స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఇన్నాళ్లూ ఫాంహౌస్‌ల గోల.. ఇక ఇళ్లపై గగ్గోలు?స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa24 Sep 2026, 10:33 AM

ఇన్నాళ్లూ ఫాంహౌస్‌ల గోల.. ఇక ఇళ్లపై గగ్గోలు?

బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి 3 ఏండ్లు అయినా 10 ఏండ్ల పాలనలో ఏం చేశారో ఇంకా కాంగ్రెస్ సోషల్ మీడియా ఎండగడుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం వరకు స్థబ్దుగా ఉన్న హస్తం హ్యాండిల్స్ అసెంబ్లీ సమావేశాల తర్వాత చాలా యాక్టివ్ అయ్యాయి. వారం రోజుల క్రితం వరకు ఊపు మీద ఉన్నబీఆర్ఎస్ సోషల్ మీడియా పోటీ పడడంలో చతికల పడుతోంది. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేల ఆస్తులను, ఇళ్లను ప్రజలకు చూపిస్తూ వాళ్లు అధికారంలో ఏమీ చేయలేదు, కేవలం ఆస్తులే సంపాదించుకున్నారనే స్థాయిలో ఎండగడుతున్నారు. సాధారణంగా అధికార పార్టీ నేతల ఇళ్లకు ప్రతిపక్ష నేతలు వెళ్లి హంగామా చేస్తారు.

నేడు థర్మల్ ప్లాంట్ల పరిశీలనకు బీఆర్ఎస్ బృందాలుతెలంగాణSwechaa24 Sep 2026, 10:31 AM

నేడు థర్మల్ ప్లాంట్ల పరిశీలనకు బీఆర్ఎస్ బృందాలు

రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్‌ల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై బీఆర్ఎస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ బృందాలు నేడు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్‌కు వెళ్లి నిజనిర్ధారణ చేయనున్నాయి. ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇందులో భాగస్వాములు కానున్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలైన తరుణంలో అటు ప్రజలు, ఇటు రైతుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నిన్న సచివాలయంలో కూడా పవర్, ఇంటర్నెట్ షట్‌డౌన్ అయినట్టు కథనాలు రావడంతో బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమైంది. నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సైతం విద్యుత్ శాఖ మీద సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. రెండు డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్!తెలంగాణSwechaa24 Sep 2026, 10:11 AM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. రెండు డీఏల చెల్లింపునకు సర్కారు గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగ కానుకగా తీపి కబురు అందించింది. ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రెండు పెండింగ్ డియర్‌నెస్ అలవెన్సులను (DA) కలిపి మొత్తం 6.4శాతం చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. అక్టోబర్ 1న జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) సమావేశంలో ఈ డీఏల పెంపునకు అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేసిన సర్కార్, కొత్త వేతన సవరణ కమిషన్ (PRC) నివేదికను ఈ నెలాఖరు నాటికి తెప్పించుకుంటామని తెలిపింది.

Birth tourism: 'బర్త్ టూరిజం'పై అమెరికా ఉక్కుపాదం.. కొత్త వీసా ఆంక్షలు!InternationalSwechaa24 Sep 2026, 09:48 AM

Birth tourism: 'బర్త్ టూరిజం'పై అమెరికా ఉక్కుపాదం.. కొత్త వీసా ఆంక్షలు!

అమెరికా పౌరసత్వం కోసం విదేశీయులు ఆ దేశానికి వెళ్లి ప్రసవించే 'బర్త్ టూరిజం' వ్యవహారంపై బైడెన్-ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర స్థాయిలో కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. విదేశీయులకు అమెరికన్ పౌరసత్వాన్ని వ్యాపారంగా మార్చి విక్రయిస్తున్న వాణిజ్య నెట్‌వర్క్‌లు, మధ్యవర్తులు, ఏజెంట్లపై కొత్త వీసా ఆంక్షలు విధించనున్నట్లు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలలోని సెక్షన్ 212(a)(3)(C) కింద ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

ఐఐటీ బీటెక్‌ ఇక ఐదేళ్లా..? విద్యార్థులకు లాభమా.. లేక మరో భారమా?NationalSwechaa24 Sep 2026, 09:42 AM

ఐఐటీ బీటెక్‌ ఇక ఐదేళ్లా..? విద్యార్థులకు లాభమా.. లేక మరో భారమా?

బీటెక్‌ ఐదేళ్లు చేయడం నిజంగా సాధ్యమేనా? అలా చేస్తే విద్యార్థులకు ప్రయోజనమా?

లేక ఒక సంవత్సరం అదనంగా చదవడం వల్ల సమయం, ఖర్చు పెరుగుతాయా? ముఖ్యంగా.. ఈ విధానం ఐఐటీలకే పరిమితమవుతుందా? లేక దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ విద్యలో ఇలాంటి మార్పులకు అవకాశం ఉందా?

TG: కుండపోత వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!తెలంగాణSwechaa24 Sep 2026, 09:01 AM

TG: కుండపోత వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

తెలంగాణలో నేడు, రేపు (గురు, శుక్రవారాలు) అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

కాంట్రాక్ట్ ఉద్యోగాలతోనే కోట్ల సంపాదన.. లక్ష్మీ భాస్కర్ కి కలిసొచ్చిన లక్కదే!తెలంగాణSwechaa24 Sep 2026, 12:11 AM

కాంట్రాక్ట్ ఉద్యోగాలతోనే కోట్ల సంపాదన.. లక్ష్మీ భాస్కర్ కి కలిసొచ్చిన లక్కదే!

ఒక ప్రభుత్వ వైద్యుడు.. నిమ్స్‌లో కీలక పరిపాలనా బాధ్యతలు.. మరి ఇంత భారీగా ఆస్తులు ఎలా వచ్చాయి? నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ నోరి లక్ష్మీ భాస్కర్‌ ఎపిసోడ్ లో వినిపిస్తున్న ప్రశ్నలివి. వైద్యం చేయాల్సిన డాక్టర్.. ప్రభుత్వ జీతంతో పనిచేసే వైద్యాధికారి.. కానీ ఇప్పుడు ఆయన ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

TG: ఇక మీ ముంగిట్లోకే ‘మీ సేవ’ సేవలు.. కొత్త సర్వీస్‌ను స్టార్ట్ చేసిన మంత్రి శ్రీధర్‌బాబు!తెలంగాణSwechaa23 Sep 2026, 10:08 PM

TG: ఇక మీ ముంగిట్లోకే ‘మీ సేవ’ సేవలు.. కొత్త సర్వీస్‌ను స్టార్ట్ చేసిన మంత్రి శ్రీధర్‌బాబు!

TG: ప్రభుత్వ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా ఆఫీసుల చుట్టూ తిరగడం, మీ సేవ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం ఇకపై గతం కానుంది. పౌర సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విప్లవానికి తెరతీసింది. సరికొత్త సాంకేతిక సంస్కరణలతో తయారు చేసిన ‘మీ సేవ డోర్ డెలివరీ’ సేవలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు లాంఛనంగా స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో దీనికి సంబంధించిన ఆధునిక పోర్టల్‌ను ఆయన ఆవిష్కరించారు.సామాన్యులకు ఎలాంటి శ్రమ లేకుండా ఇంటి ముంగిట్లోనే ప్రభుత్వ సేవలందించేందుకు సర్కార్ అత్యాధునిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది.

Fuel Price Hike: చమురు సంస్థలకు భారీ నష్టాలు.. మళ్లీ రేట్లు బాదుడేనా?తెలంగాణSwechaa23 Sep 2026, 09:50 PM

Fuel Price Hike: చమురు సంస్థలకు భారీ నష్టాలు.. మళ్లీ రేట్లు బాదుడేనా?

Fuel Price Hike: గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు నిప్పులు చెరుగుతున్నాయి. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం భారత చమురు మార్కెట్‌ను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేస్తోంది. విదేశాల్లో ముడి చమురు విలువ కొండెక్కుతున్నా, దేశంలో జనాలపై భారం మోపకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (IOCL, BPCL, HPCL) పెట్రోల్, డీజిల్ రేట్లను మార్చకుండా హోల్డ్‌లో పెట్టాయి. దీంతో ఆయా సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత ప్రభుత్వ చమురు కంపెనీలు ప్రతిరోజూ దాదాపు రూ. 530 కోట్ల మేర గట్టిగా నష్టపోతున్నాయని రేటింగ్ ఏజెన్సీ 'ఇక్రా' వెల్లడించింది.ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీల మార్జిన్లు భారీగా పడిపోయాయి. ఇక్రా తాజా నివేదిక ప్రకారం నష్టాల లెక్కలు ఇలా ఉన్నాయి. లీటరు పెట్రోల్ అమ్మకంపై కంపెనీలకు సుమారు రూ. 8 వరకు నష్టం వస్తోంది. లీటరు డీజిల్ అమ్మకంపై ఏకంగా రూ. 9 దాకా కోత పడుతోంది. ఇళ్లలో వాడే ఒక్కో ఎల్‌పీజీ సిలిండర్‌పై సంస్థలకు దాదాపు రూ. 300 వరకు భారం పడుతోంది.

రిమ్స్‌ ఘటన.. సీఎం రేవంత్ రూ.50లక్షలు ఫైన్ కట్టాలితెలంగాణSwechaa23 Sep 2026, 09:10 PM

రిమ్స్‌ ఘటన.. సీఎం రేవంత్ రూ.50లక్షలు ఫైన్ కట్టాలి

Kavitha: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యలేనని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే రోజులు కూడా నిండని పసిపిల్లలు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న జిల్లాలో ఇంత హృదయ విదాకరమైన సంఘటన జరిగితే వచ్చి చూసే తీరిక లేదా అని ప్రశ్నించారు.

ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు ముఖ్యమంత్రికి సమయం ఉంది గానీ మైనార్టీ, ఆదివాసీ చిన్నారులు చనిపోతే వచ్చి చూసే తీరిక లేకుండా పోయిందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగిన ఎస్ఎన్ సీయూను బుధవారం కల్వకుంట్ల కవిత పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును హాస్పిటల్ సిబ్బందిని, చిన్నారుల తల్లిదండ్రులు, బంధువులను అడిగి తెలుసుకున్నారు.

TG: పాలమూరు రైతులను ఎండబెట్టి ఏపీకి నీళ్లా.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్తెలంగాణSwechaa23 Sep 2026, 08:48 PM

TG: పాలమూరు రైతులను ఎండబెట్టి ఏపీకి నీళ్లా.. సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్

TG: తెలంగాణలో తీవ్రమవుతున్న సాగునీటి కొరత, కరువు పరిస్థితులపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు కాంగ్రెస్ పాలనపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దుస్థితి ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, రేవంత్ రెడ్డి అసమర్థ పరిపాలన ఫలితంగా తలెత్తిన మానవ తప్పిదమేనని స్పష్టం చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.శ్రీశైలం జలాశయంలో తగినంత నీరు నిల్వ ఉన్నప్పటికీ తెలంగాణ ఆయకట్టుకు ఎందుకు విడుదల చేయడం లేదని హరీశ్ రావు ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో రైతులకు క్రాప్‌ హాలిడేతెలంగాణSwechaa23 Sep 2026, 08:43 PM

కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో రైతులకు క్రాప్‌ హాలిడే

Harish Rao: కాంగ్రెస్‌ ప్రభుత్వం చేతగానితనంతో రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితి వచ్చిందన్నారు. శ్రీశైలంలో నీరు అందుబాటులో ఉన్నప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి స్థాయిలో నీటిని ఎత్తిపోసుకోవడం లేదని విమర్శించారు.

జూరాలకు నీటి విడుదలపై కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి సమీక్షతెలంగాణSwechaa23 Sep 2026, 07:52 PM

జూరాలకు నీటి విడుదలపై కర్నాటక నీటిపారుదల శాఖ మంత్రి సమీక్ష

Jurala Water: జూరాలకు నీటి విడుదలకు సంబంధించి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. నీటి విడుదలకు కర్ణాటక సీఎం డీకే శివకుమార్ అంగీకరించారు. ఈ నేపథ్యంలో కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, మెగా రెడ్డి, మధుసూదన్ రెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు. బెంగళూరులోని కర్ణాటక రాష్ట్ర సచివాలయం ఇందుకు వేదికైంది.

BJP: తెలంగాణ బీజేపీ బాధ్యతలు సునీల్ భన్సల్‌కు.. తెరవెనక బెంగాల్‌ వ్యూహం?తెలంగాణSwechaa23 Sep 2026, 07:36 PM

BJP: తెలంగాణ బీజేపీ బాధ్యతలు సునీల్ భన్సల్‌కు.. తెరవెనక బెంగాల్‌ వ్యూహం?

BJP: దక్షిణాదిలో అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అధిష్ఠానం, తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలకు తెరలేపింది. ఎన్నికల వ్యూహాలను అమలు చేయడంలో అపర చాణక్యుడిగా పేరుగాంచిన పార్టీ సీనియర్ నేత సునీల్ భన్సల్‌కు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించడం వెనుక ఢిల్లీ పెద్దల భారీ వ్యూహం దాగి ఉందనే చర్చ స్టార్ట్ అయ్యింది. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు ఉనికి లేని స్థితి నుంచి పార్టీని విజయతీరాలకు చేర్చి, సంచలన ఫలితాలు రాబట్టిన భన్సల్ అనుభవాన్ని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉపయోగించుకునేందుకు కమలనాథులు రెడీ అయ్యారు.రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ అగ్రనాయకత్వం పక్కాగా ఫిక్స్ అయింది. గతంలో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అధికార పార్టీకి చమటలు పట్టించి, గ్రౌండ్ లెవల్‌లో పార్టీ కేడర్‌ను ఎన్నికల యంత్రంలా మార్చడంలో సునీల్ భన్సల్ అనుసరించిన శైలి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.

2 డీఏలు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్తెలంగాణSwechaa23 Sep 2026, 07:10 PM

2 డీఏలు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్

Telangana Govt: తెలంగాణ సీఎస్‌ సంజయ్ జాజుతో ఉద్యోగ సంఘాల చర్చలు ఫలించాయి. రెండు డీఏలు ఇచ్చేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వచ్చే క్యాబినెట్ భేటీలో డీఏలకు ఆమోదం తెలిపే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎస్‌తో చర్చల తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. సీఎస్‌తో భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు తెలియజేశారు.

TG: 25న హైదరాబాద్ లో స్కూళ్లకు సెలవుతెలంగాణSwechaa23 Sep 2026, 06:37 PM

TG: 25న హైదరాబాద్ లో స్కూళ్లకు సెలవు

TG: మహానగరంలో అత్యంత వైభవంగా జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి రంగం సిద్ధమైంది. వేలాదిగా తరలివచ్చే గణనాథుల శోభాయాత్ర, నిమజ్జన వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు జనరల్ హాలిడే ప్రకటిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సెలవుకు బదులుగా భవిష్యత్తులో ఒక రెండో శనివారం సెలవును రద్దు చేసి వర్కింగ్ డేగా మార్చారు. వినాయక నిమజ్జనం రోజున నగరంలో భారీ ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు, జనసందోహం ఉండనున్న నేపథ్యంలో ప్రజలకు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెప్టెంబర్ 25న పూర్తిస్థాయిలో సెలవు వర్తిస్తుంది. బ్యాంకులు, విద్యాసంస్థలు, ప్రభుత్వ విభాగాలు ఆ రోజున మూతపడనున్నాయి.

TG : వర్షాలపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డితెలంగాణSwechaa23 Sep 2026, 06:05 PM

TG : వర్షాలపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి : పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

TG : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న రెండు రోజుల్లో కనీవినీ ఎరుగని రీతిలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తం అయ్యింది. రాబోయే 48 గంటలు అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ప్రభుత్వం అప్రమత్తం చేసింది.రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయి పరిస్థితులపై అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల ముప్పు ఎక్కువగా పొంచి ఉన్న పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, యంత్రాంగాన్ని అత్యంత అప్రమత్తంగా ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు సహాయక చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్, కమీషన్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్తెలంగాణSwechaa23 Sep 2026, 05:48 PM

వాటర్‌ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్, కమీషన్ మేనేజ్‌మెంట్‌లో సక్సెస్

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. వాటర్ మేనేజ్‌మెంట్‌లో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు. కమీషన్ మేనేజ్‌మెంట్‌లో మాత్రం సక్సెస్ అయ్యిందని విమర్శలు చేశారు. 30శాతం కమీషన్ మేనేజ్ మెంట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరితేరిందని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ కు తెలిసింది రెండే.. 30శాతం కమీషన్లు తీసుకోవడం లేదా ప్రతిపక్షాల మీద కమిషన్లు వేయడం అని హరీశ్ రావు ధ్వజమెత్తారు.

BJP:  తెలంగాణకు సునీల్‌ భన్సల్‌.. రాష్ట్రాలకు కొత్త బీజేపీ ఇన్‌ఛార్జిలుతెలంగాణSwechaa23 Sep 2026, 05:30 PM

BJP: తెలంగాణకు సునీల్‌ భన్సల్‌.. రాష్ట్రాలకు కొత్త బీజేపీ ఇన్‌ఛార్జిలు

BJP: దేశవ్యాప్తంగా సంస్థాగత యంత్రాంగాన్ని పటిష్టం చేసే లక్ష్యంతో బీజేపీ నాయకత్వం కీలక కార్యాచరణను చేపట్టింది. జాతీయ కార్యవర్గ సభ్యులకు వివిధ రాష్ట్రాల బాధ్యతలు అప్పగిస్తూ కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబిన్‌ తాజాగా ప్రకటన రిలీజ్ చేశారు. దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్తగా ఇన్‌ఛార్జిలు, కో-ఇన్‌ఛార్జిల పేర్లను ఫిక్స్ చేశారు. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకులను నియమించారు.రాజకీయ వ్యూహాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత సునీల్ భన్సల్‌ను తెలంగాణ ఇన్‌ఛార్జిగా నియమిస్తూ పార్టీ అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను కూడా ఆయనకే కేటాయించారు. క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, సమన్వయంపై దృష్టి సారించే క్రమంలో భన్సల్ అనుభవం రెండు రాష్ట్రాల్లో కీలకంగా మారనుంది.

కర్ణాటక సీఎంకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలుతెలంగాణSwechaa23 Sep 2026, 04:52 PM

కర్ణాటక సీఎంకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

Cm Revanth Reddy: తెలంగాణకు కృష్ణా జలాల విడుదల విషయంలో కర్ణాటక నుంచి సానుకూల స్పందన లభించింది. తెలంగాణకు కృష్ణా జలాలను విడుదల చేయాలన్న విజ్ఞప్తిని కర్ణాటక ప్రభుత్వం అంగీకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల తరఫున కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య స్నేహ భావానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని అన్నారు.

కర్ణాటక, తెలంగాణ ప్రజల మధ్య ఉన్న సోదర భావానికి కృష్ణా జలాల విడుదలే నిదర్శనం అన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం కర్ణాటక అందించిన సహకారానికి ధన్యవాదాలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజల మధ్య ప్రేమ, సోదర భావాన్ని చాటేలా కృష్ణా జలాల నిర్ణయం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ పాలిటిక్స్‌.. డ్యామేజ్ కంట్రోల్ కోసమేనా?తెలంగాణSwechaa23 Sep 2026, 04:21 PM

బీఆర్ఎస్ మళ్లీ నీళ్ల సెంటిమెంట్ పాలిటిక్స్‌.. డ్యామేజ్ కంట్రోల్ కోసమేనా?

TG: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘సెంటిమెంట్’ అస్త్రం తెరపైకి వచ్చింది. ఉద్యమ కాలం నుంచి పార్టీని నడిపించిన ప్రధాన భావోద్వేగాలను గులాబీ దళం మళ్లీ రాజేసే పనిలో పడినట్లు కనిపిస్తుంది. అయితే ఈసారి ఈ అంశం తెరపైకి రావడం వెనుక కేవలం ప్రజా సమస్యలే కారణమా? లేక వరుస ఆరోపణలతో ఇరుకున పడ్డ పార్టీని గట్టెక్కించే సరికొత్త డ్యామేజ్ కంట్రోల్ వ్యూహమా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున సాగుతోంది.గత కొద్ది రోజులుగా రాజధాని శివార్లలోని చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధుల్లో అక్రమ నిర్మాణాలు, ఫామ్‌హౌస్‌ల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. అధికార కాంగ్రెస్‌తో పాటు క్షేత్రస్థాయి యంత్రాంగం దూకుడు పెంచడంతో గులాబీ కీలక నేతలపై భూ కబ్జా ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి.

Tollywood-RC 17: అక్టోబర్ 20న RC17 గ్రాండ్ ఓపెనింగ్.. చరణ్–సుక్కు కాంబోపై భారీ అంచనాలు!సినిమాSwechaa23 Sep 2026, 03:26 PM

Tollywood-RC 17: అక్టోబర్ 20న RC17 గ్రాండ్ ఓపెనింగ్.. చరణ్–సుక్కు కాంబోపై భారీ అంచనాలు!

Tollywood: టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి కలిలి చేయబోతున్న ఆర్సీ17పై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో.. ఇప్పుడు ఆర్సీ17పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

brazil : 16 మందిని చంపిన ‘దోమ’.. దట్టమైన అడవుల్లో దూరి!క్రైమ్Swechaa23 Sep 2026, 03:22 PM

brazil : 16 మందిని చంపిన ‘దోమ’.. దట్టమైన అడవుల్లో దూరి!

16 మందిని దారుణంగా హత్యచేసిన ‘దోమ’ ఎట్టకేలకు చిక్కాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దోమ అంటే రక్తం పీలుస్తుంది కదా? అంతమందిని ఎలా చంపిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. ఇక్కడ దోమ అంటే రక్తం పీల్చే కీటకం కాదు. దోమ అంటే మనిషే..బ్రెజిల్‌లో వరుస హత్యలకు కారణం ఈ సీరియల్ కిల్లర్ జోర్లాన్ లోప్స్ డా సిల్వా (33). నిందితుడు హత్యచేశాక పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు అడవుల్లో గుడారాలు వేసుకుని తలదాచుకున్నట్టు తేలింది. సన్నని దేహదారుడ్యం కలిగి ఉన్నందునే అందరూ అతన్ని మస్కిటో (దోమ) అని పిలిచేవారు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..బ్రెజిల్‌లోని పరైబా రాష్ట్రంలో ఉండే జొర్లాన్ మారుమూల ప్రాంతాల్లో వరుస హత్యలకు పాల్పడినట్టు సమాచారం. గత మూడు నెలల్లో 16 మందిని అత్యంత దారుణంగా హతమార్చినట్టు అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకరిని చంపేసిన వెంటనే దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కోవడం అతనికి అలవాటు.

సచివాలయంలో ఇంటర్నెట్ డౌన్.. స్తంభించిన ప్రభుత్వ కీలక కార్యకలాపాలు!తెలంగాణSwechaa23 Sep 2026, 03:11 PM

సచివాలయంలో ఇంటర్నెట్ డౌన్.. స్తంభించిన ప్రభుత్వ కీలక కార్యకలాపాలు!

 తెలంగాణ రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం సాంకేతిక లోపం కారణంగా ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీని ప్రభావంతో సచివాలయ ప్రాంగణంలోని పలు కీలక శాఖల రోజువారీ పాలనా వ్యవహారాలు, పౌర సేవలు తీవ్రంగా స్తంభించిపోయాయి. సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు, ఉద్యోగులు సేవలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  సచివాలయంలోని మీడియా సెంటర్, పబ్లిసిటీ సెల్, ఎన్ఆర్ఐ (NRI) అసిస్టెన్స్ సెల్ వంటి ప్రాధాన్యత కలిగిన విభాగాల్లోనూ నెట్‌వర్క్ సేవలు నిలిచిపోవడంతో సమాచార వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.

Srikanth Odela-Sarvapindi: ది ప్యారడైజ్ ఇంటర్వెల్‌లో ‘సర్వపిండి’.. ఆ సీన్ ఎందుకంత స్పెషల్?సినిమాSwechaa23 Sep 2026, 03:02 PM

Srikanth Odela-Sarvapindi: ది ప్యారడైజ్ ఇంటర్వెల్‌లో ‘సర్వపిండి’.. ఆ సీన్ ఎందుకంత స్పెషల్?

Srikanth Odela: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త తరహా కథ, డిఫరెంట్ వరల్డ్, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో కథతో పాటు మన తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించే కొన్ని ప్రత్యేకమైన అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

KTR: తెలంగాణలో మళ్లీ 1980ల నాటి కరెంట్ కోతలు.. కేటీఆర్ ఘాటు విమర్శలు!తెలంగాణSwechaa23 Sep 2026, 02:59 PM

KTR: తెలంగాణలో మళ్లీ 1980ల నాటి కరెంట్ కోతలు.. కేటీఆర్ ఘాటు విమర్శలు!

 సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల నాటి ట్రెండ్ నడుస్తోందని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నాటి రోజుల్లోలాగా విద్యుత్ కోతలతో రైతాంగం అల్లాడిపోతోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు’ అని తాము ఎన్నికల ముందే హెచ్చరించామని, ఈనాడు రాష్ట్రంలో అదే నిజమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ పత్రికల్లో విద్యుత్ కోతలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయని ఆరోపించారు.

Iran Crisis: దివాలా అంచున ఇరాన్‌.. 380% రేట్లు పెరిగిన నిత్యవసర సరుకులు.. ఆకలి రాజ్యంగా మారుతుందా..?ప్రపంచంSwechaa23 Sep 2026, 02:56 PM

Iran Crisis: దివాలా అంచున ఇరాన్‌.. 380% రేట్లు పెరిగిన నిత్యవసర సరుకులు.. ఆకలి రాజ్యంగా మారుతుందా..?

దశాబ్దాల పాటు చమురు సంపదతో తులతూగిన గల్ఫ్ దేశం ఇరాన్‌లో ఇప్పుడు మానవతా సంక్షోభం పరాకాష్టకు చేరింది. యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ ఆంక్షలు, స్థానిక కరెన్సీ ‘రియాల్’ పతనం అన్ని కలిపి దేశాన్ని ద్రవ్యోల్బణ విషవలయంలోకి నెట్టేశాయి. ఒకప్పుడు పెట్రో-డాలర్లతో విర్రవీగిన నేలపై.. ఇప్పుడు ప్రజలు పూట గడవడం కోసం తీవ్రంగా పోరాడాల్సి వస్తోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో సాధారణ మధ్యతరగతి కుటుంబాలు సైతం దారిద్య్రరేఖకు దిగువకు జారుకుంటున్నాయి.

సాధువు ముసుగులో మృగం.. ఒంటరి మహిళలకు దగ్గరై!క్రైమ్Swechaa23 Sep 2026, 02:30 PM

సాధువు ముసుగులో మృగం.. ఒంటరి మహిళలకు దగ్గరై!

ఆధ్యాత్మికత అనే ముసుగులో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.అవతలి వ్యక్తుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు.అనంతరం వారికి దగ్గరై లోబరుచుకుంటున్నారు. అంతేకాకుండా వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నా జనాలు ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు. . తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇలాంటి ఘటనలకు అద్దం పడుతోంది. వివరాల్లోకివెళితే.. ఆధ్యాత్మికత పేరుతో మహిళలకు దగ్గరై.. వందలాది మందిని హిమ్మత్ గిరి అలియాస్ హేమంత్ రాజ్ అనే సాధువు వలలో వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మహిళలతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి వేధించినట్టు తెలిసింది. ముఖ్యంగా వితంతువులు, పిల్లలు లేని మహిళల్ని టార్గెట్ చేసుకొని మాయమాటలతో వారికి దగ్గరై లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం.

చంద్రబాబు ఘోరంగా మోసం చేశాడు.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్!ఏపీSwechaa23 Sep 2026, 02:29 PM

చంద్రబాబు ఘోరంగా మోసం చేశాడు.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్!

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లాలో జరిగిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ఘోరంగా మోసం చేశాడంటూ విమర్శించారు.

The Paradise-Advance Booking: అడ్వాన్స్ సేల్స్‌తోనే దుమ్ము రేపుతున్న నేచురల్ స్టార్..!సినిమాSwechaa23 Sep 2026, 02:24 PM

The Paradise-Advance Booking: అడ్వాన్స్ సేల్స్‌తోనే దుమ్ము రేపుతున్న నేచురల్ స్టార్..!

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, దసరా ఫేమ్మ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదిరిపోయే స్పందన లభిస్తోంది.