినిపిస్తోంది..ఈ 2026 మొత్తం వినిపించేది ప్యారడైజ్ సినిమా గురించే..అని తాజాగా జరిగిన ప్యారడైజ్ సినిమా సక్సెస్ ఈవెంట్‌లో హీరో నాని అన్నాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి మిక్స్ టాక్, డివైడ్ టాక్ వచ్చింది. సాధారణంగా ఇలాంటి టాక్ వచ్చాక మొత్తం సీన్ మారిపోతుంది.

SIR:  "సర్‌" నోటీసులిచ్చినంత మాత్రాన విచారణకు రానక్కర్లేదు.. ఈసీ కీలక ప్రకటనతెలంగాణSwechaa26 Sep 2026, 07:11 PM

SIR: "సర్‌" నోటీసులిచ్చినంత మాత్రాన విచారణకు రానక్కర్లేదు.. ఈసీ కీలక ప్రకటన

SIR: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) నోటీసుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈజీ) తెరదించింది. క్షేత్రస్థాయి అధికారులు ఇచ్చే 'సర్‌' నోటీసులు అందుకున్నంత మాత్రాన సామాన్య ఓటర్లు నేరుగా వ్యక్తిగత విచారణకు హాజరుకావాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. అత్యంత అనివార్యమైన, అత్యవసరమైన సాంకేతిక సందర్భాల్లో మినహా సాధారణ జనాలను విచారణ పేరిట ఇబ్బంది పెట్టకూడదని అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.ఢిల్లీలోని ఈసీ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధూ, డాక్టర్ వివేక్ జోషిల నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి భేటీ అనంతరం ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

కుళ్లిన మాంసం, ఇంజనాయిల్ లాంటి ఆయిల్.. హోటల్స్‌, రెస్టారెంట్లలో దారుణాలుతెలంగాణSwechaa26 Sep 2026, 06:58 PM

కుళ్లిన మాంసం, ఇంజనాయిల్ లాంటి ఆయిల్.. హోటల్స్‌, రెస్టారెంట్లలో దారుణాలు

Rotten Meat: కుళ్లిన గుడ్లతో ఆమ్లెట్లు.. మురిగిపోయిన మాంసంతో వేపుళ్లు.. ఇంజనాయిల్ లాంటి ఆయిల్ తో ఫ్రైడ్ చికెన్.. సింథటిక్ ఫుడ్ కలర్స్.. ఎక్స్ పైరీ ఫుడ్ ఐటెమ్స్.. లేబుల్స్ లేని ఆహార పదార్ధాలు.. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని హోటల్స్, రెస్టారెంట్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన సోదాల్లో ఈ దారుణాలు వెలుగుచూశాయి. హోటల్, రెస్టారెంట్ ఫుడ్ ను లొట్టలు వేసుకుంటూ తినే వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్ తోనో కలిసి హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్లి ఇలాంటి ఆహారం తిన్నారంటే జబ్బుల బారిన పడటం ఖాయం అంటున్నారు డాక్టర్లు.

Srikanth Odela: నాని అన్న నన్ను భరించాల్సిందే..వేరే ఆప్షన్ లేదు!సినిమాSwechaa26 Sep 2026, 06:51 PM

Srikanth Odela: నాని అన్న నన్ను భరించాల్సిందే..వేరే ఆప్షన్ లేదు!

Srikanth Odela: నాని అన్న నన్ను భరించాల్సిందే..వేరే ఆప్షన్ లేదు..అంటూ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ది ప్యారడైజ్ మూవీ ఈవెంట్ లో మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘దసరా’ సినిమాతో ఈ ఇద్దరూ కలిసి సృష్టించిన బాక్సాఫీస్ కలెక్షన్స్ ప్రేక్షకులకు ఇంకా గుర్తుంది. దీంతో వీరి కాంబోలో మరో సినిమా అనగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

TG: నవంబర్‌ నుంచి కాళేశ్వరం పునరుద్ధరణ పనులు మొదలుపెడతాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితెలంగాణSwechaa26 Sep 2026, 06:29 PM

TG: నవంబర్‌ నుంచి కాళేశ్వరం పునరుద్ధరణ పనులు మొదలుపెడతాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

TG: తెలంగాణ సాగునీటి రంగంలో అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. తీవ్ర వివాదాస్పదమైన మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పనులను నవంబర్ రెండో వారం నుంచి అధికారికంగా ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు.ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర నివేదికలను సిద్ధం చేసింది. కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి అక్టోబర్ 5న తుది డిజైన్లను సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు.

AI Scam Call: ఏఐ తో మోసం.. బ్యాంకు నుంచి రూ.1000 కోట్లు మాయం!!..InternationalSwechaa26 Sep 2026, 06:11 PM

AI Scam Call: ఏఐ తో మోసం.. బ్యాంకు నుంచి రూ.1000 కోట్లు మాయం!!..

కేటుగాళ్లు ఏఐని ఉపయోగించి.. ఓ బ్యాంకుకు రూ.వేల కోట్లు కుచ్చుటోపి వేశారు.. సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించి సుమారు 1000 కోట్లు కొల్లగొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ భారీ మోసం ఇటలీలోని అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకు ఇంటెసా శాన్‌పాలోలో చోటుచేసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఇటలీలో అతిపెద్ద బ్యాంకు ఇంటెసా శాన్‌పాలో సంబంధిత విభాగమైన ఫిడ్యూరమ్‌ మాజీ ఛైర్మన్‌ పావొలో మోలెసినిని ఫిబ్రవరిలో కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. ఇంటెసా శాన్‌పాలో సీఈఓ కార్లో మెస్సీనాలా నమ్మబలికి ఏఐ వాయిస్‌ క్లోనింగ్‌ సృష్టించి ఫోన్‌ కాల్‌ చేశారు. దీంతో మాజీ ఛైర్మన్‌ పావొలో ఇదంతా నిజమనుకొని.. విదేశీ ఖాతాల్లోని నిధులను ట్రాన్స్‌ఫర్‌ చేయాలని తన ఫైనాన్స్‌ విభాగాన్ని ఆదేశించారు.

Rana Daggubati: రానా రిలీజ్ చేస్తున్న కీర్తి సురేష్ సినిమాసినిమాSwechaa26 Sep 2026, 05:57 PM

Rana Daggubati: రానా రిలీజ్ చేస్తున్న కీర్తి సురేష్ సినిమా

Rana Daggubati: తమిళంలో ఈ వారం రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న సినిమా ‘డోరతీ’. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. డోరతీ ప్రేక్షకుల ముందుకు వచ్చాక.. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారి..సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. అయినా, ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు రానా దగ్గుబాటి.

Paid Reviews: రక్తం ధారపోస్తే.. రివ్యూల పేరుతో చంపేస్తారా? బాక్సాఫీస్‌ను శాసిస్తున్న పెయిడ్ రివ్యూల దందా!సినిమాSwechaa26 Sep 2026, 05:56 PM

Paid Reviews: రక్తం ధారపోస్తే.. రివ్యూల పేరుతో చంపేస్తారా? బాక్సాఫీస్‌ను శాసిస్తున్న పెయిడ్ రివ్యూల దందా!

Paid Reviews: సినిమా అంటే ఒకప్పుడు కళ, కోట్లాది మంది అభిమానం. ఇప్పుడు మాత్రం కొందరు స్వార్థపరుల చేతుల్లో అది సులువైన బ్లాక్‌మెయిలింగ్ దందాలా మారిపోయింది. టికెట్ తెగి తెరపై బొమ్మ పడకముందే 'ఎక్స్' (ట్విట్టర్), యూట్యూబ్‌లలో స్టార్ రేటింగుల బేరసారాలు మొదలవుతున్నాయి. పైసలు ముట్టజెప్పిన మేకర్స్‌కు ఆకాశమంత పొగడ్తలు, ప్యాకేజీలు తిరస్కరించిన చిత్రాలకు పాతాళమంత నెగెటివిటీని కట్టబెడుతున్న ఈ "రివ్యూ సిండికేట్" ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.నేటి సినీ విశ్లేషణల ముసుగులో జరుగుతున్న తంతు అంతా ఇంతా కాదు. నిర్మాణ సంస్థల నుంచి ముట్టే ప్యాకేజీల ఆధారంగానే రివ్యూల స్వభావం మారుతోందన్న ఆరోపణలు బహిరంగ రహస్యంగా మారాయి. కాసుల వర్షం కురిపించిన ప్రాజెక్టులకు డల్ కంటెంట్ ఉన్నా ‘కల్ట్ క్లాసిక్’ అని బిరుదులు ఇవ్వడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. డీల్స్ కుదరని సినిమాల ఫస్ట్ షో ముగియకముందే 'డిజాస్టర్' అనే ముద్ర వేసి ప్రేక్షకులు థియేటర్ వైపు రాకుండా చేయడం కొంత మంది చేస్తున్నారు. ఈ పైరసీ రేటింగుల వల్ల సాధారణ ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చి స్వయంగా నిర్ణయం తీసుకునే కనీస స్వేచ్ఛను కూడా కోల్పోతున్నాడనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

సీఈసీ జ్ఞానేశ్వర్‌ను వెంటనే తొలగించాలి, అరెస్ట్ చేయాలితెలంగాణSwechaa26 Sep 2026, 05:50 PM

సీఈసీ జ్ఞానేశ్వర్‌ను వెంటనే తొలగించాలి, అరెస్ట్ చేయాలి

CEC Row: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఓటు చోరీ జరుగుతోందన్నది వాస్తవం అన్నారాయన. బీజేపీకి అవసరం ఉన్న చోట ఓటు చోరీ జరుగుతోందన్నారు. ఈసీ చేపట్టిన సర్ ప్రక్రియపై యువతరం ఆందోళన చెందుతోందన్నారు. అందుకే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారని చెప్పారు.

సీఈసీ జ్ఞానేశ్వర్ ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని, అరెస్ట్ చేయాలని మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. జ్ఞానేశ్వర్ ను తొలిగించాలనే డిమాండ్ తో సోమవారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

Megastar-Kaaka: 'కాకా' డబ్బింగ్ మొదలు..బాబీ స్పీడ్ మాములుగా లేదు..సినిమాSwechaa26 Sep 2026, 05:19 PM

Megastar-Kaaka: 'కాకా' డబ్బింగ్ మొదలు..బాబీ స్పీడ్ మాములుగా లేదు..

Megastar-Kaaka: బాబీ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘కాకా’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చిత్రబృందం డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా వీడియోను రిలీజ్ చేసింది. ఈవీడియో దర్శకుడు బాబీ..కీలక పాత్రలో నటించిన యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ సహా చిత్ర యూనిట్ కూడా ఉన్నారు.

తెలంగాణ టూ బెంగాల్.. గోడదూకిన 111 మంది నేతలు! ADR రిపోర్ట్‌తో దద్దరిల్లుతున్న పాలిటిక్స్..తెలంగాణSwechaa26 Sep 2026, 05:04 PM

తెలంగాణ టూ బెంగాల్.. గోడదూకిన 111 మంది నేతలు! ADR రిపోర్ట్‌తో దద్దరిల్లుతున్న పాలిటిక్స్..

ADR Report: భారత రాజకీయాల్లో ఎన్నికలు ముగియడమే ఆలస్యం.. సిద్ధాంతాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రజలు ఒక గుర్తును చూసి ఓటేస్తే, గెలిచిన నేతలు మాత్రం ఏమాత్రం సంకోచం లేకుండా అధికార పార్టీల పంచన చేరుతున్నారు. ఇటీవల 'అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్' (ADR), నేషనల్ ఎలక్షన్ వాచ్ రిలీజ్ చేసిన తాజా డేటా ప్రస్తుతం దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. 2022 నుంచి 2026 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఏకంగా 111 మంది ప్రజాప్రతినిధులు (26 మంది లోక్‌సభ ఎంపీలు, 7 గురు రాజ్యసభ సభ్యులు, 78 మంది ఎమ్మెల్యేలు) పార్టీ ఫిరాయించారనే వాస్తవం ప్రజాస్వామ్య వ్యవస్థల పనితీరుపై ప్రశ్నలను లేవనెత్తుతోంది.దక్షిణాది వేదికగా తెలంగాణ రగడ..ఈ ఫిరాయింపుల పర్వంలో తెలంగాణ రాజకీయాలు ప్రత్యేక చర్చకు దారితీశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేల్లో 9 మంది కాంగ్రెస్ గూటికి చేరారని ADR నివేదిక అధికారికంగా తేల్చింది. అయితే ఇతర రాష్ట్రాల్లో లాగా ఇక్కడ వ్యవహారం అంత తేలిగ్గా క్లోజ్ కాలేదు.

సీఈసీ రాజీనామా చేయకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలితెలంగాణSwechaa26 Sep 2026, 04:23 PM

సీఈసీ రాజీనామా చేయకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి

CEC Row: కేంద్రం ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఎస్ఐఆర్ పేరుతో అన్యాయంగా ఓట్లు తొలగించారని ఆయన ఆరోపించారు. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగించిందనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని వినోద్ కమార్ డిమాండ్ చేశారు. సీఈసీ రాజీనామా చేయకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలని ఆయన కోరారు.

SK 27: శివకార్తికేయన్–కయాదు లోహర్ కొత్త సినిమా ప్రారంభంసినిమాSwechaa26 Sep 2026, 04:17 PM

SK 27: శివకార్తికేయన్–కయాదు లోహర్ కొత్త సినిమా ప్రారంభం

SK 27: కోలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మరో క్రేజీ కాంబినేషన్ తెరపై రాబోతోంది. టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్, బ్యూటిఫుల్ హీరోయిన్ కయాదు లోహర్ జంటగా నటించనున్న కొత్త చిత్రం తాజాగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. వరుసగా ఫ్లాప్స్ వస్తున్నా కూడా కయాదు మాత్రం మాంచి జోరు మీదుంది. ఇటీవల, నాని నటించిన ప్యారడైజ్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కయాదుకి వెంటనే తమిళ సినిమా ఛాన్స్ అంటే గొప్ప విషయం.

చాలా ఏళ్ల తర్వాత సినిమాకు వెళ్తున్నా- కేటీఆర్తెలంగాణSwechaa26 Sep 2026, 03:50 PM

చాలా ఏళ్ల తర్వాత సినిమాకు వెళ్తున్నా- కేటీఆర్

Ktr: నిత్యం రాజకీయ వ్యవహారాలతో బిజీబిజీగా ఉండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపు రిలాక్స్ అవ్వనున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన సినిమా చూసేందుకు థియేటర్ కి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన 'ది ప్యారడైజ్' సినిమాను శనివారం రాత్రి చూడబోతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. తాను అభిమానించే నటుల్లో నాని ఒకరు అని కేటీఆర్ తెలిపారు.

‘‘చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు రాత్రి థియేటర్‌లో సినిమా చూడాలనుకుంటున్నా. నా అభిమాన నటుడు నాని, ప్రతిభావంతుడైన యువ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కలిసి తీసిన ‘ది ప్యారడైజ్‌’ చూడబోతున్నా’’ అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలిపారు కేటీఆర్.

SIR: ‘ఇదేం పని సర్’ దేశవ్యాప్తంగా ఈసీ ఎందుకు బద్నాం అవుతోంది?తెలంగాణSwechaa26 Sep 2026, 03:00 PM

SIR: ‘ఇదేం పని సర్’ దేశవ్యాప్తంగా ఈసీ ఎందుకు బద్నాం అవుతోంది?

SIR: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రాణవాయువు పారదర్శకమైన ఎన్నికల ప్రక్రియ. ఆ ప్రక్రియకు గుండెకాయ వంటిది నిష్పాక్షికమైన ఓటర్ల జాబితా. స్వతంత్ర భారతంలో దశాబ్దాలుగా ఎన్నికల సంఘం (ఈసీ) అంటే ఒక అపారమైన విశ్వసనీయత ఉంటూ వచ్చింది. రాజకీయ పార్టీలు ఎన్ని విమర్శలు చేసుకున్నా, ఎన్నికల నిర్వహణలో ఈసీ తీసుకునే నిర్ణయాలకు ప్రజాక్షేత్రంలో ఒక ప్రత్యేక గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైనట్లు కనిపిస్తుందనే కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాను పకడ్బందీగా ప్రక్షాళన చేస్తామంటూ కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (సర్) కార్యక్రమం.. ఇప్పుడు అదే కమిషన్ మెడకు అతిపెద్ద ఉచ్చులా చుట్టుకుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.మ్యాపింగ్‌తో మొదలైన చిన్నపాటి సమస్యలు.. చివరకు సామాన్యుల నుంచి వీఐపీల వరకు లక్షల సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యే దుస్థితికి దారితీశాయని అంటున్నారు. ఇది చాలదన్నట్లు, ఏకంగా ఎన్నికల కమిషన్ అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీనామా చేయాలని విపక్షాలు పట్టుబట్టే స్థాయికి వ్యవహారం ముదరడం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు ఎన్నికల సంఘం ఇంతలా ఎందుకు బద్నాం అవుతోంది? తెరవెనుక జరిగిన తప్పిదాలేంటి? అనేది తెలుసుకుందాం.

Arnaud Denis: బాధ భరించలేక కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల నటుడు!..InternationalSwechaa26 Sep 2026, 02:54 PM

Arnaud Denis: బాధ భరించలేక కారుణ్య మరణం పొందిన 43 ఏళ్ల నటుడు!..

ఫ్రెంచ్ నటుడు, దర్శకుడు ఆర్నాడ్ డెనిస్ 43 ఏళ్ల వయసులో కారుణ్య మరణం ద్వారా ప్రాణాలు విడిచారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కొన్నేళ్లుగా పోరాడిన ఆయన.. బెల్జియంలో కారుణ్య మరణం పొందినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. హెర్నియా సర్జరీ తర్వాత వచ్చిన సైడ్‌ ఎఫెక్ట్స్‌ కారణంగా డెనిస్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక భరించలేక, వైద్యులను సంప్రదించించి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు నటుడి లాయర్‌ తెలిపారు.

ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తాం : టీఆర్ఎస్ చీఫ్ కవితతెలంగాణSwechaa26 Sep 2026, 02:49 PM

ఖైరతాబాద్ ఉపఎన్నికలో పోటీ చేస్తాం : టీఆర్ఎస్ చీఫ్ కవిత

రాష్ట్రంలో ప్రస్తుతం ఖైరతాబాద్ ఉపఎన్నిక హాట్‌టాపిక్ అయ్యింది.ఈ క్రమంలోనే తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టంచేశారు.శనివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ సర్కార్ కేటీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ డ్రామా నడుపుతోందని పేర్కొన్నారు.ఇదంతా లోపాయికారీ ఒప్పందంలో భాగమే అని ఆరోపించారు.కేటీఆర్ ఫామ్‌హౌస్‍పై ఎలాంటి చర్యలు ఉండబోవని స్పష్టంచేశారు. ఇది కేవలం మాటల ప్రభుత్వం మాత్రమే అని.. చేతలు శూన్యం అని విమర్శించారు.

VIRAL: ఏంటీ ‘మనిషి చేష్టలు’ .. క్వార్టర్ సీసాను తాగేసి కునుకు తీసిన కోతిబావ!వైరల్ న్యూస్Swechaa26 Sep 2026, 02:37 PM

VIRAL: ఏంటీ ‘మనిషి చేష్టలు’ .. క్వార్టర్ సీసాను తాగేసి కునుకు తీసిన కోతిబావ!

 మనుషులు ఏదైనా తిక్క పనులు చేస్తే ఏంటీ ఈ ‘కోతి చేష్టలు’ అని తిట్టడం సహజం. అయితే ఒక కోతి చేసిన పని చేసిన వారంతా ఏంటీ ఈ ‘మనిషి చేష్టలు’ అనేలా చేసింది. ఎప్పుడూ పండ్లు తినీ తినీ బోర్‌ కొడుతోందనుకుందో ఏమో ఓ వైన్స్‌పై కన్నేసింది. దుకాణంలో ఉన్న వాళ్లంతా "ఏం కావాలి భయ్యా?" అని అడిగేలోపే... కౌంటర్‌పై ఉన్న ఒక క్వార్టర్ సీసాను స్టైల్‌గా చేతిలోకి తీసుకుంది. ఇక అసలు సిసలైన టాలెంట్ అప్పుడే బయటపడింది. ఏమాత్రం తడబడకుండా, మూతను తన పళ్లతో ‘పప్‌’మని ఓపెన్ చేసి, డైరెక్ట్‌గా గటగటా తాగేసింది. సీసా ఖాళీ చేసే స్పీడ్ చూసి అక్కడున్న మందుబాబులంతా నోరెళ్లబెట్టారు.

పోలీసులు vs ఉద్యోగులు.. రోడ్ బ్లాక్‌తో వాహనదారుల పరేషాన్తెలంగాణSwechaa26 Sep 2026, 02:24 PM

పోలీసులు vs ఉద్యోగులు.. రోడ్ బ్లాక్‌తో వాహనదారుల పరేషాన్

హైదరాబాద్ మహానగరంలో గణనాథుల నిమజ్జనాలు ఇంకా కొనసాగుతున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 2.25 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిన విషయం తెలిసిందే. నగరం నలుమూలల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు నిన్న మహాగణపతిని దర్శించుకుని కడసారి వీడ్కోలు పలికారు. అయితే, సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి నిన్న రాత్రి వరకు వచ్చిన విగ్రహాలను ఇవాళ ఉదయం నుంచి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతోంది.

నేటి సాయంత్రం వరకు మొత్తం నిమజ్జనం ప్రక్రియ పూర్తికానుందని సమాచారం. నిమజ్జనం ప్రక్రియ మొత్తం పూర్తికాకపోవడంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఆఫీసులు, వివిధ పనుల కోసం రోడ్ల మీదకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిమజ్జనం పూర్తయ్యిందని రెగ్యులర్‌గా వెళ్లే దారిలో వచ్చిన వారికి పోలీసులు షాక్ ఇచ్చారు.

The Paradise: ఫ్లాప్ టాక్‌తోను 100 కోట్లు దాటిన నానిసినిమాSwechaa26 Sep 2026, 02:22 PM

The Paradise: ఫ్లాప్ టాక్‌తోను 100 కోట్లు దాటిన నాని

The Paradise: నాని మాస్ జాతర బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కొనసాగుతుందనడానికి తాజా చిత్రం ది ప్యారడైజ్ అతిపెద్ద ఉదాహరణ. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నానీ హీరోగా, కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమాకి ప్రీమియర్స్ నుంచే డివైడ్ టాక్ వచ్చింది. కానీ, ఈ టాక్‌తో సంబంధం లేకుండానే ఇప్పుడు ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను దాటేసింది.

బాలాపూర్ రికార్డులు బ్రేక్.. రేసులో ముందున్న దిల్‌సుఖ్‌నగర్ లడ్డూ!తెలంగాణSwechaa26 Sep 2026, 02:10 PM

బాలాపూర్ రికార్డులు బ్రేక్.. రేసులో ముందున్న దిల్‌సుఖ్‌నగర్ లడ్డూ!

భాగ్యనగర చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలాపూర్ గణేష్ లడ్డూ రికార్డును తాజాగా దిల్‌సుఖ్‌నగర్‌లో నిర్వహించిన లడ్డూ వేలం బద్దలుగొట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ‘జై గణేశ్ యూత్ అసోసియేషన్’ ఆధ్వర్యంలో సుమారు 2.5 కోట్లతో అద్భుతంగా డెకరేట్ చేసిన గణపయ్య సన్నిధిలో శనివారం లడ్డూ వేలం ఘనంగా నిర్వహించారు. పోటాపోటీగా సాగిన ఈ వేలంలో గణపతి లడ్డూ ప్రసాదం రూ.51 లక్షల ధర పలికింది. స్థానిక భక్తుడు రాజేష్ రూ.51 లక్షలు వెచ్చించి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నాడు. మరోవైపు అదే మండపంలో స్వామి వారికి సమర్పించిన మరో లడ్డూను ఓ భక్తుడు రూ.25 లక్షలు వెచ్చించి వేలం పాటలో దక్కించుకున్నాడు. కాగా, ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం పాటలో రూ.39 లక్షల ధర పలికింది.

TGTET: టీజీటెట్‌ ఫలితాలు విడుదల.. 70.07 శాతం ఉత్తీర్ణత!తెలంగాణSwechaa26 Sep 2026, 01:47 PM

TGTET: టీజీటెట్‌ ఫలితాలు విడుదల.. 70.07 శాతం ఉత్తీర్ణత!

 రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌ (TGTET-Inservice Teachers 2026) పరీక్షా ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యాశాఖ డైరెక్టర్, టీజీటెట్ ఛైర్‌పర్సన్ ఈ ఫలితాలను అధికారికంగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మొత్తం 70.07 శాతం మంది ఉపాధ్యాయులు అర్హత సాధించి ఉత్తీర్ణత సాధించారు.