స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Nagaland: మద్య నిషేధం ఉన్న చోట కల్తీ మద్యం కలకలం.. 19మంది బలి!InternationalSwechaa26 Sep 2026, 01:33 PM

Nagaland: మద్య నిషేధం ఉన్న చోట కల్తీ మద్యం కలకలం.. 19మంది బలి!

 పూర్తి మద్యనిషేధం అమల్లో ఉన్న నాగాలాండ్‌ ట్యూన్ సాంగ్ జిల్లాలో కల్తీ మద్యం తీవ్ర విషాదాన్ని నింపింది. అనుమానాస్పద స్థితిలో కల్తీ మద్యం సేవించి గడిచిన రెండు రోజుల్లోనే ఏకంగా 19 మంది ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలోని మొకోక్‌చుంగ్ జిల్లాలో 8మంది, ట్యూన్‌సాంగ్ జిల్లాలో 11 మంది మృతి చెందినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. ఈ హృదయవిదారక ఘటనతో స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురికాగా, పోలీసు యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది.

జారిపడిన వృద్ధుడు.. ప్లాట్‌ఫాంపై లాక్కెళ్లిన రైలువైరల్ న్యూస్Swechaa26 Sep 2026, 01:32 PM

జారిపడిన వృద్ధుడు.. ప్లాట్‌ఫాంపై లాక్కెళ్లిన రైలు

రైలు ఎక్కేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్లు ప్రాణాంతకంగా మారొచ్చు. సమయం అయిపోతుందని, రైలు కదులుతోందని కొందరు భయంతో రన్నింగ్ ట్రైన్ ఎక్కే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సమయంలో చేతులు కాస్త తడిగా ఉన్నా హ్యాండిల్ చేయి జారిపోయి కొందరు కిందపడిపోతుంటారు. తాజాగా ఓ వృద్ధుడికి ఇలాంటి ప్రమాదకర ఘటనే ఎదురైంది. రైలు ఎక్కుతున్న క్రమంలో ఓ వృద్దుడు పట్టుకోల్పోయి కింద పడ్డాడు. అయితే, అటు ప్లాట్‌ఫాం మీద ,ఇటు రైలు కింద కాకుండా మధ్యలో ఇరుక్కుపోయాడు. రైలు ఫుట్ రెస్ట్ మధ్యలో ఆయన కాలు ఇరుక్కుపోయింది. దాంతో కొంతదూరం వరకు ట్రైయిన్ అయన్ను లాక్కెళ్లింది.ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నై‌లోని గిండి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది.

SS.Rajamouli-Varanasi-Mahesh: వారణాసి కి రాజమౌళి ప్లాన్ ఇలా వర్కౌంట్ అవుతుందా?సినిమాSwechaa26 Sep 2026, 01:19 PM

SS.Rajamouli-Varanasi-Mahesh: వారణాసి కి రాజమౌళి ప్లాన్ ఇలా వర్కౌంట్ అవుతుందా?

SS.Rajamouli: గ్లోబల్ స్థాయిలో మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ఇప్పటికే మన మేకర్స్ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అక్కడ మార్కెట్‌ను బాగా ఆకట్టుకునేందుకు భారతీయ చిత్ర పరిశ్రమ పాన్ ఇండియన్ సినిమాలతో ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను ఎంచుకుంటోంది. ఇటీవల కన్నడ రాకింగ్ స్టార్ యష్ ‘టాక్సిక్’ సినిమాను నేరుగా ఇంగ్లీష్‌లో కూడా షూట్ చేసి విదేశీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే, రాజమౌళి ఇంకో ప్రయత్నం చేయబోతున్నాడు. తెలుగులోనే అన్నీ చోట్లా రిలీజ్ చేయనున్నాడట.

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు వేధింపులు.. పీఈటీ ఎస్కేప్!తెలంగాణSwechaa26 Sep 2026, 01:08 PM

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులకు వేధింపులు.. పీఈటీ ఎస్కేప్!

విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మంచి భవిష్యత్ ప్రసాదించాల్సిన గురువులు గాడి తప్పుతున్నారు. విద్యార్థినులు కూడా తమ పిల్లలే అనుకోవాల్సిన వారు తమలోని క్రూరత్వాన్ని, వికృత రూపాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు చెప్పుకోలేక నరకయాతన అనుభవిస్తున్నట్టు సమాచారం. కొందరు ధైర్యం చేసి ఇంట్లో ఈ విషయాన్ని చెప్పగా.. స్కూల్స్‌లో విద్యార్థినుల పట్ల జరుగుతున్న దారుణాలు నెమ్మదిగా వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లా గుదిమళ్ల ప్రభుత్వ పాఠశాలలో ఓ పీఈటీ టీచర్ విద్యార్థినులను గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలిసింది. ఫిజికల్ ట్రైనింగ్ పేరుతో బాలికలను అసభ్యంగా తాకుతూ ఇబ్బందులకు గురిచేసినట్టు సమాచారం. అయితే, వేధింపులు తీవ్రతరం కావడంతో పీఈటీ షఫీ అహ్మద్‌పై విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటకు వెలుగుచూసింది. ఉపాధ్యాయుడు తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

ఆమె ప్రేమ చూస్తే అతడు డబ్బు చూశాడు.. చివరకు!క్రైమ్Swechaa26 Sep 2026, 12:37 PM

ఆమె ప్రేమ చూస్తే అతడు డబ్బు చూశాడు.. చివరకు!

ప్రేమ పేరిట వేధింపులు, మోసాలు, హత్య ఉదంతాలు క్రమంగా పెరుగుతున్నాయి.ఏళ్లుగా ప్రేమించకుంటున్నామని ఇంట్లో చెప్పే ధైర్యం జంటలకు ఉండటంలేదు. బయటకు మాత్రం అమర ప్రేమికులగా నటిస్తున్నారు. ఫలితంగా పెళ్లి విషయం వచ్చేసరికి అబ్బాయి లేదా అమ్మాయి తిరస్కరించడం ఇటీవలి కాలంలో కామన్ అయ్యింది. అయితే, పెళ్లి చేసుకుందామని పిలిచి ఓ యువతిని ప్రియుడు మర్డర్ చేశాడు. అనంతరం ఆమె వద్దనున్న నగదు, బంగారం ఎత్తుకెళ్లాడు. ఈ హత్యలో నిందితుడికి మరో ముగ్గురు సాయం చేయగా..వారిని తాాజాగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

కెప్టెన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో టీమిండియా మేనేజ్‌మెంట్!క్రీడలుSwechaa26 Sep 2026, 12:25 PM

కెప్టెన్ గిల్‌కు గాయం.. ఆందోళనలో టీమిండియా మేనేజ్‌మెంట్!

 వెస్టిండీస్‌తో తొలి వన్డే ప్రారంభానికి సరిగ్గా రెండు రోజుల ముందు భారత క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. శుక్రవారం నాడు నిర్వహించిన నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తీవ్రంగా గాయపడ్డాడు. భారత వేగవంతమైన బౌలర్ మహ్మద్ సిరాజ్ విసిరిన బంతి అనూహ్యంగా ఎగిసిపడి నేరుగా గిల్ కుడి చేతి మోచేతికి బలంగా తాకడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బంతి తగలగానే తీవ్ర నొప్పితో విలవిలలాడిన గిల్, వెంటనే బ్యాట్‌ను కిందపడేసి నెట్స్ నుంచి బయటకు వచ్చేశాడు.

కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో నిరంతరం పోరాడాలి : హరీశ్ రావుతెలంగాణSwechaa26 Sep 2026, 12:08 PM

కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో నిరంతరం పోరాడాలి : హరీశ్ రావు

స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ సాధన వరకు ఆయన చేసిన త్యాగం, పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు, స్ఫూర్తి భవిష్యత్ తరాలకు అందాలనే ఉద్దేశంతో వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని గుర్తుచేశారు. ఉద్యాన విశ్వవిద్యాలయానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడంతో పాటు, ట్యాంక్ బండ్ పై వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి సమున్నతంగా గౌరవించారని తెలిపారు.

ఆత్మగౌరవ ధిక్కార స్వరానికి  నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ : కేసీఆర్తెలంగాణSwechaa26 Sep 2026, 11:51 AM

ఆత్మగౌరవ ధిక్కార స్వరానికి నిలువెత్తు నిదర్శనం చాకలి ఐలమ్మ : కేసీఆర్

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఆమె త్యాగాలను స్మరిస్తూ ఘన నివాళ్లు అర్పించారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. చాకలి ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరమని, అందుకు ఆమె నిలువెత్తు నిదర్శనమని మాజీ సీఎం కొనియాడారు. నిజాం పాలన సమయంలో నిరంకుశ రాచరిక పోకడలు, భూస్వాముల అణచివేతకు వ్యతిరేకంగా, రైతాంగం న్యాయమైన హక్కుల కోసం గళమెత్తిన ధీరవనిత అని ప్రశంసించారు. ఓ వైపు భూస్వామ్య శక్తులను ఎదురిస్తూనే, మరోవైపు చట్టాల పరిధిలో న్యాయస్థానాల్లో న్యాయపోరాటం చేసి గెలిచిన ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శనీయం అని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రస్తుత అస్తవ్యస్త పాలనా పరిస్థితుల్లో చాకలి ఐలమ్మ ప్రదర్శించిన ప్రజాస్వామిక పోరాట పంథా, తెలంగాణ సోయి నేటి యువత అనుసరించదగినదని స్పష్టం చేశారు.

Asiangames: ఇరాన్‌ను ఓడించి.. కబడ్డీలో స్వర్ణం గెలిచిన భారత మహిళలు!క్రీడలుSwechaa26 Sep 2026, 11:50 AM

Asiangames: ఇరాన్‌ను ఓడించి.. కబడ్డీలో స్వర్ణం గెలిచిన భారత మహిళలు!

 జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత క్రీడాకారుల పతకాల వేట కొనసాగుతోంది. తాజాగా మహిళల కబడ్డీ జట్టు అసాధారణ ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఈ క్రీడా పోటీల్లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం కావడం విశేషం. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 37-33 పాయింట్ల తేడాతో బలమైన ఇరాన్ జట్టును చిత్తు చేసి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత మహిళలు తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుని, కబడ్డీలో దేశిక ప్రాభవాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

Chiranjeevi-Update New: ‘కాకా’ మూవీపై మెగాస్టార్ క్రేజీ అప్‌డేట్..సినిమాSwechaa26 Sep 2026, 11:33 AM

Chiranjeevi-Update New: ‘కాకా’ మూవీపై మెగాస్టార్ క్రేజీ అప్‌డేట్..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు భారీ ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటూనే.. మరోవైపు తన అభిమానుల్లో ఆసక్తిని పెంచేలా కీలక అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ‘కాకా’ మూవీకి సంబంధించి మెగాస్టార్ ఇచ్చిన తాజా అప్‌డేట్ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ 80 శారం పూర్తైందట. ఫస్టాఫ్ కంటెంట్ థమన్ చేతికి వెళ్ళినట్టుగా కూడా చిరు వెల్లడించారు.

ఉగ్రదేశం నన్ను ప్రశ్నిస్తోంది.. పాక్ జర్నలిస్టుకు జై శంకర్ దిమ్మతిరిగే కౌంటర్NationalSwechaa26 Sep 2026, 11:28 AM

ఉగ్రదేశం నన్ను ప్రశ్నిస్తోంది.. పాక్ జర్నలిస్టుకు జై శంకర్ దిమ్మతిరిగే కౌంటర్

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు ఇప్పుడు కాస్త తగ్గినా దౌత్యపరంగా మాత్రం ఆ వైరం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వేదికల మీద ఇండియా పరువు తీయాలని ప్రయత్నించిన ప్రతిసారి దాయాది పాక్‌కు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పాక్ పన్నాగాలు వరుసగా విఫలం అవుతున్న తరుణంలో అంతర్జాతీయ వేదికల మీద భారత్ పరువు తీయాలని ప్రయత్నించే వారి కుట్రలను విదేశాంగశాఖ తిప్పికొడుతోంది. తాజాగా యూఎన్‌జీవో 81వ సమావేశాల్లో భాగంగా న్యూయార్క్‌లో జరిగిన మీడియా మీట్‌లో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఓ పాక్ జర్నలిస్ట్ ‘పాకిస్తాన్‌లో భారత్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని మీ దేశం ఎప్పుడు ఆపుతుంది’ అని ప్రశ్నించగా.. ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఒక ఉగ్రవాద దేశమే నన్ను ఈ ప్రశ్న అడుగుతోంది. కమాన్’ అని ఘాటు జవాబు ఇచ్చారు.

Srikanth Odela-Mega Chance: ది ప్యారడైజ్ ఫ్లాప్ .. శ్రీకాంత్ ఓదెలకు మెగా ఛాన్స్ మిస్ అవుతుందా?సినిమాSwechaa26 Sep 2026, 11:24 AM

Srikanth Odela-Mega Chance: ది ప్యారడైజ్ ఫ్లాప్ .. శ్రీకాంత్ ఓదెలకు మెగా ఛాన్స్ మిస్ అవుతుందా?

Srikanth Odela: యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పేరు టాలీవుడ్‌లో ఒక్క సినిమాతోనే మార్మోగింది. మొదటి చిత్రం ‘దసరా’తో తనలోని మాస్ టేకింగ్‌ను చూపించిన శ్రీకాంత్.. ఇప్పుడు నాని హీరోగా తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’తో మరోసారి భారీ అంచనాలను సెట్ చేశాడు. అయితే, ఈ సినిమా ఫలితం శ్రీకాంత్ కెరీర్‌లో చాలా కీలకంగా మారనుందన్న విషయం అందరికీ తెలిసిందే. దసరా సినిమా చూసే మెగాస్టార్ చిరంజీవి..ఈ యువ దర్శడుకి ఛాన్స్ ఇచ్చారు. కానీ, ప్యారడైజ్ ఫలితం వల్ల అది మిస్ అవుతుందంటున్నారు.

ఎస్సై సహా 13మంది మృతి.. నిమజ్జనోత్సవాల్లో విషాదాలపై డీజీపీ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతి!క్రైమ్Swechaa26 Sep 2026, 11:23 AM

ఎస్సై సహా 13మంది మృతి.. నిమజ్జనోత్సవాల్లో విషాదాలపై డీజీపీ సీవీ ఆనంద్ దిగ్భ్రాంతి!

 తెలంగాణ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగిన వినాయక నిమజ్జన ఉత్సవాల్లో తీవ్ర విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. నిమజ్జన ప్రక్రియలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల కారణంగా ఒక ఎస్ఐ సహా మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) సీవీ ఆనంద్ వెల్లడించారు. బాధితులకు తక్షణ వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో గణేష్ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని డీజీపీ వివరించారు.

Keerthy Suresh-Dorothy: కార్తీక్ సుబ్బరాజ్ ‘డొరొతి’ని బాయ్‌కాట్ చేయాలా? కారణమేంటి?సినిమాSwechaa26 Sep 2026, 11:10 AM

Keerthy Suresh-Dorothy: కార్తీక్ సుబ్బరాజ్ ‘డొరొతి’ని బాయ్‌కాట్ చేయాలా? కారణమేంటి?

Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. అయితే ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ‘డొరొతి’ చుట్టూ వినిపిస్తున్న బాయ్‌కాట్ డిమాండ్లు సోషల్ మీడియాలో ఆసక్తిని పెంచుతున్నాయి. సినిమాను చూడొద్దంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం సినిమాను సినిమాగా చూడాలంటూ పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు.

విమానం క్రాష్.. ఇద్దరు ఆర్మీ అధికారులు సహా 14 మంది దుర్మరణంప్రపంచంSwechaa26 Sep 2026, 10:41 AM

విమానం క్రాష్.. ఇద్దరు ఆర్మీ అధికారులు సహా 14 మంది దుర్మరణం

ఆఫ్రికా ఖండంలో మరో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. కాంగో దేశంలో నిన్న ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కిక్విట్ నుండి కాంగో రాజధాని కిన్షాసాకు వెళుతున్న విమానం కెంగే ప్రాంతంలో క్రాష్ ల్యాండ్ అయింది.ఈ ఘటనలో విమానంలోని ప్రయాణికులు మరణించారు.ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు మిలిటరీ అధికారులు సైతం ఉన్నట్టు సమాచారం. వారిలో ఒకరు లెఫ్టినెంట్ జనరల్ ముటొంబో కటలాయి టియెండే, మరొకరు సాయుధ దళాల ఆడిటర్ జనరల్ బకుమి లికులియా అని తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించినట్టు సమాచారం.

ChakaliAilammaJayanthi: చాకలి ఐలమ్మ భావితరాలకు ఆదర్శం: కేటీఆర్తెలంగాణSwechaa26 Sep 2026, 10:38 AM

ChakaliAilammaJayanthi: చాకలి ఐలమ్మ భావితరాలకు ఆదర్శం: కేటీఆర్

 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరనారి, బహుజన ధీరత్వానికి ప్రతీక అయిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు 'ఎక్స్'(ట్విట్టర్) వేదికగా ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకుంటూ, తెలంగాణ మట్టి గడ్డపై ఐలమ్మ చూపిన పోరాట పటిమ, చేసిన త్యాగాలు భావితరాలకు నిరంతరం ఆదర్శంగా నిలుస్తాయని కొనియాడారు.

ఇజం లేని టూరిజం.. మాటలేనా.. చేతలు ఉండవా?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa26 Sep 2026, 10:30 AM

ఇజం లేని టూరిజం.. మాటలేనా.. చేతలు ఉండవా?

ప్రపంచ పర్యాటక దినోత్సవం 2026 థీమ్ ఏంటో తెలుసా. పర్యాటక రంగాన్ని పునరుద్ధరించేందుకు డిజిటల్ అజెండా ఏఐ. కానీ, టెక్నాలజీ యుగంలో ఆ ఉత్సాహం లేదు. భవిష్యత్ ప్రణాళికలు కానరావడం లేదు. ప్రభుత్వం రాగానే 10 ఏండ్లుగా టూరిజం పాలసీ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2024లో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2030 వరకు పాలసీ అంటూ 2025 మార్చి 17న అమల్లోకి తెచ్చారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 3 లక్షల ఉద్యోగాలు, టాప్ 5 రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలని ఏదేదో చెప్పారు.

Asiangames: 44ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. భారత అథ్లెట్ తిరుగులేని ఘనత!క్రీడలుSwechaa26 Sep 2026, 10:14 AM

Asiangames: 44ఏళ్ల నిరీక్షణకు తెరదించి.. భారత అథ్లెట్ తిరుగులేని ఘనత!

 జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత అథ్లెట్ సావన్ బర్వాల్ అద్భుత ప్రదర్శనతో చారిత్రక విజయాన్ని నమోదు చేశాడు. పురుషుల మారథాన్ (42.195 కిలోమీటర్లు) విభాగంలో రజత పతకం కైవసం చేసుకుని, ఈ విభాగంలో దాదాపు 44ఏళ్లుగా కొనసాగుతున్న భారత్ పతక నిరీక్షణకు తిరుగులేని తెరదించాడు. జాతీయ రికార్డు హోల్డర్ అయిన సావన్, రేసు ప్రారంభం నుంచే అగ్రశ్రేణి రన్నర్లతో పోటీపడుతూ చివరి వరకు తీవ్రంగా శ్రమించి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు.

డబ్బు కట్టలతో షో .. అతి చేసి అనుభవించిన యూట్యూబర్ ఫ్యామిలీ!వైరల్ న్యూస్Swechaa26 Sep 2026, 10:08 AM

డబ్బు కట్టలతో షో .. అతి చేసి అనుభవించిన యూట్యూబర్ ఫ్యామిలీ!

కొందరు వ్యక్తులు సోషల్ మీడియానే తమ ప్రపంచంగా భావించి ఇంట్లోని సంసారాన్ని బజార్లో పెడుతున్నారు. వ్యూస్,లైక్స్ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. తమ ఇంట్లో ఉదయాన్నే ఏం చేస్తుంటాం, మధ్యాహ్నం ఏం చేస్తుంటాం. సాయంకాలం,రాత్రి ఇలా ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో పోస్టు చేయడం కొందరికి వ్యసనంలా మారింది. ఫలితంగా మన వ్యక్తిగత డిటేల్స్, ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? వస్తువులు ఏం ఉన్నాయ్.. ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ క్రిమినల్స్, దొంగలు, సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతుందని గుర్తించడం లేదు. తీరా గుర్తించే సరికి ఆలస్యం అవుతోంది. ఓ యూట్యూబర్ ఫ్యామిలీ తాజాగా తన ఇంట్లో ఎంత డబ్బు ఉందో సోషల్ మీడియా రీల్స్ ద్వారా బహిర్గతం చేసింది. డబ్బు మొత్తం బీరువాలో నుంచి తీసి చూపిస్తూ ఇంట్లో కుమ్మరించింది. తన కూతురి మీద నోట్ల వర్షం కురిపిస్తూ డ్యాన్సులు చేసింది. ఇంకేముంది ఆ వీడియో ఎవరి కంట పడకూడదో వారికంట పడింది. డబ్బును మాయం చేసేందుకు దొంగలు ముహూర్తం పెట్టారు.భార్యాభర్తలు ఇంట్లో లేనిసమయంలో వచ్చి మొత్తం దోచుకుని వెళ్లారు.

హెచ్‌-1బీ వీసాలపై కొత్త రూల్‌.. కలిసిపోయిన 22 అమెరికా రాష్ట్రాలు!InternationalSwechaa26 Sep 2026, 09:56 AM

హెచ్‌-1బీ వీసాలపై కొత్త రూల్‌.. కలిసిపోయిన 22 అమెరికా రాష్ట్రాలు!

 అమెరికాలో హెచ్‌-1బీ(H-1B) వీసా పిటిషన్లపై ఏకంగా 103,265డాలర్ల (సుమారు రూ. 95 లక్షలు) భారీ ఫీజు విధించాలని ట్రంప్ యాజమాన్యం చేసిన నూతన ముసాయిదా ప్రతిపాదనపై యూఎస్ రాజకీయంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాలిఫోర్నియా, న్యూయార్క్, న్యూజెర్సీ, టెక్సాస్ సహా మొత్తం 22 అమెరికా రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఏకమయ్యారు. ఈ ప్రతిపాదన అత్యంత హానికరం, చట్టవిరుద్ధం అని పేర్కొంటూ యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS)కు వారు సంయుక్తంగా అధికారిక నిరసన లేఖను పంపించారు.

SajjanarIPS: సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. ట్రాఫిక్ ఆంక్షలు పొడిగింపు!తెలంగాణSwechaa26 Sep 2026, 09:18 AM

SajjanarIPS: సీపీ సజ్జనార్ కీలక ప్రకటన.. ట్రాఫిక్ ఆంక్షలు పొడిగింపు!

హైదరాబాద్‌లో గణేశ్ శోభాయాత్రలు, నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది భక్తులు ఉత్సవాల్లో పాల్గొనడంతో నగరం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్(CP) వీసీ సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. నగరంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర నిన్నటి(శుక్రవారం) నుంచి అత్యంత ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతోందని సీపీ తెలిపారు. ఉత్సవాలు సజావుగా సాగేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరిస్తున్న నగర ప్రజలందరికీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Asiangames: చైనా యువకుడి సంచలనం.. ఏకంగా 7స్వర్ణాలు కైవసం!క్రీడలుSwechaa26 Sep 2026, 09:04 AM

Asiangames: చైనా యువకుడి సంచలనం.. ఏకంగా 7స్వర్ణాలు కైవసం!

 టోక్యోలోని ఆక్వాటిక్స్ సెంటర్‌లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో చైనాకు చెందిన 19ఏళ్ల యువ ఈతగాడు జాంగ్ జన్షువో అద్భుత ప్రదర్శనతో సంచలనం సృష్టించాడు. తాను అరంగేట్రం చేసిన తొలి ఏషియన్ గేమ్స్‌లోనే ఏకంగా 7 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో చరిత్ర పుటలకెక్కాడు. పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన అనంతరం, అతను ఆసియా క్రీడల రికార్డు సమయంతో రేసును ముగించి, తన రెండు చేతుల వేళ్లతో 'ఏడు' సంఖ్యను సూచిస్తూ వేడుకలు చేసుకున్నాడు.

Telangana: టీఎస్ ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా.. బరిలో 6 ప్రధాన సంఘాలు!తెలంగాణSwechaa26 Sep 2026, 08:56 AM

Telangana: టీఎస్ ఆర్టీసీలో మోగిన ఎన్నికల నగారా.. బరిలో 6 ప్రధాన సంఘాలు!

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లో కార్మిక సంఘాల ఎన్నికల కోలాహలం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2016లో గుర్తింపు సంఘాలు ఎన్నికలు జరిగాయి. తర్వాత సమీకరణాలు మారడంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తింపు సంఘాలను రద్దుచేసి ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆర్టీసీలో కార్మికుల గుర్తింపు సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరటంతో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో మళ్లీ గుర్తింపు సంఘాల ఎన్నికల హడావుడి మొదలైంది.

Google: అంతరిక్షంలో  ఏఐ డేటా సెంటర్లు.. గూగుల్‌ సంచలన ప్రయోగం!!..InternationalSwechaa26 Sep 2026, 08:28 AM

Google: అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లు.. గూగుల్‌ సంచలన ప్రయోగం!!..

టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాను చేపట్టిన ప్రాజెక్ట్‌ సన్‌ క్యాచర్‌ కింద అత్యధిక ఇంధన సమర్థత, పనితనం కలిగిన కృత్రిమ మేధ (ఏఐ) యాక్సిలరేటర్‌ చిప్‌ అయిన ట్రిల్లియం టెన్సర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (టీపీయూ)ను త్వరలో పరీక్షించనుంది. రేడియేధార్మికత, వేడి, కనెక్టివిటీ వంటి సవాళ్లను అధిగమించి సౌర విద్యుత్‌ ఆధారిత కృత్రిమ మేధ కంప్యూటింగ్‌ సదుపాయాలు అంతరిక్షంలో మనుగడ సాగించగలవా అన్నది పరీక్షిస్తున్నారు. ఈ ఏర్పాటు ద్వారా ఏఐని అంతరిక్షంలోకి తీసుకెళ్లేందుకు గూగుల్‌ సన్నాహాలు చేస్తోంది. ఖగోళంలో కృత్రిమ మేధ డేటా సెంటర్లను ఏర్పాటు చేసి సౌరవిద్యుత్‌ ఆధారంగా నడిచే ఉపగ్రహాల సాయంతో భారీ స్థాయిలో డేటాను ప్రాసెస్‌ చేసేందుకు సిద్ధమవుతోంది.

Health: అరికాళ్లలో మంటలు ఎందుకు వస్తాయి?..HealthSwechaa26 Sep 2026, 07:57 AM

Health: అరికాళ్లలో మంటలు ఎందుకు వస్తాయి?..

అరికాళ్లు వేడిగా ఉన్నట్టుగా, మంటగా, సూదులతో గుచ్చినట్టుగా లేదా చీమలు పాకుతున్నట్టుగా అనిపించడం చాలామందిలో కనిపించే సమస్య. ముఖ్యంగా రాత్రి పడుకున్నప్పుడు ఈ మంట మరింత ఎక్కువై నిద్రకు కూడా ఇబ్బంది కలిగించవచ్చు. అయితే అరికాళ్లలో తరచూ మంట రావడం శరీరంలో జరుగుతున్న కొన్ని మార్పులకు సంకేతంగా ఉండొచ్చు.

అరికాళ్లలో మంటకు ప్రధాన కారణాల్లో ఒకటి పెరిఫెరల్ న్యూరోపతి, అంటే శరీరంలోని అంచు నరాలు దెబ్బతినడం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువకాలం నియంత్రణలో లేకపోతే పాదాలు, కాళ్లలోని నరాలు దెబ్బతిని మంట, తిమ్మిరి, నొప్పి లేదా స్పర్శ తగ్గడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.అరికాళ్లలో మంట కొన్ని వారాలుగా కొనసాగుతున్నా, తీవ్రత పెరుగుతున్నా, కాళ్లపైకి మంట వ్యాపిస్తున్నా లేదా పాదాల్లో స్పర్శ తగ్గుతున్నా వైద్యుడిని సంప్రదించడం మంచిది

Spirituality: తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయా?..SpiritualitySwechaa26 Sep 2026, 07:45 AM

Spirituality: తెల్లవారు జామున వచ్చే కలలు నిజం అవుతాయా?..

తెల్లవారుజామున కనిపించే కలలకు మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా సూర్యోదయానికి ముందు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు. ఈ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండటంతో పాటు, బాహ్య ప్రపంచంతో సంబంధం కొంత తగ్గి అంతర్ముఖ స్థితి పెరుగుతుందని ఆధ్యాత్మిక సంప్రదాయం చెబుతుంది. అందుకే ఈ సమయంలో కనిపించే కొన్ని స్వప్నాలను సాధారణ కలల కంటే ప్రాధాన్యంగా చూసే ఆచారం ఏర్పడింది.

అయితే తెల్లవారుజామున వచ్చిన ప్రతి కల భవిష్యత్తులో తప్పకుండా నిజమవుతుందని శాస్త్రాలు చెప్పలేదు. అగ్ని పురాణంలోని స్వప్నాధ్యాయంలో రాత్రిని వివిధ భాగాలుగా విభజించి, ఏ సమయంలో స్వప్నం కనిపిస్తే దాని ఫలితం ఎప్పుడు కలుగుతుందనే విషయాన్ని వివరిస్తుంది.

Health: కిడ్నీల పనితీరు తగ్గితే శరీరంలో వచ్చే మార్పులు తెలుసా?..HealthSwechaa26 Sep 2026, 07:41 AM

Health: కిడ్నీల పనితీరు తగ్గితే శరీరంలో వచ్చే మార్పులు తెలుసా?..

కిడ్నీలు మన శరీరంలో నిశ్శబ్దంగా పనిచేసే అత్యంత కీలకమైన అవయవాలు. రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపడమే కాకుండా, శరీరంలో ద్రవాలు, లవణాల సమతుల్యతను కాపాడటంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే, కిడ్నీల పనితీరులో లోపం తలెత్తినప్పుడు శరీరం కొన్ని ముందస్తు సంకేతాలను ఇస్తుంది. ఈ లక్షణాలను పదేపదే నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో కారణాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం.

మూత్రపిండాల సమస్యలు వచ్చినప్పుడు శరీరం రకరకాల సంకేతాలను చూపిస్తుంది. అయితే కిడ్నీ స్టోన్స్, ఇన్ఫెక్షన్లు, మూత్రనాళంలో అడ్డంకులు, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వంటి వేర్వేరు పరిస్థితుల్లో వేర్వేరు లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా నడుము కింది భాగంలో, పక్కటెముకల కింద ఇరువైపులా నొప్పి రావడం కిడ్నీ సమస్యలకు ప్రధాన సంకేతం.

Spirituality: దేవాలయాల్లో మంత్రశక్తి ఉంటుందా?..SpiritualitySwechaa26 Sep 2026, 07:34 AM

Spirituality: దేవాలయాల్లో మంత్రశక్తి ఉంటుందా?..

దేవాలయాన్ని భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో దైవచైతన్యాన్ని అనుభవించే పవిత్ర క్షేత్రంగా భావిస్తారు. ముఖ్యంగా మూలవిరాట్టు ప్రతిష్ఠించిన గర్భాలయానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఆగమ, తంత్ర సంప్రదాయాల ప్రకారం.. దేవతా విగ్రహ ప్రతిష్ఠలో మంత్రాలు, యంత్రాలు, ప్రాణప్రతిష్ఠా విధానాలకు ప్రత్యేక స్థానం ఉంది. మూలవిరాట్టు పాదపీఠం లేదా పీఠభాగంలో యంత్ర ప్రతిష్ఠ చేయడం కూడా కొన్ని సంప్రదాయాల్లో కనిపిస్తుంది. నిత్యపూజలు, మంత్రోచ్చారణలు, అభిషేకాలు, ధూపదీప నైవేద్యాలతో ఆ దేవతా సన్నిధిని నిరంతరం పవిత్రంగా కొనసాగిస్తారు. .

Spirituality: మాంసాహారం తింటే తామస గుణాలు పెరుగుతాయా?..SpiritualitySwechaa26 Sep 2026, 07:27 AM

Spirituality: మాంసాహారం తింటే తామస గుణాలు పెరుగుతాయా?..

మనిషి ఏది తింటాడో అది కేవలం శరీరాన్ని మాత్రమే పోషించదు.. అతని మనస్సు స్వభావాన్ని కూడా ప్రభావితం చేస్తుందని భారతీయ వేదాంత సంప్రదాయం భావిస్తుంది. అందుకే ఆహారాన్ని కేవలం రుచి కోసం కాకుండా.. అది మనలో ఎలాంటి భావాలను, ఎలాంటి ఆలోచనలను పెంపొందిస్తుందనే దృష్టితో చూడాలని శాస్త్రాలు సూచిస్తాయి.

సనాతన ధర్మంలో ప్రకృతి మూడు గుణాలుగా వ్యక్తమవుతుందని భగవద్గీత వివరిస్తుంది. అవే సత్త్వం, రజస్సు, తమస్సు. సత్త్వం అంటే జ్ఞానం, ప్రశాంతత, పవిత్రత, వివేకం వైపు నడిపించే స్వభావం. రజస్సు అంటే కోరిక, చంచలత్వం, ఆవేశం, కర్మఫలంపై ఆసక్తి. తమస్సు అంటే అజ్ఞానం, మోహం, అలసత్వం, నిర్లక్ష్యం, వివేకాన్ని కప్పివేసే స్వభావం. ఈ మూడు గుణాలు మనిషి ఆహారంలోనూ ప్రతిబింబిస్తాయని భగవద్గీత పదిహేడో అధ్యాయం చెబుతుంది.

Khairatabad by-election: ఖైరతాబాద్‌లో హస్తం హ్యాట్రిక్ కొడుతుందా?..తెలంగాణSwechaa26 Sep 2026, 07:21 AM

Khairatabad by-election: ఖైరతాబాద్‌లో హస్తం హ్యాట్రిక్ కొడుతుందా?..

తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఉపఎన్నిక హాట్ టాపిక్ లా మారింది. దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో ఖైరతాబాద్ సీటు ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో మూడో ఉపఎన్నికకు తెరలేవడమే కాకుండా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఇది జీవన్మరణ సమస్యగా మారింది.

గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఖైరతాబాద్‌లోనూ అదే ఫలితాన్ని సాధిస్తే వరుసగా మూడో ఉపఎన్నికలో గెలిచి హ్యాట్రిక్ కొడుతుంది.