స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Health.. అరటిపండుతో తక్షణ శక్తి.. కానీ వీరు మాత్రం కాస్త జాగ్రత్త!..HealthSwechaa25 Sep 2026, 03:13 PM

Health.. అరటిపండుతో తక్షణ శక్తి.. కానీ వీరు మాత్రం కాస్త జాగ్రత్త!..

అరటిపండు ప్రకృతి మనకిచ్చిన అద్భుతమైన వరం మాత్రమే కాదు.. మన చేతిలో ఉండే న్యాచురల్ ఎనర్జీ బూస్టర్ కూడా.. అందుకే రోజు ఒక్క అరటిపండు తింటే చాలు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో ఉండే పొటాషియం, ఫైబర్, విటమిన్ B6 గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జీర్ణక్రియను సజావుగా ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.

Spirituality: పూజ గదిలో దేవుడి విగ్రహాలను ఎలా అమర్చుకోవాలి?..SpiritualitySwechaa25 Sep 2026, 03:10 PM

Spirituality: పూజ గదిలో దేవుడి విగ్రహాలను ఎలా అమర్చుకోవాలి?..

ఇంట్లో పూజా గదిని మనసు భగవంతునిపై నిలిపే పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. అందుకే సనాతన సంప్రదాయంలో పూజా స్థలాన్ని ఏర్పాటు చేయడానికీ, విగ్రహాలను అమర్చడానికీ ప్రత్యేకమైన ఆచారాలు ఏర్పడ్డాయి. ఇక వాస్తు సంప్రదాయం ప్రకారం ఇంట్లో పూజా స్థలానికి ఈశాన్య దిశను పవిత్రమైన స్థానంగా భావిస్తారు. ఈశాన్యం సాధ్యం కానప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశలో ప్రశాంతమైన, శుభ్రమైన ప్రదేశాన్ని పూజ కోసం ఉపయోగించుకోవచ్చని చెప్పడం సంప్రదాయాల్లో కనిపిస్తుంది.

Spirituality: రుద్రాక్షలు ధరించడం వల్ల ఏం జరుగుతుంది!..SpiritualitySwechaa25 Sep 2026, 03:02 PM

Spirituality: రుద్రాక్షలు ధరించడం వల్ల ఏం జరుగుతుంది!..

రుద్రాక్షలు ధరించడం వల్ల ఏం జరుగుతుంది.. అనే విషయానికి సనాతన ధర్మంలో ఎంతో లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. రుద్రాక్ష అంటే శివునికి అత్యంత ప్రీతికరమైనదిగా శైవ సంప్రదాయంలో భావించే పవిత్ర మాల అని పండితులు చెబుతారు.

రుద్ర అంటే పరమశివుడు.. అక్ష అంటే కన్ను లేదా కన్నీటి బిందువు అనే అర్థాలు ఉన్నాయి. పురాణల విశ్వాసం ప్రకారం, లోకక్షేమం కోసం పరమశివుడు ధ్యానంలో లీనమైనప్పుడు ఆయన నేత్రాల నుంచి జారిన కన్నీటి బిందువుల నుంచి రుద్రాక్ష వృక్షాలు ఉద్భవించాయని చెబుతారు. అందుకే రుద్రాక్షను శివుని అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు.

ఇక రుద్రాక్షను మెడలో ధరించడం, చేతికి కట్టుకోవడం లేదా జపమాలగా ఉపయోగించడం అనేది భక్తుడిని శివస్మరణలో నిలిపే సాధనగా పరిగణిస్తారు. ముఖ్యంగా రుద్రాక్ష మాలతో ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపించడం ద్వారా మనస్సును ఏకాగ్రం చేసుకునే ఆధ్యాత్మిక అభ్యాసం కొనసాగుతుందని పేర్కొంటారు. మన ఆధ్యాత్మిక సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రుద్రాక్షలు ప్రధానంగా 14 రకాలుగా లభిస్తాయి.

మళ్లీ రావయ్యా.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి..తెలంగాణSwechaa25 Sep 2026, 03:01 PM

మళ్లీ రావయ్యా.. గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపతి..

రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఎంతో వైభవంగా,భక్తుల కోలాహలం నడుమ కొనసాగుతున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇదిలాఉండగా, హైదరాబాద్ మహానగరంలో అత్యంత వైభవంగా, కోలాహలంగా వినాయక నిమజ్జన మహోత్సవాలు కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు నగరవాసులు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించిన ప్రసిద్ధ ఖైరతాబాద్ శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతి నిమజ్జన ప్రక్రియ ట్యాంక్ బండ్‌‌పై ఏర్పాటు చేసిన క్రేన్ నెం.5 వద్ద ప్రశాంతంగా ముగిసింది. భక్తుల జయధ్వానాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాల నడుమ మహాగణపతికి అశేష భక్తజనం భావోద్వేగంతో.. ‘మళ్లీ రావయ్య గణపయ్యా’ అంటూ బడా గణేశ్‌కు వీడ్కోలు పలికారు.

అఘోరీ మంత్రం.. డబ్బుల కట్ట ఇచ్చేసిన వ్యాపారి.. చివర్లో ట్విస్ట్!వైరల్ న్యూస్Swechaa25 Sep 2026, 02:35 PM

అఘోరీ మంత్రం.. డబ్బుల కట్ట ఇచ్చేసిన వ్యాపారి.. చివర్లో ట్విస్ట్!

దేశంలో దొంగ బాబాలు, అఘోరీల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. మంత్రాల పేరిట అమాయకులను మోసం చేయడం వారికి అలవాటుగా మారింది. పూజలు చేస్తే లాభాలు బాగా వస్తాయని ఎదుటి వ్యక్తులను నమ్మించి మోసం చేయడంతో పాటు అందినకాడికి దోచుకుని డబ్బులతో ఉడాయిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. గుర్తుతెలియని మోసగాడు అఘోరీ వేషంలో ఓ బంగారు షాపులోకి వచ్చాడు.హర్ హర్ మహదేవ్ అనుకుంటూ ఎంట్రీ ఇవ్వడంతో పాటు అక్కడే ఉన్న యజమానికి మాయమాటలు చెప్పాడు. మీ భవిష్యత్ చెప్తానంటూ జ్యువెలరీ షాప్‌ ఓనర్‌ను నమ్మించేందుకు అఘోరీ యత్నించాడు. పెట్టుబడుల్లో లాభాలు వచ్చేలా చేస్తానని, ఓ నోట్ల కట్ట అడిగి తీసుకున్నాడు. అక్కడి నుంచి మెల్లిగా ఉడాయించాడు.

ఆర్టీసీ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..తెలంగాణSwechaa25 Sep 2026, 02:14 PM

ఆర్టీసీ ఎన్నికల వేళ టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.త్వరలోనే ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 9న జరగనున్న ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో 'తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్' (TWU - రిజిస్ట్రేషన్ నంబర్ : 4-4522)కు అధికార కాంగ్రెస్ తరపున పూర్తి మద్దతు ఇస్తున్నట్టు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులకు సమాచారం అందించారు. టీడబ్ల్యూయూ యూనియన్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల (DCC), సిటీ (CCC) కాంగ్రెస్ అధ్యక్షులకు, ఎమ్మెల్యేలకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.నేతలు తమ నియోజకవర్గాల పరిధిలోని ఆర్టీసీ డిపోలలో కాంగ్రెస్ అనుబంధ టీడబ్ల్యూయూ యూనియన్‌కు సంపూర్ణ సహకారాన్ని, సమన్వయాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.ఇతర ఏ యూనియన్లను ప్రోత్సహించవద్దని స్పష్టంచేశారు.

అర్ధరాత్రి గురుకులంలో  కలకలం.. ఆస్పత్రిలో 14 మంది విద్యార్థినులుతెలంగాణSwechaa25 Sep 2026, 02:01 PM

అర్ధరాత్రి గురుకులంలో కలకలం.. ఆస్పత్రిలో 14 మంది విద్యార్థినులు

రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకులాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మొన్నటివరకు ఫుడ్ పాయిజన్ ఘటనలు గురుకులాల్లో రిపీట్ అవ్వగా.. తాజాగా మరో సమస్య వారిని వెంటాడుతోంది. అపరిశుభ్రత, నీటి సమస్యలకు తోడు కొత్తగా ఎలుకల భయం విద్యార్థినులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నట్టు తెలిసింది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఎలుకలు విద్యార్థినులను కరిచాయి.అర్ధరాత్రి విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో 14 మందిని ఎలుకలు కరిచినట్లు సమాచారం. విద్యార్థినుల చేతులు, కాళ్లపై ఎలుకలు కరవడంతో వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.రాత్రంతా విద్యార్థినులు ఏడుస్తూ కూర్చున్నట్టు సమాచారం.

బాలాపూర్ లడ్డును మించి.. వేలంలో రూ.1.01కోట్లు పలికిన గణేశ్ లడ్డు!తెలంగాణSwechaa25 Sep 2026, 01:39 PM

బాలాపూర్ లడ్డును మించి.. వేలంలో రూ.1.01కోట్లు పలికిన గణేశ్ లడ్డు!

 హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్ పరిధిలో ఉన్న ప్రముఖ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో వినాయక చవితి వేడుకల సందర్భంగా నిర్వహించిన గణేష్ లడ్డూ వేలం నగరంలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన 5 కిలోల పవిత్రమైన గణేష్ లడ్డూ ప్రసాదం వేలంలో ఊహించని రీతిలో భారీ ధరను పలికి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్థానిక నివాసితులు ఎంతో ఆధ్యాత్మిక ఉత్సాహంతో, భక్తిప్రపత్తులతో ఈ వేలం పాట పోటీలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకోవడానికి తీవ్రంగా పోటీ పడ్డారు.  ఈ పోటీలో విల్లాస్‌కు చెందిన కొందరు నివాసితులు ప్రత్యేక బృందంగా (సిండికేట్) ఏర్పడి, ఉమ్మడిగా రూ.1.01కోట్ల భారీ మొత్తాన్ని వేలం పాడి ఈ పవిత్ర లడ్డూను సొంతం చేసుకున్నారు.

శోభాయాత్రలో పోలీసులు.. పీఎస్‌‌‌లో రెండు కుటుంబాల ఫైటింగ్తెలంగాణSwechaa25 Sep 2026, 01:15 PM

శోభాయాత్రలో పోలీసులు.. పీఎస్‌‌‌లో రెండు కుటుంబాల ఫైటింగ్

రాష్ట్రంలో గణనాథుల నిమజ్జనాలు కొనసాగుతుండగా పోలీసులు విధుల్లో నిమగ్నం అయ్యారు.ట్రాఫిక్ క్లియరెన్స్, వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తున్నారు.ఈ క్రమంలోనే రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్‌లో నానా రభస చేశాయి. స్టేషన్ ప్రాంగణంలో ఇరువర్గాలు దాడులకు పాల్పడ్డాయి. దీనికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ గొడవకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకివెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. వివాహేతర సంబంధం వ్యవహారంలో మొదలైన వివాదం కాస్త తొలుత మాటల యుద్ధం, ఆపై పరస్పర దాడులకు దారితీసింది.ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఇరువర్గాలు పీఎస్‌లోకి దూసుకెళ్లాయి.

Viral: ఉద్యోగులందరికీ ఐఫోన్.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బాస్!వైరల్ న్యూస్Swechaa25 Sep 2026, 01:09 PM

Viral: ఉద్యోగులందరికీ ఐఫోన్.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన బాస్!

 యూఏఈ (UAE) కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మానవ వనరుల సంస్థ ‘వరల్డ్ స్టార్ మ్యాన్‌పవర్’ తమ సిబ్బంది పట్ల చూపిన ఉదారత ఇప్పుడు సోషల్ మీడియాలో విశేష ప్రశంసలు అందుకుంటోంది. కంపెనీ పురోగతికి అహర్నిశలు శ్రమిస్తున్న ఉద్యోగులందరినీ ఆశ్చర్యపరుస్తూ యాజమాన్యం సరికొత్త మోడల్ ఐఫోన్లను (iPhones) బహుమతిగా ప్రదానం చేసింది. అయితే ఈ ఖరీదైన గిఫ్ట్‌లను అందించిన విధానం అత్యంత ఆసక్తికరంగా మారడంతో, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

జగిత్యాలలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడుతెలంగాణSwechaa25 Sep 2026, 12:42 PM

జగిత్యాలలో విషాదం.. నిమజ్జన వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అయితే, కొన్ని చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. నెంబర్ల వారీగా జిల్లాల్లో గణపయ్యలు నిమజ్జనం కోసం బారులు తీరాయి. అయితే, యువత నిమజ్జన వేడుకల్లో ఆటపాటలతో సందడి చేస్తున్నారు. ఊరూరా డీజే సౌండ్స్, బ్యాండ్స్ సప్పుళ్లు మోత మోగుతున్నాయి.ఈ క్రమంలోనే డీజే సౌండ్స్ ధాటికి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డ్యాన్స్ చేస్తున్న క్రమంలోనే గుండెపోటు వచ్చినట్టు సమాచారం. తోటి వారు అతనికి కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

‘నువ్వెప్పుడూ నా బేబీ బ్రదర్‌వే’.. సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్!వైరల్ న్యూస్Swechaa25 Sep 2026, 12:35 PM

‘నువ్వెప్పుడూ నా బేబీ బ్రదర్‌వే’.. సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్!

 క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ సెప్టెంబర్ 25న తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోదరి సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి అత్యంత భావోద్వేగభరితమైన శుభాకాంక్షలు తెలియజేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియో మాంటేజ్ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్ననాటి తీపి జ్ఞాపకాల నుంచి నేటి వరకు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోకు సారా స్వయంగా తన వాయిస్‌ ఓవర్ ఇచ్చారు.

శోభాయాత్రలో విషాదం.. వాహనం కింద పడి యువకుడి దుర్మరణంతెలంగాణSwechaa25 Sep 2026, 12:23 PM

శోభాయాత్రలో విషాదం.. వాహనం కింద పడి యువకుడి దుర్మరణం

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం నెలకొంది. ఖైరతాబాద్ గణేశుల శోభాయాత్రలో భాగంగా ప్రమాదవశాత్తు ఓ యువకుడు వాహనం కింద పడి మరణించాడు. గంగమ్మ ఒడికి చేరేందుకు వినాయకులు వడివడిగా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్న క్రమంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు సెక్రెటేరియట్ ముందు నుంచి ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర సాగుతోంది. అయితే, మహాగణపతి శోభాయాత్రను వీక్షించేందుకు లక్షలాది భక్తులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే సచివాలయం, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్ పరిసరాల్లో భారీగా రద్దీ నెలకొంది.అయితే, ట్రాఫిక్ రద్దీని క్లియర్ చేసే క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయగా.. ఓ యువకుడు నిమజ్జనకోసం తరలుతున్న వాహనంపైకి ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి కిందపడగా వాహనం మీద నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1167 వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ పోలీసులు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు.. ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లుతెలంగాణSwechaa25 Sep 2026, 11:41 AM

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసు.. ఎమ్మెల్యే గాంధీకి ఈడీ సమన్లు

సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది.సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలంటూ గురువారం పంపిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లను మోసం చేసిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్టు ఆరోపణల రావడంతో దీనిపై ఈడీ విచారణ చేస్తున్నది. లావాదేవీల స్వభావం, ఉద్దేశంపై దర్యాప్తు చేపట్టింది.నిధుల వినియోగానికి సరైన వ్యాపార కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తునట్టు తెలిసింది. మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఆస్తులపైనా ఈడీ దృష్టి సారించింది.

balapur-laddu: బాలాపూర్ లడ్డూకు వేలంలో భారీ ధర.. పాత రికార్డులన్నీ బద్దలు!తెలంగాణSwechaa25 Sep 2026, 11:40 AM

balapur-laddu: బాలాపూర్ లడ్డూకు వేలంలో భారీ ధర.. పాత రికార్డులన్నీ బద్దలు!

భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈసారి సరికొత్త రికార్డులను సృష్టించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ వేలంలో 'అర్బన్ రియాలిటీ గ్రూప్'కు చెందిన 35 ఏళ్ల వ్యాపారవేత్త సామా ప్రణీత్ రెడ్డి అత్యధికంగా రూ.39లక్షలు పలికి స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం ప్రస్థానం ఏటేటా పెరుగుతూ నేడు రూ.39లక్షలకు చేరుకోవడం విశేషం. పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ ఈ ఏడాది అత్యంత భారీ ధరకు లడ్డూ వేలం సాగడంతో బాలాపూర్ ప్రాంగణమంతా భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనించింది. గతేడాది జరిగిన వేలంలో కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దాశరథ్ గౌడ్ రూ.35లక్షలకు లడ్డూను దక్కించుకోగా, ఈసారి ఆ రికార్డు సైతం బద్దలైంది.

గణేశ్ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్.. బాలుడు మృతితెలంగాణSwechaa25 Sep 2026, 11:22 AM

గణేశ్ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్.. బాలుడు మృతి

రాష్ట్రవ్యాప్తంగా గణనాథుల నిమజ్జనాలు, శోభాయాత్రాలు ఘనంగా కొనసాగుతున్నాయి.యువతీయువకులు, పెద్దలు శోభాయాత్రలో స్టెప్పులు వేస్తూ ‘వెళ్లిరావయ్యా..గణేశా’ అంటూ గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు.ఎక్కడ చూసినా డీజే సౌండ్స్, డప్పుచప్పుళ్ల నడమ గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు వెళ్తున్నారు. అయితే, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో శోభాయాత్రల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ గణనాథుడి శోభాయాత్రలో చిక్కుకోవడంతో సకాలంలో వైద్యం అందక రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్‌లో చోటుచేసుకుంది.

ఆన్‌లైన్ డిస్కౌంట్ల మాయాజాలానికి చెక్.. ఈ-కామర్స్ సైట్లకు కొత్త రూల్స్!వ్యాపారంSwechaa25 Sep 2026, 11:18 AM

ఆన్‌లైన్ డిస్కౌంట్ల మాయాజాలానికి చెక్.. ఈ-కామర్స్ సైట్లకు కొత్త రూల్స్!

దేశంలో నానాటికీ పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) సవరణ నిబంధనలు- 2026’ ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. పండుగల వేళ భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్ల పేరిట నకిలీ తగ్గింపులతో కస్టమర్లను బురిడీ కొట్టించే ఈ-కామర్స్ సంస్థల మాయాజాలానికి చెక్ పెట్టడమే కాకుండా, డిజిటల్ మార్కెట్‌ను మరింత పారదర్శకంగా మార్చడమే ఈ కొత్త విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.

అభివృద్ధి జరగాలి..దేశానికి దూరంగా కాదు : ప్రధాని మోడీNationalSwechaa25 Sep 2026, 11:04 AM

అభివృద్ధి జరగాలి..దేశానికి దూరంగా కాదు : ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పండిట్ ‘దీన్‌దయాళ్’ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశానికి స్వదేశీ భావజాలంతో కూడిన దృక్పథాన్ని అందించిన మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అని పేర్కొన్నారు. దీన్‌దయాళ్ 'చరైవేతి, చరైవేతి' (నిరంతరం ముందుకు సాగండి) అనే అభివృద్ధి మంత్రాన్ని బోధించడమే కాకుండా, తన జీవితాంతం ఆచరించి చూపించారని కొనియాడారు. ఆయన నిరంతర సాధకుడని ప్రశంసించారు. భారతదేశాన్ని పాశ్చాత్య లేదా విదేశీ దృక్పథంతో కాకుండా, స్వదేశీ మూలాలతో అర్థం చేసుకుని భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారని.. అందుకే ఆయన అరుదైన నాయకుడు అని గుర్తుచేశారు.

నిమజ్జనం స్పెషల్.. 24 గంటల పాటు ఆర్టీసీ బస్సు సేవలుతెలంగాణSwechaa25 Sep 2026, 10:32 AM

నిమజ్జనం స్పెషల్.. 24 గంటల పాటు ఆర్టీసీ బస్సు సేవలు

హైదరాబాద్ మహానగరంలో నేడు గణనాథుల నిమజ్జనాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే వందలాది గణనాథులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుండగా..మరికొన్ని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన బేబి పాండ్స్ వద్దకు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఇప్పటికే ప్రారంభం అవ్వగా.. మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తికానుంది. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరిగేలా పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, గణేశ్ నిమజ్జనానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌ సమీప ప్రాంతాలకు, అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు 24 గంటల పాటు నిరంతరాయంగా సుమారు 700 ప్రత్యేక బస్సులను నడపనుంది. శోభాయాత్ర రద్దీ, ట్రాఫిక్ మళ్లింపులు, పర్యవేక్షణ కోసం 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను రంగంలోకి దించింది.

తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు స్వల్ప ఉపశమనం!వ్యాపారంSwechaa25 Sep 2026, 10:27 AM

తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలుదారులకు స్వల్ప ఉపశమనం!

దేశీయ బులియన్ మార్కెట్‌లో సెప్టెంబర్ 25 శుక్రవారం ఉదయం బంగారం, వెండి కొనుగోలుదారులకు కొద్దిగా ఉపశమనం లభించింది. పసిడి మరియు వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో ఉదయం 7:00 గంటల సమయానికి ఉన్న సమాచారం ప్రకారం, మేలిమి బంగారం (24 క్యారెట్లు) 10 గ్రాములకు రూ. 1,52,670 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,39,940 గా నమోదైంది. అలాగే 18 క్యారెట్ల పసిడి ధర రూ. 1,14,500 వద్ద కొనసాగుతోంది. మరోవైపు వెండి ధరల్లోనూ స్వల్ప ఊరట లభించింది. కిలో వెండిపై రూ. 100 మేర ధర తగ్గడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కిలో వెండి ధర రూ. 2,44,900 వద్ద స్థిరపడింది.

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం.. సీపీ సజ్జనార్ కీలక ప్రకటన!తెలంగాణSwechaa25 Sep 2026, 10:22 AM

ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం.. సీపీ సజ్జనార్ కీలక ప్రకటన!

హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జన మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. భాగ్యనగరం నలుమూలల నుంచి తరలివచ్చే వేలాది వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. శోభాయాత్ర నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాలన్నీ భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను మంత్రి దానం నాగేందర్ టస్కార్ ముందు కొబ్బరికాయ కొట్టి వైభవంగా ప్రారంభించారు.

AsianGames2026: భారత్‌కు డబుల్ ధమాకా.. స్వర్ణం, రజతంతో మెరిసిన భారత షూటర్లు!క్రీడలుSwechaa25 Sep 2026, 10:11 AM

AsianGames2026: భారత్‌కు డబుల్ ధమాకా.. స్వర్ణం, రజతంతో మెరిసిన భారత షూటర్లు!

జపాన్‌లోని ఐచీ-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల ఆరో రోజున భారత షూటర్లు అద్భుత ప్రదర్శనతో దేశానికి డబుల్ ధమాకా అందించారు. షూటింగ్ విభాగంలో భారత క్రీడాకారులు లఘు వ్యవధిలోనే ఒక స్వర్ణం, ఒక రజత పతకాన్ని సాధించి పతకాల పంట పండించారు. 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్‌లో సురుచి, కమల్‌జీత్ లతో కూడిన భారత జోడీ సంచలన ప్రదర్శనతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే ఈ జోడీ ఆసియా రికార్డును సమం చేయడం విశేషం.

రేవంత్ రవ్వంత కంటే ఎక్కువే తగ్గుతున్నారు!?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa25 Sep 2026, 09:50 AM

రేవంత్ రవ్వంత కంటే ఎక్కువే తగ్గుతున్నారు!?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆందోళనలతో వెనక్కి తగ్గుతున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి గుంపులోని మేస్త్రీలతో చర్చించి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌లో ప్రశ్నించే ప్రజాస్వామ్యం ఒక వైపు, అధిష్టానం సుతిమొత్తటి మందలింపులు, ప్రతిపక్షాల నిలదీతతో రేవంత్ రవ్వంతనైనా తగ్గాల్సి వస్తోంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌లా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజల వద్ద కష్టమనే భావన కనిపిస్తోంది. అందుకే ప్రతిపక్ష నాయకులపైనే చర్యలు అంటూ కాలం నెట్టుకొస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు ఉండే వాటిని వెంటనే క్లోజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

విద్యార్థులకు ‘ఎయిర్ ఇండియా’ గుడ్ న్యూస్.. టిక్కెట్ల బుకింగ్‌కు బంపర్ ఆఫర్!వ్యాపారంSwechaa25 Sep 2026, 09:04 AM

విద్యార్థులకు ‘ఎయిర్ ఇండియా’ గుడ్ న్యూస్.. టిక్కెట్ల బుకింగ్‌కు బంపర్ ఆఫర్!

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దేశవ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులకు శుభవార్త అందించింది. కాలేజీ సెమిస్టర్లు, ఇంటర్న్‌షిప్‌లు, రాబోయే పండుగల సీజన్‌లో స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల ప్రయాణ భారాన్ని తగ్గించే లక్ష్యంతో 'స్టూడెంట్ ఫేర్' పేరుతో ప్రత్యేక రాయితీ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకునే విద్యార్థులకు విమాన ప్రాథమిక ఛార్జీ (బేస్ ఫేర్) పై 10 శాతం తక్షణ తగ్గింపు లభించనుంది.  డిస్కౌంట్‌తో పాటు విద్యార్థులకు లగేజీ విషయంలోనూ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ భారీ ఉపశమనం కల్పించింది.

Spirituality: మనిషిలో దాగిన ఆసురీ గుణాలు.. జీవితాన్ని పతనం వైపు నడిపించే లక్షణాలు ఇవే!..SpiritualitySwechaa25 Sep 2026, 07:30 AM

Spirituality: మనిషిలో దాగిన ఆసురీ గుణాలు.. జీవితాన్ని పతనం వైపు నడిపించే లక్షణాలు ఇవే!..

మనిషి జీవితంలో వెలుగు ఎంత ముఖ్యమో.. అంతరంగంలోని చీకటిని తొలగించడం కూడా అంతే ముఖ్యం. మనలోని ఆ చీకటినే శాస్త్రాలు ఆసురీ గుణాలుగా వివరిస్తాయి. ఇవి బయట కనిపించే రూపాలు కావు.. మన ఆలోచనలు, కోరికలు, భావోద్వేగాలు, ప్రవర్తనలో వ్యక్తమయ్యే అంతర్గత ప్రవృత్తులుగా పేర్కొంటారు.

అన్ని ఇంద్రియ భోగాలపై అదుపులేని కోరికను కామం అని, కోరిక తీరనప్పుడు పుట్టే తీవ్ర ఆవేశంను క్రోధం అని అంటారు. ఈ క్రోధం పెరిగినప్పుడు విచక్షణ తగ్గుతుంది.. మనిషి తన మాటపై, తన చేతలపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఇక తనకు ఉన్నదాన్ని పంచుకోలేని మనస్తత్వం లోభం. అవసరానికి మించిన వస్తువులు, సంబంధాలు, సంపదపై అతుక్కుపోయే మనస్తత్వంను మోహం. ఈ మోహమే యుక్తాయుక్త విచక్షణను మసకబార్చుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

Cooking Oil Rates: వంట నూనెలపై దిగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రంతెలంగాణSwechaa24 Sep 2026, 10:23 PM

Cooking Oil Rates: వంట నూనెలపై దిగుమతి సుంకాలు తగ్గించిన కేంద్రం

Cooking Oil Rates: దసరా, దీపావళి వంటి ప్రధాన పండుగల సీజన్ సమీపిస్తున్న వేళ దేశీయ మార్కెట్లలో వంట నూనెల ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పామాయిల్, సోయాబీన్, సన్‌ఫ్లవర్ సహా ముడి, శుద్ధి చేసిన పలు రకాల వంట నూనెలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గిస్తూ తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సవరించిన ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 24 అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

22A Lands: 22ఏ భూములపై రేవంత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయంతెలంగాణSwechaa24 Sep 2026, 09:27 PM

22A Lands: 22ఏ భూములపై రేవంత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

22A Lands: రాష్ట్రంలో గత నెల రోజులుగా తీవ్ర గందరగోళానికి దారితీసిన 22ఏ నిషేధిత భూముల వివాదానికి రేవంత్ రెడ్డి సర్కార్ చెక్ పెట్టింది. ప్రజలు, ఆస్తి యజమానుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. 22ఏ నిషేధిత పరిధిలో ఉన్నప్పటికీ.. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ వంటి ప్రభుత్వ విభాగాల అనుమతులు ఉన్న భూములు, ప్లాట్లు, నివాస గృహాలకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు జారీ చేసిన ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.50 లక్షల ఎకరాల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారు. అయితే అధికారుల తప్పిదం వల్ల ప్రభుత్వ భూములతో పాటు సరైన లేఅవుట్ అనుమతులు ఉన్న ప్రైవేట్ స్థలాలు, ఓపెన్ ప్లాట్లు, నివాస గృహాలు కూడా ఈ జాబితాలోకి చేరడంతో రిజిస్ట్రేషన్ల శాఖ అమ్మకాలు, కొనుగోళ్లను ఆపేసింది.

పార్టీలు మారే వాళ్లకు సుప్రీం తీర్పు చెంపపెట్టు : బండి సంజయ్తెలంగాణSwechaa24 Sep 2026, 09:20 PM

పార్టీలు మారే వాళ్లకు సుప్రీం తీర్పు చెంపపెట్టు : బండి సంజయ్

Bandi Sanjay: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు సుప్రీంకోర్టు తాజా తీర్పు గట్టి చెంపపెట్టు లాంటిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రజల ఓట్లతో ఒక పార్టీ గుర్తుపై గెలిచి, ఆ తర్వాత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మరో పార్టీలోకి మారడం ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తోందని, రెండు పార్టీలదీ ఒకే తాను ముక్కల విధానమని ఆయన మండిపడ్డారు.

ఒక వికెట్ డౌన్.. త్వరలో మరికొన్ని వికెట్లు పడతాయితెలంగాణSwechaa24 Sep 2026, 09:12 PM

ఒక వికెట్ డౌన్.. త్వరలో మరికొన్ని వికెట్లు పడతాయి

KTR: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్. సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెంపపెట్టుగా అభివర్ణించారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును దొంగిలించి, స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఫిరాయింపుదారులను కాపాడాలనుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

సుప్రీంకోర్టు తీర్పుతో ఫిరాయింపుల రాజకీయాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో విఫలమైన హామీలకు, పాలనా వైఫల్యాలకు, చేసిన నమ్మకద్రోహానికి ఖైరతాబాద్ ప్రజలు ఉప ఎన్నికల రూపంలో తగిన తీర్పు చెబుతారని కేటీఆర్ అన్నారు. దానం నాగేందర్ పై అనర్హతతో ఒక వికెట్ పడిందన్న కేటీఆర్.. త్వరలో మరిన్ని వికెట్లు పడతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

BRS: బీఆర్‌ఎస్‌ రాజీలేని పోరాటం.. సుప్రీంకోర్టులో దానం ఎమ్మెల్యే కథ క్లోజ్! గులాబీ శ్రేణుల్లో సంబరాలు..తెలంగాణSwechaa24 Sep 2026, 09:01 PM

BRS: బీఆర్‌ఎస్‌ రాజీలేని పోరాటం.. సుప్రీంకోర్టులో దానం ఎమ్మెల్యే కథ క్లోజ్! గులాబీ శ్రేణుల్లో సంబరాలు..

BRS: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై తాము సాగించిన న్యాయపోరాటం చారిత్రాత్మక విజయాన్ని అందుకుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో పాటు, ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ కూడా వీగిపోయింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్‌ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టు గడప వరకు గులాబీ దళం అలుపెరగకుండా సాగించిన సుదీర్ఘ న్యాయపోరాటం ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని ఆ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.