స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

The Paradise-Advance Booking: అడ్వాన్స్ సేల్స్‌తోనే దుమ్ము రేపుతున్న నేచురల్ స్టార్..!సినిమాSwechaa23 Sep 2026, 02:24 PM

The Paradise-Advance Booking: అడ్వాన్స్ సేల్స్‌తోనే దుమ్ము రేపుతున్న నేచురల్ స్టార్..!

The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, దసరా ఫేమ్మ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదిరిపోయే స్పందన లభిస్తోంది.

రేవంత్ రెడ్డి నీకు నెల రోజులే టైం : టీఆర్ఎస్ చీఫ్ కవితతెలంగాణSwechaa23 Sep 2026, 02:05 PM

రేవంత్ రెడ్డి నీకు నెల రోజులే టైం : టీఆర్ఎస్ చీఫ్ కవిత

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదిలాబాద్ రిమ్స్ ఘటన మీద బుధవారం ఆమె స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆదిలాబాద్ రిమ్స్‌లో కరెంట్ షార్ట్‌ సర్క్యూట్, ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మరణించారని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఆదిలాబాద్ సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్‍లో చికిత్స పొందుతున్న ‘రిమ్స్’ ఎస్ఎన్‍సీయూ అగ్ని ప్రమాద ప్రమాద బాధిత శిశువుల తల్లిదండ్రులను కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో టీఆర్ఎస్ చీఫ్ కవిత మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని సీఎం రేవంత్ చెప్పారని, ఆయన దత్తత తీసుకున్న జిల్లాలో 5 మంది పసి పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా? అని ప్రశ్నించారు. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు మాత్రమే సీఎంకు టైం ఉంటుందన్నారు. మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూడటానికి టైం లేదా? అని నిలదీశారు.

TG: ఉదయం 9.30లోపే బ్రేక్‌ఫాస్ట్, పాలు.. విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు!తెలంగాణSwechaa23 Sep 2026, 01:43 PM

TG: ఉదయం 9.30లోపే బ్రేక్‌ఫాస్ట్, పాలు.. విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అల్పాహార పథకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు సరఫరా చేసే అల్పాహారం, పాలు పంపిణీ చేసిన తర్వాత, విద్యార్థులందరూ విధిగా ఉదయం 9:30 గంటల లోపే తమ టిఫిన్ తినడం, పాలు తాగే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సమయపాలన పాటిస్తూ విద్యాబోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

క్యాబ్ ఎక్కుతుండగా అమానుషం.. మహిళా టెకీని లాగి ముద్దుపెట్టిన సెక్యూరిటీక్రైమ్Swechaa23 Sep 2026, 01:22 PM

క్యాబ్ ఎక్కుతుండగా అమానుషం.. మహిళా టెకీని లాగి ముద్దుపెట్టిన సెక్యూరిటీ

ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, యువతులకు వేధింపులు ఆగడం లేదు. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఏదో ఒక రూపంలో వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు కామాంధులు కావాలనే ప్లాన్ ప్రకారం వారి మీద దాడులు చేయడం, లైంగికంగా వేధించడం వంటివి చేస్తున్నట్టు తెలుస్తోంది. బస్సులో, ఆఫీసులో, జనసముదాయంలోనూ ఏదో రకంగా అతివలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. బాడీషేమింగ్ చేయడం,అక్కడ ఇక్కడ టచ్ చేయడం వంటివి చేస్తున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఉద్యోగానికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఓ సెక్యూరిటీ గార్డు పక్కకు లాగి ముద్దు పెట్టినట్టు సమాచారం. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని పీజీ హాస్టల్‌లో ఉంటూ ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్నది.ఇవాళ ఉదయం విధులకు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతున్న యువతిని ఓ వ్యక్తి అకస్మాత్తుగా పక్కకు లాగి ముద్దు పెట్టాడు.

Jaipur: ఘోర అగ్నిప్రమాదం.. రూ.కోట్ల విలువ చేసే 8 లగ్జరీ కార్లు దగ్ధం!క్రైమ్Swechaa23 Sep 2026, 01:19 PM

Jaipur: ఘోర అగ్నిప్రమాదం.. రూ.కోట్ల విలువ చేసే 8 లగ్జరీ కార్లు దగ్ధం!

 రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ మార్కెట్‌లో ఉన్న ప్రముఖ మెర్సిడెస్(Mercedes) కార్ల వర్క్‌షాప్‌(Car workshop)లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు వర్క్‌షాప్ నలువైపులా వేగంగా విస్తరించడంతో దాదాపు 8 ఖరీదైన లగ్జరీ కార్లు, విలువైన విడిభాగాలు మరియు యాక్సెసరీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అగ్నిప్రమాద తీవ్రతకు దట్టమైన పొగలు సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.  

కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టిలేపిన రైతులకు ధన్యవాదాలు : కేటీఆర్తెలంగాణSwechaa23 Sep 2026, 12:47 PM

కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టిలేపిన రైతులకు ధన్యవాదాలు : కేటీఆర్

జూరాల నుంచి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకపోవడంతో కొన్నిరోజులుగా అన్నదాతలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏకంగా జూరాల ప్రాజెక్టు ఎంట్రీ గేటు బద్దలు గొట్టి మరీ రైతులే నీటిని విడుదల చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం పోలీసు పహారాతో రైతులను మరోసారి ప్రాజెక్టు వద్దకు రాకుండా అడ్డుకున్నది. అయితే, గత రెండ్రోజులుగా అన్నదాతల కోసం అటు బీఆర్ఎస్,ఇటు బీజేపీ పార్టీల నేతలు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని ఆందోళనలు నిర్వహించారు. తాజాగా సర్కార్ ఆయకట్టుకోసం జూరాల కుడి, ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేసింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరపోస్టు పెట్టారు. ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప!’ అంటూ రాసుకొచ్చారు. హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన అన్నదాతల పోరాట పటిమను మాజీమంత్రి కొనియాడారు.ప్రాజెక్టు నుంచి నీరు అందక పొలాలు పూర్తిగా ఎండిపోతున్న విపత్కర పరిస్థితుల్లో రైతులు చేసిన సాహసోపేతమైన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమన్నారు.

రూ.10 వేల కోసం మొండికేశాడు.. రూ.24 కోట్ల భారీ నష్టం!క్రైమ్Swechaa23 Sep 2026, 12:23 PM

రూ.10 వేల కోసం మొండికేశాడు.. రూ.24 కోట్ల భారీ నష్టం!

కొందరు వ్యాపారులు చేసే చిన్న చిన్న తప్పిదాలు ఏకంగా రూ. కోట్ల నష్టానికి దారి తీసేలా చేస్తుంటాయి. అది వ్యాపారంలో తీసుకునే సలహా విషయంలో కావొచ్చు లేదా తమ కింద పనిచేసే వారితో వ్యవహరించే విధానం వల్లైనా కావొచ్చు.వ్యాపారంలో లాభం రావాలన్నా, నష్టం రావాలన్నా ఓనర్లు కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అందరితో నమ్మకంగా వ్యవహరించాలి. ఉద్యోగుల జీతం విషయంలో ఆలస్యం చేయకూడదు. తమ కింద పనిచేసేవారి పట్ల చిన్న చూపు పనికిరాదు. కాగా, ఓ ఉద్యోగికి చెల్లించాల్సిన వేతనం విషయంలో ఆలస్యం కారణంగా ఓ యజమాని భారీగా నష్టపోయాడు. రూ.10వేలు జీతం చెల్లించడం లేదని ఏకంగా షాపులకు నిప్పుపెట్టాడు. ఈ ఘటన గుజరాత్ లోని సూరత్‌లో వెలుగుచూసింది.

ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట.. మరో మూడు కాంస్యాలు సొంతం!క్రీడలుSwechaa23 Sep 2026, 12:09 PM

ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట.. మరో మూడు కాంస్యాలు సొంతం!

 జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. పోటీల్లో భారత్ తాజాగా మొత్తంగా మూడు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. షూటింగ్‌లోని స్కీట్ విభాగానికి చెందిన పురుషుల, మహిళల జట్లు చెరో కాంస్యం సాధించగా, సాఫ్ట్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు చారిత్రక కాంస్య పతకం లభించింది. దీంతో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య తొమ్మిదికి చేరగా, అందులో ఏడు పతకాలు ఒక్క షూటింగ్ విభాగం నుంచే రావడం విశేషం.

జీతం ప్రభుత్వానిది, ఆస్తులు కోట్లలో! సర్కారీ వ్యవస్థల్లో లక్కీ భాస్కర్లుతెలంగాణSwechaa23 Sep 2026, 12:02 PM

జీతం ప్రభుత్వానిది, ఆస్తులు కోట్లలో! సర్కారీ వ్యవస్థల్లో లక్కీ భాస్కర్లు

ప్రభుత్వ జీతం.. ప్రైవేట్‌ సామ్రాజ్యం. లగ్జరీ కార్లు.. లెక్కలేనన్ని ప్లాట్లు.. కళ్లు చెదిరేలా ఫ్లాట్లు.. ఒంటినిండా బంగారం.. కోట్లలో బ్యాంకు బ్యాలెన్స్. ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఇదే గుర్తురావాలా..? ఏమో ఈ మధ్య ఏసీబీ పట్టుకుంటున్న అధికారుల ఆస్తుల చిట్టా చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

జూరాలకు జలకళ.. కర్ణాటక హామీతో సాగుకోసం నీటి విడుదలతెలంగాణSwechaa23 Sep 2026, 12:01 PM

జూరాలకు జలకళ.. కర్ణాటక హామీతో సాగుకోసం నీటి విడుదల

గత వారం రోజులుగా జూరాల ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయి.ఈ క్రమంలోనే రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాలు, రాస్తారోకోలు, డ్యాం ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు.దీంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాగు కోసం నీటి విడుదల చేసేందుకు అంగీకరించింది.ఈ మేరకు కర్ణాటక సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపి 7 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదం పొందింది.నెల రోజులపాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో జూరాల నుంచి సాగునీటి విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.దీంతో ఇవాళ ఉదయం జూరాల కుడి,ఎడమ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు.

Tollywood-Vijay: రణబాలి షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ‘రౌడీ జనార్ధన’ సెట్స్ కి రెడీ!సినిమాSwechaa23 Sep 2026, 11:39 AM

Tollywood-Vijay: రణబాలి షూటింగ్ పూర్తి.. నెక్స్ట్ ‘రౌడీ జనార్ధన’ సెట్స్ కి రెడీ!

Tollywood: యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమాతో పాటు మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా ఫోకస్ పెట్టారు విజయ్.‘రణబాలి’ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు షిఫ్ట్ కాబోతున్నాడు.

ACB : లక్ష్మీభాస్కర్‌కు 14 రోజుల రిమాండ్తెలంగాణSwechaa23 Sep 2026, 11:35 AM

ACB : లక్ష్మీభాస్కర్‌కు 14 రోజుల రిమాండ్

ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ ఇళ్లు, కార్యాలయం, బంధువులు, బినామీల ఇండ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఆయనకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం లక్ష్మీ భాస్కర్‌ను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఏసీబీ సమర్పించిన ఆధారాలు పరిశీలించిన నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం భద్రతా సిబ్బంది ఆయనను నగరంలోని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. నిమ్స్ ఉన్నతాధికారి హోదాను అడ్డం పెట్టుకుని భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది.

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. పక్కింటి వ్యక్తిపై తల్లి అనుమానాలు!క్రైమ్Swechaa23 Sep 2026, 11:20 AM

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. పక్కింటి వ్యక్తిపై తల్లి అనుమానాలు!

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇంద్రవెల్లి హరిణి (18) అనే విద్యార్థిని స్వగ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సెలవుల నేపథ్యంలో ఇటీవలే గ్రామానికి వచ్చిన సదరు యువతి, తన ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక భాగంలో మృతదేహమై కనిపిచడం తీవ్ర కలకలం రేపింది.

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయవిచారణ జరపాలి : సీపీఎంఏపీSwechaa23 Sep 2026, 11:05 AM

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయవిచారణ జరపాలి : సీపీఎం

ఏపీలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నియామకాల్లో అసలైన అర్హులకు న్యాయం జరగలేదని, కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. ఈ మేరకు వైసీపీ నేతలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.దీనికి బదులుగా తెలుగుదేశం పార్టీ నేతలు సైతం వైసీపీ ఆందోళనలను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. విజయవాడలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. కాగా, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలని తాజాగా సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘డీఎస్సీ అక్రమాలపై నిరసనకు దిగిన వైసీపీ కార్యకర్తలు/ నిరుద్యోగులపై లాఠీచార్జీని ఖండిస్తున్నాం.తమ సమస్యలపై నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పార్టీలు, సంఘాలు, సంస్థల ప్రాథమిక హక్కు.హక్కును నిరాకరించడం అప్రజాస్వామికం’ అని పేర్కొంది.

AdaniGroup: అదానీ గ్రూప్‌నకు ఊరట.. రూ.1.5 కోట్లతో సెటిల్‌మెంట్!వ్యాపారంSwechaa23 Sep 2026, 10:50 AM

AdaniGroup: అదానీ గ్రూప్‌నకు ఊరట.. రూ.1.5 కోట్లతో సెటిల్‌మెంట్!

 అమెరికా హెడ్జ్‌ఫండ్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక ఆధారంగా నమోదైన కేసుల విచారణ నుంచి అదానీ గ్రూప్‌కు గణనీయమైన ఉపశమనం లభించింది. సంబంధిత పార్టీల లావాదేవీలు (RPT), కార్పొరేట్ గవర్నెన్స్ మార్గదర్శకాల అతిక్రమణపై మార్కెట్ నియంత్రణ సంస్థ 'సెబీ' (SEBI) చేపట్టిన న్యాయపరమైన చర్యలను ఐదు అదానీ గ్రూప్ కంపెనీలు రూ.1.5 కోట్ల మొత్తం చెల్లించి సెటిల్ చేసుకున్నాయి. సెబీ నిబంధనల ప్రకారం ఎలాంటి తప్పునూ ఒప్పుకోకుండా, లేదా తిరస్కరించకుండా ప్రక్రియను ముగించే 'సెటిల్‌మెంట్ మెకానిజం' ద్వారా ఈ కేసుకు స్వస్తి పలికారు.

భారత్ చారిత్రక ఘనత.. టీ20ల్లో 200 విజయాలు..!క్రీడలుSwechaa23 Sep 2026, 10:18 AM

భారత్ చారిత్రక ఘనత.. టీ20ల్లో 200 విజయాలు..!

పొట్టి ఫార్మాట్ టీ20 క్రికెట్‌లో భారత జట్టు సరికొత్త మైలురాయిని చేరుకుంటూ చారిత్రక రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే 200 విజయాలు సాధించిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా టీమిండియా నిలిచింది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో తీవ్ర ఉత్కంఠ నడుమ విజయం సాధించడం ద్వారా భారత్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలో ఏ ఇతర అంతర్జాతీయ లేదా ఫ్రాంచైజీ జట్టు సాధించని రికార్డును భారత్ నమోదు చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

pm modi: డిసెంబర్‌లో అమెరికాకు ప్రధాని మోదీ.. జీ20 వేదికగా ట్రంప్‌తో కీలక భేటీ!InternationalSwechaa23 Sep 2026, 09:55 AM

pm modi: డిసెంబర్‌లో అమెరికాకు ప్రధాని మోదీ.. జీ20 వేదికగా ట్రంప్‌తో కీలక భేటీ!

ప్రధాని మోదీ ఈఏడాది డిసెంబర్‌లో అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్లోరిడాలోని డొరల్‌ వేదికగా డిసెంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆత్మీయంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సును 2009 తర్వాత దాదాపు 17సంవత్సరాల విరామం అనంతరం అమెరికా తిరిగి నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఈ సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది.

Nani-CM: తెలంగాణ సీఎం కి నాని రిక్వెస్ట్..!సినిమాSwechaa23 Sep 2026, 09:48 AM

Nani-CM: తెలంగాణ సీఎం కి నాని రిక్వెస్ట్..!

Nani: నేచురల్ స్టార్ నాని మరోసారి తన అభిమానులపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి థియేటర్‌లో కూర్చొని చూడాలని ఉందని, అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వాలని నాని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో 23నే పేయిడ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ షోను నానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమనౌలతో కలిసి చూడాలనే కోరికను తెలిపాడు.

ఓయోలో యువతి అనుమానాస్పద మృతి..వెలుగులోకి షాకింగ్ నిజాలుక్రైమ్Swechaa23 Sep 2026, 09:35 AM

ఓయోలో యువతి అనుమానాస్పద మృతి..వెలుగులోకి షాకింగ్ నిజాలు

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి వైజాగ్‌కు చెందిన యువతి షారన్ నిఖిత టోప్నో (23) నగరానికి వచ్చింది. వీరిద్దరూ మాదాపూర్ సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్-5లోని ఓయో హోటల్ రూమ్ నం.303లో దిగారు.అయితే, అర్ధరాత్రి తన ప్రియురాలు అస్వస్థతకు గురైందని హోటల్ మేనేజర్‌కు ప్రియుడు సమాచారం ఇచ్చాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు యువతి మృతిపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.మాదాపూర్ ఓయో రూమ్‌లో బీర్, విస్కీ బాటిల్స్‌ పగిలినట్లు పోలీసులు గుర్తించారు. బెడ్‌తో పాటు రూమ్ గోడలపై రక్తపు మరకలు సైతం ఉన్నట్టు తేల్చారు. మృతురాలు షారన్ నిఖిత ముఖం, శరీరంపైనే కాకుండా, తల వెనుక కూడా తీవ్ర గాయాలు ఉన్నట్టు నిర్దారించారు.

పోలీస్ సిస్టమ్‌కు సుస్తీ!.. ఖాకీల లంచాలకు విసిగెత్తిపోతున్న ప్రజలు!!..తెలంగాణSwechaa23 Sep 2026, 09:21 AM

పోలీస్ సిస్టమ్‌కు సుస్తీ!.. ఖాకీల లంచాలకు విసిగెత్తిపోతున్న ప్రజలు!!..

తెలంగాణలో పోలీస్ వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతోందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. అధికారుల పర్యవేక్షణ సిస్టమ్‌ను ఓవర్ టేక్ చేసి కొనసాగుతున్న వ్యవహారమే ఇందుకు కారణంగా చెప్పుకొంటున్నారు.. ఎస్‌హెచ్‌ఓ నేరుగా డీసీపీలకు/ఎస్పీలకు లేదా సీపీలకు కనెక్టివిటీ పెంచుకోవడంతో రాష్ట్రంలో అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులు భారీగా దండుకుంటున్నారని విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఫలించిన పాలమూరు రైతాంగ పోరాటం.. జూరాల ఎడమ కాలువకు నీటి విడుదల!తెలంగాణSwechaa23 Sep 2026, 09:11 AM

ఫలించిన పాలమూరు రైతాంగ పోరాటం.. జూరాల ఎడమ కాలువకు నీటి విడుదల!

 పాలమూరు జిల్లాలోని అమరచింత, ఆత్మకూరు తదితర మండలాల ఆయకట్టు రైతుల సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. జూరాల ప్రాజెక్టు కింద సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన బాట పట్టడంతో స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు, ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. సాగునీటి కోసం రైతులు బీఆర్‌ఎస్ మద్దతుతో నిర్వహించిన విస్తృత ఆందోళనల ప్రతిఫలంగానే ప్రభుత్వం దిగివచ్చి నీటిని వదిలిందని స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

కొత్త పింఛన్ పరేషాన్.. కుమ్మక్కైన అధికారులు, లీడర్లు!తెలంగాణSwechaa23 Sep 2026, 09:06 AM

కొత్త పింఛన్ పరేషాన్.. కుమ్మక్కైన అధికారులు, లీడర్లు!

రాష్ట్రంలో కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు ‘దసరా’లోపు ఇస్తామని నిన్న మంత్రి సీతక్క శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం అర్హులు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. కొందరు అధికారులు, లీడర్ల కుమ్మక్కై నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అత్యంత పారదర్శకంగా వెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో వెరిఫికేషన్ కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.కేవలం దరఖాస్తుదారులనే కాకుండా ఇరుగుపొరుగు వారిని సైతం అడిగి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తులు ఇచ్చిన సమాచారం తప్పా? ఒప్పా? అని అడిగి మరీ ఎంట్రీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, వెరిఫికేషన్ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలు విని కొత్త పింఛన్ దరఖాస్తుదారులు షాక్ అవుతున్నట్టు సమాచారం.

Kayadu Lohar-Dubbing Issue: తెలంగాణ యాస..కయాదు ఇలా అనేసిందేంటి?సినిమాSwechaa23 Sep 2026, 09:05 AM

Kayadu Lohar-Dubbing Issue: తెలంగాణ యాస..కయాదు ఇలా అనేసిందేంటి?

Kayadu Lohar: తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్లు తమ పాత్రలకు తగ్గట్టుగా భాష, యాస నేర్చుకోవడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాల్లో అక్కడి నేటివిటీని పర్ఫెక్ట్‌గా చూపించేందుకు నటీనటులు ప్రత్యేకంగా యాసపై శిక్షణ తీసుకుంటుంటారు. తాజాగా హీరోయిన్ కయాదు లోహర్ కూడా తెలంగాణ యాసలో మాట్లాడేందుకు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ఆ ఇబ్బంది తాజా చిత్రం ది ప్యారడైజ్ కోసం డబ్బింగ్ చెప్పలేక అని తెలిపింది.

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!..తెలంగాణSwechaa23 Sep 2026, 09:01 AM

గణేష్‌ నిమజ్జనం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!..

గణేష్‌ నిమజ్జనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ద.మ. రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జనం జరిగే రోజుల్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాత్రంతా 8 ప్రత్యేక ఎంఎంటీఎస్‌ రైళ్లను నడపనున్నట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 25 నుంచి 27 వరకు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు నడుస్తాయని సీపీఆర్‌వో ఎ.శ్రీధర్‌ పేర్కొన్నారు.

క్యూర్‌ చట్టం పై కొత్త చర్చ.. స్థానిక సంస్థల అధికారాల సంగతేంటి?..తెలంగాణSwechaa23 Sep 2026, 08:39 AM

క్యూర్‌ చట్టం పై కొత్త చర్చ.. స్థానిక సంస్థల అధికారాల సంగతేంటి?..

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే.. పలు వివాదాస్పదమైన నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటుంది. అందులో 22 A అంశం తెలంగాణలో బర్నింగ్ టాపిక్ మారింది. అలాగే కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) చట్టం కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూర్‌ చట్టం మున్సిపల్‌ కార్పొరేషన్ల పాలకవర్గాల అధికారాలను కుదించేలా ఉందన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పలు రాజకీయ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సీఎం అధ్యక్షతన ఏర్పాటు కానున్న అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌, అధికారులతో కూడిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ద్వారా మేయర్‌, కార్పొరేషన్‌ పాలకవర్గాల నిర్ణయాధికారాలకు పరిమితులు ఏర్పడనున్నాయి.

తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!..తెలంగాణSwechaa23 Sep 2026, 08:18 AM

తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!..

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మరింత తీవ్రం కానున్నాయి. బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల 20.4 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ముషీరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్‌లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, పోలీసు విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ నీరు నిలిచే ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

దానం రాజకీయ ప్రస్థానానికి మరో కీలక మలుపు.. ఖైరతాబాద్ ఉపఎన్నిక!!..తెలంగాణSwechaa23 Sep 2026, 07:56 AM

దానం రాజకీయ ప్రస్థానానికి మరో కీలక మలుపు.. ఖైరతాబాద్ ఉపఎన్నిక!!..

రాజకీయం అంటే పూలబాట కాదని కొందరి నేతల జీవితాలు నిరూపిస్తాయి. అందుకే రక్తం చిందించకుండా ఆడే ఆధునిక కురుక్షేత్రం రాజకీయం అంటారు పెద్దలు. ఇక్కడ పదవుల వెనుక పదునైన వ్యూహాలు ఉంటాయి. ఒక్క తప్పటడుగు పడితే అడ్రస్ లేకుండాపోయే చక్రవ్యూహం కూడా!.. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు.

ఉండేది ఒక్కటే అధికారం!.. దీనికోసమే ఎన్నో కుతంత్రాలు, విమర్శలు, మొత్తానికి ఇదొక మనుషులతో ఆడే చదరంగం. ప్రస్తుతం బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఇలాంటి పొలిటికల్ గేమ్ మొదలైందనే చర్చలు జోరందుకున్నాయి. ఎన్నో ఆశలతో దానం నాగేందర్ పదవి పొందితే.. ఆ పదవికి గండం తెచ్చింది బీఆర్ఎస్.. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నిక దానం నాగేందర్ రాజకీయ జీవితంలో మరో కీలక మలుపుగా మారబోతోందా? అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

రోజూ నల్ల శనగలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుంది?..HealthSwechaa23 Sep 2026, 07:46 AM

రోజూ నల్ల శనగలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుంది?..

మన వంటింట్లో సులభంగా దొరికే నల్ల శనగలు పోషకాల భాండాగారం. వీటిలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్, నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా సహాయపడవచ్చు. జీర్ణక్రియ మెరుగుపడటానికి, మలబద్ధకం తగ్గడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రోటీన్, ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలిగి బరువు నియంత్రణలో తోడ్పడవచ్చు. అయితే ఎక్కువగా తింటే గ్యాస్, ఉబ్బరం రావచ్చు. అందుకే నానబెట్టి, ఉడికించి పరిమితంగా తీసుకోవడం మంచిది.

Health: ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు చెక్.. యాంటీఆక్సిడెంట్లు అందించే 5 డ్రింక్స్ ఇవే!..HealthSwechaa23 Sep 2026, 07:36 AM

Health: ఆక్సిడేటివ్ స్ట్రెస్‌కు చెక్.. యాంటీఆక్సిడెంట్లు అందించే 5 డ్రింక్స్ ఇవే!..

మన శరీరంలో ప్రతి రోజూ సహజంగానే కొన్ని రియాక్టివ్ ఆక్సిజన్ పదార్థాలు ఏర్పడుతుంటాయి. వీటి ఉత్పత్తి వల్ల శరీరంలోని రక్షణ వ్యవస్థ మధ్య సమతుల్యత దెబ్బతింటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగవచ్చు. కాలుష్యం, పొగతాగడం, అనారోగ్యకరమైన ఆహారం, అధిక ఒత్తిడి వంటి అంశాలు కూడా దీనికి తోడ్పడవచ్చు. ఈ నేపథ్యంలో యాంటీఆక్సిడెంట్, పాలీఫెనాల్ సమృద్ధిగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఉపయోగకరంగా ఉంటుంది.

పురుషులే పిండప్రదానం చేయాలా?..SpiritualitySwechaa23 Sep 2026, 07:21 AM

పురుషులే పిండప్రదానం చేయాలా?..

పితృదేవతలను స్మరించుకోవడం అంటే మనకు జన్మనిచ్చిన వంశపారంపర్యానికి కృతజ్ఞత చెప్పడం. అందుకే సనాతన ధర్మంలో శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే పిండప్రదానం విషయంలో మహిళలకు అధికారం ఉందా అనే సందేహం చాలాకాలంగా ఉంది. సాధారణంగా పురుషులే ఈ కర్మలను నిర్వహించడం కనిపించడంతో.. మహిళలు చేయకూడదనే భావన ఏర్పడింది. గరుడ పురాణంలోని కొన్ని సందర్భాల్లో కుమారుడు లేని పరిస్థితుల్లో భార్య, కుమార్తె వంటి కుటుంబ సభ్యులకు కొన్ని పితృకర్మలు నిర్వహించే అవకాశం ప్రస్తావించబడింది. ఉదాహరణకు గరుడ పురాణంలోని ఒక శ్లోకం.. కుమారుడు లేనప్పుడు భార్య, కుమార్తె లేదా కుమార్తె కుమారుడు వంటి వారిని కర్మ నిర్వహణలో పేర్కొంటుంది.