స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

మహాలయ పక్షాల్లో ఈ ఆచారాలకు ఎందుకంత ప్రాధాన్యం?..SpiritualitySwechaa23 Sep 2026, 07:08 AM

మహాలయ పక్షాల్లో ఈ ఆచారాలకు ఎందుకంత ప్రాధాన్యం?..

మనిషి తన మూలాలను మరచిపోకూడదని గుర్తుచేసే పవిత్ర కాలమే పితృపక్షం.. మహాలయ పక్షాలు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న పౌర్ణమితో ఈ పర్వకాలానికి శ్రీకారం చుడుతుంది. సెప్టెంబర్ 27 నుంచి పితృపక్ష శ్రాద్ధాలు ప్రారంభమై.. అక్టోబర్ 10న సర్వపితృ అమావాస్యతో ముగుస్తాయి.

ఇక పితృపక్షం అంటే.. మనకు జన్మనిచ్చిన, మన వంశాన్ని ముందుకు తీసుకెళ్లిన పూర్వీకులను కృతజ్ఞతతో స్మరించుకునే సమయం. హిందూ సంప్రదాయంలో మనిషికి దేవ ఋణం, ఋషి ఋణంతో పాటు పితృ ఋణం కూడా ఉందని భావిస్తారు. ఆ పితృ ఋణాన్ని స్మరించుకోవడంలో శ్రాద్ధానికి ప్రత్యేక స్థానం ఉంది.

ఈ సమయంలో పూర్వీకుల పేరుతో తర్పణం చేయడం, శ్రాద్ధం నిర్వహించడం, పిండప్రదానం చేయడం వంటి ఆచారాలు పాటిస్తారు. నీటితో తిలాలను సమర్పిస్తూ చేసే తర్పణం.. పితృదేవతల పట్ల గౌరవం, కృతజ్ఞతలకు ప్రతీకగా భావిస్తారు.

పరివర్తిని ఏకాదశి విశిష్టత గురించి తెలుసా?..SpiritualitySwechaa23 Sep 2026, 07:02 AM

పరివర్తిని ఏకాదశి విశిష్టత గురించి తెలుసా?..

సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశి ఒక్కో ఆధ్యాత్మిక సందేశాన్ని, ప్రత్యేకమైన వ్రత విధానాన్ని, విశిష్టమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది.

అలాంటి పవిత్రమైన ఏకాదశుల్లో భాద్రపద శుక్లపక్ష ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. దీనినే పద్మ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, జలఝూలని ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇక చాతుర్మాస కాలంలో క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ఈ తిథిన తన శయన స్థితిలో పరివర్తనం చెందుతాడని పురాణ సంప్రదాయంలో విశ్వాసం. అందుకే దీనికి పరివర్తిని ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు.

ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలెందుకు..? బాంబే IIT ఘటనతో దేశవ్యాప్త చర్చNationalSwechaa23 Sep 2026, 12:40 AM

ఐఐటీల్లో విద్యార్థుల ఆత్మహత్యలెందుకు..? బాంబే IIT ఘటనతో దేశవ్యాప్త చర్చ

ఐఐటీలో సీటు.. లక్షలాది మంది విద్యార్థుల కల. కానీ ఆ కలను సాకారం చేసుకున్న కొందరు విద్యార్థులు చదువుల ఒత్తిడి, మానసిక ఆందోళనలు, సామాజిక వివక్ష, సంస్థాగత సమస్యల మధ్య ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు? ఐఐటీ బాంబే విద్యార్థి సహిల్ వాకోడే మరణం మరోసారి దేశవ్యాప్తంగా ఈ ప్రశ్నను ముందుకు తెచ్చింది.

డీల్ ఆర్ ఫైట్..? UN వేదికగా ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటంInternationalSwechaa22 Sep 2026, 11:43 PM

డీల్ ఆర్ ఫైట్..? UN వేదికగా ఇరాన్ కు ట్రంప్ అల్టిమేటం

ఇరాన్‌తో ఒప్పందమా.. లేక పూర్తిస్థాయి విధ్వంసమా? ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ కామెంట్స్ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇరాన్‌ విషయంలో తన ముందున్నది కేవలం రెండు మార్గాలేనని ట్రంప్‌ స్పష్టం చేశారు.

అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అణచలేరు : రాంచందర్‌ రావుతెలంగాణSwechaa22 Sep 2026, 10:17 PM

అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అణచలేరు : రాంచందర్‌ రావు

TG: "అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను రేవంత్ సర్కార్ ఎంతమాత్రం అణచివేయలేదు" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. జూరాల ప్రాజెక్టు కింద పంటలు ఎండిపోతున్నాయంటూ రోడ్డెక్కిన ఆయకట్టు రైతులకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం ఆయన బయలుదేరగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పోలీసులు కాన్వాయ్‌ను అడ్డగించి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో జడ్చర్ల జాతీయ రహదారిపై ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది.రాంచందర్‌రావును అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుండగా పెద్ద సంఖ్యలో వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా పడుకుని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాషాయ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. నాయకులను వాహనాల్లో తరలించడంతో ఆగ్రహించిన కార్యకర్తలు హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి భారీ రాస్తారోకోకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.

కట్టల కొద్దీ నోట్లు, కిలోల కొద్దీ బంగారం, లగ్జరీ కార్లు.. బయటపడ్డ నిమ్స్ డాక్టర్ బండారం!తెలంగాణSwechaa22 Sep 2026, 09:28 PM

కట్టల కొద్దీ నోట్లు, కిలోల కొద్దీ బంగారం, లగ్జరీ కార్లు.. బయటపడ్డ నిమ్స్ డాక్టర్ బండారం!

TG: పేద ప్రజల ప్రాణాలు నిలిపే ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడ్డాగా ఓ ఉన్నతాధికారి సాగించిన అక్రమార్జన పర్వం తాజాగా బట్టబయలైంది. పేదల సేవ ముసుగులో అందినకాడికి దండుకుంటూ వేల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు ఏకకాలంలో నిర్వహించిన మెరుపు దాడుల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూసి విచారణ అధికారులే అవాక్కయ్యారు.ఎర్రగడ్డలోని కల్పతరు అపార్ట్‌మెంట్‌లో ఉన్న లక్ష్మీ భాస్కర్ నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, స్నేహితులకు చెందిన ఎనిమిది కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో విలాసవంతమైన హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4-BHK ఫ్లాట్, కూకట్‌పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో రెండు 3-BHK ఫ్లాట్లు, వీటితో పాటు మణికొండ, పేటబషీరాబాద్, కూకట్‌పల్లి పరిసరాల్లో మరో ఐదు 2-BHK ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 8 లగ్జరీ ఫ్లాట్లను ఆయన కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

జూరాలకు నీళ్లు ఇవ్వండి- కర్ణాటక సీఎంకు రేవంత్ ఫోన్తెలంగాణSwechaa22 Sep 2026, 09:21 PM

జూరాలకు నీళ్లు ఇవ్వండి- కర్ణాటక సీఎంకు రేవంత్ ఫోన్

Cm Revanth: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టుకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎంను కోరారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఆయనకు వివరించారు. జూరాల నుంచి సాగునీరు అందక ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయగా.. కర్ణాటక సీఎం శివకుమార్‌ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

కొత్త పెన్షన్లపై సీతక్క బిగ్ అనౌన్స్‌మెంట్!తెలంగాణSwechaa22 Sep 2026, 09:06 PM

కొత్త పెన్షన్లపై సీతక్క బిగ్ అనౌన్స్‌మెంట్!

TG: తెలంగాణలోని నిరుపేదలకు, ఆసరా కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త పింఛన్ల పంపిణీకి కీలక ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రాబోయే దసరా పండుగ వేళ పేదల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేలా, అక్టోబర్ నెలలోనే కొత్త పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులకు అత్యంత ఆదేశాలు జారీ చేశారు.దసరా సందర్భంగా పండుగకు ముందే అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్ సొమ్ము అందేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పెన్షన్ దరఖాస్తుల గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా, అవసరమైతే అదనపు సిబ్బందిని సైతం రంగంలోకి దించాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.

రైతుల ప్రయోజనాలే ముఖ్యం, పంటలు కాపాడేందుకు చర్యలుతెలంగాణSwechaa22 Sep 2026, 08:42 PM

రైతుల ప్రయోజనాలే ముఖ్యం, పంటలు కాపాడేందుకు చర్యలు

Jupalli Krishna Rao: జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో కొంతమంది చేస్తున్న హంగామా చూస్తుంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఒక టీఎంసీ నీటిలో ఎంత ఆవిరి అవుతుంది? ప్రాజెక్టులో ఎంత నీరు అందుబాటులో ఉంది? ఇన్‌ఫ్లో ఎంత వస్తోంది? ఔట్‌ఫ్లో ఎంత ఉంది? కర్ణాటకలో వర్షపాతం, అక్కడి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? అనే వాస్తవాలను పరిశీలించకుండా మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నాయకులకు ఆయన హితవు పలికారు.

గుండెలు ఆగుతున్నయ్.. చెవులు బద్దలవుతున్నయ్‌.. ఎందుకీ రాకాసి డీజేలు..?తెలంగాణSwechaa22 Sep 2026, 08:21 PM

గుండెలు ఆగుతున్నయ్.. చెవులు బద్దలవుతున్నయ్‌.. ఎందుకీ రాకాసి డీజేలు..?

DJ Sound: పండుగలు, ఊరేగింపులు, పెళ్లిళ్లు.. సందర్భం ఏదైనా వినోదం హద్దులు దాటి ప్రాణాంతకంగా మారుతోంది. భక్తి, ఉత్సాహం ముసుగులో రోడ్లపైకి వస్తున్న భారీ డీజే బాక్సుల చప్పుళ్లు మనుషుల ప్రాణాలను నిలువునా బలితీసుకుంటున్నాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలు, భూమి కంపించే బేస్ దరువుల తీవ్రతకు గుండెలు ఝల్లుమంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వేడుకలు, శోభాయాత్రల్లో డీజేల మోతలకు క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

డీజేల ధాటికి సరదాగా గడపాల్సిన వేడుకల్లో తీవ్ర విషాదం అలుముకుంటోంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ రాంనగర్ క్రాస్ రోడ్స్ సమీపంలో ఊరేగింపులో భారీ డీజే మోతకు డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల బీటెక్ విద్యార్థి అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద శబ్దాల తీవ్రత వల్లే కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అలాగే ఘట్‌కేసర్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ నిమజ్జన ఊరేగింపులో తీవ్రమైన శబ్దాల నడుమ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో నేలకొరిగి ప్రాణాలు విడిచారు.

దళిత, ఆదివాసీ, గిరిజన వర్గాల అభివృద్ధే లక్ష్యంతెలంగాణSwechaa22 Sep 2026, 08:19 PM

దళిత, ఆదివాసీ, గిరిజన వర్గాల అభివృద్ధే లక్ష్యం

Cm Revanth: దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదని అన్నారు. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరా గాంధీది అని తెలిపారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఈ వర్గాల కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.

Aadarsha Kutumbam-Post Poned: అనుకున్నదే జరిగింది మళ్ళీ వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం’సినిమాSwechaa22 Sep 2026, 07:45 PM

Aadarsha Kutumbam-Post Poned: అనుకున్నదే జరిగింది మళ్ళీ వాయిదా పడ్డ ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘ఆదర్శ కుటుంబం–హౌస్ నంబర్ 47 (AK47)’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తర్వాత వెంకటేష్ నుంచి వస్తున్న ఈ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీ విషయంలో మాత్రం వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ దొందూ దొందే..  ఫామ్‌హౌస్‌ల చుట్టూ భూముల కబ్జాలేనా..?తెలంగాణSwechaa22 Sep 2026, 07:00 PM

బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ దొందూ దొందే.. ఫామ్‌హౌస్‌ల చుట్టూ భూముల కబ్జాలేనా..?

Telangana Politics: హైదరాబాద్ శివార్లలో ఇప్పుడు ఏ మూల చూసినా కూల్చివేతలు, ఆక్రమణల రచ్చే కనిపిస్తోంది. చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధులను కాపాడాలంటూ సామాన్యుల నిర్మాణాలపై దూసుకెళ్తున్న అధికారులు.. రాజకీయ పలుకుబడి ఉన్న బడా నేతల విలాస భవంతుల వద్దకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారనే విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి. మొన్నటిదాకా గత పాలకుల ఫామ్‌హౌస్‌లను లక్ష్యంగా చేసుకుని గళమెత్తిన కాంగ్రెస్ శ్రేణులు, ఇప్పుడు తమ పార్టీ నేతలే చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై బీఆర్‌ఎస్ బయటపెడుతున్న ఆధారాలతో డిఫెన్స్‌లో పడ్డాయి. నిన్న మీరు.. నేడు మేము అంటూ ఇరు పార్టీలు సాగిస్తున్న ఈ 'ఫాంహౌస్ యుద్ధం' వెనుక పచ్చని ప్రకృతి వనరులు బలైపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.గత ప్రభుత్వ హయాంలో జీవో 111ను తుంగలో తొక్కి నిర్మించారంటూ జన్వాడ ఫాంహౌస్ మొదలుకొని పలు గులాబీ నేతల ఎస్టేట్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే పాలన మారినా తీరు మారలేదన్న రీతిలో, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రుల పరిధిలోని విలాసవంతమైన ఫాంహౌస్‌లు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను మింగేసి నిర్మించినవేనంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు సరికొత్త డ్రోన్ విజువల్స్, వీడియోలతో విరుచుకుపడుతున్నాయి.

ఆంధ్రా సర్కార్‌తో కలిసిపోయి తెలంగాణలో పంటలు ఎండబెడుతున్నారుతెలంగాణSwechaa22 Sep 2026, 06:56 PM

ఆంధ్రా సర్కార్‌తో కలిసిపోయి తెలంగాణలో పంటలు ఎండబెడుతున్నారు

Eatala Rajendar: జూరాల ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా సాగు కోసం రైతులకు నీరు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్వేషం, కోపం ఉంటే కేసీఆర్ పై తీర్చుకోవాలని రైతులపై కాదని హితవు పలికారు. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఈటల విమర్శించారు. తెలంగాణలో కరెంటు కోతలు పెరిగిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో 8, 9 గంటలు కూడా విద్యుత్ ఉండటం లేదన్నారు. కరెంట్ ట్రిప్ అవ్వడం వల్ల మోటార్లు కాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈటల వాపోయారు.

నీటి సరఫరాపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదా.. లేకుంటే రైతులపై ద్వేషం ఉందా? అని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎలాంటి హక్కు లేని రాయలసీమకు మన ప్రాంతం నుంచి కృష్ణా జలాలు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నింపుకుంటోందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 8 టీఎంసీల చొప్పున తరలిస్తున్నారని పేర్కొన్నారు.

Ranabaali-Song: ‘రణబాలి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్..ప్రేమలో మునిగిపోతున్న విజయ్-రష్మికసినిమాSwechaa22 Sep 2026, 06:39 PM

Ranabaali-Song: ‘రణబాలి’ ఫస్ట్ సింగిల్ రిలీజ్..ప్రేమలో మునిగిపోతున్న విజయ్-రష్మిక

Ranabaali: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘ఏందయ్యా సామీ’ అంటూ సాగే ఈ పాటతో సినిమా మ్యూజికల్ జర్నీకి మేకర్స్ శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 22న ఈ పాటను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ముందుగానే ప్రకటించింది.

Mancherial: ప్రభుత్వ శాఖల్లో వేళ్ళూనుకున్న అవినీతి.. ఏసీబీకి అడ్డంగా దొరికిన జీపీవో!.. వీడియో వైరల్..తెలంగాణSwechaa22 Sep 2026, 06:04 PM

Mancherial: ప్రభుత్వ శాఖల్లో వేళ్ళూనుకున్న అవినీతి.. ఏసీబీకి అడ్డంగా దొరికిన జీపీవో!.. వీడియో వైరల్..

తెలంగాణలో అవినీతి అధికారుల భరతం పడుతోంది ఏసీబీ. లంచాలు తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులను ఎక్కడిక్కడ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటోంది. లేటెస్ట్ గా రైతుల నుంచి లంచం తీసుకుంటుండగా జీపీవోను ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. మంచిర్యాల జిల్లా భీమిని మండల తహసీల్దార్ కార్యాలయంలో జీపీవోగా విధులు నిర్వహిస్తున్న దుర్గాప్రసాద్‌ను ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఒక కేసు విషయంలో పెద్దంపేటకు చెందిన రైతు మహమ్మద్ ఫకీర్ వద్ద దుర్గాప్రసాద్ రూ.80 వేల లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లంచం మొత్తాన్ని తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయనను పట్టుకున్నారు.

Tollywood-Megastar: మెగాస్టార్-మైత్రీ-బుచ్చిబాబు కాంబోలో సినిమా!సినిమాSwechaa22 Sep 2026, 05:52 PM

Tollywood-Megastar: మెగాస్టార్-మైత్రీ-బుచ్చిబాబు కాంబోలో సినిమా!

Tollywood: మెగాస్టార్-మైత్రీ-బుచ్చిబాబు కాంబోలో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తాజా సమాచారం. టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి–బుచ్చిబాబు సానా–మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియాలో ఈ ముగ్గురి కలయికలో సినిమా రాబోతుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

నీటి వాటాలు తక్కువ చేసి రైతులను ముంచారు.. బీఆర్ ఎస్‌పై మంత్రుల ఫైర్తెలంగాణSwechaa22 Sep 2026, 05:41 PM

నీటి వాటాలు తక్కువ చేసి రైతులను ముంచారు.. బీఆర్ ఎస్‌పై మంత్రుల ఫైర్

Jurala Project: రాష్ట్రంలో సాగునీరు, తాగునీటి ఎద్దడిపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రైతుల సమస్యలను పరిష్కరించడం కంటే, వాటిని రాజకీయం చేయడానికే బీఆర్‌ఎస్‌ ఎక్కువ ప్రాధాన్యమిస్తోందంటూ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు వద్ద గులాబీ నేతలు చేస్తున్న హడావుడిని ఎండగడుతూ మంత్రి జూపల్లి సంధించిన ప్రశ్నలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.తెలంగాణలో అన్నదాతల ప్రయోజనాల కోసం తాము ఎంతవరకైనా వెళ్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు కుండబద్దలు కొట్టారు. "కర్ణాటక ప్రభుత్వ కాళ్లు పట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ నేతలు హేళనగా మాట్లాడుతున్నారు. అవును.. రాష్ట్ర రైతాంగం కోసం, సాగునీటి అవసరాల కోసం పక్క రాష్ట్రం కాళ్లు మొక్కినా ఎలాంటి తప్పులేదు" అని ఆయన ఘాటుగా బదులిచ్చారు. ఇప్పటికే నీటి విడుదల విషయమై కర్ణాటక సీఎంతో మాట్లాడుతున్నామని, ఆయనకు అధికారికంగా లేఖ కూడా రాశామని వెల్లడించారు.

మీ ఇళ్లలోకి అలా వస్తే అనుమతిస్తారా?తెలంగాణSwechaa22 Sep 2026, 05:29 PM

మీ ఇళ్లలోకి అలా వస్తే అనుమతిస్తారా?

Jagadish Reddy: బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్ భూములు చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతల తీరుని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్తిలోకి, ప్రైవేటు భూముల్లోకి వెళ్లకూడదనే విషయం మీకు తెలియదా? అని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందాన్ని ఆయన ప్రశ్నించారు. చట్టాల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల భూముల గురించో, ఆస్తుల గురించో విచారించే హక్కు మీకు ఉంటుందా? అని నిలదీశారు.

Varun Tej-3 Movies: మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టాడా?సినిమాSwechaa22 Sep 2026, 05:20 PM

Varun Tej-3 Movies: మూడు ప్రాజెక్ట్స్ లైన్‌లో పెట్టాడా?

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల వచ్చిన కొరియన్ కనకరాజు సినిమాతో సాలీడ్ హిట్ దక్కించుకున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వరుణ్‌కి దక్కిన విజయమిది. దీని, తర్వాత కూడా మూడు సినిమాలను లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ వరున్ తేజ్ చెలెల్లు..మెగా డాటర్ నిహారిక నిర్మాతగా 'బరి' అనే సినిమా రూపొందుతోంది. ఇది కాకుండా మరో రెండు సినిమాలను ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది.

Leopard Alipiri: తిరుమలలో మళ్లీ చిరుత.. భక్తులకు టీటీడీ హెచ్చరిక!..ఏపీSwechaa22 Sep 2026, 05:05 PM

Leopard Alipiri: తిరుమలలో మళ్లీ చిరుత.. భక్తులకు టీటీడీ హెచ్చరిక!..

తిరుమలలో మరోసారి చిరుత కనిపించడం భక్తులను భయాందోళనకు గురిచేసింది. అలిపిరి మెట్లమార్గంలో చిరుత కనిపించడంతో భక్తులు పరుగులు తీశారు. . 2800 మెట్టు సమీపంలోని ఓ చెట్టుపై ఉన్న చిరుతను గుర్తించిన భక్తులు.. వెంటనే టీటీడీ సిబ్బంది, అటవీశాఖకు సమాచారమిచ్చారు. కాగా అలిపిరిలో ఏడవ మైలు నుంచి నరసింహస్వామి ఆలయ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలుతెలంగాణSwechaa22 Sep 2026, 04:55 PM

బిగ్‌ అలర్ట్‌.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Rain Alert : బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం తెలంగాణ వైపు వేగంగా దూసుకొస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్ష బీభత్సం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ముసురు పట్టిన వాతావరణం రానున్న 48 గంటల్లో మరింత ఉగ్రరూపం దాల్చనుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే 12 గంటల వ్యవధి అత్యంత కీలకమని, ఇది తీవ్ర వాయుగుండంగా మారి నేలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.ఈ వాతావరణ మార్పులతో ప్రధానంగా 8 జిల్లాల ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

రూల్స్ సీఎంకేనా పీసీసీకి వర్తించవా?.. కాంగ్రెస్ అంతర్గత పోరులో కొత్త లొల్లి!తెలంగాణSwechaa22 Sep 2026, 04:10 PM

రూల్స్ సీఎంకేనా పీసీసీకి వర్తించవా?.. కాంగ్రెస్ అంతర్గత పోరులో కొత్త లొల్లి!

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత కుమ్ములాటలు భగ్గుమన్నాయి. "మాట ఒకటే.. సబ్జెక్ట్ ఒకటే.. కానీ ఒకరు మాట్లాడితే తప్పట, మరొకరు మాట్లాడితే ఒప్పా?" అంటూ హస్తం శ్రేణుల్లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మొన్న సీఎం రేవంత్ రెడ్డి పరకాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేను గెలిపించాలని కోరితే కాంగ్రెస్ సంస్కృతికి విరుద్ధమంటూ హడావుడి చేసిన పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్.. ఇప్పుడు స్వయంగా తనే పోటీ చేస్తానని ముందస్తుగా ప్రకటించుకోవడం గాంధీభవన్‌లో సరికొత్త మంటలు రేపుతోంది.కొద్దిరోజుల క్రితం పరకాల పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మళ్లీ గెలిపించాలని పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్‌లోని ఓ వర్గం తీవ్ర దుమారం రేపింది. "ఎన్నికలకు ముందే అభ్యర్థిని ప్రకటించే హక్కు సీఎంకు ఎక్కడిది? కాంగ్రెస్ పద్ధతి ఇది కాదు" అంటూ పెద్ద పంచాయితీ పెట్టారు. అది చిలికి చిలికి గాలివానలా మారి ఏకంగా మంత్రి వర్గం వరకు చర్చకు దారితీసింది.

Anil Ravipudi-Tollywood: హిట్ మెషిన్‌కి కోపమొచ్చింది..అందుకే ఫైర్.!సినిమాSwechaa22 Sep 2026, 04:01 PM

Anil Ravipudi-Tollywood: హిట్ మెషిన్‌కి కోపమొచ్చింది..అందుకే ఫైర్.!

Anil Ravipudi: టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. వరుసగా 9 బ్లాక్ బస్టార్స్ అందుకున్న ఆయన ఇప్పుడు 10వ సినిమాను రెడీ చేస్తున్నాడు. అయితే, మరోసారి వార్తల్లో నిలిచారు అనిల్ రావిపూడి. తాజాగా అభిమానులతో జరిగిన ఓ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. అభిమానుల తీరుపై అనిల్ రావిపూడి అసహనం వ్యక్తం చేశారు.

వరంగల్ ఎంజీఎంలో మరో ప్రమాదం..తెలంగాణSwechaa22 Sep 2026, 03:46 PM

వరంగల్ ఎంజీఎంలో మరో ప్రమాదం..

MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వరుస ప్రమాదాలు పేషంట్లను, అక్కడ పని చేసే సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆరోగ్యశ్రీ వార్డులో సీలింగ్ స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డ ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకంది. RICU, ఫిజియోథెరపీ వార్డులో పైకప్పు పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. కాగా, పెచ్చులు ఊడిపడి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేషంట్లు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు మీడియాను ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. మెయిన్ గేటు దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Mahaveer Karna: ‘మహావీర్ కర్ణ’గా రాఘవ లారెన్స్..ఈసారి సరికొత్త అవతారంలో!సినిమాSwechaa22 Sep 2026, 03:39 PM

Mahaveer Karna: ‘మహావీర్ కర్ణ’గా రాఘవ లారెన్స్..ఈసారి సరికొత్త అవతారంలో!

Mahaveer Karna: సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలు, ప్రయోగాత్మక కథలకు రాఘవ లారెన్స్ పెట్టింది పేరు. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి ఆయన ‘మహావీర్ కర్ణ’గా కనిపించనున్నాడు. దీంతో, ఈ సారి లారెన్స్ ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు.

Tollywood-Charan-Sujeeth: రామ్ చరణ్, సుజీత్ కాంబినేషన్ సినిమా..నిజమేనా?సినిమాSwechaa22 Sep 2026, 03:17 PM

Tollywood-Charan-Sujeeth: రామ్ చరణ్, సుజీత్ కాంబినేషన్ సినిమా..నిజమేనా?

Tollywood: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుజీత్ కాంబినేషన్ గురించి మరోసారి టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. సుజీత్ తెరకెక్కించిన రన్ రాజా రన్, సాహో, దే కాల్ హిమ్ ఓజీ చిత్రాలతో ఆయనకు స్టైలిష్ యాక్షన్ సినిమాల దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా భారీ స్థాయి యాక్షన్, స్టైలిష్ విజువల్స్, ఇంటర్నేషనల్ బ్యాక్‌డ్రాప్‌లపై సుజీత్‌కు ఉన్న ఆసక్తి రామ్ చరణ్ అభిమానుల్లో ఈ కాంబినేషన్‌పై ఆసక్తిని పెంచుతోంది.

వరంగల్ ఎంజీఎంలో ఊడిన పెచ్చులు.. నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యేపై పోలీసుల దాష్టీకం!తెలంగాణSwechaa22 Sep 2026, 03:07 PM

వరంగల్ ఎంజీఎంలో ఊడిన పెచ్చులు.. నిరసనకు దిగిన మాజీ ఎమ్మెల్యేపై పోలీసుల దాష్టీకం!

 వరంగల్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్ (ఎంజీఎం) ఆసుపత్రి వద్ద మంగళవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రిలోని ఆర్‌ఐసీయూ (RICU), ఫిజియోథెరపీ విభాగాల్లో పైకప్పు పెచ్చులు ఊడిపడిన ఘటన తీవ్ర ఆందోళన రేకెత్తించింది. ఆ సమయంలో రోగులు, సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినప్పటికీ, ప్రభుత్వ ఆసుపత్రులలో భద్రతా లోపాలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకుని బాధితుల పరిస్థితిని, ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌ను పోలీసులు అడ్డుకున్నారు.

Nidhhi Agerwal-Kollywood: నిధి అగర్వాల్ తమిళ సినిమాల గురించి ఏమంటోంది?సినిమాSwechaa22 Sep 2026, 02:52 PM

Nidhhi Agerwal-Kollywood: నిధి అగర్వాల్ తమిళ సినిమాల గురించి ఏమంటోంది?

Nidhhi Agerwal: ఇస్మార్ట్ బ్యూటీగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో క్రేజ్ తెచ్చుకున్న నిధి అగర్వాల్.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకముందే మోడలింగ్ రంగంలో గుర్తింపు తెచ్చుకుంది. కెమెరా ముందు ఉండటం, స్టేజ్‌పై కాన్ఫిడెంట్‌గా కనిపించడంతో సినిమా అవకాశాల కోసం ప్రయత్నించి. అలా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత కెరీర్ ప్రారంభంలో కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి. అయితే, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ అయి ఇస్మార్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది.

ఎవరి గ్రూపులో ఉండాలో తెలియక తలపట్టుకుంటున్న కేడర్.. మెదక్ బీజేపీలో పీక్స్‌కు చేరిన లొల్లి!తెలంగాణSwechaa22 Sep 2026, 02:45 PM

ఎవరి గ్రూపులో ఉండాలో తెలియక తలపట్టుకుంటున్న కేడర్.. మెదక్ బీజేపీలో పీక్స్‌కు చేరిన లొల్లి!

Telangana BJP: రాష్ట్రంలో అధికారం మాదేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పార్టీ పరిస్థితి మెదక్ జిల్లాలో మాత్రం విడ్డూరంగా మారింది. రెండు నియోజకవర్గాలు.. పది గ్రూపులు అన్న చందంగా మారిన కాషాయ దళంలో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో, అదీ ఒకే ఊళ్లో ఒకే పార్టీకి ఏకంగా రెండు ఆఫీస్‌లు వెలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నర్సాపూర్ కేంద్రంగా జరుగుతున్న ఈ వర్గ పోరు పార్టీ కేడర్‌ను నవ్వులపాలు చేస్తుండగా, అధిష్ఠానం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన వాల్దాస్ మల్లేష్ గౌడ్‌ను నియమించిన నాటి నుంచే అసలు వివాదం స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. ఆయన నియామకాన్ని స్థానిక సీనియర్ నేత మురళీ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మల్లేష్ గౌడ్ నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక పార్టీ కార్యక్రమాలకు మురళీ యాదవ్ దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లా అధ్యక్షుడైన మల్లేష్ గౌడ్ సైతం "వస్తే రండి.. లేకపోతే పొండి" అన్న రీతిలో వ్యవహరించడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందని చెబుతున్నారు.