స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

వానలు అయిపోయాయి.. తెలంగాణ ఇక భగభగలేతెలంగాణSwechaa25 Sep 2026, 09:12 PM

వానలు అయిపోయాయి.. తెలంగాణ ఇక భగభగలే

Hot Summer: తెలంగాణలో జోరు వానలు కురిశాయి. పలు జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. కుండపోత వానలతో వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఉక్కపోతతో విలవిలలాడిన ప్రజలు వాతావరణం చల్లబడి కాస్త రిలీఫ్ పొందారు. హమ్మయ్య అని ఊపిరిపీల్చుకున్నారు. అయితే, రాష్ట్రంలో వాతావరణం మారిపోనుంది. మళ్లీ ఎండలు మండిపోనున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. ఈ మేరకు తెలంగాణ వెదర్‌మ్యాన్ ఇచ్చిన సమాచారం ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

రాష్ట్రంలో తీవ్ర వాయుగుండం ప్రభావం పూర్తిగా ముగిసిందని తెలంగాణ వెదర్‌మ్యాన్ తెలిపారు. ఈ సీజన్‌కు సంబంధించి నైరుతి రుతుపవనాల ప్రధాన వర్షాలు దాదాపుగా ముగిసినట్లేనని స్పష్టం చేశారు. శనివారం (సెప్టెంబర్ 26) నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు గణనీయంగా తగ్గిపోయి, పొడి వాతావరణంతో పాటు తీవ్రమైన ఉక్కపోత మొదలవుతుందని వెల్లడించారు. అక్కడక్కడ చెదురుమదురు జల్లులు మినహా చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుందని అంచనా వేశారు.

హ్యామ్ రహదారుల నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్తెలంగాణSwechaa25 Sep 2026, 08:08 PM

హ్యామ్ రహదారుల నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్

HAM Roads: తెలంగాణలో హ్యామ్ (హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌) రహదారుల నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. కాంట్రాక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 25 నుంచి రాష్ట్రవ్యాప్తంగా హ్యామ్ రహదారుల పనులు ప్రారంభించాలని చెప్పారు. గ్రామీణ తెలంగాణకు శాశ్వత మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. హ్యామ్ విధానంలో 18,472 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు అభివృద్ధి చేస్తామన్నారు. తొలి విడతలో 7,448 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి చేస్తామని, ఇందుకోసం 6 వేల కోట్లకు పైగా వ్యయం అవుతుందని మంత్రి సీతక్క వెల్లడించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 1,366 కిలోమీటర్ల మేర 445 రహదారులను అభివృద్ధి చేయనున్నారు.

మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్తెలంగాణSwechaa25 Sep 2026, 07:16 PM

మన్మోహన్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్

Cm Revanth: మాజీ ప్రధాని, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది. గచ్చిబౌలిలోని ఐటీ కారిడార్ లో విప్రో సర్కిల్ వద్ద మన్మోహన్ సింగ్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి శనివారం ఆవిష్కరించనున్నారు.

స్మారక చిహ్నం కాదు.. శాశ్వత ప్రతీక

విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా పరిశీలించారు. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ విగ్రహం కేవలం ఒక స్మారక చిహ్నం కాదన్నారు. దేశ నిర్మాణంలో మన్మోహన్ సింగ్ పోషించిన పాత్ర, ఆయన ఆర్థిక దార్శనికత, నిస్వార్థమైన ప్రజాసేవ, నిరాడంబర నాయకత్వ లక్షణాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే శాశ్వత ప్రతీక అని మంత్రి పొన్నం తెలిపారు.

బీజేపీ కుట్రపూరితంగా జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించిందిNationalSwechaa25 Sep 2026, 06:30 PM

బీజేపీ కుట్రపూరితంగా జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించింది

CEC Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెంటనే ఆయనను పదవి నుంచి తొలగించాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కుట్రపూరితంగా జ్ఞానేశ్ కుమార్‌ను సీఈసీగా నియమించిందని చామల కిరణ్ ఆరోపించారు. తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయనను ఆ పదవిలో కూర్చోబెట్టిందన్నారు.

గోదావరి జలాలను లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపండితెలంగాణSwechaa25 Sep 2026, 05:15 PM

గోదావరి జలాలను లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపండి

Harish Rao: గోదావరి జలాలపై మాజీ మంత్రి హరీశ్ రావు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. గోదావరిలో వరద పోతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రిజర్వాయర్లు అడుగంటిపోతున్నాయని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల మీద రాజకీయాలు చేస్తూ రైతుల పంటలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎండగొడుతోందని మండిపడ్డారు. గోదావరి జలాలను తక్షణమే లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాలంటూ మంత్రి ఉత్తమ్ కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు హరీశ్ రావు. ఎల్లంపల్లి వద్ద భారీ వరద ఉన్నా మోటార్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోయకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని హరీశ్ రావు మండిపడ్డారు.

Telangana: సీఎం రేవంత్‌ రెడ్డికి బెస్ట్ పబ్లిక్ సర్వెంట్–2026 అవార్డు!!తెలంగాణSwechaa25 Sep 2026, 03:58 PM

Telangana: సీఎం రేవంత్‌ రెడ్డికి బెస్ట్ పబ్లిక్ సర్వెంట్–2026 అవార్డు!!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మకమైన అరుదైన గౌరవం దక్కింది. కేరళకు చెందిన దిగ్గజ కాంగ్రెస్‌ నేత, దివంగత ఆర్యదాన్‌ ముహమ్మద్‌ స్మారకార్థం అందించే "బెస్ట్‌ పబ్లిక్‌ సర్వెంట్‌–2026" అవార్డుకు సీఎం రేవంత్‌రెడ్డి ఎంపికయ్యారు. ఆర్యదాన్‌ ముహమ్మద్‌ ఫౌండేషన్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తోంది. రాష్ట్రంలోని రైతులు, వెనుకబడిన వర్గాలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, రేవంత్‌రెడ్డి దూరదృష్టితో కూడిన నాయకత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఫౌండేషన్‌ వర్కింగ్‌ ఛైర్మన్‌, నిలంబూర్‌ ఎమ్మెల్యే ఆర్యదాన్‌ షౌకత్‌ తెలిపారు. ప్రజాస్వామిక విలువల పట్ల ముఖ్యమంత్రికి ఉన్న నిబద్ధతను జ్యూరీ ప్రత్యేకంగా ప్రశంసించింది.

Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాస్త్రవేత్తల కీలక సూచనలు!!తెలంగాణSwechaa25 Sep 2026, 03:50 PM

Telangana: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాస్త్రవేత్తల కీలక సూచనలు!!

ఎల్‌నినో ప్రభావం తెలంగాణ వానాకాలం సాగుపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వరి సాగు విస్తీర్ణం తగ్గడంతో ఈ సీజన్‌లో ధాన్యం దిగుబడి, బియ్యం ఉత్పత్తి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఎల్‌నినో పరిస్థితులు ప్రభావం చూపుతున్న నేపథ్యంలో.. ధాన్యం, బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది.

Telangana:పెరిగిన విద్యుత్తు వినియోగం.. పాత కరెంట్ కనెక్షన్లకు కొత్త భారం !!..తెలంగాణSwechaa25 Sep 2026, 03:39 PM

Telangana:పెరిగిన విద్యుత్తు వినియోగం.. పాత కరెంట్ కనెక్షన్లకు కొత్త భారం !!..

పాత విద్యుత్తు కనెక్షన్లు ఉన్న వినియోగదారులకు క్రమబద్ధీకరణ ఛార్జీల రూపంలో కొత్త భారం పడుతోంది. ఏళ్ల క్రితం తక్కువ విద్యుత్తు లోడ్‌తో తీసుకున్న కనెక్షన్లలో.. కాలక్రమంలో ఇంట్లో ఏసీలు, గీజర్లు, ఓవెన్లు, వాషింగ్‌ మెషిన్లు, మోటార్లు వంటి విద్యుత్తు ఉపకరణాలు పెరగడంతో వినియోగం పెరిగింది. ఈ నేపథ్యంలో అనుమతించిన లోడ్‌ కంటే ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తున్నట్లు గుర్తించిన కొన్ని ఇళ్లకు డిస్కంలు క్రమబద్ధీకరణ ఛార్జీల కోసం నోటీసులు జారీ చేస్తున్నాయి.

Telangana: ధాన్యం లెక్కల్లో భారీ గోల్‌మాల్.. మాజీ మంత్రి పాత్రపై ఫోకస్!?..తెలంగాణSwechaa25 Sep 2026, 03:29 PM

Telangana: ధాన్యం లెక్కల్లో భారీ గోల్‌మాల్.. మాజీ మంత్రి పాత్రపై ఫోకస్!?..

పౌరసరఫరాల శాఖలో కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక చర్చకు దారితీస్తోంది. ఏళ్లుగా కొనసాగుతున్న సీఎంఆర్ లెక్కల్లో భారీగా తేడాలు ఎలా వచ్చాయి? ప్రభుత్వ ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత.. తిరిగి రావాల్సిన బియ్యం ఎక్కడికి వెళ్లింది? ఈ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? గత ప్రభుత్వ హయాంలోనే బయటపడిన హెచ్చరికలను ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదన్న అంశాలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

Andhra Pradesh: లోకల్‌ ఫైట్‌లో జనసేనకు కొత్త చిక్కులు.. పవన్‌ ముందున్న డబుల్‌ ఛాలెంజ్‌ ఇదే!!..ఏపీSwechaa25 Sep 2026, 03:22 PM

Andhra Pradesh: లోకల్‌ ఫైట్‌లో జనసేనకు కొత్త చిక్కులు.. పవన్‌ ముందున్న డబుల్‌ ఛాలెంజ్‌ ఇదే!!..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కూటమి ప్రయాణం ఇప్పుడు మరో కీలక దశలోకి వెళ్తోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ–జనసేన–బీజేపీ కలిసి సాధించిన ఫలితాల తర్వాత.. అదే సమీకరణ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పనిచేస్తుందన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ముఖ్యంగా జనసేనకు పన్నెండేళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత పార్టీ క్షేత్రస్థాయిలో తనకు ఉన్న బలాన్ని రాజకీయ సీట్లుగా మార్చుకోగలదా? అనేది సవాల్ గా మారింది..

2014లో జనసేన ఆవిర్భవించినప్పుడు పార్టీకి బలమైన సంస్థాగత నిర్మాణం కంటే పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత ప్రభావం, అభిమానుల మద్దతు ప్రధాన బలంగా ఉండేది. ఆ తర్వాతి కాలంలో, 2019 ఎన్నికలలో వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి తీవ్రమైన కష్టకాలంగా మారింది. ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయి, జనసేన చరిత్రలోనే అది ఒక క్లిష్టమైన పరీక్షా సమయంగా నిలిచింది.

వివేకా హత్య కేసు..  రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన సునీల్ యాదవ్!క్రైమ్Swechaa25 Sep 2026, 03:20 PM

వివేకా హత్య కేసు..  రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన సునీల్ యాదవ్!

 మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ దర్యాప్తును తీవ్రతరం చేసింది. ఈ కేసులో భారీ ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు చోటుచేసుకున్నాయన్న కోణంలో విచారణ జరుపుతున్న అధికారులు, రెండో నిందితుడైన (A2) సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని తమ ప్రాంతీయ కార్యాలయంలో వరుసగా రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు.  హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, రూటింగ్‌పై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు.

Health: బెండకాయలతో  ఎన్ని ప్రయోజనాలో తెలుసా?..HealthSwechaa25 Sep 2026, 03:18 PM

Health: బెండకాయలతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?..

మన వంటింట్లో తరచుగా కనిపించే బెండకాయ కేవలం రుచికోసం మాత్రమే కాదు.. శరీరానికి అవసరమైన పలు పోషకాలను అందించే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. ముఖ్యంగా బెండకాయలో పీచు, విటమిన్‌ సి, విటమిన్‌ కె, ఫోలేట్‌ వంటి పోషకాలు, అలాగే యాంటీఆక్సిడెంట్‌ సమ్మేళనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా బెండకాయలో ఉండే పీచు జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడటంతో పాటు.. ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అందువల్ల సమతుల్య ఆహారంలో బెండకాయను చేర్చుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

Health.. అరటిపండుతో తక్షణ శక్తి.. కానీ వీరు మాత్రం కాస్త జాగ్రత్త!..HealthSwechaa25 Sep 2026, 03:13 PM

Health.. అరటిపండుతో తక్షణ శక్తి.. కానీ వీరు మాత్రం కాస్త జాగ్రత్త!..

అరటిపండు ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం మాత్రమే కాదు.. మన చేతిలో ఉండే న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ కూడా.. అందుకే రోజు ఒక్క అరటిపండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జీర్ణక్రియను సజావుగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

Spirituality: పూజ గదిలో దేవుడి విగ్రహాలను ఎలా అమర్చుకోవాలి?..SpiritualitySwechaa25 Sep 2026, 03:10 PM

Spirituality: పూజ గదిలో దేవుడి విగ్రహాలను ఎలా అమర్చుకోవాలి?..

ఇంట్లో పూజా గదిని మనసు భగవంతునిపై నిలిపే పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అందుకే సనాతన సంప్రదాయంలో పూజా స్థలాన్ని ఏర్పాటు చేయడానికీ, విగ్రహాలను అమర్చడానికీ ప్రత్యేకమైన ఆచారాలు ఏర్పడ్డాయి. ఇక వాస్తు సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజా స్థలానికి ఈశాన్య దిశను పవిత్రమైన స్థానంగా భావిస్తారు. ఈశాన్యం సాధ్యం కానప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశాన్ని పూజ కోసం ఉపయోగించుకోవచ్చని చెప్పడం సంప్రదాయాల్లో కనిపిస్తుంది.

Spirituality: రుద్రాక్షలు ధరించడం వల్ల ఏం జరుగుతుంది!..SpiritualitySwechaa25 Sep 2026, 03:02 PM

Spirituality: రుద్రాక్షలు ధరించడం వల్ల ఏం జరుగుతుంది!..

రుద్రాక్షలు ధరించడం వల్ల ఏం జరుగుతుంది.. అనే విషయానికి సనాతన ధర్మంలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. రుద్రాక్ష అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా శైవ సంప్రదాయంలో భావించే పవిత్ర మాల అని పండితులు చెబుతారు.

రుద్ర అంటే పరమశివుడు.. అక్ష అంటే కన్ను లేదా కన్నీటి బిందువు అనే అర్థాలు ఉన్నాయి. పురాణల విశ్వాసం ప్రకారం, లోకక్షేమం కోసం పరమశివుడు ధ్యానంలో లీనమైనప్పుడు ఆయన నేత్రాల నుంచి జారిన కన్నీటి బిందువుల నుంచి రుద్రాక్ష వృక్షాలు ఉద్భవించాయని చెబుతారు. అందుకే రుద్రాక్షను శివుని అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు.

ఇక రుద్రాక్షను మెడలో ధరించడం, చేతికి కట్టుకోవడం లేదా జపమాలగా ఉపయోగించడం అనేది భక్తుడిని శివస్మరణలో నిలిపే సాధనగా పరిగణిస్తారు. ముఖ్యంగా రుద్రాక్ష మాలతో ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపించడం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసుకునే ఆధ్యాత్మిక అభ్యాసం కొనసాగుతుందని పేర్కొంటారు. మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రుద్రాక్షలు ప్రధానంగా 14 రకాలుగా లభిస్తాయి.

మళ్లీ రావయ్యా.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి..తెలంగాణSwechaa25 Sep 2026, 03:01 PM

మళ్లీ రావయ్యా.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి..

రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఎంతో వైభవంగా,భక్తుల కోలాహలం నడుమ కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా, హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా వినాయక నిమజ్జన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు నగరవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన ప్రసిద్ధ ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ట్యాంక్ బండ్‌‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నెం.5 వద్ద ప్రశాంతంగా ముగిసింది. భక్తుల జయధ్వానాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ మహాగణపతికి అశేష భక్తజనం భావోద్వేగంతో.. ‘మళ్లీ రావయ్య గణపయ్యా’ అంటూ బడా గణేశ్‌కు వీడ్కోలు పలికారు.

అఘోరీ మంత్రం.. డబ్బుల కట్ట ఇచ్చేసిన వ్యాపారి.. చివర్లో ట్విస్ట్!వైరల్ న్యూస్Swechaa25 Sep 2026, 02:35 PM

అఘోరీ మంత్రం.. డబ్బుల కట్ట ఇచ్చేసిన వ్యాపారి.. చివర్లో ట్విస్ట్!

దేశంలో దొంగ బాబాలు, అఘోరీల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రాల పేరిట అమాయకులను మోసం చేయడం వారికి అలవాటుగా మారింది. పూజలు చేస్తే లాభాలు బాగా వస్తాయని ఎదుటి వ్యక్తులను నమ్మించి మోసం చేయడంతో పాటు అందినకాడికి దోచుకుని డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. గుర్తుతెలియని మోసగాడు అఘోరీ వేషంలో ఓ బంగారు షాపులోకి వచ్చాడు.హర్ హర్ మహదేవ్ అనుకుంటూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు అక్కడే ఉన్న యజమానికి మాయమాటలు చెప్పాడు. మీ భవిష్యత్ చెప్తానంటూ జ్యువెలరీ షాప్‌ ఓనర్‌ను నమ్మించేందుకు అఘోరీ యత్నించాడు. పెట్టుబడుల్లో లాభాలు వచ్చేలా చేస్తానని, ఓ నోట్ల కట్ట అడిగి తీసుకున్నాడు. అక్కడి నుంచి మెల్లిగా ఉడాయించాడు.

ఆర్టీసీ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..తెలంగాణSwechaa25 Sep 2026, 02:14 PM

ఆర్టీసీ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో 'తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్' (TWU - రిజిస్ట్రేషన్ నంబర్ : 4-4522)కు అధికార కాంగ్రెస్ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్టు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు సమాచారం అందించారు. టీడబ్ల్యూయూ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల (DCC), సిటీ (CCC) కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్ అనుబంధ టీడబ్ల్యూయూ యూనియన్‌కు సంపూర్ణ సహకారాన్ని, సమన్వయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.ఇతర ఏ యూనియన్లను ప్రోత్సహించవద్దని స్పష్టంచేశారు.

అర్ధరాత్రి గురుకులంలో  కలకలం.. ఆస్పత్రిలో 14 మంది విద్యార్థినులుతెలంగాణSwechaa25 Sep 2026, 02:01 PM

అర్ధరాత్రి గురుకులంలో కలకలం.. ఆస్పత్రిలో 14 మంది విద్యార్థినులు

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల్లో రిపీట్ అవ్వగా.. తాజాగా మరో సమస్య వారిని వెంటాడుతోంది. అపరిశుభ్రత, నీటి సమస్యలకు తోడు కొత్తగా ఎలుకల భయం విద్యార్థినులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నట్టు తెలిసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు విద్యార్థినులను కరిచాయి.అర్ధరాత్రి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో 14 మందిని ఎలుకలు కరిచినట్లు సమాచారం. విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కరవడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.రాత్రంతా విద్యార్థినులు ఏడుస్తూ కూర్చున్నట్టు సమాచారం.

బాలాపూర్ లడ్డును మించి.. వేలంలో రూ.1.01కోట్లు పలికిన గణేశ్ లడ్డు!తెలంగాణSwechaa25 Sep 2026, 01:39 PM

బాలాపూర్ లడ్డును మించి.. వేలంలో రూ.1.01కోట్లు పలికిన గణేశ్ లడ్డు!

 హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ పరిధిలో ఉన్న ప్రముఖ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో వినాయక చవితి వేడుకల సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం నగరంలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 5 కిలోల పవిత్రమైన గణేష్ లడ్డూ ప్రసాదం వేలంలో ఊహించని రీతిలో భారీ ధరను పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్థానిక నివాసితులు ఎంతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో, భక్తిప్రపత్తులతో ఈ వేలం పాట పోటీలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డారు.  ఈ పోటీలో విల్లాస్‌కు చెందిన కొందరు నివాసితులు ప్రత్యేక బృందంగా (సిండికేట్) ఏర్పడి, ఉమ్మడిగా రూ.1.01కోట్ల భారీ మొత్తాన్ని వేలం పాడి ఈ పవిత్ర లడ్డూను సొంతం చేసుకున్నారు.

శోభాయాత్రలో పోలీసులు.. పీఎస్‌‌‌లో రెండు కుటుంబాల ఫైటింగ్తెలంగాణSwechaa25 Sep 2026, 01:15 PM

శోభాయాత్రలో పోలీసులు.. పీఎస్‌‌‌లో రెండు కుటుంబాల ఫైటింగ్

రాష్ట్రంలో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతుండగా పోలీసులు విధుల్లో నిమగ్నం అయ్యారు.ట్రాఫిక్ క్లియరెన్స్, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లో నానా రభస చేశాయి. స్టేషన్ ప్రాంగణంలో ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డాయి. దీనికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ గొడవకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకివెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం కాస్త తొలుత మాటల యుద్ధం, ఆపై పరస్పర దాడులకు దారితీసింది.ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇరువర్గాలు పీఎస్‌లోకి దూసుకెళ్లాయి.

Viral: ఉద్యోగులందరికీ ఐఫోన్.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బాస్!వైరల్ న్యూస్Swechaa25 Sep 2026, 01:09 PM

Viral: ఉద్యోగులందరికీ ఐఫోన్.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బాస్!

 యూఏఈ (UAE) కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మానవ వనరుల సంస్థ ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ తమ సిబ్బంది పట్ల చూపిన ఉదారత ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష ప్రశంసలు అందుకుంటోంది. కంపెనీ పురోగతికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులందరినీ ఆశ్చర్యపరుస్తూ యాజమాన్యం సరికొత్త మోడల్ ఐఫోన్లను (iPhones) బహుమతిగా ప్రదానం చేసింది. అయితే ఈ ఖరీదైన గిఫ్ట్‌లను అందించిన విధానం అత్యంత ఆసక్తికరంగా మారడంతో, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

జగిత్యాలలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడుతెలంగాణSwechaa25 Sep 2026, 12:42 PM

జగిత్యాలలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అయితే, కొన్ని చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. నెంబర్ల వారీగా జిల్లాల్లో గణపయ్యలు నిమజ్జనం కోసం బారులు తీరాయి. అయితే, యువత నిమజ్జన వేడుకల్లో ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఊరూరా డీజే సౌండ్స్, బ్యాండ్స్ సప్పుళ్లు మోత మోగుతున్నాయి.ఈ క్రమంలోనే డీజే సౌండ్స్ ధాటికి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డ్యాన్స్ చేస్తున్న క్రమంలోనే గుండెపోటు వచ్చినట్టు సమాచారం. తోటి వారు అతనికి కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

‘నువ్వెప్పుడూ నా బేబీ బ్రదర్‌వే’.. సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్!వైరల్ న్యూస్Swechaa25 Sep 2026, 12:35 PM

‘నువ్వెప్పుడూ నా బేబీ బ్రదర్‌వే’.. సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్!

 క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ సెప్టెంబర్ 25న తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోదరి సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి అత్యంత భావోద్వేగభరితమైన శుభాకాంక్షలు తెలియజేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియో మాంటేజ్ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్ననాటి తీపి జ్ఞాపకాల నుంచి నేటి వరకు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోకు సారా స్వయంగా తన వాయిస్‌ ఓవర్ ఇచ్చారు.

శోభాయాత్రలో విషాదం.. వాహనం కింద పడి యువకుడి దుర్మరణంతెలంగాణSwechaa25 Sep 2026, 12:23 PM

శోభాయాత్రలో విషాదం.. వాహనం కింద పడి యువకుడి దుర్మరణం

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేశుల శోభాయాత్రలో భాగంగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు వాహనం కింద పడి మరణించాడు. గంగమ్మ ఒడికి చేరేందుకు వినాయకులు వడివడిగా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్న క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు సెక్రెటేరియట్ ముందు నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర సాగుతోంది. అయితే, మహాగణపతి శోభాయాత్రను వీక్షించేందుకు లక్షలాది భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే సచివాలయం, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా రద్దీ నెలకొంది.అయితే, ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేసే క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయగా.. ఓ యువకుడు నిమజ్జనకోసం తరలుతున్న వాహనంపైకి ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి కిందపడగా వాహనం మీద నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1167 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ పోలీసులు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు.. ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లుతెలంగాణSwechaa25 Sep 2026, 11:41 AM

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు.. ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లు

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది.సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలంటూ గురువారం పంపిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లను మోసం చేసిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్టు ఆరోపణల రావడంతో దీనిపై ఈడీ విచారణ చేస్తున్నది. లావాదేవీల స్వభావం, ఉద్దేశంపై దర్యాప్తు చేపట్టింది.నిధుల వినియోగానికి సరైన వ్యాపార కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తునట్టు తెలిసింది. మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఆస్తులపైనా ఈడీ దృష్టి సారించింది.

balapur-laddu: బాలాపూర్ లడ్డూకు వేలంలో భారీ ధర.. పాత రికార్డులన్నీ బద్దలు!తెలంగాణSwechaa25 Sep 2026, 11:40 AM

balapur-laddu: బాలాపూర్ లడ్డూకు వేలంలో భారీ ధర.. పాత రికార్డులన్నీ బద్దలు!

భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈసారి సరికొత్త రికార్డులను సృష్టించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ వేలంలో 'అర్బన్ రియాలిటీ గ్రూప్'కు చెందిన 35 ఏళ్ల వ్యాపారవేత్త సామా ప్రణీత్ రెడ్డి అత్యధికంగా రూ.39లక్షలు పలికి స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం ప్రస్థానం ఏటేటా పెరుగుతూ నేడు రూ.39లక్షలకు చేరుకోవడం విశేషం. పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ ఈ ఏడాది అత్యంత భారీ ధరకు లడ్డూ వేలం సాగడంతో బాలాపూర్ ప్రాంగణమంతా భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనించింది. గతేడాది జరిగిన వేలంలో కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దాశరథ్ గౌడ్ రూ.35లక్షలకు లడ్డూను దక్కించుకోగా, ఈసారి ఆ రికార్డు సైతం బద్దలైంది.

గణేశ్ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్.. బాలుడు మృతితెలంగాణSwechaa25 Sep 2026, 11:22 AM

గణేశ్ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్.. బాలుడు మృతి

రాష్ట్రవ్యాప్తంగా గణనాథుల నిమజ్జనాలు, శోభాయాత్రాలు ఘనంగా కొనసాగుతున్నాయి.యువతీయువకులు, పెద్దలు శోభాయాత్రలో స్టెప్పులు వేస్తూ ‘వెళ్లిరావయ్యా..గణేశా’ అంటూ గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు.ఎక్కడ చూసినా డీజే సౌండ్స్, డప్పుచప్పుళ్ల నడమ గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు వెళ్తున్నారు. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో శోభాయాత్రల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ గణనాథుడి శోభాయాత్రలో చిక్కుకోవడంతో సకాలంలో వైద్యం అందక రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్‌లో చోటుచేసుకుంది.

ఆన్‌లైన్ డిస్కౌంట్ల మాయాజాలానికి చెక్.. ఈ-కామర్స్ సైట్లకు కొత్త రూల్స్!వ్యాపారంSwechaa25 Sep 2026, 11:18 AM

ఆన్‌లైన్ డిస్కౌంట్ల మాయాజాలానికి చెక్.. ఈ-కామర్స్ సైట్లకు కొత్త రూల్స్!

దేశంలో నానాటికీ పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) సవరణ నిబంధనలు- 2026’ ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. పండుగల వేళ భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్ల పేరిట నకిలీ తగ్గింపులతో కస్టమర్లను బురిడీ కొట్టించే ఈ-కామర్స్ సంస్థల మాయాజాలానికి చెక్ పెట్టడమే కాకుండా, డిజిటల్ మార్కెట్‌ను మరింత పారదర్శకంగా మార్చడమే ఈ కొత్త విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.

అభివృద్ధి జరగాలి..దేశానికి దూరంగా కాదు : ప్రధాని మోడీNationalSwechaa25 Sep 2026, 11:04 AM

అభివృద్ధి జరగాలి..దేశానికి దూరంగా కాదు : ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పండిట్ ‘దీన్‌దయాళ్’ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశానికి స్వదేశీ భావజాలంతో కూడిన దృక్పథాన్ని అందించిన మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అని పేర్కొన్నారు. దీన్‌దయాళ్ 'చరైవేతి, చరైవేతి' (నిరంతరం ముందుకు సాగండి) అనే అభివృద్ధి మంత్రాన్ని బోధించడమే కాకుండా, తన జీవితాంతం ఆచరించి చూపించారని కొనియాడారు. ఆయన నిరంతర సాధకుడని ప్రశంసించారు. భారతదేశాన్ని పాశ్చాత్య లేదా విదేశీ దృక్పథంతో కాకుండా, స్వదేశీ మూలాలతో అర్థం చేసుకుని భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారని.. అందుకే ఆయన అరుదైన నాయకుడు అని గుర్తుచేశారు.