స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

Pranay Case: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడు అబ్దుల్ బారీ మృతి!తెలంగాణSwechaa24 Sep 2026, 08:01 PM

Pranay Case: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడు అబ్దుల్ బారీ మృతి!

Pranay Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ అమృత - ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 4వ నిందితుడిగా (A4) జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో మరణించారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు.

Pranay Case: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడు అబ్దుల్ బారీ మృతి!తెలంగాణSwechaa24 Sep 2026, 07:27 PM

Pranay Case: మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడు అబ్దుల్ బారీ మృతి!

Pranay Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ అమృత - ప్రణయ్ పరువు హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో 4వ నిందితుడిగా (A4) జీవిత ఖైదు అనుభవిస్తున్న అబ్దుల్ బారీ గుండెపోటుతో మరణించారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో జైలు సిబ్బంది హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు అధికారులు తెలిపారు.చర్లపల్లి జైల్లో ఉన్న అబ్దుల్ బారీకి అకస్మాత్తుగా తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు. పరిస్థితి విషమించడంతో అప్రమత్తమైన జైలు అధికారులు వెంటనే అతడిని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర వార్డులో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి అతడు మరణించినట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. ప్రస్తుతం బారీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు.

బొగ్గు ఉన్నా చీకట్లే? సింగరేణిని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ సర్కార్తెలంగాణSwechaa24 Sep 2026, 07:25 PM

బొగ్గు ఉన్నా చీకట్లే? సింగరేణిని నిలువునా ముంచుతున్న కాంగ్రెస్ సర్కార్

Singareni: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, సరఫరాకు సంబంధించిన అంశాలపై బీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈరోజు హైదరాబాద్ లో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్‌ను కలిసింది. ఈ కమిటీలో మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే దివాకర్ రావు, TGBKS నాయకులు రాజిరెడ్డి, సురేందర్ ఉన్నారు.

దక్షిణ భారత దేశంలోనే ఏకైక బొగ్గు గని క్షేత్రం ఉండి, దేశంలోనే రెండవ అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి (SCCL)లో 51 శాతం వాటా ఉన్న తెలంగాణను నేడు విద్యుత్ సంక్షోభం, చీకట్లలోకి నెట్టివేయడం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం, తీవ్ర పరిపాలనా వైఫల్యమేనని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నిప్పులు చెరిగారు. నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకపోవడంతో TG GENCO థర్మల్ యూనిట్లు మూతపడటం, సింగరేణి ఉత్పత్తి గణనీయంగా పడిపోవడం, రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు లెక్కల్లో లేకుండా మాయం, దాదాపు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సింగరేణి భవన్‌లో సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) బుద్ధ ప్రకాష్ జ్యోతికి సమగ్ర వినతిపత్రం సమర్పించారు.

GO 240 Protests: బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకోం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితెలంగాణSwechaa24 Sep 2026, 06:31 PM

GO 240 Protests: బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకోం: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

GO 240 Protests: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన 'జీఓ నంబర్ 240' ఇప్పుడు హైదరాబాద్ శివార్లలో అగ్గి రాజేస్తోంది. వేల కోట్ల పరిహారం ఇస్తామన్నా సరే.. తమకు ఆ డబ్బే వద్దని, తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములే ముద్దంటూ రైతాంగం తెగేసి చెబుతోంది. మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరిట చిన్నకారు రైతుల ఉసురు తీయవద్దంటూ ఉప్పల్ నియోజకవర్గంలో తీవ్రస్థాయిలో ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ క్రమంలో రైతులకు అండగా బాధితులతో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలెక్టరేట్‌ను ముట్టడించి ప్రభుత్వ విధానాలపై సమరశంఖం పూరించారు.మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరిని కలిసిన సందర్భంగా ఉప్పల్ రైతులు తమ ఆవేదనను, ఆక్రోశాన్ని ముక్తకంఠంతో వినిపించారు. "మా రక్తాన్ని ధారబోసి కాపాడుకున్న భూములను ప్రాజెక్టుల పేరుతో ఎలా లాక్కుంటారు?

క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టుకెక్కిన హరీశ్ రావుతెలంగాణSwechaa24 Sep 2026, 06:16 PM

క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టుకెక్కిన హరీశ్ రావు

Harish Rao: తనపై వచ్చిన క్షుద్రపూజల ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హరీశ్ రావు కోర్టుకెక్కారు. తాను క్షుద్రపూజలు చేశానంటూ ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌ పై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశానని, కేసు కూడా ఫైల్ చేశానని హరీశ్ తెలిపారు. పరువు నష్టం దావా కేసు ఆధారాలతో సహా ఫైల్ చేసినట్లు పేర్కొన్నారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు తన పిటిషన్ ను స్వీకరించిందని, వచ్చే బుధవారం తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు. తాను క్షుద్రపూజలు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. వారిపై లీగల్ గా ముందుకెళ్తున్నామన్నారు.

CJP: 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకుంటే జంతర్‌ మంతర్‌ 2.0 : అభిజీత్ దీప్కేదునియాSwechaa24 Sep 2026, 06:04 PM

CJP: 48 గంటల్లో సీఈసీ రాజీనామా చేయకుంటే జంతర్‌ మంతర్‌ 2.0 : అభిజీత్ దీప్కే

CJP: కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా దుమారం చెలరేగింది. 'సర్‌' పేరిట సాగుతున్న పరిణామాలపై ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ప్రజాస్వామ్య వ్యవస్థకే పెను ముప్పుగా మారారని ధ్వజమెత్తిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే, ఆయన పదవి నుంచి వైదొలగడానికి 48 గంటల డెడ్‌లైన్ విధించారు. ఈ గడువులోగా సీఈసీ రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తిస్తామని, ఢిల్లీ నడిబొడ్డున ‘జంతర్‌ మంతర్‌ 2.0’ ప్రజా సంగ్రామాన్ని చేపట్టి తీరుతామని సంచలన హెచ్చరిక చేశారు.ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అభిజీత్‌ దీప్కే కేంద్ర ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా ఎండగట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటర్లే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, కానీ ప్రస్తుత సీఈసీ నేతృత్వంలో ఎవరు ఓటు వేయాలో ప్రభుత్వమే నిర్ణయించేలా దారుణమైన పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. ‘‘ప్రజాస్వామ్యానికి ప్రధాన ఎన్నికల కమిషనరే పెద్ద అవరోధంగా మారారు.

TG: "దానం" డిస్మిస్.. ఉప ఎన్నికకు అప్పుడే అన్ని పార్టీల్లో జోరుతెలంగాణSwechaa24 Sep 2026, 04:51 PM

TG: "దానం" డిస్మిస్.. ఉప ఎన్నికకు అప్పుడే అన్ని పార్టీల్లో జోరు

TG: తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు విధించిన అనర్హత వేటును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్థించడంతో తాజాగా రాజధాని నడిబొడ్డున ఎన్నికల నగారా మోగింది. దానం వేసిన పిటిషన్‌ను విచారించేందుకే సుప్రీం నిరాకరించి కొట్టివేయడంతో ఆయనకు అన్ని దారులూ మూసుకుపోయాయి. స్పీకర్ కార్యాలయం నుంచి అధికారికంగా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ప్రకటన రావడమే తరువాయి.. ఇక ఆరు నెలల్లో ఉపఎన్నిక అనివార్యమౌతుంది.ఈ ఒక్క తీర్పుతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల్లో అప్పుడే రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి.బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ ‘బీ-ఫామ్’తో ఎంపీగా పోటీ చేయడమే దానం అనర్హతకు ప్రధాన కారణమైంది. ఇప్పుడు శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయిన దానం.. ‘నేను ఫైటర్‌ని, మళ్లీ గెలిచి చూపిస్తా’ అంటూ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది కత్తిమీద సాములాంటి పరిణామం అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక జరిగితే అది అధికార పార్టీ పనితీరుకు రెఫరెండంగా మారే ప్రమాదం ఉంది. దానం నాగేందర్‌కే మళ్లీ టికెట్ ఇచ్చి సానుభూతి, స్థానిక పట్టుతో గెలవాలా? లేక ప్రత్యామ్నాయ వ్యూహం రచించాలా? అన్న అంశంపై గాంధీ భవన్‌లో ఇప్పటికే సమాలోచనలు స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది.

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను వెంటనే సవరించాలితెలంగాణSwechaa24 Sep 2026, 04:40 PM

రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను వెంటనే సవరించాలి

Vinod Kumar: రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ను సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీలు మార్చే ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువు విధించాలని ఆయన అన్నారు. 10వ షెడ్యూల్ లో నిర్ణీత గడువు లేనందున చట్టంలోని లొసుగులను ప్రజా ప్రతినిధులు వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో రెండున్నరేళ్లు సమయం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. 10 షెడ్యూల్ లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. పదవ షెడ్యూల్ లో చర్యలపై నిర్ణీత గడువు విధించకపోవడం వల్ల ఇష్టారీతిన అసెంబ్లీ స్పీకర్స్ సమయం తీసుకుంటున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

Election Commission: ఎన్నికల కమిషన్ గూటిలో కుట్రల మంటలు..తెలంగాణSwechaa24 Sep 2026, 04:40 PM

Election Commission: ఎన్నికల కమిషన్ గూటిలో కుట్రల మంటలు..

Election Commission: భారత ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటి ఎన్నికల వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో పడిందా? ఓటర్ల డేటాబేస్, ఓట్ల నమోదుల వెనుక వ్యవస్థాగతంగా భారీ రిగ్గింగ్ జరుగుతోందా? ఈ సంచలన ప్రశ్నలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంపై విపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలు సాధారణ ఆరోపణల స్థాయిని దాటి, నేరుగా రాజ్యాంగ వ్యవస్థల ఉనికే ప్రమాదంలో పడిందన్న ఆందోళనను రేకెత్తిస్తున్నాయి."నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగనప్పుడు ఇక ప్రజాస్వామ్యానికి అర్థమెక్కడుంది?" అంటూ విపక్ష నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఒకవేళ ఎన్నికల్లో ఏదైనా ఒక రూపంలో అక్రమాలు జరుగుతుంటే, దానికి ఎన్నికల కమిషన్ సహకరిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికంటే తీవ్రమైన విషయం ఏమిటంటే — సాక్షాత్తు ఎన్నికల కమిషనర్‌కే ఈ అక్రమాలు, అవకతవకల గురించి తెలిసీ కూడా, వాటిని అడ్డుకోకుండా కళ్లప్పగించి చూస్తూ చోద్యం చూస్తుంటే... అది కేవలం పదవీ వైఫల్యం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు. అంతకుమించి అది ముమ్మాటికీ 'దేశానికి తీరని ద్రోహం.. క్షమించరాని దేశద్రోహం' అని విపక్షాలు వేదికలపై గర్హిస్తున్నాయి.

ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందనే..దానం సుప్రీంకోర్టుకెళ్లారుతెలంగాణSwechaa24 Sep 2026, 04:28 PM

ఖైరతాబాద్‌లో బీఆర్ఎస్ గెలుస్తుందనే..దానం సుప్రీంకోర్టుకెళ్లారు

Padi Kaushik Reddy: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో దానంపై హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దానం నాగేందర్ పై సుప్రీంకోర్టు తీర్పును ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పు ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలకు చెంపపెట్టు అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.

BRS: పట్టభద్రుల పోరుపై గులాబీ దళం ఎక్స్‌ట్రా కేర్.. ఓటర్ నమోదుతో పాటే అభ్యర్థుల వేట!తెలంగాణSwechaa24 Sep 2026, 03:38 PM

BRS: పట్టభద్రుల పోరుపై గులాబీ దళం ఎక్స్‌ట్రా కేర్.. ఓటర్ నమోదుతో పాటే అభ్యర్థుల వేట!

BRS: తెలంగాణ రాజకీయాల్లో మరో హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమవుతోంది. ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీల్లో ఒక్కసారిగా కదలిక మొదలైంది. అయితే, అన్ని రాజకీయ పక్షాల కంటే ఒకడుగు ముందే మేల్కొన్న బీఆర్ఎస్ ఈసారి దూకుడుగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు ఇంకా నెలల సమయం ఉన్నప్పటికీ, అభ్యర్థులను ఇప్పుడే ప్రకటించి ప్రత్యర్థులకు ఊహించని షాక్ ఇచ్చేందుకు కేసీఆర్ సేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం ఇంత 'ఎక్స్‌ట్రా కేర్' తీసుకోవడం వెనుక లోతైన రాజకీయ వ్యూహం దాగి ఉందని అంటున్నారు. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థులను ప్రకటించడం పార్టీల ఆనవాయితీ. కానీ గులాబీ దళం ఆ పాత పద్ధతికి స్వస్తి పలకాలని చూస్తోందట.

సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టుతెలంగాణSwechaa24 Sep 2026, 03:35 PM

సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు

Harish Rao: దానం నాగేందర్ అనర్హతను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి పదేపదే మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టుగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా “సంవిధాన్ బచావో” అంటూ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ మాటలను ఆచరణలో చూపించాల్సిన సమయం వచ్చిందని హరీశ్ రావు సూచించారు.

రాజ్యాంగంపై రాహుల్ గాంధీకి నిజంగా నిబద్ధత ఉంటే.. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి, ప్రజల తీర్పు కోరాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాజ్యాంగ నైతికత గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో తమ పార్టీ అనుసరిస్తున్న ఫిరాయింపుల రాజకీయాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారు? అని ప్రశ్నించారు. “సంవిధాన్ బచావో” అనేది కేవలం రాజకీయ నినాదమా? లేక నిజమైన రాజ్యాంగ నిబద్ధతా? రాహుల్ గాంధీ స్పష్టం చేయాలన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి పంపాలని హరీశ్ రావు అన్నారు.

డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు.. బినామీల ఇళ్లలో మెరుపుదాడులు!క్రైమ్Swechaa24 Sep 2026, 03:35 PM

డీఎస్పీ భీమ్ రెడ్డి కేసులో ఏసీబీ దూకుడు.. బినామీల ఇళ్లలో మెరుపుదాడులు!

 ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ భీమ్ రెడ్డి కేసు దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు తమ వేగాన్ని మరింత పెంచారు. ఈ కేసు విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు కీలక పరిణామాన్ని వెలుగులోకి తెచ్చారు. డీఎస్పీ భీమ్ రెడ్డికి సంబంధించినవిగా భావిస్తున్న ఎనిమిది మంది అనుమానిత బినామీలను అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌లోని పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ బినామీల నివాసాలు, కార్యాలయాలపై ఏసీబీ బృందాలు నేడు(గురువారం) ఏకకాలంలో మెరుపు సోదాలు చేపట్టాయి. ఏసీబీ డీఎస్పీ జి.శ్రీధర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలను నిర్వహిస్తున్నాయి.

గణేశ్ నిమజ్జనం.. మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్తెలంగాణSwechaa24 Sep 2026, 02:51 PM

గణేశ్ నిమజ్జనం.. మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్

వినాయకచవితి నవరాత్రులు పూర్తయిన సందర్భంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. గణపయ్యను ప్రతిష్టించిన మూడో రోజు నుంచే హైదరాబాద్ మహానగరంలో ఘనంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల నిమజ్జనాలు పూర్తయ్యాయి.. రేపు నగరంలోని ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం జరగనుంది. ఇదిలాఉండగా, నగర వాసులకు హైదరాబాద్ మెట్రో అధికారులు తీపి కబురు అందించారు. శోభాయాత్ర, నిమజ్జనం మహోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 25న అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు. నగరంలోని అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో రైలు అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నా :  దానం నాగేందర్తెలంగాణSwechaa24 Sep 2026, 02:32 PM

ఉపఎన్నికకు సిద్ధంగా ఉన్నా : దానం నాగేందర్

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఘటనలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దుచేసిన విషయం తెలిసిందే.ఈ తీర్పుపై స్టే కోరుతూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దానంపై అనర్హత వేటు వేయడం సరైనదే అని సర్వోన్నత న్యాయస్థానం భావించింది. సుప్రీంకోర్టులోనూ తనకు వ్యతిరేకంగా తీర్పు రావడంపై తాజాగా దానం నాగేందర్ స్పందించారు.అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని పేర్కొన్నారు. చట్టపరమైన ప్రక్రియపై గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని వెల్లడించారు. ఇకపై తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ‘కోర్టు తీర్పు ఈ విధంగా వస్తుందని నేను ముందే ఊహించాను. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నిబంధనల ప్రకారం లీగల్‌గా నాకు కొంత ఊరట లభిస్తుందని భావించాను. అందుకే చట్టబద్ధంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను’ అని దానం చెప్పుకొచ్చారు.

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలన నిజాలు.. మిలటరీలో చేరే ముందే పాత నేర చరిత్ర!క్రైమ్Swechaa24 Sep 2026, 02:09 PM

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలన నిజాలు.. మిలటరీలో చేరే ముందే పాత నేర చరిత్ర!

 హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాసు రెజిమెంట్ నుంచి ఆయుధాలు చోరీకి గురైన సంచలనాత్మక కేసులో పోలీసులు మరొక బిగ్ ట్విస్ట్‌ను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయి మల్కాజ్‌గిరి పోలీసుల కస్టడీలో ఉన్న మాజీ హవాల్దార్ మల్లేష్‌కు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. 2005 నుంచి 2007 మధ్యకాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై పలు ఇళ్లల్లో దొంగతనాలకు (హౌజ్ బ్రేకింగ్) సంబంధించిన కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

‘దానం’కు సుప్రీం షాక్.. రేవంత్ ఇకనైనా బుద్ది తెచ్చుకో : ఏలేటి మహేశ్వర్ రెడ్డితెలంగాణSwechaa24 Sep 2026, 01:58 PM

‘దానం’కు సుప్రీం షాక్.. రేవంత్ ఇకనైనా బుద్ది తెచ్చుకో : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందున ఆయన శాసనసభ సభ్యత్వాన్ని హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం సైతం రాష్ట్ర హైకోర్టు తీర్పును సమర్థించింది. స్టే ఇవ్వలేమని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది.అయితే, దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వం రద్దు కావడంలో కీలక పాత్ర పోషించిన బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించడం రాజ్యాంగ విజయమని పేర్కొన్నారు. బీజేఎల్పీ చేసిన న్యాయపోరాటం వల్లే ఈ విజయం దక్కిందని, ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలపై కోర్టుల్లో న్యాయపోరాటం క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు కొనసాగిస్తామని వెల్లడించారు.

నమ్మించి కాటేశారు.. యువతిపై ముగ్గురు పోలీసుల గ్యాంగ్ రేప్!క్రైమ్Swechaa24 Sep 2026, 01:42 PM

నమ్మించి కాటేశారు.. యువతిపై ముగ్గురు పోలీసుల గ్యాంగ్ రేప్!

రక్షణ కల్పించాల్సిన పోలీసులే బక్షించారు. బయట ఎవరినీ నమ్మడానికి లేదు తనకు రక్షణ కల్పించాలని ఓ యువతి పోలీసులను సాయం కోరగా.. వారే ఆమె మీద మృగాళ్లలా విరుచుకపడ్డారు.మద్యం మత్తులో ఆమె మీద లైంగికదాడికి పాల్పడ్డారు.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు పోలీసులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆమ్రోహా జిల్లా హసన్‌పూర్‌లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. హర్యానాలోని ఫతేహాబాద్‌కు చెందిన 23 ఏళ్ల యువతి మతపరమైన ప్రదేశాల్ని సందర్శించాలనుంది.ఆ సమయంలోనే సాయం కోసం ఎదురుచూడగా.. అప్పుడు ఓ మహిళ ఆమెకు ఫోన్ చేసి CRPFలో ఇన్‌స్పెక్టర్‌ అయిన మోహిత్‌తో కలిసి వెళ్లమని సూచించింది.సెప్టెంబర్ 21న సోనిపట్‌లో మోహిత్‌ను కలిసిన యువతి.. అతనితో కలిసి మీరట్‌కు ప్రయాణించింది.

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం.. వుషులో వరుసగా మూడోసారి మెడల్!క్రీడలుSwechaa24 Sep 2026, 01:29 PM

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో రజతం.. వుషులో వరుసగా మూడోసారి మెడల్!

 జపాన్ వేదికగా సాగుతున్న ఆసియా క్రీడల ఐదో రోజు పోటీల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. వుషు మహిళల 60 కేజీల సాండా విభాగం ఫైనల్లో భారత క్రీడాకారిణి నవోరెమ్ రోషిబినా దేవి రజత పతకాన్ని కైవసం చేసుకుంది. చైనాకు చెందిన జియావోయు జాంగ్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ పోరులో రోషిబినా దేవి 0-2 తేడాతో ఓటమి పాలైనప్పటికీ, అద్భుత పోరాటంతో భారత్‌కు రజత పతకాన్ని అందించింది.

12 మంది అదనపు జడ్జిలు పర్మినెంట్..కొలీజియం గ్రీన్‌‌సిగ్నల్!NationalSwechaa24 Sep 2026, 01:22 PM

12 మంది అదనపు జడ్జిలు పర్మినెంట్..కొలీజియం గ్రీన్‌‌సిగ్నల్!

దేశంలోని వివిధ కోర్టుల్లో అదనపు న్యాయమూర్తులుగా విధులు నిర్వహిస్తున్న పలువురికి సుప్రీంకోర్టు కొలీజియం శుభవార్త చెప్పింది. ఇంతకాలం అదనపు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న వారికి పర్మినెంట్ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు వీరు విధులు నిర్వహిస్తున్న చోటనే శాశ్వత జడ్జిలుగా తీర్పులు చెప్పనున్నారు. పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం కోసం న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు, కొత్త వారి నియామకానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవలి కాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాలుగు ప్రధాన హైకోర్టుల్లో విధులు నిర్వర్తిస్తున్న 12 మంది అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. బుధవారం సమావేశమైన కొలీజియం.. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఉత్తరాఖండ్, గువాహటి న్యాయస్థానాలకు సంబంధించిన ఈ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిలో భాగంగా ఏపీ హైకోర్టుకు చెందిన ఐదుగురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

బీఆర్‌ఎస్ నేతల భూఅక్రమాలపై విచారణకు హైపవర్ కమిటీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!తెలంగాణSwechaa24 Sep 2026, 01:14 PM

బీఆర్‌ఎస్ నేతల భూఅక్రమాలపై విచారణకు హైపవర్ కమిటీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ!

 తెలంగాణలోని పలు జిల్లాల్లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కేటాయింపులు, కొనుగోళ్లు, తీవ్ర అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, వారి కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన భూములపై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారికంగా జీవోను జారీ చేసింది. ఈ కమిటీకి ఐఏఎస్ అధికారిణి ఏ.శ్రీదేవసేన అధ్యక్షత వహించనుండగా, రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్‌గాంధీ హనుమంతు(IAS) కన్వీనర్‌గా, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(IAS) సభ్యుడిగా వ్యవహరిస్తారు

బీహార్‌లో అసలేం జరుగుతోంది..! అమ్మాయిలకు రక్షణే లేదా..?NationalSwechaa24 Sep 2026, 01:13 PM

బీహార్‌లో అసలేం జరుగుతోంది..! అమ్మాయిలకు రక్షణే లేదా..?

బీహార్‌లో రెండు వైరల్ వీడియోలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఒకటి జముయ్‌లో.. మరొకటి సమస్తిపూర్‌లో. ఒక ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైన కొద్ది రోజులకే.. మరో ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో దీనిని కేవలం రెండు నేర ఘటనలుగా చూడాలా? లేక బీహార్‌లో మహిళలు, బాలికల భద్రతపై మరింత లోతుగా చర్చించాలా?

‘దానం’కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. త్వరలోనే ఖైరతాబాద్ ఉపఎన్నిక!తెలంగాణSwechaa24 Sep 2026, 01:05 PM

‘దానం’కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. త్వరలోనే ఖైరతాబాద్ ఉపఎన్నిక!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు బిగ్‌షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.దీనిని సుప్రీంకోర్టులో ఆయన అప్పీల్ చేయగా..తాజాగా సుప్రీంకోర్టు సైతం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక రావడం అనివార్యం అయ్యింది. సాధారణంగా ఏదైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ సెగ్మెంటులో అభ్యర్థి మరణించినా లేదా రాజీనామా చేసినా ఆరు నెలలోపు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు వచ్చే రెండు నెలల వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేసి ఉపఎన్నిక నిర్వహించనున్నట్టు సమాచారం.

శ్రీ శ్రీమన్నారాయణ హైస్కూల్లో  విద్యా నిబంధనలకు తూట్లు?తెలంగాణSwechaa24 Sep 2026, 12:18 PM

శ్రీ శ్రీమన్నారాయణ హైస్కూల్లో విద్యా నిబంధనలకు తూట్లు?

కూకట్‌పల్లి, సర్దార్ పటేల్ నగర్ : హైదరాబాద్ మహానగరంలో పలు విద్యా సంస్థలు ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. ఇరుకు వీధుల్లో కనీసం వాహనాలు వెళ్లేందుకు కూడా దారిలేని ప్రదేశంలో బహుల అంతస్థుల్లో పాఠశాలలను నడుపుతున్నట్టు సమాచారం. ఫలితంగా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ నుంచి విద్యార్థులు సేఫ్‌గా బయటకు వస్తారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా నగరంలోని శ్రీ శ్రీమన్నారాయణ స్కూల్‌లో సేఫ్టీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమారు 400 మంది విద్యార్థులు చదువుతున్న శ్రీ శ్రీమన్నారాయణ హైస్కూల్‌లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.స్కూల్‌లో ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు, ఫైర్ NOC ఉన్నాయా? అనే అంశంపై తల్లిదండ్రులు, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విద్యార్థులు ఆటలు ఆడేందుకు, శారీరక కార్యకలాపాలు నిర్వహించేందుకు తగిన గ్రౌండ్ సౌకర్యం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కేవలం బహుల అంతస్తుల భవనంలో ఎలాంటి భద్రతా సౌకర్యాలు లేకుండా స్కూల్ నడుస్తున్నట్టు తెలుస్తోంది.

ఏటీఏంలో వాకీటాకీ.. మహిళకు మస్కా కొట్టి రూ.2.9 లక్షలు స్వాహా!క్రైమ్Swechaa24 Sep 2026, 11:57 AM

ఏటీఏంలో వాకీటాకీ.. మహిళకు మస్కా కొట్టి రూ.2.9 లక్షలు స్వాహా!

ఈజీ మనీ కోసం కొందరు అక్రమార్కులు అమాయకులను మోసం చేస్తున్నారు. వారి భయం, అభద్రతా భావాన్ని లక్ష్యంగా చేసుకుని రూ.లక్షలు కొల్లగొడుతున్నారు. మహిళలు, వృద్ధులు ఎక్కువగా మోసాల బారిన పడుతుండగా.. ఇటీవలి కాలంలో చదువుకున్న వ్యక్తులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, పోలీసులు, డాక్టర్లు సైతం మోసపోతున్నారు. తాజాగా ఓ మహిళను ఓ మాయగాడు బురిడీ కొట్టించాడు. ఏటీఎంలో వాకీటాకీ అమర్చి బాధితురాలిని భయాందోళనకు గురిచేశాడు. అనంతరం రూ.2.9 లక్షలు కొట్టేశాడు.వివరాల్లోకివెళితే.. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ పట్టణానికి చెందిన ఓ మహిళ డబ్బులు డ్రా చేసేందుకు ఏటీఎం వెళ్లింది. అక్కడ రూ.27 వేలు విత్‌డ్రా చేసింది. డెబిట్ కార్డు యంత్రంలోనే ఇరుక్కుపోగా ఎంత తీసినా బయటకు రాలేదు. ఈ క్రమంలోనే ఏటీఎంలో అమర్చిన వాకీ-టాకీతో సదరు మహిళను బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు.

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర కన్నుమూత.. సినీ ప్రపంచంలో తీరని లోటు!సినిమాSwechaa24 Sep 2026, 11:51 AM

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రవిచంద్ర కన్నుమూత.. సినీ ప్రపంచంలో తీరని లోటు!

 తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయవంతమైన చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ సీనియర్ దర్శకుడు సారిక సత్య రవిచంద్ర(84) హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో పాటు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు, నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

'ది ప్యారడైజ్‌'లో KCRను పోలిన పాత్ర.. ట్రెండింగ్‌గా ప్రియదర్శి గెటప్, పవర్‌ఫుల్ డైలాగ్స్!సినిమాSwechaa24 Sep 2026, 11:20 AM

'ది ప్యారడైజ్‌'లో KCRను పోలిన పాత్ర.. ట్రెండింగ్‌గా ప్రియదర్శి గెటప్, పవర్‌ఫుల్ డైలాగ్స్!

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన 'ది ప్యారడైజ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై థియేటర్లలో రికార్డు స్థాయి స్పందనను రాబడుతోంది. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో వర్సటైల్ నటుడు ప్రియదర్శి పోషించిన 'ఎమ్మెల్యే శంకర్' పాత్ర ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాజకీయ నాయకుడి గెటప్‌లో కనిపించిన ప్రియదర్శి నటనపై నెటిజన్లు, సినీ ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు.. పురావస్తు శాఖపై తీవ్ర విమర్శలు!తెలంగాణSwechaa24 Sep 2026, 11:03 AM

చార్మినార్ నుంచి ఊడిపడిన పెచ్చులు.. పురావస్తు శాఖపై తీవ్ర విమర్శలు!

 హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్త ఐకాన్‌గా విరాజిల్లుతున్న చారిత్రక చార్మినార్ రక్షణ, నిర్వహణ పట్ల భారత పురావస్తు శాఖ (ASI) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో చార్మినార్ మొదటి అంతస్తు లాడ్ బజార్ వైపు ఉన్న భాగం నుంచి సున్నపు పెచ్చులు, డిజైన్ పువ్వుల భాగాలు ఊడి కిందపడిపోయాయి. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం రాత్రి సమయంలో జరగడం, ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

గణేశ్  నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం.. ఎస్ఐ మృతితెలంగాణSwechaa24 Sep 2026, 10:52 AM

గణేశ్ నిమజ్జన వేడుకల్లో తీవ్ర విషాదం.. ఎస్ఐ మృతి

రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణపతి నిమజ్జనాల ఉత్సవాల్లో భాగంగా విధులు నిర్వహించేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఓ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన కింద పడిపోవడంతో సహచర ఉద్యోగి ఆయన్ను పైకి లేపారు. గాయాలపాలైన కొత్తగూడెం టూ టౌన్ ఎస్సై కె.వెంకన్న (55)ను హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స అనంతరం ఆయన క్షేమంగా కొత్తగూడంలోని తన ఇంటికి వెళ్లిపోయారు.మంగళవారం రాత్రి సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు సమాచారం. మరో పోలీస్ అధికారితో కలిసి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం వాహనం ఆపకుండానే పారిపోయారు.ఈ ఘటనలో ఆయన కుడి కాలికి స్వల్ప గాయాలయ్యాయి.చికిత్స తీసుకున్న తర్వాత తన ఇంటికి వెళ్లినప్పటికీ ఒంటినొప్పులు తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం 5.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.

ఇన్నాళ్లూ ఫాంహౌస్‌ల గోల.. ఇక ఇళ్లపై గగ్గోలు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa24 Sep 2026, 10:33 AM

ఇన్నాళ్లూ ఫాంహౌస్‌ల గోల.. ఇక ఇళ్లపై గగ్గోలు?

బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి 3 ఏండ్లు అయినా 10 ఏండ్ల పాలనలో ఏం చేశారో ఇంకా కాంగ్రెస్ సోషల్ మీడియా ఎండగడుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు స్థబ్దుగా ఉన్న హస్తం హ్యాండిల్స్ అసెంబ్లీ సమావేశాల తర్వాత చాలా యాక్టివ్ అయ్యాయి. వారం రోజుల క్రితం వరకు ఊపు మీద ఉన్నబీఆర్ఎస్ సోషల్ మీడియా పోటీ పడడంలో చతికల పడుతోంది. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేల ఆస్తులను, ఇళ్లను ప్రజలకు చూపిస్తూ వాళ్లు అధికారంలో ఏమీ చేయలేదు, కేవలం ఆస్తులే సంపాదించుకున్నారనే స్థాయిలో ఎండగడుతున్నారు. సాధారణంగా అధికార పార్టీ నేతల ఇళ్లకు ప్రతిపక్ష నేతలు వెళ్లి హంగామా చేస్తారు.